160 పాయింట్ల లాభంతో సెన్సెక్స్

స్టాక్ మార్కెట్ ప్రస్తతం 160 పాయింట్ల లాభంతో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 15,391 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 43 పాయింట్లు లాభపడి 4,567 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 1.05 శాతం, నిఫ్టీ 0.95 శాతం మేరకు వృద్ధి చెందాయి. ఇప్పటి వరకు మొత్తం 2,635 కంపెనీల వాటాలు ట్రేడ్ అవగా, 1,670 కంపెనీల వాటాలు లాభాల్లో ఉన్నాయి.
Source: Yahoo! Telugu: News | 24 Jul 2009 | 2:26 pm

బైతుల్లా యమ డేంజర్: హాల్‌బ్రూక్

ప్రముఖ ఉగ్రవాద సంస్థ తహరీక్-ఏ-తాలిబన్‌కు చెందిన ప్రముఖుడు బైతుల్లా మెహసూద్ అతి భయంకరమైన వ్యక్తి అని, పాకిస్థాన్ దేశపు వ్యవహారాలపై ప్రత్యేక దౌత్యాధికారిగానున్న రిచర్డ్ హాల్‌బ్రూక్ అన్నారు.
Source: Yahoo! Telugu: News | 24 Jul 2009 | 2:22 pm

డీఎస్సీ ద్వారా 50 వేల ఉద్యోగాల భర్తీ: రోశయ్య

రాష్ట్ర విత్తమంత్రి రోశయ్య తన బడ్జెట్ ప్రసంగంలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. డీఎస్సీ ద్వారా కొత్తగా యాభైవేల పోస్టులను భర్తీ చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. 2009-10 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను ఆయన శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
Source: Yahoo! Telugu: News | 24 Jul 2009 | 2:08 pm

త్వరలో తెరపైకి వస్తానంటోన్న"జగన్మోహిని"

సెక్సీడాళ్ నమిత త్వరలో "జగన్మోహిని"గా తెరపైకి వస్తానంటోంది. 1980 ప్రారంభంలో విడుదలైన "జగన్మోహిని" చిత్రాన్ని ప్రస్తుతం రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నమిత టైటిల్ పాత్రను పోషిస్తోంది. రాజా, మీరాచోప్రా, నరసింహరాజు, అలనాటి తార జ్యోతిలక్ష్మి ప్రధాన తారాగణంగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలను ముగించుకుని చివరి దశలో ఉంది. గ్రాఫ్రిక్స్, టెక్నికల్ పరమైన కార్యక్రమాల కోసం ఈ చిత్రం విడుదలకు జాప్యం జరుగుతోందని చిత్ర యూనిట్ తెలిపింది. ఎన్.కె. విశ్వనాథన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి మురళీ నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Jul 2009 | 1:55 pm

17% లాభాలు పొందిన ఐటీసీ

ఐటీసీ సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికమైన ఎప్రిల్ నెలనుంచి జూన్ నెలవరకు జరిపిన వ్యాపార లావాదేవీలలో 17శాతం లాభాలు పెరిగి 879కోట్ల రూపాయల నికర లాభాలు చేకూరాయని కంపెనీ బొంబాయి స్టాక్ ఎక్స్‌‍ఛేంజ్‌కు తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 24 Jul 2009 | 1:48 pm

జలయజ్ఞానికి పెద్దపీట వేసిన మంత్రి రోశయ్య

రాష్ట్ర విత్తమంత్రి కొణిజేటి రోశయ్య మరోమారు తన చతురతను చూపించి 2009-10 ఆర్థిక సంవత్సరానికి గానూ పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అందరూ ఊహించినట్టుగానే రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ లక్ష కోట్లను దాటింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞానికి రోశయ్య పెద్దపీట వేశారు.
Source: Yahoo! Telugu: News | 24 Jul 2009 | 1:35 pm

మళ్లీ లాభాల్లోకి సెన్సెక్స్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం లాభాల్లోకి ప్రవేశించడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 33 పాయింట్లు పుంజుకుని 15,264 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 13 పాయింట్లు లాభపడి 4,537 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.22 శాతం, నిఫ్టీ 0.29 శాతం మేరకు పుంజుకున్నాయి.
Source: Yahoo! Telugu: News | 24 Jul 2009 | 1:25 pm

అల్‌ఖైదా అమెరికాపై దాడి చేయొచ్చు: ములేన్

ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న ప్రముఖ ఉగ్రవాద సంస్థ అయిన అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ పాకిస్థాన్‌లోని ఫాటా ప్రాంతంలోనే తల దాచుకుని ఉన్నాడని, అతను, అతని సభ్యులు అక్కడినుంచే అమెరికాపై దాడులకు పాల్పడగలరని అమెరికా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మెన్ ఎడ్మిరల్ మైఖేల్ ములేన్ తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 24 Jul 2009 | 1:20 pm

వచ్చే నెల 29వ వరకు బడ్జెట్ సమావేశాలు

రాష్ట్ర బడ్జెట్ శాసనసభ సమావేశాలు వచ్చే నెల 29వ తేదీ వరకు జరుగనున్నాయి. స్పీకర్ కిరణ్ కుమార్ అధ్యక్షత శుక్రవారం జరిగిన బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ బడ్జెట్ సమావేశాల పని దినాలను 26 రోజులుగా నిర్ణయించారు.
Source: Yahoo! Telugu: News | 24 Jul 2009 | 1:15 pm

సంయుక్త ప్రకటన న్యాయబద్ధం కాదు: కేంద్రం

నామ్ సదస్సు సందర్భంగా భారత్-పాకిస్థాన్ దేశాలకు చెందిన ప్రధానమంత్రులు కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శశిథరూర్ సమర్థించారు. ఈ ప్రకటన న్యాయబద్ధం కాదని ఆయన వివరిణ ఇచ్చారు.
Source: Yahoo! Telugu: News | 24 Jul 2009 | 1:00 pm

అమెరికా, ఆసియా స్టాక్ మార్కెట్లు

అమెరికా స్టాక్ మార్కెట్లు... డౌ జోన్స్ ఇండస్ట్రియల్ ఇండెక్స్ - 2.12 శాతంతో 188.03 పాయింట్లు పుంజుకుని 9,069.29 వద్దకు ముగిసింది. నవంబర్ 2008 తర్వాత గరిష్ఠ ముగింపుగా ఇది నమోదైంది. స్టాండార్డ్ అండ్ పూర్ 500 ఇండెక్స్ - 2.33 శాతంతో 22.22 పాయింట్లు లాభపడి 976.29 వద్ద ముగిసింది. నాస్‌డాక్ కంపోజిట్ ఇండెక్స్ - 2.45 శాతంతో 47.22 పాయింట్లు బలపడి 1,973.60 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి.. హాంగ్ సెంగ్ (హాంకాంగ్) - 92 పాయింట్లు పుంజుకుని 19,909 వద్దకు చేరుకుంది. నిక్కీ (జపాన్) - 157 పాయింట్లు బలపడి 9,950 వద్దకు చేరుకుంది. షాంఘై (చైనా) - 22 పాయింట్లు పెరిగి 3,351 వద్దకు చేరుకుంది.
Source: Yahoo! Telugu: News | 24 Jul 2009 | 12:43 pm

"స్వయంవరం" ఫలించింది.. రాఖీకి ఆగస్టు 2న పెళ్లి!?

బాలీవుడ్ సెక్సీతార రాఖీ సావంత్ స్వయం వరం ఫలించింది. వచ్చేనెల (ఆగస్టు) 2వ తేదీన రాఖీ సావంత్ పెళ్లి చేసుకోనుందని ఆమె సన్నిహితులు అంటున్నారు. వరుడి ఎంపికకోసం రాఖీ సావంత్ "రాఖీ కా స్వయంవర్" కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి విదితమే. ఈ స్వయం వరంలో పాల్గొన్న వారి నుంచి చిటిజ్ జైన్, ఎలేష్ పరుజన్ వాలా, మవస్ కత్యాల్ అనే ముగ్గురు ఫైనల్స్‌కు ఎంపికయ్యారు. వీరిలో కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఎలేష్‌ను రాఖీ పెళ్లాడనుందని విశ్వసనీయ సమాచారం. అంతేగాకుండా స్వయంవరానికి వచ్చిన వారిలో ఎలేష్ పట్ల రాఖీ ఆకర్షితురాలయ్యిందని ఆమె స్నేహితులు తెలిపారు. ఇకపోతే.. పెళ్లి సంగతిని ఇంకా నిర్ధారించి చెప్పకున్నా... ఆగస్టు రెండో తేదీన అందరికీ వాస్తవం తెలుస్తుందని రాఖీ సావంత్ అంటోంది. వైవాహిక వ్యవస్థను అపహాస్యం చేయాలన్న ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని సావంత్ చెప్పింది.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Jul 2009 | 11:45 am

కాలేజీ డేస్‌లోనే నాకు సెక్సువల్ ఎటాచ్‌మెంట్‌ ఉంది: షెర్లిన్

వినడానికే వెగటు పుట్టించే కామెంట్స్‌ చేయడంలో సెక్స్‌బాంబ్‌ మోనాచోప్రా అలియాస్‌ "షెర్లిన్‌ చోప్రా" ఫస్ట్‌ ప్లేస్‌‌లో ఉంటుందట. కాలేజీ డేస్‌లోనే సెక్సువల్ ఎటాచ్‌మెంట్‌ ఉందని చెప్పిన ఈ సెక్సీతార, ఎవరితోనైనా డేటింగ్‌కు సిద్ధమని ఇటీవలే వార్తల్లోకెక్కింది. నగ్నంగా ఫోటోకు ఫోజులివ్వడమే గాకుండా.. నగ్నంగా నటించడం ఓ ఆర్ట్ అని, అదేదో తనకే చెల్లిందని వ్యాఖ్యలు కూడా చేసింది. ఇంతేకాదు.. ఇటీవల మరో వార్తను కూడా ముందుంచుంది. సినిమాల్లోకి రాకముందే ఆమె ఎద భాగం చాలా ఫ్లాట్‌గా ఉండేదట. అబ్బాయిల్లా ఉండే తన ఎదభాగాన్ని చూసి అప్పట్లో ఆందోళన చెందేదాన్ని అని, కాస్మొటిక్‌ సర్జరీ అందుబాటులో రావడంతో ఎత్తుగా, అందంగా మార్చుకున్నానని చెప్పింది. ఇదేంటి? దాపరికం లేకుండా అన్ని విషయాలు బయటికి చెప్పేస్తున్నారే? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు, సెక్సు గురించి, నగ్నంగా నటించడం గురించి, తన అందచందాల రహస్యం గురించి చెప్పడం నా ఇష్టమని సమాధానమిచ్చిందట..!. అంతేకాదు.. అవన్నీ ఎందుకు దాచాలి? అని తిరుగు ప్రశ్న కూడా వేసిందట..!
Source: Yahoo! Telugu: Entertainment | 24 Jul 2009 | 11:20 am

డీఎస్సీ ద్వారా 50 వేల ఉద్యోగాల భర్తీ: రోశయ్య

రాష్ట్ర విత్తమంత్రి రోశయ్య తన బడ్జెట్ ప్రసంగంలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. డీఎస్సీ ద్వారా కొత్తగా యాభైవేల పోస్టులను భర్తీ చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. 2009-10 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను ఆయన శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
Source: ఏపీ న్యూస్ | 24 Jul 2009 | 8:39 am

జలయజ్ఞానికి పెద్దపీట వేసిన మంత్రి రోశయ్య

రాష్ట్ర విత్తమంత్రి కొణిజేటి రోశయ్య మరోమారు తన చతురతను చూపించి 2009-10 ఆర్థిక సంవత్సరానికి గానూ పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అందరూ ఊహించినట్టుగానే రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ లక్ష కోట్లను దాటింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞానికి రోశయ్య పెద్దపీట వేశారు.
Source: ఏపీ న్యూస్ | 24 Jul 2009 | 8:21 am

వచ్చే నెల 29వ వరకు బడ్జెట్ సమావేశాలు

రాష్ట్ర బడ్జెట్ శాసనసభ సమావేశాలు వచ్చే నెల 29వ తేదీ వరకు జరుగనున్నాయి. స్పీకర్ కిరణ్ కుమార్ అధ్యక్షత శుక్రవారం జరిగిన బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ బడ్జెట్ సమావేశాల పని దినాలను 26 రోజులుగా నిర్ణయించారు.
Source: ఏపీ న్యూస్ | 24 Jul 2009 | 7:46 am

వైఎస్ క్లాస్‌తో దిగివచ్చిన మంత్రి: మీడియాకు సారీ

అసత్య వార్తలు రాసినందుకు పత్రికా విలేకరులపై దాడి చేసిన రాష్ట్ర పశుసంవర్ధక శాఖామంత్రి కె.పార్థసారథి ఎట్టకేలకు దిగివచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ ఆయనను పిలిచి తీవ్రంగానే మందలించారు. దీంతో చేసిన తప్పును తెలుసుకున్న మంత్రి మీడియా సిబ్బందికి బహిరంగ క్షమాపణలు చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 24 Jul 2009 | 7:45 am

సంయుక్త ప్రకటన న్యాయబద్ధం కాదు: కేంద్రం

నామ్ సదస్సు సందర్భంగా భారత్-పాకిస్థాన్ దేశాలకు చెందిన ప్రధానమంత్రులు కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శశిథరూర్ సమర్థించారు. ఈ ప్రకటన న్యాయబద్ధం కాదని ఆయన వివరిణ ఇచ్చారు.
Source: జాతీయ | 24 Jul 2009 | 7:31 am

తాడిపత్రిలో పడగవిప్పిన ఫ్యాక్షన్: ఇరువురి హత్య

రాయలసీమ మరో మారు రావణకాష్టంగా మారింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో శుక్రవారం ఉదయం జంట హత్యలు జరిగాయి. ఇందులో ఒకరు తెలుగుదేశం నేత కాగా, మరొకరు కాంగ్రెస్ నేత. ఇద్దరి హత్యలకు పాత కక్షలే ప్రధాన కారణంగా నిలిచాయి.
Source: ఏపీ న్యూస్ | 24 Jul 2009 | 6:43 am

అన్నా తిరిగి నటించవా? లేదంటే 22న ర్యాలీ చేస్తాం!

పీఆర్పీ అధినేత, మెగాస్టార్ అధినేత చిరంజీవి మళ్ళీ సినిమాల్లో నటించాలని ఒత్తిడితేవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. చిరంజీవి రాజకీయాల్లోకి రావాలని అభిమానులు ఏ విధంగా ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించారో, అదే తరహాలో సినిమాల్లోనూ తిరిగి నటించాలని ఆయనపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా.. చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అభిమాన సంఘాలు ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిసింది.
Source: ఏపీ న్యూస్ | 24 Jul 2009 | 6:38 am

భూ సేకరణ బిల్లును వ్యతిరేకించిన మమతా

గురువారం రాత్రి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో భూ సేకరణ బిల్లు-2007ను ఆమె తిరస్కరించినట్టు తెలుస్తోంది. కేబినెట్ భేటీలో ఈ బిల్లుతో పాటు.. పునరావాసం, పునఃపరిష్కారం బిల్లు అంశాలు ప్రధాన అజెండాగా కేబినెట్ సమావేశం జరిగింది.
Source: జాతీయ | 24 Jul 2009 | 6:21 am

స్పీకర్ అల్పాహార విందుకు "దేశం" డుమ్మా

రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకుని సభాపతి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఉదయం ఇచ్చిన అల్పాహార విందుకు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి చెందిన సభ్యులు గైర్హాజరయ్యారు.
Source: ఏపీ న్యూస్ | 24 Jul 2009 | 5:47 am

నేడు అసెంబ్లీలో రాష్ట్ర వార్షిక బడ్జెట్ దాఖలు

రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను విత్తమంత్రి కొణిజేటి రోశయ్య శుక్రవారం మధ్యాహ్నం 12.30 నిమిషాలకు శాసనసభలో దాఖలు చేయనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండానే 2009-10 పూర్తి బడ్జెట్‌ రూ.98 వేల కోట్లు దాటుతుందని అధికారుల అంచనా వేస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 24 Jul 2009 | 5:37 am

దేశంలో 371కి చేరిన స్వైన్ ఫ్లూ కేసులు

దేశంలో స్వైన్ ఫ్లూ బారినపడిన రోగుల సంఖ్య గురువారం 371కి పెరిగింది. తాజాగా 29 కొత్త స్వైన్ ఫ్లూ కేసులు వెలుగుచూశాయని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. వీటిలో ఏడు ఢిల్లీలో, బెంగళూరులో ఆరు, చెన్నైలో నాలుగు, హైదరాబాద్‌లో మూడు, పూణేలో నాలుగు, గోవాలో రెండు, కోయంబత్తూరులో ఒక కేసు గుర్తించారు.
Source: జాతీయ | 24 Jul 2009 | 4:10 am

నేతల భద్రతపై రాజీ లేదు: ప్రణబ్ ముఖర్జీ

రాజకీయ నేతల భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజీ పడబోదని ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ హామీ ఇచ్చారు. ఆయన గురువారం మాట్లాడుతూ.. నేతల భద్రత విషయంలో ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తే లేదన్నారు.
Source: జాతీయ | 24 Jul 2009 | 4:03 am

నన్నేమన్నా అంటే నా కుక్క పగలబడి పీకుతుంది: బిపాస

బాలీవుడ్ సెక్సీరాణి బిపాసాబసు మగాళ్లతో విసిగిపోయినట్లు మాటాడుతోంది. మాటమార్చే మగాళ్లకంటే విశ్వాసం చూపించే కుక్క నయం అంటోదట. ఇవాళ చెప్పింది రేపు చెప్పలేదనే మగాళ్లకంటే, ఒక్కసారి స్నేహం చేస్తే తోక ఊపుకుంటూ తనవద్దే కూచుకుని తనను చూస్తూ గుటకలు మింగే బుల్లికుక్క అంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చిందట. "మీరు కుక్కను అంతగా నమ్మడానికి కారణమేమిటి మిస్" అని ఓ పిల్ల జర్నలిస్టు అడిగితే... దానికి చాలా కారణాలున్నాయని అంటోందట.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Jul 2009 | 8:55 pm

హైదరాబాదులో "కొమరంపులి" షూటింగ్!

"ఖుషి" తర్వాత ప్రముఖ దర్శకుడు ఎస్.జె. సూర్య, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం "కొమరంపులి". ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో జరుగుతోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Jul 2009 | 7:20 pm

"లేచిపోదామా" అంటోన్న "సంధ్య" పర్సనల్ టచ్

"ప్రేమిస్తే" సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన యంగ్ హీరోయిన్, అందాల ముద్దుగుమ్మ సంధ్య. ప్రేమిస్తే సినిమా పోస్టర్లు చూసి ఇంత చిన్న పిల్ల హీరోయినా అని అందరూ అనుకున్నారు. కానీ "ప్రేమిస్తే"లో అద్భుతంగా నటించి ప్రేక్షకుల నుంచి మంచి పేరు కొట్టేసింది. తర్వాత "అన్నవరం"లో పవన్ కళ్యాణ్ చెల్లెలిగా, "వల్లభ"లో శింబు స్నేహితురాలిగా కనిపించింది. మంచి నటిగా పేరు తెచ్చుకున్న సంధ్య.. తాజాగా సంగీత సోదరుడు పరిమళ్ హీరోగా నటించే "లేచిపోదామా" చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. పుట్టినరోజు: 27-09-1989,జన్మస్థలం: అలువ (కేరళ), నచ్చే హీరోలు: కమల్ హాసన్, సూర్య, నచ్చే హీరోయిన్లు: శోభన, జ్యోతిక, హాబీలు: సంగీతం వినడం, సినిమాలు చూడటం, డాన్స్ చేయడం నచ్చే రంగు: నలుపు, నచ్చే ఆహారం: దోశెలు, చికెన్ ఫ్రై, నచ్చే దుస్తులు: జీన్స్, టాప్స్.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Jul 2009 | 6:38 pm

స్వయంవరంతో ఆ ముగ్గురికీ పిచ్చెక్కిస్తున్న రాఖీ

సహజంగా అబ్బాయి తరపువారు అమ్మాయిల ఇంటికి వెళ్లి, మంచి చెడులు చూసుకుంటారు. రాఖీ మాత్రం దీనికి వ్యతిరేకంగా అబ్బాయిల ఇళ్లకే వెళ్లి వారి వ్యవహారాలను వడపోత పోసింది. ఈ తంతు ముగిసిన తర్వాత ఆ ముగ్గురిలో ఎవరిని వివాహం చేసుకుంటావు? అని ప్రశ్నిస్తే... చూస్తుండండి ఎవర్ని చేసుకుంటానో...? అంటోందట. ఇంకా సస్పెన్సే. ఆమెతో సన్నిహితంగా మెలిగేవారు మాత్రం రాఖీ పెద్ద తిక్క మనిషి అనీ, గంటకో మాట మాట్లాడే అలవాటు రాఖీదని కొంతమంది వద్ద సన్నగా గొణుగుతున్నారట. ఇదిలావుండగా రాఖీ ఆ ముగ్గురిలో ఒక వరునిపై అమితంగా ప్రేమను పెంచేసుకుందట. అతని పేరు ఎలీష్ పరుజన్‌వాలా. అతను కెనడాలో బడా వ్యాపారవేత్త. మూటలకు మూటలు డబ్బు గడించి ఇనప్పెట్టెల నిండుగా ఉంచాడట. బహుశా ఈ ధనవంతుడైన అబ్బాయినే రాఖీ పెళ్లి చేసుకుంటుందంటున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Jul 2009 | 4:04 pm

అమాయకత్వం వల్ల మోసపోయా: మయూరి

ఆదిలో "లక్స్‌పాప"గా తెరపై అందాల్ని ఆరబోసిన ఆషాషైనీ 'నరసింహనాయుడు' తర్వాత హీరోయిన్‌గా నిలబడలేకపోయింది. ఆ తర్వాత అరకొరగా ఐటంసాంగ్స్‌లోనటించింది. తదనంతరం పాస్‌పోర్ట్‌ వివాదంలో చిక్కుకుంది. ఇవన్నీ జాతకం బాగోకనే జరుగుతున్నాయని మయూరిగా పేరు మార్చుకుంది. మొన్ననే 'ఆ ఇంట్లో' చిత్రంలో నటించింది. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌ వచ్చిన మయూరితో పిచ్చాపాటీ..ప్రశ్న: 'ఆ ఇంట్లో' పాత్రకు ఎలాంటి రెస్పాన్స్‌ వచ్చింది?జ: ప్రేక్షకులు చాలా బాగుందని అభినందిస్తున్నారు. ప్రశ్న: ఎలాంటి పాత్రలు చేస్తారు?జ: ఇలా వచ్చి అలా వెళ్ళే రోల్స్ కాకుండా.. ఆ ఇంట్లో పాత్రలాగా.ప్రశ్న: మరి ఐటంసాగ్స్‌ చేయరా?జ: అప్పుడప్పుడు తప్పదు. కానీ అచ్చం ఐటంసాంగ్స్‌ కాకుండా చిన్నపాత్రైనా పెద్దబేనర్‌, హీరోల చిత్రాల్లో నటిస్తాను. ప్రశ్న: పాస్‌పోర్ట్‌ గొడవ సమసిపోయిందా?జ: అయిపోయిన దాని గురించి ప్రస్తావన వద్దు. మొత్తానికి నేను నిర్దోషినని తేలిపోయింది.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Jul 2009 | 3:57 pm

విడుదలకు సిద్ధమైన నవదీప్ "యాగం"

"చందమామ" ఫేమ్ నవదీప్ హీరోగా నటిస్తోన్న "యాగం" సినిమా విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది. బాలీవుడ్ సెక్సీతార కిమ్ శర్మ, అందాల రాశి భూమిక కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో నవదీప్, కిమ్‌శర్మలు ఓ బార్‌లో పనిచేస్తున్నట్లు నటిస్తుండగా, భూమిక ఎయిర్ హోస్టెస్‌ పాత్రను పోషిస్తోంది. థాయిలాండ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి పి. ఎ. అరుణ్ ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Jul 2009 | 3:16 pm

ప్రజారాజ్యానికి సూర్యుడు గుర్తు: ఈసీ

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సూర్యుడు గుర్తును ఎన్నికల గుర్తుగా వినియోగించుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రజారాజ్యం పార్టీకి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు సూర్యుడు గుర్తు ధృవీకరణ పత్రాన్ని ఎన్నికల కమిషనర్ ఏవీఎస్.రెడ్డి గురువారం ప్రరాపా నేతలకు అందజేశారు.
Source: ఏపీ న్యూస్ | 23 Jul 2009 | 2:18 pm

జీహెచ్‌ఎంసీ నోటిఫికేషన్ విడుదలలో జాప్యం

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ జారీలో జాప్యం నెలకొంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని డివిజన్ల పునర్విభజనతో పాటు.. రిజర్వేషన్లపై పలు విమర్శలు వచ్చాయి. అధికార పార్టీకి అనుకూలంగా ఈ పునర్వభజన ఉందని అన్ని రాజకీయ పార్టీల నేతలు ఆరోపించారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించారు.
Source: ఏపీ న్యూస్ | 23 Jul 2009 | 1:52 pm

త్వరలోనే గుర్తింపు సంఖ్య కేటాయింపు: నందన్ నీలేకని

దేశ పౌరులందరికీ వీలైనంత త్వరలోనే జాతీయ గుర్తింపు సంఖ్యను అందజేస్తామని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఛైర్మన్ నందన్ నీలేకని చెప్పారు. ఆయన ఈ బృహత్తర ప్రాజెక్టు డైరక్టరుగా గురువారం బాధ్యతలు స్వీకరించారు.
Source: జాతీయ | 23 Jul 2009 | 1:14 pm

మైఖేల్ జాక్సన్‌కు నాలుగో బిడ్డ ఉన్నాడట..?!!

పాప్ సామ్రాజ్య రారాజు మైఖేల్ జాక్సన్‌కు నాలుగో బిడ్డ ఉన్నాడని సన్ ఆన్‌లైన్ పత్రిక వెల్లడించింది. ఒమర్ బట్టి(25) అనే పేరుతో నానీ పియాకు పుట్టిన సంతానాన్ని జాక్సన్ నాలుగో బిడ్డగా ఆ పత్రిక ప్రచురించింది. 1984లో ఒక రాత్రి జరిగిన సంఘటనతో తనకు ఒమర్ బట్టి జన్మించాడని జాక్సన్ 2004లో తన మిత్రులకు చెప్పినట్లుగా సన్ ఆన్‌లైన్ పత్రిక వెల్లడించింది. ఈ ఆరోపణలు ఎంతవరకు నిజమనేది తెలియాలంటే..? ఒమర్ డీఎన్ఏ పరీక్షల ఫలితాలు వచ్చేంతవరకు ఆగాల్సిందే. ఇదే విషయాన్ని నాని పియా భర్త రిజ్ దృష్టికి తీసుకెళితే ఆయన ఏ మాత్రం నోరువిప్పలేదు.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Jul 2009 | 12:15 pm

విశాఖలో తథాగతుడి "బుద్ధం శరణం గచ్చామి"

ఒకప్పుడు ఎక్కడో మగధ సామ్రాజ్యంలో "బుద్ధం శరణం గచ్చామి" అని వినిపిస్తే చాలు ఈ పట్టణం పరవశంతో పులకించిపోయేది. వెంటనే "ధర్మం శరణం గచ్చామి" అంటూ తానూ గొంతు కలిపేది. హీనయాన, మహాయాన బౌద్ధ భిక్షువులెందరికో ఆశ్రయం ఇస్తూ...
Source: వినోదం | 23 Jul 2009 | 11:47 am

కసబ్ ప్రకటనపై తగిన సమయంలో నిర్ణయం: జడ్జి

తీవ్రవాది అజ్మల్ కసబ్ కోర్టులో చేసిన ప్రకటనపై తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని ప్రత్యేక కోర్టు జడ్జి ఎం.ఎల్.తహిల్యాని తెలిపారు. దీన్ని ఆధారంగా చేసుకుని ఇపుడే తుది తీర్పు వెల్లడించలేమని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. అదేసమయంలో కసబ్‌పై కొనసాగిస్తున్న విచారణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Source: జాతీయ | 23 Jul 2009 | 11:39 am

స్వయంవరంతో ఆ ముగ్గురికీ పిచ్చెక్కిస్తున్న రాఖీ

సహజంగా అబ్బాయి తరపువారు అమ్మాయిల ఇంటికి వెళ్లి, మంచి చెడులు చూసుకుంటారు. రాఖీ మాత్రం దీనికి వ్యతిరేకంగా అబ్బాయిల ఇళ్లకే వెళ్లి వారి వ్యవహారాలను వడపోత పోసింది. ఈ తంతు ముగిసిన తర్వాత ఆ ముగ్గురిలో ఎవరిని వివాహం చేసుకుంటావు? అని ప్రశ్నిస్తే... చూస్తుండండి...
Source: వినోదం | 23 Jul 2009 | 10:36 am

"ఆ నలుగురు"కు భద్రత యధాతథం: కేంద్రం

పలు రాజకీయ పార్టీలకు చెందిన అధినేతల భద్రతపై గురువారం రాజ్యసభ దద్దరిల్లింది. ఈ అంశంపై ప్రభుత్వం జోక్యం చేసుకుని వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతితో పాటు.. ఎస్పీ, ఆర్జేడీ అధినేతలు ములాయం సింగ్, లాలూ ప్రసాద్ యాదవ్‌, భాజపా నేత మురళీమనోహర్ జోషీలకు ఎన్.ఎస్.జి భద్రతను యధావిధిగా కొనసాగించనున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది.
Source: జాతీయ | 23 Jul 2009 | 10:07 am