|
2010 నాటికి 60 వేల నానోలు: టాటా మోటార్స్దేశంలో అతిపెద్ద మోటారు వాహన సంస్థ టాటా మోటార్స్ సంస్థ వచ్చే 2010 సంవత్సరం జులై నాటికి 60 వేల నానో కార్లను డెలివరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజల కారుగా పేరొందిన నానో కారుకు స్వదేశీయంగానే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ లభించిన విషయం తెల్సిందే.Source: Yahoo! Telugu: News | 2 Aug 2009 | 7:46 am వర్షాభావ పరిస్థితులపై ప్రత్యామ్నాయ ప్రణాళికలురాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వారం రోజుల్లో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందిస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కె. రోశయ్య స్పష్టం చేశారు. పలు ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగానే ఉన్నట్లు రోశయ్య వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 2 Aug 2009 | 7:30 am బూటాసింగ్ నివాసంలో పిస్తోళ్లు స్వాధీనంకేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్ ఛైర్మన్ బూటాసింగ్ నివాసంలో లైసెన్సులేని తుపాకీలను సీబీఐ అధికారులు కైవసం చేసుకున్నారు. బూటాసింగ్ ఆయన కుమారుడు సరబ్‌జ్యోత్ సింగ్ కలిసి ఒకే ఇంటిలో నివశిస్తున్నారు.Source: Yahoo! Telugu: News | 2 Aug 2009 | 7:20 am పార్లమెంట్‌లో ముషారఫ్ భవితవ్యం: పాక్ ప్రధానిమాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ భవితవ్యాన్ని పార్లమెంట్ తేల్చుతుందని పాకిస్థాన్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ చెప్పారు. ముషారఫ్ సైనిక అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దేశంలో ఎమెర్జెన్సీ విధించారు. దీనిపై దాఖలైన పిటీషన్‌పై ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది.Source: Yahoo! Telugu: News | 2 Aug 2009 | 6:50 am ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ విభాగానికి కొత్త ఎండిభారత స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా జీవిత బీమా విభాగమైన ఎస్బీఐ లైఫ్ మేనేజింగ్ డైరక్టర్‌గా మహదేవ్ నాగేంద్ర రావు బాధ్యతలు స్వీకరించారు. ఎస్పీబీ, బీఎన్పీ పరిబాస్ అస్యూరెన్స్‌ల సంయుక్త సంస్థ ఎస్బీఐ లైఫ్ ఎండీ బాధ్యతలను ఆయన శనివారం స్వీకరించినట్టు ఆ సంస్థ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.Source: Yahoo! Telugu: News | 2 Aug 2009 | 6:32 am మార్కెట్లో కోడిగుడ్లు ధరలురాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో ఆదివారం కోడిగుడ్ల ధరలు కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో వంద కోడిగుడ్లు ధర రూ.193గా ఉండగా, చిల్లరగా ఒక్క గుడ్డు ధర రూ.2.20గా ఉంది. అలాగే.. వరంగల్ మార్కెట్‌లో రూ.194 గాను, విజయవాడలో రూ.193, విశాఖపట్నంలో రూ.210, గోదావరి మార్కెట్‌లో రూ.193, తూర్పుగోదావరిలో రూ.193, చిత్తూరులో 206 రూపాయలుగా ఉంది. ఇకపోతే.. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో వంద కోడిగుడ్లు ధర రూ.213 పలుకగా, కోళ్ళ పరిశ్రమకు ఆయువుపట్టుగా ఉన్న నామక్కల్‌లో 210 రూపాయలుగా పలుకుతోంది.Source: Yahoo! Telugu: News | 2 Aug 2009 | 6:28 am ప్రభుత్వ విధానాల్లో భారీ లోపాలు: జయప్రకాష్వ్యవసాయ అభివృద్ధి కోసం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్లో భారీ లోపాలు ఉన్నాయని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ అభిప్రాయపడ్డారు. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయంలో పలు రికార్డులు సృష్టించిందని, ఈ ఏడాది వాటన్నింటిలో వెనకపడిపోయిందని గుర్తు చేశారు.Source: Yahoo! Telugu: News | 2 Aug 2009 | 6:20 am ఆస్ట్రేలియాలో పర్యటించనున్న ఎస్ఎంకృష్ణకేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ఎం.కృష్ణ ఈనెల ఆరో తేదీ నుంచి ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఇటీవలి కాలంలో ఆస్ట్రేలియాలోని భారతీయ విద్యార్థులపై దాడులు ఎక్కువగా జరుగుతున్న విషయం తెల్సిందే. జాతి వివక్షతో కూడిన ఈ దాడులను అరికట్టడంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.Source: Yahoo! Telugu: News | 2 Aug 2009 | 5:32 am కాశ్మీర్‌పై పురోగతి లేదు: పాక్ విదేశాంగ శాఖభారత్-పాకిస్థాన్ దేశాల మధ్య సుదీర్ఘ కాలంగా నెలకొన్న కాశ్మీర్ వివాదం పరిష్కారంలో పురోగతి లేదని పాక్ విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి మసూద్ ఖలీద్ అన్నారు. ఈ వివాదం పరిష్కారంలో తాము అనుకున్నంత వేగంగా ముందుకు సాగడం లేదని ఆయన శనివారం మీడియాతో అన్నారు.Source: Yahoo! Telugu: News | 2 Aug 2009 | 5:25 am నేటి బులియన్ మార్కెట్ ధరలునేటి బులియన్ మార్కెట్‌లో బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.ముంబై మార్కెట్‌లో 99.9 రకం బంగారం 10 గ్రాములు ధర 14,930 నుంచి 14,775గా ఉంది. అలాగే 99.5 రకం బంగారం ధర రూ.14,860-.14,700-గా ఉంది. కిలో వెండి ధర రూ.22,890-22,730గా ఉంది. విశాఖపట్నం మార్కెట్‌లో బంగారం (24 క్యారెట్లు) రూ.15,060 నుంచి రూ.14,930. ఆర్మమెంట్ బంగారం ధర రూ.13,780 నుంచి రూ.13,660గా పలుకుతోంది. కిలో వెండి ధర రూ.23,200 నుంచి రూ.23,200గా ఉంది. చెన్నై మార్కెట్‌లో 24 క్యారెట్లు బంగారం ధర 14,910 నుంచి రూ.14,765. ఆర్నమెంట్ బంగారం ఒక గ్రాము ధర రూ.1,382 నుంచి 1,388 రూపాయలు చొప్పున పలుకుతోంది. కిలో వెండి ధర రూ.23,565 నుంచి 22,080 రూపాయలుగా ఉంది.Source: Yahoo! Telugu: News | 2 Aug 2009 | 5:21 am బీహార్‌ను ముంచెత్తిన వరదలుబీహార్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. బీహార్‌లోని బాగ్‌మతి నదికి వరదలు రావడంతో సీతామర్హి జిల్లాలోని వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. దాదాపు 200 గ్రామాల్లోకి వరదనీరు ప్రవేశించిందని ప్రభుత్వ అధికారులు తెలిపారు. వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టామని వారు వెల్లడించారు.Source: జాతీయ | 2 Aug 2009 | 4:31 am మహిళల కోసం వైఎస్ చేస్తున్న కృషి ఎనలేనిది!మహిళాలోకానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి చేస్తున్న కృషి ఎనలేనిదని హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాష్ట్ర మహిళలకు దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించిపెట్టిన ఘనత ముఖ్యమంత్రిదేనని మంత్రి ప్రశంసించారు. జలయజ్ఞానికి శ్రీకారం చుట్టి అపర భగీరథుడిగా పేరొందిన సీఎం.. మహిళ అభ్యున్నతికి చేస్తున్న కృషి చారిత్రాత్మకమని చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 2 Aug 2009 | 3:41 am పదో తరగతిలో గ్రేడింగ్ విధానం: వరప్రసాద్పదవ తరగతి పరీక్షల్లో గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మాణిక్ వరప్రసాద్ ఆదివారం స్పష్టం చేశారు. ఈ విద్యాసంవత్సరం నుంచి పదో తరగతి గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తామని వరప్రసాద్ ప్రకటించారు.Source: ఏపీ న్యూస్ | 2 Aug 2009 | 3:38 am వర్షాభావ పరిస్థితులపై ప్రత్యామ్నాయ ప్రణాళికలురాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వారం రోజుల్లో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందిస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కె. రోశయ్య స్పష్టం చేశారు. పలు ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగానే ఉన్నట్లు రోశయ్య వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 2 Aug 2009 | 2:01 am బూటాసింగ్ నివాసంలో పిస్తోళ్లు స్వాధీనంకేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్ ఛైర్మన్ బూటాసింగ్ నివాసంలో లైసెన్సులేని తుపాకీలను సీబీఐ అధికారులు కైవసం చేసుకున్నారు. బూటాసింగ్ ఆయన కుమారుడు సరబ్‌జ్యోత్ సింగ్ కలిసి ఒకే ఇంటిలో నివశిస్తున్నారు.Source: జాతీయ | 2 Aug 2009 | 1:51 am ప్రభుత్వ విధానాల్లో భారీ లోపాలు: జయప్రకాష్వ్యవసాయ అభివృద్ధి కోసం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్లో భారీ లోపాలు ఉన్నాయని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ అభిప్రాయపడ్డారు. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయంలో పలు రికార్డులు సృష్టించిందని, ఈ ఏడాది వాటన్నింటిలో వెనకపడిపోయిందని గుర్తు చేశారు.Source: ఏపీ న్యూస్ | 2 Aug 2009 | 1:05 am ఆస్ట్రేలియాలో పర్యటించనున్న ఎస్ఎంకృష్ణకేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ఎం.కృష్ణ ఈనెల ఆరో తేదీ నుంచి ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఇటీవలి కాలంలో ఆస్ట్రేలియాలోని భారతీయ విద్యార్థులపై దాడులు ఎక్కువగా జరుగుతున్న విషయం తెల్సిందే. జాతి వివక్షతో కూడిన ఈ దాడులను అరికట్టడంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.Source: జాతీయ | 2 Aug 2009 | 12:03 am పేదల అభ్యున్నతికి మాయావతి వ్యతిరేకం: కాంగ్రెస్ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పేదల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి అడ్డుతగులుతున్నారని కాంగ్రెస్ ఆ పార్టీ ఆరోపించింది. ముఖ్యంగా.. బుందేల్‌ఖండ్ ప్రాంత ఆర్థికాభివృద్ధికి ఒక స్వతంత్ర సంస్థ ఏర్పాటును ఆమె వ్యతిరేకించండాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది.Source: జాతీయ | 1 Aug 2009 | 11:29 pm అడవి ఫినిష్... ఇక పరిటాల "రక్త చరిత్ర"పై రాము దృష్టిసస్పెన్స్ థ్రిల్లర్ అడవి దాదాపు పూర్తయిపోయింది. ఇక ఇప్పుడు రామ్‌గోపాల్ వర్మ తన దృష్టిని "రక్త చరిత్ర"పై మళ్లించారు. పరిటాల రవి జీవిత చరిత్రను ఆధారం చేసుకుని రూపొందించనున్న ఈ చిత్రంలో అనేక ఉత్కంఠభరితమైన అంశాలను జోడించే పనిలో వర్మ నిమగ్నమై ఉన్నారు. రక్త చరిత్రకు ఆధారంగా తీసుకుంటున్న పరిటాల రవి పుట్టు పూర్వోత్తరాలు, ఆయన జీవితంలో జరిగిన వరుస సంఘటనలు, హత్యకు దారితీసిన పరిస్థితులన్నింటినీ వర్మ క్షుణ్ణంగా తెలుసుకుని ఆ ప్రకారం స్క్రిప్టును పక్కాగా రూపొందిస్తున్నారట.Source: Yahoo! Telugu: Entertainment | 1 Aug 2009 | 1:36 pm "మౌనరాగం" మొదటి షెడ్యూల్ పూర్తి!అగ్రనిర్మాతలు ఎన్.వి.ప్రసాద్, శానం నాగఅశోక్ కుమార్‌లు సంయుక్తంగా శ్రీసాయిదేవా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై, "నచ్చావులే" హీరో తనీష్ కథానాయకుడిగా "మౌనరాగం" చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. జూలై 2న ప్రారంభమైన ఈ చిత్రం 27వరకూ మొదటి షెడ్యూల్‌ను జరుపుకుంది. దీనికి సంబంధించిన రెండో షెడ్యూల్ ఆగస్టు ఆరో తేదీ నుంచి ప్రారంభం కానుంది.Source: Yahoo! Telugu: Entertainment | 1 Aug 2009 | 12:49 pm సాయిమనీష పతాకంపై ద్విభాషా చిత్రం ప్రారంభంసాయిమనీష సినిమా పతాకంపై ద్విభాషా చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. కాంగ్రెస్ నాయకులు సుధాకర్‌రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, దర్శకులు సముద్ర, వెంకీ తదితరులు ఈ సినిమా ప్రారంభ వేడుకలో పాల్గొన్నారు. అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ వేడుకలో బేనర్ లోగోను లాంఛనంగా ఆవిష్కరించారు.Source: Yahoo! Telugu: Entertainment | 1 Aug 2009 | 12:46 pm "అదిరె.. అదిరే.." లోగో ఆవిష్కరణగ్లోరియస్ మూవీ మేకర్స్ పతాకంపై "అదిరె.. అదిరే..." అనే చిత్రాన్ని ప్రారంభిస్తున్నట్లు నిర్మాత ఎన్. రామ్‌మోహన్ రెడ్డి చెప్పారు.రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న తనకు సినిమా రంగమంటే తనకు ఆసక్తి ఎక్కువని చెప్పారు. చక్కని ప్రేమకథను చరణ్‌బాబు అందించారని, మొదటిభాగం కాలేజీ నేపథ్యంలో, రెండోభాగం కాలేజీ ముగిసిన తర్వాత ఉంటుందన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 1 Aug 2009 | 12:18 pm నేను ఏంజెలీనా జోలీని కాదు: మేగాన్ ఫాక్స్"టామ్‌రైడర్" హాట్‌స్టార్ ఏంజెలీనా జోలీతో తనను పదేపదే పోలుస్తుండటం ట్రాన్స్‌ఫార్మర్స్ భామ మేగాన్ ఫాక్స్‌కు కోపం తెప్పించింది. తననుతాను గుర్తించకుండా, తరుచూ ఏంజెలీనాతో పోలుస్తుండటంపై ఫాక్స్ కాస్త ఘాటుగానే స్పందించింది. ఈ చికాకులో మేగాన్ ఫాక్స్ (23) మాట్లాడుతూ.. తనకు జోలీకి కొన్ని శరీర పోలికలు ఉన్న మాత్రాన తానేమీ ఆమె పార్ట్- 2ని కాదని స్పష్టం చేసింది. తాను కూడా నల్లటి జుట్టు, మందమైన ఎర్రటి పెదాలు, సెక్సీ ప్రవర్తన కలిగివున్న కారణంగా జోలీతో పోలుస్తున్నారు. టాటూలు ఉండటం కూడా కారణం కావొచ్చు. దీనితో సరిపెట్టుకోకుండా మీడియాలో సృజనాత్మకత లేకపోవడం వలన కూడా తనను జోలీతో పోల్చుకుంటూనే ఉన్నారని ఫాక్స్ న్యూస్‌తో మేగాన్ తెలిపింది.Source: Yahoo! Telugu: Entertainment | 1 Aug 2009 | 11:50 am రెస్టారెంట్ ప్రారంభించనున్న బ్రిట్నీ స్పియర్స్!పాప్ రాణి బ్రిట్నీ స్పియర్స్ లాస్ ఏంజెలెస్‌లో ఓ ఫుడ్ రెస్టారెంట్‌ను ప్రారంభించాలనుకుంటుంది. ఈ ఫుడ్ రెస్టారెంట్‌ను ఆమె తండ్రి నడుపుతారు. ఈ టాక్సిక్ సింగర్ తండ్రి జేమీ స్పియర్స్ ఇప్పుడు ఆమె వ్యక్తిగత, వృత్తి వ్యవహారాలను కూడా పర్యవేక్షిస్తున్నారు. గత ఏడాది ఒక్కసారికి ప్రజాదరణ కోల్పోయిన స్పియర్స్ తన తండ్రి సాయం తీసుకోవాలని నిర్ణయించుకుంది.Source: Yahoo! Telugu: Entertainment | 1 Aug 2009 | 10:42 am ముంబై దాడుల్లో హఫీజ్ హస్తం: మంత్రి చిదంబరంగత యేడాది ముంబైపై ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ హస్తం ఉందని కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం ఆరోపించారు. ఇందుకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు తమ దర్యాప్తులో లభించాయన్నారు.Source: జాతీయ | 1 Aug 2009 | 8:21 am తెరాస రాష్ట్ర కార్యదర్శి పదవికి మహేందర్ గుడ్బైతెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) రాష్ట్ర కార్యదర్శి పదవికి ఆ పార్టీ సీనియర్ నేత మహేందర్ రెడ్డి రాజీనామా చేశారు. ఒకవైపు తెరాస అత్యవసర పోలిట్‌బ్యూరో సమావేశం జరుగుతుండగా, ఆయన తన రాజీనామా లేఖను పార్టీ కార్యాలయానికి పంపారు. ఈ సంఘటన తెరాసలో కలకలం సృష్టించింది.Source: ఏపీ న్యూస్ | 1 Aug 2009 | 7:50 am హిందుత్వపై పునరాలోచన లేదు: రాజ్‌నాథ్ సింగ్హిందుత్వ అజెండాపై పునరాలోచన చేసే ప్రసక్తే లేదని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. తమ పార్టీ మూల సిద్ధాంతాలైన హిందుత్వ, జాతీయ సాంస్కృతికతత్వంలపై మడమతిప్పబోమని ఆయన శనివారం బెంగుళూరులో తేల్చి చెప్పారు.Source: జాతీయ | 1 Aug 2009 | 7:45 am "వర్షం" భామ 'త్రిష' పర్సనల్ టచ్దక్షిణాది హీరోయిన్లలో అగ్రహీరోయిన్‌గా ముద్రవేసుకున్న పొడవుకాళ్ల సుందరి "త్రిష". దక్షిణాది చిత్రాల్లోనే గాకుండా ఉత్తరాదిలో అడుగు పెట్టిన త్రిష తాజాగా బాలీవుడ్ అవకాశం కొట్టేసింది. వర్షం, యువ, సైనికుడు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, నువొస్తానంటే.. నేనొద్దంటానా, అతడు, స్టాలిన్, కృష్ణ, పౌర్ణమి, కింగ్ వంటి చిత్రాల ద్వారా త్రిష టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్‌తో మళ్లీ "నమో వెంకటేశ" అనే చిత్రంలో నటిస్తోంది. మరోవైపు "వర్షం"లో విలన్‌గా నటించిన గోపిచంద్ సరసన "శంఖం" చిత్రంలోనూ హీరోయిన్ పాత్రను పోషిస్తోంది. కృష్ణన్, ఉమాకృష్ణన్ దంపతులకు పాలక్కాడులో పుట్టిన త్రిష, తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందింది. చెన్నైలో ఉన్నత విద్యను పూర్తి చేసిన త్రిష, మోడలింగ్ రంగంలోకి ప్రవేశించి 1999లో "మిస్ సేలం"గా నిలిచింది, అదే సంవత్సరంలో "మిస్ చెన్నై"గా కిరీటం దక్కించుకుంది. "2001 మిస్ ఇండియా మిస్ బ్యూటీఫుల్ స్మైల్"గానూ తన హవాను కొనసాగించింది.ఇంకా ఆమె పూర్తిపేరు: త్రిష కృష్ణన్, పుట్టినతేది: మే 4, 1983, జన్మస్థలం: పాలక్కాడు, కేరళ. తొలి తెలుగు సినిమా: వర్షం.Source: Yahoo! Telugu: Entertainment | 1 Aug 2009 | 7:13 am సీబీఐ విచారణ ఎదుర్కొనేందుకు సిద్ధం: బూటాసింగ్కేంద్ర నేర పరిశోధనా సంస్థ (సీబీఐ) చేపట్టే విచారణను ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్ ఛైర్మన్, కేంద్ర మాజీ మంత్రి బూటా సింగ్ స్పష్టం చేశారు. తన కుమారుడు సరబ్‌జ్యోత్ సింగ్ చేసిన నిర్వాకం వల్ల బూటాసింగ్ చిక్కుల్లో పడిన విషయం తెల్సిందే.Source: జాతీయ | 1 Aug 2009 | 6:03 am రైతులు ప్రత్యామ్నాయ పంటలకు సిద్ధం కావాలి: సీఎంరాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో ఆయన శనివారం కరువు పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేసం నిర్వహించారు.Source: ఏపీ న్యూస్ | 1 Aug 2009 | 5:58 am "నచ్చావులే" తనీష్ హీరోగా "మంచివాడు"ఆణిముత్యాల్లాంటి అందరూ మెచ్చి అభినందించిన పలు ఉత్తమ కథా చిత్రాల్ని అందించిన సూపర్‌గుడ్ ఫిలిమ్స్ సంస్థ సునీల్ కథానాయకుడిగా "అందాల రాముడు" వంటి హిట్ చిత్రాన్ని అందించిన యువ దర్శకుడు లక్ష్మీనారాయణ (దీప్తి)కి మరో అవకాశాన్ని ఇచ్చింది. నేటిమేటి యువకథానాయకుడు తనీష్ హీరోగా అందరూ మెచ్చే కథలో "మంచివాడు" అనే చిత్రాన్ని దీప్తి రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించిన సంగీత ముహూర్తం జూలై 31న సూపర్ గుడ్ థియేటర్‌లో జరిగింది.Source: Yahoo! Telugu: Entertainment | 1 Aug 2009 | 5:23 am సల్మాన్ గురించి చెప్పీ చెప్పీ విసుగెత్తింది: కత్రినా"మల్లీశ్వరి", "పిడుగు" వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించిన అందాల ముద్దుగుమ్మ, బాలీవుడ్ అగ్రహీరోయిన్ కత్రీనా కైఫ్. మోడలింగ్ ఫీల్డ్‌లో రాణించిన కత్రీనా.. బాలీవుడ్‌లో "బూమ్" చిత్రం ద్వారా రంగ ప్రవేశం చేసింది. విదేశాల నుంచి భారత్‌కు దిగుమతైన ఈ ఆసియా అందగత్తె 17 ఏళ్ల వయసులో లండన్ నుంచి ఇండియాకు వచ్చేశానని అంటోంది. తన చెల్లెలు ఇసబెల్లేకూడా తనతోనే ఉంటుందనీ, ఆమెకూడా అవకాశాల కోసం ఎదురుచూస్తుందని కత్రీనా చెప్పింది. మొన్ననే ఇక లండన్ వెళ్ళిపోదానమి చెల్లెలు తనతో చెప్పింది. అయితే ఇండియా వదిలి నువ్వెళితే వెళ్లు..! 4 లక్షలతో వచ్చిన తాను స్థిరపడానికి ఇండియానే కారణమని అందుకే రానని తేల్చిచెప్పానని కైఫ్ అంటోంది. ఇక సల్మాన్‌ఖాన్ గురించి మీడియాతో చెప్పి చెప్పి విసిగిపోయానని, నమ్మిన వారికి ప్రాణమిచ్చే వ్యక్తిత్వం ఆయనదని కితాబిచ్చింది.Source: Yahoo! Telugu: Entertainment | 1 Aug 2009 | 5:15 am "వర్షం" భామ 'త్రిష' పర్సనల్ టచ్దక్షిణాది హీరోయిన్లలో అగ్రహీరోయిన్‌గా ముద్రవేసుకున్న పొడవుకాళ్ల సుందరి "త్రిష". దక్షిణాది చిత్రాల్లోనే గాకుండా ఉత్తరాదిలో అడుగు పెట్టిన త్రిష తాజాగా బాలీవుడ్ అవకాశం కొట్టేసింది. వర్షం, యువ, సైనికుడు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, నువొస్తానంటే.. నేనొద్దంటానా, అతడు, స్టాలిన్, కృష్ణ, పౌర్ణమి, కింగ్ వంటి చిత్రాల ద్వారా త్రిష టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్‌తో మళ్లీ "నమో వెంకటేశ" అనే చిత్రంలో నటిస్తోంది. మరోవైపు "వర్షం"లో విలన్‌గా నటించిన గోపిచంద్ సరసన "శంఖం" చిత్రంలోనూ హీరోయిన్ పాత్రను పోషిస్తోంది. కృష్ణన్, ఉమాకృష్ణన్ దంపతులకు పాలక్కాడులో పుట్టిన త్రిష, తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందింది. చెన్నైలో ఉన్నత విద్యను పూర్తి చేసిన త్రిష, మోడలింగ్ రంగంలోకి ప్రవేశించి 1999లో "మిస్ సేలం"గా నిలిచింది, అదే సంవత్సరంలో "మిస్ చెన్నై"గా కిరీటం దక్కించుకుంది. "2001 మిస్ ఇండియా మిస్ బ్యూటీఫుల్ స్మైల్"గానూ తన హవాను కొనసాగించింది. ఇంకా ఆమె పూర్తిపేరు: త్రిష కృష్ణన్, పుట్టినతేది: మే 4, 1983, జన్మస్థలం: పాలక్కాడు, కేరళ. తొలి తెలుగు సినిమా: వర్షం.Source: వినోదం | 1 Aug 2009 | 4:44 am దేవేందర్ వ్యవహారంపై పెదవి విప్పని పీఆర్పీ నేతలుపార్టీ సీనియర్ నేత టి.దేవేందర్ వ్యవహారంపై ప్రజారాజ్యం పార్టీ నేతలు పెదవి విప్పడం లేదు. దేవేందర్ పార్టీకి రాజీనామా చేశారా లేక చేయబోతున్నారా అనే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు వారు నిరాకరిస్తున్నారు. ఇదిలావుండగా, శనివారం పార్టీ అధ్యక్షుడు చిరంజీవిని, ఆయన నివాసంలో దేవేందర్ కలుసుకున్నారు.Source: ఏపీ న్యూస్ | 1 Aug 2009 | 4:24 am చైనా-పాక్ దేశాల ముప్పుపై ప్రధాని సమీక్షపొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్ దేశాల నుంచి భవిష్యత్‌లో తలెత్తే ముప్పుపై ప్రధాని మన్మోహన్ సింగ్ శనివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర రక్షణ శాఖామంత్రి ఏకే.ఆంటోనీ, హోం శాఖ మంత్రి చిదంబరం, జాతీయ భద్రతా సలహాదారు నారాయణన్, విదేశాంగ నూతన కార్యదర్శి నిరుపమా రావు, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు.Source: జాతీయ | 1 Aug 2009 | 4:18 am ఏరికోరి వస్తే ఎవరు కాదంటారు: ధర్మపురితమ పార్టీలో చేరుతామని ఎవరైనా ముందుకు వస్తే ఎవరు కాదంటారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను, కీలక నేతలను ఆకర్షించాల్సిన అవసరం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు.Source: ఏపీ న్యూస్ | 1 Aug 2009 | 4:17 am సమ్మెను విరమించుకోండి.. లేదా చర్య తప్పదు: ప్రఫుల్దేశంలోని ప్రైవేట్ విమానయాన సంస్థలు వచ్చే 18వ తేదీ నుంచి చేపట్టదలచిన సమ్మెను విరమించుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి ప్రఫుల్ పటేల్ విజ్ఞప్తి చేశారు. అలాకానీ పక్షంలో చర్య తప్పదని ఆయన హెచ్చరించారు. సమస్యలను పరిష్కరించుకునేందుకు చర్చలకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.Source: జాతీయ | 1 Aug 2009 | 3:31 am
|