|
నష్టాల్లో సెన్సెక్స్: టాటా పవర్ క్షీణతస్టాక్ మార్కెట్ ప్రస్తుతం నష్టాల్లో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 65 పాయింట్లు కోల్పోయి 15,860 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 17 పాయింట్లు నష్టపోయి 4,695 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.41 శాతం, నిఫ్టీ 0.36 శాతం మేరకు క్షీణించాయి.Source: Yahoo! Telugu: News | 4 Aug 2009 | 9:37 am కేంద్ర ఉక్కు మంత్రి భార్యపై అవినీతి కేసు నమోదుకేంద్ర ఉక్కుశాఖామంత్రి వీరభద్రా సింగ్ సతీమణిపై హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. 2008 సంవత్సరం మేలో విడుదలైన ఆడియో సీడీలోని సంభాషణలను ఆధారంగా చేసుకుని ఆమెపై కేసు నమోదు చేసినట్టు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (విజిలెన్స్) ఎస్.ఆర్.మర్డి తెలిపారు.Source: Yahoo! Telugu: News | 4 Aug 2009 | 9:31 am ఆఫ్ఘన్ రాజధానిలో ఐదు రాకెట్ దాడులుఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో మంగళవారం ఐదు రాకెట్ దాడులు జరిగాయి. వీటిలో ఒక రాకెట్ అమెరికా దౌత్యకార్యాలయం సమీపంలో పేలింది. కాబూల్‍లో అనూహ్యంగా ఈ రాకెట్ దాడులు జరగడంతో ప్రజలు భయభ్రాంతులయ్యారు. మరో మూడు వారాల్లో దేశ అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా రాజధానిలో తీవ్రవాదులు ఈ దాడులకు పాల్పడటం ప్రాధాన్యత సంతరించుకుంది.Source: Yahoo! Telugu: News | 4 Aug 2009 | 9:21 am చేదుగా మారుతున్న చక్కెరమార్కెట్లో చక్కెర ధరలు గత వారంకన్నా ఒక్కసారిగా 10 శాతం పెరిగి రూ. 28లకు చేరుకుంది. గత నెలగా చక్కెర ధరలు ఎగుడు దిగుడుగా మారుతున్నాయి. గత నెలలో రూ. 24 నుంచి రూ. 25ల మధ్య కొట్టుమిట్టాడుతున్న చక్కెర ధర ప్రస్తుతం ఒక్కసారిగా రూ. 28లకు చేరుకుందిSource: Yahoo! Telugu: News | 4 Aug 2009 | 9:15 am లంక స్థానిక ఎన్నికలు: మీడియాపై నిషేధంశ్రీలంకలోని సమస్యాత్మక ఉత్తర ప్రాంతంలో తొలిసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఆ దేశ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ప్రత్యేక తమిళ దేశాన్ని డిమాండ్ చేస్తూ ఈ ప్రాంతం నుంచి గత మూడు దశాబ్దాలుగా ఎల్టీటీఈ తీవ్రవాద గ్రూపు పోరాటం జరిపిన సంగతి తెలిసిందే.Source: Yahoo! Telugu: News | 4 Aug 2009 | 9:08 am భ్రమలు వీడి... వాస్తవాలు గ్రహించండి: జేపీరాష్ట్ర ఆర్థిక రంగం బాగుందనే భ్రమలు వీడి, వాస్తవాలను గ్రహించాలని అధికార కాంగ్రెస్ పార్టీ సభ్యులకు లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ సూచించారు. ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టేందుకు వనరుల ఖర్చే కాకుండా, అపరిమిత వృధాను కూడా తగ్గించాలని ఆయన కోరారు.Source: Yahoo! Telugu: News | 4 Aug 2009 | 8:58 am కాంగ్రెస్-తెదేపాయేతర ఎమ్మెల్యేలతో చిరు భేటీప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి మెల్లగా రాష్ట్ర రాజకీయాలను జీర్ణించుకుంటున్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలంటే.. తమ బలం మాత్రమే సరిపోదని ఆయన గ్రహించారు. దీంతో కాంగ్రెస్, తెదేపాయేతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలతో ఆయన మంగళవారం సచివాలయంలో భేటీ అయ్యారు.Source: Yahoo! Telugu: News | 4 Aug 2009 | 8:39 am 156 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్స్టాక్ మార్కెట్ 156 పాయింట్లు కోల్పోవడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 15,768 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 38 పాయింట్లు నష్టపోయి 4,673 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.98 శాతం, నిఫ్టీ 0.81 శాతం మేరకు క్షీణించాయి. ఇప్పటి వరకు మొత్తం 2,700 కంపెనీల వాటాలు ట్రేడ్ అవగా, 1,529 కంపెనీల వాటాలు లాభపడ్డాయి.Source: Yahoo! Telugu: News | 4 Aug 2009 | 8:22 am నష్టాల్లో కొనసాగుతున్న సెన్సెక్స్స్టాక్ మార్కెట్ ప్రస్తుతం నష్టాల్లో కొనసాగుతుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 28 పాయింట్లు కోల్పోయి 15,875 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 22 పాయింట్లు నష్టపోయి 4,689 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.31 శాతం, నిఫ్టీ 0.47 శాతం మేరకు క్షీణించాయి.Source: Yahoo! Telugu: News | 4 Aug 2009 | 7:57 am కొరియాతో జర్నలిస్ట్‌ల విడుదలపై బిల్ చర్చలుఅమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ మంగళవారం ఉత్తర కొరియా పర్యటనకు విచ్చేశారు. తీవ్ర నేరాల కింద ఉత్తర కొరియా న్యాయవ్యవస్థ దోషులుగా పరిగణించిన ఇద్దరు అమెరికా జర్నలిస్ట్‌ల విడుదలపై ఆయన ఈ పర్యటనలో చర్చలు జరుపుతారు.Source: Yahoo! Telugu: News | 4 Aug 2009 | 7:55 am వర్మ "అడవి" హోర్గింగుపై ఉరి వేసుకుని వేలాడుతున్న మనిషి...?!!ముంబయిలోని జార్గాన్ ఫ్లై ఓవర్ వద్ద సోమవారం అడవి చిత్రం హోర్గింగును చూసిన జనం ఠారెత్తిపోయారు. ఆ హోర్గింగుపై రక్తపు మరకలతో ఉరితో వేలాడుతున్న మానవ శరీరాన్ని చూసి బెంబేలెత్తిపోయారు. ఈ వార్త ముంబయిలో దావానంలా వ్యాపించడంతో ఆ హోర్గింగు వద్ద భారీ సంఖ్యలో జనం గుమిగూడారు. పోలీసు కంట్రోలు రూముకు ఫోను చేసి, విషయాన్ని చేరవేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి శరీరాన్ని కిందికి దింపి చూస్తే.. అసలు నిజం ఏమిటో బయటపడింది. వివరాలలోకి వెళితే... అడవి చిత్రం విడుదల తేదీ దగ్గరయ్యేకొద్దీ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రేక్షకులలో ఉత్కంఠను రేకిత్తించే మార్గాలను అనుసరిస్తున్నారు. తాజాగా ముంబయిలో మరో అలజడిని సృష్టించారు. అడవి పబ్లిసిటీని వెరైటీగా చేయాలనుకున్న వర్మ ముంబయిలోని జార్గాన్ ఫ్లై ఓవర్ వద్ద చిత్రం తాలూకు పెద్ద హోర్గింగ్‌ను ఏర్పాటు చేశారు. సహజంగా తన సినీ ప్రమోషన్లలో హాట్ డ్రెస్సుల్లో ఉన్న హీరోయిన్ల శరీర ప్రదర్శను ఉంటుంది. కానీ దీనికి భిన్నంగా హోర్గింగ్‌పై మనిషి డమ్మీ శరీరాన్ని ఉరి వేసుకున్నట్లుగా వేలాడదీయించాడు. ఆదివారం బాగా పొద్దుపోయిన తర్వాత ఈ పబ్లిసిటీ తాలూకు కార్యక్రమాన్ని ముగించాడు.Source: Yahoo! Telugu: Entertainment | 4 Aug 2009 | 7:00 am భారతీయుడితో హాలీవుడ్ తార జైమ్ ప్రెస్లీ పెళ్లి!"డెడ్ ఆర్ అలైవ్" అనే హాలీవుడ్ సినిమాలో నటించిన అందాల ముద్దుగుమ్మ జైమ్ ప్రెస్లీ ఓ భారతీయుడిని వివాహం చేసుకోనుంది. మరికొద్ది రోజుల్లో 32వ జన్మదినం జరుపుకోనున్న వ్రెస్లీ వెంటనే భారతీయ సంతతికి చెందిన లాయర్ సిమ్రన్ సింగ్‌ను పెళ్లి చేసుకోవాలని తహతహలాడుతోంది. ఇప్పటికే తమ నిశ్చితార్థం జరిగిపోయిందని వ్రెస్లీ ఓ అమెరికా మ్యాగజైన్‌కు కూడా వెల్లడించింది. వీలైనంత త్వరలో పెళ్లికూతురు కాబోతోన్న వ్రెస్లీ జన్మదిన వేడుకల కోసం సిమ్రన్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడని అమెరికా మ్యాగజైన్ తెలిపింది.Source: Yahoo! Telugu: Entertainment | 4 Aug 2009 | 6:43 am అమ్మో... బ్రెస్ట్ కేన్సర్: టాలీవుడ్ హీరోయిన్స్తారలకు ఇప్పుడు కొత్తభయాలు పట్టుకున్నాయి. కెరీర్‌గ్రాఫ్, సంపాదన, వైవాహిక జీవితంఎలా ఉంటుంది అనే వాటికంటే వారికి వేరే కొత్త భయం ఎక్కువయింది. అదే ఆరగ్యోంపై భయం. గ్లామర్, హెల్త్ కాన్షస్ విపరీతంగా పెరిగిపోవడంతో తారలు తమ ఆరోగ్యం గురించి విపరీతంగా ఆలోచిస్తున్నారు. దీనికోసం వేలాదిరూపాయలు ఖర్చుపెడుతున్నారు. టాలీవుడ్‌లో పలు షూటింగ్ స్పాట్లకు ఆయా దర్శకుల వ్యక్తిగత వైద్యులు వస్తుండటం మామూలై పోయింది. అదే బాటను ఇప్పుడు హీరోయిన్లు అనుసరిస్తున్నారు. హీరోయిన్లను ప్రధానంగా వెంటాడుతున్న భయం బ్రెస్ట్ కేన్సర్. వివరాలలోకి వెళితే... సంజయ్‌దత్ తల్లి నర్గీస్ కేన్సర్‌తో మరణించింది. ఇటీవలే గౌతమి బ్రెస్ట్‌కాన్సర్‌తో బాధపడింది. కమల్‌హాసన్ దగ్గరుండి ఆదుకోవడంతో కోలుకుంది.Source: Yahoo! Telugu: Entertainment | 4 Aug 2009 | 5:36 am కేంద్ర ఉక్కు మంత్రి భార్యపై అవినీతి కేసు నమోదుకేంద్ర ఉక్కుశాఖామంత్రి వీరభద్రా సింగ్ సతీమణిపై హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. 2008 సంవత్సరం మేలో విడుదలైన ఆడియో సీడీలోని సంభాషణలను ఆధారంగా చేసుకుని ఆమెపై కేసు నమోదు చేసినట్టు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (విజిలెన్స్) ఎస్.ఆర్.మర్డి తెలిపారు.Source: జాతీయ | 4 Aug 2009 | 4:03 am భ్రమలు వీడి... వాస్తవాలు గ్రహించండి: జేపీరాష్ట్ర ఆర్థిక రంగం బాగుందనే భ్రమలు వీడి, వాస్తవాలను గ్రహించాలని అధికార కాంగ్రెస్ పార్టీ సభ్యులకు లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ సూచించారు. ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టేందుకు వనరుల ఖర్చే కాకుండా, అపరిమిత వృధాను కూడా తగ్గించాలని ఆయన కోరారు.Source: ఏపీ న్యూస్ | 4 Aug 2009 | 3:29 am కాంగ్రెస్-తెదేపాయేతర ఎమ్మెల్యేలతో చిరు భేటీప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి మెల్లగా రాష్ట్ర రాజకీయాలను జీర్ణించుకుంటున్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలంటే.. తమ బలం మాత్రమే సరిపోదని ఆయన గ్రహించారు. దీంతో కాంగ్రెస్, తెదేపాయేతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలతో ఆయన మంగళవారం సచివాలయంలో భేటీ అయ్యారు.Source: ఏపీ న్యూస్ | 4 Aug 2009 | 3:10 am ఆస్పత్రి నిర్లక్ష్యమే చిన్నారి ప్రాణాలు తీసింది: అశోక్ప్రైవేట్ ఆస్పత్రి సిబ్బంది, వైద్యుల నిర్లక్ష్యం వల్లే స్వైన్ ఫ్లూ బారిన పడిన 14 సంవత్సరాల చిన్నారి మృత్యువాత పడిందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ అభిప్రాయపడ్డారు. ఇది ఒక దురదృష్టకర సంఘటనగా ఆయన పేర్కొన్నారు.Source: జాతీయ | 4 Aug 2009 | 2:26 am బడి పంతుళ్ళ బదిలీలకు హైకోర్టు పచ్చజెండారాష్ట్రంలో టీచర్ల బదిలీలకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. గతంలో విధించిన స్టే కారణంగా బ్రేక్ బడిన బదిలీల ప్రక్రియ మళ్లీ ఆరంభంకానుంది. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు ఉన్న అడ్డంకుల్నీ తొలగిపోయినట్టేనని టీచర్ల సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.Source: ఏపీ న్యూస్ | 4 Aug 2009 | 2:20 am ప్రైవేటు ఆస్పత్రులకు స్వైన్ ఫ్లూపై కొత్త విధానాలు: కేంద్రందేశంలో తొలి స్వైన్ ఫ్లూ మరణం నమోదు కావడంతో కేంద్ర ఆరోగ్యం శాఖ మేల్కొంది. ప్రైవేటు ఆస్పత్రులకు కొత్త విధి విధానాలను అమలు చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా, ఈ ప్రపంచ మహమ్మారిని మరింత సమర్థవంతంగా ఎదుర్కొని, నివారించేందుకు కొత్త విధానం రూపొందిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించిందిSource: జాతీయ | 4 Aug 2009 | 1:47 am ఆయనొస్తే.. నేను పోతా: తలసాని అల్టిమేటంఅందరూ ఊహించినట్టుగానే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓ నిర్ణయానికి వచ్చారు. మాతృ సంస్థలోకి దేవేందర్ గౌడ్‌ను తిరిగి తీసుకుంటే తాను పార్టీకి గుడ్‌బై చెప్పనున్నట్టు ప్రకటించారు. అవరమైతే, రాజకీయాలకు పూర్తిగా స్వస్తి చెపుతానని ఆయన తన అనుచరులతో మంగళవారం సమావేశమైన తర్వాత మీడియాకు వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 4 Aug 2009 | 1:27 am కాకతీయ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ర్యాగింగ్ నిరోధకానికి ప్రభుత్వ, పోలీసు యంత్రాంగాలు ఎన్నో రకాల నిబంధనలు విధించినా.. ఈ భూతం మాత్రం ఆగడం లేదు. దేశంలో ఏదో ఒక చోట.. ఏదో ఒక ప్రాంతంలో ర్యాగింగ్‌కు జూనియర్ విద్యార్థులు బలి పశువులు అవుతున్నారు.Source: ఏపీ న్యూస్ | 4 Aug 2009 | 1:12 am పాకిస్థాన్ కపటనాటకాలపై విదేశాంగ శాఖ సీరియస్పాకిస్థాన్ ఆడుతున్న కపటనాటకాలపై కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ సీరియస్‌గా స్పందించింది. ముంబై దాడుల వ్యవహారంలో పాక్‌కు తగిన కౌంటర్ ఇచ్చేందుకు కేంద్ర సర్కార్ సమాయత్తమైంది. నామ్ సదస్సు సందర్భంగా ఇండో-పాక్ ప్రధానులు విడుదల చేసిన సంయుక్త ప్రకటనను పక్కన పెట్టాలని నిర్ణయించింది.Source: జాతీయ | 4 Aug 2009 | 12:06 am అవినీతిలో 'ఇద్దరూ దొంగలే': జయప్రకాష్అవినీతిలో ముఖ్యమంత్రి వైఎస్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులు దొందూ దొందేనని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ ఆరోపించారు. తమ అవినీతిపై సిట్టింగ్ లేదా రిటైర్ జడ్జిలతో విచారణ జరిపించాలంటూ ఆరేళ్లుగా సవాళ్లుగా విసురుకుంటున్నారే గానీ.. ఒక్కసారి కూడా తగిన చర్యలు తీసుకోలేదని ఆయన ఎద్దేవా చేశారు.Source: ఏపీ న్యూస్ | 3 Aug 2009 | 11:44 pm దేశంలో తొలి స్వైన్ ఫ్లూ మరణం రికార్డుదేశంలో తొలి స్వైన్ ఫ్లూ మరణం నమోదైంది. హెచ్1ఎన్1 వ్యాధి లక్షణాలతో బాధపడుతూ వచ్చిన 14 సంవత్సరాల పూణెకు చెందిన బాలిక రిషా షేక్ సోమవారం మృత్యువాత పడింది. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్ల, చికిత్సలో అలసత్వం ప్రదర్శించడంతో ఆ చిన్నారి మృతి చెందినట్టు వైద్య వర్గాలు వెల్లడించాయి.Source: జాతీయ | 3 Aug 2009 | 11:29 pm దేవేందర్ గౌడ్.. ఓ గల్లీ కార్యకర్త కంటే హీనం: పీఆర్పీమాతృసంస్థ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించిన మాజీ మంత్రి, సీనియర్ నేత తూళ్ళ దేవేందర్ గౌడ్ ఓ గల్లీ కార్యకర్త కంటే హీనమని ప్రజారాజ్యం పార్టీ నేతలు దుయ్యబట్టారు. ఇంతకంటే పచ్చి అవకాశవాది ఈ రాష్ట్ర రాజకీయాల్లో మరొకరు ఉండబోరని కడిగి పారేశారు.Source: ఏపీ న్యూస్ | 3 Aug 2009 | 11:00 pm దీప్ జోషికి ప్రతిష్టాత్మక మెగసెసే అవార్డుఆసియా ఖండంలో నోబెల్ బహుమతితో సమానంగా కొలిచే రామన్ మెగసెసే అవార్డుకు మరో భారతీయుడు ఎంపికయ్యాడు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో తనవంతు పాత్ర పోషిస్తున్న ప్రముఖ సామాజిక కార్యకర్తగా దీప్ జోషి ఈ ఏడాది ప్రతిష్టాత్మక రామన్ మెగసెసే అవార్డు అందుకోనున్నారు.Source: జాతీయ | 3 Aug 2009 | 10:12 pm జడ్జిల బిల్లును ఉపసంహరించుకున్న కేంద్రంన్యాయమూర్తుల ఆస్తులపై రూపొందించిన వివాదాస్పద బిల్లు విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ కూటమి ప్రభుత్వం వెనుకడుగువేసింది. ఈ బిల్లును రాజ్యసభలో ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఈ బిల్లుపై ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపై నడవడంతో పాలకపక్షం దానిని వెనక్కు తీసుకోకతప్పలేదు.Source: జాతీయ | 3 Aug 2009 | 9:36 pm "అడవి"కోసం శ్రీకాళహస్తీశ్వరునికి నితిన్ పూజలుసిక్స్ ప్యాక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే యత్నం చేసి ఆనక ఏకంగా రామ్‌గోపాల్ వర్మ దృష్టిలో పడి "అడవి" హీరోగా అవతారమెత్తిన స్ట్రాంగ్ హీరో నితిన్. అడవిలో ప్రియాంక కొఠారి బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లుగా తన లాంగ్వేజ్‌ను మార్చుకుని మాస్‌ను మజా చేయడానికి రానున్నాడు. ఇక రామ్‌గోపాల్ వర్మ తారలను ఏ రేంజ్‌లో చూపిస్తారో వేరే చెప్పనక్కర లేదు. ఈ సంగతి ప్రక్కనపెడితే, మన తెలుగు హీరో నితిన్ "అడవి" అఖండమైన విజయం సాధించాలని కోరుకుంటూ శ్రీకాళహస్తీశ్వరునికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించాడు. హీరో ఒక్కడే వచ్చాడు.. మరి హీరోయిన్ పూజలు చేయలేదా.. అనుకునేరు. ప్రియాంక కొఠారి కూడా అడవి సూపర్ డూపర్ హిట్టవ్వాలని తన ఇష్టదైవాన్ని కోరుకుంటూ పూజలు నిర్వహించినట్లు బాలీవుడ్ వార్త.Source: Yahoo! Telugu: Entertainment | 3 Aug 2009 | 2:05 pm పబ్బుల్లో "మందు" కొడుతున్న కమలినీ ముఖర్జీహోమ్లీ ఇమేజ్ తెచ్చుకున్న కమలినీ ముఖర్జీ ఇటీవల పబ్బుల్లో తాగుతూ తూలుతూ కనబడుతోందట. ఒక సినీ ప్రముఖుడు ఆ రోజు ఆమెను పలకరిద్దామని అనుకుంటే మాట్లాడే స్థితిలో లేకపోవడం వల్ల మరుసటిరోజు ఆమెను కలిసి, 'ఏమిటి రోజుకి రెండుసార్లు టీ తాగడానికే ఇష్టపడని నువ్వే ఇలా మందు కొట్టేస్తున్నావ్' అనడిగాడట. ఆ ప్రశ్నకు కమిలినీ, "ఏముంది. నేను అనుకోకుండా అడుగుపెట్టిన రంగం ఇది. ఈ రంగంలో మడి కట్టుకుని కూర్చుంటే.. మనకు మిగిలేది ఏమీ ఉండదు. అదీగాక సహనటీనటులు వింతగా చూస్తారు. నలుగురితో నారాయణ.. అనే కర్టసీ కోసం అప్పుడప్పుడూ వారికోసం లైట్‌గా మందు తీసుకుంటున్నాను. తప్పదుకదా" అని సింపుల్‌గా చెప్పిందట. లైట్‌గా తీసుకుంటే తూలేలా వాలిపోతారా? మరి ఫుల్ తీస్కుంటే? ఏమవుతారూ...? అనేది వారి ప్రశ్న.Source: Yahoo! Telugu: Entertainment | 3 Aug 2009 | 12:05 pm గోపీచంద్- త్రిషల "శంఖం" షూటింగ్ పూర్తిఎగ్రెసివ్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావులు శ్రీ బాలాజీ సీనీమిడియా పతాకంపై అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్న క్రేజీ చిత్రం ''శంఖం''కి సంబంధించిన ఓ అందమైన యుగళ గీతాన్ని ''రామోజీ ఫిలిం సిటీ'' లో జులై27 నించి 30 వరకు చిత్రీకరించారు. ''అరు బాబోరు...అరు బాబోరు.. దీని ఫ్రంటు చూస్తే అరు బాబోరు..దీని బ్యాక్ చూస్తే అరు బాబోరు'' అంటూ గీతరచయిత భాస్కర బట్ల వ్రాసిన యుగళ గీతాన్ని గోపీచంద్- త్రిషలపైన చిత్రీకరించారు. ఈ పాట చిత్రీకరణతో ''శంఖం'' చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తయ్యాయి.Source: Yahoo! Telugu: Entertainment | 3 Aug 2009 | 11:12 am "నీలవేణి"లో ఆర్తీ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ లుక్ముఖుల్దేవ్, ఆర్తీ అగర్వాల్ జంటగా భరత్ పారేపల్లి దర్శకత్వంలో ఎం.జి.ఆర్. కంబైన్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం నీలవేణి. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటివరకూ 80 శాతం పూర్తయింది. ఈనెల 10 నుంచి 28 వరకు జరిగే షూటింగ్‌తో మొత్తం పూర్తవుతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ, "ఈ చిత్రానికి కథతోపాటు సంగీతం, రామ్‌లక్ష్మణ్‌ల ఫైట్స్ హైలైట్‌గా నిలుస్తాయి. ఆర్తీ అగర్వాల్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ చిత్రమవుతుంది. ఐదు పాటలు, నాలుగు బిట్ సాంగ్స్ ఉన్నాయి. తను ప్రేమించి ప్రియుడిని తనకు కాకుండా చేసిన కొందరు దుర్మార్గులకు నీలవేణి ఎలా బుద్ధి చెప్పింది.. అనే అంశంతో రూపొందుతోంది. సెప్టెంబర్ 10న ఆడియోను, దసరానాడు సినిమాను విడుదలచేయనున్నామ"ని తెలిపారు.Source: Yahoo! Telugu: Entertainment | 3 Aug 2009 | 9:51 am దేశంలో తొలి స్వైన్‌ఫ్లూ మరణంమహారాష్ట్రలోని పుణెలో స్వైన్‌ఫ్లూ వ్యాధిబారిన పడిన ఓ చిన్నారి మృతి చెందింది. దీంతో దేశంలో మొదటి స్వైన్‌ఫ్లూ మరణం నమోదైంది. స్వైన్‌ఫ్లూ వ్యాధిబారిన పడిన 14 సంవత్సరాల బాలిక గత ఆరు రోజులుగా పుణె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు వైద్యాధికారులు తెలిపారు.Source: జాతీయ | 3 Aug 2009 | 9:39 am స్కోడా కారును దొంగిలించిన కసబ్నిరుడు ముంబైలో జరిగిన మారణకాండకు సంబంధించి సాక్ష్యమివ్వడానికి సోమవారం వచ్చిన ఓ వ్యక్తి కసబ్‌ను గుర్తించి ముంబైలోని సెక్రటేరియేట్ వద్ద తుపాకీ చూపించి స్కోడా కారును దొంగలించుకు పారిపోయిన ఉగ్రవాదులలో ఇతనూ ఒకడని తెలిపాడు.Source: జాతీయ | 3 Aug 2009 | 8:46 am పీఆర్‌పీకి గుడ్ బై చెప్పిన గౌడ్...!గత కొన్ని రోజులుగా ప్రజారాజ్యం పార్టీని వీడనున్నట్లు వస్తున్న ఊహలకు దేవేందర్ గౌడ్ సోమవారం తెరదించారు. పీఆర్‌పీకి రాజీనామా చేసిన లేఖను ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి పంపారుSource: ఏపీ న్యూస్ | 3 Aug 2009 | 8:34 am బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ మనీ ఫార్ములాస్డబ్బుకోసం షారుక్ ఎన్నో ఇబ్బందులు పడ్డాడట. స్వానుభవంతో తెలుసుకున్నవి కొన్నైతే తన తల్లి డబ్బు విలువ ఎంతటిదో షారుక్ కు అనేక సందర్భాల్లో చెప్పిందట. డబ్బును తను ఎలా ఖర్చు చేస్తాడో.. ఎలా పొదుపు చేస్తాడో.. ఇలా వివరించాడు. " నేనెప్పుడూ డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయను. అయితే నేను ఇంటి బయటకు వెళ్లేటపుడు జేబులో వేసుకున్న డబ్బంతా ఖర్చు చేసేస్తాను. నా మనసు ఎంతో సున్నితమైంది. ఎవరైనా డబ్బుకోసం చేయి చాచితే డబ్బును ఇచ్చేస్తా. అలా ఇచ్చేసిన తర్వాత నా చేతిలో డబ్బు ఉండదు. మళ్లీ ఏదైనా అవసరం రావచ్చేమోనని నా స్పాట్ బాయ్ దగ్గరో లేదంటే నా డ్రైవరు దగ్గరో అప్పు తీసుకుంటా. ఇంకో విషయం.. నా వద్ద చాలా క్రెడిట్ కార్డులు ఉంటాయి. కానీ వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించను. క్రెడిట్ కార్డులు తెచ్చే ఇబ్బందులు మా స్నేహితుని ద్వారా తెలుసుకున్నాను. అందుకే అవి వున్నా.. వాటిని మాత్రం ఉపయోగించను. ఇక నా పెట్టుబడుల విషయానికి వస్తే.. నాకు షేర్లలో డబ్బును పెట్టుబడి పెట్టే అలవాటు లేదు. అలాగే డబ్బును వడ్డీలకు ఇవ్వను. అప్పు చేయను. నేను కొన్న బిల్డింగే నాకు పెద్ద పెట్టుబడి. అదే నా స్వేదం. నా రక్తం.. నా కన్నీరు.Source: Yahoo! Telugu: Entertainment | 3 Aug 2009 | 8:17 am "శ్రీదేవి ఆంటీ..." అసిన్- "అసిన్ ఆంటీ.." శ్రీదేవి కూతురుసెక్సీ పిల్ల అసిన్ చెన్నైలో ఉన్న ఇంటిని సైతం అమ్ముకుని బాలీవుడ్‌లో సెటిలయ్యేందుకు ఎందుకు ప్రయత్నిస్తుంది.. దీని వెనుక కారణమేమిటా అని మన పిల్ల జర్నలిస్టు ఆరాతీశాడు. అందులో తేలిందేంటయా అంటే.. అసిన్ ఉంటున్న బిల్గింగు- శ్రీదేవి బోనీకపూర్ ఉంటున్న బిల్డింగూ ఒకటేనట. శ్రీదేవితో అసిన్ గంటలకొద్దీ బాతాఖానీ కొడుతూ కాలక్షేపం చేస్తోందట. బాలీవుడ్ షూటింగులు వాయిదా పడటంతో ఆ మధ్య తమ ప్రక్క ఇంట్లో ఉన్న పిల్లలతో అసిన్ ఆటలాడుకుంటోందన్న వార్తలు వచ్చాయి కదా. ఈ ఆటలు శ్రీదేవి పిల్లలతోనే అని కనిపెట్టాడు మన పిల్ల జర్నలిస్టు. ఇదిలావుంటే, శ్రీదేవి భర్త బోనీకపూర్ అసిన్‌ను తెగ పొగుడుతున్నాడట. అసిన్‌కు ఓ పెద్ద నటి అని గర్వమే లేదని చెపుతున్నాడట. అసిన్ అయితే సమయం దొరికినప్పుడల్లా.. "శ్రీదేవీ ఆంటీ..." అంటూ శ్రీదేవి ఇంట్లోకి గంటలకొద్దీ కాలం గడుపుతోందట. ఆ తర్వాత అసిన్ తన ఇంట్లోకి వెళ్లగానే శ్రీదేవి కూతురు, "అసిన్ ఆంటీ..." అని అసిన్ ఇంట్లో కాలక్షేపం చేస్తోందట. మొత్తమ్మీద శ్రీదేవిని వదిలి అసిన్, అసిన్‌ను వదిలి శ్రీదేవి కూతురు ఉండలేకపోతున్నారట. అదండీ అసలు సంగతి.Source: Yahoo! Telugu: Entertainment | 3 Aug 2009 | 6:03 am ఇదేం థియేటర్ కాదు.. మేం ప్రేక్షకులం కాము: చిరుఅసెంబ్లీ కాలక్షేపాన్ని థియేటర్ కాదని, అంతకంటే ముందు తామేమీ ప్రేక్షకులం కామని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడేందుకు ప్రతి ఒక్కరికీ అవకాశం ఇవ్వాలని ఆయన సభాపతికి సూచన చేశారు.Source: ఏపీ న్యూస్ | 3 Aug 2009 | 6:01 am బెంగుళూరులో కూలిన మెట్రో పిల్లర్: ఇద్దరికి గాయాలుదేశంలోని మెట్రో నగరాల్లో నిర్మిస్తున్న మెట్రో పిల్లర్లు నిర్మాణ దశలోనే కూలిపోతున్నాయి. పిల్లర్ల నిర్మాణంలోనే లోపాలు ఉండటం వల్ల అవి ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయి. తాజాగా బెంగుళూరులో నిర్మాణ దశలో ఉన్న మెట్రో బ్రిడ్జి కూలి పోయింది.Source: జాతీయ | 3 Aug 2009 | 5:45 am గోపీచంద్- త్రిషల "శంఖం" షూటింగ్ పూర్తిఎగ్రెసివ్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావులు శ్రీ బాలాజీ సీనీమిడియా పతాకంపై అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్న క్రేజీ చిత్రం ''శంఖం''కి సంబంధించిన ఓ అందమైన యుగళ గీతాన్ని ''రామోజీ ఫిలిం సిటీ'' లో జులై27 నించి 30 వరకు చిత్రీకరించారు. ''అరు బాబోరు...అరు బాబోరు.. దీని ఫ్రంటు చూస్తే అరు బాబోరు..దీని బ్యాక్ చూస్తే అరు బాబోరు'' అంటూ గీతరచయిత భాస్కర బట్ల వ్రాసిన యుగళ గీతాన్ని గోపీచంద్- త్రిషలపైన చిత్రీకరించారు. ఈ పాట చిత్రీకరణతో ''శంఖం'' చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తయ్యాయి.Source: వినోదం | 3 Aug 2009 | 5:44 am "కింగ్ కోబ్రా" రాజధాని "ఆగుంబె""నిన్నలేని అందమేదో నిదుర లేచెనెందుకో....!" అని ఓ సినీ కవి అన్నట్లుగా... దారి పొడవునా పచ్చటి పందిరి వేసినట్లుగా చెట్లు, దూరంగా అగ్గిపెట్టెల్లాగా ఇళ్ళు, చెయ్యి తిరిగిన చిత్రకారుడి కుంచె నుంచి జాలువారిన అద్భుతమైన వర్ణ చిత్రంలాంటి దట్టమైన అటవీ అందాలన్నింటినీ తనలో దాచుకున్న ప్రాంతమే "ఆగుంబె". పడమటి కనుమల్లోకెల్లా ఎత్తయిన ఈ ప్రాంతం, దక్షిణ భారతదేశంలోనే అత్యధికంగా వర్షం కురిసేటి... "దక్షిణాది చిరపుంజి"గా పేరుగాంచింది.Source: వినోదం | 3 Aug 2009 | 5:42 am "నీలవేణి"లో ఆర్తీ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ లుక్ముఖుల్దేవ్, ఆర్తీ అగర్వాల్ జంటగా భరత్ పారేపల్లి దర్శకత్వంలో ఎం.జి.ఆర్. కంబైన్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం నీలవేణి. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటివరకూ 80 శాతం పూర్తయింది. ఈనెల 10 నుంచి 28 వరకు జరిగే షూటింగ్‌తో మొత్తం పూర్తవుతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ, "ఈ చిత్రానికి కథతోపాటు సంగీతం, రామ్‌లక్ష్మణ్‌ల ఫైట్స్ హైలైట్‌గా నిలుస్తాయి. ఆర్తీ అగర్వాల్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ చిత్రమవుతుంది.Source: వినోదం | 3 Aug 2009 | 4:24 am ఫోర్ ట్వంటీస్ ఎవరో ప్రజలు తేల్చి తీర్పిచ్చారు: వైఎస్రాష్ట్రంలో ఫోర్ ట్వంటీస్ ఎవరో ప్రజలు తేల్చి తీర్పు ఇచ్చారని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తెదేపా సభ్యులకు చురక అంటించారు. ఈ విషయంలో సిగ్గుపడాల్సింది తెలుగుదేశం పార్టీ సభ్యులేనని ఆయన అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్ అభృద్ధిపై చర్చ జరిగింది.Source: ఏపీ న్యూస్ | 3 Aug 2009 | 4:17 am
|