లాభాలబాటలో మహింద్రా అండ్ మహింద్రా

ట్రాక్టర్ల నిర్మాణ రంగంలో అగ్రగామిగానున్న దేశీయ వాహన నిర్మాణ కంపెనీ మహింద్రా అండ్ మహింద్రా(ఎమ్అండ్ఎమ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికాంతానికి 152శాతం లాభాలు పొందింది. దీంతో కంపెనీ నికర ఆదాయం రూ. 401కోట్లకు చేరుకుంది.
Source: Yahoo! Telugu: News | 31 Jul 2009 | 9:51 am

లాభాల్లో కొనసాగుతున్న సెన్సెక్స్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం లాభాల్లో కొనసాగుతుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 277 పాయింట్లు పుంజుకుని 15,665 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 79 పాయింట్లు లాభపడి 4,650 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 1.80 శాతం, నిఫ్టీ 1.73 శాతం చొప్పున వృద్ధి చెందాయి.
Source: Yahoo! Telugu: News | 31 Jul 2009 | 9:34 am

అన్ని రంగాల్లో విఫలమైన ప్రభుత్వం: వెంకయ్య

రాష్ట్రంలోని వైఎస్ సర్కారు అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడు ఆరోపించారు. ముఖ్యంగా నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలను నియంత్రించడంలో ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు.
Source: Yahoo! Telugu: News | 31 Jul 2009 | 9:31 am

డీఎల్ఎఫ్ లాభాల్లో 79శాతం తగ్గుదల

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలిత్రైమాసికాంతానికి రియాల్టీ కంపెనీ డీఎల్ఎఫ్‌కు నికర లాభాలలో 79శాతం తగ్గినట్లు కంపెనీ బొంబాయి స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌కు తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 31 Jul 2009 | 9:22 am

లాడెన్ పాకిస్థాన్‌లో తలదాచుకోవడం లేదు

అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ పాకిస్థాన్‌లో తలదాచుకుంటున్నాడని వస్తున్న ఆరోపణలను ఆ దేశ మంత్రి ఒకరు తోసిపుచ్చారు. పాకిస్థాన్- ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో లాడెన్ ఉంటున్నాడని అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు భావిస్తున్న సంగతి తెలిసిందే.
Source: Yahoo! Telugu: News | 31 Jul 2009 | 9:16 am

నన్ను అవమానించేందుకే కుట్ర: బూటాసింగ్

తన రాజకీయ, వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొన్ని రాజకీయ శక్తులు తనపై కక్ష కట్టాయని ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్ ఛైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బూటాసింగ్ ఆరోపించారు. అందుకే తన కుమారుడిని లంచం కేసులో ఇరికించి, అరెస్టు చేయించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Source: Yahoo! Telugu: News | 31 Jul 2009 | 9:06 am

256 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్

స్టాక్ మార్కెట్ 256 పాయింట్లు లాభపడటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 15,644 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 57 పాయింట్లు పుంజుకుని 4,629 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 1.66 శాతం, నిఫ్టీ 1.25 శాతం మేరకు వృద్ధి చెందాయి. ఇప్పటి వరకు మొత్తం 2,705 కంపెనీల వాటాలు ట్రేడ్ అవగా, 1,469 కంపెనీల వాటాలు లాభపడ్డాయి.
Source: Yahoo! Telugu: News | 31 Jul 2009 | 8:21 am

లాభాలతో పుంజుకుంటున్న సెన్సెక్స్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం లాభాల్లో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ 274 పాయింట్లు బలపడి 15,662 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 76 పాయింట్లు పుంజుకుని 4,648 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 1.78 శాతం, నిఫ్టీ 1.67 శాతం మేరకు వృద్ధి చెందాయి. ఇప్పటి వరకు మొత్తం 2,705 కంపెనీల వాటాలు ట్రేడ్ అవగా, 1,469 కంపెనీల వాటాలు లాభపడగా.. 1,126 కంపెనీల వాటాలు నష్టాల్లో ఉన్నాయి.
Source: Yahoo! Telugu: News | 31 Jul 2009 | 8:11 am

సూకీ కేసుపై తీర్పు ఆగస్టు 11కి వాయిదా

మయన్మార్ ప్రతిపక్ష నేత అంగ్ సాన్ సూకీ ఎదుర్కొంటున్న కోర్టు విచారణ ఇటీవల ముగిసింది. ఆమె కేసులో తీర్పు శుక్రవారం వెలువడాల్సివుంది. అయితే ఈ కేసులో కోర్టు తీర్పు ఆగస్టు 11న వెలువడే అవకాశం ఉందని ప్రభుత్వాధికారులు తెలిపారు. కోర్టు విచారణ ఎందుకు వాయిదా పడిందో కారణాలు అధికారులెవరూ వెల్లడించలేదు.
Source: Yahoo! Telugu: News | 31 Jul 2009 | 7:56 am

భారతీ-ఎంటీఎన్ఎల్ ఒప్పందం ఖరారు కాలేదు

భారతీ ఎయిర్‌టెల్ మరియు దక్షిణాఫ్రికాకు చెందిన ఎంటీఎన్‌ల మధ్య పూర్తి విలీనం చేయడానికి జరుగుతున్న చర్చలు ఇంకా ఖరారు కాలేదని కార్పొరేట్ వ్యవహారాల మంత్రి సల్మాన్ ఖుర్షీద్ వెల్లడించారు. త్వరలోనే ఈ ఒప్పందం తుది రూపం దాల్చుతుందని లేదా ఇరు కంపెనీల సంతకాలు చేస్తాయని ఆయన తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 31 Jul 2009 | 7:44 am

బాలీవుడ్‌లో గోళ్లు గిల్లుకుంటున్న అసిన్

హిందీ గజినీతో బాలీవుడ్ నిర్మాతల దృష్టిని ఆకర్షించిన అసిన్, ఆ తర్వాత అవకాశాలను బాగానే సాధించుకుంది. ఆ ఊపుతో టాలీవుడ్, కోలీవుడ్ నిర్మాతలు ఎంత పిలిచినా విననట్టు వదిలేసింది. పిలిచీ పిలిచీ విసుగెత్తిన టాలీవుడ్, కోలీవుడ్ సినీజనం మిన్నకున్నారు. ఇప్పుడేమో హిందీలో ఒప్పుకున్నవి కొన్ని ఆగిపోవడం... మరికొన్ని వాయిదా పడడంతో ఏం చేయాలో తోచక అక్కడ గోళ్లు గిల్లుకుంటూ కూచుందట. తమ పక్కింట్లో ఎవరైనా పిల్లలు ఖాళీగా ఉంటే వారితో పిల్లాటలు ఆడుకుంటోందట. ఇటీవల అసిన్‌ను పలుకరిద్దామని వెళ్లిన ఓ కోలీవుడ్ నిర్మాత ఆమె పరిస్థితి చూసి జాలిపడ్డాడట. అయితే అదేమీ పట్టించుకోని అసిన్ తాను బాలీవుడ్ సినిమాలతో బిజీగానే ఉన్నానని ఊకదంపుడు కబుర్లు చెప్పిందట. చివర్లో సదరు నిర్మాత బయలుదేరేముందు తను కోలీవుడ్, టాలీవుడ్ నిర్మాతల పిలుపుకోసం ఎదురు చూస్తున్నాని చెప్పమందట.
Source: Yahoo! Telugu: Entertainment | 31 Jul 2009 | 7:36 am

"మడోన్నా" బాడీ బిల్డర్ కాదంటే నమ్మండి!

పాప్ సామ్రాజ్యాన్ని రాణిగా ఏలుతున్న మడోన్నా బాడీ బిల్డర్ ఫోటోలు వెబ్‌సైట్లలో దర్శనమిస్తున్నాయి. ఇటీవలి కాలంలో మడోన్నా ఎక్కువగా జిమ్‌కు వెళ్తుండటంతో సరదాగా ఇలాంటి బొమ్మలు నెట్‌లో ప్రత్యక్షమయ్యాయి. "మెటీరియల్ గర్ల్" హిట్ మేకర్ మడోన్నా బాడీబిల్డర్ ఫోటోలపై ఆమె వ్యక్తిగత ప్రతినిధి మాట్లాడుతూ.. పాప్ గాయని మడోన్నాకు ఆ ఫోటోలకు ఎలాంటి సంబంధాలు లేవని కొట్టిపారేశారు. అసలు ఆ ఫోటోలు మడోన్నావే కావని తేల్చి చెప్పేశారు. మడోన్నా ఫోటోలను ఫోటో షాప్‌లో ఎడిట్ చేసి, వాటిని వెబ్‌సైట్లలో పెడుతున్నారని మడోన్నా వ్యక్తిగత ప్రతినిధి కాంటాక్ట్ మ్యూజిక్‌తో తెలిపినట్లు గాసిప్‌కాప్‌.డాట్.కామ్ వెల్లడించింది.
Source: Yahoo! Telugu: Entertainment | 31 Jul 2009 | 7:11 am

ఐర్లండ్‌ ద్వీపంలో నా హనీమూన్‌: గోపిక

"మా ఆయన ఐర్లాండ్‌లో వైద్యుడు. పెళ్లి అయిన తర్వాతహనీమూన్‌కు అక్కడ ఓ ద్వీపంలో వారం రోజులుగడిపాం" అని నటి గోపిక చెబుతోంది. నా ఆటోగ్రాఫ్‌, వీధి చిత్రాల్లోనటించిన గోపిక తమిళంలో పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్‌కోసం కేరళ వచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... "పెళ్లి కుదిరే వరకు నేను నటినన్న విషయం ఆయనకు తెలీదు. తెలిశాక పెళ్లయ్యాక్కూడా నటించమని చెప్పారు. ప్రస్తుతం రెండు మలయాళ చిత్రాలు చేస్తున్నా. అవి పూర్తయ్యాక ఐర్లాండ్‌ వెళతాను. మళ్ళీ అవకాశాలొస్తే తిరిగి వస్తాన"ని చెబుతోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 31 Jul 2009 | 6:03 am

"అష్టాచమ్మా"కు అరుదైన గౌరవం

నాని, కలర్స్ స్వాతి హీరోహీరోయిన్లుగా నటించిన "అష్టాచమ్మా" సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రామ్‌మోహన్ నిర్మించిన "అష్టాచమ్మా" చిన్న చిత్రాల్లో పెద్ద విజయం సాధించింది. ఇందులో భాగంగా.. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బి) నిర్వహించే ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ కోర్సు విద్యార్థుల కేస్ స్టడీ కోసం అష్టాచమ్మా చిత్రాన్ని ఎంపిక చేశారు. ఒక తెలుగు చిత్రానికి బిజినెస్ స్కూలులో విద్యాత్మక గౌరవం దక్కడం ఇదే తొలిసారి అని చిత్ర నిర్మాత రామ్‌మోహన్ అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 31 Jul 2009 | 5:15 am

అన్ని రంగాల్లో విఫలమైన ప్రభుత్వం: వెంకయ్య

రాష్ట్రంలోని వైఎస్ సర్కారు అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడు ఆరోపించారు. ముఖ్యంగా నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలను నియంత్రించడంలో ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు.
Source: ఏపీ న్యూస్ | 31 Jul 2009 | 4:03 am

నన్ను అవమానించేందుకే కుట్ర: బూటాసింగ్

తన రాజకీయ, వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొన్ని రాజకీయ శక్తులు తనపై కక్ష కట్టాయని ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్ ఛైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బూటాసింగ్ ఆరోపించారు. అందుకే తన కుమారుడిని లంచం కేసులో ఇరికించి, అరెస్టు చేయించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Source: జాతీయ | 31 Jul 2009 | 3:37 am

చిరులో నాయకత్వ లక్షణాలు లేవు: కృష్ణంరాజు

ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిలో నాయకత్వ లక్షణాలు లేవని ఆ పార్టీ నేత, సినీ నటుడు కృష్ణంరాజు ఆరోపించారు. ముఖ్యంగా, తన సేవలను పార్టీ తగినరీతిలో ఉపయోగించుకోలేదని ఆయన ఆరోపించారు. ప్రజారాజ్యం పార్టీకి ఆయన శుక్రవారం రాజీనామా చేసిన విషయం తెల్సిందే.
Source: ఏపీ న్యూస్ | 31 Jul 2009 | 2:25 am

ఛైర్మన్ పీఠం నుంచి బూటాసింగ్‌ను తప్పించాలి: భాజపా

ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్ ఛైర్మన్ పదవి నుంచి బూటాసింగ్‌ను తక్షణం తప్పించాలని ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. జాతీయ కమిషన్‌ను అడ్డుపెట్టుకుని బహిరంగంగా లంచాలు వసూలు చేస్తున్నారంటూ ఆ పార్టీ నేతలు ఆరోపించారు.
Source: జాతీయ | 31 Jul 2009 | 2:07 am

మహిళలపై దాడులు అరికడతాం: మంత్రి సబితా రెడ్డి

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న యాసిడ్ దాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం జరిగిన అసెంబ్లీ శాసన సభ సమావేశాల్లో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 31 Jul 2009 | 1:55 am

ముఖ్యమంత్రిగా తిరిగి బాధ్యతలు చేపట్టిన ఒమర్

జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా శుక్రవారం తిరిగి బాధ్యతలు చేపట్టారు. ఆయన చేసిన రాజీనామాను ఆ రాష్ట్ర గవర్నర్ ఎన్.ఎన్.వోహ్రా తిరస్కరించడంతో ఒమర్ తిరిగి ముఖ్యమంత్రి కార్యాలయానికి రాక తప్పలేదు.
Source: జాతీయ | 31 Jul 2009 | 12:10 am

బూటాసింగ్ కుమారుడుని అరెస్టు చేసిన ఏసీబీ

జాతీయ షెడ్యూల్ కులాలు, తెగల కమిషన్ ఛైర్మన్ బూటాసింగ్ కుమారుడు సరబ్జీత్ సింగ్‌ అలియాస్ స్వీటీని అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. ఎస్టీఎస్టీ కేసు నుంచి ఒక కాంట్రాక్టరును విముక్తుడిని చేసేందుకు కోటి రూపాయల లంచాన్ని డిమాండ్ చేశాడన్న ఆరోపణలపై స్వీటీని అరెస్టు చేసినట్టు ఏసీబీ తెలిపింది.
Source: జాతీయ | 31 Jul 2009 | 12:00 am

ప్రజారాజ్యానికి నటుడు కృష్ణంరాజు గుడ్‌బై

ప్రజారాజ్యం పార్టీకి సినీ నటుడు కృష్ణంరాజు గుడ్‌బై చెప్పారు. తన రాజీనామా లేఖను పార్టీ ప్రధాన కార్యాలయానికి పంపారు. తన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై సన్నిహితులతో సమావేశమై చర్చించిన పిదపే తుది నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు.
Source: ఏపీ న్యూస్ | 30 Jul 2009 | 11:36 pm

అభివృద్ధిలో చిన్న పరిశ్రమల పాత్ర కీలకం: వైఎస్

రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో చిన్న పరిశ్రమల పాత్ర అత్యంత కీలమమని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి అభిప్రాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్లలో ఎపీఐఐసీ 350 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ఏరోస్పేస్‌ పార్కులో సమూహా ఇంజనీరింగ్‌ ఇండస్ట్రీస్‌ పేరుతో పలు చిన్న పరిశ్రములు రూ.1500 కోట్ల పెట్టుబడితో ముందుకు రావడం అభినందనీయమని ముఖ్యమంత్రి వైఎస్‌ వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 30 Jul 2009 | 11:17 pm

గుజ్జర్ల బిల్లుకు రాజస్థాన్ గవర్నర్ ఆమోదం

గుజ్జర్లకు ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును రాజస్థాన్ గవర్నర్ ఎస్‌కే కృష్ణ గురువారం రాత్రి ఆమోదించారు. దీనికి సంబంధించిన బిల్లు గుజ్జర్లతోపాటు, మరో మూడు సామాజిక వర్గాలకు ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తుంది. అగ్ర కులాల్లోని పేదలకు కూడా 14 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాజస్థాన్ ప్రభుత్వం తాజా బిల్లును రూపొందించింది.
Source: జాతీయ | 30 Jul 2009 | 10:12 pm

ప్రభుత్వ వివరణపై ప్రతిపక్షాల తీవ్ర అసంతృప్తి

ఇటీవల ఈజిప్టు పర్యటన సందర్భంగా భారత్, పాకిస్థాన్ ప్రధానమంత్రుల విడుదల చేసిన సంయుక్త ప్రకటన పార్లమెంట్‌ను కుదిపేసింది. గత రెండు రోజులుగా పార్లమెంట్‌లో భారత్- పాక్ సంయుక్త ప్రకటనపై పెద్దఎత్తున రసాబాస జరిగింది. ప్రభుత్వం ఈ సంయుక్త ప్రకటనను గట్టిగా సమర్థించుకుంటూ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు మద్దతుగా నిలిచింది.
Source: జాతీయ | 30 Jul 2009 | 9:40 pm

మెగాస్టార్ ఇంటిపైకి దుమికిన ఆడ తోడేలు..?!!

దేశంలో మరో వదంతి బయలుదేరింది. కనిపించన పెద్ద ఆడ తోడేలు ఒకటి దేశంలో సంచరిస్తోందనీ, అది కొన్ని కట్టడాలపైకి దుముకి వాటిలోకి చొరబడేందుకు యత్నిస్తోందన్న వదంతులు బయలుదేరాయి. ఈ ఆడ తోడేలు కాలి ముద్రలతో కూడిన ఆనవాళ్లు చెన్నైలోని సెంట్రల్ స్టేషన్, ఆగ్రాలోని కుతుబ్ మినార్, ముంబయిలోని గేట్ వే ఆఫ్ ఇండియాపై కనిపించాయట. ఇదిలావుంటే ఈ తోడేలు తన దృష్టిని కట్టడాలపై నుంచి సెలబ్రిటీల గృహాలపై మరల్చినట్లు వదంతులు వినబడుతున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఇంటిపైకి దూకి ఎలాగైనా ఇంట్లో చొరబడటానికి ప్రయత్నం చేసిందట. అది అలా ప్రయత్నించినట్లు తెలిపే కాలి ముద్ర చిరు ఇంటిపై ఉండటాన్ని తాము చూశామని కొందరు చెపుతున్నారట.
Source: Yahoo! Telugu: Entertainment | 30 Jul 2009 | 3:21 pm

కత్రినా జాతకమేంటో తెలుసా...!

అందంతోపాటు చలాకీతనంతో బాలీవుడ్‌ను తన వశం చేసుకున్న ఓ విదేశీ వనిత... హీరోయినై ప్రజల మనసును దోచుకుంటున్న ఆ సుందరాంగి... ఎవరో తెలుసా... ఆమే కత్రినా కైఫ్. చూపు మరల్చుకోలేని అందం ఆమె సొంతం. కత్రినా కైఫ్ 16 జులై 1984 సాయంత్రం గం 6.30లకు హాంగ్‌కాంగ్‌లో పుట్టింది. సోమవారంనాడు పుట్టిన ఈమె జన్మకుండలి ఓసారి పరిశీలిస్తే...వృశ్చికలగ్నం కుంభరాశిలో జన్మించింది.
Source: Yahoo! Telugu: Entertainment | 30 Jul 2009 | 12:48 pm

గ్రీకువీరుడితో డేటింగ్‌కు మేగాన్ ఫాక్స్ సిద్ధం!

ఫైర్ ఫైటర్లు, నటులతో డేటింగ్ చేసిన అనుభవం ఉన్న హాలీవుడ్ నటీమణి, మాజీ మోడల్ మేగన్ ఫాక్స్ ఇప్పుడు గ్రీకువీరుడితో ప్రేమాయణం సాగించాలని ఆరాటపడుతోంది. 23 ఏళ్ల ఈ హాలీవుడ్ సుందరికి ఒంటరిగా ఉండటమంటే భయమట. బ్రియాన్ ఆస్టిన్ గ్రీన్‌తో తెగతెంపులు చేసుకొన్న ఈమె ఇప్పుడు ఒంటరిగానే ఉంటుంది. ఒంటరితనం భయపెట్టిందో? ఏమో? ఈసారి డేటింగ్‌కు ఓ గ్రీకు కుర్రాడిని వెతుక్కోవాలని మేగాన్ భావిస్తున్నట్లు డైలీస్టార్.కో.యూకే వెబ్‌సైట్ వెల్లడించింది.
Source: Yahoo! Telugu: Entertainment | 30 Jul 2009 | 12:46 pm

నీతూ చంద్ర ఏం కోరుకుంటోంది?

ప్రముఖ బాలీవుడ్ నటి నీతూ చంద్ర గతంలో నటించిన చిత్రాలలో అంతగా పేరు ప్రఖ్యాతలు రాలేదు. అదే బికినీ ధరించి ఫోటోలు తీయించుకోవడంతో ఒక్కసారిగా ఆమె వార్తలలో వ్యక్తిగా నిలబడింది. దీంతో మళ్ళీ ప్రజల కళ్ళల్లో పడింది. సమలైంగిక పరమైన ఫోజులిచ్చి ఫోటోలు తీయించుకోవడంతో బాలీవుడ్ నిర్మాతలు, దర్శకుల కళ్ళు ఆమెపై పడ్డాయి. కురచ దుస్తులు ధరించడంలో ఆమెకు ఆమే సాటి అని బాలీవుడ్ కోడై కూస్తోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 30 Jul 2009 | 12:07 pm

"ప్రియమణి" హీరోయిన్‌గా కుమార్ బ్రదర్స్ సినిమా!

ఓ వైపు గ్లామరస్ రోల్స్‌తో ప్రేక్షకుల ఆదరణ పొందుతూ, మరోవైపు విలక్షణ నటనతో ప్రభుత్వ అవార్డులను గెలుచుకుంటోన్న జాతీయ ఉత్తమనటి అవార్డు గ్రహీత ప్రియమణి ప్రధాన పాత్రలో త్వరలో ఓ భారీ చిత్రం ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని కె.బి.సి. పతాకంపై కుమార్ బ్రదర్స్ నిర్మిస్తుండగా.. ఈ సినిమా ద్వారా కార్తికేయ గోపాలకృష్ణ దర్శకుడిగా పరిచయం కానున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 30 Jul 2009 | 11:38 am

ఆగస్టు 12న తెరపైకి వస్తోన్న "ఆంజనేయులు"

క్రేజీస్టార్ రవితేజ, అందాలతార నయనతార హీరోహీరోయిన్లుగా "యువత" ఫేమ్ పరుశురామ్ (బుజ్జి) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న "ఆంజనేయులు" సినిమా ఆగస్టు 12వ తేదీన తెరపైకి రానుంది. పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై నటుడు గణేష్‌బాబు నిర్మిస్తోన్న ఈ భారీ చిత్రం చివరి పాట చిత్రీకరణలో ఉంది. ఈ సందర్భంగా నిర్మాత గణేష్ బాబు మాట్లాడుతూ.. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఆంజనేయులు ఆడియోను సూపర్‌హిట్ చేసిన శ్రోతలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆగస్టు 12న "ఆంజనేయులు" చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచేలా "ఆంజనేయులు" రూపుదిద్దుకున్నాడని తెలిపారు
Source: Yahoo! Telugu: Entertainment | 30 Jul 2009 | 11:23 am

రాజ్యసభకు జేడీయూ అభ్యర్థిగా జార్జి ఫెర్నాండెజ్‌

జనతాదళ్ (యు) సీనియర్‌ నేత, కేంద్ర రక్షణ మాజీ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌కు ఆ పార్టీ సముచిత స్థానం కల్పించనుంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో జార్జికి టిక్కెట్ ఇచ్చేందుకు నిరాకరించిన జేడీయు అధిష్టానం... రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసి ఆయన గౌరవప్రదమైన స్థానం కల్పించింది.
Source: జాతీయ | 30 Jul 2009 | 8:53 am

ఒమర్ రాజీనామాను తిరస్కరించిన జేకే గవర్నర్

జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చేసిన రాజీనామాను ఆ రాష్ట్ర గవర్నర్ వోహ్రా గురువారం తిరస్కరించారు. 2006లో వెలుగులోకి వచ్చి సెక్స్‌ కుంభకోణంలో ఒమర్ అబ్దుల్లాకు ఎలాంటి సంబంధం లేదని సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిందని, అందువల్ల రాష్ట్ర గవర్నర్‌గా ఒమర్ అబ్దుల్లానే కొనసాగుతారని గవర్నర్ స్పష్టం చేశారు.
Source: జాతీయ | 30 Jul 2009 | 8:37 am

త్వరలో తెదేపా తీర్థం పుచ్చుకుంటాం: పెద్దిరెడ్డి

త్వరలోనే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్టు ప్రజారాజ్యం పార్టీ నేత ఇ.పెద్దిరెడ్డి తెలిపారు. ఆయన గురువారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తనతో పాటు, మరో సీనియర్ నేత టి.దేవేందర్ గౌడ్ కూడా తెదేపాలో చేరనున్నట్టు చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 30 Jul 2009 | 8:21 am

నీతూ చంద్ర ఏం కోరుకుంటోంది?

ప్రముఖ బాలీవుడ్ నటి నీతూ చంద్ర గతంలో నటించిన చిత్రాలలో తనకు అంతగా పేరు ప్రఖ్యాతలు రాలేదు. అదే బికినీ ధరించి ఫోటోలు తీయించుకోవడంతో ఒక్కసారిగా ఆమె వార్తలలో వ్యక్తిగా నిలబడింది. నీతూ మళ్ళీ ప్రజల కళ్ళల్లో పడింది. సమలైంగిక పరమైన ఫోజులిచ్చి ఫోటోలు తీయించుకోవడంతో బాలీవుడ్ నిర్మాతలు, దర్శకుల కళ్ళు ఆమెపై పడింది. బట్టలు ధరించడంలో ఆమెకు ఆమే సాటి అని బాలీవుడ్ కోడై కూస్తోంది.
Source: వినోదం | 30 Jul 2009 | 6:38 am

సంయుక్త ప్రకటనకు ప్రణబ్ ముఖర్జీ సమర్థన

ఈజిప్టు పర్యటన సందర్భంగా వెలువడిన భారత్- పాక్ సంయుక్త ప్రకటన విషయంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ గట్టిగా సమర్థించారు. భారత్- పాక్ సంయుక్త ప్రకటన పార్లమెంట్ సమావేశాలను కుదిపేసిన సంగతి తెలిసిందే.
Source: జాతీయ | 30 Jul 2009 | 6:02 am

మల్లికా శెరావత్ నగ్నంగా నటించిందా...?

మల్లికా శెరావత్ హాలీవుడ్ చిత్రం "హిస్‌స్‌స్"లో దాదాపు నగ్నంగా కనిపించినంత పనిచేసిందంటున్నారు. హిస్‌స్‌స్ చిత్రం తాజా ప్రొమోలో భాగంగా మల్లిక బురదలో పడి, ఆ తర్వాత వస్త్రాలను విసర్జించి నగ్నంగా మారిపోయి అటు పిమ్మట పాములా మారుతుందట. ఈ సన్నివేశాన్ని చీకటిలో కనిపించీ కనిపించకుండా ఉండేటట్లు రూపొందించారనీ, ఆ మసక వెలుతురులో శెరావత్ నగ్నంగా నటించేసిందని అంటున్నారు. చిత్ర దర్శకులు మాత్రం ఈ విషయాన్ని కొట్టి పారేస్తున్నారట. దీనికి ఉదాహరణగా.... తాము తొలి ప్రోమోను విడుదల చేసినప్పుడు శెరావత్ స్టిల్స్ చూసినవారంతా మల్లికా నగ్నంగా నటించిందేమో అనుకున్నారనీ, శెరావత్ నగ్నంగా అనిపించేటటువంటి వస్త్రాలను ధరించిందని తాము చెప్పే వరకూ ఎవరూ నమ్మలేదని దర్శకులు చెపుతున్నారట.
Source: వినోదం | 30 Jul 2009 | 5:57 am

రాష్ట్రంలో ఐపీఎస్‌ అధికారుల బదిలీలు

రాష్ట్రంలో ఆరుగురు ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
Source: ఏపీ న్యూస్ | 30 Jul 2009 | 5:26 am

గోర్ష్‌కోవ్ ధరను సమర్థించిన సురేష్ మెహతా

రష్యా నుంచి అడ్మిరల్ గోర్ష్‌కోవ్ అనే విమానవాహక నౌకను కొనుగోలు చేయడానికి ప్రభుత్వ భారీ మొత్తం చెల్లించడాన్ని నావికా దళ చీఫ్ అడ్మిరల్ సురేష్ మెహతా గురువారం సమర్థించారు. గోర్ష్‌కోవ్ నౌకను కొనుగోలు చేసేందుకు చెల్లిస్తున్న మొత్తాన్ని పెంచడంపై కాగ్ ఇటీవల అంక్షితలు వేసిన సంగతి తెలిసిందే.
Source: జాతీయ | 30 Jul 2009 | 4:55 am

విడుదలైన జనశక్తి నేత అమర్‌

చర్లపల్లి జైల్లో శిక్షను అనుభవిస్తున్న జనశక్తి నేత అమర్‌ గురువారం విడుదలయ్యారు. జనశక్తి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న అమర్‌ పలు కేసుల్లో శిక్ష అనుభవిస్తూ చర్లప్లలి జైల్లో ఉన్నారు. ఈయనకు షరతులతో కూడిన బెయిలు మంజూరు కావడంతో విడుదలయ్యారు.
Source: ఏపీ న్యూస్ | 30 Jul 2009 | 4:11 am