బ్యాంకుల సమ్మె ముగుస్తుంది : మంత్రి ముఖర్జీ

దేశవ్యాప్తంగా రెండు రోజుల సమ్మెతో ప్రజలు, ఖాతాదారులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం బ్యాంక్ ఉద్యోగులు తమ సమ్మెను ఈరోజుతో ముగుస్తారని ప్రభుత్వం భావిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 7 Aug 2009 | 9:51 am

ముఖ్యమంత్రి చెన్నై పర్యటన రద్దు

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి చెన్నై పర్యటన రద్దయ్యింది. శుక్రవారం మధ్యాహ్నం వైఎస్ హైదరాబాద్ నుంచి చెన్నై బయలుదేరి వెళ్ళాల్సి ఉంది.
Source: Yahoo! Telugu: News | 7 Aug 2009 | 9:42 am

378 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం 351 పాయింట్లు నష్టపోవడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 15,163 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 108 పాయింట్లు నష్టపోయి 4,478 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 2.26 శాతం, నిఫ్టీ 2.35 శాతం మేరకు క్షీణించాయి. అన్ని సెక్టోరల్ ఇండెక్స్‌లు నష్టాల్లో పయనిస్తున్నాయి.
Source: Yahoo! Telugu: News | 7 Aug 2009 | 9:33 am

బాలీవుడ్ పాటల రచయిత గుల్షన్ మృతి

ప్రముఖ బాలీవుడ్ పాటల రచయిత గుల్షన్ బావ్రా మరణించారు. సినీరంగంలో తన హవాను కొనసాగించి, తన పాటలతో శ్రోతలను ఇట్టే ఆకట్టుకున్న గుల్షన్‌కు మరణించేనాటికి 70 సంవత్సరాలు. 54 సంవత్సరాల పాటు సినీరంగంలో రాణించిన గుల్షన్ 240కి పైగా పాటలు రాశారు. "ఉపకార్" చిత్రంలోని "మేరే దేశ్‌ కీ ధర్తీ" అని సాగే దేశభక్తి గీతం సూపర్ హిట్టయ్యింది.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Aug 2009 | 9:24 am

ఫీజులు పెంచే హక్కు ప్రైవేట్ స్కూళ్లకు లేదు

ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలలకు ఫీజులు పెంచే హక్కు లేదని సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పు చెప్పింది. విద్యార్థుల వద్ద వసూలు చేసే ఫీజులను పెంచే హక్కు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు లేదని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 2004లో సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పును పునఃపరిశీలించాలని కోరుతూ అన్‌ఎయిడెడ్ ప్రైవేట్ కళాశాలల కార్యాచరణ కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది.
Source: Yahoo! Telugu: News | 7 Aug 2009 | 9:08 am

దేశీయ మార్కెట్లో వోల్వో ఎక్స్‌60 కారు

రానున్న సంవత్సరంలో దేశంలో వోల్వోకు చెందిన లక్జరీ సీడన్‌ ఎస్‌60 కారుని ప్రవేశ పెట్టగలమని స్వీడిష్‌ కార్ల ఉత్పత్తి సంస్థ వోల్వో కార్‌ ప్రకటించింది.
Source: Yahoo! Telugu: News | 7 Aug 2009 | 9:06 am

రాజీవ్ హత్య గురించి కేపీకి ముందే తెలుసు

భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య గురించి ఎల్టీటీఈ కొత్త అధిపతి సెల్వరాస పధ్మనాథన్‌ను కొన్ని నెలల ముందే తెలుసు. శ్రీలంకలో ప్రత్యేక దేశం కోసం సుమారు 30 ఏళ్లపాటు అంతర్యుద్ధాన్ని సాగించిన ఎల్టీటీఈ రాజీవ్ గాంధీ హత్యకు వ్యూహరచన చేసి, అమలు చేసిన సంగతి తెలిసిందే.
Source: Yahoo! Telugu: News | 7 Aug 2009 | 8:44 am

310 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం 310 పాయింట్లు కోల్పోవడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 15,204 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 81 పాయింట్లు నష్టపోయి 4,504 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 2.00 శాతం, నిఫ్టీ 1.77 శాతం మేరకు క్షీణించాయి.
Source: Yahoo! Telugu: News | 7 Aug 2009 | 8:27 am

రాష్ట్రంలో దారుణంగా పడిపోయిన పాల ఉత్పత్తి

రాష్ట్రంలో ముందెన్నడూ లేని విధంగా పాల ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. పాల కొరత ఏర్పడటంతో ఇతర రాష్ట్రాల నుంచి పాలను దిగుమతి చేసుకోవలసిన అగత్యం ఏర్పడింది. ఒక వైపు పాల ఉత్పత్తి తగ్గి డైరీలు వట్టిపోతుండగా.. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో...
Source: Yahoo! Telugu: News | 7 Aug 2009 | 7:58 am

మరింతగా నష్టాల్లోకి స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం నష్టాల్లోకి మరింతగా కూరుకుపోతుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 257 పాయింట్లు కోల్పోయి 15,257 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 89 పాయింట్లు నష్టపోయి 4,497 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 1.66 శాతం, నిఫ్టీ 1.93 శాతం మేరకు క్షీణించాయి.
Source: Yahoo! Telugu: News | 7 Aug 2009 | 7:34 am

ఉద్యోగులను తొలగించనున్న జెట్‌ ఎయిర్‌వేస్‌

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొన్న పరిస్థితుల్లో దేశీయ విమానయాన సంస్థలపై రోకటి పోటులాగా మారి పెరిగిన ఇంధన భారం మరింత కుంగదీస్తోంది. ఈ సమస్యల నుంచి బయ టపడేందుకు పలు విమానయాన సంస్థలు ఉద్యోగులను తొలగించేందుకు సిద్దమవుతున్నాయి.
Source: Yahoo! Telugu: News | 7 Aug 2009 | 7:24 am

"వాట్ ఎ మ్యాన్"..! ఆయనంటే నాకెంతో ఇష్టం..!

"ప్రజలను ప్రభావితం చేసే సత్తా ఆయనకుంది. నిర్మలమైన, నిష్కలమైన మనస్తత్వం ఆయనిది. అంతేకాదు.. గొప్పవ్యక్తి అయిన కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ రాహుల్ గాంధీ అంటే నా కెంతో ఇష్టమని" బాలీవుడ్ భామ దియా మీర్జా చెప్పింది. తన అందచందాలతో కుర్రకారును ఇట్టే ఆకట్టుకుంటున్న దియా.. ఎట్టకేలకు మనసులోని మాటను బయట పెట్టింది. హైదరాబాదులో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మకు నచ్చిన వ్యక్తి ఎవరబ్బా? అని అందరూ ఎదురుచూస్తుండగానే.. దియా రాహుల్ అంటే తనకు ఇష్టమని చెప్పేసింది.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Aug 2009 | 6:16 am

ముఖ్యమంత్రి చెన్నై పర్యటన రద్దు

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి చెన్నై పర్యటన రద్దయ్యింది. శుక్రవారం మధ్యాహ్నం వైఎస్ హైదరాబాద్ నుంచి చెన్నై బయలుదేరి వెళ్ళాల్సి ఉంది.
Source: ఏపీ న్యూస్ | 7 Aug 2009 | 4:13 am

ఫీజులు పెంచే హక్కు ప్రైవేట్ స్కూళ్లకు లేదు

ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలలకు ఫీజులు పెంచే హక్కు లేదని సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పు చెప్పింది. విద్యార్థుల వద్ద వసూలు చేసే ఫీజులను పెంచే హక్కు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు లేదని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 2004లో సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పును పునఃపరిశీలించాలని కోరుతూ అన్‌ఎయిడెడ్ ప్రైవేట్ కళాశాలల కార్యాచరణ కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది.
Source: జాతీయ | 7 Aug 2009 | 3:38 am

రాష్ట్రంలో దారుణంగా పడిపోయిన పాల ఉత్పత్తి

రాష్ట్రంలో ముందెన్నడూ లేని విధంగా పాల ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. పాల కొరత ఏర్పడటంతో ఇతర రాష్ట్రాల నుంచి పాలను దిగుమతి చేసుకోవలసిన అగత్యం ఏర్పడింది. ఒక వైపు పాల ఉత్పత్తి తగ్గి డైరీలు వట్టిపోతుండగా.. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో...
Source: ఏపీ న్యూస్ | 7 Aug 2009 | 2:28 am

స్వైన్ ఫ్లూ వ్యాప్తి సాధారణమే: మంత్రి ఆజాద్

ప్రపంచాన్ని వణికిస్తున్న స్వైన్ ఫ్లూ వ్యాధి దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా.. మహారాష్ట్రలోని పూణె నగర వాసులను ఈ వైరస్ భయభ్రాంతులకు గురి చేస్తోంది. అయితే, హెచ్‌1ఎన్1 వైరస్ వ్యాప్తి దేశంలో సాధారణంగానే ఉందని కేంద్ర ఆరోగ్యం శాఖామంత్రి గులాం నబీ ఆజాద్ అన్నారు.
Source: జాతీయ | 7 Aug 2009 | 1:40 am

అథారిటీ ఏర్పాటుకు రాహుల్ మద్దతు

దేశంలోనే బాగా వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు పొందిన బుందేల్‌ఖండ్‌ అభివృద్ధి కోసం ప్రత్యేక డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిసి వినతిపత్రం కూడా సమర్పించింది.
Source: జాతీయ | 7 Aug 2009 | 1:05 am

ఆయిల్ ఫాం రైతులకు ప్రత్యేక ప్యాకేజీ: మంత్రి

కష్టాల ఊబిలో చిక్కుకున్న ఆయిల్ ఫాం రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీతో కూడిన చర్యలు తీసుకోనున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి ఎన్.రఘువీరా రెడ్డి తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 7 Aug 2009 | 12:33 am

మటన్ బిర్యానీ కావాలి.. తీసుకరండి: కసబ్

ఏంటీ.. రోజూ పప్పు, ఆకుకూరలేనా? మటన్.. చికెన్ బిర్యానీల వంటివి వడ్డించరా? అంటూ తీవ్రవాది అజ్మల్ కసబ్ జైలు సిబ్బందిని ప్రశ్నించాడు. రోజూ చపాతీలు, పప్పు కూరలు తిని నోరు చప్పగా ఉంది. నాకు మటన్ బిర్యానీ తినాలని ఉంది తెప్పించండి అంటూ రగడ చేశాడు.
Source: జాతీయ | 6 Aug 2009 | 11:58 pm

చెన్నైలో పర్యటించనున్న ముఖ్యమంత్రి వైఎస్సార్

రాష్ట్రముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి శుక్రవారం చెన్నై నగరానికి చేరుకోనున్నారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నిర్వహిస్తోన్న ఓ సదస్సులో పాల్గొనేందుకు ఆయన చెన్నైకి ప్రయాణం కానున్నారని ప్రభుత్వ అధికారిక వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు చెన్నై విమానాశ్రయం చేరుకునే వైఎస్ తర్వాత రాయల్ మెరీడియన్ హోటల్‌కు చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 3.15కు సీఐఐ సదస్సులో పాల్గొంటారు. 4.30 గంటలకు చెన్నైలోని తరమణి ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి వైఎస్సార్ హాజరవుతారు.
Source: ఏపీ న్యూస్ | 6 Aug 2009 | 11:47 pm

తెదేపా బాబు సొంత ఆస్తికాదు: ప్రసన్న కుమార్

తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడుకు చెందిన సొంత ఆస్తి కాదని నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద విలేఖరులతో మాట్లాడారు. తాను నోరు విప్పితే చంద్రబాబు బండారం బయటపడుతుందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 6 Aug 2009 | 11:38 pm

బెల్టు షాపులు ఎలా ఆపమంటారు: రోశయ్య ప్రశ్న

రాష్ట్ర ఖజానాకు ప్రధాన ఆదాయవనరుగా ఉన్న బెల్టు షాపులను ఎలా ఆపమంటారని ప్రతిపక్ష సభ్యులను విత్తమంత్రి కె.రోశయ్య ప్రశ్నించారు. ఈ షాపులను పూర్తిగా అరికట్టడం సాధ్యం కాదని ఆయన చెప్పుకొచ్చారు. బెల్టు షాపులను అరికడితే సమాజంలో చీప్‌లిక్కర్ ఏరులై పారే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
Source: ఏపీ న్యూస్ | 6 Aug 2009 | 11:13 pm

ఢిల్లీలో ఇద్దరు హిజ్బుల్ తీవ్రవాదుల అరెస్ట్

దేశ రాజధానిలో గురువారం రాత్రి ఇద్దరు అనుమానిత హిజ్బుల్ ముజాహిదీన్ తీవ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో.. తీవ్రవాదులను పోలీసులు అరెస్టు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Source: జాతీయ | 6 Aug 2009 | 10:07 pm

అంతర్గత భద్రతపై 17న సీఎంల సమావేశం

నక్సల్స్ హింసాకాండ, పాకిస్థాన్‌కు చెందిన తీవ్రవాద సంస్థలు దేశంలో అరాచకాలు సృష్టిస్తున్న నేపథ్యంలో.. అంతర్గత భద్రతపై చర్చించేందుకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అధ్యక్షతన ముఖ్యమంత్రుల సమావేశం జరగబోతుంది. నక్సల్స్, తీవ్రవాదుల ముప్పుతోపాటు, జమ్ము- కాశ్మీర్, ఈశాన్య భారతదేశంలో పరిస్థితులపై కూడా ముఖ్యమంత్రులతో ప్రధాని చర్చలు జరుపుతారు.
Source: జాతీయ | 6 Aug 2009 | 9:22 pm

పొడుగుకాళ్ల సుందరిని ముద్దుగోల వదలదా..?

ప్రముఖ బాలీవుడ్ నటి, పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టిని ముద్దు వివాదం వదిలేలా కనిపించడంలేదు. ఎయిడ్స్‌పై ప్రచారంలో భాగంగా భారత్ వచ్చిన హాలీవుడ్ నటుడు రిచర్డ్ గెరె ఆమెను బహిరంగంగా ముద్దుపెట్టుకోవడంపై దేశంలో తీవ్రస్థాయిలో దుమారం రేగిన విషయం తెల్సిందే. తాజాగా మరో ముద్దు వివాదంలో శిల్ప చిక్కుకుంది. ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా శిల్పాశెట్టి ఇటీవలే ఒరిస్సాలోని సాక్షిగోపాల ఆలయాన్ని సందర్శించింది. అయితే అక్కడ శిల్పాశెట్టిని చూసి తెగ మురిసిపోయిన ఓ వృద్ధ అర్చకుడు ఆమెను ఆశీర్వదించే క్రమంలో.. ఆలయంలోనే ముద్దెట్టుకున్నాడట.
Source: Yahoo! Telugu: Entertainment | 6 Aug 2009 | 12:30 pm

"తడాఖా" సినిమా షూటింగ్ ప్రారంభం

ఆదిత్య ఓం, దినేష్, సునయన, రూపాకౌర్ నాయకా నాయికలుగా నటిస్తోన్న చిత్రం "తడాఖా". రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై పూసల రాధ దర్శకత్వంలో బి. ఓబుల్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ముహూర్తపు షాట్‌కు కోడి రామకృష్ణ క్లాప్ ఇవ్వగా, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. పి.సి.రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 6 Aug 2009 | 11:13 am

ఆర్తి అగర్వాల్‌తో జతకట్టిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం!

లేట్ మేరేజ్ అయినా లేటెస్ట్‌గా అయిందన్నట్లుగా ఎట్టకేలకు మరో కమేడియన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం హీరో అయిపోయాడు. నాలుగేళ్ళుగా తన బాడీ లాంగ్వేజ్‌కు సరిపడా కథ ఉందని పలువురు చెబుతూ వచ్చారని, కానీ ఇన్నాళ్లకు అది కార్యరూపం దాల్చిందని నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం అన్నారు. రాఖీపౌర్ణమి సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. రాజా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై ఈ చిత్రాన్ని రాజా ఆర్.ఆర్. నిర్మిస్తుండగా, రామ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ధర్మవరపు, అనుష్యరామ్‌పై తీసిన తొలిషాట్‌కు డా.డి. రామానాయుడు క్లాప్‌కొట్టగా రమేష్‌ప్రసాద్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 6 Aug 2009 | 9:37 am

"మళ్ళీ మళ్ళీ" కళ్యాణి చేస్తోన్న "సర్పయాగం"

"మళ్ళీ మళ్ళీ" ఫేమ్ కళ్యాణి హీరోయిన్‌గా, విక్టరి ఫిలింస్ టి. దుర్గారావు సమర్పణలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం "సర్పయాగం". రాజపుత్ర క్రియేషన్స్ పతాకంపై రుద్రరాజు ప్రసాద్‌రాజు నిర్మించిన ఈ సినిమాకు అన్బు దర్శకత్వం వహించారు. తాజాగా అనువాద కార్యక్రమాలను పూర్తి చేసుకున్న "సర్పయాగం" ప్రస్తుతం డీటీఎస్ మిక్సింగ్ జరుపుకుంటోంది. ఆగస్టు నెలాఖరుకు విడుదలకానున్నఈ సినిమా గురించి నిర్మాత రుద్రరాజు ప్రసాద్ రాజు మాట్లాడుతూ.. తమిళంలో ఘనివిజయం సాధించిన "ప్రతినాయిరు 7 టు 10 ఎ.ఎం" అనే చిత్రాన్ని"సర్పయాగం" పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నామన్నారు. జల్సాలకు అలవాటుపడిన నలుగురు యువకులు మద్యం మత్తుతో ఓ ఆదివారం అనుకోకుండా తమకు తారసపడిన హీరోయిన్‌ను రేప్ చేస్తారు. తనకు జరిగిన అన్యాయానికి వారిపై పగతీర్చుకునే క్రమంలో, తనను రేప్ చేసిన ఆ నలుగురిలో ఒకరిని కొన్ని విచిత్ర పరిస్థితుల్లో హీరోయిన్ పెళ్ళి చేసుకుని నలుగురిపై పగ తీర్చుకుంటుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 6 Aug 2009 | 9:12 am

రాష్ట్రంలో 71కి చేరిన స్వైన్ ఫ్లూ కేసులు

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మరో ముగ్గురికి స్వైన్ ఫ్లూ వైరస్ సోకినట్లు ఛాతీ వైద్యశాలకు చెందిన వైద్యాధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ సోకినవారి సంఖ్య 71కి చేరింది.
Source: ఏపీ న్యూస్ | 6 Aug 2009 | 8:59 am

తల్లిపాల రుణం తీర్చుకుంటా: దేవేందర్ గౌడ్

తనకు రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీ కన్నతల్లిలాంటిదని, ఇకపై ఆ తల్లిపాల రుణం తీర్చుకునేందుకు రాత్రి పగలు కష్టపడి పని చేస్తానని సీనియర్ నేత దేవేందర్ గౌడ్ ప్రకటించారు. ఆయన తన అనుచరులతో కలిసి గురువారం తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో మళ్లీ తెదేపా తీర్థం పుచ్చుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 6 Aug 2009 | 8:12 am

చిక్కుల్లో కాంగ్రెస్ వృద్ధనేత బూటా సింగ్

ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్ ఛైర్మన్, కాంగ్రెస్ పార్టీ వృద్ధ నేత బూటా సింగ్‌ కష్టాల కడలి నుంచి గట్టెక్కేలా కనిపించడం లేదు. బీహార్‌లో రూ.900 కోట్ల విలువ చేసే ప్రాజెక్టు కేటాయింపుపై బూటాసింగ్ పాత్రపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయిని ఏర్పాటు చేయనుంది.
Source: జాతీయ | 6 Aug 2009 | 8:00 am

మహారాష్ట్రలో కొత్తగా 30 స్వైన్ ఫ్లూ కేసులు

ప్రపంచాన్ని వణికిస్తున్న స్వైన్ ఫ్లూ వ్యాధి మహారాష్ట్రలో వేగంగా విస్తరిస్తోంది. గురువారం మరో 30 కేసులు వెలుగు చూశాయి. దీంతో మహారాష్ట్రలో నమోదైన స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య 172కు చేరుకుంది.
Source: జాతీయ | 6 Aug 2009 | 7:06 am

కోడవీడు మనదేరా... "కొండపల్లి" మనదేరా...!!

"కోడవీడు మందేరా ... కొండపల్లి మందేరా కాదనువాడుంటే ... కటకం దాకా మందేరా...!" అంటూ శ్రీకృష్ణదేవరాయల కాలంలో వీరత్వం ఒలికించే ఈ పాటకు నెలవైన "కొండపల్లి కోట"ను కలిగి ఉన్న గ్రామమే "కొండపల్లి". కొండపల్లి అంటేనే కొండపల్లి కొయ్య బొమ్మలతోపాటు కొండపల్లి దుర్గం కూడా గుర్తు రావడం సహజం. అయితే కొండపల్లి కోట కంటే, కొండపల్లి కొయ్య బొమ్మలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయన్నది అందరికీ తెలిసిందే...!
Source: వినోదం | 6 Aug 2009 | 6:20 am

"సింహా"గా వస్తోన్న నందమూరి బాలకృష్ణ

నరసింహనాయుడు, లక్ష్మీనరసింహ వంటి చిత్రాల్లో నటించిన నందమూరి బాలకృష్ణ "సింహా"గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. గురువారం నాడు హైదరాబాదులో ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్, తారకరత్న, మోహనకృష్ణలతో పాటు తదితర నందమూరి వంశీయులు హాజరయ్యారు. బాలకృష్ణపై తీసిన ముహూర్తపు షాట్‌కు డి. సురేష్‌బాబు క్లాప్ కొట్టగా, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 6 Aug 2009 | 6:11 am

ఆస్పత్రులపై కేసు పెట్టిన రీడా కుటుంబసభ్యులు

స్వైన్ ఫ్లూ బారినపడి మృతి చెందిన రీడా షేక్ (14) కుటుంబసభ్యులు తమ బిడ్డ మరణానికి కారణమైన రెండు ప్రైవేట్ ఆస్పత్రులపై పోలీసు కేసు పెట్టారు. పూణేలోని సెయింట్ అన్నెస్ పాఠశాలలో తొమ్మిదో చదువుతున్న రీడా షేక్ మంగళవారం స్వైన్ ఫ్లూ కారణంగా ప్రాణాలు కోల్పోయింది.
Source: జాతీయ | 6 Aug 2009 | 5:52 am

కలెక్షన్ల వెల్లువలో "చిరుత"నయుడి "మగధీర"

"చిరుత"నయుడు రామ్‌చరణ్ తేజ హీరోగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం "మగధీర". సెక్సీడాళ్ కాజల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు రాజమౌళి రూపొందించగా, గీతాఆర్ట్స్ అధినేత అల్లుఅరవింద్ నిర్మించారు. గతవారం లాంఛనంగా తెరపైకి విడుదలైన "మగధీర" మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అత్యున్నత ప్రమాణాలతో హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 50 థియేటర్లకు పైగా విడుదల చేయడం విశేషం.
Source: Yahoo! Telugu: Entertainment | 6 Aug 2009 | 5:45 am

"రాజు.. రాణి"కి మూడు ముళ్ళ బంధం!?

సినీ నటుడు ప్రకాష్ రాజ్, ప్రజారాజ్యం మహిళా విభాగం అధ్యక్షురాలు శోభారాణి వివాహం ఊహాగాహన వార్తలు రాష్ట్రంలో సంచలనం రేకెత్తించాయి. ఇటీవల చెన్నయ్ పర్యటనకు వెళ్లిన శోభారాణి.. ప్రకాష్‌రాజ్‌తో పరిచయం ఏర్పడటం.. ఆ పరిచయం ప్రేమగా.. ఆపై పెళ్లికి చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి.
Source: ఏపీ న్యూస్ | 6 Aug 2009 | 3:50 am

రాష్ట్రంలో చల్లారని "మగధీర" వివాదం

రాష్ట్రంలో మగధీర పాట వివాదం చల్లారడం లేదు. ఈ పాట వివాదానికి రాజకీయ రంగు తోడు కావడంతో పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. దీంతో ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి తనయుడు రాంచరణ్‌తేజ్‌ నటించిన 'మగధీర' సినిమా వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది.
Source: ఏపీ న్యూస్ | 6 Aug 2009 | 3:07 am