ఐదింతలు పెరిగిన లాభాలు: కెనరాబ్యాంక్

దేశీయ బ్యాంక్ అయిన కెనరా బ్యాంక్ 30 జూన్ 2009తో పరిసమాప్తమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలిత్రైమాసికంలో నికర లాభాలు ఐదింతలు పెరిగి రూ. 555.33 కోట్లకు చేరుకుంది.
Source: Yahoo! Telugu: News | 22 Jul 2009 | 3:42 pm

రెండు రోజుల్లో ప్రరాపా తొలి గ్రేటర్ జాబితా: చిరు

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను మరో రెండు రోజుల్లో విడుదల చేయనున్నట్టు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ప్రకటించారు. పొత్తులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
Source: Yahoo! Telugu: News | 22 Jul 2009 | 3:39 pm

స్టాక్ మార్కెట్లో పెరిగిన నష్టాలు

స్టాక్ మార్కెట్లో నష్టాలు మరింతగా పెరుగుతుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 203 పాయింట్లు కోల్పోయి 14,860 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 67 పాయింట్లు నష్టపోయి 4,402 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 1.35 శాతం, నిఫ్టీ 1.49 శాతం మేరకు క్షీణించాయి.
Source: Yahoo! Telugu: News | 22 Jul 2009 | 3:36 pm

పాకిస్థాన్‌లో 56 మంది తీవ్రవాదుల హతం

పాకిస్థాన్‌లోని సమస్యాత్మక నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్‌లో గత మూడు రోజులుగా సైనికులు సుమారు 56 మంది తీవ్రవాదులను హతమార్చారు. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో తాలిబాన్ తీవ్రవాదులతో పాక్ సైనికులు పోరాడుతున్నారు.
Source: Yahoo! Telugu: News | 22 Jul 2009 | 3:20 pm

ఉద్యోగులను తొలగించనున్న కాంటినెంటల్

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థికమాంద్యం కారణంగా అమెరికాకు చెందిన కాంటినెంటల్ ఎయిర్ లైన్స్ సంస్థ 17వందల మందిని ఉద్యోగాలలోనుంచి తొలగించనుంది.
Source: Yahoo! Telugu: News | 22 Jul 2009 | 2:56 pm

133 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

స్టాక్ మార్కెట్ 133 పాయింట్లు కోల్పోవడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 14,929 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 45 పాయింట్లు నష్టపోయి 4,424 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.88 శాతం, నిఫ్టీ 1.00 శాతం మేరకు క్షీణించిపోయాయి. ఇప్పటి వరకు మొత్తం 2,630 కంపెనీల వాటాలు ట్రేడ్ అవగా.. 1,345 కంపెనీల వాటాలు నష్టాల్లో పయనిస్తున్నాయి.
Source: Yahoo! Telugu: News | 22 Jul 2009 | 2:49 pm

కావాలంటే నన్ను ఉరితీయండి: అజ్మల్ కసబ్

చేసిన నేరానికి శిక్ష తగ్గించుకునేందుకు తాను ఎలాంటి నాటకాలు ఆడటం లేదు. కావాలంటే నన్ను ఉరి తీయవచ్చని ముంబై దాడుల కేసులో సజీవంగా పట్టుబడిన ఏకైక ఉగ్రవాది అజ్మల్ కసబ్ స్పష్టం చేశాడు.
Source: Yahoo! Telugu: News | 22 Jul 2009 | 2:43 pm

దేశంలో 322 స్వైన్ ఫ్లూ కేసులు: మంత్రి ఆజాద్

దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 322 స్వైన్ ఫ్లూ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి గులాం నబీ ఆజాద్ తెలిపారు. ఈ కేసుల్లో 234 మందికి రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు చేసి సంపూర్ణ ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసిందని ఆయన చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 22 Jul 2009 | 1:38 pm

నష్టాల్లో పయనిస్తున్న స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం నష్టాల్లో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 169 పాయింట్లు కోల్పోయి 14,893 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 49 పాయింట్లు నష్టపోయి 4,420 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 1.12 శాతం, నిఫ్టీ 1.10 శాతం మేరకు క్షీణించాయి.
Source: Yahoo! Telugu: News | 22 Jul 2009 | 1:32 pm

ఇరాక్‌లో బాంబు దాడులు: 21 మంది మృతి

ఇరాక్‌లో మంగళవారం సంభవించిన బాంబు పేలుళ్లలో మృతి చెందినవారి సంఖ్య 21కి పెరిగిందని అధికారిక వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరిగిన బాంబు దాడులు ఇరాక్ పౌరుల్లో భయాందోళనలు సృష్టించాయి. ఇరాక్ నగరాల నుంచి అమెరికా సైన్యాన్ని ఉపసంహరించిన మూడు వారాల తరువాత వరుసగా ఇటువంటి బాంబు దాడులు జరుగుతున్నాయి.
Source: Yahoo! Telugu: News | 22 Jul 2009 | 1:27 pm

పొడవైన జులపాల జుట్టులోనే ధోనీ ఎంతో అందంగా ఉంటాడట

ధోనీ నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పిందే చెప్పి విసుగెత్తిస్తున్న తమిళనటి లక్ష్మీరాయ్ కొత్తగా ధోనీ గురించి మరో మాట మాట్లాడిందట. పొడవైన జులపాల జుట్టులోనే ధోనీ ఎంతో అందంగా ఉంటాడని పరవశించిపోతూ చెప్పిందట. ఆ జుట్టును చూస్తూ అలా కాలం గడిపిన సందర్భాలు కూడా ఉన్నాయట. అదిసరే... "ధోనీ గురించి తెగ చెపుతున్నావ్.. ఇటీవల ధోనీని ఎప్పుడైనా కలిశావా..?" అని ఎవరైనా అడిగితే, చివాల్న చూసి, ఫ్రెండ్స్ ఎప్పుడు కలుస్తారో... ఎప్పుడు మాట్లాడుకుంటారో వాళ్లకే తెలుసు. నేను ధోనీని ఎప్పుడు కలిశానో ధోనికే తెలుసు- అని తికమక జవాబులు చెపుతోందట.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Jul 2009 | 1:19 pm

దీపిక.. మరీ అంత బక్కదానిలే ఉందేంటీ...?

"లవ్ 4ఎవర్" చిత్రంకోసం దర్శకుడు జయంత్ బాలీవుడ్ సుందరాంగి దీపికా పదుకునేతో ఓ ఐటమ్ సాంగ్ చేయించాడు. ఆ సాంగ్ షూటింగ్ జరిగే సమయంలో దీపికను చూసేందుకు జనం ఎగబడ్డారట. ఆ జనంలో ఎలాగో సందు చేసుకుని చొరబడ్డ ఓ మెట్ట కుర్రాడు.. దీపికను చూసిన తర్వాత, "మరీ అంత బక్కదానిలా ఉందేంటీ...?" అని డైరెక్టుగా కొంతమంది సినీజనం వింటుండగానే అనేశాడట. అంతటితో ఊరుకోకుండా, "నమితలో సగం కూడా లేద"ని నోట్లో ఉన్న పాన్‌పరాగ్‌ను తుపుక్కున ఉమ్మి డొక్కు సైకిలెక్కి వెనక్కి తిరక్కుండా వెళ్లిపోయాడట.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Jul 2009 | 11:31 am

"మై కలాం హూ" చిత్రంలో నటిస్తోన్న అబ్దుల్ కలాం!

భారతరత్న, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం నటుడిగా అవతారమెత్తనున్నారు. "కలలు కనండి-వాటిని సాకారం చేసుకోండి" నినాదం ఆధారంగా హిందీలో ఓ సినిమాకు రూపకల్పన చేస్తున్నారు. ప్రముఖ హిందీ దర్శకుడు మాధవ్ పాండే రూపొందిస్తున్న ఈ చిత్రంలో ఫ్రెంచ్ నటి సోఫీ, గుల్షన్ గ్రోవర్ తదితరులు నటిస్తున్నట్లు తెలిసింది. 8 ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న "స్లమ్‌డాగ్ మిలియనీర్" లాగానే ఈ చిత్రంలోనూ కొందరు మురికివాడల పిల్లలను నటింపజేస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Jul 2009 | 11:16 am

రెండు రోజుల్లో ప్రరాపా తొలి గ్రేటర్ జాబితా: చిరు

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను మరో రెండు రోజుల్లో విడుదల చేయనున్నట్టు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ప్రకటించారు. పొత్తులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 22 Jul 2009 | 10:10 am

కావాలంటే నన్ను ఉరితీయండి: అజ్మల్ కసబ్

చేసిన నేరానికి శిక్ష తగ్గించుకునేందుకు తాను ఎలాంటి నాటకాలు ఆడటం లేదు. కావాలంటే నన్ను ఉరి తీయవచ్చని ముంబై దాడుల కేసులో సజీవంగా పట్టుబడిన ఏకైక ఉగ్రవాది అజ్మల్ కసబ్ స్పష్టం చేశాడు.
Source: జాతీయ | 22 Jul 2009 | 10:08 am

దేశంలో 322 స్వైన్ ఫ్లూ కేసులు: మంత్రి ఆజాద్

దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 322 స్వైన్ ఫ్లూ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి గులాం నబీ ఆజాద్ తెలిపారు. ఈ కేసుల్లో 234 మందికి రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు చేసి సంపూర్ణ ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసిందని ఆయన చెప్పారు.
Source: జాతీయ | 22 Jul 2009 | 8:09 am

అతి త్వరలో 9 గంటల విద్యుత్ అమలు: వైఎస్

మరో ఐదారు రోజుల్లో తొమ్మిది గంటల పాటు ఉచిత్ విద్యుత్ సరఫరా హామీని అమలు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టర్లతో ఆయన బుధవారం సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Source: ఏపీ న్యూస్ | 22 Jul 2009 | 7:45 am

హస్తినలో కేసీఆర్ నివాసం ఎదుట ధర్నా

తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కే.చంద్రశేఖర రావు గత కొన్ని రోజులగా ప్రజలకు గానీ, మీడియాకు గానీ కనిపించడం లేదు. దీంతో ఆయన కోసం పాలమూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు గాలిస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 22 Jul 2009 | 7:36 am

వారణాసిలో కనపడిన డైమండ్ రింగ్

దేశంలోని వారణాసిలో సంపూర్ణ సూర్యగ్రహణం కారణంగా డైమండ్ రింగ్‌లాంటి అత్యద్భుతమైన దృశ్యం చోటు చేసుకుంది. అసోంలోని దిబ్రూగఢ్‌లో ప్రజలు, ఖగోళశాస్త్రజ్ఞులు బుధవారం ఉదయం గం.6.31లనుంచి గం.6.34ల మధ్య అమితానందకరమైన దృశ్యం కనపడింది.
Source: జాతీయ | 22 Jul 2009 | 7:16 am

ఢిల్లీ మెట్రో రైల్ నిర్మాణంలో మరో ప్రమాదం

ఢిల్లీ మెట్రో రైల్ నిర్మాణంలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. గత పది రోజుల్లో రెండు ప్రమాదాలు జరిగాయి. వీటిలో ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం జరిగిన మరో ప్రమాదంలో 22 సంవత్సరాల యువ కార్మికుడు మృత్యువాత పడ్డారు.
Source: జాతీయ | 22 Jul 2009 | 6:23 am

కలాంకు క్షమాపణలు చెప్పిన కాంటినెంటల్

మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే.అబ్దుల్ కలాం పట్ల అమర్యాదగా ప్రవర్తించిన అమెరికాకు చెందిన కాంటినెంటల్ ఎయిర్‌లైన్స్ సంస్థ అధికారులు చేసిన తప్పును తెలుసుకుని, ఆయనకు క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ.. ఈ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు.
Source: జాతీయ | 22 Jul 2009 | 5:58 am

సొంత లాభాల కోసం వైఎస్ లాలూచీ: చంద్రబాబు

తాను, తన కుటుంబసభ్యులు, తన బంధుగణం మాత్రమే బాగుండాలని కోరుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ రాష్ట్ర ప్రయోజనాలను పొరుగు రాష్ట్రాలకు తాకట్టుపెడుతున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు.
Source: ఏపీ న్యూస్ | 22 Jul 2009 | 5:44 am

నిర్మాణ పనుల జాప్యంపై ముఖ్యమంత్రి ఆగ్రహం

రాష్ట్రంలో సాగుతున్న విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణ పనుల్లో జాప్యం నెలకొనడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణంలో ఉన్న అన్ని విద్యుత్పత్తి ప్రాజెక్టులను వచ్చే 2014 నాటికి పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
Source: ఏపీ న్యూస్ | 22 Jul 2009 | 5:28 am

జాతి భద్రతకోసమే " యూమా " : ఎస్.ఎం.కృష్ణ

భారతదేశానికి సంబంధించిన రక్షణ వ్యవస్థల తనిఖీలతోపాటు రక్షణ కొనుగోళ్ళకు సంబంధించి అమెరికాతో చివరి వినియోగ పర్యవేక్షణ ఒప్పందం చేసుకోవడంతో జాతి భద్రత కోసమేనని కేంద్ర విదేశాంగ శాఖామంత్రి ఎస్.ఎం. కృష్ణ లోక్‌సభలో స్పష్టం చేశారు.
Source: జాతీయ | 22 Jul 2009 | 4:03 am

ఆకాశంలో అద్భుతం...! ఈ సూర్యగ్రహణం

ప్రస్తుత శతాబ్దంలోనే మొట్ట మొదటిసారి ఏర్పడిన సుదీర్ఘమైన సూర్యగ్రహణం బుధవారం ఉదయసంధ్యలో ప్రారంభమైంది. 21వ శతాబ్దపు మహాద్భుతంగా భావిస్తున్న ఈ గ్రహణం మన దేశంలో ఉదయం 5 గంటల 29 నిముషాలకు ప్రారంభమై 7 గంటల 29 నిముషాలకు ముగిసింది
Source: జాతీయ | 22 Jul 2009 | 3:07 am

అసిన్‌కు ఎన్ని భాషలు వచ్చో తెలుసా...!

ప్రముఖ నటి అసిన్‌కు ఏడు భాషలు వచ్చంట. మూడు దక్షిణ భారత భాషలతోపాటు ఫ్రెంచ్, ఆంగ్లం, హిందీ మరియు సంస్కృతం భాషలను అనర్గళంగా మాట్లుడుతుందంట.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Jul 2009 | 8:56 pm

"మగధీర"ను ట్రైలర్లో తిలకించండి

మెగాస్టార్, "చిరుత"నయుడు రామ్‌చరణ్ తేజ హీరోగా, సెక్సీతార కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం "మగధీర". ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఆడియోకి శ్రోతల నుంచి మంచి స్పందన లభించిందని ఎగ్జిక్యూటివ్ నిర్మాత బోగవల్లి ప్రసాద్ వెల్లడించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Jul 2009 | 7:37 pm

"మాయాబజార్" స్క్రీన్‌ప్లే 'వెంగమాంబ'లో కనిపించింది..!

"వెంగమాంబ" చేసేటప్పుడు మీనాను సెలక్ట్‌చేస్తే ఇండస్ట్రీలో చాలామంది అవుట్‌డేటెడ్ అమ్మాయిని తెచ్చి చేతులు కాల్చుకోవద్దని సూచించారు. ఎందరినో పరిశీలించాం. ఎవ్వరూ సహకరించలేదు. అసలు వెంగమాంబ ఎవరో తెలీని వారుకూడా ఇండస్ట్రీలో ఉన్నారు. ఈ సినిమాను చూసిన విశ్వనాథ్‌.. మాయాబజార్‌ తర్వాత అంతటి స్క్రీన్‌ప్లే "వెంగమాంబ"లో కన్పించిందని ప్రశంసించడం పడిన కష్టానికి ఫలితం దక్కిందనుకుంటున్నామని వెంగమాంబ దర్శకుడు తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Jul 2009 | 7:34 pm

నిర్మాతకు ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదులే..!

కాకిపిల్ల కాకికి ముద్దు. సినిమా తీసే నిర్మాతకు తన సినిమా అంటే ముద్దు. కానీ దాన్ని ఎక్కువగా ఊహించుకుని రివర్స్‌ అయితే మాత్రం కోపంతో చిందులేయడం వంటి సంఘటన చోటుచేసుకుంది. "కలవరమాయమదిలో".. సినిమా నిర్మాత మోహన్‌ వడ్లపట్ల. ఆయనకు తన సినిమాపై విపరీతమైన నమ్మకం అట. దర్శకుడు సతీష్‌ కాసెట్టిని కూడా పక్కన బెట్టి ఆయనే మొత్తం సినిమాను చూసుకోవడం.. దర్శకుడికి చిన్నచూపు అవుతుంది. సినిమా ముందునుంచి ఆహా.. ఓహో.. అన్న నిర్మాత.. రిలీజ్‌కుముందు మాత్రం గొడవపడ్డాడు. తాననుకున్నట్లు రాలేదనేది ఆయన వాదన. దర్శకుడు మాత్రం తన ప్రమేయంలేకుండా అన్నీ ఆయనే నిర్వహించారని చెప్పేసి వెళ్లిపోయారట. మరి ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ పనికి రాదులే..!. అలా ఎక్కువయితే ఇలాగే ఉంటుందని దర్శకుడు చెమక్కు కూడా ఇచ్చారట.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Jul 2009 | 7:29 pm

సినిమా తీయాలంటే ఛానెల్‌ పెట్టాలి: చిన్నా

తన స్నేహితులతో కలిసి "ఆ ఇంట్లో" సినిమా తీశాం. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ అయినా రెండు పాటలు పెట్టాం. దాన్ని విడుదల చేయడానికి ఏ ఒక్క ఆడియో కంపెనీ ముందుకు రాలేదు. ఆఖరికి ఎఫ్‌.ఎం. వారుకూడా పాటలు వేయలేదు. పబ్లిసిటీకి ఎవరూ సహకరించలేదు. పెద్ద హీరోల చిత్రాలకైతే పైసా ఇవ్వకపోయినా విపరీతమైన పబ్లిసిటీ చేస్తారు. దీంతో తమ సినిమాలకు వారు సమయం కేటాయించడంలేదు. దీన్ని బట్టి అర్థమయిందేమంటే...? నిర్మాత అనేవాడు తప్పనిసరిగా ఓ ఛానల్‌కు అధినేత అయితే మంచిదనే అభిప్రాయాన్ని చిన్నా వ్యక్తం చేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Jul 2009 | 7:17 pm

ఇలియానా అక్కా.. నాకు సినిమా ఛాన్స్ ఇప్పించవూ...

ఇలియానా తన చెల్లెల్ని చిత్ర పరిశ్రమకు పరిచయం చెయ్యటానికి తెగ ఆరాటపడిపోతోంది. ప్రముఖ హీరోలు, దర్శకుల కాంబినేషన్‌లో సహోదరిని నటింపజెయ్యాలని ప్రయత్నాలు సాగిస్తోందట. ఈ ప్రయత్నంలో ఇలియానా సఫలమైనట్లు టాలీవుడ్ సినీజనం అనుకుంటున్నారు. టాలీవుడ్‌లో పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో చెల్లెల్ని నటింపజేసేందుకు క్లియర్ రూట్‌‌ను ఏర్పరిచిందట. కానీ ఆ సినిమా ఆలస్యం అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. అందువల్లనో ఏమోకానీ తన చెల్లెల్ని తమిళ వెండితెరకు పరిచయం చేయాలని నిశ్చయించుకుందట.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Jul 2009 | 5:14 pm

యూఎస్ ఎయిర్‌లైనర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు: కేంద్రం

వీఐపీ ప్రోటోకాల్ నిబంధనలను ఉల్లంఘించి మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాంను సాధారణ ప్రయాణికుడిలా వరుసలో నిలబెట్టి తనిఖీ చేసిన అమెరికాకు చెందిన విమానయాన సంస్థ కాంటినెంటల్ ఎయిర్‌లైన్స్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కేంద్రం నిర్ణయించింది.
Source: జాతీయ | 21 Jul 2009 | 2:54 pm

ఈవీఎంలతోనే గ్రేటర్ సమరం: ఏవీఎస్ రెడ్డి

త్వరలో జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారానే నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఏవీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆగస్టు నెలాఖరులోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 21 Jul 2009 | 1:30 pm

ప్రజారాజ్యంతో పొత్తుకు సిద్ధం: నారాయణ

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ తెలిపారు. దీనిపై ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీలు కలిసి పోటీ చేస్తే మంచి ఫలితాలు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 21 Jul 2009 | 1:22 pm

"జోష్" సినిమా ట్రైలర్‌ను వీక్షించండి

యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్య కథానాయకుడిగా, నటి రాధ పెద్ద కుమార్తె కార్తీక కథానాయికగా నటిస్తోన్న చిత్రం "జోష్". శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై టాలీవుడ్ గోల్డెన్ హ్యాండ్ దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వాసువర్మ దర్శకత్వం వహిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Jul 2009 | 1:19 pm

25 నుంచి గ్రేటర్ హైదరాబాద్‌లో చిరు పర్యటన

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారాన్ని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఈనెల 25వ తేదీ నుంచి శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, తెదేపా నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేసిన నేపథ్యంలో చిరు ప్రచారంతో మరింత ఊపందుకోనుంది.
Source: ఏపీ న్యూస్ | 21 Jul 2009 | 1:11 pm

ఆ రెండు మినహా.. ఇతరులతో చెలిమికి సిద్ధం: సీపీఎం

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను ఎదుర్కొనేందుకు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలతో మినహా మిగిలిన పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు తాము సిద్ధమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ.రాఘవులు స్పష్టం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 21 Jul 2009 | 1:02 pm

హిందుస్తానీ సంగీత విధ్వాంసురాలు హంగల్ మృతి

ప్రసిద్ధ హిందూస్తానీ సంగీత విద్వాంసురాలు గంగూభాయి హంగల్ మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆమెకు తీవ్రమైన గుండెపోటు రావడంతో మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. ఆమెకు వయస్సు 97 సంవత్సరాలు.
Source: జాతీయ | 21 Jul 2009 | 12:47 pm

ఇలియానా అక్కా.. నాకు సినిమా ఛాన్స్ ఇప్పించవూ...

ఇలియానా తన చెల్లెల్ని చిత్ర పరిశ్రమకు పరిచయం చెయ్యటానికి తెగ ఆరాటపడిపోతోంది. ప్రముఖ హీరోలు, దర్శకుల కాంబినేషన్‌లో సహోదరిని నటింపజెయ్యాలని ప్రయత్నాలు సాగిస్తోందట. ఈ ప్రయత్నంలో ఇలియానా సఫలమైనట్లు...
Source: వినోదం | 21 Jul 2009 | 11:45 am

వెండిమబ్బుల స్వాగతాన్నిచ్చే "చిరపుంజి"

నేలపై పచ్చటి తివాచీ పరచినట్లుగా ఉండే చెట్లు, మొక్కలు.. ఆకాశంలో వెండి మబ్బులు, మధ్యమధ్యలో ఆ మబ్బుల చాటునుంచి బయటకు వచ్చే సూరీడు... ఇలా ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉన్న ప్రాంతం "చిరపుంజి".
Source: వినోదం | 21 Jul 2009 | 11:04 am

రాజీవ్‌ గతే పడుతుంది: మావోల వార్నింగ్

నక్సలైట్ అణిచివేత చర్యలు ఆపకపోతే మాజీ ప్రధాని రాజీవ్‌గాధీకి పట్టిన గతే పడుతుందని కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు మావోలు తాజాగా హెచ్చరించారు. అణిచివేత చర్యలను తక్షణమే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు.
Source: జాతీయ | 21 Jul 2009 | 10:44 am