|
అమెరికా డ్రోన్ దాడిలో మెహసూద్ భార్య మృతిపాకిస్థాన్ తాలిబాన్ చీఫ్ బైతుల్లా మోహసూద్ ఇంటిపై అమెరికా డ్రోన్ జరిపిన దాడి చేసింది. ఈ దాడిలో మెహసూద్ భార్య మృతి చెందినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌లోని దక్షిణ వజీరిస్థాన్ గిరిజన ప్రాంతంలో జరిగిన అనుమానిత అమెరికా డ్రోన్ దాడిలో మెహసూద్ భార్య మృతి చెందినట్లు పాకిస్థాన్ టీవీ ఛానళ్లు బుధవారం వెల్లడించాయి.Source: Yahoo! Telugu: News | 5 Aug 2009 | 10:02 am జేకే ఎన్‌కౌంటర్‌లో 9 మంది మిలిటెంట్లు హతంజమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో తొమ్మిది మంది మిలిటెంట్లు హతమయ్యారు. పూంఛ్ జిల్లాలోని సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన మిలిటెంట్లను భద్రతా దళాలు హతమార్చాయి.Source: Yahoo! Telugu: News | 5 Aug 2009 | 9:58 am ఢిల్లీలో అగ్నిప్రమాదాలకు 380 మంది ఆహుతిదేశ రాజధాని న్యూఢిల్లీ అగ్నిప్రమాదాల కేంద్రంగా మారుతోంది. ప్రజల భద్రతకు అగ్రపీఠం వేస్తున్నామని గొప్పులు చెప్పుకునే పాలకులకు.. సాక్షాత్ న్యూఢిల్లీలో జరిగే అగ్నిప్రమాదాలు మాత్రం కనిపించడం లేదు. ఇక్కడ ఒక్కో రోజుకు సరాసరి ఇద్దరు చొప్పున అగ్నికి మృత్యువాత పడుతున్నట్టు తాజా సర్వే వెల్లడిస్తోంది.Source: Yahoo! Telugu: News | 5 Aug 2009 | 9:35 am లాభాల్లో పయనిస్తున్న సెన్సెక్స్స్టాక్ మార్కెట్ ప్రస్తుతం లాభాల్లో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 68 పాయింట్లు పుంజుకుని 15,899 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 6 పాయింట్లు లాభపడి 4,687 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.43 శాతం, నిఫ్టీ 0.14 శాతం చొప్పున బలపడ్డాయి.Source: Yahoo! Telugu: News | 5 Aug 2009 | 9:31 am రాఖీ కానుకగా "అభయహస్తం": వైఎస్సార్రాష్ట్రంలోని ఆడపడుచులకు రాఖీ పర్వదిన సందర్భంగా "అభయహస్తం" పథకాన్ని అమలుచేయనున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి అన్నారు. రాఖీ పండుగను పురస్కరించుకుని మహిళలకు బుధవారం శుభాకాంక్షలు తెలియజేశారు. స్వయం సహాయక బృందాల్లో 60 ఏళ్లు పైబడిన ఆడపడుచులకు ప్రతినెలా ప్రభుత్వ ఉద్యోగి జీతంలాగా రూ. 500 నుంచి రూ.2,200 వరకు అందించే ఆత్మీయ నేస్తమే అభయహస్తమని వైఎస్సార్ పేర్కొన్నారు. రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా కోటి మంది మహిళలకు అభయహస్తం పత్రాలను పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు.Source: Yahoo! Telugu: News | 5 Aug 2009 | 9:24 am పెరుగుతున్న మిరియాల ధరలు...!ప్రపంచ మార్కెట్లో మిరియాల ఉత్పత్తులు తగ్గడంతో ప్రస్తుత వారంలో వీటి ధరలు ఆకాశాన్నంటే స్థాయికి చేరుకున్నాయి.Source: Yahoo! Telugu: News | 5 Aug 2009 | 9:11 am పెరిగిన ముడి చమురు ధరలు...!అంతర్జాతీయ మార్కెట్లో బుధవారం ముడి చమురు ధరలు పెరిగాయి. సెప్టెంబరులో డెలివరీకి సిద్ధంగానున్న ముడి చమురు ధరలు ప్రతి బ్యారెల్‌పై ఇరవై సెంట్లు పెరిగి 71.62 డాలర్లకు చేరుకుంది.Source: Yahoo! Telugu: News | 5 Aug 2009 | 8:47 am రోజా కాంగ్రెస్‌లోకి వస్తానంటోంది: ముఖ్యమంత్రితెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు, సినీ నటి ఆర్కే.రోజా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఉవ్విళ్లూరుతోందని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి చెప్పుకొచ్చారు. దీంతో మీడియా సిబ్బంది ఒక్కసారి అవాక్కయ్యారు. వెనువెంటనే ముఖ్యమంత్రి కల్పించుకుని.. ఇతర పార్టీలకు చెందిన రోజాలాంటి వాళ్లు తమ పార్టీలోకి వస్తామంటున్నారని తెలిపారు.Source: Yahoo! Telugu: News | 5 Aug 2009 | 8:36 am 73 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్స్టాక్ మార్కెట్ ప్రస్తుతం 73 పాయింట్లు నష్టపోవడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 15,758 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 28 పాయింట్లు కోల్పోయి 4,652 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.46 శాతం, నిఫ్టీ 0.60 శాతం మేరకు క్షీణించాయి. ఇప్పటి వరకు మొత్తం 2,651 కంపెనీల వాటాలు ట్రేడ్ అగా, 1,356 కంపెనీల వాటాలు లాభాల్లో ఉన్నాయి.Source: Yahoo! Telugu: News | 5 Aug 2009 | 8:07 am ఆస్ట్రేలియాలో తీవ్రవాద కుట్ర: మరిన్ని అరెస్ట్లుఆస్ట్రేలియాలోని సిడ్నీ ఆర్మీ స్థావరంపై ఆత్మాహుతి దాడి చేసేందుకు జరిగిన కుట్రకు సంబంధించి అధికారిక యంత్రాంగం మరో ముగ్గురు తీవ్రవాద అనుమానితులను అరెస్టు చేసింది. ఆర్మీ స్థావరంపై ఆత్మాహుతి దాడి చేసేందుకు తీవ్రవాదులు పన్నిన కుట్రను ఆస్ట్రేలియా భద్రతా యంత్రాంగం భగ్నం చేసిన సంగతి తెలిసిందే.Source: Yahoo! Telugu: News | 5 Aug 2009 | 7:53 am "శంభో శివ శంభో" అంటోన్న రవితేజ!"కిక్" సినిమా తర్వాత క్రేజీ హీరో రవితేజ "శంభో శివ శంభో" అంటూ తెరపైకి రానున్నారు. శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్‌పై బెల్లంకొండ నిర్మిస్తున్న "శంభో శివ శంభో" చిత్రంలో రవితేజ హీరోగా నటిస్తున్నారు. తమిళంలో అనంతపురం 1980 ఫేమ్ శశికుమార్ హీరోగా నటించిన "నాడోడిగళ్" అనే చిత్రానికి రీమేక్‌గా రూపుదిద్దుకోనున్న "శంభో శివ శంభో" చిత్రంలో రవితేజతో పాటు అల్లరి నరేష్, శివబాలాజీలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 5 Aug 2009 | 7:51 am హిందీలో "హ్యాంగ్ ఓవర్"విదేశీ చిత్రమైన "హ్యాంగ్ ఓవర్" ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఫిరోజ్ నాడియాడ్‌వాలాకు తెగ నచ్చేసింది. దీంతో ఈయన ఈ చిత్రాన్ని వెంటనే హిందీ భాషలో నిర్మించేందుకు నిర్ణయించాడు. ఈ చిత్రాన్ని హిందీలో నిర్మించేందుకుగాను సర్వహక్కులను కొనుక్కుని స్క్రిప్ట్ రాయించే పనిలో ఉన్నాడని బాలీవుడ్ వర్గాలు చెపుతున్నాయి.Source: Yahoo! Telugu: Entertainment | 5 Aug 2009 | 7:20 am అబ్రహాంది ఏముందిలే..? సల్మానే రియల్ బాయ్‌ఫ్రెండ్..!సెలబ్రిటీ జీవితాల్లో జరిగే ప్రతి చిన్న విషయమూ సెన్సేషనల్ కావడం సహజమే. సెలబ్రిటీలకు చెందిన విశేషాలను వీడియోల ద్వారా చిత్రీకరించి ప్రపంచమంతటికి తెలియజేసేందుకు ప్రస్తుతం ఇంటర్నెట్ సులభసాధనంగా తయారైంది. తాజాగా కత్రీనా రూటు మారిందని, జాన్ అబ్రహాం, ఆసియా అందగత్తె కత్రీనాల మధ్య "సమ్‌థింగ్ సమ్‌థింగ్" అని బాలీవుడ్ వర్గాల్లో గుసగుసలాడుకుంటున్నాయి. దీంతో సల్మాన్ కత్రీనాతో సంబంధాలు తెగతెంపులు చేసుకున్నాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేశాయి. అయితే సల్మాన్ ఖాన్, కత్రీనాల మధ్య ఎలాంటి పోట్లాటలు లేవని, అవన్నీ పుకార్లేనని లేటెస్ట్ వీడియో తెలియజేస్తోంది. తాజాగా విడుదలైన ఓ వీడియోలో సల్మాన్-కత్రీనాల శృంగార విన్యాసాలు చాలా హాట్‌గా దర్శనమిస్తున్నాయట. రకరకాలైన భంగిమల్లో ఉన్న ఈ వీడియోను వీక్షించేందుకు కత్రీనా, సల్మాన్ అభిమానులు మరియు ఇంటర్నెట్ భక్తులు బ్రౌజింగ్ సెంటర్లలో క్యూ కడుతున్నారని తెలిసింది. ఇప్పటికే ఈ వీడియోను తిలకించిన బ్రౌజర్లు ఏమంటున్నారంటే..? అబ్రహాంతో ఏమీలేదులే బాసు? సల్మానే కత్రీనా రియల్ బాయ్‌ఫ్రెండ్ అంటూ గుసగుసలాడుకుంటున్నారట.Source: Yahoo! Telugu: Entertainment | 5 Aug 2009 | 5:20 am జేకే ఎన్‌కౌంటర్‌లో 9 మంది మిలిటెంట్లు హతంజమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో తొమ్మిది మంది మిలిటెంట్లు హతమయ్యారు. పూంఛ్ జిల్లాలోని సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన మిలిటెంట్లను భద్రతా దళాలు హతమార్చాయి.Source: జాతీయ | 5 Aug 2009 | 4:29 am ఢిల్లీలో అగ్నిప్రమాదాలకు 380 మంది ఆహుతిదేశ రాజధాని న్యూఢిల్లీ అగ్నిప్రమాదాల కేంద్రంగా మారుతోంది. ప్రజల భద్రతకు అగ్రపీఠం వేస్తున్నామని గొప్పులు చెప్పుకునే పాలకులకు.. సాక్షాత్ న్యూఢిల్లీలో జరిగే అగ్నిప్రమాదాలు మాత్రం కనిపించడం లేదు. ఇక్కడ ఒక్కో రోజుకు సరాసరి ఇద్దరు చొప్పున అగ్నికి మృత్యువాత పడుతున్నట్టు తాజా సర్వే వెల్లడిస్తోంది.Source: జాతీయ | 5 Aug 2009 | 4:07 am రాఖీ కానుకగా "అభయహస్తం": వైఎస్సార్రాష్ట్రంలోని ఆడపడుచులకు రాఖీ పర్వదిన సందర్భంగా "అభయహస్తం" పథకాన్ని అమలుచేయనున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి అన్నారు. రాఖీ పండుగను పురస్కరించుకుని మహిళలకు బుధవారం శుభాకాంక్షలు తెలియజేశారు. స్వయం సహాయక బృందాల్లో 60 ఏళ్లు పైబడిన ఆడపడుచులకు ప్రతినెలా ప్రభుత్వ ఉద్యోగి జీతంలాగా రూ. 500 నుంచి రూ.2,200 వరకు అందించే ఆత్మీయ నేస్తమే అభయహస్తమని వైఎస్సార్ పేర్కొన్నారు. రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా కోటి మంది మహిళలకు అభయహస్తం పత్రాలను పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 5 Aug 2009 | 3:55 am రోజా కాంగ్రెస్‌లోకి వస్తానంటోంది: ముఖ్యమంత్రితెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు, సినీ నటి ఆర్కే.రోజా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఉవ్విళ్లూరుతోందని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి చెప్పుకొచ్చారు. దీంతో మీడియా సిబ్బంది ఒక్కసారి అవాక్కయ్యారు. వెనువెంటనే ముఖ్యమంత్రి కల్పించుకుని.. ఇతర పార్టీలకు చెందిన రోజాలాంటి వాళ్లు తమ పార్టీలోకి వస్తామంటున్నారని తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 5 Aug 2009 | 3:39 am దేశంలో మరో 16 కొత్త స్వైన్ ఫ్లూ కేసులుదేశంలో మరో 16 స్వైన్ ఫ్లూ కేసులు బుధవారం కొత్తగా వెలుగుచూశాయి. దీంతో దేశంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 574కు చేరుకుంది. కాగా, కొత్తగా వెలుగు చూసిన ఆరు కేసుల్లో మూడు దేశ రాజధాని ఢిల్లీలో నమోదు కాగా, పూణెలో 16 కేసులు, ముంబైలో రెండు, చెన్నై, గుర్గాన్, త్రివేండ్రంలలో ఒక్కో కేసు చొప్పున ఉంది.Source: జాతీయ | 5 Aug 2009 | 1:40 am "ఏం పిల్లడో... ఎల్దమొస్తవా" పాటపై రగడ!ఇటీవల విడుదలైన మగధీర చిత్రం మరోమారు వార్తలకెక్కింది. ఇప్పటికే సంచలన విజయంతో తెలుగు చిత్రపరిశ్రమలో హాట్ టాపిక్‌గా ఈ చిత్రం మారింది. అయితే, ఈ చిత్రంలోని ఒక పాట ప్రస్తుతం వివాదాస్పదమైంది. తన అనుమతి లేకుండా ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవా’ అనే పాటను వాడుకున్నారని ప్రముఖ రచయిత, ప్రజా గాయకుడు వంగపండు ఆరోపించారు.Source: ఏపీ న్యూస్ | 5 Aug 2009 | 1:30 am "గ్రేటర్" లబ్ధి కోసమే ప్రతిపక్షాల ఆందోళన: వైఎస్త్వరలో జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న తపనతోనే విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ఆరోపించారు. రాజీవ్ గృహకల్పపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా భారతీయ జనతా పార్టీ, ఎంఐఎం, తెదేపా పార్టీలు బుధవారం శాసనసభ సమావేశాల నుంచి వాకౌట్ చేశాయి.Source: ఏపీ న్యూస్ | 5 Aug 2009 | 12:41 am దోడా జిల్లాలో ఎన్‌కౌంటర్: టాప్ మిలిటెంట్ హతంజమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని దోడా జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ ముజాహిద్దీన్ తీవ్రవాద సంస్థకు చెందిన టాప్ మిలిటెంట్ హతమయ్యాడు. ఈ విషయాన్ని భద్రతా వర్గాలు వెల్లడించాయి.Source: జాతీయ | 5 Aug 2009 | 12:08 am వరుణ దేవుడు పార్టీ మార్చేశాడు: చిరంజీవిఐదేళ్ళ పాటు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం పుచ్చుకుని ఉన్న వరుణ దేవుడు.. కాంగ్రెస్ నేతల అరాచకాలను చూసి పార్టీ మార్చేశాడని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఎద్దేవా చేశారు. అందువల్లే ఉత్తర భారతదేశాన్ని వరుణ దేవుడు ముంచెత్తుంటే.. మన రాష్ట్రంలో వర్షం చుక్క పడటం లేదన్నారు.Source: ఏపీ న్యూస్ | 4 Aug 2009 | 11:48 pm ఇందిరమ్మ రాజ్యం-ఇంటింటా మద్యపానం: భాజపారాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్య పాలన సాగుతోందని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర కాంగ్రెస్ నేతలు.. ఇంటింటికి మద్యపానాన్ని ఏరులై పారిస్తున్నారని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఆరోపించారు.Source: ఏపీ న్యూస్ | 4 Aug 2009 | 11:35 pm నాకెవరి సాయం అవసరం లేదు: బూటాకుమారుడు లంచం ఆరోపణల్లో చిక్కుకోవడంతో ఇబ్బందుల్లో పడిన జాతీయ ఎస్టీ, ఎస్సీ కమిషన్ ఛైర్మన్ బూటా సింగ్ మంగళవారం మాట్లాడుతూ.. ఈ ఆరోపణల నుంచి బయటపడేందుకు తనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు అవసరం లేదని స్పష్టం చేశారు.Source: జాతీయ | 4 Aug 2009 | 10:12 pm విద్యా హక్కు బిల్లుకు లోక్‌సభ ఆమోదందేశంలో ఆరు నుంచి 14 ఏళ్లలోపు వయసు గల బాలలకు ఉచిత, నిర్బంధ ప్రాథమిక విద్యను అందించే బిల్లును లోక్‌సభ మంగళవారం ఆమోదించింది. బాలలకు విద్యను ప్రాథమిక హక్కుగా మార్చే ఈ బిల్లును పార్లమెంట్ సభ్యులు చారిత్రాత్మకంగా వర్ణించారు.Source: జాతీయ | 4 Aug 2009 | 9:37 pm మగాడి భుజాలపై కూచోవడం జెన్నీకి థ్రిల్‌గా ఉందటసన్నజాజి కొమ్మ అందాల ముద్దుగుమ్మ జెనీలియాకు మగాడి భుజాలపై కూచోవడం చాలా థ్రిల్‌గా అనిపించిదట. తాజాగా ఈ పూబంతి నటిస్తున్న హిందీ చిత్రం "లైఫ్ పార్టనర్". ఈ చిత్రంలో ఫర్దీన్ ఖాన్ భుజాలపై కూచునే సన్నివేశం ఒకటుందట. ఆ సన్నివేశం చిత్రీకరించే సమయంలో తను అతడి భుజాలపై కూచునేందుకు మహా బిడియపడ్డానని చెపుతోందట. లైఫ్ పార్టనర్‌లో సంజనాగా నటిస్తున్న జెనీలియా కరణ్‌గా నటిస్తున్న ఫర్దీన్ ఖాన్‌ను పిచ్చిపిచ్చిగా ప్రేమిస్తుందట. ఆ క్రమంలో వారిద్దరి మధ్య జరిగిన లవ్ సీన్స్ మహా ఇంటరెస్టింగ్ ఉంటాయని జెనీలియా మహా సంబరంగా చెపుతోంది. అన్నిటికీ మించి తను ఫర్దీన్ భుజాలపై ఎందుకు ఎక్కాల్సి వచ్చిందో తప్పక చూసి తెలుసుకోవాలని అంటోందట. సరే.. చూసి తెలుసుకుందాం.Source: Yahoo! Telugu: Entertainment | 4 Aug 2009 | 2:57 pm రామ్‌గోపాల్ వర్మ "అడవి"తో నా ఇమేజ్ పై.. పైకి..!ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తాజాగా రూపుదిద్దుకున్న "అడవి" చిత్రం తన ఇమేజ్ పెంచుతుందని నిర్మాత నట్టికుమార్ నమ్మకం వ్యక్తం చేశారు. రామ్‌గోపాల్ వర్మ చిత్రాలను తెలుగులో రిలీజ్‌చేయడానికి పోటీ ఉంటుంది. అటువంటి పోటీ "అడవి" చిత్రానికి కూడా ఉన్నదని నట్టికుమార్ అన్నారు. కానీ తాను నమ్మకంతో అడవి చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రయత్నించానని, మొదట తనకీ సినిమా ఇవ్వడానికి వర్మ ససేమిరా అన్నా.. ఆ తర్వాత తన పనితీరును గురించి తెలుసుకుని అడవిని తెలుగులో రిలీజ్ చేసే అవకాశాన్ని తనకిచ్చారని నట్టికుమార్ వెల్లడించారు.Source: Yahoo! Telugu: Entertainment | 4 Aug 2009 | 1:00 pm విడుదలకు సిద్ధమైన "గాలిశీను"మెంటల్‌కృష్ణ, రాజావారి చేపల చెరువు వంటి చిత్రాల ద్వారా హీరోగా ముద్రవేసుకున్న ప్రముఖ దర్శకుడు పోసాని కృష్ణమురళి "గాలిశీను" ద్వారా తెరపైకి రానున్నారు. పి. ఉదయభాస్కర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి స్వప్నమూవీస్ పతాకంపై ఎం.వి. కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. టైటిల్ రోల్‌ను హనీఫ్ అనే నూతన నటుడు పోషిస్తుండగా, మెంటల్ కృష్ణ ఫేమ్ సత్యకృష్ణన్ మళ్లీ గాలిశీనులో హీరోయిన్‌గా నటించడం విశేషం. వీధి రౌడీ నుంచి డాన్ స్థాయికి ఎదగాలనుకునే రౌడీ కథే గాలిశీను అని దర్శకుడు తెలిపారు. చక్కటి హాస్యభరిత చిత్రంగా గాలిశీను తెరకెక్కనున్నాడని ఆయన తెలిపారు.Source: Yahoo! Telugu: Entertainment | 4 Aug 2009 | 12:36 pm యానిమేషన్‌లో శ్రీ వేంకటేశ్వర సుప్రభాతంటాలీవుడ్ సినిమా ప్రమాణాలు హాలీవుడ్ స్థాయికి చేరుకుంటున్న సంగతి తెలిసిందే. అత్యాధునిక సాంకేతిక విజ్ఞానంతో సినిమాలు రూపుదిద్దుకున్న తరుణంలో తాజాగా త్రీడీ యానిమేషన్ వీడియో రూపంలో శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం ఆల్బమ్ తెరపైకి రాబోతోంది. సైబర్ విలేజ్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించిన ఈ ఆల్బమ్ గురించి ఆ సంస్థ అధినేత పెండ్యాల రాంబాబు మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. త్రీడు యానిమేషన్ సుప్రభాతంను రూపొందించడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 4 Aug 2009 | 12:16 pm షిప్‌యార్డ్‌లో మంటలు ఆరుగురు మృతిగుజరాత్లోనున్న షిప్‌యార్డ్‌లో మంగళవారం ఒక్క ఉదుటన మంటలు చెలరేగడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారుSource: జాతీయ | 4 Aug 2009 | 9:56 am బాయ్‌ఫ్రెండ్ ముద్దడిగితే ఇవ్వాల్సిందే... తప్పదు: ప్రియమణిటాలీవుడ్లో బికినీతో నటించడంపై కొందరు రభస చేస్తున్నారంటూ బికినీ భామ ప్రియమణి రుసరుసలాడుతోంది. తనకంటే ముందే ఎందరో మరింత కురచ బికినీల్లో సొగసులు ఆరబోస్తూ నటించారని గుర్తు చేస్తోంది. పైగా నీటిలో ఈతకొట్టేటపుడు చీరతో ఈదుతారా...? అని ప్రశ్నలు వేస్తోంది. అన్నిటికీ మించి తను ఎప్పుడూ లంగా ఓణిలో నటిస్తే ప్రేక్షకులు బోర్ ఫీలవుతారని, అందువల్లనే కాస్తంత గ్లామర్‌గా కనిపించాలని బికినీ వేసినట్లు చెపుతోంది. అదిసరే... ముద్దు గురించి మీ అభిప్రాయం ఏమిటీ.. అని ఓ కుర్ర జర్నలిస్టు అడిగితే... ఇలా చెప్పుకొచ్చింది. "ముద్దు అంటే నాకు ఎంతో ఇష్టం. ఇప్పుడు కూడా నేను ఇంటికి వెళ్లగానే మా నాన్నగారు నాకు ముద్దులు పెడతారు. మా ఫ్రెండ్స్ అంతా కలిసినప్పుడు ఒకరికొకరం ఎగబడి ముద్దులు పెట్టుకుంటాం. ఇక సినిమా విషయానికి వస్తే... ధనుష్ నాకు లిప్ టు లిప్ కిస్ ఇచ్చాడు. ఇక ప్రేమికుల ముద్దు విషయానికి వస్తే, 20 ఏళ్ల అబ్బాయి తన గాళ్ ఫ్రెండ్‌తో ఉన్నప్పుడు ముద్దు పెట్టాలన్న కోరిక కలగడం సహజమే. ఆ ఫీలింగ్‌ను ఎవరూ ఆపలేరు." అంటూ ముదురు "ముద్దు" సమాధానం చెప్పింది.Source: Yahoo! Telugu: Entertainment | 4 Aug 2009 | 9:56 am 26/11 నివేదిక బహిర్గతంపై స్టే విధించిన సుప్రీంగత యేడాది జరిగిన 26/11 దాడులకు సంబంధించిన పూర్తిస్థాయి నివేదికను బహిర్గతం చేయాలని మహారాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మంగళవారం స్టే విధించింది.Source: జాతీయ | 4 Aug 2009 | 8:01 am వర్మ "అడవి" హోర్డింగుపై ఉరి వేసుకుని వేలాడుతున్న మనిషి...?!!ముంబయిలోని జార్గాన్ ఫ్లై ఓవర్ వద్ద సోమవారం అడవి చిత్రం హోర్డింగును చూసిన జనం ఠారెత్తిపోయారు. ఆ హోర్గింగుపై రక్తపు మరకలతో ఉరితో వేలాడుతున్న మానవ శరీరాన్ని చూసి బెంబేలెత్తిపోయారు. ఈ వార్త ముంబయిలో దావానంలా వ్యాపించడంతో ఆ హోర్డింగు వద్ద భారీ సంఖ్యలో జనం గుమిగూడారు. పోలీసు కంట్రోలు రూముకు ఫోను చేసి, విషయాన్ని చేరవేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి శరీరాన్ని కిందికి దింపి చూస్తే.. అసలు నిజం ఏమిటో బయటపడింది. వివరాలలోకి వెళితే... అడవి చిత్రం విడుదల తేదీ దగ్గరయ్యేకొద్దీ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రేక్షకులలో ఉత్కంఠను రేకిత్తించే మార్గాలను అనుసరిస్తున్నారు. తాజాగా ముంబయిలో మరో అలజడిని సృష్టించారు. అడవి పబ్లిసిటీని వెరైటీగా చేయాలనుకున్న వర్మ ముంబయిలోని జార్గాన్ ఫ్లై ఓవర్ వద్ద చిత్రం తాలూకు పెద్ద హోర్డింగ్‌ను ఏర్పాటు చేశారు. సహజంగా తన సినీ ప్రమోషన్లలో హాట్ డ్రెస్సుల్లో ఉన్న హీరోయిన్ల శరీర ప్రదర్శను ఉంటుంది. కానీ దీనికి భిన్నంగా హోర్డింగ్‌పై మనిషి డమ్మీ శరీరాన్ని ఉరి వేసుకున్నట్లుగా వేలాడదీయించాడు. ఆదివారం బాగా పొద్దుపోయిన తర్వాత ఈ పబ్లిసిటీ తాలూకు కార్యక్రమాన్ని ముగించాడు.Source: Yahoo! Telugu: Entertainment | 4 Aug 2009 | 7:00 am భారతీయుడితో హాలీవుడ్ తార జైమ్ ప్రెస్లీ పెళ్లి!"డెడ్ ఆర్ అలైవ్" అనే హాలీవుడ్ సినిమాలో నటించిన అందాల ముద్దుగుమ్మ జైమ్ ప్రెస్లీ ఓ భారతీయుడిని వివాహం చేసుకోనుంది. మరికొద్ది రోజుల్లో 32వ జన్మదినం జరుపుకోనున్న వ్రెస్లీ వెంటనే భారతీయ సంతతికి చెందిన లాయర్ సిమ్రన్ సింగ్‌ను పెళ్లి చేసుకోవాలని తహతహలాడుతోంది. ఇప్పటికే తమ నిశ్చితార్థం జరిగిపోయిందని వ్రెస్లీ ఓ అమెరికా మ్యాగజైన్‌కు కూడా వెల్లడించింది. వీలైనంత త్వరలో పెళ్లికూతురు కాబోతోన్న వ్రెస్లీ జన్మదిన వేడుకల కోసం సిమ్రన్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడని అమెరికా మ్యాగజైన్ తెలిపింది.Source: Yahoo! Telugu: Entertainment | 4 Aug 2009 | 6:43 am ఉగ్రవాదులపై ప్రభుత్వం మెతకవైఖరి: అద్వానీనిరుడు ముంబైలో జరిగిన మారణహోమంలో ప్రధాన పాత్రధారి హఫీజ్ సయీద్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం సరైన రీతిలో స్పందించడం లేదని బీజేపీ లోక్‌సభలో ఆరోపించింది.Source: జాతీయ | 4 Aug 2009 | 6:22 am బాయ్‌ఫ్రెండ్ ముద్దడిగితే ఇవ్వాల్సిందే... తప్పదు: ప్రియమణిటాలీవుడ్లో బికినీతో నటించడంపై కొందరు రభస చేస్తున్నారంటూ బికినీ భామ ప్రియమణి రుసరుసలాడుతోంది. తనకంటే ముందే ఎందరో మరింత కురచ బికినీల్లో సొగసులు ఆరబోస్తూ నటించారని గుర్తు చేస్తోంది. పైగా నీటిలో ఈతకొట్టేటపుడు చీరతో ఈదుతారా...? అని ప్రశ్నలు వేస్తోంది. అన్నిటికీ మించి తను ఎప్పుడూ లంగా ఓణిలో నటిస్తే ప్రేక్షకులు బోర్ ఫీలవుతారని, అందువల్లనే కాస్తంత గ్లామర్‌గా కనిపించాలని బికినీ వేసినట్లు చెపుతోంది.Source: వినోదం | 4 Aug 2009 | 4:28 am అమరత్వ రహస్యాన్ని భోదించిన "అమర్‌నాథ్"చుట్టూ మంచుకొండలతో, రకరకాల పువ్వులతో, సెలయేర్లతో, జలపాతాలతో... లోకంలోని అందాలన్నింటినీ తనలో దాచుకున్న ప్రాంతం కాశ్మీర్. పచ్చదనాల సొగసునంతా లోయల్లో నింపుకోవటమేగాక, ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు కూడా ఇది ఆలవాలమయ్యింది. అందులోనూ పరమశివుడు పార్వతీమాతకు అమరత్వ రహస్యాన్ని చెప్పిన ప్రాంతమైన "శ్రీ అమర్‌నాథ్" క్షేత్రం చాలా ప్రతీతి.Source: వినోదం | 4 Aug 2009 | 4:22 am కేంద్ర ఉక్కు మంత్రి భార్యపై అవినీతి కేసు నమోదుకేంద్ర ఉక్కుశాఖామంత్రి వీరభద్రా సింగ్ సతీమణిపై హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. 2008 సంవత్సరం మేలో విడుదలైన ఆడియో సీడీలోని సంభాషణలను ఆధారంగా చేసుకుని ఆమెపై కేసు నమోదు చేసినట్టు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (విజిలెన్స్) ఎస్.ఆర్.మర్డి తెలిపారు.Source: జాతీయ | 4 Aug 2009 | 4:03 am భారతీయుడితో హాలీవుడ్ తార జైమ్ ప్రెస్లీ పెళ్లి!"డెడ్ ఆర్ అలైవ్" అనే హాలీవుడ్ సినిమాలో నటించిన అందాల ముద్దుగుమ్మ జైమ్ ప్రెస్లీ ఓ భారతీయుడిని వివాహం చేసుకోనుంది. మరికొద్ది రోజుల్లో 32వ జన్మదినం జరుపుకోనున్న వ్రెస్లీ వెంటనే భారతీయ సంతతికి చెందిన లాయర్ సిమ్రన్ సింగ్‌ను పెళ్లి చేసుకోవాలని తహతహలాడుతోంది. ఇప్పటికే తమ నిశ్చితార్థం జరిగిపోయిందని వ్రెస్లీ ఓ అమెరికా మ్యాగజైన్‌కు కూడా వెల్లడించింది. వీలైనంత త్వరలో పెళ్లికూతురు కాబోతోన్న వ్రెస్లీ జన్మదిన వేడుకల కోసం సిమ్రన్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడని అమెరికా మ్యాగజైన్ తెలిపింది.Source: వినోదం | 4 Aug 2009 | 3:57 am భ్రమలు వీడి... వాస్తవాలు గ్రహించండి: జేపీరాష్ట్ర ఆర్థిక రంగం బాగుందనే భ్రమలు వీడి, వాస్తవాలను గ్రహించాలని అధికార కాంగ్రెస్ పార్టీ సభ్యులకు లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ సూచించారు. ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టేందుకు వనరుల ఖర్చే కాకుండా, అపరిమిత వృధాను కూడా తగ్గించాలని ఆయన కోరారు.Source: ఏపీ న్యూస్ | 4 Aug 2009 | 3:29 am కాంగ్రెస్-తెదేపాయేతర ఎమ్మెల్యేలతో చిరు భేటీప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి మెల్లగా రాష్ట్ర రాజకీయాలను జీర్ణించుకుంటున్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలంటే.. తమ బలం మాత్రమే సరిపోదని ఆయన గ్రహించారు. దీంతో కాంగ్రెస్, తెదేపాయేతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలతో ఆయన మంగళవారం సచివాలయంలో భేటీ అయ్యారు.Source: ఏపీ న్యూస్ | 4 Aug 2009 | 3:10 am
|