|
నేపాల్ ప్రభుత్వానికి మావోయిస్టుల అల్టిమేటంనేపాల్ మాజీ గెరిల్లా పార్టీ యూనిఫైడ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్ట్) సోమవారం నేపాల్ ప్రభుత్వాన్ని రద్దు చేసేందుకు కొత్త ప్రధానమంత్రి మాధవ్ కుమార్ నేపాల్‌కు 72 గంటల గడువు విధించింది. మాధవ్ కుమార్ నేతృత్వంలోని ఇటీవల నేపాల్‌లో కొత్త సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయిన సంగతి తెలిసిందే.Source: Yahoo! Telugu: News | 3 Aug 2009 | 9:56 am "నీలవేణి"లో ఆర్తీ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ లుక్ముఖుల్దేవ్, ఆర్తీ అగర్వాల్ జంటగా భరత్ పారేపల్లి దర్శకత్వంలో ఎం.జి.ఆర్. కంబైన్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం నీలవేణి. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటివరకూ 80 శాతం పూర్తయింది. ఈనెల 10 నుంచి 28 వరకు జరిగే షూటింగ్‌తో మొత్తం పూర్తవుతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ, "ఈ చిత్రానికి కథతోపాటు సంగీతం, రామ్‌లక్ష్మణ్‌ల ఫైట్స్ హైలైట్‌గా నిలుస్తాయి. ఆర్తీ అగర్వాల్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ చిత్రమవుతుంది. ఐదు పాటలు, నాలుగు బిట్ సాంగ్స్ ఉన్నాయి. తను ప్రేమించి ప్రియుడిని తనకు కాకుండా చేసిన కొందరు దుర్మార్గులకు నీలవేణి ఎలా బుద్ధి చెప్పింది.. అనే అంశంతో రూపొందుతోంది. సెప్టెంబర్ 10న ఆడియోను, దసరానాడు సినిమాను విడుదలచేయనున్నామ"ని తెలిపారు.Source: Yahoo! Telugu: Entertainment | 3 Aug 2009 | 9:51 am ఫోర్ ట్వంటీస్ ఎవరో ప్రజలు తేల్చి తీర్పిచ్చారు: వైఎస్రాష్ట్రంలో ఫోర్ ట్వంటీస్ ఎవరో ప్రజలు తేల్చి తీర్పు ఇచ్చారని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తెదేపా సభ్యులకు చురక అంటించారు. ఈ విషయంలో సిగ్గుపడాల్సింది తెలుగుదేశం పార్టీ సభ్యులేనని ఆయన అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్ అభృద్ధిపై చర్చ జరిగింది.Source: Yahoo! Telugu: News | 3 Aug 2009 | 9:46 am గ్యాస్ ధరలపై ప్రభుత్వ అనుమతి తప్పనిసరి: మురళిగ్యాస్ వినియోగంపై నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వమేనని అలాగే గ్యాస్ ధరలపై ప్రభుత్వ అనుమతి తప్పనిసరని కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి మురళి దేవరా అన్నారు.Source: Yahoo! Telugu: News | 3 Aug 2009 | 9:37 am గరిష్ట స్థాయికి చేరుకున్నసెన్సెక్స్బాంబే స్టాక్ మార్కెట్‌కు సోమవారం కలిసొచ్చింది. ఆసియా, యూరప్ మార్కెట్ల ట్రేడింగ్ లాభదాయకంగా పయనించడంతో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో సెన్సెక్స్ 217 పాయింట్లు బలపడి, 15, 868 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 78 పాయింట్లు వృద్ధి చెంది, 4, 713 పాయింట్ల మార్కు వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.Source: Yahoo! Telugu: News | 3 Aug 2009 | 9:26 am అహ్మదీనెజాద్ అధ్యక్ష ఎన్నికకు ఆమోదంమహమౌద్ అహ్మదీనెజాద్ అధ్యక్ష ఎన్నికను ఇరాన్ సుప్రీం నేత ఆమోదించారు. ఇటీవల ఇరాన్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అహ్మదీనెజాద్ అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో నెజాద్ భారీ ఎత్తున రిగ్గింగ్ చేసి అక్రమ మార్గంలో విజయం సాధించారని ఆయన ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.Source: Yahoo! Telugu: News | 3 Aug 2009 | 9:17 am కాశ్మీర్ లోయలో నలుగురు మిలిటెంట్ల హతంజమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో సోమవారం భద్రతా దళాలకు, మిలిటెంట్లకు మధ్య సాగిన పోరులో నలుగురు మిలిటెంట్లు హతమయ్యారు. అలాగే ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆయుధ శిక్షణ కోసం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన మరో ఆరుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు.Source: Yahoo! Telugu: News | 3 Aug 2009 | 9:15 am ఇదేం థియేటర్ కాదు.. మేం ప్రేక్షకులం కాం: చిరుఅసెంబ్లీ కాలక్షేపాన్ని థియేటర్ కాదని, అంతకంటే ముందు తామేమీ ప్రేక్షకులం కామని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడేందుకు ప్రతి ఒక్కరికీ అవకాశం ఇవ్వాలని ఆయన సభాపతికి సూచన చేశారు.Source: Yahoo! Telugu: News | 3 Aug 2009 | 8:56 am బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ మనీ ఫార్ములాస్డబ్బుకోసం షారుక్ ఎన్నో ఇబ్బందులు పడ్డాడట. స్వానుభవంతో తెలుసుకున్నవి కొన్నైతే తన తల్లి డబ్బు విలువ ఎంతటిదో షారుక్ కు అనేక సందర్భాల్లో చెప్పిందట. డబ్బును తను ఎలా ఖర్చు చేస్తాడో.. ఎలా పొదుపు చేస్తాడో.. ఇలా వివరించాడు. " నేనెప్పుడూ డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయను. అయితే నేను ఇంటి బయటకు వెళ్లేటపుడు జేబులో వేసుకున్న డబ్బంతా ఖర్చు చేసేస్తాను. నా మనసు ఎంతో సున్నితమైంది. ఎవరైనా డబ్బుకోసం చేయి చాచితే డబ్బును ఇచ్చేస్తా. అలా ఇచ్చేసిన తర్వాత నా చేతిలో డబ్బు ఉండదు. మళ్లీ ఏదైనా అవసరం రావచ్చేమోనని నా స్పాట్ బాయ్ దగ్గరో లేదంటే నా డ్రైవరు దగ్గరో అప్పు తీసుకుంటా. ఇంకో విషయం.. నా వద్ద చాలా క్రెడిట్ కార్డులు ఉంటాయి. కానీ వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించను. క్రెడిట్ కార్డులు తెచ్చే ఇబ్బందులు మా స్నేహితుని ద్వారా తెలుసుకున్నాను. అందుకే అవి వున్నా.. వాటిని మాత్రం ఉపయోగించను. ఇక నా పెట్టుబడుల విషయానికి వస్తే.. నాకు షేర్లలో డబ్బును పెట్టుబడి పెట్టే అలవాటు లేదు. అలాగే డబ్బును వడ్డీలకు ఇవ్వను. అప్పు చేయను. నేను కొన్న బిల్డింగే నాకు పెద్ద పెట్టుబడి. అదే నా స్వేదం. నా రక్తం.. నా కన్నీరు.Source: Yahoo! Telugu: Entertainment | 3 Aug 2009 | 8:17 am హఫీజ్ సయీద్ కేసు నిరవధిక వాయిదాగత ఏడాది నవంబరులో జరిగిన ముంబయి ఉగ్రవాద దాడుల కుట్రదారులను చట్టం ముందుకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న భారత్‌కు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. ముంబయి దాడుల ప్రధాన సూత్రధారిగా భారత్ విశ్వసిస్తున్న జమాదుత్ దవా చీఫ్ హఫీజ్ మొహమ్మద్ సయీద్ కేసు విచారణను పాకిస్థాన్ సుప్రీంకోర్టు సోమవారం నిరవధిక వాయిదా వేసింది.Source: Yahoo! Telugu: News | 3 Aug 2009 | 8:15 am విదేశీ మార్కెట్ల ప్రభావం: వృద్ధి బాటలో సెన్సెక్స్ఆసియా మార్కెట్ల ట్రేడింగ్ పుంజుకోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ భారీ లాభాల దిశగా పయనిస్తోంది. ఎఫ్‌సీజీ, కన్యూమర్ డ్యూరబుల్, బ్యాంకు, ఐటీ వాటాలు లాభాలను ఆర్జించడంతో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ సోమవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో 117 పాయింట్లు వృద్ధి చెంది, 15,789 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 37 పాయింట్లు బలపడి, 4,675 పాయింట్ల వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 3 Aug 2009 | 8:11 am తెరాసలో ముదురుతున్న అసంతృప్తి సంక్షోభం!తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస)లో అసంతృప్తుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ముఖ్యంగా, ఆ పార్టీ అధినేత చంద్రశేఖర రావు ప్రాతినిథ్యం వహిస్తున్న మహబూబ్ నగర్ జిల్లాల్లో తెరాస నేతలు అసమ్మతి నేతలు సెగలు కక్కుతున్నారు.Source: Yahoo! Telugu: News | 3 Aug 2009 | 8:07 am "శ్రీదేవి ఆంటీ..." అసిన్- "అసిన్ ఆంటీ.." శ్రీదేవి కూతురుసెక్సీ పిల్ల అసిన్ చెన్నైలో ఉన్న ఇంటిని సైతం అమ్ముకుని బాలీవుడ్‌లో సెటిలయ్యేందుకు ఎందుకు ప్రయత్నిస్తుంది.. దీని వెనుక కారణమేమిటా అని మన పిల్ల జర్నలిస్టు ఆరాతీశాడు. అందులో తేలిందేంటయా అంటే.. అసిన్ ఉంటున్న బిల్గింగు- శ్రీదేవి బోనీకపూర్ ఉంటున్న బిల్డింగూ ఒకటేనట. శ్రీదేవితో అసిన్ గంటలకొద్దీ బాతాఖానీ కొడుతూ కాలక్షేపం చేస్తోందట. బాలీవుడ్ షూటింగులు వాయిదా పడటంతో ఆ మధ్య తమ ప్రక్క ఇంట్లో ఉన్న పిల్లలతో అసిన్ ఆటలాడుకుంటోందన్న వార్తలు వచ్చాయి కదా. ఈ ఆటలు శ్రీదేవి పిల్లలతోనే అని కనిపెట్టాడు మన పిల్ల జర్నలిస్టు. ఇదిలావుంటే, శ్రీదేవి భర్త బోనీకపూర్ అసిన్‌ను తెగ పొగుడుతున్నాడట. అసిన్‌కు ఓ పెద్ద నటి అని గర్వమే లేదని చెపుతున్నాడట. అసిన్ అయితే సమయం దొరికినప్పుడల్లా.. "శ్రీదేవీ ఆంటీ..." అంటూ శ్రీదేవి ఇంట్లోకి గంటలకొద్దీ కాలం గడుపుతోందట. ఆ తర్వాత అసిన్ తన ఇంట్లోకి వెళ్లగానే శ్రీదేవి కూతురు, "అసిన్ ఆంటీ..." అని అసిన్ ఇంట్లో కాలక్షేపం చేస్తోందట. మొత్తమ్మీద శ్రీదేవిని వదిలి అసిన్, అసిన్‌ను వదిలి శ్రీదేవి కూతురు ఉండలేకపోతున్నారట. అదండీ అసలు సంగతి.Source: Yahoo! Telugu: Entertainment | 3 Aug 2009 | 6:03 am ఫోర్ ట్వంటీస్ ఎవరో ప్రజలు తేల్చి తీర్పిచ్చారు: వైఎస్రాష్ట్రంలో ఫోర్ ట్వంటీస్ ఎవరో ప్రజలు తేల్చి తీర్పు ఇచ్చారని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తెదేపా సభ్యులకు చురక అంటించారు. ఈ విషయంలో సిగ్గుపడాల్సింది తెలుగుదేశం పార్టీ సభ్యులేనని ఆయన అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్ అభృద్ధిపై చర్చ జరిగింది.Source: ఏపీ న్యూస్ | 3 Aug 2009 | 4:17 am కాశ్మీర్ లోయలో నలుగురు మిలిటెంట్ల హతంజమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో సోమవారం భద్రతా దళాలకు, మిలిటెంట్లకు మధ్య సాగిన పోరులో నలుగురు మిలిటెంట్లు హతమయ్యారు. అలాగే ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆయుధ శిక్షణ కోసం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన మరో ఆరుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు.Source: జాతీయ | 3 Aug 2009 | 3:45 am ఇదేం థియేటర్ కాదు.. మేం ప్రేక్షకులం కాం: చిరుఅసెంబ్లీ కాలక్షేపాన్ని థియేటర్ కాదని, అంతకంటే ముందు తామేమీ ప్రేక్షకులం కామని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడేందుకు ప్రతి ఒక్కరికీ అవకాశం ఇవ్వాలని ఆయన సభాపతికి సూచన చేశారు.Source: ఏపీ న్యూస్ | 3 Aug 2009 | 3:27 am తెరాసలో ముదురుతున్న అసంతృప్తి సంక్షోభం!తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస)లో అసంతృప్తుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ముఖ్యంగా, ఆ పార్టీ అధినేత చంద్రశేఖర రావు ప్రాతినిథ్యం వహిస్తున్న మహబూబ్ నగర్ జిల్లాల్లో తెరాస నేతలు అసమ్మతి నేతలు సెగలు కక్కుతున్నారు.Source: ఏపీ న్యూస్ | 3 Aug 2009 | 2:54 am పశ్చిమ బెంగాల్‌లో సీపీఎం వృద్ధ నేత కన్నుమూతపశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కమ్యూనిస్టు వృద్ధ నేతల్లో ఒకరైన సుభాష్ చక్రవర్తి సోమవారం మృతి చెందారు. ఆయనకు వయస్సు 68 సంవత్సరాలు. ఆ రాష్ట్ర క్రీడలు, రవాణా శాఖ మంత్రిగా కూడా ఆయన విధులు నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.Source: జాతీయ | 3 Aug 2009 | 1:59 am తెదేపా అభివృద్ధిని చూసే ప్రజలు ఓట్లు వేశారు: వైఎస్గత తొమ్మిదేళ్ళ తెలుగుదేశం పాలనలో జరిగిన అభివృద్ధిని చూసిన ప్రజలే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారన్న విషయాన్ని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు గుర్తుంచుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి హితవు పలికారు.Source: ఏపీ న్యూస్ | 3 Aug 2009 | 12:56 am ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌కు బెయిల్ అవుట్ లేదు: పటేల్ఈనెల 18వ తేదీన నిర్వహించ తలపెట్టిన సమ్మెను ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ ఉపసంహరించుకున్నప్పటికీ.. ఆ సంస్థలను ఆదుకునేందుకు వీలుగా ప్రత్యేక బెయిల్ అవుట్ ప్యాకేజీని ప్రకటించే ఉద్దేశం లేదని కేంద్రం తేల్చిచెప్పింది.Source: జాతీయ | 3 Aug 2009 | 12:39 am తాజ్ హెరిటేజ్ జోన్‌లో నిర్మాణ ప్రణాళికలేవీ లేవుప్రపంచ ప్రఖ్యాత తాజ్‌మహల్ వద్ద ఉన్న తాజ్ హెరిటేజ్ జోన్‌లో ఎటువంటి నిర్మాణ, అభివృద్ధి పనులు చేపట్టడం లేదని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం స్పష్టం చేసింది. తాజ్ హెరిటేజ్ జోన్‌లో యూపీ ప్రభుత్వం ఇతర నిర్మాణాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.Source: జాతీయ | 3 Aug 2009 | 12:25 am కరవు ప్రాంతంగా గుంటూరు జిల్లా: మంత్రి కన్నారాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా గుంటూరు జిల్లాను కరవు ప్రాంతంగా ప్రకటించనున్నట్టు రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖామంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ విషయంపై సోమవారం ముఖ్యమంత్రితో చర్చించనున్నట్టు ఆయన తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 3 Aug 2009 | 12:22 am చంద్రబాబుపై మరోమారు విమర్శలు చేసిన రోశయ్యతెదేపా అధినేత చంద్రబాబుపై రాష్ట్ర మంత్రి కొణిజేటి రోశయ్య మరోమారు విమర్శల వర్షం గుప్పించారు. ఆపరేషన్ ఆకర్ష్.. ఆపరేషన్ వికర్ష్‌లు చంద్రబాబు పుణ్యమేనని ఆయన ఆరోపించారు. తమ పార్టీకి శాసనసభలో పూర్తిస్థాయి బలం ఉందనే విషయాన్ని బాబు గ్రహించాలన్నారు.Source: ఏపీ న్యూస్ | 3 Aug 2009 | 12:14 am కుంభకర్ణ నిద్రలో వ్యవసాయ మంత్రి రఘువీరా: బండారురాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి ఎన్.రఘువీరా రెడ్డి కుంభకర్ణ నిద్రలో ఉన్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ ఆరోపించారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా వేసిన అతికొద్ది పంటలు ఎండిపోతున్నాయన్నారు.Source: ఏపీ న్యూస్ | 3 Aug 2009 | 12:02 am సీబీఐ నన్ను వేధింపులకు గురిచేస్తోంది: బూటామాజీ కేంద్ర మంత్రి బుటా సింగ్ ఆదివారం తనను సీబీఐ వేధింపులకు గురి చేస్తోందని ఆరోపించారు. బూటా సింగ్ కుమారుడిని ఇటీవల సీబీఐ కోటి రూపాయల లంచం కుంభకోణంలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ లంచం కేసు వివాదంపై బూటా సింగ్ మాట్లాడుతూ.. సీబీఐ తనపై వేధింపులకు గురి చేసేందుకు ప్రయత్నిస్తుందన్నారు.Source: జాతీయ | 2 Aug 2009 | 10:05 pm రేపటి నుంచి ప్రభుత్వ ఉద్యోగుల "మహా" సమ్మెఆరో వేతన సంఘం సిఫార్సులను తక్షణం అమలు చేయాలని కోరుతూ మహారాష్ట్రలో సుమారు 22 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు సోమవారం సమ్మె చేయనున్నారు. వీరిలో పాఠశాల ఉపాధ్యాయులతో సహా, జూనియర్ కళాశాల లెక్చరర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్స్ కూడా ఉన్నారు.Source: జాతీయ | 2 Aug 2009 | 6:37 am రాజకీయ పార్టీలన్నీ స్నేహంగా మెలగాలి: వైఎస్రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలు స్నేహభావంతో మెలుగుతూ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి అన్నారు. పార్టీలన్నీ ఐక్యంగా ఉంటే అదే ప్రజా సంక్షేమానికి రాజమార్గం అవుతుందని అన్నారు.Source: ఏపీ న్యూస్ | 2 Aug 2009 | 6:37 am బీహార్‌ను ముంచెత్తిన వరదలుబీహార్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. బీహార్‌లోని బాగ్‌మతి నదికి వరదలు రావడంతో సీతామర్హి జిల్లాలోని వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. దాదాపు 200 గ్రామాల్లోకి వరదనీరు ప్రవేశించిందని ప్రభుత్వ అధికారులు తెలిపారు. వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టామని వారు వెల్లడించారు.Source: జాతీయ | 2 Aug 2009 | 4:31 am మహిళల కోసం వైఎస్ చేస్తున్న కృషి ఎనలేనిది!మహిళాలోకానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి చేస్తున్న కృషి ఎనలేనిదని హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాష్ట్ర మహిళలకు దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించిపెట్టిన ఘనత ముఖ్యమంత్రిదేనని మంత్రి ప్రశంసించారు. జలయజ్ఞానికి శ్రీకారం చుట్టి అపర భగీరథుడిగా పేరొందిన సీఎం.. మహిళ అభ్యున్నతికి చేస్తున్న కృషి చారిత్రాత్మకమని చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 2 Aug 2009 | 3:41 am పదో తరగతిలో గ్రేడింగ్ విధానం: వరప్రసాద్పదవ తరగతి పరీక్షల్లో గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మాణిక్ వరప్రసాద్ ఆదివారం స్పష్టం చేశారు. ఈ విద్యాసంవత్సరం నుంచి పదో తరగతి గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తామని వరప్రసాద్ ప్రకటించారు.Source: ఏపీ న్యూస్ | 2 Aug 2009 | 3:38 am
|