|
బీహార్: కరువు కోరల్లో చిక్కుకున్న 26 జిల్లాలుబీహార్ ప్రభుత్వం 26 జిల్లాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. రాష్ట్రంలోని మొత్తం 38 జిల్లాల్లో సగానికిపైగా జిల్లాలు కరువు కోరల్లో చిక్కుకున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. సోమవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.Source: Yahoo! Telugu: News | 10 Aug 2009 | 9:59 am భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్స్టాక్ మార్కెట్ ప్రస్తుతం భారీ నష్టాల్లో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 258 పాయింట్లు కోల్పోయి 14,902 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 44 పాయింట్లు నష్టపోయి 4,438 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 1.70 శాతం, నిఫ్టీ 0.98 శాతం మేరకు క్షీణించాయి.Source: Yahoo! Telugu: News | 10 Aug 2009 | 9:52 am ఇరాక్‌లో బాంబు పేలుళ్లు: 42 మంది మృతిఇరాక్ రాజధాని బాగ్దాద్, మోసూల్ నగరాల్లో సంభవించిన నాలుగు బాంబు పేలుళ్లలో 42 మంది మృతి చెందగా, సుమారు 160 మంది గాయపడ్డారు. ఉత్తర ఇరాక్‌లో ఉన్న మోసూల్ నగరంలో సోమవారం జరిగిన రెండు ట్రక్ బాంబు దాడుల్లో 25 మంది మృతి చెందగా, 75 మంది గాయపడ్డారని అధికారిక వర్గాలు తెలిపాయి.Source: Yahoo! Telugu: News | 10 Aug 2009 | 9:10 am తిరోగమన బాటలో స్టాక్ మార్కెట్స్టాక్ మార్కెట్ ప్రస్తుతం తిరోగమన బాటలో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 35 పాయింట్లు కోల్పోయి 15,182 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 5 పాయింట్లు లాభపడి 4,487 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.14 శాతం క్షీణించగా, నిఫ్టీ 0.12 శాతం లాభపడింది.Source: Yahoo! Telugu: News | 10 Aug 2009 | 8:52 am అక్షరం మారితే.. అదృష్టం వస్తుందా..?కాలం కలిసి రాకపోతే పేర్లను మార్పు చేసుకుని ట్రై చేసిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు సినీ పరిశ్రమలో బోలెడు మంది కన్పిస్తారు. అసలు పేరును మార్చేసి కొసరి పేరుతో తెలుగు ఇండస్ట్రీలో మెలిగేవాళ్లూ చాలామంది ఉన్నారు. తాజాగా కథానాయిక ఆషాషైనీ విషయానికొస్తే.. ఫ్లోరా శైనీగా తన పేరును మార్చుకుని, ఆ తర్వాత అదీ కలసి రాకపోవడంతో 'మయూరి'గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా "మనసంతా నువ్వే" ఫేమ్ రీమాసేన్ తన పేరులోని ఇంగ్లీషు అక్షరాల్లో ఇంకో 'ఎమ్'ని అదనంగా చేర్చేసుకుంది. ఈ పేరు మార్చుకున్న తర్వాత ఇటీవలే ఓ ఫంక్షన్‌కు రీమాసేన్ హాజరైందట. ఆ ఫంక్షన్‌లో స్లీవ్‌లెస్ అందాల్ని ప్రదర్శించి అందరిచేత 'వావ్' అనిపించేలా చేసిందట. మరి రీమాసేన్‌కు ఈ రకంగా పేరు వచ్చిందన్నమాట..!Source: Yahoo! Telugu: Entertainment | 10 Aug 2009 | 8:15 am ఖాతాదారులను పెంచుకోనున్న ఐడీబీఐదేశీయ పారిశ్రామిక రంగంలోని మధ్య తరహా, చిన్న తరహా, కుటీర పరిశ్రమలనుంచి ఖాతాదారులను పెంపొందించుకునేందుకు తమ బ్యాంక్ కృషి చేస్తోందని ఐడీబీఐ ఛైర్మెన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ యోగేశ్ అగ్రవాల్ అన్నారు.Source: Yahoo! Telugu: News | 10 Aug 2009 | 7:57 am కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్: ముగ్గురు తీవ్రవాదుల హతంజమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలోని రెయాసి జిల్లాలో భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు హతమయ్యారు. సోమవారం ఇక్కడ భద్రతా దళాలకు, తీవ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయని పోలీసులు చెప్పారు.Source: Yahoo! Telugu: News | 10 Aug 2009 | 7:57 am ఒడిదుడుకుల మధ్య స్టాక్ మార్కెట్స్టాక్ మార్కెట్ ప్రస్తుతం ఒడిదుడుకుల మధ్య పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 25 పాయింట్లు కోల్పోయి 15,135 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 5 పాయింట్లు నష్టపోయి 4,476 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.17 శాతం, నిఫ్టీ 0.11 శాతం మేరకు క్షీణించింది.Source: Yahoo! Telugu: News | 10 Aug 2009 | 7:51 am ఆఫ్ఘనిస్థాన్: నాటో దళాలపై ఆత్మాహుతి దాడిఉత్తర ఆఫ్ఘనిస్థాన్‌లో సోమవారం నాటో దళాలను లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడి జరిగింది. ఆత్మాహుతి దళ సభ్యుడొకరు పేలుడు పదార్థాల నింపిన వాహనంలో వచ్చి నాటో దళాల కాన్వాయ్‌కు అతి సమీపంలో తననితాను పేల్చుకున్నాడు. ఈ దాడిలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని ఆఫ్ఘనిస్థాన్ పోలీసులు తెలిపారు.Source: Yahoo! Telugu: News | 10 Aug 2009 | 7:29 am విదేశీ బ్యాంకులను కొంటాం: బరోడా బ్యాంక్మంచి అవకాశమొస్తే విదేశాల్లోని బ్యాంకులను కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని దేశీయ ప్రముఖ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజింగ్ డైరెక్టర్ మాల్యా తెలిపారు.Source: Yahoo! Telugu: News | 10 Aug 2009 | 7:23 am ఆసియా స్టాక్ మార్కెట్లుఆసియా మార్కెట్లలో మిశ్రమ ఫలితాలు వెల్లడయ్యాయి. హాంగ్ సెంగ్ (హాంకాంగ్) - 2 శాతంతో 450 పాయింట్లు పుంజుకుని 20,852 వద్దకు చేరుకుంది. నిక్కీ (జపాన్) - 100 పాయింట్లు లాభపడి 10,512 వద్దకు చేరుకుంది. షాంఘై (చైనా) - 16 పాయింట్లు పెరిగి 3,245 వద్దకు చేరుకుంది. సియోల్ కంపోజిట్ - 1,573 వద్ద స్థిరంగా పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 10 Aug 2009 | 7:12 am బాలీవుడ్ సినిమాలో మాజీ రాష్ట్రపతి...!భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ తాజాగా బాలీవుడ్ చిత్రంలో నటించనున్నారు. ఆయన "మై కలామ్ హూఁ ". అన్న పేరుగల సినిమాలో నటించనున్నారు. దేశంలో ప్రముఖ శాస్త్రజ్ఞులలో డాక్టర్ కలామ్ ఒకరు. తన పాత్రను తానే పోషించడం ఈ చిత్రంలోని విశేషం.Source: Yahoo! Telugu: Entertainment | 10 Aug 2009 | 5:31 am నయనతో ముద్దు.. త్రిషతో డేటింగ్...!!?"వల్లభ" సినిమా ద్వారా అందాల ముద్దుగుమ్మ నయనతారను "శింబు" వాడుకుని వదిలేశాడని సినీ జనం గుసగుసలాడుకుంటే.. తాజాగా "వల్లభ" రూటు మార్చాడట. ప్రముఖ దర్శకుడు గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఓ తమిళ చిత్రంలో శింబు, త్రిష జంటగా నటిస్తున్నారు. ఈ షూటింగ్‌లో ఇద్దరి మధ్య అవగాహన కుదిరిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. వీరిద్దరు ప్రేమలో పడ్డారని కూడా సినీజనం అనుకుంటున్నారు. గతంలో నయనతారను ఇలాగే ముద్దు వ్యవహరంలో దించి, ఆ తర్వాత శింబు వదిలేశాడని ఇండస్ట్రీలో టాక్. ఈ నేపథ్యంలో నీకు కూడా అదే గతి పడుతుందేమో? జాగ్రత్త అని త్రిషకు ఆమె సన్నిహితులు చెప్పారట. కానీ శింబుచాలా మంచివాడని త్రిష సమర్థించిందట.Source: Yahoo! Telugu: Entertainment | 10 Aug 2009 | 5:18 am బీహార్: కరువు కోరల్లో చిక్కుకున్న 26 జిల్లాలుబీహార్ ప్రభుత్వం 26 జిల్లాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. రాష్ట్రంలోని మొత్తం 38 జిల్లాల్లో సగానికిపైగా జిల్లాలు కరువు కోరల్లో చిక్కుకున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. సోమవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.Source: జాతీయ | 10 Aug 2009 | 4:29 am చెన్నయ్‌లో బాలుడు.. పూణెలో డాక్టరు మృతిదేశంలో స్వైన్ మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సోమవారం ఉదయం మరో ఇద్దరు రోగులు మరణించారు. వీరిలో ఒకరు 35 సంవత్సరాల ఆయుర్వేద డాక్టరు కాగా, మరొకరు నాలుగేళ్ళ బాలుడు ఉన్నాడు.Source: జాతీయ | 10 Aug 2009 | 2:47 am కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్: ముగ్గురు తీవ్రవాదుల హతంజమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలోని రెయాసి జిల్లాలో భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు హతమయ్యారు. సోమవారం ఇక్కడ భద్రతా దళాలకు, తీవ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయని పోలీసులు చెప్పారు.Source: జాతీయ | 10 Aug 2009 | 2:43 am జమ్ములో బంద్: 25 మంది బీజేపీ నేతల అరెస్ట్జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలో ప్రతిపాదిత కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని జమ్ములోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మద్దతుతో సీయూఏఎస్ సోమవారం బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్ కారణంగా జమ్ములో ఈ రోజు సాధారణ జనజీవనం దెబ్బతింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ ఖజూరియాతోసహా 25 మంది బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.Source: జాతీయ | 10 Aug 2009 | 1:43 am రాష్ట్రంలో ధరలు తక్కువగానే ఉన్నాయ్: వైఎస్ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు తక్కువగానే ఉన్నాయని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం జరిగిన సభా కార్యక్రమంలో నిత్యావసర సరుకుల ధరల అంశం చర్చకు వచ్చింది.Source: ఏపీ న్యూస్ | 10 Aug 2009 | 12:36 am ఆన్‌లైన్‌లో ఆలయ ఆస్తుల వివరాలు: మంత్రిరాష్ట్రంలో ఆలయ భూములను రైతులకు కౌలుకు ఇవ్వనున్నట్టు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖామంత్రి జి.వెంకట రెడ్డి తెలిపారు. విజయనగరం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 37,147 దేవస్థానాలు ఉండగా 4.23 లక్షల ఎకరాలు భూమి ఉందన్నారుSource: ఏపీ న్యూస్ | 10 Aug 2009 | 12:17 am సహ ఉద్యోగినికి మత్తుమందు: ఆపై అత్యాచారంతాజాగా మరో యువతి అత్యాచారానికి గురైంది. ఒక కాల్ సెంటర్‌లో పని చేస్తున్న ఉద్యోగినికి సహ ఉద్యోగే మత్తు మందు ఇచ్చి.. ఆపై అత్యాచారం చేసిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చిందిSource: జాతీయ | 10 Aug 2009 | 12:07 am మొయిలీ వ్యాఖ్యలపై సభలో గందరగోళంకేంద్ర న్యాయ శాఖామంత్రి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ ఆదివారం చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర అసెంబ్లీ దద్దరిల్లి పోయింది. మొయిలీ వ్యాఖ్యలను అధికార పార్టీ మినహా మిగిలిన అన్ని విపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి.Source: ఏపీ న్యూస్ | 9 Aug 2009 | 11:37 pm వైఎస్ సర్కారు వైఖరిని ఎండగట్టిన ప్రరాపారాష్ట్రంలోని వైఎస్ సర్కారుకు ప్రజారాజ్యం పార్టీ అనుకూలంగా వ్యవహిస్తూ వస్తుందనే అపవాదును చెరిపేసుకునే దిశగా ప్రజారాజ్యం పార్టీ అసెంబ్లీ వ్యవహరిస్తోంది. ప్రస్తుతం వాడివేడిగా జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆ పార్టీకి చెందిన 18 ఎమ్మెల్యేలు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు.Source: ఏపీ న్యూస్ | 9 Aug 2009 | 10:29 pm ప్రఫుల్ పటేల్‌తో నేడు ఎఫ్ఐఏ బృందం భేటికేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ఫ్రపుల్ పటేల్‌తో సోమవారం భారత విమానయాన సంస్థల సమాఖ్య (ఎఫ్ఐఏ) బృందం సమావేశం కాబోతుంది. ఎయిర్‌లైన్స్ కంపెనీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈ సందర్భంగా ఎఫ్ఐఏ బృందం ప్రఫుల్ పటేల్‌కు వివరించనుంది. జెట్ ఇంధనంపై పన్ను, విమానాశ్రయ ఛార్జీలు తగ్గించాలని విజ్ఞప్తి చేయనుంది.Source: జాతీయ | 9 Aug 2009 | 10:18 pm వైద్యుల కమిటీ ఏర్పాటుకు ప్రధాని సూచనదేశంలో ప్రమాదకర స్వైన్ ఫ్లూ వ్యాధి ఆదివారం మరో రెండు ప్రాణాలను బలిగొనడంతో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వ్యాధి తీవ్రతను అధ్యయనం చేసేందుకు వైద్యుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖకు సూచించారు. గడిచిన వారంలో రోజుల్లో దేశంలో మొత్తం నాలుగు స్వైన్ ఫ్లూ మరణాలు సంభవించాయి.Source: జాతీయ | 9 Aug 2009 | 9:44 pm జలవివాదాలకు చర్చలే పరిష్కార మార్గం: మొయిలీదేశంలో పలు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలకు చర్చలే పరిష్కారమార్గమని కేంద్ర న్యాయశాఖామంత్రి వీరప్ప మొయిలీ అన్నారు. ఆదివారం ఆయన డాక్టరేట్ పురస్కారాన్నిఅందుకున్నారు.Source: ఏపీ న్యూస్ | 9 Aug 2009 | 6:44 am గిరిజనుల అభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యం: వైఎస్రాష్ట్రంలోని గిరిజనులు సర్వతోముఖాభివృద్ధి సాధించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి పునరుద్ఘాటించారు. ఆయన ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన భద్రాద్రిలో కొలువైన శ్రీరాముడిని దర్శించుకున్నారు.Source: ఏపీ న్యూస్ | 9 Aug 2009 | 6:27 am నేడు ప్రిన్స్ మహేష్ బాబు జన్మదినోత్సవంటాలీవుడ్ కలల హీరో, ప్రిన్స్ మహేష్ బాబు 27వ పుట్టిన రోజు వేడుకలను ఆదివారం జరుపుకుంటున్నారు. సంచలన విజయాలతో ఈ యువ కథానాయకుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకున్నాడు.Source: Yahoo! Telugu: Entertainment | 9 Aug 2009 | 6:24 am ఆజాద్ క్షమాపణలు చెప్పాలి: రీదా ఫ్యామిలీతమ కుమార్తె వల్లే పూణెలో అనేక మందికి హెచ్1ఎన్1 వైరస్ సోకిందని అర్థంపర్థం లేదని ప్రకటన చేసిన కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి గులాం నబీ ఆజాద్ క్షమాపణ చెప్పాలని స్వైన్ ఫ్లూ వైరస్ బారినపడి తిరిగిరాని లోకాలకు చేరుకున్న మృతురాలి తల్లిదండ్రులు ఆదివారం డిమాండ్ చేశారు.Source: జాతీయ | 9 Aug 2009 | 6:12 am స్వైన్ ఫ్లూ మృతులు: అప్రమత్తమైన కేంద్రందేశంలో స్వైన్ ఫ్లూ మరణాల సంఖ్య నాలుగుకు చేరుకోవడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ వైరస్ బారిన పడిన రోగులను రక్షించేందుకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.Source: జాతీయ | 9 Aug 2009 | 3:39 am
|