|
రాష్ట్రంలో పలువురు ఐపీఎస్‌లకు స్థానభ్రంశంరాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత భారీ సంఖ్యలో ఐపీఎస్‌లకు స్థానంభ్రంశం కలిగించింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.Source: Yahoo! Telugu: News | 23 Jul 2009 | 4:42 pm డిసెంబర్‌లో మొబైల్ పోర్టబిలిటీ: టెలికాం శాఖవినియోగదారులకు ఇది ఒకరకంగా శుభవార్తనే చెప్పొచ్చు. ఎందుకంటే.. ఇప్పటికే తమ వద్ద ఉన్న మొబైల్ నెంబర్‌ను మార్చే పని లేకుండా.. ఒక టెలికాం సర్వీసు ప్రొవైడర్ నుండి మరొక టెలికాం సర్వీసు ప్రొవైడర్‌కు మారిపోయే సౌకర్యాన్ని టెలికాం శాఖ మరి కొద్ది రోజుల్లో అందుబాటులోకి తేనుంది.Source: Yahoo! Telugu: News | 23 Jul 2009 | 4:23 pm ఫజ్లుల్లా బతికే ఉన్నాడు: పాకిస్థాన్ తాలిబాన్పాకిస్థాన్ వాయువ్య ప్రాంతంలోని సమస్యాత్మక స్వాత్ లోయలో తీవ్రవాదులకు నేతృత్వం వహిస్తున్న తాలిబాన్ కమాండర్ ఫజ్లుల్లా బతికే ఉన్నాడని, అతనికి ఎటువంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. ఈ విషయాన్ని గురువారం తాలిబాన్ ప్రతినిధులు వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 23 Jul 2009 | 4:23 pm లోక్‌సత్తాలో తిరుగుబాటు: జేపీకి లేఖగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమరానికి ముందు లోక్‌సత్తా పార్టీలో అసమ్మతి గళం రాజుకుంది. ఆ పార్టీకి చెందిన కొంతమంది నేతలు అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఈ మేరకు వారు గురువారం జేపీకి వారు బహిరంగ లేఖ రాశారు.Source: Yahoo! Telugu: News | 23 Jul 2009 | 4:07 pm స్వయంవరంతో ఆ ముగ్గురికీ పిచ్చెక్కిస్తున్న రాఖీసహజంగా అబ్బాయి తరపువారు అమ్మాయిల ఇంటికి వెళ్లి, మంచి చెడులు చూసుకుంటారు. రాఖీ మాత్రం దీనికి వ్యతిరేకంగా అబ్బాయిల ఇళ్లకే వెళ్లి వారి వ్యవహారాలను వడపోత పోసింది. ఈ తంతు ముగిసిన తర్వాత ఆ ముగ్గురిలో ఎవరిని వివాహం చేసుకుంటావు? అని ప్రశ్నిస్తే... చూస్తుండండి ఎవర్ని చేసుకుంటానో...? అంటోందట. ఇంకా సస్పెన్సే. ఆమెతో సన్నిహితంగా మెలిగేవారు మాత్రం రాఖీ పెద్ద తిక్క మనిషి అనీ, గంటకో మాట మాట్లాడే అలవాటు రాఖీదని కొంతమంది వద్ద సన్నగా గొణుగుతున్నారట. ఇదిలావుండగా రాఖీ ఆ ముగ్గురిలో ఒక వరునిపై అమితంగా ప్రేమను పెంచేసుకుందట. అతని పేరు ఎలీష్ పరుజన్‌వాలా. అతను కెనడాలో బడా వ్యాపారవేత్త. మూటలకు మూటలు డబ్బు గడించి ఇనప్పెట్టెల నిండుగా ఉంచాడట. బహుశా ఈ ధనవంతుడైన అబ్బాయినే రాఖీ పెళ్లి చేసుకుంటుందంటున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 23 Jul 2009 | 4:04 pm ఎంటీఎన్‌తో ఒప్పందంపై చర్చలు: భారతీదక్షిణాఫ్రికాకు చెందిన ఎంటీఎన్‌తో ఒప్పందంపై ఇప్పటికీ చర్చలు జరుగుతున్నాయని భారతీ ఎయిర్‌టెల్ లిమిటెడ్ గురువారం వెల్లడించింది. రెండు టెలికాం దిగ్గజాల విలీనానికి సంబంధించి గత కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు కంపెనీలు విలీనం జరిగే ఏర్పడే ఉమ్మడి సంస్థ రెవెన్యూ 20 బిలియన్ డాలర్లపైగా ఉంటుంది.Source: Yahoo! Telugu: News | 23 Jul 2009 | 3:58 pm అమాయకత్వం వల్ల మోసపోయా: మయూరిఆదిలో "లక్స్‌పాప"గా తెరపై అందాల్ని ఆరబోసిన ఆషాషైనీ 'నరసింహనాయుడు' తర్వాత హీరోయిన్‌గా నిలబడలేకపోయింది. ఆ తర్వాత అరకొరగా ఐటంసాంగ్స్‌లోనటించింది. తదనంతరం పాస్‌పోర్ట్ వివాదంలో చిక్కుకుంది. ఇవన్నీ జాతకం బాగోకనే జరుగుతున్నాయని మయూరిగా పేరు మార్చుకుంది. మొన్ననే 'ఆ ఇంట్లో' చిత్రంలో నటించింది. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్ వచ్చిన మయూరితో పిచ్చాపాటీ..ప్రశ్న: 'ఆ ఇంట్లో' పాత్రకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది?జ: ప్రేక్షకులు చాలా బాగుందని అభినందిస్తున్నారు. ప్రశ్న: ఎలాంటి పాత్రలు చేస్తారు?జ: ఇలా వచ్చి అలా వెళ్ళే రోల్స్ కాకుండా.. ఆ ఇంట్లో పాత్రలాగా.ప్రశ్న: మరి ఐటంసాగ్స్ చేయరా?జ: అప్పుడప్పుడు తప్పదు. కానీ అచ్చం ఐటంసాంగ్స్ కాకుండా చిన్నపాత్రైనా పెద్దబేనర్, హీరోల చిత్రాల్లో నటిస్తాను. ప్రశ్న: పాస్‌పోర్ట్ గొడవ సమసిపోయిందా?జ: అయిపోయిన దాని గురించి ప్రస్తావన వద్దు. మొత్తానికి నేను నిర్దోషినని తేలిపోయింది.Source: Yahoo! Telugu: Entertainment | 23 Jul 2009 | 3:57 pm 404 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్స్టాక్ మార్కెట్ భారీ లాభాల దిశగా పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 405 పాయింట్లు పుంజుకుని 15,248 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 125 పాయింట్లు లాభపడి 4,524 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 2.73 శాతం, నిఫ్టీ 2.84 శాతం చొప్పున బలపడ్డాయి.Source: Yahoo! Telugu: News | 23 Jul 2009 | 3:56 pm "ఆ నలుగురు"కు భద్రత యధాతథం: కేంద్రంపలు రాజకీయ పార్టీలకు చెందిన అధినేతల భద్రతపై గురువారం రాజ్యసభ దద్దరిల్లింది. ఈ అంశంపై ప్రభుత్వం జోక్యం చేసుకుని వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతితో పాటు.. ఎస్పీ, ఆర్జేడీ అధినేతలు ములాయం సింగ్, లాలూ ప్రసాద్ యాదవ్, భాజపా నేత మురళీమనోహర్ జోషీలకు ఎన్.ఎస్.జి భద్రతను యధావిధిగా కొనసాగించనున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది.Source: Yahoo! Telugu: News | 23 Jul 2009 | 3:36 pm యూఎస్, బ్రిటన్‌ల ప్రయోజనం కోసమే యుద్ధంఅమెరికా, బ్రిటన్ దేశాల ప్రయోజనాల కోసమే ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్ తీవ్రవాదులపై యుద్ధం జరుగుతోందని యూఎస్ ఉపాధ్యక్షుడు జో బిడెన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. బీబీసీతో బిడెన్ మాట్లాడుతూ.. వివాదాస్పద గ్వాంటనామో బే జైలును ప్రణాళికబద్ధంగా జనవరి 2010నాటికి మూసివేయనున్నట్లు వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 23 Jul 2009 | 3:16 pm విడుదలకు సిద్ధమైన నవదీప్ "యాగం""చందమామ" ఫేమ్ నవదీప్ హీరోగా నటిస్తోన్న "యాగం" సినిమా విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది. బాలీవుడ్ సెక్సీతార కిమ్ శర్మ, అందాల రాశి భూమిక కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో నవదీప్, కిమ్‌శర్మలు ఓ బార్‌లో పనిచేస్తున్నట్లు నటిస్తుండగా, భూమిక ఎయిర్ హోస్టెస్ పాత్రను పోషిస్తోంది. థాయిలాండ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి పి. ఎ. అరుణ్ ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 23 Jul 2009 | 3:16 pm 224 పాయింట్ల లాభంతో సెన్సెక్స్స్టాక్ మార్కెట్ లాభాల్లో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 362 పాయింట్లు పుంజుకుని 15,205 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 113 పాయింట్లు బలపడి 4,512 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 2.44 శాతం, నిఫ్టీ 2.56 శాతం మేరకు వృద్ధి చెందాయి.Source: Yahoo! Telugu: News | 23 Jul 2009 | 2:45 pm లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్స్టాక్ మార్కెట్ ప్రస్తుతం లాభాల్లో కొనసాగుతుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 220 పాయింట్లు పుంజుకుని 15,063 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 72 పాయింట్లు లాభపడి 4,471 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 1.48 శాతం, నిఫ్టీ 1.65 శాతం మేరకు వృద్ధి చెందింది.Source: Yahoo! Telugu: News | 23 Jul 2009 | 1:46 pm మైఖేల్ జాక్సన్‌కు నాలుగో బిడ్డ ఉన్నాడట..?!!పాప్ సామ్రాజ్య రారాజు మైఖేల్ జాక్సన్‌కు నాలుగో బిడ్డ ఉన్నాడని సన్ ఆన్‌లైన్ పత్రిక వెల్లడించింది. ఒమర్ బట్టి(25) అనే పేరుతో నానీ పియాకు పుట్టిన సంతానాన్ని జాక్సన్ నాలుగో బిడ్డగా ఆ పత్రిక ప్రచురించింది. 1984లో ఒక రాత్రి జరిగిన సంఘటనతో తనకు ఒమర్ బట్టి జన్మించాడని జాక్సన్ 2004లో తన మిత్రులకు చెప్పినట్లుగా సన్ ఆన్‌లైన్ పత్రిక వెల్లడించింది. ఈ ఆరోపణలు ఎంతవరకు నిజమనేది తెలియాలంటే..? ఒమర్ డీఎన్ఏ పరీక్షల ఫలితాలు వచ్చేంతవరకు ఆగాల్సిందే. ఇదే విషయాన్ని నాని పియా భర్త రిజ్ దృష్టికి తీసుకెళితే ఆయన ఏ మాత్రం నోరువిప్పలేదు.Source: Yahoo! Telugu: Entertainment | 23 Jul 2009 | 12:15 pm కృష్ణవంశీ ఔట్.. సురేందర్‌రెడ్డి ఇన్..!"అనంతపురం 1980" ఫేమ్ శశికుమార్ నటించిన తాజా తమిళ చిత్రం "నాడోడిగళ్" తెలుగు హక్కులను ప్రముఖ దర్శకుడు బెల్లంకొండ సురేందర్ రెడ్డి పొందారు. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ సినిమాను అద్భుతంగా రూపొందించే దిశగా సన్నాహాలు చేస్తున్నారు. ఇంకా "నాడోడిగళ్" మల్టీస్టారర్ సినిమా కాబట్టి తెలుగులో రవితేజ, అల్లరి నరేష్‌తోపాటు మరో నటుడిని ఎంపిక చేసే ప్రయత్నంలో ఉన్నారు. అందులో హీరోయిన్‌గా ప్రియమణిని ఎంపికచేయనున్నట్లు సమాచారం. లేదంటే.. లక్ష్మీరాయ్ కూడా అనుకుంటున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 23 Jul 2009 | 11:15 am రాష్ట్రంలో పలువురు ఐపీఎస్‌లకు స్థానభ్రంశంరాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత భారీ సంఖ్యలో ఐపీఎస్‌లకు స్థానంభ్రంశం కలిగించింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.Source: ఏపీ న్యూస్ | 23 Jul 2009 | 11:12 am బొడ్డు చుట్టూ వెయ్ టాటూ.. ఎదపై వెయ్ టాటూ.. ఇంకెక్కడేస్తావ్ టాటూ...ముంబై, గోవా బారుల్లో టాటూలతో (పచ్చబొట్లు) వేయించుకుని యువతను మత్తెక్కించే ఆచారం వెండితెరపై ఎక్కువయింది. సెక్సీతార ముమైత్‌ఖాన్ బొడ్డుచుట్టు, ఎదపై కూడా టాటూ వేయించుకుంది. ఇదేవిధంగా నటి త్రిష కూడా తన ఎద భాగంలో టాటూ వేయించుకుంది. అలాగే నయనతార సెల్యూట్, బిల్లాలో హాట్‌హాట్‌గా కన్పించి అదరగొట్టింది. మొన్నీమధ్య హైటెక్ సిటీలోని ఫ్యాషన్ కాలేజీలో జరిగిన ఓ షోకు సినీరంగ ప్రముఖులు హాజరయ్యారు. అందులో ఓ యువతి బొడ్డుకింద టాటూ వేయించుకుని అక్కడివారికి జలక్ ఇచ్చింది.బొడ్డుకింద డ్రెస్ ఊడిపోతుందా? అన్నట్లుగా వస్త్రధారణ కట్టుకుంది. దీంతో ఆమె అందానికి ముగ్ధుడై ఓ ప్రముఖుడు తను తీయబోయే చిత్రంలోఆమెకు ఓ పాత్ర ఇస్తానని హామీ ఇచ్చాడట. అదే నిజమైతే హైదరాబాద్‌లోనూ టాటూల తాకిడి ఎక్కువవుతుందేమో..?!!.Source: Yahoo! Telugu: Entertainment | 23 Jul 2009 | 10:59 am లోక్‌సత్తాలో తిరుగుబాటు: జేపీకి లేఖగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమరానికి ముందు లోక్‌సత్తా పార్టీలో అసమ్మతి గళం రాజుకుంది. ఆ పార్టీకి చెందిన కొంతమంది నేతలు అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఈ మేరకు వారు గురువారం జేపీకి వారు బహిరంగ లేఖ రాశారు.Source: ఏపీ న్యూస్ | 23 Jul 2009 | 10:38 am "ఆ నలుగురు"కు భద్రత యధాతథం: కేంద్రంపలు రాజకీయ పార్టీలకు చెందిన అధినేతల భద్రతపై గురువారం రాజ్యసభ దద్దరిల్లింది. ఈ అంశంపై ప్రభుత్వం జోక్యం చేసుకుని వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతితో పాటు.. ఎస్పీ, ఆర్జేడీ అధినేతలు ములాయం సింగ్, లాలూ ప్రసాద్ యాదవ్, భాజపా నేత మురళీమనోహర్ జోషీలకు ఎన్.ఎస్.జి భద్రతను యధావిధిగా కొనసాగించనున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది.Source: జాతీయ | 23 Jul 2009 | 10:07 am పాక్ మీడియా వార్తల్లో నిజం లేదు: శశి థరూర్తమ దేశంలో తీవ్రవాద కార్యకలాపాలను భారత్ ప్రోత్సహిస్తుందనేందుకు సంబంధించిన సాక్ష్యాధారాల నివేదికను పాక్ యంత్రాంగం భారత్‌కు అందజేసిందని పాకిస్థాన్ మీడియాలో వచ్చిన వార్తలో అణుమాత్రం నిజం లేదని కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి శశిథరూర్ స్పష్టం చేశారు.Source: జాతీయ | 23 Jul 2009 | 7:40 am నిఘా నీడలో 24 నుంచి అసెంబ్లీ సమావేశాలురాష్ట్ర శాసనసభ సమావేశాలు శుక్రవారం (24వ తేదీ) నుంచి ప్రారంభంకానున్నాయి. తీవ్రవాదుల నుంచి ముప్పు పొంచివుందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో సమావేశమవుతున్న అసెంబ్లీకి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.Source: ఏపీ న్యూస్ | 23 Jul 2009 | 6:57 am వీహెచ్‌పీ నేత హత్య: లొంగిపోయిన నిందితులుఒరిస్సా రాష్ట్రంలోని కంధమాల్ జిల్లాలో గత యేడాది జరిగిన విశ్వహిందూ పరిషత్ నేత హత్య కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు.Source: జాతీయ | 23 Jul 2009 | 6:43 am నాకు ఎలాంటి క్షమాపణ లేఖ అందలేదు: కలాంతనకు జరిగిన అమర్యాదకర చర్యలకు కాంటినెంటల్ ఎయిర్‌లైన్స్ సంస్థ నుంచి ఎలాంటి క్షమాపణ లేఖ తనకు అందలేదని మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం స్పష్టం చేశారు. సంబంధిత ఎయిర్‌లైన్ సంస్థ నుంచి ఎలాంటి సమాచారం తనకు అందలేదు అని కలాం గురువారం మీడియాకు చెప్పారు.Source: జాతీయ | 23 Jul 2009 | 6:32 am సాయిరామ్‌కు ఉస్మానియాలో మెడికల్ సీటుఎంసెట్ ప్రవేశ పరీక్షలో రాష్ట్రంలో తొమ్మిదో ర్యాంకు సాధించిన సాయిరామ్‌కు ఉస్మానియా వైద్య కళాశాలలో సీటు కేటాయించారు. వైద్య మండలి నిబంధన కంటే సాయిరామ్ వయస్సు 15 రోజులు తక్కువగా ఉంది. దీంతో అతన్ని ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం సీటు కేటాయించేందుకు నిరాకరించింది.Source: ఏపీ న్యూస్ | 23 Jul 2009 | 5:49 am ప్రజలే సైన్యం.. విధానాలే అస్త్రాలు: జేపీగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోరుకు నగర వాసులు సమాయాత్తం కావాలని లోక్‌సత్తా అధినేత డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ పిలుపునిచ్చారు. తాము చేయనున్న ధర్మపోరాటనికి నగరంలోని ప్రతి పౌరుడు తమ వంతు సహకారం అందించాలని ఆయన కోరారు.Source: ఏపీ న్యూస్ | 23 Jul 2009 | 5:41 am తెగతెంపులు చేసుకుంటేనే పొత్తు: చిరంజీవిప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీతో తెగతెంపులు చేసుకుంటేనే వామపక్షాలతో పొత్తు పెట్టుకునేందుకు తాము సిద్ధమని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు కె.చిరంజీవి తేల్చి చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసం తాము తెదేపాతో పొత్తుల కోసం వెంపర్లాడటం లేదని ఆయన స్పష్టం చేశారు.Source: ఏపీ న్యూస్ | 23 Jul 2009 | 5:26 am క్రేన్ ప్రమాదానికి గామన్ ఇండియానే కారణంఢిల్లీ మెట్రో రైలు ప్రమాదానికి గామన్ ఇండియానే కారణమని ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్న డీఎంఆర్‌సీ కమిటీ పేర్కొంది. ఢిల్లీ మెట్రో రైలు నిర్మాణ ప్రదేశంలో జరిగిన క్రేను ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్న కమిటీ శిథిలాల తొలగింపు ప్రక్రియను పరిశీలించింది. అనంతరం ఈ అసాధారణ ఘటనకు గామన్ ఇండియా కాంట్రాక్టరే బాధ్యుడని కమిటీ తేల్చింది.Source: జాతీయ | 23 Jul 2009 | 4:28 am నక్సలిజంపై రాజీపడరాదు: పి. చిదంబరంకేంద్ర హోం శాఖ మంత్రి పి.చిదంబరం ఇప్పటికీ దేశం తీవ్రవాద ముప్పు ఎదుర్కొంటుందని బుధవారం పార్లమెంట్‌కు తెలియజేశారు. గడిచిన ఆరు నెలల కాలంలో హోంశాఖ పనితీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కాలంలో మదానీతోపాటు, గణనీయమైన సంఖ్యలో కరుడుగట్టిన తీవ్రవాదులను అరెస్టు చేశామని వివరించారు.Source: జాతీయ | 23 Jul 2009 | 3:56 am ప్రియాంకా... మళ్లీ అడవికెళ్దాం పద: రామ్‌గోపాల్ వర్మరామ్గోపాల్ వర్మ ఏ చిత్రం చేసినా ఆయన టేకింగ్, థింకింగ్.. అంతా డిఫరెంట్. ఆయన తాజాగా రూపొందిస్తున్న "అడవి"లో ప్రియాంకా కొఠారి అరణ్యంలోని ముళ్ల తుప్పల మధ్య మహా గరం గరంగా కనబడుతుంది. ఇదంతా బాగానే ఉంది... కానీ ప్రియాంక మాత్రం ఆ అడవికి వెళ్లొచ్చిన తర్వాత శరీరమంతా చీరుకుపోయి గాయాలతో మూలుగుతోందట. తన సున్నితమైన శరీరాన్ని అడవిలోని సూదంటు ఆకులు, మొనదేలిన ముళ్లు గుచ్చుకుని ఆమెకు చెప్పలేనంత నొప్పి పెడుతున్నాయట. ఆమె ఇలా బాధపడుతుంటే.. రామ్‌గోపాల్ వర్మ మళ్లీ అదే అడవిలోకి మరోసారి పాటల చిత్రీకరణ కోసం వెళ్లాలని ప్రియాంకతో చెప్పాడట. అంతే కొఠారి "కుయ్యో"మని పెద్దగా మూలుగుతూ... నేను రాను "మొర్రో" అందట. నటించిన సన్నివేశాలకు పాటలు ఖచ్చితంగా అతుక్కుపోవాలంటే, అడవిలోకి వెళ్లాల్సిందే అని వర్మ గట్టిగా చెప్పటంతో కొఠారి తన గాయాలను రాముకు చూపిందట. దాంతో మెత్తబడిన వర్మ, సరే లోకల్ బీచ్‌లో పాటలను కానించేద్దాం అని సముదాయించాడట.Source: Yahoo! Telugu: Entertainment | 22 Jul 2009 | 8:20 pm 'తుషార్ గాంధీ'చే "మహాత్మా" ఆడియో విడుదల?టాలీవుడ్ అగ్రహీరో శ్రీకాంత్ కథానాయకుడిగా కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న చిత్రం 'మహాత్మా'. మహాత్మాగాంధీ ఆశయాలు నేపథ్యంలో ఈనాటి ట్రెండ్‌కు అనుగుణంగా చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. దాదాపు షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఆడియోను ఆగస్టు 15న విడుదలచేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో విశేషమేమంటే..? గాంధీ మనవడు "తుషార్‌గాంధీ" చేతులమీదుగా ఈ కార్యక్రమాన్ని జరపాలని చిత్ర యూనిట్ సభ్యులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 22 Jul 2009 | 6:09 pm అల్లరి నరేష్‌తో "ఉషాకిరణ్ మూవీస్" కొత్త చిత్రంకొత్తవారికి అవకాశం కల్పించే ఉషాకిరణ్ మూవీస్ తాజాగా శివనాగేశ్వరరావు దర్శకత్వంలో 'నిన్నే నిన్నే' చిత్రాన్ని నిర్మిస్తుంది. దీనిలో కొత్తవారిని పరిచయం చేస్తున్నారు. ఆ వివరాలు త్వరలో తెలియజేస్తామని ఎగ్జిక్యూటివ్ నిర్మాత రవిబాబు చెబుతున్నారు.ఈ చిత్రం తర్వాత "అల్లరి నరేష్"తో ఓ చిత్రాన్ని నిర్మించడానికి ఉషాకిరణ్ మూవీస్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.Source: Yahoo! Telugu: Entertainment | 22 Jul 2009 | 5:48 pm ఆగస్టు 15న తెరపైకి రానున్న "పోలీస్ స్టైల్"సంఘవి, ఉదయ్ హీరోహీరోయిన్లుగా జై భవాని క్రియేషన్స్ పతాకంపై చిన్న శ్రీశైలం యాదవ్ సమర్పణలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం "పోలీస్ స్టైల్". ఆర్.ఆర్. దేవరపల్లి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను ఎ. రాజు సాగర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 15వ తేదీన విడుదల చేసేందుకు రంగం సిద్ధమౌతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆనంద్ మాస్టర్ ఆధ్వర్యంలో రామిరెడ్డి, అల్లరి సుభాషినిపై చిత్రీకరించిన సాంగ్ ప్రేక్షకులకు కడుపుబ్బ నవ్విస్తుందన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 22 Jul 2009 | 5:46 pm ఆంధ్ర వంటకాలను ఆరగించిన రాహుల్ గాంధీకాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ బుధవారం ఆంధ్ర వంటకాలను ఆరగించారు. అది మన రాష్ట్రంలో అంటే కాదు. హస్తినాపురిలో ఉన్న ఆంధ్రభవన్‌లో బుధవారం మధ్యాహ్నం అనుకోని అతిథిలా విచ్చేశారు. ఆయన వెంట రాజస్థాన్‌కు చెందిన యువ ఎంపీ జితేందర్ సింగ్ కూడా ఉన్నారు.Source: ఏపీ న్యూస్ | 22 Jul 2009 | 2:54 pm యువ నేరచరితులపై ఉపేక్ష లేదు: రాహుల్దేశ జనాభాలో యువకుల శాతం 54 శాతంగా ఉంది. వీరిలో ఎక్కువ మందిని కాంగ్రెస్ వైపు ఆకర్షించేందుకు రాహుల్ గాంధీ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. అదేసమయంలో పార్టీలో చేర్చుకునే యువకులు ఎలాంటి నేర చరితులై ఉండరాదన్నది ఆయన ప్రధాన లక్ష్యంగా ఉంది.Source: జాతీయ | 22 Jul 2009 | 1:42 pm 'తుషార్ గాంధీ'చే "మహాత్మా" ఆడియో విడుదల?టాలీవుడ్ అగ్రహీరో శ్రీకాంత్ కథానాయకుడిగా కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న చిత్రం 'మహాత్మా'. మహాత్మాగాంధీ ఆశయాలు నేపథ్యంలో ఈనాటి ట్రెండ్‌కు అనుగుణంగా చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.Source: వినోదం | 22 Jul 2009 | 1:16 pm రాష్ట్రంలో 48కు చేరిన స్వైన్ ఫ్లూ బాధితులురాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో బుధవారం మరో రెండు స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ కేసుల సంఖ్య 48కు చేరుకుంది. ఇటీవల లండన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ మహిళతో సహా నలుగురు పిల్లలకు స్వైన్ ఫ్లూ ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు.Source: ఏపీ న్యూస్ | 22 Jul 2009 | 12:25 pm అల్లరి నరేష్‌తో "ఉషాకిరణ్ మూవీస్" కొత్త చిత్రంకొత్తవారికి అవకాశం కల్పించే ఉషాకిరణ్ మూవీస్ తాజాగా శివనాగేశ్వరరావు దర్శకత్వంలో 'నిన్నే నిన్నే' చిత్రాన్ని నిర్మిస్తుంది. దీనిలో కొత్తవారిని పరిచయం చేస్తున్నారు. ఆ వివరాలు త్వరలో తెలియజేస్తామని ఎగ్జిక్యూటివ్ నిర్మాత రవిబాబు చెబుతున్నారు. ఈ చిత్రం తర్వాత "అల్లరి నరేష్"తో ఓ చిత్రాన్ని నిర్మించడానికి ఉషాకిరణ్ మూవీస్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.Source: వినోదం | 22 Jul 2009 | 12:19 pm ఆగస్టు 15న తెరపైకి రానున్న "పోలీస్ స్టైల్"సంఘవి, ఉదయ్ హీరోహీరోయిన్లుగా జై భవాని క్రియేషన్స్ పతాకంపై చిన్న శ్రీశైలం యాదవ్ సమర్పణలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం "పోలీస్ స్టైల్". ఆర్.ఆర్. దేవరపల్లి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను ఎ. రాజు సాగర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 15వ తేదీన విడుదల చేసేందుకు రంగం సిద్ధమౌతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆనంద్ మాస్టర్ ఆధ్వర్యంలో రామిరెడ్డి, అల్లరి సుభాషినిపై చిత్రీకరించిన సాంగ్ ప్రేక్షకులకు కడుపుబ్బ నవ్విస్తుందన్నారు.Source: వినోదం | 22 Jul 2009 | 12:16 pm బాండ్ గర్ల్ ఆఫర్‌ను తోసిపుచ్చిన "మేగాన్"హాలీవుడ్ ప్రముఖ తారల్లో ఒకరిగా వెలుగొందుతున్న మోడల్ మేగాన్ ఫాక్స్ కొత్త జేమ్స్‌బాండ్ సినిమాలో హీరోయిన్ అవకాశాన్ని తిరస్కరించింది. జేమ్స్‌బాండ్ సిరీస్‌లో రూపొందే తరువాతి చిత్రంలో హీరో డేనియల్ క్రైగ్ సరసన మేగాన్ ఫాక్స్‌ను బుక్ చేసుకునేందుకు సదరు నిర్మాతలు ఈ భామను సంప్రదించారు. అయితే 23 ఏళ్ల ఈ "ట్రాన్స్‌ఫార్మర్స్" సుందరి బాండ్ గర్ల్ ఆఫర్‌కు నిరాకరించింది. తన కెరీర్‌కు బాండ్ గర్ల్ పాత్ర ఉపయోగపడుతుందని మేగాన్ ఫాక్స్ భావించడం లేదని, అందువలనే ఈ ఆఫర్‌ను ఆమె తోసిపుచ్చిందని ఓ వైబ్‌సైట్ వెల్లడించింది. సినిమాలో ప్రధాన పాత్రగా ఉండే విలన్ పాత్ర చేయడానికైనా మేగాన్ ఆసక్తి చూపాలనుకుంది.Source: వినోదం | 22 Jul 2009 | 11:54 am ప్రజారాజ్యంతో చెలిమి లేదు: ఎర్రన్నాయుడుగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసం ప్రజారాజ్యం పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తెలుగుదేశం పార్టీ స్పష్టం చేసింది. ఈ అంశంపై ఆ పార్టీ సీనియర్ నేత కె.ఎర్రన్నాయుడు బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రరాపాతో పొత్తు ఉండే ప్రసక్తే లేదని చెప్పామన్నారు.Source: ఏపీ న్యూస్ | 22 Jul 2009 | 11:16 am ఇద్దరు హీరోలతో "డయాజ్" ప్రేమాయణం!హాలీవుడ్ అగ్రశ్రేణి హీరోయిన్ "కామెరోన్ డయాజ్" త్రిక్రోణ ప్రేమాయణం కొనసాగిస్తోందని తెలిసింది. "ద హాలిడే", "గాంగ్స్ ఆఫ్ న్యూయార్క్", "మై బెస్ట్ ఫ్రెండ్స్ వెడ్డింగ్" వంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన కామెరోన్ డయాజ్ (36), టైటానిక్ ఫేమ్ లియోనార్డో డీ కాప్రియో, 'కోల్డ్ మౌంటెన్' ఫేమ్ "జూడ్ లా"లతో ప్రేమాయణం సాగిస్తుందని హాలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. డయాజ్‌తో తెరమీద జంటగా నటించిన లియొనార్డో, జూడ్‌లిద్దరూ తెర బయట ఆమెతో చెట్టాపట్టాలేసుకుని తిరిగేందుకు తహతహలాడుతున్నారని సమాచారం. అంతేకాదు.. వీరిద్దరూ ఆమెతో రహస్యంగా డేటింగ్ కూడా జరుపుతున్నట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి.Source: వినోదం | 22 Jul 2009 | 11:14 am వెస్ట్ మిడ్నాపూర్‌లో సీపీఎం నేత కాల్చివేతపశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అధికార సీపీఎం పార్టీకి చెందిన నేతను మావోయిస్టులు కాల్చి చంపారు. వెస్ట్ మిడ్నాపూర్ జిల్లాలోని బుధవారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. కాగా, ఈ జిల్లాలో ఇలాంటి ఘటన జరగడం ఇది ఆరోది కావడం గమనార్హం.Source: జాతీయ | 22 Jul 2009 | 11:08 am మువ్వురు మూర్తుల క్షేత్రం "యాదగిరి"భగవంతుడి దశావతారాలలో నరసింహావతారానికి ఎంతో విశిష్టత ఉంది. భక్తవరదుడిగాను, దుష్ట శిక్షకుడిగాను, ధర్మ పరిరక్షకుడిగాను, ఆర్తులకు చేయూతనిచ్చే అసమాన దైవంగానూ భక్తజనకోటి హృదయాలలో సుస్థిర స్థానం సంపాందించుకున్న దేవుడు నరసింహస్వామి.Source: వినోదం | 22 Jul 2009 | 10:40 am
|