కొత్త హీరోకి నందనాసేన్ గాఢ చుంబనలు

బాలీవుడ్ నటీమణి నందనాసేన్ నటిస్తున్న ఓ కొత్త చిత్రంలో ఆమె సరసన అనుభవ్ ఆనంద్ అనే కొత్త హీరో నటిస్తున్నాడు. ఈ సినిమాలో వీళ్లద్దరి మధ్య ఓ ఘాటైన ముద్దు సన్నివేశం ఉన్నదట. ఆ ముద్దు సన్నివేశాన్ని తెరకెక్కించడానికి దర్శకుడు నానా తంటాలు పడ్డాడట. కొత్త హీరో కావడం వల్ల నందనా పెదవులపై ముద్దెట్టుకోవడానికి అతగాడు తెగ సిగ్గుపడిపోయాడట. దీంతో నందనా చొరవ తీసుకుని అతని ముఖాన్ని దగ్గరకు లాక్కుని డైరెక్టరు కట్ చెప్పే వరకూ రెండు పెదవులపై గాఢమైన చుంబనలిచ్చిందట. దీంతో ఆ కుర్ర హీరో ముద్దు మస్తుతో చిత్తై ఎక్కడ చూసినా నందనా ముద్దు జపం చేస్తున్నాడట. ఏ ఫంక్షన్‌కెళ్లినా నందనా చాలా గొప్ప నటి అనీ, జూనియర్ నటులనే తేడా లేకుండా అన్ని విషయాలను చాలా చక్కగా నేర్పుతుందని చెప్పడంతోపాటు పనిలో పనిగా ఘాటైన ముద్దు సంగతిని కూడా చెప్పేస్తున్నాడట.
Source: Yahoo! Telugu: Entertainment | 18 Jul 2009 | 7:41 pm

12శాతం లాభాలు పెంచుకున్న ఐబీఎమ్

ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో అగ్రగామిగానున్న సంస్థ ఐబీఎమ్ ప్రస్తుత ఏడాది రెండవ త్రైమాసికంలో 12శాతం లాభాలను చేజిక్కించుకుంది.
Source: Yahoo! Telugu: News | 18 Jul 2009 | 7:26 pm

91లోకి అడుగిడిన మండేలా!

దక్షిణాఫ్రికా తొలి నల్లజాతి అధ్యక్షుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, దక్షిణాఫ్రికా గాంధీగా పిలువబడే నల్ల సూరీడు నెల్సన్ మండేలా నేడు 91లోకి అడుగిడారు.
Source: Yahoo! Telugu: News | 18 Jul 2009 | 7:14 pm

రీరికార్డింగ్‌లో ఛార్మి 'సైయ్యాట'

ఛార్మి హీరోయిన్‌గా నటిస్తోన్న 'సైయ్యాట' చిత్రానికి ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నల్లూరి రాజశేఖర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కె.ఆర్‌.కె. పవన్‌ దర్శకుడు. నిర్మాత మాట్లాడుతూ, "ప్రముఖ హీరో ఛార్మి సరసన నటిస్తున్నాడు. ఆ వివరాలు త్వరలో తెలియజేస్తాం. ఇటీవలే ఛార్మితోపాటు 60 మంది డాన్సర్లపై రిచ్‌గా ఓ పాటను చిత్రించాం. ఈ చిత్ర ఆడియోను ఆగస్టులో విడుదలచేస్తామ"న్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 18 Jul 2009 | 6:34 pm

దాసరిచే 'వీడు మనవాడే' ఆడియో విడుదల

శ్యామ్‌, మల్లికాకపూర్‌ జంటగా నేతాజీ దర్శకత్వంలో సి. విజయకుమార్‌ నిర్మించిన 'వీడు మనవాడే' చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం శనివారం ప్రసాద్‌ ల్యాబ్స్‌లో జరిగింది. ముఖ్య అతిథి డా|| దాసరి నారాయణరావు ఆడియో సీడీని ఆవిష్కరించి తొలిప్రతిని మరో దర్శకుడు సాగర్‌కు అందజేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 18 Jul 2009 | 6:24 pm

రీటా బహుగుణాకు మధ్యంతర బెయిల్ మంజూరు

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అరెస్ట్ అయిన యూపీసీసీ అధ్యక్షురాలు రీటా బహుగుణా జోషికి శనివారం మొరదాబాద్ కోర్టు జులై 29 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఎస్సీ, ఎస్టీ అత్యాచార బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని విమర్శిస్తూ, ముఖ్యమంత్రి మాయావతిపై కూడా రీటా బహుగుణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Source: Yahoo! Telugu: News | 18 Jul 2009 | 5:53 pm

భారత్- పాక్ చర్చలకు అమెరికా ఒత్తిడి చేయదు

భారత్- పాకిస్థాన్ ప్రభుత్వాలు ద్వైపాక్షిక చర్చలు ప్రారంభించేందుకు అమెరికా ప్రభుత్వం ఎటువంటి ఒత్తిళ్లు తేవడం లేదని ఆ దేశ విదేశాంగ శాఖ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ శనివారం స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నేతృత్వంలోని అధికారిక యంత్రాంగం భారత్ లేదా పాకిస్థాన్ ప్రభుత్వాలపై ద్వైపాక్షిక చర్చలు ప్రారంభించే దిశగా ఎటువంటి ఒత్తిడి తేవడం లేదన్నారు.
Source: Yahoo! Telugu: News | 18 Jul 2009 | 5:46 pm

జకార్తా పేలుళ్ల వెనుక నూర్డిన్ టాప్ హస్తం

ఇండోనేషియా రాజధానిలో రెండు లగ్జరీ హోటళ్లలో శుక్రవారం ఉదయం సంభవించిన పేలుళ్ల వెనుక ఉన్న ఆత్మాహుతి దళ సభ్యులను గుర్తించేందుకు అధికారిక యంత్రాంగం కసరత్తులు చేపట్టింది. జకార్తాలోని రెండు అమెరికా లగ్జరీ హోటళ్లలో సంభవించిన బాంబు పేలుళ్లలో తొమ్మిది మంది మృతి చెందగా, 60 మందికిపైగా గాయపడ్డారు.
Source: Yahoo! Telugu: News | 18 Jul 2009 | 5:31 pm

హ్యాపీ బర్త్‌డే 'ప్రియాంక చోప్రా'

జులై 18న 26 వసంతాలు పూర్తి చేసుకుని 27లోకి అడుగుపెడుతున్న ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రాకు హ్యాపీ బర్తడే విషెష్ చెపుతాం. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఆమె నటనతోనే అందలమెక్కిన నటి ప్రియాంకా చోప్రా. కేవలం ఒక ఏడాదిలోనే ఆమె చేసిన చిత్రాలు చాలా తక్కువ అయినాకూడా ఆ చిత్రాలు ఆమెకు స్టార్‌డమ్ తెచ్చిపెట్టాయి.
Source: Yahoo! Telugu: Entertainment | 18 Jul 2009 | 5:31 pm

సున్నాకన్నా దిగువున కెనడా వార్షిక ద్రవ్యోల్బణం

కెనడా వార్షిక ద్రవ్యోల్బణం రేటు సున్నా కన్నా దిగువకు పడిపోయింది. 15 ఏళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి అని కెనడా గణాంకాల శాఖ వెల్లడించింది. గ్యాస్ స్టేషన్‌ల వద్ద గ్యాస్ తక్కువగా లభించడం వంటి కారణాలతో మొత్తం ఇండెక్స్ 0.3 శాతాని కన్నా తక్కువకు చేరుకుందని తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 18 Jul 2009 | 5:21 pm

జమ్ము- కాశ్మీర్‌లో మహిళా తీవ్రవాది అరెస్ట్

నిషేధిత తీవ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ కోసం పని చేస్తున్న ఓ మహిళా తీవ్రవాదిని జమ్ము- కాశ్మీర్‌లో భద్రతా దళాలు అరెస్టు చేశాయి. ఈ మహిళా తీవ్రవాదిని షకీలాగా గుర్తించారు. రాష్ట్రంలోని దోడా జిల్లాలో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు అధికారిక యంత్రాంగం శనివారం తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 18 Jul 2009 | 5:09 pm

లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై అద్వానీ విచారం

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దేశ ప్రజలకు బీజేపీ కంటే కాంగ్రెస్‌వైపు మొగ్గుచూపటంపట్ల ఎల్‌కే అద్వానీ విచారం వ్యక్తం చేశారు. అయితే దేశంలో ద్విధృవ రాజకీయాలను నెలకొల్పిన ఘనత తమకే దక్కుతుందని బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ తెలిపారు. దేశ ఓటర్లు తాజా ఎన్నికల్లో పెద్ద పార్టీలకే పట్టం కట్టారని, చిన్న పార్టీలను తిరస్కరించారని చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 18 Jul 2009 | 4:58 pm

దేశవ్యాప్త సమ్మె చేయనున్న ఎస్‌బీఐ

భారతీయ స్టేట్ బ్యాంక్ ఉద్యోగులు తమ డిమాండ్‌ల పరిష్కారం కోరుతూ ఆగస్టు 6,7 తేదీల్లో దేశవ్యాప్తంగా సమ్మె చేయనున్నట్టు ఎస్‌బీఐ బ్యాంక్‌ల సమాఖ్య ప్రధాన కార్యదర్శి జి.డి నడాఫ్‌ తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 18 Jul 2009 | 4:04 pm

లఖ్వీపై ఛార్జిషీట్ దాఖలు చేసిన పాకిస్థాన్

గత ఏడాది ముంబయి మహానగరంలో జరిగిన ఉగ్రవాద దాడుల కేసులో లష్కరే తోయిబా చీఫ్ జాకీవుర్ రెహమాన్ లఖ్వీని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ పాకిస్థాన్ ప్రభుత్వం శనివారం అడియాలా జైలులో ఛార్జిషీటు దాఖలు చేసింది. ముంబయి మారణహోమానికి లఖ్వీని ప్రధాన సూత్రధారిగా పాక్ ప్రభుత్వం పేర్కొంది. ఈ ఛార్జిషీట్‌లో జరార్ షా, ఇతర నిందితుల పేర్లు కూడా ఉన్నాయి.
Source: Yahoo! Telugu: News | 18 Jul 2009 | 3:51 pm

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో దొంగల భీభత్సం

నిజాముద్దీన్ నుంచి సికింద్రాబాద్ వస్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైలులో గత రాత్రి దారి దోపిడి జరిగింది. మొత్తం నాలుగు బోగిల్లోని ప్రయాణీకులపై దొంగలు మత్తుమందు చల్లి దోపిడి చేశారు. ఈ దోపిడిలో దాదాపు రూ. 50లక్షల విలువ చేసే వస్తు సామగ్రి, నగదు దోచుకుపోయారు.
Source: ఏపీ న్యూస్ | 18 Jul 2009 | 3:13 pm

కాశ్మీరు వివాదాన్ని కొత్త దృష్టితో చూడండి: హిల్లరీ

భారతదేశం- పాకిస్తాన్ దేశాల మధ్య ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న కాశ్మీరు వివాదాన్ని కొత్త దృష్టితో చూడాలని హిల్లరీ క్లింటన్ పిలుపునిచ్చారు. ఇరు దేశాల మధ్య నెలకొని ఉన్న అపనమ్మకాలను వీడి, పరస్పర విశ్వాసంతో సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు.
Source: జాతీయ | 18 Jul 2009 | 2:52 pm

రీటా బహుగుణాకు మధ్యంతర బెయిల్ మంజూరు

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అరెస్ట్ అయిన యూపీసీసీ అధ్యక్షురాలు రీటా బహుగుణా జోషికి శనివారం మొరదాబాద్ కోర్టు జులై 29 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఎస్సీ, ఎస్టీ అత్యాచార బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని విమర్శిస్తూ, ముఖ్యమంత్రి మాయావతిపై కూడా రీటా బహుగుణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Source: జాతీయ | 18 Jul 2009 | 12:24 pm

ప్రేక్షకులకు థ్రిల్లింగ్‌నిచ్చే "ఆ ఇంట్లో"

చిత్రం: ఆ ఇంట్లో...నటీనటులు: చిన్నా, మయూరి (ఆషాశైనీ), ఎవీఎస్‌, కృష్ణభగవాన్‌, రామ్‌జగన్‌, కోటశ్రీనివాసరావు తదితరులు,కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చిన్నా, ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ చిత్రం 'శివ'తో నటునిగా కెరీర్‌ను ప్రారంభించిన "చిన్నా" ఆయన అడుగుజాడల్లోనే దర్శకునిగా మారి 'ఆ ఇంట్లో' అనే చిత్రాన్ని రూపొందించారు. తన ఒరిజినల్‌ పేరు జితేందర్‌రెడ్డి అనేది నిర్మాతల్లో ఒకరిగా వేసుకున్నాడు. మొత్తం ఐదుగురు స్నేహితులు కలిసి తీసిన సినిమా ఇది. హార్రర్‌ థ్రిల్లర్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్ళే వాళ్ళకూ ఆ ఇంట్లో చిత్రం తీసి నచ్చే ప్రయత్నం చేశాడు. హాలీవుడ్‌ చిత్రాలను తలపించేలా చిన్నా దర్శకుడిగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. ఏ సన్నివేశం బోర్‌కొట్టకుండా చూపాడు. కథ, కథనం ఆసక్తికరంగా మార్చడంలోనూ, పరిమిత నటీనటులతో ఒకే ఇంటిలో చిత్రాన్ని చూపించి మెప్పించడం విశేషమే. నటుడిగా తనేంటో నిరూపించుకున్న చిన్నా.. మయూరిని నటిగా తీర్చిదిద్దడంలో ఎంతో శ్రమపడ్డాడు. ఆమె నటన ఈ సినిమాలో బయటపడింది. మొత్తాన్ని థ్రిల్‌ కల్గించే చిత్రం చూశామన్న ఫీలింగ్‌ కలుగుతుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 18 Jul 2009 | 11:46 am

జమ్ము- కాశ్మీర్‌లో మహిళా తీవ్రవాది అరెస్ట్

నిషేధిత తీవ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ కోసం పని చేస్తున్న ఓ మహిళా తీవ్రవాదిని జమ్ము- కాశ్మీర్‌లో భద్రతా దళాలు అరెస్టు చేశాయి. ఈ మహిళా తీవ్రవాదిని షకీలాగా గుర్తించారు. రాష్ట్రంలోని దోడా జిల్లాలో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు అధికారిక యంత్రాంగం శనివారం తెలిపింది.
Source: జాతీయ | 18 Jul 2009 | 11:40 am

లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై అద్వానీ విచారం

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దేశ ప్రజలకు బీజేపీ కంటే కాంగ్రెస్‌వైపు మొగ్గుచూపటంపట్ల ఎల్‌కే అద్వానీ విచారం వ్యక్తం చేశారు. అయితే దేశంలో ద్విధృవ రాజకీయాలను నెలకొల్పిన ఘనత తమకే దక్కుతుందని బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ తెలిపారు. దేశ ఓటర్లు తాజా ఎన్నికల్లో పెద్ద పార్టీలకే పట్టం కట్టారని, చిన్న పార్టీలను తిరస్కరించారని చెప్పారు.
Source: జాతీయ | 18 Jul 2009 | 11:28 am

మదిలో కల'వర'మే..!

చిత్రం: కలవరమాయే మదిలో...నటీనటులు: స్వాతి, కమల్‌కామరాజు, ఢిల్లీరాజేశ్వరి, తనికెళ్ళభరణి, విక్రమ్‌ గోఖలే, సందీప్ తదితరులు,నిర్మాత: మోహన్‌వడ్లపట్ల, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సతీష్‌కాసెట్టి.పాయింట్: ఓ గాయని మదిలోని కల 'వరం'గా మారడమే. అది ఎలా జరిగిందనేది సినిమా.కలలన్నీ నిద్రకే పరిమితం చేస్తే.. వాస్తవంలో అందుకోవలసిన విజయాలు అలాగే మిగిలిపోతాయి. కలల్నినిజం చేయాలంటే ఓ తపన కావాలి. దాన్ని సాధించేందుకు మనోధైర్యం ఉండాలి. ఈ సినిమాలో నాయికకు పాటలు పాడాలనేది కోరిక. సంగీత ప్రధానంగా తెరకెక్కిన శంకరాభారణం, స్వాతిముత్యం వంటి ప్రతిష్టాత్మక చిత్రాలకు కాస్త పోలికలున్న ఈ చిత్రంలో సంగీతం చాలా బాగా కుదిరింది. రొటీన్‌ సినిమాలు చూసే ప్రేక్షకులను కాస్త సంగీత ప్రపంచంలో ఓలలాడించిందే విధంగా 'చిత్ర దర్శకుడు సతీష్‌కాసెట్టి చేసిన ప్రయోగమే "కలవరమాయేమదిలో". ఈ సినిమాను చూస్తున్నంతసేపు చక్కటి సంగీత ప్రధానంగా చిత్రం చూశామనే ఫీలింగ్‌ కన్నా స్వాతి భలే నటించిందనే అనుభూతి మాత్రం ప్రేక్షకుడిని వెంటాడుతూనే ఉంటుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 18 Jul 2009 | 11:05 am

ప్రకృతి ముద్దుబిడ్డ "కక్కబె"

కాఫీ తోటలు.. ఏలకుల పరిమళాలు.. నారింజ పండ్ల తోటలు.. జలపాతాలు.. కొండలతో దోబూచులాడే మేఘాలు... పర్వతారోహకులకు అనువైన కొండలు.. ఇలాంటి చూడముచ్చటైన ప్రకృతి అందాలు ఆ ప్రాంతం సొంతం.
Source: వినోదం | 18 Jul 2009 | 10:45 am

అణు జలాంతర్గామిని ప్రధాని ప్రారంభిస్తారు: సీఎం

అణు జలంతర్గామి ప్రారంభోత్సవానికి ఈ నెల 26న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విశాఖకు రానున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి తెలిపారు. త్వరలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రానున్నట్లు వైఎస్సార్ చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 18 Jul 2009 | 10:10 am

మీడియాది దుష్ప్రచారం: చిరంజీవి

ప్రజారాజ్యం పార్టీలో అసంతృప్తి గురించి మీడియా దుష్ప్రచారం చేస్తుందని ఆ పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. ఈ దుష్ప్రచారాన్ని ప్రజలే తిప్పికొట్టాలని ఆయన కోరారు. తనకు, ప్రజలకు మధ్య దూరం పెంచేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగా కృషి చేస్తున్నారని చిరు ఆరోపించారు.
Source: ఏపీ న్యూస్ | 18 Jul 2009 | 9:59 am

బీజేపీకి నవజోత్ సింగ్ సిద్దూ రాజీనామా?

రాజకీయాల్లోకి అడుగుపెట్టిన క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్దూ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసినట్లు శుక్రవారం సాయంత్రం ప్రచారం ప్రారంభమైంది. పార్టీ తన ప్రత్యర్థిని ప్రోత్సహిస్తుండటంపై సిద్దూ అసంతృప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Source: జాతీయ | 18 Jul 2009 | 9:40 am

ముంబయి దాడుల సూత్రధారి లష్కరే చీఫ్ లఖ్వీ: పాక్

ముంబయి ఉగ్రవాద దాడుల్లో భారత భద్రతా దళాలకు పట్టుబడిన ఒకేఒక్క తీవ్రవాది అజ్మల్ కసబ్ తమ దేశీయుడేనని పాకిస్థాన్ ప్రభుత్వం అంగీకరించింది. ముంబయి ఉగ్రవాద దాడుల్లో పట్టుబడిన కసబ్ తమ దేశీయుడేనని పాకిస్థాన్ అధికారికంగా అంగీకరించడం ఇదే తొలిసారి.
Source: జాతీయ | 18 Jul 2009 | 8:36 am

ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు: శ్రీధర్ బాబు

ర్యాగింగ్ నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ర్యాగింగ్‌కు పాల్పడిన ఎస్వీ వర్శిటీ విద్యార్థులు అరెస్టయిన నేపథ్యంలో.. ర్యాగింగ్ చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలో ర్యాగింగ్ లేకుండా చేస్తామని ఆయన అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 18 Jul 2009 | 8:24 am

ఎస్వీ వర్శిటీలో ర్యాగింగ్: విద్యార్థులపై సస్పెన్షన్ వేటు

తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు పడింది. జూనియర్ విద్యార్థిపై ర్యాగింగ్‌ పాల్పడిన ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ర్యాగింగ్ పేరిట అరెస్టయిన 8మంది విద్యార్థులను కళాశాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వీసీ ప్రభాకర రావు శనివారం ప్రకటించారు.
Source: ఏపీ న్యూస్ | 18 Jul 2009 | 7:24 am

యూపీలో ప్రభుత్వం విఫలమైంది: రాహుల్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఎస్పీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ శుక్రవారం నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని దుయ్యబట్టారు. బీఎస్పీ సంబంధిత విగ్రహాలు, స్మారకచిహ్నాలు ఏర్పాటుకే వందలాది కోట్ల రూపాయాలు వృధా చేస్తుందని విమర్శించారు.
Source: జాతీయ | 18 Jul 2009 | 7:03 am

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం

బంగాళాఖాతంలో ఉన్న వాతావరణ పరిస్థితులకు రుతుపవన ద్రోణి తోడుకావడంతో అల్పపీడనం ఏర్పడబోతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో వాయువ్య బంగాళాఖాతంలో రెండురోజుల్లో అల్పపీడనం ఏర్పడుతుంది. ఈ అల్పపీడనం ఇంకా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Source: ఏపీ న్యూస్ | 18 Jul 2009 | 6:33 am

మదిలో కల'వర'మే..!

చిత్రం: కలవరమాయే మదిలో... నటీనటులు: స్వాతి, కమల్‌కామరాజు, ఢిల్లీరాజేశ్వరి, తనికెళ్ళభరణి, విక్రమ్‌ గోఖలే, సందీప్ తదితరులు, నిర్మాత: మోహన్‌వడ్లపట్ల, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సతీష్‌కాసెట్టి. పాయింట్: ఓ గాయని మదిలోని కల 'వరం'గా మారడమే. అది ఎలా జరిగిందనేది సినిమా.
Source: వినోదం | 18 Jul 2009 | 6:24 am

రీటా ఇంటిపై దాడి: యూపీ ఎమ్మెల్యేపై కేసు

ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు రీటా బహుగుణా జోషి ఇంటిపై జరిగిన దాడికి సంబంధించి అధికార బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఎమ్మెల్యేపై కేసు నమోదయింది. మాయావతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇబ్బందుల్లో పడ్డ రీటా ఇంటిపై కొందరు దుండగులు దాడి చేశారు.
Source: జాతీయ | 18 Jul 2009 | 5:55 am

ఎస్వీ వర్శిటీలో పడగవిప్పిన ర్యాగింగ్: 8మంది అరెస్ట్

ర్యాంగింగ్ భూతానికి అడ్డుకట్టవేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా.. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో అర్థరాత్రి ర్యాగింగ్ చోటుచేసుకుంది. ఎంకామ్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిపై సీనియర్లు ర్యాంగింగ్‌కు పాల్పడ్డారు. మద్యం సేవించి డ్యాన్స్ చేయాలని జూనియర్లను ఒత్తిడి చేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ర్యాంగింగ్‌కు పాల్పడిన 8 మందిని పీజీ విద్యార్థులను అరెస్టు చేశారు.
Source: ఏపీ న్యూస్ | 18 Jul 2009 | 4:53 am

నేటి నుంచి తిరుపతిలో చిరంజీవి పర్యటన

తిరుపతి నియోజకవర్గంలో ప్రజారాజ్యం అధినేత చిరంజీవి రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. 18, 19 తేదీల్లో తిరుపతిలో పర్యటనలో భాగంగా తొలి రోజైన శనివారం బీసీ హాస్టల్ సలహా కమిటీతో సమావేశమవుతారు. శనివారం ఉదయం పది గంటలకు రోడ్డు విస్తరణ విషయమై చిన్నబజారు, టీ.కేస్ట్రీట్ అసోసియేషన్ నాయకులతో సమావేశమవుతారు.
Source: ఏపీ న్యూస్ | 18 Jul 2009 | 4:42 am

మావో "కృష్ణవేణి"ని అదుపులోకి తీసుకున్న పోలీసులు

శ్రీకాకులం డివిజన్‌కు చెందిన మావోయిస్టు కృష్ణవేణి అలియాస్ శాంతక్కను విజయనగరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు కృష్ణవేణి వద్ద విచారణ ప్రారంభించారు.
Source: ఏపీ న్యూస్ | 18 Jul 2009 | 4:32 am

నూతిలో దూకుతుందని భయమా?

"నాకూ, మా ఆవిడకూ ఏదైనా గొడవయితే నేను వెంటనే మా ఇంట్లో బావిని చెక్కతో మూసి ఉంచుతాను" అన్నాడు వెంకీ...
Source: వినోదం | 18 Jul 2009 | 4:16 am

చల్లబడ్డాక వెళ్తాను

"రష్యావాళ్ళు, అమెరికా వాళ్ళు చంద్రలోకానికి వెళ్లారు. అవునా?" "అవును"...
Source: వినోదం | 18 Jul 2009 | 4:15 am

ముంబయి చేరుకున్న హిల్లరీ: తాజ్‌లో బస

అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ ఐదు రోజుల భారత పర్యటన కోసం శుక్రవారం ముంబయి వచ్చారు. శుక్రవారం రాత్రి 10.20 గంటలకు హిల్లరీ క్లింటన్ ముంబయి చేరుకున్నారు. అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శిగా హిల్లరీ భారత్ రావడం ఇదే తొలిసారి. భారత్‌లో ఆమె ఐదు రోజులపాటు పర్యటిస్తారు.
Source: జాతీయ | 18 Jul 2009 | 3:43 am

తీవ్రవాదాన్ని అంతమొందిస్తేనే చర్చలు: ప్రధాని

ఈజిప్టు చర్చల్లో పాకిస్థాన్ విషయంలో భారత ప్రభుత్వం మెతకవైఖరి కనబర్చిందని వస్తున్న ఆరోపణలను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తోసిపుచ్చారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. సరిహద్దు తీవ్రవాదాన్ని పాక్ ప్రభుత్వం పూర్తిగా నిరోధించిన తరువాతే ఆ దేశంతో ఎటువంటి అర్థవంతమైన చర్చలు జరుగుతాయని స్పష్టం చేశారు.
Source: జాతీయ | 18 Jul 2009 | 3:29 am

ఇతర సినిమాలపై "హ్యారీపోటర్" బాయ్ దృష్టి

హాలీవుడ్ టీనేజ్ స్టార్ డేనియల్ రాడ్‌క్లిఫ్ ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతున్న "హ్యారీపోటర్ సిరీస్" సినిమాల నుంచి బయటపడాలనుకుంటున్నట్లు చెప్పాడు. ఈ సినిమాలతోనే రాడ్‌క్లిఫ్ హాలీవుడ్‌లో తిరుగులేని టీనేజ్ స్టార్‌గా వెలుగొందుతున్నాడు. హ్యారీపోటర్ సిరీస్‌లో ఐదో భాగమైన "హ్యారీపోటర్ అండ్ ది హాఫ్- బ్లడ్ ప్రిన్స్" బుధవారం ఉత్తర అమెరికా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా వసూళ్లలో బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తుందని హాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. హ్యారీపోటర్ సిరీస్‌లో ఇది ఆరో చిత్రం. ఆరు సినిమాల్లోనూ డేనియల్ రాడ్‌క్లిఫ్ హీరో పాత్రలో నటించాడు. అతను ఇప్పుడు హ్యారీపోటర్ సినిమాల నుంచి బయటకు రావాలనుకుంటున్నాడు. హ్యారీపోటర్ జీవితం నుంచి బయటపడి కొత్త ఇమేజ్ కోసం ప్రయత్నించాలని ఉందన్నాడు.
Source: Yahoo! Telugu: Entertainment | 17 Jul 2009 | 6:44 pm

మైఖేల్ మృతి: హత్యకోణంలో పోలీసుల దర్యాప్తు

పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ మృతిని హత్య కోణంలోనే లాస్ ఏంజెలిస్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారని వినోద వెబ్‌సైట్ టీఎంజడ్.కాం తెలిపింది. జాక్సన్ మృతిని హత్యగానే భావిస్తోన్న పోలీసులు, ఆయనకు చివరి రోజుల్లో వైద్యం అందించిన డాక్టర్ కోనార్డ్ ముర్రేపై దృష్టి సారించారు. ఈ కేసులో డాక్టర్‌కు వ్యతిరేకంగా ఎంతో బలమైన ధాఖలాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని జాక్సన్ నివాసం నుంచి మత్తుమందును, ఆక్సిజన్ సిలిండర్‌ వంటి తదితర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఆ వెబ్‌సైట్ పేర్కొంది.
Source: Yahoo! Telugu: Entertainment | 17 Jul 2009 | 3:20 pm

జూనియర్లను వెంటాడిన ర్యాగింగ్ భూతం!

రాష్ట్ర ప్రభుత్వం ర్యాంగింగ్ భూతంపై సీరియస్ అయినా.. ఫలితం లేకుండా పోతుంది. ఒకవైపు మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే, మరోవైపు ర్యాంగింగ్ కూడా పడగవిప్పి ఆడుతోంది. తాజాగా శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రగతి విద్యాలయ కళాశాలలో ముగ్గురు జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు దాడికి పాల్పడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 17 Jul 2009 | 1:38 pm