పాటిలో కాప్ కమ్యూనిటీ కాలేజ్ ప్రారంభం

మెదక్ జిల్లాలోని పాటిలో ఏర్పాటయిన కాప్ కమ్యూనిటీ కాలేజ్ ఆరు నెలల సర్టిఫికేట్ కోర్సులు, రెండేళ్ల అసోసియేట్ డిగ్రీ, ఏడాది డిగ్రీ కోర్సులను అందిస్తోంది. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (ఐజీఎన్ఓయూ) సహకారంతో కాప్ పౌండేషన్ పాటి గ్రామంలో ఏర్పాటు చేసిన కాప్ సెంటర్‌ను విశ్వవిద్యాలయ ఉపకులపతి లతా పిళ్లై ప్రారంభించారు.
Source: Yahoo! Telugu: News | 1 Aug 2009 | 10:43 am

రెస్టారెంట్ ప్రారంభించనున్న బ్రిట్నీ స్పియర్స్!

పాప్ రాణి బ్రిట్నీ స్పియర్స్ లాస్ ఏంజెలెస్‌లో ఓ ఫుడ్ రెస్టారెంట్‌ను ప్రారంభించాలనుకుంటుంది. ఈ ఫుడ్ రెస్టారెంట్‌ను ఆమె తండ్రి నడుపుతారు. ఈ టాక్సిక్ సింగర్ తండ్రి జేమీ స్పియర్స్ ఇప్పుడు ఆమె వ్యక్తిగత, వృత్తి వ్యవహారాలను కూడా పర్యవేక్షిస్తున్నారు. గత ఏడాది ఒక్కసారికి ప్రజాదరణ కోల్పోయిన స్పియర్స్ తన తండ్రి సాయం తీసుకోవాలని నిర్ణయించుకుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Aug 2009 | 10:42 am

ఓఎన్‌జీసీతో ఒప్పందం చేసుకున్న మిట్టల్

కజకిస్తాన్‌ సరిహద్దుల్లోని కాస్పియన్‌ సముద్రంలోని సత్పవేవ్‌ చమురు క్షేత్రంలో 25 శాతం వాటా కొనేందుకు ఉక్కు దిగ్గజం లక్ష్మీమిట్టల్‌ నేతృత్వలోని మిట్టల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ లిమిటెడ్‌, ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఆయిల్‌ అండ్‌ నాచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జిసి)లు ఒప్పందం చేసుకున్నాయి.
Source: Yahoo! Telugu: News | 1 Aug 2009 | 10:34 am

సమీప భవిష్యత్‌లో ఒబామా భారత పర్యటన

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సమీప భవిష్యత్‌లో భారత పర్యటనకు విచ్చేస్తారని వైట్‌హోస్ తెలిపింది. అయితే వచ్చే మూడు నెలల్లో మాత్రం ఆయన భారత్ పర్యటనకురారని స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు భారత్ పర్యటనకు ఎప్పుడైన వెళ్లవచ్చని వైట్‌హోస్ మీడియా కార్యదర్శి రాబర్ట్ గిబ్స్ తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 1 Aug 2009 | 10:12 am

దేవేందర్ వ్యవహారంపై పెదవి విప్పని పీఆర్పీ నేతలు

పార్టీ సీనియర్ నేత టి.దేవేందర్ వ్యవహారంపై ప్రజారాజ్యం పార్టీ నేతలు పెదవి విప్పడం లేదు. దేవేందర్ పార్టీకి రాజీనామా చేశారా లేక చేయబోతున్నారా అనే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు వారు నిరాకరిస్తున్నారు. ఇదిలావుండగా, శనివారం పార్టీ అధ్యక్షుడు చిరంజీవిని, ఆయన నివాసంలో దేవేందర్ కలుసుకున్నారు.
Source: Yahoo! Telugu: News | 1 Aug 2009 | 9:53 am

ప్రధాన నగరాల్లోని వస్తువుల మార్కెట్ల ధరలు

దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో గల మార్కెట్లలో వస్తువుల ధరలు... కోల్హాపూర్ మార్కెట్‌లో చక్కెర ధర (100 కేజీలు) - రూ. 2,367 గుంటూరు మార్కెట్‌లో ఎండుమిరపకాయలు (100 కేజీలు) - రూ. 5,854 హజీరాబాద్ మార్కెట్‌లో సహజవాయువు (1ఎంఎంబీటీయు) - రూ. 175.90 ముంబాయి మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ (1బీబీఎల్) - రూ. 3,345
Source: Yahoo! Telugu: News | 1 Aug 2009 | 9:48 am

చైనా-పాక్ దేశాల ముప్పుపై ప్రధాని సమీక్ష

పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్‌ దేశాల నుంచి భవిష్యత్‌లో తలెత్తే ముప్పుపై ప్రధాని మన్మోహన్ సింగ్ శనివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర రక్షణ శాఖామంత్రి ఏకే.ఆంటోనీ, హోం శాఖ మంత్రి చిదంబరం, జాతీయ భద్రతా సలహాదారు నారాయణన్‌, విదేశాంగ నూతన కార్యదర్శి నిరుపమా రావు, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు.
Source: Yahoo! Telugu: News | 1 Aug 2009 | 9:33 am

ఏరికోరి వస్తే ఎవరు కాదంటారు: ధర్మపురి

తమ పార్టీలో చేరుతామని ఎవరైనా ముందుకు వస్తే ఎవరు కాదంటారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను, కీలక నేతలను ఆకర్షించాల్సిన అవసరం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు.
Source: Yahoo! Telugu: News | 1 Aug 2009 | 9:24 am

తొలి త్రైమాసికంలో పెరిగిన ఎల్.వి.బి నికర ఆదాయం

ముఖ్యంగా, జూన్ 30వ తేదీతో ముగిసిన తొలి మూడు నెలల్లో బ్యాంకు నిరక ఆదాయం 22.66 కోట్ల రూపాయలుగా అర్జించినట్టు పేర్కొంది. గత సంవత్సరంలో ఇదే కాలానికి బ్యాంకు ఆదాయం రూ.4.28 కోట్లుగా ఉన్నట్టు ఆ సంస్థ శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
Source: Yahoo! Telugu: News | 1 Aug 2009 | 9:17 am

మయన్మార్ చేతుల్లోకి త్వరలో అణు బాంబు

ఉత్తర కొరియా, ఇరాక్ దేశాల వివాదాస్పద అణు కార్యక్రమాలపై సతమతమవుతున్న ప్రపంచ దేశాలకు మయన్మార్ కూడా తలనొప్పిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. నిరంకుశ మిలిటరీ జుంతా అధికారంలో ఉన్న మయన్మార్‌లో అణు బాంబు పరీక్షకు త్వరితగతిన సన్నాహాలు జరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Source: Yahoo! Telugu: News | 1 Aug 2009 | 9:14 am

సమ్మెను విరమించుకోండి.. లేదా చర్య తప్పదు: ప్రఫుల్

దేశంలోని ప్రైవేట్ విమానయాన సంస్థలు వచ్చే 18వ తేదీ నుంచి చేపట్టదలచిన సమ్మెను విరమించుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి ప్రఫుల్ పటేల్ విజ్ఞప్తి చేశారు. అలాకానీ పక్షంలో చర్య తప్పదని ఆయన హెచ్చరించారు. సమస్యలను పరిష్కరించుకునేందుకు చర్చలకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
Source: Yahoo! Telugu: News | 1 Aug 2009 | 9:00 am

"వర్షం" భామ 'త్రిష' పర్సనల్ టచ్

దక్షిణాది హీరోయిన్లలో అగ్రహీరోయిన్‌గా ముద్రవేసుకున్న పొడవుకాళ్ల సుందరి "త్రిష". దక్షిణాది చిత్రాల్లోనే గాకుండా ఉత్తరాదిలో అడుగు పెట్టిన త్రిష తాజాగా బాలీవుడ్ అవకాశం కొట్టేసింది. వర్షం, యువ, సైనికుడు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, నువొస్తానంటే.. నేనొద్దంటానా, అతడు, స్టాలిన్, కృష్ణ, పౌర్ణమి, కింగ్ వంటి చిత్రాల ద్వారా త్రిష టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్‌తో మళ్లీ "నమో వెంకటేశ" అనే చిత్రంలో నటిస్తోంది. మరోవైపు "వర్షం"లో విలన్‌గా నటించిన గోపిచంద్ సరసన "శంఖం" చిత్రంలోనూ హీరోయిన్‌ పాత్రను పోషిస్తోంది. కృష్ణన్, ఉమాకృష్ణన్ దంపతులకు పాలక్కాడులో పుట్టిన త్రిష, తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందింది. చెన్నైలో ఉన్నత విద్యను పూర్తి చేసిన త్రిష, మోడలింగ్ రంగంలోకి ప్రవేశించి 1999లో "మిస్ సేలం"గా నిలిచింది, అదే సంవత్సరంలో "మిస్ చెన్నై"గా కిరీటం దక్కించుకుంది. "2001 మిస్ ఇండియా మిస్ బ్యూటీఫుల్ స్మైల్‌"గానూ తన హవాను కొనసాగించింది.ఇంకా ఆమె పూర్తిపేరు: త్రిష కృష్ణన్, పుట్టినతేది: మే 4, 1983, జన్మస్థలం: పాలక్కాడు, కేరళ. తొలి తెలుగు సినిమా: వర్షం.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Aug 2009 | 7:13 am

"నచ్చావులే" తనీష్ హీరోగా "మంచివాడు"

ఆణిముత్యాల్లాంటి అందరూ మెచ్చి అభినందించిన పలు ఉత్తమ కథా చిత్రాల్ని అందించిన సూపర్‌గుడ్ ఫిలిమ్స్ సంస్థ సునీల్ కథానాయకుడిగా "అందాల రాముడు" వంటి హిట్ చిత్రాన్ని అందించిన యువ దర్శకుడు లక్ష్మీనారాయణ (దీప్తి)కి మరో అవకాశాన్ని ఇచ్చింది. నేటిమేటి యువకథానాయకుడు తనీష్ హీరోగా అందరూ మెచ్చే కథలో "మంచివాడు" అనే చిత్రాన్ని దీప్తి రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించిన సంగీత ముహూర్తం జూలై 31న సూపర్ గుడ్ థియేటర్‌లో జరిగింది.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Aug 2009 | 5:23 am

సల్మాన్ గురించి చెప్పీ చెప్పీ విసుగెత్తింది: కత్రినా

"మల్లీశ్వరి", "పిడుగు" వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించిన అందాల ముద్దుగుమ్మ, బాలీవుడ్ అగ్రహీరోయిన్ కత్రీనా కైఫ్. మోడలింగ్ ఫీల్డ్‌లో రాణించిన కత్రీనా.. బాలీవుడ్‌లో "బూమ్" చిత్రం ద్వారా రంగ ప్రవేశం చేసింది. విదేశాల నుంచి భారత్‌కు దిగుమతైన ఈ ఆసియా అందగత్తె 17 ఏళ్ల వయసులో లండన్ నుంచి ఇండియాకు వచ్చేశానని అంటోంది. తన చెల్లెలు ఇసబెల్లేకూడా తనతోనే ఉంటుందనీ, ఆమెకూడా అవకాశాల కోసం ఎదురుచూస్తుందని కత్రీనా చెప్పింది. మొన్ననే ఇక లండన్‌ వెళ్ళిపోదానమి చెల్లెలు తనతో చెప్పింది. అయితే ఇండియా వదిలి నువ్వెళితే వెళ్లు..! 4 లక్షలతో వచ్చిన తాను స్థిరపడానికి ఇండియానే కారణమని అందుకే రానని తేల్చిచెప్పానని కైఫ్ అంటోంది. ఇక సల్మాన్‌ఖాన్‌ గురించి మీడియాతో చెప్పి చెప్పి విసిగిపోయానని, నమ్మిన వారికి ప్రాణమిచ్చే వ్యక్తిత్వం ఆయనదని కితాబిచ్చింది.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Aug 2009 | 5:15 am

దేవేందర్ వ్యవహారంపై పెదవి విప్పని పీఆర్పీ నేతలు

పార్టీ సీనియర్ నేత టి.దేవేందర్ వ్యవహారంపై ప్రజారాజ్యం పార్టీ నేతలు పెదవి విప్పడం లేదు. దేవేందర్ పార్టీకి రాజీనామా చేశారా లేక చేయబోతున్నారా అనే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు వారు నిరాకరిస్తున్నారు. ఇదిలావుండగా, శనివారం పార్టీ అధ్యక్షుడు చిరంజీవిని, ఆయన నివాసంలో దేవేందర్ కలుసుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 1 Aug 2009 | 4:24 am

చైనా-పాక్ దేశాల ముప్పుపై ప్రధాని సమీక్ష

పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్‌ దేశాల నుంచి భవిష్యత్‌లో తలెత్తే ముప్పుపై ప్రధాని మన్మోహన్ సింగ్ శనివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర రక్షణ శాఖామంత్రి ఏకే.ఆంటోనీ, హోం శాఖ మంత్రి చిదంబరం, జాతీయ భద్రతా సలహాదారు నారాయణన్‌, విదేశాంగ నూతన కార్యదర్శి నిరుపమా రావు, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు.
Source: జాతీయ | 1 Aug 2009 | 4:18 am

ఏరికోరి వస్తే ఎవరు కాదంటారు: ధర్మపురి

తమ పార్టీలో చేరుతామని ఎవరైనా ముందుకు వస్తే ఎవరు కాదంటారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను, కీలక నేతలను ఆకర్షించాల్సిన అవసరం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 1 Aug 2009 | 4:17 am

సమ్మెను విరమించుకోండి.. లేదా చర్య తప్పదు: ప్రఫుల్

దేశంలోని ప్రైవేట్ విమానయాన సంస్థలు వచ్చే 18వ తేదీ నుంచి చేపట్టదలచిన సమ్మెను విరమించుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి ప్రఫుల్ పటేల్ విజ్ఞప్తి చేశారు. అలాకానీ పక్షంలో చర్య తప్పదని ఆయన హెచ్చరించారు. సమస్యలను పరిష్కరించుకునేందుకు చర్చలకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
Source: జాతీయ | 1 Aug 2009 | 3:31 am

రాములమ్మ ప్రాంతీయతపై ఆసక్తికర చర్చ!

మెదక్ లోక్‌సభ సభ్యురాలు, తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) సెక్రటరీ జనరల్, సినీ నటి విజయశాంతి ప్రాంతీయతపై ప్రస్తుతం రాష్ట్రంలో చర్చ ఆసక్తికరంగా సాగుతోంది. ముఖ్యంగా, వరంగల్ జిల్లా ఏటూరునాగారం, రామన్నగూడెం ప్రజల్లో ఇది మరింత చర్చనీయాంశంగా మారింది.
Source: ఏపీ న్యూస్ | 1 Aug 2009 | 1:58 am

బూటాసింగ్‌ను ప్రశ్నించనున్న సీబీఐ

ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్ ఛైర్మన్, మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బూటాసింగ్ చిక్కుల్లో పడ్డారు. ఆయన కుమారుడు చేసిన నిర్వాకంతో కేంద్ర నేర పరిశోధా సంస్థ (సీబీఐ) బూటాసింగ్‌ను విచారించాలని నిర్ణయించినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.
Source: జాతీయ | 1 Aug 2009 | 12:43 am

విదేశాంగ కార్యదర్శిగా నిరుపమ బాధ్యతల స్వీకారం

దేశ విదేశాంగ శాఖ కార్యదర్శిగా నిరుపమరావు శనివారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. భారత విదేశాంగ శాఖ కార్యదర్శిగా సేవలు అందిస్తున్న రెండో మహిళ నిరుపమ. ఇప్పటివరకు ఈ బాధ్యతలను శివశంకర్ మీనన్ నిర్వహించారు. ఆయన పదవీకాలం జులై 31తో ముగిసింది.
Source: జాతీయ | 1 Aug 2009 | 12:12 am

వ్యక్తిగతంగా నచ్చిన వ్యక్తి చిరంజీవి: గౌడ్

మెగాస్టార్ చిరంజీవి తనకు వ్యక్తిగతంగా నచ్చిన వ్యక్తి. ఆయనపై అపారమైన గౌరవం, మర్యాదలు ఉన్నాయని ప్రజారాజ్యం పార్టీ సీనియర్ నేత టి.దేవేందర్ గౌడ్ చెప్పారు. అలాగే, తాను పీఆర్పీకి రాజీనామా చేసినట్టు, రాజీనామా లేఖను కూడా సమర్పించినట్టు మీడియాలో వస్తున్న వార్తల్లో అణు మాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 1 Aug 2009 | 12:05 am

రాములమ్మపై వేటు తథ్యం: తెరాస వర్గాలు

తెలంగాణా రాష్ట్ర సమితి జనరల్ సెక్రటరీ, మెదక్ లోక్‌సభ సభ్యురాలు, సినీ నటి విజయశాంతి అలియాస్ రాములమ్మపై వేటు పడటం ఖాయమని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ అంశంపై ఆమెకు ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేశామని తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 31 Jul 2009 | 11:26 pm

దేవేందర్ గౌడ్‌ వ్యవహారంపై తెదేపాలో విభేదాలు!

తెలుగుదేశం పార్టీ మాజీ నేత, రాష్ట్ర మాజీ హోం మంత్రి, ప్రజారాజ్యం పార్టీ నేత తూళ్ళ దేవేందర్ గౌడ్‌కు ఆదిలోనే కష్టాలు ఆరంభమయ్యాయి. ప్రజారాజ్యం పార్టీని వీడి మాతృసంస్థకు వెళ్లాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నారు. తన రాజకీయ భవిష్యత్ కోసం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 31 Jul 2009 | 11:13 pm

సాధ్వి ప్రజ్ఞా సింగ్‌పై మోకా కేసు ఎత్తివేత

మాలేగావ్ బాంబు పేలుడు కేసుపై విచారణ జరుపుతున్న ప్రత్యేక కోర్టు శుక్రవారం సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ఎస్‌పీ పురోహిత్, ఇతర తొమ్మిది మంది నిందితులపై మోకా ఎత్తివేసింది. మాలేగావ్ పేలుడు కేసులో నిందితులపై మహారాష్ట్ర పోలీసులు మోకా ప్రయోగించిన సంగతి తెలిసిందే.
Source: జాతీయ | 31 Jul 2009 | 10:23 pm

రాజీనామా చేయాల్సిన అవసరం లేదు: బూటా

మాజీ కేంద్ర మంత్రి బూటా సింగ్ తన కుమారుడిపై వచ్చిన లంచం ఆరోపణలను తనపై జరిగిన కుట్రగా వ్యాఖ్యానించారు. మహారాష్ట్రకు చెందిన ఓ రాజకీయ పార్టీ ఈ వ్యవహారంతో తనను అప్రతిష్టపాలు చేసేందుకు కుట్రపన్నిందని ఆరోపించారు.
Source: జాతీయ | 31 Jul 2009 | 9:55 pm

మాస్‌వీరా.. మగధీరా.. అద్భుతం గదరా...!!!

చిత్రం: మగధీర- నటీనటులు: రామ్‌చరణ్, కాజల్ అగర్వాల్, డా. శ్రీహరి, దేవ్‌గిల్, శరత్‌బాబు తదితరులు.స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజమౌళి, పతాకం: గీతా ఆర్ట్స్,నిర్మాత: అల్లు అరవింద్,టేకింగ్, టెక్నికల్ వాల్యూస్‌తో పాటు కథలు కూడా పాశ్చాత్యబాట పడుతున్న తరుణంలో మన దేశానికి సంబంధించిన రాచరిక చరిత్రను తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకోవడం గొప్ప విషయం. స్టూడెంట్ నెం.1, యమదొంగ చిత్రాలతో ఎన్టీఆర్‌ను ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిన రాజమౌళి ఈసారి చిరంజీవి కుమారుడు రామ్‌చరణ్‌ను ఆ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. రాచరిక వ్యవస్థలో వీరోచిత పోరాటాలు, గగుర్పాటు కలిగించే విన్యాసాలు చాలా ఉంటాయి. రాజ్యం కోసం సర్వసైన్యాధ్యక్షుడు పణం అడ్డుగా పెడతాడు. అలా తరతరాలుగా రాజ్యం కోసం ప్రాణాలు అర్పించే శతధృవవంశీయునికి చెందిన కాలభైరవుడు (రామ్‌చరణ్). క్రీ.శ. 1609లో ఉదయ్‌ఘడ్ రాజ్యాన్ని ఎలా కాపాడి, చివరికి కాలాన్ని కూడా జయించి, 400 ఏళ్ళనాటి ప్రేమను ఈ జన్మలో ఎలా దక్కించుకున్నాడన్నదే "మగధీర" చిత్ర కథాంశం.
Source: Yahoo! Telugu: Entertainment | 31 Jul 2009 | 11:07 am

లాల్‌గఢ్‌లో మళ్ళీ ఘర్షణలు

పశ్చిమబెంగాల్‌లోని లాల్‌గఢ్‌లో మళ్ళీ ఘర్షణలు జరిగాయి. లాల్‌గఢ్‌ ప్రాతంలోని ధులగేరియా గ్రామంలో శుక్రవారం మావోయిస్టులకు, భద్రతా దళాలకు మధ్య భీకరమైన కాల్పులు జరిగాయి.
Source: జాతీయ | 31 Jul 2009 | 10:18 am

జెన్నిఫర్ ఆనిస్టన్ హాట్ ఫోటోలు నెట్‌లో హల్‌ఛల్!

హాలీవుడ్ నటి జెన్నిఫర్ ఆనిస్టన్ హాట్ ఫోటోలు నెట్లో షికార్లు చేస్తున్నాయి. దీంతో న్యూయార్క్ నెట్ సెంటర్లలో ఆమె అభిమానులు బారులు తీరారు. జెన్నిఫర్‌కు సంబంధించిన విత్ అవుట్ బ్రా ఫోటో నెట్లో దర్శనమిస్తోంది. దీంతో పాటు బిగుతుగా గల గ్రే కలర్ టాప్, ఖాకీ కలర్ షార్ట్స్‌తో జెన్నీకి చెందిన మరో హాట్ ఫోటో కూడా నెట్లో అభిమానులను కనువిందు చేస్తోందని న్యూయార్క్ పత్రికలు వెల్లడించాయి. మరోవైపు బట్లర్-ఆనిస్టన్‌ల మధ్య ప్రేమాయణం చిగురించిందని హాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
Source: Yahoo! Telugu: Entertainment | 31 Jul 2009 | 9:21 am

తెదేపా ఎమ్మెల్యే బెయిల్ పిటీషన్ వాయిదా

కేరళకు చెందిన విద్యార్థినులపై అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీకి చెందిన తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే టీవీ.రామారావు దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌ విచారణను ఏలూరు కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.
Source: ఏపీ న్యూస్ | 31 Jul 2009 | 8:22 am

కేంద్ర కేబినెట్ నుంచి రాజాను తప్పించాలి: భాజపా

ఒక కేసు వ్యవహారంలో న్యాయమూర్తికి ఫోన్ చేసి బెదిరించిన వ్యవహారంలో కేంద్ర మంత్రి ఏ.రాజాను మంత్రి వర్గం నుంచి తొలగించాలని ప్రతిపక్ష భాజపా, అన్నాడీఎంకే పార్టీలకు చెందిన ఎంపీలు డిమాండ్ చేశారు.
Source: జాతీయ | 31 Jul 2009 | 8:18 am

బాలీవుడ్‌లో గోళ్లు గిల్లుకుంటున్న అసిన్

హిందీ గజినీతో బాలీవుడ్ నిర్మాతల దృష్టిని ఆకర్షించిన అసిన్, ఆ తర్వాత అవకాశాలను బాగానే సాధించుకుంది. ఆ ఊపుతో టాలీవుడ్, కోలీవుడ్ నిర్మాతలు ఎంత పిలిచినా విననట్టు వదిలేసింది. పిలిచీ పిలిచీ విసుగెత్తిన టాలీవుడ్, కోలీవుడ్ సినీజనం మిన్నకున్నారు. ఇప్పుడేమో హిందీలో ఒప్పుకున్నవి కొన్ని ఆగిపోవడం... మరికొన్ని వాయిదా పడడంతో ఏం చేయాలో తోచక అక్కడ గోళ్లు గిల్లుకుంటూ కూచుందట. తమ పక్కింట్లో ఎవరైనా పిల్లలు ఖాళీగా ఉంటే వారితో పిల్లాటలు ఆడుకుంటోందట. ఇటీవల అసిన్‌ను పలుకరిద్దామని వెళ్లిన ఓ కోలీవుడ్ నిర్మాత ఆమె పరిస్థితి చూసి జాలిపడ్డాడట. అయితే అదేమీ పట్టించుకోని అసిన్ తాను బాలీవుడ్ సినిమాలతో బిజీగానే ఉన్నానని ఊకదంపుడు కబుర్లు చెప్పిందట. చివర్లో సదరు నిర్మాత బయలుదేరేముందు తను కోలీవుడ్, టాలీవుడ్ నిర్మాతల పిలుపుకోసం ఎదురు చూస్తున్నాని చెప్పమందట.
Source: Yahoo! Telugu: Entertainment | 31 Jul 2009 | 7:36 am

పార్టీ నన్ను ఉపయోగించుకోలేదు... అందుకే: కృష్ణంరాజు

ప్రజారాజ్యం పార్టీ తన సేవలను పార్టీ తగిన రీతిలో ఉపయోగించుకోలేదని కృష్ణంరాజు ఆరోపించారు. ప్రజారాజ్యం పార్టీకి ఆయన శుక్రవారం రాజీనామా చేసిన విషయం తెల్సిందే. దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన రాజీనామా లేఖను పార్టీ కార్యాలయానికి పంపుతున్నట్టు చెప్పారు. పార్టీలో ఎవరిపైనా తనకు అసంతృప్తి లేదన్నారు.
Source: ఏపీ న్యూస్ | 31 Jul 2009 | 7:27 am

సామాజిక న్యాయమే తమ పార్టీ పునాదులు: కత్తి

తమ పార్టీకి సమాజిక న్యాయమే పునాదులని ప్రజారాజ్యం పార్టీ నేత కత్తిపద్మారావు అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తమ పార్టీని దెబ్బతీయలేరని ఆయన జోస్యం చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 31 Jul 2009 | 7:25 am

"మడోన్నా" బాడీ బిల్డర్ కాదంటే నమ్మండి!

పాప్ సామ్రాజ్యాన్ని రాణిగా ఏలుతున్న మడోన్నా బాడీ బిల్డర్ ఫోటోలు వెబ్‌సైట్లలో దర్శనమిస్తున్నాయి. ఇటీవలి కాలంలో మడోన్నా ఎక్కువగా జిమ్‌కు వెళ్తుండటంతో సరదాగా ఇలాంటి బొమ్మలు నెట్‌లో ప్రత్యక్షమయ్యాయి. "మెటీరియల్ గర్ల్" హిట్ మేకర్ మడోన్నా బాడీబిల్డర్ ఫోటోలపై ఆమె వ్యక్తిగత ప్రతినిధి మాట్లాడుతూ.. పాప్ గాయని మడోన్నాకు ఆ ఫోటోలకు ఎలాంటి సంబంధాలు లేవని కొట్టిపారేశారు. అసలు ఆ ఫోటోలు మడోన్నావే కావని తేల్చి చెప్పేశారు. మడోన్నా ఫోటోలను ఫోటో షాప్‌లో ఎడిట్ చేసి, వాటిని వెబ్‌సైట్లలో పెడుతున్నారని మడోన్నా వ్యక్తిగత ప్రతినిధి కాంటాక్ట్ మ్యూజిక్‌తో తెలిపినట్లు గాసిప్‌కాప్‌.డాట్.కామ్ వెల్లడించింది.
Source: Yahoo! Telugu: Entertainment | 31 Jul 2009 | 7:11 am

హింసాత్మక వాతావరణంలో చర్చలు అసాధ్యం: కృష్ణ

హింసాత్మక వాతావరణంలో భారత్-పాకిస్థాన్‌ దేశాల మధ్య సమగ్ర చర్చలకు సాధ్యంకాదని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణ స్పష్టం చేశారు. ఇదే అంశాన్ని ఇండో-పాక్ సంయుక్త ప్రకటనలో కూడా స్పష్టంగా పేర్కొన్నట్టు మంత్రి శుక్రవారం రాజ్యసభకు వివరించారు.
Source: జాతీయ | 31 Jul 2009 | 6:27 am

ఐర్లండ్‌ ద్వీపంలో నా హనీమూన్‌: గోపిక

"మా ఆయన ఐర్లాండ్‌లో వైద్యుడు. పెళ్లి అయిన తర్వాతహనీమూన్‌కు అక్కడ ఓ ద్వీపంలో వారం రోజులుగడిపాం" అని నటి గోపిక చెబుతోంది. నా ఆటోగ్రాఫ్‌, వీధి చిత్రాల్లోనటించిన గోపిక తమిళంలో పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్‌కోసం కేరళ వచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... "పెళ్లి కుదిరే వరకు నేను నటినన్న విషయం ఆయనకు తెలీదు. తెలిశాక పెళ్లయ్యాక్కూడా నటించమని చెప్పారు. ప్రస్తుతం రెండు మలయాళ చిత్రాలు చేస్తున్నా. అవి పూర్తయ్యాక ఐర్లాండ్‌ వెళతాను. మళ్ళీ అవకాశాలొస్తే తిరిగి వస్తాన"ని చెబుతోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 31 Jul 2009 | 6:03 am

మాస్‌వీరా.. మగధీరా.. అద్భుతం గదరా...!!!

చిత్రం: మగధీర- నటీనటులు: రామ్‌చరణ్, కాజల్ అగర్వాల్, డా. శ్రీహరి, దేవ్‌గిల్, శరత్‌బాబు తదితరులు. స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజమౌళి, పతాకం: గీతా ఆర్ట్స్, నిర్మాత: అల్లు అరవింద్, టేకింగ్, టెక్నికల్ వాల్యూస్‌తో పాటు కథలు కూడా పాశ్చాత్యబాట పడుతున్న తరుణంలో మన దేశానికి సంబంధించిన రాచరిక చరిత్రను తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకోవడం గొప్ప విషయం. స్టూడెంట్ నెం.1, యమదొంగ చిత్రాలతో ఎన్టీఆర్‌ను ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిన రాజమౌళి...
Source: వినోదం | 31 Jul 2009 | 5:56 am

"అష్టాచమ్మా"కు అరుదైన గౌరవం

నాని, కలర్స్ స్వాతి హీరోహీరోయిన్లుగా నటించిన "అష్టాచమ్మా" సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రామ్‌మోహన్ నిర్మించిన "అష్టాచమ్మా" చిన్న చిత్రాల్లో పెద్ద విజయం సాధించింది. ఇందులో భాగంగా.. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బి) నిర్వహించే ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ కోర్సు విద్యార్థుల కేస్ స్టడీ కోసం అష్టాచమ్మా చిత్రాన్ని ఎంపిక చేశారు. ఒక తెలుగు చిత్రానికి బిజినెస్ స్కూలులో విద్యాత్మక గౌరవం దక్కడం ఇదే తొలిసారి అని చిత్ర నిర్మాత రామ్‌మోహన్ అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 31 Jul 2009 | 5:15 am

సాహసకృత్యాల మేళవింపు "మొదలియార్‌కుప్పం"

నీటి ఉపరితలాన్ని చీల్చుకుని ముందుకు దూసుకెళ్తుండే పడవలు సందర్శకులకు ఓ వింత అనుభూతిని పంచిపెడుతున్న ప్రాంతమే "మొదలియార్‌కుప్పం". చిన్న బోటుకు కట్టిన తాడు సహాయంతో సుమారు రెండు వందల అడుగుల ఎత్తుకు రివ్వున ఆకాశంలోకి దూసుకెళ్లే "వాటర్ పారా సైలింగ్" జలక్రీడను ఇక్కడి ప్రత్యేకతగా చెప్పవచ్చు.
Source: వినోదం | 31 Jul 2009 | 4:23 am

అన్ని రంగాల్లో విఫలమైన ప్రభుత్వం: వెంకయ్య

రాష్ట్రంలోని వైఎస్ సర్కారు అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడు ఆరోపించారు. ముఖ్యంగా నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలను నియంత్రించడంలో ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు.
Source: ఏపీ న్యూస్ | 31 Jul 2009 | 4:03 am

నన్ను అవమానించేందుకే కుట్ర: బూటాసింగ్

తన రాజకీయ, వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొన్ని రాజకీయ శక్తులు తనపై కక్ష కట్టాయని ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్ ఛైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బూటాసింగ్ ఆరోపించారు. అందుకే తన కుమారుడిని లంచం కేసులో ఇరికించి, అరెస్టు చేయించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Source: జాతీయ | 31 Jul 2009 | 3:37 am