ఏకపక్షంగా వ్యవహరిస్తున్న సభాపతి: చంద్రబాబు

సభా వ్యహారాలను పరిరక్షించి, అన్ని పార్టీల సభ్యులను సమానంగా చూడాల్సిన సభాపతి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి అధికార పార్టీకి అనుకూలంగా, ఏకపక్షంగా వ్యవహిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వారిపట్ల ఆయన వకల్తా పుచ్చుకున్నట్టుగా ఉన్నారని బాబు మండిపడ్డారు.
Source: Yahoo! Telugu: News | 29 Jul 2009 | 10:15 am

కాల్పుల్లో రష్యా మాఫియా నేతకు గాయాలు

రష్యా మాఫియా సామ్రాజ్యంలోని ప్రధాన వ్యక్తుల్లో ఒకరు కాల్పుల్లో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో వ్యాచెస్లావ్ ఇవాన్‌కోవ్ అనే మాఫియా ముఠా నేతపై కాల్పులు జరిపి గాయపరిచారు. వారి కాల్పుల్లో వ్యాచెస్లావ్‌కు ఉదర భాగంలో గాయమైంది.
Source: Yahoo! Telugu: News | 29 Jul 2009 | 10:05 am

అబ్బోట్‌ను అమ్మిన వాకార్డ్

మందుల తయారీ కంపెనీల్లో అగ్రగామిగానున్న వాకార్డ్ కంపెనీ తనకు చెందిన అబ్బోట్‌ కంపెనీని అమ్మినట్లు వాకార్డ్ కంపెనీ ఛైర్మెన్ హబీల్ ఖోరాకీవాలా బుధవారం వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 29 Jul 2009 | 9:50 am

సెక్స్ కుంభకోణం: సీబీఐ క్లీన్‌ చిట్‌పై పీడీపీ ఆగ్రహం

సెక్స్ కుంభకోణంలో జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పాత్రపై సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వాడన్ని పీడీపీ తీవ్రంగా ఆక్షేపించింది. అంతటితో ఆగని ఆ పార్టీ ఎమ్మెల్యేలు బుధవారం కూడా అసెంబ్లీలో రభస సృష్టించారు.
Source: Yahoo! Telugu: News | 29 Jul 2009 | 9:44 am

192 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం 192 పాయింట్లు కోల్పోవడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 15,140 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 62 పాయింట్లు నష్టపోయి 4,502 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 1.25 శాతం, నిఫ్టీ 1.35 శాతం మేరకు క్షీణించాయి. ఇప్పటి వరకు మొత్తం 2,673 కంపెనీల వాటాలు ట్రేడ్ అవగా, 1,612 కంపెనీల వాటాలు నష్టాల్లో ఉన్నాయి.
Source: Yahoo! Telugu: News | 29 Jul 2009 | 9:39 am

ఎస్‌బీహెచ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న టాటా

ఫియెట్ కార్లను కొనడానికి వచ్చే వినియోగదారులకు ఆటో‌ లోన్ సౌకర్యం కల్పించనున్నట్లు టాటా మోటార్స్ సంస్థ తెలిపింది. దీనికిగాను తాము స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు బుధవారం ఢిల్లీలో ప్రకటించింది.
Source: Yahoo! Telugu: News | 29 Jul 2009 | 9:27 am

సుప్రీంకోర్టు సమన్లను ముషారఫ్ బేఖాతరు

పాకిస్థాన్ మాజీ మిలిటరీ పాలకుడు పర్వేజ్ ముషారఫ్ ఆ దేశ సుప్రీంకోర్టు సమన్లను బేఖాతరు చేశారు. దేశంలో రెండేళ్ల క్రితం అత్యాయిక పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించడంతోపాటు, న్యాయమూర్తులను తొలగిస్తూ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ముషారఫ్‌కు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.
Source: Yahoo! Telugu: News | 29 Jul 2009 | 9:22 am

పూణెలో పాఠశాల విద్యార్థులకు స్వైన్ ఫ్లూ

ప్రపంచ మహమ్మారి స్వైన్ ఫ్లూ వ్యాధి పాఠశాలల్లో కూడా వ్యాపిస్తోంది. మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణెలోని పలు పాఠశాల విద్యార్థులకు ఈ వ్యాధి సోకింది. దీంతో పూణెలో స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య ఒక్కసారి 66కు చేరుకుంది. ఒక్క మంగళవారమే ఆరు కేసులు బయటపడ్డాయి.
Source: Yahoo! Telugu: News | 29 Jul 2009 | 9:21 am

నష్టాల్లోనే కొనసాగుతున్న స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం నష్టాల్లోనే కొనసాగుతుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 186 పాయింట్లు కోల్పోయి 15,146 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 56 పాయింట్లు నష్టపోయి 4,509 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 1.21 శాతం, నిఫ్టీ 1.22 శాతం మేరకు క్షీణించాయి.
Source: Yahoo! Telugu: News | 29 Jul 2009 | 8:21 am

లాభాలు పొందిన కార్పోరేషన్ బ్యాంక్

దేశీయ బ్యాంకుల్లో అగ్రగామిగానున్న కార్పోరేషన్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలిత్రైమాసికాంతానికి నికర లాభాలు 41.75శాతం పెరిగి రూ. 261.24కోట్లకు చేరుకుందని బ్యాంక్ తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 29 Jul 2009 | 8:01 am

"ఆది", "ఖుషీ" విలన్ రాజన్ పి.దేవ్ కన్నుమూత

ఆది, ఖుషీ తదితర తెలుగు చిత్రాల్లో నటించి మేటి విలన్ అనిపించుకున్న మలయాళ నటుడు రాజన్ పి.దేవ్(58) బుధవారం కన్నుమూశారు. లివర్ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న రాజన్ బుధవారం కేరళలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మృతిచెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 29 Jul 2009 | 7:29 am

కడప దర్గాలో "మగధీర" ప్రత్యేక ప్రార్థనలు

కడప జిల్లా కేంద్రంలో ఉన్న అమీన్‌పీర్ దర్గాను మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తేజ్ బుధవారం దర్శించుకున్నారు. తాను కొత్తగా నటించిన 'మగధీర' ఈనెల 31వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం హిట్ కావాలని కోరుతూ రామ్ చరణ్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేయించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 29 Jul 2009 | 6:51 am

మళ్లీ.. అహనా పెళ్లంట!

రాజేంద్రప్రసాద్‌ హీరోగా గతంలో వచ్చిన 'అహనా పెళ్లంట' చిత్రం అప్పట్లో ప్రేక్షకులను హాస్యపు జల్లులో ముంచెత్తిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడా చిత్రాన్ని నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా రీమేక్‌ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విశేషమేమంటే.. ఈ కొత్త వర్షన్‌లో హీరోగా అల్లరి నరేష్‌ పేరు విన్పిస్తోంది. ప్రముఖ దర్శకుడు తెరకెక్కించనున్న "అహనా పెళ్లంట" చిత్రం త్వరలో సెట్‌పైకి రానుంది. మరో ప్రత్యేకత ఏమంటే... అందులో నటించిన రాజేంద్రప్రసాద్‌ ఈ కొత్త చిత్రంలో కీలకపాత్ర పోషించనున్నాడట. మొత్తానికి రాజేంద్రప్రసాద్‌ చిత్రాలన్నీ నరేష్‌కు క్రేజ్‌ తెచ్చిపెడుతున్నాయన్నమాట.
Source: Yahoo! Telugu: Entertainment | 29 Jul 2009 | 5:30 am

దాసరి డబ్బు... సన్నిహితుడు గుటకాయ స్వాహా

దాసరి నారాయణరావును మోసం చేయడమా? ఎన్ని గుండెలుండాలి అనిపించవచ్చు. అది బయటివ్యక్తికి. ఆయనతో అతి సన్నిహితుడికి అదేమంత కష్టం కాదు కదా. దాసరి బోళా మనిషంటారు. మహాముదురు అని మరోవర్గం చెబుతుంటారు. దాసరికంటే.. ఆయన చుట్టూ చేరిన కొందరు బాగా సంపాదించారని కూడా అనుకుంటారు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో దాసరికి పెద్దమొత్తంలో డబ్బు రావలసి ఉంది. ఆ డబ్బును దాసరి పంపించారంటూ దాసరి సన్నిహితులొకరు ఢిల్లీ వెళ్ళి.. అప్పటికే దాసరి సంతకం చేసిన కొన్ని కాగితాలు ఇచ్చి ఆ పెద్ద ఎమౌంట్‌‌ను తీసేసుకున్నాడట. ఈ విషయం తెలీని దాసరి కొన్ని రోజుల తర్వాత తనకు రావాల్సిన సొమ్ము గురించి ఢిల్లీలో ఉన్న వ్యక్తిని అడిగినప్పుడు.. అసలు కథ బయటపడిందట.
Source: Yahoo! Telugu: Entertainment | 29 Jul 2009 | 5:19 am

'గాలి' మాటలు మాట్లాడడం బాబు నైజం: కాంగ్రెస్

తొమ్మిదేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సభా సమయాన్ని వృధా చేసేందుకు సభలో తన పార్టీ సభ్యులను ప్రోత్సహిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ప్రతిపక్ష నేత స్థానంలో ఉన్న బాబు.. ఇలాంటి చర్యలను ప్రోత్సహించడం సరైన చర్య కాదని ఆ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మీనారాయణ హితవు పలికారు.
Source: ఏపీ న్యూస్ | 29 Jul 2009 | 5:15 am

రోశయ్య వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి: తెదేపా

బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం జరిగిన కార్యకలాపాల్లో తమ పార్టీ సభ్యుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడును ఉద్దేశించి మంత్రి రోశయ్య చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది.
Source: ఏపీ న్యూస్ | 29 Jul 2009 | 5:06 am

ఏకపక్షంగా వ్యవహరిస్తున్న సభాపతి: చంద్రబాబు

సభా వ్యహారాలను పరిరక్షించి, అన్ని పార్టీల సభ్యులను సమానంగా చూడాల్సిన సభాపతి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి అధికార పార్టీకి అనుకూలంగా, ఏకపక్షంగా వ్యవహిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వారిపట్ల ఆయన వకల్తా పుచ్చుకున్నట్టుగా ఉన్నారని బాబు మండిపడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 29 Jul 2009 | 4:47 am

సెక్స్ కుంభకోణం: సీబీఐ క్లీన్‌ చిట్‌పై పీడీపీ ఆగ్రహం

సెక్స్ కుంభకోణంలో జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పాత్రపై సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వాడన్ని పీడీపీ తీవ్రంగా ఆక్షేపించింది. అంతటితో ఆగని ఆ పార్టీ ఎమ్మెల్యేలు బుధవారం కూడా అసెంబ్లీలో రభస సృష్టించారు.
Source: జాతీయ | 29 Jul 2009 | 4:15 am

నేనేమీ.. చిన్నపిల్లోడిని కాదు: దేవేందర్ గౌడ్

తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని ప్రజారాజ్యం పార్టీ సీనియర్ నేత తూళ్ల దేవేందర్ గౌడ్ స్పష్టం చేశారు. దీనిపై ఆయన బుధవారం పార్టీ ప్రధాన కార్యదర్శి అల్లు అరవింద్ నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు అల్లు అరవింద్‌తో సమావేశమైనట్టు చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 29 Jul 2009 | 4:09 am

ప్రశ్నలు వేయడం మాని... పని చేయండి: చిదంబరం

ముంబై మారణహోమంలో సంబంధం ఉన్న దోషులను చట్టం ముందు నిలబెట్టేందుకు పాకిస్థాన్ చిత్తశుద్ధితో కృషి చేయాలని కేంద్ర హోంమంత్రి చిదంబరం హితవు పలికారు. ఈ అంశంలో భారత్‌కు ప్రశ్నలు సంధించడం మాని, నిందితులను అరెస్టు చేసి, విచారించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.
Source: జాతీయ | 29 Jul 2009 | 4:05 am

పూణెలో పాఠశాల విద్యార్థులకు స్వైన్ ఫ్లూ

ప్రపంచ మహమ్మారి స్వైన్ ఫ్లూ వ్యాధి పాఠశాలల్లో కూడా వ్యాపిస్తోంది. మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణెలోని పలు పాఠశాల విద్యార్థులకు ఈ వ్యాధి సోకింది. దీంతో పూణెలో స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య ఒక్కసారి 66కు చేరుకుంది. ఒక్క మంగళవారమే ఆరు కేసులు బయటపడ్డాయి.
Source: జాతీయ | 29 Jul 2009 | 3:52 am

ఏ సభకెళ్లినా బీహారీల సంక్షేమమే ముఖ్యం: పాశ్వాన్

బీహార్ ప్రజల ప్రయోజనాల కోసం పార్లమెంట్‌కు వెళతానని లోక్‌జనశక్తి అధినేత, మాజీ కేంద్రమంత్రి రాం విలాస్ పాశ్వాన్ స్పష్టం చేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో పాశ్వాన్‌తో సహా మొత్తం పార్టీ అభ్యర్థులంతా ఓటమిపాలైన విషయం తెల్సిందే.
Source: జాతీయ | 29 Jul 2009 | 1:09 am

కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత : షాద్‌నగర్‌ పర్యటన రద్దు

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కే.చంద్రశేఖర రావుకు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన బుధవారం నిర్వహించ తలపెట్టిన మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
Source: ఏపీ న్యూస్ | 29 Jul 2009 | 12:44 am

విశాఖ అచ్యుతాపురంలో అణు విద్యుత్ కేంద్రం

దేశంలోనే రెండో అణు విద్యుత్ కేంద్రం మన రాష్ట్రంలో ఏర్పాటు కానుంది. విశాఖపట్నం జిల్లా కేంద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న అచ్యుతాపురంలో ఈ కేంద్రాన్ని నిర్మించనున్నారు. బాబా అణు విద్యుత్ పరిశోధనా కేంద్రం రెండో క్యాంపస్‌ను నిర్మించాలని కేంద్రం నిర్ణయించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Source: ఏపీ న్యూస్ | 29 Jul 2009 | 12:31 am

నక్సల్ ప్రభావిత రాష్ట్రాలకు రూ.7800 కోట్లు: కేంద్రం

దేశంలో నక్సల్ ప్రభావిత రాష్ట్రాల్లో మావోయిస్టు కార్యకలాపాలను అణిచి వేసేందుకు కేంద్రం ఉక్కుపాదం మోపుతోంది. ఇందులోభాగంగా అవసరమైన కనీస సదుపాయల రూప కల్పనతో పాటు.. పోలీసు బలగాల సంఖ్యను మరింతగా పెంచనుంది.
Source: జాతీయ | 29 Jul 2009 | 12:24 am

సొంత గూటికి తూళ్ళ దేవేందర్ గౌడ్!?

మాజీ హోం మంత్రి, ప్రజారాజ్యం పార్టీ సీనియర్ నేత తూళ్ళ దేవేందర్ గౌడ్ తిరిగి మాతృసంస్థలో చేరనున్నారు. ఆయన చేరికకు మరో మాజీ నేత ఇ.పెద్దిరెడ్డి రాయబారం నడుపగా, దీనికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 28 Jul 2009 | 11:53 pm

కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న స్వతంత్ర ఎమ్మెల్యేలు

గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన వారిలో ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అందువల్ల వీరు ఇక నుంచి కాంగ్రెస్ అనుబంధ సభ్యులుగా కొనసాగుతారని ప్రభుత్వ చీఫ్ విఫ్ భట్టి విక్రమార్క తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 28 Jul 2009 | 11:29 pm

ప్రజారాజ్యం ఎమ్మెల్యేకు మంత్రుల ప్రశంస

ప్రజారాజ్యం పార్టీకి చెందిన కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కె.కన్నబాబుకు రాష్ట్ర మంత్రులు తమ అభినందనలు తెలిపారు. ఆర్థిక మంత్రి రోశయ్య ప్రవేశపెట్టిన 2009-10 వార్షిక బడ్జెట్‌పై కన్నబాబు మంగళవారం సభలో ప్రసంగించారు.
Source: ఏపీ న్యూస్ | 28 Jul 2009 | 11:22 pm

డిజైన్, పదార్థ లోపాలే ప్రమాదానికి కారణం

దేశ రాజధానిలోని జంమ్రుద్‌పూర్‌లో జరిగిన ప్రమాదానికి డిజైనింగ్, పదార్థ లోపాలే కారణమని ఢిల్లీ మెట్రో భావిస్తోంది. దీనికి సంబంధించి కాంట్రాక్టు చేపట్టిన గామన్ ఇండియాకు షాకాజు నోటీసు జారీ చేయాలని నిర్ణయించుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
Source: జాతీయ | 28 Jul 2009 | 10:20 pm

మార్పులేమీ లేకుండా గుజ్‌సీఓసీకి ఆమోదం

గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ మంగళవారం గుజరాత్ వ్యవస్థీకృత నేరాల నిరోధక (జీయూజేసీఓసీ) బిల్లును ఆమోదించింది. గతంలో కేంద్రం ఆమోదం కోసం వెళ్లిన ఈ బిల్లులో కొన్ని మార్పులు చేయాలని రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ వెనక్కు పంపిన సంగతి తెలిసిందే.
Source: జాతీయ | 28 Jul 2009 | 9:44 pm

హీరోగా వస్తోన్న సాయికుమార్ కుమారుడు!

ప్రముఖ నటుడు సాయి కుమార్‌ తన కుమారుడిని హీరోగా పరిచయం చేస్తున్నారు. రవితేజ, ఇలియానా హీరోహీరోయిన్లుగా నటించిన 'కిక్‌' చిత్రాన్ని నిర్మించిన వెంకట్ ఆర్‌.ఆర్‌.మూవీమేకర్స్‌ పతాకంపై జె.డి.చక్రవర్తి దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 28 Jul 2009 | 12:15 pm

యువతరం కోసం "మగధీర" కొత్త నిర్మాణ సంస్థ!

చిత్ర పరిశ్రమలో ఎంతోమంది ప్రతిభావంతులైన యువకులను ప్రోత్సహించే దిశగా "మగధీర" రంగం సిద్ధం చేస్తున్నాడు. టాలెంట్ గల యువకులకు మంచి అవకాశం వస్తే తమ సత్తా ఏంటో నిరూపించుకోవడానికి చిరుతనయుడు, రామ్‌చరణ్ తేజ కొత్త నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు గుప్పుమన్నాయి. సరైన సమయంలో "మగధీర" తన నిర్మాణ సంస్థకు అంకురార్పణ చేయాలని రామ్‌చరణ్‌ ఆలోచిస్తున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం.
Source: Yahoo! Telugu: Entertainment | 28 Jul 2009 | 11:56 am

నయనతారతో కోడి రామకృష్ణ కొత్తచిత్రం!

సెక్సీతార అనుష్కను "అరుంధతి" చూపించి హిట్ కొట్టిన ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ, మరో సెక్సీడాళ్‌ నయనతారతో కొత్త చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'అమ్మోరు', 'దేవి', 'అరుంధతి' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ, నయనతార ప్రధాన పాత్రలో గ్రాఫిక్స్‌ ప్రధానంగా సాగే కొత్త సినిమాను తెరకెక్కించనున్నారు
Source: Yahoo! Telugu: Entertainment | 28 Jul 2009 | 11:40 am

ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఎస్సై

రాష్ట్ర ఖాకీలకార్కానికి మరో అబలబలైంది. చట్టాన్ని పరిరక్షించాల్సిన ఎస్సై.. ప్రేమ పేరుతో ఒక యువతిని నమ్మించి మోసం చేశాడు. అంతటితో ఆగని ఆ కామాంధ ఎస్సై.. ఆ యువతిని గుంటూరు జిల్లా కేంద్రంలోని ఓ లాడ్జీకి తీసుకెళ్లి శారీరక సుఖాన్ని కూడా తీర్చుకున్నాడు.
Source: ఏపీ న్యూస్ | 28 Jul 2009 | 9:48 am

ఒరిజినల్ మగధీరుడో లేక గ్లాడియేటర్ గ్జెరాక్సో..?!!

రామ్ చరణ్ తేజ ద్వితీయ చిత్రం సక్సెస్ కోసం నిర్విరామ కృషి జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో టాలీవుడ్లో ఇంతటి భారీ బడ్జెట్టుతో, ఇంతటి మహా ఘనమైన సబ్జెక్టును చేయలేదని టాలీవుడ్ సినీజనం టాక్. రషెస్ చూసిన మెగాస్టార్ చిరంజీవే సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారంటే మగధీర ఏ లెవల్లో ఉండి ఉంటుందోనన్న ఆసక్తి నెలకొంది. అవన్నీ అలావుంటే... వళ్లు గగుర్పొడిచే కత్తి యుద్ధాలు, గుఱ్ఱాలపై రివ్వున బాణంలా దూసుకుపోయే కండల వీరుని విన్యాసాలు, ఉక్కుమనిషిలా కనిపించే దృఢకాయుడు, మహోజ్వాలలను విసరగల తీక్షణమైన అతని కంటిచూపులు, శత్రువులపై మెరుపు దాడి... ఇలా ప్రతి సన్నివేశం ఎంతో రసవత్తరంగా చిత్రీకరించిన ఇంగ్లీషు సినిమా గ్లాడియేటర్‌కు మగధీరకు దగ్గర పోలికలున్నట్లు టాలీవుడ్ టాక్. చిత్రం విడుదలైతే గానీ "మగధీర" ఒరిజినల్ మగధీరుడా... లేక గ్లాడియేటర్ క్సెరాక్సో తెలియదు.
Source: Yahoo! Telugu: Entertainment | 28 Jul 2009 | 8:07 am

సముద్ర అంతర్భాగంలో "జగన్మోహిని"తో రాజా రొమాన్స్!

మల్టీప్లెక్స్ హీరో రాజా "ఇంకోసారి" సినిమా షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్నాడు. రిచా, మంజరి, రాజాలు ప్రధాన పాత్రలు పోషిస్తోన్న 'ఇంకోసారి' చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు.. జగన్మోహినితో రాజా రొమాన్స్ చేస్తున్నాడట. ఇదేదో విదేశాల్లోనూ, పార్క్‌ల్లోనూ కాదండీ..! ఏకంగా సముద్ర అంతర్భాగంలో జగన్మోహిని నమితతో రాజా రొమాన్స్ చేసే సన్నివేశాన్ని చిత్ర యూనిట్ ఇటీవలే చిత్రీకరించింది. ఈ సీన్‌కోసం నమిత, రాజాలకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారని చిత్ర యూనిట్ అంటోంది. ఇంకా రాజా, నమితలు నటించిన ఆ రొమాన్స్ సీన్ అదిరిందని, తప్పకుండా ప్రేక్షకులను ఆ సీన్ ఆకట్టుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అంతేగాకుండా.. సముద్ర అంతర్భాగంలో చిత్రీకరించిన కీలక సన్నివేశాలు ప్రత్యేకంగానూ, అద్భుతంగానూ ఉంటాయని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. మరి.. జగన్మోహిని సినిమాను ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో? వేచి చూడాల్సిందే..!.
Source: Yahoo! Telugu: Entertainment | 28 Jul 2009 | 7:20 am

నయనతారతో కోడి రామకృష్ణ కొత్తచిత్రం!

సెక్సీతార అనుష్కను "అరుంధతి" చూపించి హిట్ కొట్టిన ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ, మరో సెక్సీడాళ్‌ నయనతారతో కొత్త చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'అమ్మోరు', 'దేవి', 'అరుంధతి' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ, నయనతార ప్రధాన పాత్రలో గ్రాఫిక్స్‌ ప్రధానంగా సాగే కొత్త సినిమాను తెరకెక్కించనున్నారు
Source: వినోదం | 28 Jul 2009 | 6:47 am

యువతరం కోసం "మగధీర" కొత్త నిర్మాణ సంస్థ!

చిత్ర పరిశ్రమలో ఎంతోమంది ప్రతిభావంతులైన యువకులను ప్రోత్సహించే దిశగా "మగధీర" రంగం సిద్ధం చేస్తున్నాడు. టాలెంట్ గల యువకులకు మంచి అవకాశం వస్తే తమ సత్తా ఏంటో నిరూపించుకోవడానికి చిరుతనయుడు, రామ్‌చరణ్ తేజ కొత్త నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు గుప్పుమన్నాయి. సరైన సమయంలో "మగధీర" తన నిర్మాణ సంస్థకు అంకురార్పణ చేయాలని రామ్‌చరణ్‌ ఆలోచిస్తున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం.
Source: వినోదం | 28 Jul 2009 | 6:47 am

'బుందేల్‌ఖండ్‌'కు ప్రత్యేక ప్యాకేజీ: రాహుల్ డిమాండ్

బుందేల్‌ఖండ్‌ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, అమేథీ ఎంపీ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ శాసనసభ్యులతో వెళ్లి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను కలిసి వినపతి పత్రం సమర్పించారు.
Source: జాతీయ | 28 Jul 2009 | 6:41 am

ముఖ్యమంత్రి పదవికి ఒమర్ అబ్దుల్లా రాజీనామా

జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన పదవికి రాజీనామా చేశారు. తనపై ప్రతిపక్ష సభ్యులు చేసిన ఆరోపణలకు మనస్తాపానికి గురైన ఆయన మంగళవారం తన రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించారు. ఒమర్ రాజీనామా గవర్నర్ తక్షణం ఆమోదించారు.
Source: జాతీయ | 28 Jul 2009 | 5:44 am

హ్యాండ్‌సమ్ "సూర్య" సరసన సెక్సీతార "అనుష్క"!

టాలీవుడ్‌లో అగ్రహీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న అందాల రాశి అనుష్క. "అరుంధతి" చిత్రం ద్వారా బొమ్మాళీగా అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరైన ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయని ఇండస్ట్రీలో టాక్. "బిల్లా"లో బికినీతో మాస్‌ను ఆకట్టుకున్న అనుష్క తాజాగా పలు కోలీవుడ్ సినిమాల్లో నటించేందుకు కాల్షీట్లు ఇచ్చేసిందని తెలిసింది. "ఇరండు" (రెండు) చిత్రం ద్వారా కోలీవుడ్ రంగం ప్రవేశం చేసిన అనుష్క తాజాగా తమిళ యంగ్ హీరో విజయ్ సరసన "వేట్టైక్కారన్" అనే సినిమాలో నటిస్తోంది. మరోవైపు గజిని, వీడొక్కడే, సూర్య సన్నాఫ్ కృష్ణన్ ఫేమ్ సూర్యతో అనుష్క జతకట్టనుందని సమాచారం.
Source: Yahoo! Telugu: Entertainment | 28 Jul 2009 | 4:58 am