స్వైన్ ఫ్లూ మృతులు: అప్రమత్తమైన కేంద్రం

దేశంలో స్వైన్ ఫ్లూ మరణాల సంఖ్య నాలుగుకు చేరుకోవడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ వైరస్ బారిన పడిన రోగులను రక్షించేందుకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.
Source: Yahoo! Telugu: News | 9 Aug 2009 | 9:08 am

త్రైమాసిక ఫలితాల్లో ఏసీసీ 15 శాతం వృద్ధి

ప్రముఖ సిమెంట్ ఉత్పత్తి సంస్థ ఏసీసీ.. 2009-10 జూన్, 30తో ముగిసిన తొలి త్రైమాసికంలో 15 శాతం మేరకు వృద్ధి చెందినట్లు ప్రకటించింది. ఈ వృద్ధితో సుమారు రూ. 2,188 కోట్ల మేరకు టర్నోవర్ సాధించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 1,906 కోట్ల టర్నోవర్ మాత్రమే ఏసీసీ సాధించింది.
Source: Yahoo! Telugu: News | 9 Aug 2009 | 9:01 am

నేటి బులియన్ మార్కెట్ ధరలు

నేటి బులియన్ మార్కెట్ ధరలు... హైదరాబాద్ 24 క్యారెట్ - రూ. 15,180 - రూ. 15,200, వెండి కిలో - రూ. 23,500 - రూ. 23,400. చెన్నై 24 క్యారెట్ - రూ. 14,950 - రూ. 14,995, వెండి కిలో - రూ. 24,505 - రూ. 24,560. విజయవాడ - రూ. 15,095 - రూ. 15,140, వెండి కిలో - రూ. 23,400 - రూ. 23,800.
Source: Yahoo! Telugu: News | 9 Aug 2009 | 7:30 am

గృహ వడ్డీ రేట్లు కుదించిన ఎస్‌బీఐ

దేశంలోనే బ్యాంకింగ్ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) గృహ రుణాల వడ్డీ రేట్లను తగ్గించింది. 'ఎస్‌బీఐ మై హోమ్ కాంపెయిన్' అనే విన్నూత్న పథకం ద్వారా తగ్గించిన గృహ రుణ వడ్డీ రేట్ల సదుపాయాన్ని ఎస్‌బీఐ కల్పించింది.
Source: Yahoo! Telugu: News | 9 Aug 2009 | 7:24 am

ఫిట్స్‌ వల్లే ఏఆర్ కానిస్టేబుల్ మృతి

దేశ రాజధాని న్యూఢిల్లీలో అనుమానాస్పదంగా మృతి చెందిన ఏఆర్.కానిస్టేబుల్ మురళీనాథ్ ఫిట్స్ కారణంగా తుది శ్వాస విడిచినట్టు అధికారులు పరిశోధనలో వెల్లడైంది. ఈ మేరకు సీసీఎస్‌కు నివేదికను పోలీసులు అందజేసినట్టు సమాచారం.
Source: Yahoo! Telugu: News | 9 Aug 2009 | 7:16 am

రెండో భార్యతో శోభనం: బైతుల్లా ప్రాణాలు ఖతం!

పాకిస్థాన్‌లోని తాలిబాన్ తీవ్రవాద సంస్థ చీఫ్ బైతుల్లా మసూద్ తన ప్రాణాలకు తానే ముప్పు కొని తెచ్చుకున్నాడు. రెండో పెళ్లి చేసుకున్న బైతుల్లా.. మామగారి ఇంటిలో భార్యతో శోభనరాత్రి గడిపాడు.
Source: Yahoo! Telugu: News | 9 Aug 2009 | 7:08 am

భవానీ థియేటర్ మృతులకు 'అల్లు' ఆర్థిక సాయం

వరంగల్ జిల్లా కేంద్రంలో "మగధీరుడు" ప్రదర్శిస్తున్న భవానీ థియేటర్‌ టిక్కెట్ కౌంటర్‌లో షాట్ సర్క్యూట్ కాణంగా శనివారం రాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అభిమానులు మృత్యువాత పడ్డారు. దీంతో ఆదివారం ఉదయం ఆటను రద్దు చేశారు.
Source: Yahoo! Telugu: News | 9 Aug 2009 | 6:32 am

నేడు ప్రిన్స్ మహేష్ బాబు జన్మదినోత్సవం

టాలీవుడ్ కలల హీరో, ప్రిన్స్ మహేష్ బాబు 27వ పుట్టిన రోజు వేడుకలను ఆదివారం జరుపుకుంటున్నారు. సంచలన విజయాలతో ఈ యువ కథానాయకుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకున్నాడు.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Aug 2009 | 6:24 am

చర్చలు విఫలం: ప్రమాదంలో నేపాల్ శాంతి ప్రక్రియ

నేపాల్‌లో రాజకీయ పరిణామాలు మరోమారు అస్థిరతకు దారితీస్తున్నాయి. నేపాల్ ప్రధాని మాధవకుమార్‌, మావోయిస్టు చీఫ్ ప్రచండల మధ్య శనివారం జరిగిన చర్చలు విఫమయ్యాయి. దీంతో మావోయిస్టులు, 11 రాజకీయ పార్టీల మధ్య గతంలో కుదిరిన శాంతి ప్రక్రియకు విఘాతం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి.
Source: Yahoo! Telugu: News | 9 Aug 2009 | 6:07 am

ఉత్తరాఖండ్‌లో ప్రమాదం : 30 మంది మృతి

ఉత్తరాఖండ్‌ రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడటంతో 30 మంది చనిపోయారు. మరో 50 మంది శకలాల కింద సజీవ సమాధి అయి ఉండవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
Source: Yahoo! Telugu: News | 9 Aug 2009 | 6:06 am

నేటి ఫారంగేట్ మార్కెట్ ధరలు

నేటి ఫారంగేట్ మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి... హైదరాబాద్ (ఒక గుడ్డు) - రూ. 2.25 (వంద గుడ్లు) - రూ. 198 విజయవాడ - రూ. 199 విశాఖపట్నం - రూ. 217 చెన్నై - 223 నమక్కల్ - రూ. 218
Source: Yahoo! Telugu: News | 9 Aug 2009 | 5:58 am

స్వైన్ ఫ్లూ మృతులు: అప్రమత్తమైన కేంద్రం

దేశంలో స్వైన్ ఫ్లూ మరణాల సంఖ్య నాలుగుకు చేరుకోవడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ వైరస్ బారిన పడిన రోగులను రక్షించేందుకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.
Source: జాతీయ | 9 Aug 2009 | 3:39 am

ఫిట్స్‌ వల్లే ఏఆర్ కానిస్టేబుల్ మృతి

దేశ రాజధాని న్యూఢిల్లీలో అనుమానాస్పదంగా మృతి చెందిన ఏఆర్.కానిస్టేబుల్ మురళీనాథ్ ఫిట్స్ కారణంగా తుది శ్వాస విడిచినట్టు అధికారులు పరిశోధనలో వెల్లడైంది. ఈ మేరకు సీసీఎస్‌కు నివేదికను పోలీసులు అందజేసినట్టు సమాచారం.
Source: ఏపీ న్యూస్ | 9 Aug 2009 | 1:47 am

భవానీ థియేటర్ మృతులకు 'అల్లు' ఆర్థిక సాయం

వరంగల్ జిల్లా కేంద్రంలో "మగధీరుడు" ప్రదర్శిస్తున్న భవానీ థియేటర్‌ టిక్కెట్ కౌంటర్‌లో షాట్ సర్క్యూట్ కాణంగా శనివారం రాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అభిమానులు మృత్యువాత పడ్డారు. దీంతో ఆదివారం ఉదయం ఆటను రద్దు చేశారు.
Source: ఏపీ న్యూస్ | 9 Aug 2009 | 1:03 am

ఉత్తరాఖండ్‌లో ప్రమాదం : 30 మంది మృతి

ఉత్తరాఖండ్‌ రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడటంతో 30 మంది చనిపోయారు. మరో 50 మంది శకలాల కింద సజీవ సమాధి అయి ఉండవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
Source: జాతీయ | 9 Aug 2009 | 12:36 am

మహిళా సాధికారతకు రిజర్వేషన్లు తప్పదు: అగాథా

మహిళల రాజకీయ, ఆర్థిక, సాంఘిక సాధికారతకు రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి అగథా సంగ్మా అభిప్రాయపడ్డారు. ఇది కల్పించినపుడే దేశాభివృద్ధిలో మహిళల పాత్ర గణనీయంగా పెరుగుతుందన్నారు.
Source: జాతీయ | 8 Aug 2009 | 11:56 pm

బ్లాక్ మార్కెట్ భరతం పట్టండి: ముఖ్యమంత్రి

నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా భావిస్తున్న బ్లాక్ మార్కెట్‌పై ఉక్కుపాదం మోపాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి పిలుపునిచ్చారు. ఎలాగైనా నిత్యావసర వస్తువుల ధరలు తక్షణం తగ్గేలా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.
Source: ఏపీ న్యూస్ | 8 Aug 2009 | 11:32 pm

బాబ్లీపై 11న చిరు ఆధ్వర్యంలో ప్రజారాజ్యం ధర్నా

గత అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటలేని ప్రజారాజ్యం పార్టీ ప్రజలకు చేరువయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూ వారితో మమేకమై బలాన్ని పెంచుకునేందుకు తహతహలాడుతోంది.
Source: ఏపీ న్యూస్ | 8 Aug 2009 | 11:21 pm

దేశంలో నాలుగు స్వైన్ ఫ్లూ మరణాలు

దేశంలో రెండో స్వైన్ ఫ్లూ మరణం నమోదైంది. పూణేలో టీనేజ్ అమ్మాయి రీదాషేక్ (14 ఏళ్లు) స్వైన్ ఫ్లూకు బలి అయిన ఐదు రోజుల తర్వాత ముంబైలోని 53 ఏళ్ల ఫాహ్మిదా పాన్వాలా మృతి చెందింది. మధుమేహ వ్యాధి, అధిక రక్తపోటుతో బాధపడుతున్న ఫాహ్మిదా.. స్వైన్ ఫ్లూ సోకడంతో అమె పరిస్థితి తీవ్రతరమైందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
Source: జాతీయ | 8 Aug 2009 | 9:45 pm

ఎన్టీఆర్‌కే క్రేజట.. మరి బాలయ్య సినీ చరిష్మా అంతేనా..?

జనాల్ని సమ్మోహనుల్ని చేసేది సినిమాలైతే.. అందులో ఎవరు ప్రేక్షకులికి దగ్గరవుతారో? వారికే పెద్ద పీట. ప్రస్తుతం నందమూరి వంశంలో కొన్నాళ్ళుగా ఇదే జరిగింది. నందమూరి బాలకృష్ణ వస్తున్నాడంటే.. ఆ కుటుంబ హీరోలకు అదొక క్రేజ్‌గా ఉండేది. విపరీతమైన పబ్లిసిటీ వచ్చేది. అలా తొలినాళ్ళలో జూనియర్ ఎన్టీఆర్ ఆరాటపడేవారు. బాబాయ్ అంటూ.. ఆయన వస్తే చాలు.. అదే పదివేలుగా భావించి ఆయన ప్రాపకం పొందడానికి ప్రయత్నించేవారు. ఎన్టీఆర్ సినిమాల ప్రారంభోత్సవాలకు బాలకృష్ణ ఎస్సెట్. అది కొడాలి నాని తీస్తున్న సినిమా వరకు సాగింది. "బండ్లు ఓడలు ఓడలు బండ్లు అవుతాయ"న్న సామెతలా.. ప్రస్తుతం బాలకృష్ణ పరిస్థితి అలానే ఉందని సినీపండితులు విశ్లేషిస్తున్నారు. బాలయ్య తాజా సినిమా "సింహా" ప్రారంభోత్సవానికి ఎన్టీఆర్ పెద్ద ఆకర్షణగా నిలిచాడు. తెలుగుదేశం పార్టీ ప్రచారంలో అందరూ ఎన్టీఆర్ వారసుడు జూ.ఎన్టీఆర్ అనే పేరు తెచ్చుకున్నాడు. సినిమా ఫీల్డులోనూ ప్రస్తుతం బాలయ్య చిత్రాలు ఏమీ ఆడడం లేదు. ఎన్టీఆర్ యువకుడు గనుక ఆయన చిత్రాలు బాగానే చూస్తున్నారు. ఎన్టీఆర్ రావడంతోనే కొత్త కళ వచ్చిందని అక్కడివారనుకోవడం విశేషం. మరి టైం అంటే అదే.. ఇంతలోనే ఎంత తేడా.. కదా..!?
Source: Yahoo! Telugu: Entertainment | 8 Aug 2009 | 11:50 am

రవితేజ నన్ను నిర్మాతగా నిలబెట్టాడు: గణేష్ బాబు

నటుడు కావాలని సినీరంగంలోకి ప్రవేశించి మొదట ప్రొడక్షన్స్‌లో వ్యవహారాలను చూసుకుంటూ.. నిదానంగా ప్రొడక్షన్ మేనేజర్‌ స్థాయికి ఎదిగిన వ్యక్తి గణేష్ బాబు. నటుడిగానే ఉంటూ ఏకంగా నిర్మాతగా అవతారమెత్తి రవితేజతో ఆంజనేయులు సినిమా తీశారు. ఈ సందర్భంగా శనివారం ఆయనతో జరిపిన భేటీ.. ప్రశ్న: నిర్మాత కావాలనే కోరిక ఎలా కలిగింది?జ: ఆ కోరిక ముందునుంచే ఉంది. నటునిగా స్థిరపడ్డాక ఓ సందర్భంలో స్నేహితుడైన రవితేజకు చెప్పాను. "చేసేద్దామ్.. కానీయ్.." అంటూ రవితేజ క్యాజువల్‌గా చెప్పారు. ఈ క్రెడిట్ అంతా రవితేజకే చెందుతుంది. ప్రశ్న: ఈ చిత్రంలో నటించకపోవడానికి కారణం?జ: నిర్మాణంలో అన్ని పనులు నేనే చేసుకోవాలి. నేను మొహానికి రంగు పూసుకుని కూర్చుంటే.. ప్రొడక్షన్ గాడి తప్పుతుందనే భయం. ప్రశ్న: ఈ సినిమాద్వారా అనవసరపు ఖర్చు 5కోట్లు మిగిల్చారని దాసరిగారు కామెంట్ చేశారు. ఎలా?జ: (నవ్వుతూ..) దాసరిగారు అన్నట్లు అంతలేదుగాని.. కొంత నిర్మాణవ్యయం తగ్గించుకున్నాం.ప్రశ్న: బ్రహ్మానందం పాత్ర ఎలా ఉంటుంది?జ: రవితేజకు పనిచేసే ఆఫీసులో బాస్‌గా బ్రహ్మానందం నటించాడు. ఇద్దరి కాంబినేషన్‌లో నవ్వులే నవ్వులు.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Aug 2009 | 11:37 am

బాలీవుడ్‌లో నితిన్ రెడ్డి బ్లో- అప్

"అడవి" చిత్రం వర్మకు హిట్ ఇచ్చిందో లేదో తెలియదు కానీ కుర్ర హీరో నితిన్ మాత్రం... "అడవి" తంతే బాలీవుడ్ బూరెల బుట్టలో పడ్డాడంటున్నారు టాలీవుడ్ సినీ విశ్లేషకులు. ప్రియాంకా కొఠారి సరసన సిక్స్ ప్యాక్ బాడీతో స్టెప్పులేసిన యంగ్ హీరో నితిన్ బాలీవుడ్‌లో నితిన్ రెడ్డిగా పరిచయమయ్యాడు. "అడవి"లో నితిన్ రెడ్డి యాక్షన్ చూసిన కొందరు బాలీవుడ్ నిర్మాతలు నితిన్‌కు తమ తమ సినిమాల్లో అవకాశాలిచ్చే అంశంపై చర్చలు జరుపుతున్నారట. ప్రస్తుతం బాలీవుడ్‌లో మీసాలు తీసేసి బోడి మూతులతో నటించే హీరోలతో విసిగిపోయిన ప్రేక్షకులు నితిన్ రెడ్డి లాంటి చాకులాంటి కుర్రహీరోలను చూసేందుకు ఇష్టపడుతున్నట్లు ఓ బాలీవుడ్ సినీ నిర్మాత చెప్పాడు. మొత్తమ్మీద అడవితో నితిన్ దశ తిరిగిందన్నమాట. బాలీవుడ్‌లో నితిన్ రెడ్డి తన ఇమేజ్‌ను ఎలా బిల్డప్ చేసుకుంటాడో చూడాలి మరి.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Aug 2009 | 10:07 am

"ఐటం గర్ల్" ముమైత్‌ఖాన్ పర్సనల్ టచ్

"ఇప్పటికింకా నా వయసు.. నిండా పదహారే.." అనే "పోకిరి" ఐటం సాంగ్‌లో టాలీవుడ్ ప్రేక్షకులను ఓ ఊపు ఊపేసిన అందాల సెక్సీడాళ్ ముమైత్ ఖాన్. పాకిస్తాన్ నుంచి భారత్‌లోని వాణిజ్యకేంద్రం ముంబైలో స్థిరపడిన ముమైత్‌ఖాన్.. ఓ చిన్న డ్యాన్స్ ట్రూప్‌లో పనిచేసేది. నెలకు రూ. 1,500లను జీతంగా పుచ్చుకున్న ముమైత్ నేడు ఐటం గర్ల్‌గా ముద్రవేసుకుంది. హిందీ, తమిళం, తెలుగు, కన్నడ సినిమాల్లో సెక్సీతారగా కుర్రకారును మత్తెక్కించిన ముమైత్ ఖాన్‌కు తెలుగు "పోకిరి" ఐటంసాంగ్ మంచి గుర్తింపును సంపాదించిపెట్టింది. తమిళ రీమేక్ "పోకిరి"లోనూ అదే "ఐటంసాంగ్‌"తో కోలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. టాటూల అందాలతో బాలీవుడ్ నుంచి దిగుమతి అయిన ముమైత్ ఖాన్ టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులను తన అందచందాలతో కట్టిపడేస్తుంది. అంతేకాదు.. తాను ఎంతో అందగత్తెనని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకుంది. ఇప్పటికే 45 చిత్రాలకు పైగా నటించిన ముమైత్ ఖాన్ ముద్దుపేరు: మున్ను, మున్ని.పుట్టిన తేది: సెప్టెంబర్ 1.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Aug 2009 | 8:11 am

ప్రధాని మన్మోహన్‌ను కలిసిన చైనా ప్రతినిధులు

భారత్-చైనా దేశాల మధ్య ఉన్న సరిహద్దు వివాదంపై ఇరు దేశాల ప్రతినిధులు జరిపిన చర్చలు శనివారంతో ముగిశాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ చర్చలు సంతృప్తికరంగా ముగిసినట్టు ఇరు వర్గాలు వెల్లడించాయి. అనంతరం చైనా ప్రతినిధులు ప్రధాని మన్మోహన్ సింగ్‌తో భేటీ అయ్యారు.
Source: జాతీయ | 8 Aug 2009 | 8:09 am

కరువుపై నిర్లక్ష్యం తగదు: తెదేపా

రాష్ట్రంలో నెలకొన్న కరువుపై పాలకులకు నిర్లక్ష్యం తగదని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ సూచించింది. ఆగష్టు నెల వచ్చినా.. ఇప్పటి వరకు చుక్క వర్షం లేక రైతులు విలవిలలాడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆ పార్టీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు మండి పడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 8 Aug 2009 | 7:38 am

నిశ్శబ్దం రాజ్యమేలుతున్న ప్రరాపా ఆఫీసు!

ఒకపుడు అభిమానులు, వలస నేతలు, కార్యకర్తలు, ప్రజల రాకపోకలతో నిత్యం సందడిగా పండుగ వాతావరణాన్ని తలపించిన ప్రజారాజ్యం పార్టీ కార్యాలయం వద్ద ప్రస్తుతం నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఆ పార్టీకి ఉన్న రెండు కార్యాలయాల్లో ఒక కార్యాలయాన్ని (ఆఫీసు-2)ను ఇటీవలే మూసి వేసిన విషయం తెల్సిందే.
Source: ఏపీ న్యూస్ | 8 Aug 2009 | 7:18 am

భాగ్యనగరిలో రెడ్‌అలెర్ట్: విస్తృత తనిఖీలు

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను భగ్నం చేసేందుకు తీవ్రవాదులు కుట్ర పన్నినట్టు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీనికి తోడు.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ప్రపంచ బ్యాడ్మింటన్ పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీలకు కూడా ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని ఇంటలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో భాగ్యనగరిలో రెడ్‌అలెర్ట్ ప్రకటించారు.
Source: ఏపీ న్యూస్ | 8 Aug 2009 | 6:43 am

స్వైన్ ఫ్లూ సోకిన చిన్నారి ఆరోగ్యం విషమం

స్వైన్ ఫ్లూ వ్యాధి దేశ ప్రజలను వణికిస్తోంది. మెల్లగా ప్రధాన నగరాలకు విస్తరిస్తోంది. శనివారం గుజరాత్, పూణె, మహారాష్ట్రలలో మరికొన్ని కేసులు వెలుగు చూశాయి. ముఖ్యంగా, మహారాష్ట్రంలోని పూణెలో స్వైన్ ఫ్లూ సోకిన 12 ఏళ్ళ చిన్నారి ఆరోగ్యం విషమంగా మారింది.
Source: జాతీయ | 8 Aug 2009 | 6:33 am

రామ్.."అడవి"లో నా కోసం జిమ్ ఏర్పాటు చేయవూ..!!

సినిమాల్లో హీరోహీరోయిన్లుగా రాణించాలంటే ఫిట్‌నెస్ సంగతిని మరవకూడదని సినీ పండితులు అంటుంటారు. ఈ విషయాన్ని "అడవి" హీరోయిన్ ప్రియాంక కొఠారి బాగా అర్థం చేసుకుంది. అందుకే అడవుల్లో షూటింగ్ కోసం వెళ్లినా.. అక్కడే వ్యాయామం చేసిందట. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన "అడవి" చిత్రాన్ని దాదాపుగా శ్రీలంక అడవుల్లో చిత్రీకరించారు. అలాంటి కీకారణ్యంలో.. క్రూర మృగాల మధ్య సుమారు నలభైరోజులు నటించేందుకు ప్రియాంక అభ్యంతరం చెప్పలేదు. కానీ.. అక్కడ తనకోసం జిమ్‌లేకపోవడం ఆమెకు పెద్ద సమస్యగా మారింది. దాంతో 40 రోజులూ తాను వ్యాయామం చేసేలా.. ప్రత్యేక ఏర్పాటు కల్పించమంటూ రామ్‌ను ప్రియాంక కోరిందట. వెంటనే స్పందించిన రామ్, కొఠారి కోసం ప్రత్యేక ఏర్పాటు కూడా చేశాడట.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Aug 2009 | 5:04 am

బాలీవుడ్‌లో నితిన్ రెడ్డి బ్లో- అప్

"అడవి" చిత్రం వర్మకు హిట్ ఇచ్చిందో లేదో తెలియదు కానీ కుర్ర హీరో నితిన్ మాత్రం... "అడవి" తంతే బాలీవుడ్ బూరెల బుట్టలో పడ్డాడంటున్నారు టాలీవుడ్ సినీ విశ్లేషకులు. ప్రియాంకా కొఠారి సరసన సిక్స్ ప్యాక్ బాడీతో స్టెప్పులేసిన యంగ్ హీరో నితిన్ బాలీవుడ్‌లో నితిన్ రెడ్డిగా పరిచయమయ్యాడు. "అడవి"లో నితిన్ రెడ్డి యాక్షన్ చూసిన కొందరు బాలీవుడ్ నిర్మాతలు నితిన్‌కు తమ తమ సినిమాల్లో అవకాశాలిచ్చే అంశంపై చర్చలు జరుపుతున్నారట. ప్రస్తుతం బాలీవుడ్‌లో మీసాలు తీసేసి బోడి మూతులతో నటించే హీరోలతో విసిగిపోయిన ప్రేక్షకులు నితిన్ రెడ్డి లాంటి చాకులాంటి కుర్రహీరోలను చూసేందుకు ఇష్టపడుతున్నట్లు ఓ బాలీవుడ్ సినీ నిర్మాత చెప్పాడు. మొత్తమ్మీద అడవితో నితిన్ దశ తిరిగిందన్నమాట. బాలీవుడ్‌లో నితిన్ రెడ్డి తన ఇమేజ్‌ను ఎలా బిల్డప్ చేసుకుంటాడో చూడాలి మరి.
Source: వినోదం | 8 Aug 2009 | 4:40 am

వరి పంట రక్షణకు ప్రత్యేక చర్యలు: ప్రధాని

దేశంలో వరి ఉత్పత్తి బాగా తగ్గిపోవడం పట్ల ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పంట రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతునిస్తుందని సింగ్‌ హామీ ఇచ్చారు
Source: జాతీయ | 8 Aug 2009 | 3:44 am

కోస్ట్‌గార్డ్‌ ఆధీనంలో ఉత్తరకొరియా కార్గో నౌక

భారత సముద్ర జలాల్లోకి ముందస్తు అనుమతి లేకుండా ప్రవేశించిన ఉత్తరకొరియాకు చెందిన కార్గో నౌకను భారత కోస్ట్‌గార్డ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. సముద్ర గస్తీలో నిమగ్నమైవున్న కోస్ట్‌గార్డ్‌ సిబ్బందిని చూసిన వెంటనే నౌకలోని సిబ్బంది ఆందోళనకు గురయ్యారు.
Source: జాతీయ | 8 Aug 2009 | 3:23 am