ప్రాణాలతో ఉన్న బైతుల్లా మసూద్: తాలిబాన్

పాకిస్థాన్‌లోని తాలిబాన్ తీవ్రవాద సంస్థ అధినేత బైతుల్లా మసూద్ అమెరికా రక్షణ బలగాలు జరిపిన దాడుల్లో ప్రాణాలు కోల్పోలేదని తాలిబన్ తీవ్రవాద సంస్థ ప్రకటించింది ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
Source: Yahoo! Telugu: News | 8 Aug 2009 | 9:30 am

బ్యాంకులూ... గ్రామాలపై దృష్టి సారించండి

గ్రామాలపై బ్యాంకులు మరింతగా దృష్టి సారించాల్సిందిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సూచించింది. ఇందుకోసం గ్రామాల్లో బ్యాంకింగ్ సౌకర్యాలు మెరుగుపరుస్తూ.. మరిన్ని బ్రాంచ్‌లను ఏర్పాటు చేయాలని కోరింది. బ్యాంకుల అభివృద్ధికి ఇది కూడా ఒక మార్గమని తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 8 Aug 2009 | 9:24 am

వరి పంట రక్షణకు ప్రత్యేక చర్యలు: ప్రధాని

దేశంలో వరి ఉత్పత్తి బాగా తగ్గిపోవడం పట్ల ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పంట రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతునిస్తుందని సింగ్‌ హామీ ఇచ్చారు
Source: Yahoo! Telugu: News | 8 Aug 2009 | 9:12 am

కోస్ట్‌గార్డ్‌ ఆధీనంలో ఉత్తరకొరియా కార్గో నౌక

భారత సముద్ర జలాల్లోకి ముందస్తు అనుమతి లేకుండా ప్రవేశించిన ఉత్తరకొరియాకు చెందిన కార్గో నౌకను భారత కోస్ట్‌గార్డ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. సముద్ర గస్తీలో నిమగ్నమైవున్న కోస్ట్‌గార్డ్‌ సిబ్బందిని చూసిన వెంటనే నౌకలోని సిబ్బంది ఆందోళనకు గురయ్యారు.
Source: Yahoo! Telugu: News | 8 Aug 2009 | 8:53 am

"ఐటం గర్ల్" ముమైత్‌ఖాన్ పర్సనల్ టచ్

"ఇప్పటికింకా నా వయసు.. నిండా పదహారే.." అనే "పోకిరి" ఐటం సాంగ్‌లో టాలీవుడ్ ప్రేక్షకులను ఓ ఊపు ఊపేసిన అందాల సెక్సీడాళ్ ముమైత్ ఖాన్. పాకిస్తాన్ నుంచి భారత్‌లోని వాణిజ్యకేంద్రం ముంబైలో స్థిరపడిన ముమైత్‌ఖాన్.. ఓ చిన్న డ్యాన్స్ ట్రూప్‌లో పనిచేసేది. నెలకు రూ. 1,500లను జీతంగా పుచ్చుకున్న ముమైత్ నేడు ఐటం గర్ల్‌గా ముద్రవేసుకుంది. హిందీ, తమిళం, తెలుగు, కన్నడ సినిమాల్లో సెక్సీతారగా కుర్రకారును మత్తెక్కించిన ముమైత్ ఖాన్‌కు తెలుగు "పోకిరి" ఐటంసాంగ్ మంచి గుర్తింపును సంపాదించిపెట్టింది. తమిళ రీమేక్ "పోకిరి"లోనూ అదే "ఐటంసాంగ్‌"తో కోలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. టాటూల అందాలతో బాలీవుడ్ నుంచి దిగుమతి అయిన ముమైత్ ఖాన్ టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులను తన అందచందాలతో కట్టిపడేస్తుంది. అంతేకాదు.. తాను ఎంతో అందగత్తెనని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకుంది. ఇప్పటికే 45 చిత్రాలకు పైగా నటించిన ముమైత్ ఖాన్ ముద్దుపేరు: మున్ను, మున్ని.పుట్టిన తేది: సెప్టెంబర్ 1.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Aug 2009 | 8:11 am

ధరల పెరుగుదలపై కేంద్రం సీరియస్: పవార్

దేశ వ్యాప్తంగా నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరగడం పట్ల కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. అక్రమ నిల్వలను వెలికి తీసేందుకు ఆకస్మిక దాడులు నిర్వహించాల్సిందిగా అన్ని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలకు ఆదేశాలు జారీ చేసింది.
Source: Yahoo! Telugu: News | 8 Aug 2009 | 7:48 am

కోల్‌కతా-బ్యాంకాక్‌ల మధ్య కింగ్‌ఫిషర్ సర్వీసులు

ప్రముఖ ప్రైవేట్ విమానయాన సంస్థ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోల్‌కతా-బ్యాంకాక్‌ల మధ్య కొత్తగా సర్వీసులను ప్రారంభించనుంది. ఆగస్ట్ 14వ తేదీ నుంచి ఈ సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కింగ్‌ఫిషర్‌ సేవల్లో ఇది ఐదో అంతర్జాతీయ స్థాయి విమాన సేవలు కావడం విశేషం. భారత్ నుంచి ఆగ్నేయాసియాకు విమానసేవలను నడపడం తమకు ఇదే తొలిసారి అని కింగ్‌ఫిషర్ తన ప్రకటనలో వెల్లడించింది
Source: Yahoo! Telugu: News | 8 Aug 2009 | 7:02 am

దలైలామాకు అంతర్జాతీయ పురస్కారం

టిబెట్‌కు చెందిన ధార్మిక నేత దలైలామాకు జాతీయ సివిల్ రైట్స్ మ్యూజియం ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ స్వాతంత్ర్య పురస్కారాన్ని ఇవ్వనుంది.
Source: Yahoo! Telugu: News | 8 Aug 2009 | 6:39 am

రుతుపవన ఆందోళనలతోనే సెన్సెక్స్ క్షీణత

రుతుపవనాలు మొహం చాటేయడం.. దీంతో దేశంలో వర్షాభావ పరిస్థితులతో రైతన్న కష్టాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ రుతుపవనాల ప్రభావం రైతన్ననే కాదు.. అటు స్టాక్ మార్కెట్లను కూడా వణికిస్తున్నాయి. గురువారం చివరి గంటలో భారీగా నష్టపోయిన సెన్సెక్స్... శుక్రవారం కూడా అదే బటాలో నడించింది.
Source: Yahoo! Telugu: News | 8 Aug 2009 | 6:08 am

ఒకే త్రైమాసికంలో 1.31 లక్షల ఉద్యోగాలకు కోత

ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో ఏకంగా 1.31 లక్షల ఉద్యోగాల్లో నికరంగా కోత విధించినట్లు తాజా సర్వేలో వెల్లడైంది. ఈ కోతలు అధికంగా తయారీ మరియు సేవల రంగాల్లోనే ఉన్నాయి. ప్రత్యేకించి వస్త్ర, రత్న, ఆభరణాల రంగాల్లో ఎగుమతులు బాగా పడిపోయాయని కార్మికశాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 8 Aug 2009 | 5:49 am

ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం: బాబు

రాష్ట్ర ప్రజలను వివిధ రకాల సమస్యలు పట్టి పీడిస్తున్నాయని, వాటి పరిష్కారానికి అలుపెరగని పోరాటం చేయనున్నట్టు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రజల తరపున పోరాడేందుకు తాను, తమ పార్టీ నేతలు అవసరమైతే జైళ్ళకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 8 Aug 2009 | 5:45 am

రామ్.."అడవి"లో నా కోసం జిమ్ ఏర్పాటు చేయవూ..!!

సినిమాల్లో హీరోహీరోయిన్లుగా రాణించాలంటే ఫిట్‌నెస్ సంగతిని మరవకూడదని సినీ పండితులు అంటుంటారు. ఈ విషయాన్ని "అడవి" హీరోయిన్ ప్రియాంక కొఠారి బాగా అర్థం చేసుకుంది. అందుకే అడవుల్లో షూటింగ్ కోసం వెళ్లినా.. అక్కడే వ్యాయామం చేసిందట. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన "అడవి" చిత్రాన్ని దాదాపుగా శ్రీలంక అడవుల్లో చిత్రీకరించారు. అలాంటి కీకారణ్యంలో.. క్రూర మృగాల మధ్య సుమారు నలభైరోజులు నటించేందుకు ప్రియాంక అభ్యంతరం చెప్పలేదు. కానీ.. అక్కడ తనకోసం జిమ్‌లేకపోవడం ఆమెకు పెద్ద సమస్యగా మారింది. దాంతో 40 రోజులూ తాను వ్యాయామం చేసేలా.. ప్రత్యేక ఏర్పాటు కల్పించమంటూ రామ్‌ను ప్రియాంక కోరిందట. వెంటనే స్పందించిన రామ్, కొఠారి కోసం ప్రత్యేక ఏర్పాటు కూడా చేశాడట.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Aug 2009 | 5:04 am

వరి పంట రక్షణకు ప్రత్యేక చర్యలు: ప్రధాని

దేశంలో వరి ఉత్పత్తి బాగా తగ్గిపోవడం పట్ల ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పంట రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతునిస్తుందని సింగ్‌ హామీ ఇచ్చారు
Source: జాతీయ | 8 Aug 2009 | 3:44 am

కోస్ట్‌గార్డ్‌ ఆధీనంలో ఉత్తరకొరియా కార్గో నౌక

భారత సముద్ర జలాల్లోకి ముందస్తు అనుమతి లేకుండా ప్రవేశించిన ఉత్తరకొరియాకు చెందిన కార్గో నౌకను భారత కోస్ట్‌గార్డ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. సముద్ర గస్తీలో నిమగ్నమైవున్న కోస్ట్‌గార్డ్‌ సిబ్బందిని చూసిన వెంటనే నౌకలోని సిబ్బంది ఆందోళనకు గురయ్యారు.
Source: జాతీయ | 8 Aug 2009 | 3:23 am

ధరల పెరుగుదలపై కేంద్రం సీరియస్: పవార్

దేశ వ్యాప్తంగా నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరగడం పట్ల కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. అక్రమ నిల్వలను వెలికి తీసేందుకు ఆకస్మిక దాడులు నిర్వహించాల్సిందిగా అన్ని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలకు ఆదేశాలు జారీ చేసింది.
Source: జాతీయ | 8 Aug 2009 | 2:20 am

దేశ వ్యాప్తంగా భాజపా చింతన్ బైఠక్: రాజ్‌నాథ్

ఈనెల 17వ తేదీన భారతీయ జనతా పార్టీ అధ్వర్యంలో దేశ వ్యాప్తంగా చింతన్‌ బైఠక్‌ను నిర్వహించనున్నట్టు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. నిత్యావసర సరకుల ధరల పెరుగుదలకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా నిర్వహించ తలపెట్టినట్టు ఆయన తెలిపారు.
Source: జాతీయ | 8 Aug 2009 | 1:00 am

ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం: బాబు

రాష్ట్ర ప్రజలను వివిధ రకాల సమస్యలు పట్టి పీడిస్తున్నాయని, వాటి పరిష్కారానికి అలుపెరగని పోరాటం చేయనున్నట్టు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రజల తరపున పోరాడేందుకు తాను, తమ పార్టీ నేతలు అవసరమైతే జైళ్ళకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 8 Aug 2009 | 12:16 am

రాష్ట్రంలో 394 మంది సర్పంచ్‌ల పవర్ కట్: బొత్స

వివిధ కారణాల రీత్యా 394 మంది సర్పంచ్‌ల చెక్‌ పవర్‌ను రద్దు చేసినట్టు పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం శాసన మండలికి తెలిపారు. శుక్రవారం జరిగిన శాసనమండలి సమావేశాల్లో భాగంగా ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 7 Aug 2009 | 11:54 pm

ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిసారించండి: వైఎస్

దేశంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర రైతాంగం ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి పిలుపునిచ్చారు. దేశ ఆర్థిక ప్రగతికి వ్యవసాయం, ఆహార భద్రత సమాంతర సూచికలని, అత్యధిక జనాభా వీటి ఆధారంగానే ఉపాధి పొందుతున్నారన్నారు.
Source: ఏపీ న్యూస్ | 7 Aug 2009 | 11:46 pm

చంద్రబాబూ.. తస్మాత్ జాగ్రత్త: పీసీసీ

ప్రజా ముఖ్యమంత్రిగా ఆమోదం పొందిన వైఎస్.రాజశేఖర రెడ్డిపై నోరు పారేసుకుంటే తగిన మూల్యం చెల్లించక తప్పదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ హెచ్చరించింది. ముఖ్యమంత్రి పట్ల ఇష్టానుసారంగా మాట్లాడుతున్న చంద్రబాబు కాస్త నోటిని అదుపులో పెట్టుకోవాలని పీసీసీ సలహా ఇచ్చింది.
Source: ఏపీ న్యూస్ | 7 Aug 2009 | 11:39 pm

వైద్యులకు సోకిన స్వైన్ ఫ్లూ మహమ్మారి

దేశవ్యాప్తంగా రోజురోజుకూ స్వైన్ ఫ్లూ మహమ్మారి విజృంభిస్తోంది. ఢిల్లీలోని మరో ముగ్గురు వైద్యులకు ఈ వ్యాధి సంక్రమించిందని వైద్యాధికారులు తెలిపారు.
Source: జాతీయ | 7 Aug 2009 | 9:35 pm

ముగిసిన లోకసభ బడ్జెట్‌ సమావేశాలు

కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత మొదలైన తొలి బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. 15వ లోక్‌సభ మొదటి బడ్జెట్‌ సమావేశాల వీడ్కోలు కార్యక్రమంలో స్పీకర్‌ మీరాకుమార్‌ ప్రసంగించారు. తొలి లోక్‌సభ సమావేశాల్లో అంతరాయం, ఆందోళనలు, వాయిదాలతో దాదాపు 23 గంటల 34 నిమిషాలు వృథా అయ్యిందని మీరాకుమార్ వెల్లడించారు. అయితే ప్రజా సంక్షేమాన్ని గురించి చర్చించిన సమయం 26 సిట్టింగులలో కేవలం 162 గంటలు మాత్రమేనని ఆమె చెప్పారు. ముఖ్యమైన ఆర్థిక వ్యవహారాల నిర్వహణకు సంబంధించి 30 గంటల 52 నిమిషాల సమయం తీసుకుందని ఆమె వివరించారు.
Source: జాతీయ | 7 Aug 2009 | 9:10 pm

అది వర్మ మార్క్ "అడవి"!! ఏంటో.. చూస్తారా..?

ఇష్టమైన ఐస్ క్రీం బండి వద్ద డబ్బులు చెల్లించి ఐస్ క్రీం తినేందుకు చేతులు చాచినప్పుడు ఐస్ క్రీమ్ అమ్మే వ్యక్తి ఖాళీ కోన్ ఇచ్చి వచ్చే సీజన్‌లో ఐస్ క్రీం తీసుకోండి అంటే పరిస్థితి ఎలా ఉంటుంది..? శుక్రవారం విడుదలైన సినిమా "అడవి"ని చూసిన తర్వాత ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది. అంటే సినిమాని సగ భాగం చూపించి మరో భాగంలో రహస్యం విప్పుతాం అని చెప్పడం జరిగింది. ఈ సినిమా రెండో భాగం మళ్ళీ తీస్తారో లేదో తేలీదు. మొత్తానికి భోజనంలో కూర మాత్రమే వడ్డించి మిగిలిన అన్నంలోకి పెరుగు తోడుకున్న తర్వాత వేస్తాం అన్న చందంగా అడవి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Aug 2009 | 1:23 pm

త్వరలో తెరపైకి వస్తోన్న"అ.. ఆ.. ఇ.. ఈ.."

శ్రీకాంత్, మీరాజాస్మిన్, సదా కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం "అ..ఆ.. ఇ.. ఈ.." (అతను ఆమె ఇంతలో ఈమె). శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో బొద్దం అశోక్‌యాదవ్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం సెన్సార్ సిగ్నల్ కోసం వేచివున్న "అ..ఆ..ఇ..ఈ.."ని త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు చెప్పారు. కాబ్స్ డ్రైవర్ తన వైవాహిక జీవితంలో ఏర్పడిన ఒడిదుడుకులను ఎలా పరిష్కరించుకున్నాడనే కథాంశంతో ఈ చిత్రాన్ని వినోదాత్మకంగా చిత్రీకరించామని శ్రీనివాసరెడ్డి తెలిపారు. మీరా జాస్మిన్, సదా పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ఆయన వెల్లడించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Aug 2009 | 10:44 am

పమీలాకు తెగ "హాట్ గర్ల్" అన్న ఫీలింగట!

ప్రముఖ హాలీవుడ్ నటీమణి, మోడల్ పమీలా అండర్సన్‌కు ఆమేదో తెగ "హాట్ గర్ల్" అన్న ఫీలింగ్ బలంగా ఉంది. కెమేరా ముందు పనిచేసే సమయంలోగానీ, అందుకు తగిన ప్రతిఫలం లభించే క్రమంలో నేనెంతో "హాటర్" అని అండర్సన్ స్వయంగా చెప్పుకున్నట్లు ది సన్ పత్రిక వెల్లడించింది.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Aug 2009 | 10:35 am

రాత్రిపూట సైఫ్ లేనిదే కరీనాకు నిద్రపట్టదట

తన ప్రియుడు సైఫ్ అలీఖాన్ తోటి తారామణులతో చనువుగా ఉండటాన్ని చూసి సహించలేని కరీనాకపూర్.. ఖాన్‌కు కొత్త ఆంక్ష విధించిందట. అదేమిటంటే.. రోజూ తను నిద్రపోయేముందు సైఫ్‌కు "ట్రింగ్ ట్రింగ్" ఇస్తుందట. అర్థం కాలేదా..? అదేనండీ ఫోన్ కాల్. ఆ ఫోన్ కాల్ వచ్చిన వెంటనే సైఫ్ ఎక్కడ ఉన్నా ఆమె ముందు ప్రత్యక్షమవ్వాలట. అలా సైఫ్‌ను చూసిన పిదప నిద్రకు ఉపక్రమిస్తుందట కరీనా. మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత గత రోజు తాలూకు ఒత్తిళ్లు, వ్యతిరేక అనుభూతులను వదిలించుకునేందుకు యోగా చేస్తుందట. యోగా ముగిసిన వెంటనే మళ్లీ సైఫ్‌కు "ట్రింగ్" చేస్తుందట. ఈ ట్రింగ్.. ట్రింగ్‌లతో ఖాన్‌కు నిద్రలేకుండా చేస్తోందట. ఈ తంతునంతా గమనిస్తున్న కరీనా ఇరుగు పొరుగు ఇళ్లలోని వారు సైఫ్‌ను చూసి జాలిపడుతున్నారట. సైఫ్ మాత్రం ఏం చేస్తాడు. ప్రియురాలాయే...!! స్ట్రాంగ్‌గా ఓ పెద్ద "ట్రింగ్" ఇచ్చిందంటే ఏం చేయమన్నా చేయాలి.. ఎప్పుడు రమ్మన్నా రావాలి. అంతా ట్రింగ్... ట్రింగ్ మహిమ.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Aug 2009 | 10:02 am

బాలీవుడ్ పాటల రచయిత గుల్షన్ మృతి

ప్రముఖ బాలీవుడ్ పాటల రచయిత గుల్షన్ బావ్రా మరణించారు. సినీరంగంలో తన హవాను కొనసాగించి, తన పాటలతో శ్రోతలను ఇట్టే ఆకట్టుకున్న గుల్షన్‌కు మరణించేనాటికి 70 సంవత్సరాలు. 54 సంవత్సరాల పాటు సినీరంగంలో రాణించిన గుల్షన్ 240కి పైగా పాటలు రాశారు. "ఉపకార్" చిత్రంలోని "మేరే దేశ్‌ కీ ధర్తీ" అని సాగే దేశభక్తి గీతం సూపర్ హిట్టయ్యింది.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Aug 2009 | 9:24 am

బుద్ధ గార్డెన్‌ గ్యాంగ్ రేప్ కేసు: 13న తుది తీర్పు

దేశ రాజధానిలోని బుద్ధ గార్డెన్‌లో జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో స్థానిక కోర్టు తీది తీర్పును ఈనెల 13వ తేదీకి వాయిదా వేసింది. 2003 సంవత్సరంలో జరిగిన ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. రాష్ట్రపతి అంగరక్షకులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
Source: జాతీయ | 7 Aug 2009 | 7:21 am

త్వరలో తెరపైకి వస్తోన్న"అ.. ఆ.. ఇ.. ఈ.."

శ్రీకాంత్, మీరాజాస్మిన్, సదా కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం "అ..ఆ.. ఇ.. ఈ.." (అతను ఆమె ఇంతలో ఈమె). శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో బొద్దం అశోక్‌యాదవ్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం సెన్సార్ సిగ్నల్ కోసం వేచివున్న "అ..ఆ..ఇ..ఈ.."ని త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు చెప్పారు. కాబ్స్ డ్రైవర్ తన వైవాహిక జీవితంలో ఏర్పడిన ఒడిదుడుకులను ఎలా పరిష్కరించుకున్నాడనే కథాంశంతో ఈ చిత్రాన్ని...
Source: వినోదం | 7 Aug 2009 | 7:17 am

పమీలాకు తెగ "హాట్ గర్ల్" అన్న ఫీలింగట!

ప్రముఖ హాలీవుడ్ నటీమణి, మోడల్ పమీలా అండర్సన్‌కు ఆమేదో తెగ "హాట్ గర్ల్" అన్న ఫీలింగ్ బలంగా ఉంది. కెమేరా ముందు పనిచేసే సమయంలోగానీ, అందుకు తగిన ప్రతిఫలం లభించే క్రమంలో నేనెంతో "హాటర్" అని అండర్సన్ స్వయంగా చెప్పుకున్నట్లు ది సన్ పత్రిక వెల్లడించింది.
Source: వినోదం | 7 Aug 2009 | 7:17 am

'ప్రేమ'కు మరో ఇద్దరు విద్యార్థుల బలి!

రాష్ట్రంలో మరో ఇద్దరు విద్యార్థులు తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. వీరిలో ఒకరు ప్రేమోన్మాదానికి విద్యార్థిని బలైంది. మరో విద్యార్థి ప్రేమ విఫలం కావడంతో మనస్తాపానికిలోనై ఆత్మహత్య చేసుకున్నాడు.
Source: ఏపీ న్యూస్ | 7 Aug 2009 | 7:05 am

"వాట్ ఎ మ్యాన్"..! ఆయనంటే నాకెంతో ఇష్టం..!

"ప్రజలను ప్రభావితం చేసే సత్తా ఆయనకుంది. నిర్మలమైన, నిష్కలమైన మనస్తత్వం ఆయనిది. అంతేకాదు.. గొప్పవ్యక్తి అయిన కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ రాహుల్ గాంధీ అంటే నా కెంతో ఇష్టమని" బాలీవుడ్ భామ దియా మీర్జా చెప్పింది. తన అందచందాలతో కుర్రకారును ఇట్టే ఆకట్టుకుంటున్న దియా.. ఎట్టకేలకు మనసులోని మాటను బయట పెట్టింది. హైదరాబాదులో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మకు నచ్చిన వ్యక్తి ఎవరబ్బా? అని అందరూ ఎదురుచూస్తుండగానే.. దియా రాహుల్ అంటే తనకు ఇష్టమని చెప్పేసింది.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Aug 2009 | 6:16 am

రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ అటాక్

రాష్ట్ర వ్యాప్తంగా స్వైన్ ఫ్లూ విస్తరిస్తోంది. దేశం మొత్తంలో ఒక్క హైదరాబాద్‌లోనే ఎక్కవ సంఖ్యలో స్వైన్ కేసులున్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది. విదేశాల నుంచి వచ్చే వారితోనే ఈ స్వైన్ ఫ్లూ విస్తరిస్తోంది. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో అరకొర తనిఖీలతో.. స్వైన్ ఫ్లూ మరింతగా విస్తరించే అవకాశం ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 7 Aug 2009 | 5:54 am

పొడుగుకాళ్ల సుందరిని ముద్దుగోల వదలదా..?

ప్రముఖ బాలీవుడ్ నటి, పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టిని ముద్దు వివాదం వదిలేలా కనిపించడంలేదు. ఎయిడ్స్‌పై ప్రచారంలో భాగంగా భారత్ వచ్చిన హాలీవుడ్ నటుడు రిచర్డ్ గెరె ఆమెను బహిరంగంగా ముద్దుపెట్టుకోవడంపై దేశంలో తీవ్రస్థాయిలో దుమారం రేగిన విషయం తెల్సిందే. తాజాగా మరో ముద్దు వివాదంలో శిల్ప చిక్కుకుంది. ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా శిల్పాశెట్టి ఇటీవలే ఒరిస్సాలోని సాక్షిగోపాల ఆలయాన్ని సందర్శించింది. అయితే అక్కడ శిల్పాశెట్టిని చూసి తెగ మురిసిపోయిన ఓ వృద్ధ అర్చకుడు ఆమెను ఆశీర్వదించే క్రమంలో.. ఆలయంలోనే ముద్దెట్టుకున్నాడట.
Source: వినోదం | 7 Aug 2009 | 5:45 am

"గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్" భవనం "కోకొనట్ లాగూన్"

సముద్ర గర్భాన్ని చీల్చుకుని వెలుపలికి వస్తున్నట్లుగా కడిగిన ముత్యంలా ప్రకాశించే సూర్య భగవాగవానుడి లేలేత కిరణాల హొయలు, ఆ ఆదిత్యుడికి స్వాగతం పలికే పక్షుల కిలకిలారావాలు, ఈ సుందర దృశ్యాలను ప్రతిబింబిస్తూ మురిసి మెరిసిపోయే సముద్ర అలలు.. గాలి తాకిళ్లను తట్టుకుని ముందుకు దూకే పడవలు, వాటిలోని జాలర్లు, పసిపిల్లల కేరింతల్లా చప్పుడుచేసే కొబ్బరాకుల గలగలలు... ఇంతటి ప్రకృతి సౌందర్యాన్ని తనలో దాచుకున్న...
Source: వినోదం | 7 Aug 2009 | 5:43 am

తెదేపాలో గౌడ్ ప్రకంపనలు: ఒక నేత గుడ్‌బై

ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలో తూళ్ళ దేవేందర్ గౌడ్ ప్రకంపనలు ఆరంభమయ్యాయి. గౌడ్‌ను మళ్లీ పార్టీలో చేర్చుకోవడంతో మనస్తాపానికి లోనైన పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి తెదేపాకు గుడ్‌బై చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 7 Aug 2009 | 5:11 am

శోభ ఉదంతంతో ప్రజారాజ్యానికి నష్టం వాటిల్లుతుందా...?

గురువారం జరిగిన శోభారాణి, ప్రకాష్ రాజ్ పెళ్లి ఫోటోల ఉదంతంపై ఎలక్ట్రానిక్ మీడియా గగ్గోలు పెట్టింది. చర్చల మీద చర్చలతో చీల్చి చండాడింది. ఈ వ్యవహారంతో ప్రజారాజ్యం పార్టీ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లుతుందనీ, చాపకింద నీరులా తెలియని ముప్పు ఆవహించవచ్చని శుక్రవారం పార్టీ వర్గాలు ఏర్పాటు చేసిన సమావేశంలో చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం.
Source: ఏపీ న్యూస్ | 7 Aug 2009 | 5:09 am

అవినీతి ఆరోపణల వెనుక సీఎం హస్తం: కేంద్రమంత్రి

తనపై వచ్చిన అవినీతి ఆరోపణల వెనుక హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్ దుమాల్ హస్తం ఉందని కేంద్రం ఉక్కు శాఖామంత్రి వీరభద్రా సింగ్ ఆరోపించారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించిన విడుదలైన సీడీలను ముఖ్యమంత్రే బహిర్గతం చేశారని ఆయన శుక్రవారం ధ్వజమెత్తారు.
Source: జాతీయ | 7 Aug 2009 | 4:50 am

రాత్రిపూట సైఫ్ లేనిదే కరీనాకు నిద్రపట్టదట

తన ప్రియుడు సైఫ్ అలీఖాన్ తోటి తారామణులతో చనువుగా ఉండటాన్ని చూసి సహించలేని కరీనాకపూర్.. ఖాన్‌కు కొత్త ఆంక్ష విధించిందట. అదేమిటంటే.. రోజూ తను నిద్రపోయేముందు సైఫ్‌కు "ట్రింగ్ ట్రింగ్" ఇస్తుందట. అర్థం కాలేదా..? అదేనండీ ఫోన్ కాల్. ఆ ఫోన్ కాల్ వచ్చిన వెంటనే సైఫ్ ఎక్కడ ఉన్నా ఆమె ముందు ప్రత్యక్షమవ్వాలట. అలా సైఫ్‌ను చూసిన పిదప నిద్రకు ఉపక్రమిస్తుందట కరీనా. మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత గత రోజు తాలూకు ఒత్తిళ్లు, వ్యతిరేక అనుభూతులను వదిలించుకునేందుకు యోగా చేస్తుందట. యోగా ముగిసిన వెంటనే మళ్లీ సైఫ్‌కు "ట్రింగ్" చేస్తుందట. ఈ ట్రింగ్.. ట్రింగ్‌లతో ఖాన్‌కు నిద్రలేకుండా చేస్తోందట. ఈ తంతునంతా గమనిస్తున్న కరీనా ఇరుగు పొరుగు ఇళ్లలోని వారు సైఫ్‌ను చూసి జాలిపడుతున్నారట. సైఫ్ మాత్రం ఏం చేస్తాడు. ప్రియురాలాయే...!! స్ట్రాంగ్‌గా ఓ పెద్ద "ట్రింగ్" ఇచ్చిందంటే ఏం చేయమన్నా చేయాలి.. ఎప్పుడు రమ్మన్నా రావాలి. అంతా ట్రింగ్... ట్రింగ్ మహిమ.
Source: వినోదం | 7 Aug 2009 | 4:33 am

ముఖ్యమంత్రి చెన్నై పర్యటన రద్దు

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి చెన్నై పర్యటన రద్దయ్యింది. శుక్రవారం మధ్యాహ్నం వైఎస్ హైదరాబాద్ నుంచి చెన్నై బయలుదేరి వెళ్ళాల్సి ఉంది.
Source: ఏపీ న్యూస్ | 7 Aug 2009 | 4:13 am

బాలీవుడ్ పాటల రచయిత గుల్షన్ మృతి

ప్రముఖ బాలీవుడ్ పాటల రచయిత గుల్షన్ బావ్రా మరణించారు. సినీరంగంలో తన హవాను కొనసాగించి, తన పాటలతో శ్రోతలను ఇట్టే ఆకట్టుకున్న గుల్షన్‌కు మరణించేనాటికి 70 సంవత్సరాలు. 54 సంవత్సరాల పాటు సినీరంగంలో రాణించిన గుల్షన్ 240కి పైగా పాటలు రాశారు. "ఉపకార్" చిత్రంలోని "మేరే దేశ్‌ కీ ధర్తీ" అని సాగే దేశభక్తి గీతం సూపర్ హిట్టయ్యింది.
Source: వినోదం | 7 Aug 2009 | 4:04 am

ఫీజులు పెంచే హక్కు ప్రైవేట్ స్కూళ్లకు లేదు

ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలలకు ఫీజులు పెంచే హక్కు లేదని సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పు చెప్పింది. విద్యార్థుల వద్ద వసూలు చేసే ఫీజులను పెంచే హక్కు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు లేదని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 2004లో సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పును పునఃపరిశీలించాలని కోరుతూ అన్‌ఎయిడెడ్ ప్రైవేట్ కళాశాలల కార్యాచరణ కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది.
Source: జాతీయ | 7 Aug 2009 | 3:38 am