మహారాష్ట్రంలో కొత్తగా 30 స్వైన్ ఫ్లూ కేసులు

ప్రపంచాన్ని వణికిస్తున్న స్వైన్ ఫ్లూ వ్యాధి మహారాష్ట్రంలో వేగంగా విస్తరిస్తోంది. గురువారం మరో 30 కేసులు వెలుగు చూశాయి. దీంతో మహారాష్ట్రంలో నమోదైన స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య 172కు చేరుకుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి.
Source: Yahoo! Telugu: News | 6 Aug 2009 | 9:44 am

374 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

స్టాక్ మార్కెట్ 374 పాయింట్లు కోల్పోవడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 15,530 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 103 పాయింట్లు నష్టపోయి 4,591 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 2.35 శాతం, నిఫ్టీ 2.20 శాతం చొప్పున క్షీణించాయి. అన్ని సెక్టోరల్ ఇండెక్స్‌లు దాదాపు నష్టాల్లో నడుస్తున్నాయి.
Source: Yahoo! Telugu: News | 6 Aug 2009 | 9:40 am

ఆర్తి అగర్వాల్‌తో జతకట్టిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం!

లేట్ మేరేజ్ అయినా లేటెస్ట్‌గా అయిందన్నట్లుగా ఎట్టకేలకు మరో కమేడియన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం హీరో అయిపోయాడు. నాలుగేళ్ళుగా తన బాడీ లాంగ్వేజ్‌కు సరిపడా కథ ఉందని పలువురు చెబుతూ వచ్చారని, కానీ ఇన్నాళ్లకు అది కార్యరూపం దాల్చిందని నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం అన్నారు. రాఖీపౌర్ణమి సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. రాజా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై ఈ చిత్రాన్ని రాజా ఆర్.ఆర్. నిర్మిస్తుండగా, రామ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ధర్మవరపు, అనుష్యరామ్‌పై తీసిన తొలిషాట్‌కు డా.డి. రామానాయుడు క్లాప్‌కొట్టగా రమేష్‌ప్రసాద్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 6 Aug 2009 | 9:37 am

సూకీని విడుదల చేయాలి: ఐరాస డిమాండ్

మయన్మార్ ప్రతిపక్ష నేత ఆంగ్ సాన్ సూకీతోపాటు రాజకీయ ఖైదీలందరినీ అధికార జుంతా నిర్బంధం నుంచి విడిచిపెట్టాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ డిమాండ్ చేశారు. మయన్మార్‌లో ప్రజాస్వామ్య స్థాపన కోసం ఏళ్ల తరబడి పోరాటం సాగిస్తున్న సూకీని, ఇతర నేతలను అధికార మిలిటరీ జుంతా నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే.
Source: Yahoo! Telugu: News | 6 Aug 2009 | 9:27 am

"రాజు.. రాణి"కి మూడు ముళ్ళ బంధం!?

సినీ నటుడు ప్రకాష్ రాజ్, ప్రజారాజ్యం మహిళా విభాగం అధ్యక్షురాలు శోభారాణి వివాహం ఊహాగాహన వార్తలు రాష్ట్రంలో సంచలనం రేకెత్తించాయి. ఇటీవల చెన్నయ్ పర్యటనకు వెళ్లిన శోభారాణి.. ప్రకాష్‌రాజ్‌తో పరిచయం ఏర్పడటం.. ఆ పరిచయం ప్రేమగా.. ఆపై పెళ్లికి చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి.
Source: Yahoo! Telugu: News | 6 Aug 2009 | 9:15 am

"మళ్ళీ మళ్ళీ" కళ్యాణి చేస్తోన్న "సర్పయాగం"

"మళ్ళీ మళ్ళీ" ఫేమ్ కళ్యాణి హీరోయిన్‌గా, విక్టరి ఫిలింస్ టి. దుర్గారావు సమర్పణలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం "సర్పయాగం". రాజపుత్ర క్రియేషన్స్ పతాకంపై రుద్రరాజు ప్రసాద్‌రాజు నిర్మించిన ఈ సినిమాకు అన్బు దర్శకత్వం వహించారు. తాజాగా అనువాద కార్యక్రమాలను పూర్తి చేసుకున్న "సర్పయాగం" ప్రస్తుతం డీటీఎస్ మిక్సింగ్ జరుపుకుంటోంది. ఆగస్టు నెలాఖరుకు విడుదలకానున్నఈ సినిమా గురించి నిర్మాత రుద్రరాజు ప్రసాద్ రాజు మాట్లాడుతూ.. తమిళంలో ఘనివిజయం సాధించిన "ప్రతినాయిరు 7 టు 10 ఎ.ఎం" అనే చిత్రాన్ని"సర్పయాగం" పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నామన్నారు. జల్సాలకు అలవాటుపడిన నలుగురు యువకులు మద్యం మత్తుతో ఓ ఆదివారం అనుకోకుండా తమకు తారసపడిన హీరోయిన్‌ను రేప్ చేస్తారు. తనకు జరిగిన అన్యాయానికి వారిపై పగతీర్చుకునే క్రమంలో, తనను రేప్ చేసిన ఆ నలుగురిలో ఒకరిని కొన్ని విచిత్ర పరిస్థితుల్లో హీరోయిన్ పెళ్ళి చేసుకుని నలుగురిపై పగ తీర్చుకుంటుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 6 Aug 2009 | 9:12 am

నష్టాలబాటలో కింగ్‌ఫిషర్

నిరుడు ఆర్థిక సంవత్సరం కింగ్‌ఫిషర్ విమానయాన సంస్థ రూ. 1,608.09 కోట్ల నష్టాలు వచ్చాయని కంపెనీ ప్రకటించింది. కాని తమ సంస్థ షేర్ మార్కెట్ ద్వారా రూ. 500 కోట్లను సమకూర్చేందుకు ప్రణాళికలను రూపొందించిందని కంపెనీ ప్రకటించింది
Source: Yahoo! Telugu: News | 6 Aug 2009 | 8:47 am

స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం స్వల్ప లాభాల్లో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 10 పాయింట్లు లాభపడి 15,913 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 14 పాయింట్లు పెరిగి 4,708 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.06 శాతం, నిఫ్టీ 0.30 శాతం చొప్పున వృద్ధి చెందాయి.
Source: Yahoo! Telugu: News | 6 Aug 2009 | 8:23 am

లాభాల్లో పయనిస్తున్న స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం లాభాల్లో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 49 పాయింట్లు బలపడి 15,953 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 17 పాయింట్లు లాభపడి 4,711 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.31 శాతం, నిఫ్టీ 0.36 శాతం చొప్పున వృద్ధి చెందాయి.
Source: Yahoo! Telugu: News | 6 Aug 2009 | 7:55 am

రాష్ట్రంలో చల్లారని "మగధీర" వివాదం

రాష్ట్రంలో మగధీర పాట వివాదం చల్లారడం లేదు. ఈ పాట వివాదానికి రాజకీయ రంగు తోడు కావడంతో పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. దీంతో ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి తనయుడు రాంచరణ్‌తేజ్‌ నటించిన 'మగధీర' సినిమా వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది.
Source: Yahoo! Telugu: News | 6 Aug 2009 | 7:47 am

ముషారఫ్‌‍కు భద్రత కల్పించడం లేదు: పాక్

ప్రవాసంలోకి వెళ్లిన పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు పాక్ ప్రభుత్వం అధికారిక భద్రత కల్పినట్లు వచ్చిన వార్తలను పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) సీనియర్ నేత ఒకరు తోసిపుచ్చారు. పీపీపీ నేతృత్వంలోని పాక్ ప్రభుత్వం లండన్‌లో ఉంటున్న ముషారఫ్‌కు ఎటువంటి భద్రత కల్పించడం లేదని స్పష్టం చేశారు.
Source: Yahoo! Telugu: News | 6 Aug 2009 | 7:45 am

జాతి వివక్ష దాడులు: భద్రతపై కృష్ణ హామీ

భారత విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ ఆస్ట్రేలియా పర్యటన గురువారం ప్రారంభమైంది. ఆయన పర్యటన ఐదు రోజులపాటు సాగనుంది. ఆస్ట్రేలియా వచ్చిన సందర్భంగా ఎస్ఎం కృష్ణ మాట్లాడుతూ.. విదేశాల్లో ఉంటున్న భారతీయుల భద్రతకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.
Source: Yahoo! Telugu: News | 6 Aug 2009 | 7:36 am

"సింహా"గా వస్తోన్న నందమూరి బాలకృష్ణ

నరసింహనాయుడు, లక్ష్మీనరసింహ వంటి చిత్రాల్లో నటించిన నందమూరి బాలకృష్ణ "సింహా"గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బోయపాటి శీను దర్శకత్వం వహిస్తున్నారు. గురువారం నాడు హైదరాబాదులో ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్, తారకరత్న, మోహనకృష్ణలతో పాటు తదితర నందమూరి వంశీయులు హాజరయ్యారు. బాలకృష్ణపై తీసిన ముహూర్తపు షాట్‌కు డి. సురేష్‌బాబు క్లాప్ కొట్టగా, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 6 Aug 2009 | 6:11 am

కలెక్షన్ల వెల్లువలో "చిరుత"నయుడి "మగధీర"

"చిరుత"నయుడు రామ్‌చరణ్ తేజ హీరోగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం "మగధీర". సెక్సీడాళ్ కాజల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు రాజమౌళి రూపొందించగా, గీతాఆర్ట్స్ అధినేత అల్లుఅరవింద్ నిర్మించారు. గతవారం లాంఛనంగా తెరపైకి విడుదలైన "మగధీర" మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అత్యున్నత ప్రమాణాలతో హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 50 థియేటర్లకు పైగా విడుదల చేయడం విశేషం.
Source: Yahoo! Telugu: Entertainment | 6 Aug 2009 | 5:45 am

మహారాష్ట్రంలో కొత్తగా 30 స్వైన్ ఫ్లూ కేసులు

ప్రపంచాన్ని వణికిస్తున్న స్వైన్ ఫ్లూ వ్యాధి మహారాష్ట్రంలో వేగంగా విస్తరిస్తోంది. గురువారం మరో 30 కేసులు వెలుగు చూశాయి. దీంతో మహారాష్ట్రంలో నమోదైన స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య 172కు చేరుకుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి.
Source: జాతీయ | 6 Aug 2009 | 4:14 am

"రాజు.. రాణి"కి మూడు ముళ్ళ బంధం!?

సినీ నటుడు ప్రకాష్ రాజ్, ప్రజారాజ్యం మహిళా విభాగం అధ్యక్షురాలు శోభారాణి వివాహం ఊహాగాహన వార్తలు రాష్ట్రంలో సంచలనం రేకెత్తించాయి. ఇటీవల చెన్నయ్ పర్యటనకు వెళ్లిన శోభారాణి.. ప్రకాష్‌రాజ్‌తో పరిచయం ఏర్పడటం.. ఆ పరిచయం ప్రేమగా.. ఆపై పెళ్లికి చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి.
Source: ఏపీ న్యూస్ | 6 Aug 2009 | 3:50 am

రాష్ట్రంలో చల్లారని "మగధీర" వివాదం

రాష్ట్రంలో మగధీర పాట వివాదం చల్లారడం లేదు. ఈ పాట వివాదానికి రాజకీయ రంగు తోడు కావడంతో పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. దీంతో ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి తనయుడు రాంచరణ్‌తేజ్‌ నటించిన 'మగధీర' సినిమా వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది.
Source: ఏపీ న్యూస్ | 6 Aug 2009 | 3:07 am

అసెంబ్లీలో రగడ: ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్

బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం జరిగిన సమావేశాలు మరోమారు రసాభాసగా మారాయి. ఓబుళాపురం గనుల లీజుపై అసెంబ్లీ సభ దుమారం రేగింది. ఈ గనుల లీజుపై సభా సంఘాన్ని వేయడం కుదరదని ప్రభుత్వం తేల్చి చెప్పింది.
Source: ఏపీ న్యూస్ | 6 Aug 2009 | 1:56 am

ముంబై జంట పేలుళ్ల కేసు: దోషులకు మరణశిక్ష

గత 2003 సంవత్సరం ఆగస్టు 25వ తేదీన దేశ వాణిజ్య రాజధాని ముంబైలో జరిగిన జంట వరుస పేలుళ్ల కేసులో దోషులుగా తేలిన ముగ్గురికి మరణ శిక్ష విధిస్తూ పోటా కోర్టు గురువారం తీర్పు ఇచ్చింది.
Source: జాతీయ | 6 Aug 2009 | 1:36 am

భారత్‌కు వచ్చిన బంగ్లా రచయిత్రి తస్లీమా

బంగ్లాదేశ్‌కు చెందిన వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ మళ్లీ భారత్‌లో అడుగుపెట్టారు. న్యూఢిల్లీకి వచ్చీరాగానే భద్రతా సిబ్బంది అజ్ఞాతంలోకి తీసుకెళ్లారు. కాగా, పలు నాటకీయ పరిణామాల మధ్య గత 2007 సంవత్సరం నవంబరులో భారత్ గడ్డను వీడిన ఆమె.. దాదాపు ఏడాదిన్నర తర్వాత ఆమె న్యూఢిల్లీకి వచ్చారు.
Source: జాతీయ | 6 Aug 2009 | 1:12 am

2003 ముంబై పేలుళ్ళపై నేడు తుది తీర్పు

గత 2003 సంవత్సరంలో జరిగిన ముంబై పేలుళ్ళ కేసులో ముంబై ప్రత్యేక కోర్టు గురువారం తుది తీర్పు ఇవ్వనుంది. ఈ కేసు తుది తీర్పు ఇటీవల వెల్లడైంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న అష్రత్, షఫీక్ అన్సారీ (32), మహ్మద్ హనీఫ్ సయీద్ (46), ఈయన భార్య ఫెమీదా సయీద్ (43)లను ప్రత్యేక కోర్టు దోషులుగా తేల్చిన విషయం తెల్సిందే.
Source: జాతీయ | 6 Aug 2009 | 12:43 am

దేవేందర్ గౌడ్ రాక.. తలసాని పోక నేడే!

ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలో ముసలానికి అసలు బీజం నేడు పడనుంది. ఆ పార్టీ మాజీ నేత దేవేందర్ గౌడ్ తెదేపాలో చేరనున్నారు. ఆయన పునఃప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ అదే పార్టీకి చెందిన సీనియర్ నేత అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారు.
Source: ఏపీ న్యూస్ | 6 Aug 2009 | 12:20 am

కరువుపై ఈనెల 17న ప్రభుత్వ ప్రకటన

వర్షాభావ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ అంశాన్ని కేంద్రంగా చేసుకుని వైఎస్ సర్కారుపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
Source: ఏపీ న్యూస్ | 6 Aug 2009 | 12:15 am

నేడో రేపో రాములమ్మ నిర్ణయం వెల్లడి!

తెలంగాణా రాష్ట్ర సమితి జనరల్ సెక్రటరీ, రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్‌పర్సన్, మెదక్ ఎంపీ విజయశాంతి తన భవిష్యత్ నిర్ణయాన్ని నేడు లేదా రేపు వెల్లడించే అవకాశాలు ఉన్నట్టు ఆయన సన్నిహితులు వెల్లడించారు. ఈ విషయంపై ఆమె ఇప్పటికే ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చినట్టు వారు తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 6 Aug 2009 | 12:07 am

అణు యుద్ధనౌకలను భారత్ నిర్మించగలదు

అణు ఇంధనం ఆధారంగా నడిచే యుద్ధనౌకలను, విమానవాహక నౌకలను భారత్ నిర్మించగలదని జాతీయ అణు శక్తి సంఘం ఛైర్మన్ అనిల్ కకోడ్కర్ తెలిపారు. భారత్‌కు ఈ సామర్థ్యం ఉందని ఆయన చెప్పారు. భారత్ ఇటీవల పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అణు ఇంధన ఆధారిత జలాంతర్గామిని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.
Source: జాతీయ | 5 Aug 2009 | 10:20 pm

రీడా పాఠశాలలో మరో ఇద్దరికి స్వైన్ ఫ్లూ

దేశంలో తొలి స్వైన్ ఫ్లూ మరణం సంభవించిన పాఠశాలలో మరో ఇద్దరు విద్యార్థులకు ఈ వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. పూణేలోని సెయింట్ అన్నెస్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల రీడా షేక్ స్వైన్ ఫ్లూ బారినపడి సోమవారం ప్రాణాలు కోల్పోయిన సంగతి విధితమే.
Source: జాతీయ | 5 Aug 2009 | 9:59 pm

త్వరలో " హాస్య " చిత్రం : వర్మ

సినిమా అనేది వినోదాన్ని పంచేది. మనిషి జీవితంలోని సంఘటనలను తెరపై వీక్షించే అవకాశాన్ని కల్పించింది సినిమా. ఇదే సినిమాని భయం, బీభత్సం, మంత్ర- తంత్రాలు, దెయ్యాలు- భూతాలు, థ్రిల్లర్‌ సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ సంచలన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ఇప్పుడు హాస్య చిత్రాన్ని నిర్మించాలని ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 5 Aug 2009 | 3:10 pm

ఎక్స్‌పోజింగ్‌ చేయడం నా తప్పుకాదు: శ్రియ

కథక్‌ నృత్యకారిణిగా స్థిరపడాలనుకుని సినీరంగంలో అడుగుపెట్టిన భామ శ్రియ. టాప్‌హీరోయిన్ల రేంజ్‌లో పోటీపడుతున్న ఈ భామ సౌందర్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నానని చెబుతోంది. తాజాగా లక్స్‌ సోప్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. ఈ సందర్భంగా ఆమెతో జరిపిన చిట్‌చాట్‌.ప్రశ్న: మీ సౌందర్య రహస్యమేమిటి?జ: ఉదయాన్నే పాలు, గుడ్డులోని తెల్లసొనతో చేసిన ఆమ్లెట్‌ తింటాను. తర్వాత ఇతర పండ్లు తింటాను. రోజూ స్విమ్నింగ్‌, యోగా చేస్తాను. ప్రశ్న: మీ జీవితంలో తీరని కోరిక ఏమైనా ఉన్నదా?జ: నృత్యనేపథ్యంలో సాగే సినిమాలో నటించాలన్నదే నా చిరకాల కోరిక. ప్రశ్న: ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఎక్స్‌పోజింగ్‌ ఎక్కువగా చేస్తున్నారు?జ: అది నా తప్పుకాదు. నా దగ్గరకు వచ్చేపాత్రలు అలా వస్తున్నాయి. ప్రశ్న: కొత్తగా చేసే చిత్రాలు?జ: ప్రస్తుతం మల్లన్న విడుదలకు సిద్ధంగా ఉంది. మరో రెండు తమిళ చిత్రాలున్నాయి. తెలుగులో చర్చలు జరుగుతున్నాయి.ప్రశ్న: సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిసింది?జ: లేని వాళ్లకు పెట్టడంలో ఉన్న ఆనందం ఎందులోనూ లేదు. అందుకే కొంతమంది పేదపిల్లల చదువు కోసం సాయం చేస్తున్నా.
Source: Yahoo! Telugu: Entertainment | 5 Aug 2009 | 10:44 am

నా సినిమాలను పిల్లలు కూడా చూస్తారు: ముమైత్

టాలీవుడ్ ఐటంగర్ల్, సెక్సీడాళ్ ముమైత్‌ఖాన్ రూటు మార్చింది. ఎప్పుడూ అందాల ఆరబోతతో కుర్రకారును మత్తెక్కించే ముమైత్ ఇకపై తన చిత్రాలను పిల్లల కూడా చూస్తారని స్టేట్‌మెంట్ ఇచ్చి ఆశ్చర్యపరిచింది. ముందుతరం జ్యోతిలక్ష్మి, జయమాలిని, అనురాధ, సిల్క్‌స్మిత తర్వాత డిస్కోశాంతి అలా భారీ అందాల ఊపులతో కసెక్కించే చూపులతో వెండితెరపై కుర్ర ప్రేక్షకుల హృదయాలను దడదడలాడించిన ముమైత్‌ఖాన్‌ ఇప్పుడు తన నడవడికను మార్చుకొంటానంటోంది. తాజాగా హిందీ, తెలుగులో భాషల్లో రూపొందుతోన్న చిత్రంలో నటిస్తోంది. ఇందులో చీరకట్టి అందర్ని ఆశ్చర్యపరిచిన ముమైత్, ఇకపై తాను నటించే చిత్రాలు పిల్లలుకూడా చూసేట్లుగా ఉంటాయని చెప్పింది. మరి ఇటీవలే రామ్‌చరణ్‌ "మగధీర"లో "బంగారు కోడిపెట్ట"గా నటించారు కదా? అని అడిగితే..? అదేం అంత ఎక్స్‌పోజింగ్‌ కాదు గదా. అంతకంటే ఎక్కువ చూపించే సినిమాలు చేయనని అంటోంది. మరి ఈ మాట మీదనే ముమైత్ నిలుస్తుందో? లేదో వేచిచూడాల్సిందే..!.
Source: Yahoo! Telugu: Entertainment | 5 Aug 2009 | 9:42 am

బూటా కుమారుడికి 12 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ

లంచం కేసులో సీబీఐ అధికారులకు చిక్కిన కేంద్ర మాజీ మంత్రి బూటా సింగ్ కుమారుడు సరబ్‌జ్యోత్ సింగ్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు ఈనెల 12వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది. అలాగే, విచారణ నిమిత్తం సరబ్‌జ్యోత్‌ కస్టడీని పొడగించాలన్న ఏసీబీ అధికారుల విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది.
Source: జాతీయ | 5 Aug 2009 | 8:10 am

"శంభో శివ శంభో" అంటోన్న రవితేజ!

"కిక్" సినిమా తర్వాత క్రేజీ హీరో రవితేజ "శంభో శివ శంభో" అంటూ తెరపైకి రానున్నారు. శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్‌పై బెల్లంకొండ నిర్మిస్తున్న "శంభో శివ శంభో" చిత్రంలో రవితేజ హీరోగా నటిస్తున్నారు. తమిళంలో అనంతపురం 1980 ఫేమ్ శశికుమార్ హీరోగా నటించిన "నాడోడిగళ్" అనే చిత్రానికి రీమేక్‌గా రూపుదిద్దుకోనున్న "శంభో శివ శంభో" చిత్రంలో రవితేజతో పాటు అల్లరి నరేష్, శివబాలాజీలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 5 Aug 2009 | 7:51 am

నాకూ రాఖీ కట్టండి: తీవ్రవాది అజ్మల్ కసబ్

అజ్మల్ అమీర్ కసబ్‌పై ప్రత్యేక న్యాయవిచారణ జరుగుతున్న పక్షంలో బుధవారం కోర్టులో అందరి చేతులకు రాఖీలుండటం చూసిన కసబ్ కాసేపు ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఉద్వేగానికి లోనైన అతను తనకు కూడా రాఖీ కట్టుకోవాలనుందని తన తరపున వాదిస్తున్న న్యాయవాది అబ్బాస్ కాజ్మీని కోరాడు
Source: జాతీయ | 5 Aug 2009 | 7:48 am

చౌకబారు ప్రచారం వైఎస్ మానుకోవాలి: బాబు

రాష్ట్రంలోని విపక్ష పార్టీలను నిర్వీర్యం చేసేలా ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి చౌకబారు ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం ఇలాంటి దుష్ప్రచారానికి ఆయన స్వస్తి చెప్పాలని విజ్ఞప్తి చేశారు.
Source: ఏపీ న్యూస్ | 5 Aug 2009 | 7:48 am

ప్రరాపా ఎమ్మెల్యేలతో చిరంజీవి సమావేశం

ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో ఆ పార్టీ అధినేత చిరంజీవి బుధవారం సమావేశమయ్యారు. రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై స్పందించాల్సిన అంశాలపై ఆయన చర్చించారు. ముఖ్యంగా కృష్ణా-గోదావరి బేసిన్‌లో ఉత్పత్తి అయ్యే గ్యాస్‌తో రాష్ట్ర అవసరాలు తీర్చాకే మిగిలిన ప్రాంతాలకు తరలించాలని ఆయన డిమాండ్ చేశారు.
Source: ఏపీ న్యూస్ | 5 Aug 2009 | 7:35 am

హిందీలో "హ్యాంగ్ ఓవర్"

విదేశీ చిత్రమైన "హ్యాంగ్ ఓవర్" ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఫిరోజ్ నాడియాడ్‌వాలాకు తెగ నచ్చేసింది. దీంతో ఈయన ఈ చిత్రాన్ని వెంటనే హిందీ భాషలో నిర్మించేందుకు నిర్ణయించాడు. ఈ చిత్రాన్ని హిందీలో నిర్మించేందుకుగాను సర్వహక్కులను కొనుక్కుని స్క్రిప్ట్ రాయించే పనిలో ఉన్నాడని బాలీవుడ్ వర్గాలు చెపుతున్నాయి.
Source: Yahoo! Telugu: Entertainment | 5 Aug 2009 | 7:20 am

గాంధీ నివాసం కొనుగోలుకు బొగ్గు శాఖ యత్నాలు

దక్షిణాఫ్రికాలోని జోహెన్స్‌బర్గ్‌లో మహాత్మాగాంధీ నివాశించిన ఇంటిని కొనుగోలు చేసేందుకు కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ నివాసంలో గాంధీ ఒక యేడాదికి పైగా నివాసం ఉన్నారు. ఆ నివాసాన్ని కొనుగోలు చేసి, స్మారక మందిరంగా చేయాలని కోల్ ఇండియా ప్రతినిధులు నిర్ణయించారు.
Source: జాతీయ | 5 Aug 2009 | 6:34 am

అబ్రహాంది ఏముందిలే..? సల్మానే రియల్ బాయ్‌ఫ్రెండ్..!

సెలబ్రిటీ జీవితాల్లో జరిగే ప్రతి చిన్న విషయమూ సెన్సేషనల్ కావడం సహజమే. సెలబ్రిటీలకు చెందిన విశేషాలను వీడియోల ద్వారా చిత్రీకరించి ప్రపంచమంతటికి తెలియజేసేందుకు ప్రస్తుతం ఇంటర్నెట్ సులభసాధనంగా తయారైంది. తాజాగా కత్రీనా రూటు మారిందని, జాన్ అబ్రహాం, ఆసియా అందగత్తె కత్రీనాల మధ్య "సమ్‌థింగ్ సమ్‌థింగ్" అని బాలీవుడ్ వర్గాల్లో గుసగుసలాడుకుంటున్నాయి. దీంతో సల్మాన్ కత్రీనాతో సంబంధాలు తెగతెంపులు చేసుకున్నాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేశాయి. అయితే సల్మాన్ ఖాన్, కత్రీనాల మధ్య ఎలాంటి పోట్లాటలు లేవని, అవన్నీ పుకార్లేనని లేటెస్ట్ వీడియో తెలియజేస్తోంది. తాజాగా విడుదలైన ఓ వీడియోలో సల్మాన్-కత్రీనాల శృంగార విన్యాసాలు చాలా హాట్‌గా దర్శనమిస్తున్నాయట. రకరకాలైన భంగిమల్లో ఉన్న ఈ వీడియోను వీక్షించేందుకు కత్రీనా, సల్మాన్ అభిమానులు మరియు ఇంటర్నెట్ భక్తులు బ్రౌజింగ్ సెంటర్లలో క్యూ కడుతున్నారని తెలిసింది. ఇప్పటికే ఈ వీడియోను తిలకించిన బ్రౌజర్లు ఏమంటున్నారంటే..? అబ్రహాంతో ఏమీలేదులే బాసు? సల్మానే కత్రీనా రియల్ బాయ్‌ఫ్రెండ్ అంటూ గుసగుసలాడుకుంటున్నారట.
Source: Yahoo! Telugu: Entertainment | 5 Aug 2009 | 5:20 am

'సౌత్ స్పా' సౌందర్యం "కుట్రాలం" జలపాతం..!!

"భలే భలే అందాలు సృష్టించావు.. ఇలా మురిపించావు.. అదే ఆనందం.. అదే అనుబంధం.. ప్రభో మాకేల ఈయవు"... అంటూ ప్రతి ఒక్కరూ పాడుకునేలా, అందరినీ ఓ రకమైన ఉద్వేగంలో ముంచెత్తుతుంది సుందరమైన "కుట్రాలం" జలపాతం. ఎన్నిసార్లు చూసినా తనివితీరని అందం ఆ జలపాతం సొంతం. కనువిందు చేసే ప్రకృతి, ఎత్తయిన కొండల పైనుంచి దుమికే జలపాతాలు, సెలయేటి గలగలలు, ఆహ్లాదపరిచే పచ్చదనంతో ఈ ప్రాంతం ఓ అద్భుతమైన ప్రపంచంలా అనిపిస్తుంది...
Source: వినోదం | 5 Aug 2009 | 5:01 am

నా సినిమాలను పిల్లలు కూడా చూస్తారు: ముమైత్

టాలీవుడ్ ఐటంగర్ల్, సెక్సీడాళ్ ముమైత్‌ఖాన్ రూటు మార్చింది. ఎప్పుడూ అందాల ఆరబోతతో కుర్రకారును మత్తెక్కించే ముమైత్ ఇకపై తన చిత్రాలను పిల్లల కూడా చూస్తారని స్టేట్‌మెంట్ ఇచ్చి ఆశ్చర్యపరిచింది. ముందుతరం జ్యోతిలక్ష్మి, జయమాలిని, అనురాధ, సిల్క్‌స్మిత తర్వాత డిస్కోశాంతి అలా భారీ అందాల ఊపులతో కసెక్కించే చూపులతో వెండితెరపై కుర్ర ప్రేక్షకుల హృదయాలను దడదడలాడించిన ముమైత్‌ఖాన్‌ ఇప్పుడు తన నడవడికను...
Source: వినోదం | 5 Aug 2009 | 5:00 am

జేకే ఎన్‌కౌంటర్‌లో 9 మంది మిలిటెంట్లు హతం

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో తొమ్మిది మంది మిలిటెంట్లు హతమయ్యారు. పూంఛ్ జిల్లాలోని సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన మిలిటెంట్లను భద్రతా దళాలు హతమార్చాయి.
Source: జాతీయ | 5 Aug 2009 | 4:29 am

రాఖీ కానుకగా "అభయహస్తం": వైఎస్సార్

రాష్ట్రంలోని ఆడపడుచులకు రాఖీ పర్వదిన సందర్భంగా "అభయహస్తం" పథకాన్ని అమలుచేయనున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి అన్నారు. రాఖీ పండుగను పురస్కరించుకుని మహిళలకు బుధవారం శుభాకాంక్షలు తెలియజేశారు. స్వయం సహాయక బృందాల్లో 60 ఏళ్లు పైబడిన ఆడపడుచులకు ప్రతినెలా ప్రభుత్వ ఉద్యోగి జీతంలాగా రూ. 500 నుంచి రూ.2,200 వరకు అందించే ఆత్మీయ నేస్తమే అభయహస్తమని వైఎస్సార్ పేర్కొన్నారు. రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా కోటి మంది మహిళలకు అభయహస్తం పత్రాలను పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 5 Aug 2009 | 3:55 am

రోజా కాంగ్రెస్‌లోకి వస్తానంటోంది: ముఖ్యమంత్రి

తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు, సినీ నటి ఆర్కే.రోజా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఉవ్విళ్లూరుతోందని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి చెప్పుకొచ్చారు. దీంతో మీడియా సిబ్బంది ఒక్కసారి అవాక్కయ్యారు. వెనువెంటనే ముఖ్యమంత్రి కల్పించుకుని.. ఇతర పార్టీలకు చెందిన రోజాలాంటి వాళ్లు తమ పార్టీలోకి వస్తామంటున్నారని తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 5 Aug 2009 | 3:39 am

హిందీలో "హ్యాంగ్ ఓవర్"

విదేశీ చిత్రమైన "హ్యాంగ్ ఓవర్" ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఫిరోజ్ నాడియాడ్‌వాలాకు తెగ నచ్చేసింది. దీంతో ఈయన ఈ చిత్రాన్ని వెంటనే హిందీ భాషలో నిర్మించేందుకు నిర్ణయించాడు. ఈ చిత్రాన్ని హిందీలో నిర్మించేందుకుగాను సర్వహక్కులను కొనుక్కుని స్క్రిప్ట్ రాయించే పనిలో ఉన్నాడని బాలీవుడ్ వర్గాలు చెపుతున్నాయి.
Source: వినోదం | 5 Aug 2009 | 3:38 am