|
పాకిస్థాన్‌లో ఐదుగురు భద్రతాధికారుల హత్యపాకిస్థాన్లోని సమస్యాత్మక నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్‌లో ఉగ్రవాదులు ఐదుగురు భద్రతాధికారులను హత్య చేశారు. పోలీస్ వాహన శ్రేణిపై అనూహ్యంగా ఉగ్రవాదులు జరిపిన దాడిలో నలుగురు భద్రతాధికారులు మృతి చెందగా, ఇదే ప్రాంతంలో వేరొకచోట జరిగిన ఉగ్రవాద దాడిలో మరో అధికారి ప్రాణాలు కోల్పోయారు.Source: Yahoo! Telugu: News | 20 Jul 2009 | 4:16 pm లాభాల్లోనే పయనిస్తున్న సెన్సెక్స్స్టాక్ మార్కెట్ ప్రస్తుతం లాభాల్లో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 446 పాయింట్లు లాభపడి 15,191 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 127 పాయింట్లు పెరిగి 4,502 వద్ద పయనిస్తోంది. రిలయన్స్, టీసీఎస్, విప్రో తదితర సంస్థల వాటాలు లాభాల్లో ఉండగా.. ఐటీసీ, రెల్ ఇన్‌ఫ్రా తదితర సంస్థల వాటాలు నష్టాల్లో పయనిస్తున్నాయి.Source: Yahoo! Telugu: News | 20 Jul 2009 | 4:04 pm ఆర్థికాభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి: వైఎస్రాష్ట్రంలో ఆర్థికంగా అభివృద్ధి చెందితే పలు సమస్యలకు పరిష్కారం లభించి రాష్ట్రాభివృధికి మార్గం సుగమం అవుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి అన్నారు.Source: Yahoo! Telugu: News | 20 Jul 2009 | 3:32 pm మామపై మానవుడు: నేటితో 40 ఏళ్లు పూర్తినేటికి సరిగ్గా 40 ఏళ్ల క్రితం అమెరికా ప్రయోగించిన అపోలో 11 కృత్రిక ఉపగ్రహంలో అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములు చందమామపై కాలుపెట్టారు. ప్రపంచ అంతరిక్ష పరిశోధనల చరిత్రలో నేటికి ఇదొక చిరస్మరణీయ విజయం. తొలిసారి మానవుడిని చంద్రుడిపై నడిపించిన ఘనతను అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం (నాసా) ఇప్పటికీ కాపాడుకుంటోంది.Source: Yahoo! Telugu: News | 20 Jul 2009 | 3:31 pm స్వలింగ సంపర్కంపై స్టేకు సుప్రీం నిరాకరణస్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేస్తూ ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించేందుకు నిరాకరించింది. దేశ వ్యాప్తంగా సంచలనమై ఈ తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీకి చెందిన ఒక జ్యోతిష్యుడు సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెల్సిందే.Source: Yahoo! Telugu: News | 20 Jul 2009 | 3:14 pm 15వేల మార్కును దాటిన సెన్సెక్స్స్టాక్ మార్కెట్ 15వేల మార్కును దాటడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 349 పాయింట్లు లాభపడి 15,094 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 98 పాయింట్లు పుంజుకుని 4,473 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 2.43 శాతం, నిఫ్టీ 2.43 శాతం చొప్పున వృద్ధి చెందాయి.Source: Yahoo! Telugu: News | 20 Jul 2009 | 2:30 pm నేటి నుంచి దీపక్ కపూర్ అమెరికా పర్యటనభారత ఆర్మీ చీఫ్ జనరల్ దీపక్ కపూర్ సోమవారం నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. ఈ అధికారిక పర్యటనలో దీపక్ కపూర్ అమెరికా మిలిటరీ సీనియర్ అధికారులు, పౌర రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమవతారు.Source: Yahoo! Telugu: News | 20 Jul 2009 | 1:30 pm 404 పాయింట్లు పుంజుకున్న సెన్సెక్స్స్టాక్ మార్కెట్ ప్రస్తుతం 404 పాయింట్లు పుంజుకోవడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 15,149 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 107 పాయింట్లు లాభపడి 4,482 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 2.74 శాతం, నిఫ్టీ 2.44 శాతం మేరకు వృద్ధి చెందాయి. ఇప్పటి వరకు మొత్తం 2,564 కంపెనీల వాటాలు ట్రేడ్ అవగా, 1,732 కంపెనీల వాటాలు లాభపడ్డాయి.Source: Yahoo! Telugu: News | 20 Jul 2009 | 1:29 pm జేఎస్‌డబ్ల్యూ స్టీల్ నికర లాభాల్లో 6 శాతం క్షీణతజూన్ 30, 2009తో ముగిసిన తొలి త్రైమాసిక ఫలితాల్లో ప్రముఖ ఉక్కు కంపెనీ జేఎస్‌డబ్ల్యూ స్టీల్ నికర ఆదయం రూ. 234.08 కోట్లకు తగ్గి 6.45 శాతం మేరకు క్షీణించనట్లు కంపెనీ వెల్లడించింది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది నికర ఆదయం తగ్గుముఖం పట్టినట్లుగా వివరించింది. గత ఏడాది జూన్ 2008తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీకి రూ. 250.23 కోట్లు నికర ఆదాయం వచ్చినట్లు తెలిపింది.Source: Yahoo! Telugu: News | 20 Jul 2009 | 1:24 pm "మనోజ్" కొత్త చిత్రం 30శాతం పూర్తి!ప్రయాణం ఫేమ్ "మంచు మనోజ్‌కుమార్" హీరోగా, షీనా హీరోయిన్‌గా ఏటీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోన్న వినోదప్రధాన ప్రేమకథా చిత్రం రెండవ షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది. రచయితగా మంచి పేరు తెచ్చుకున్న వీరుపోట్ల ఈ చిత్రానికి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 20 Jul 2009 | 1:17 pm రంగారెడ్డి జిల్లాలో దోపిడీ దొంగల బీభత్సంరంగారెడ్డి జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. కందుకూరు మండలం సరస్వతి గూడలోని ఒక ఇంటిలోకి ఆదివారం రాత్రి ప్రవేశించిన దోపిడీ దొంగలు భార్యా భర్తలపై దాడి చేశారు. అనంతరం ఇంటిలోని నగదు, బంగారు ఆభరణాలను దోచుకుని పారిపోయారు.Source: Yahoo! Telugu: News | 20 Jul 2009 | 1:14 pm "ఒకటి కావాలంటే మరొకటి వదులుకోవాల్సిందే..!": శ్రి.యఇష్టం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన అందాల ముద్దుగుమ్మ శ్రియ... తాజాగా విలక్షణ నటుడు విక్రమ్ హీరోగా నటించే మల్లన్న సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో శ్రియ హాట్ హాట్ సీన్‌లలో నటిస్తోన్నట్లు సినీజనం చెవులు కొరుక్కుంటున్నారు. ఈ సందర్భంగా ఆమెను కదిలిస్తే...తెరపై కన్పించే శ్రియ వేరు. నిజజీవితంలో శ్రియ వేరు. తెరపై కన్పించే శ్రియ తనకు ఏమాత్రం నచ్చదని నటి శ్రియ తేల్చి చెబుతోంది. 'ఒకటికావాలంటే మరొకటి వదులు కోవాల్సిందేనే' విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నానంటోంది. అయితే మరో విషయం.. ఇంతవరకు తాను ఆశపడ్డపాత్ర రాలేదని, దానికోసమే ఎదురుచూస్తున్నానంటోంది.Source: Yahoo! Telugu: Entertainment | 20 Jul 2009 | 11:32 am గోల్డెన్‌హ్యాండ్ కాబట్టి అప్పగించాం: అక్కినేనిఅక్కినేని కుటుంబం నుంచి నాగచైతన్య ఆరో హీరోగా తెరంగేట్రం చేశాడని అక్కినేని నాగేశ్వర రావు అన్నారు. నాగార్జున నాగచైతన్యను హీరోగా పరిచయం చేస్తున్నాడు అని చెప్పినప్పుడు హ్యాపీగా ఫీలయ్యాను. చైతన్యకు పెద్ద బ్యాక్‌గ్రౌండ్ ఉంది. మరోవైపు తాత రామానాయుడు ఆశీర్వచనాలున్నాయని అక్కినేని పేర్కొన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 20 Jul 2009 | 11:10 am ప్రాజెక్టుల పూర్తికి కేంద్ర సాయం కావాలి: వైఎస్జలయజ్ఞంలో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి కేంద్రం తన వంతుమేరకు నిధుల సాయం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆర్థిక సంఘం సమావేశం జూబ్లీహాలులో జరిగింది.Source: ఏపీ న్యూస్ | 20 Jul 2009 | 9:50 am స్వలింగ సంపర్కంపై స్టేకు సుప్రీం నిరాకరణస్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేస్తూ ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించేందుకు నిరాకరించింది. దేశ వ్యాప్తంగా సంచలనమై ఈ తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీకి చెందిన ఒక జ్యోతిష్యుడు సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెల్సిందే.Source: జాతీయ | 20 Jul 2009 | 9:45 am రంగారెడ్డి జిల్లాలో దోపిడీ దొంగల బీభత్సంరంగారెడ్డి జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. కందుకూరు మండలం సరస్వతి గూడలోని ఒక ఇంటిలోకి ఆదివారం రాత్రి ప్రవేశించిన దోపిడీ దొంగలు భార్యా భర్తలపై దాడి చేశారు. అనంతరం ఇంటిలోని నగదు, బంగారు ఆభరణాలను దోచుకుని పారిపోయారు.Source: ఏపీ న్యూస్ | 20 Jul 2009 | 7:44 am సైనిక సంపత్తి కొలమానం కాదు: హిల్లరీ క్లింటన్ఒక దేశ గొప్పతనానికి ఆ దేశ సైనిక సంపత్తి గొప్పదనం కాదని అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షిస్తూ ముందుకు సాగడమే ఆయా దేశాల గొప్పతనానికి నిదర్శనమని ఆమె చెప్పుకొచ్చారు.Source: జాతీయ | 20 Jul 2009 | 7:20 am సెప్టెంబరు నుంచి అద్వానీ రథయాత్రలు!వరుస ఓటములతో డీలాపడ్డ భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపేందుకు ఆ పార్టీ ఉగ్రనేత ఉక్కుమనిషి ఎల్కే.అద్వానీ వచ్చే సెప్టెంబరు నుంచి దేశ వ్యాప్తంగా మళ్లీ రథయాత్రలు నిర్వహించనున్నారు.Source: జాతీయ | 20 Jul 2009 | 6:27 am అక్షర్‌ధామ్‌పై దాడి: లష్కర్ తీవ్రవాది అరెస్టుగుజరాత్ రాష్ట్రంలోని అక్షరధామ్‌పై జరిగిన దాడి కేసు వెనుక లష్కర్ తోయిబా సంస్థకు చెందిన అనుమానిత తీవ్రవాది హస్తం ఉన్నట్టు తాజాగా వెల్లడైంది. ఆదివారం హైదరాబాద్‌లోని, సైబరాబాద్ పోలీసులు ఆదివారం ఒక లష్కర్ తోయిబా తీవ్రవాదిని అరెస్టు చేశారు.Source: జాతీయ | 20 Jul 2009 | 6:06 am ప్రజారాజ్యానికి మరికొందరు సీనియర్లు డుమ్మా!ప్రజారాజ్యం పార్టీకి మరికొందరు సీనియర్ నేతలు డుమ్మాకొట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. తమ రాజకీయ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని వీరు తమ సొంత గూటికే చేరుకోవాలన్న యోచనలో ఉన్నట్టు వినికిడి.Source: ఏపీ న్యూస్ | 20 Jul 2009 | 6:04 am ప్రజలకు దూరం చేసేందుకు అసత్య ప్రచారం: చిరుతనను గెలిపించిన ప్రజల నుంచి దూరం చేసేందుకు కొందరు నేతలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తిరుపతి ఎమ్మెల్యే, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఆరోపించారు. అలాగే, పార్టీలో లేనిపోని గందరగోళం సృష్టించేందుకు మీడియా ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు.Source: ఏపీ న్యూస్ | 20 Jul 2009 | 6:03 am దేశంలో కొత్తగా మరో 13 స్వైన్ ఫ్లూ కేసులుదేశంలో కొత్తగా మరో 13 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య 297కు చేరుకుంది. వీటిలో ఢిల్లీ, గుర్గావ్‌లో మూడు కేసుల చొప్పున నమోదు కాగా, హైదరాబాద్‌లో రెండు, పంజాబ్‍లో ఒక కేసు నమోదైంది.Source: జాతీయ | 20 Jul 2009 | 4:48 am ఆరో వంతు జనం ఆకలి తీరుస్తున్న భారత్ప్రపంచ జనాభా ఆకలి తీర్చడంలో భారత రైతాంగం కీలకపాత్ర పోషించాలని అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ ఆకాంక్షించారు. అమెరికా విదేశాంగ కార్యదర్శిగా తొలిసారి భారత్‌లో పర్యటిస్తున్న హిల్లరీ ఆదివారం ముంబయి నుంచి ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలో ఆమె రెండు రోజులపాటు పర్యటిస్తారు.Source: జాతీయ | 20 Jul 2009 | 3:50 am గౌహతిలో ఉల్ఫా ఉగ్రవాది అరెస్ట్అస్సోం రాష్ట్రంలోని గౌహతి నగరంలోని గాంధీబస్తీ ప్రాంతంలో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఓ వ్యక్తిని ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారించగా అతను ఉల్ఫా తీవ్రవాదని తెలిసిందని పోలీసులు తెలిపారు.Source: జాతీయ | 19 Jul 2009 | 1:25 pm మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టుకీడుస్తా: పొన్నాలమహారాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న బాబ్లీ ప్రాజెక్టు విషయంలో ఆ ప్రభుత్వంపై కోర్టులో కేసు వేయనున్నామని రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖామంత్రి పొన్నాల లక్ష్మయ్య వరంగల్‌లో అన్నారుSource: ఏపీ న్యూస్ | 19 Jul 2009 | 1:13 pm రాష్ట్రంలో మరో రెండు స్వైన్‌ఫ్లూ కేసులురాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మరో రెండు స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. రియాద్ నుంచి హైదరాబాద్ వచ్చిన 38ఏళ్ల వైద్యుడు, మలేషియా నుంచి వచ్చిన సాఫ్ట్‌వేర్ ఇంజనీరు (32)కి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు శంషాబాద్ విమానాశ్రయంలో వైద్యులు నిర్ధారించారు.Source: ఏపీ న్యూస్ | 19 Jul 2009 | 11:45 am భారత్‌కు అమెరికా వెన్నుదన్నుగా ఉంటుంది: హిల్లరీవాతావరణం, సాంకేతిక రంగాలలో ఇండో- అమెరికా దేశాలు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పుతామని అమెరికా విదేశాంగ శాఖా మంత్రిణి హిల్లరీ క్లింటన్ ఆదివారం న్యూ ఢిల్లీలో అన్నారు.Source: జాతీయ | 19 Jul 2009 | 11:09 am
|