ఓటర్లు బుద్ధి చెప్పినా.. మారని బాబు: రోశయ్య

ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు తగిన బుద్ధి చెప్పినా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం తన వైఖరిని మార్చుకోలేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి కొణిజేటి రోశయ్య విమర్శించారు. నోటిని అదుపు చేసుకొని గౌరవప్రదంగా మాట్లాడితే బాగుంటుందని బాబుకు ఆయన హితవు పలికారు.
Source: Yahoo! Telugu: News | 17 Jul 2009 | 2:50 pm

సెన్సార్ల విఫలంపై ఆందోళన అనవసరం: నాయర్

చంద్రయాన్‌ను దిశానిర్ధేశం చేసే నిమిత్తం ఏర్పాటు చేసిన సెన్సార్లు విఫలం కావడం పట్ల ఆందోళన చెందాల్సిన పనిలేదని ఇస్రో ఛైర్మన్ మాధవన్ నాయర్ స్పష్టం చేశారు.
Source: Yahoo! Telugu: News | 17 Jul 2009 | 2:28 pm

తొలి నానో ఎవర్ని వరించనుందో?

ప్రజల కారు నానోకారును టాటా సంస్థ తన వినియోగదారులకు చేరవేయనుంది. టాటా సంస్థల అధినేత రతన్ టాటా శుక్రవారంనాడు నానో కారు తొలి తాళాన్ని తమ వినియోగదారులకు అందజేయనున్నారు. తొలి నానోకారు ఎవరిని వరించనుందో ఖాతాదారులలో గుబులు రేకెత్తిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 17 Jul 2009 | 2:20 pm

477 పాయింట్లు పుంజుకున్న సెన్సెక్స్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం లాభాలతో దూసుకెళుతోంది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 477 పాయింట్లు పుంజుకుని 14,727 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 135 పాయింట్లు లాభపడి 4,367 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 3.34 శాతం, నిఫ్టీ 3.20 శాతం మేరకు వృద్ధి చెందాయి.
Source: Yahoo! Telugu: News | 17 Jul 2009 | 2:14 pm

విమానం హైజాక్ కేసు నుంచి షరీఫ్‌కు విముక్తి

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు ఆ దేశ సుప్రీంకోర్టు విమానం హైజాక్ కేసు నుంచి విముక్తి కల్పించింది. పదేళ్ల క్రితం నాటి విమానం హైజాక్ కేసు నుంచి షరీఫ్ శుక్రవారం పూర్తిగా బయటపడ్డారు. పాక్ మాజీ సైనిక పాలకుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ ప్రభుత్వం షరీఫ్‌పై ఈ కేసు పెట్టింది.
Source: Yahoo! Telugu: News | 17 Jul 2009 | 1:36 pm

లాభాల్లో సెన్సెక్స్: టాటా మోటార్స్ వృద్ధి

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం లాభాల్లో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 357 పాయింట్లు పుంజుకుని 14,607 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 114 పాయింట్లు లాభపడి 4,345 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 2.65 శాతం, నిఫ్టీ 2.69 శాతం మేరకు వృద్ధి చెందాయి.
Source: Yahoo! Telugu: News | 17 Jul 2009 | 1:17 pm

చంద్రయాన్ సెన్సార్లలో సాంకేతిక లోపాలు

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఒకటైన చంద్రయాన్‌ ప్రయోగంలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. చంద్రయాన్‌లో అమర్చిన సెన్సార్లలో సాంకేతిక లోపాలను కనుగొన్నట్టు ఇస్రో ఛైర్మన్ మాధవన్ నాయర్ తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 17 Jul 2009 | 1:10 pm

బాలీవుడ్ ముసలాళ్లతో బోర్.. బోర్!!: దీపికా పదుకునే

బాలీవుడ్ ముసలి హీరోలతో నటించి నటించీ దీపికా పదుకునేకు బోర్ కొట్టిందట. తన వయసేమో 23 ఏళ్లేనట. తనకు అవకాశాలు వస్తున్నదేమో 40 ఏళ్లు దాటిన హీరోల సరసన అని తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు భోగట్టా. షారుక్ ఖాన్(44 ఏళ్లు), అక్షయ్ కుమార్ (42 ఏళ్లు) వంటివారితో ఎంతదాకా నటించాలి..? అని దీపిక తెగ బాధపడిపోతోందట. ఇందులో భాగంగానే దక్షిణాదివైపు దృష్టి సారించినట్లు బాలీవుడ్‌లో కొంతమంది సినీజనాల సమాచారం. అనుకున్నదే తడవుగా జయంత్‌ సి. ఫర్జానీ రూపొందిస్తున్న 'లవ్‌ ఫర్‌ ఎవర్‌' అనే చిత్రంలో కుర్రాళ్లతో కలిసి ఒక పాటలో స్పెషల్‌ సాంగ్‌లో నటించింది. ఈ పాటతో టాలీవుడ్‌‍లో తన ఇమేజ్ చుక్కల్లోకి వెళితే, తెలుగులో సినిమాలు చేసేందుకు "సై" అనే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకే అన్నట్లు.. పాట ఒకటే అయినా... ఆ కాస్త సేపటికే దీపిక వీలైనన్ని పొదుపు దుస్తులు ధరించింది. ఈతకొలనులో ఈదింది. టూ పీస్ వస్త్రాలలో కనిపించింది. మరి మన తెలుగు సినీ ప్రేమికులు దీపిక హాట్‌సాంగ్‌ను చూసి "రా.. రా... రమ్మంటారో..? పో.. పో.. పొమ్మంటారో..?" వేచి చూడాలి.
Source: Yahoo! Telugu: Entertainment | 17 Jul 2009 | 1:01 pm

ప్రజారాజ్యం ఎన్నికల గుర్తు 'సూర్యుడు': ఈసీ

ప్రజారాజ్యం పార్టీ తన ఎన్నికల గుర్తును మార్చుకుంది. అచ్చిరాని రైలుబండిని కాదని సూర్యుడు గుర్తును కైవసం చేసుకుంది. కిరణాలతో కూడిన సూర్యుని గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రజారాజ్యం పార్టీకి ఈసీ లేఖ రాసింది.
Source: Yahoo! Telugu: News | 17 Jul 2009 | 12:53 pm

అమెరికా, ఆసియా స్టాక్ మార్కెట్లు

అమెరికా స్టాక్ మార్కెట్లు... డౌ జోన్స్ ఇండస్ట్రియల్ ఇండెక్స్ - 1.11 శాతంతో 95.23 పాయింట్లు పుంజుకుని 8,711.44 వద్దకు చేరుకుంది. స్టాండార్డ్ అండ్ పూర్ 500 ఇండెక్స్ - 0.86 శాతంతో 8.05 పాయింట్లు లాభపడి 940.73 వద్దకు చేరుకుంది. నాస్‌డాక్ కంపోజిట్ ఇండెక్స్ - 1.19 శాతంతో 22.13 పాయింట్లు బలపడి 1,885.03 వద్దకు చేరుకుంది. ఆసియా స్టాక్ మార్కెట్లు... ఆసియా మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి. హాంగ్ సెంగ్ (హాంకాంగ్) - 1.5 శాతంతో 260 పాయింట్లు లాభపడి 18,622 వద్దకు చేరుకుంది. నిక్కీ (జపాన్) - 53 పాయింట్లు బలపడి 9,398 వద్దకు చేరుకుంది. సియోల్ కంపోజిట్ - స్వల్ప నష్టాల్లో పయనిస్తోంది. షాంఘై (చైనా) - స్వల్ప నష్టాల్లో పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 17 Jul 2009 | 12:39 pm

రాష్ట్రంలో డొకొమో జిఎస్ఎమ్ సేవలు

సెల్ ఫోన్ వినియోగదారులు తమ సిమ్ కార్డునుపయోగించి మాట్లాడే పల్స్‌ రేటు ప్రతి సెకన్‌కు ఒక పైసా మాత్రమే వసూలు చేస్తున్నామని, తమ వినియోగదారులు మాట్లాడిన సమయానికే బిల్‌ చెల్లించే విధాన్నాన్ని తాము ప్రవేశపెట్టినట్లు టాటా డొకొమో సంస్థ ప్రతినిధి తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 17 Jul 2009 | 12:33 pm

తెరపైకి వస్తోన్న వెంకీ వారసుడు!

విక్టరీ వెంకటేష్, నయనతార హీరోహీరోయిన్లుగా నటించిన "తులసి"లో వెంకటేష్‌ కొడుకుగా బుడతడు నటించాడు. చూడ్డానికి చాలా ముచ్చటగా ఉన్న అతని పేరు అతులిత్‌. చాలామంది ఇతనే విక్టరీ వెంకటేష్‌ కొడుకు అనుకున్నారు. తాజా సమాచారం ఏమిటంటే..? నాగార్జున తనయుడు నాగచైతన్య హీరోగా రూపొందుతోన్న 'జోష్‌'లో నాగచైతన్య చిన్నతనం పాత్రలో వెంకటేష్‌ కొడుకు "అర్జున్‌" కన్పించనున్నాడట.
Source: Yahoo! Telugu: Entertainment | 17 Jul 2009 | 11:19 am

ఛార్మి "సయ్యాట"కు వర్షం దెబ్బ!

నటి ఛార్మి ప్రధాన పాత్ర పోషిస్తోన్న చిత్రం "సయ్యాట". ఇందులో దేవీశ్రీప్రసాద్‌ కూడా నటిస్తున్నాడు. అతని పాత్ర హీరోనా? కాదా? అనే విషయాన్ని నిర్మాతే బయటకు పొక్కనీయడంలేదు. ఇందులో దేవీశ్రీప్రసాద్‌ కీలక పాత్ర అని మాత్రం చెబుతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సన్నివేశంతో పాటు ఒక పాట చిత్రీకరణ కోసం హైదరాబాద్‌లోని ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో 40 లక్షలతో భారీ సెట్‌వేశారు. మంగళవారం నుంచి అక్కడ మూడురోజులపాటు వర్క్‌ జరగాల్సి ఉంది. సోమవారం రాత్రి వీచిన గాలికి, కురిసిన వర్షానికి సెట్ చిందరవందరయింది. దీంతో మంగళవారం నుంచి జరగాల్సి షూటింగ్‌ వాయిదాపడింది. నిర్మాత రావ్‌కు సంఘీభావంగా ఛార్మి కాస్త ధైర్యాన్నిచ్చింది.
Source: Yahoo! Telugu: Entertainment | 17 Jul 2009 | 11:09 am

చంద్రబాబుకు పవర్ ఫ్లూ సోకింది: మంత్రి రోశయ్య

ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు తగిన బుద్ధి చెప్పినా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం తన వైఖరిని మార్చుకోలేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి కొణిజేటి రోశయ్య విమర్శించారు. నోటిని అదుపు చేసుకొని గౌరవప్రదంగా మాట్లాడితే బాగుంటుందని బాబుకు ఆయన హితవు పలికారు.
Source: ఏపీ న్యూస్ | 17 Jul 2009 | 9:36 am

రీటాపై చర్య తీసుకోవాల్సిందే: మాయావతి

తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రీటా బహుగుణ జోషీపై కాంగ్రెస్ అధిష్టానం చర్య తీసుకోవాల్సిందేనని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి డిమాండ్ చేశారు. ఆమె శుక్రవారం లక్నోలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రోద్భలంతోనే రీటా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.
Source: జాతీయ | 17 Jul 2009 | 9:35 am

సెన్సార్ల విఫలంపై ఆందోళన అనవసరం: నాయర్

చంద్రయాన్‌ను దిశానిర్ధేశం చేసే నిమిత్తం ఏర్పాటు చేసిన సెన్సార్లు విఫలం కావడం పట్ల ఆందోళన చెందాల్సిన పనిలేదని ఇస్రో ఛైర్మన్ మాధవన్ నాయర్ స్పష్టం చేశారు.
Source: జాతీయ | 17 Jul 2009 | 9:01 am

చంద్రయాన్ సెన్సార్లలో సాంకేతిక లోపాలు

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఒకటైన చంద్రయాన్‌ ప్రయోగంలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. చంద్రయాన్‌లో అమర్చిన సెన్సార్లలో సాంకేతిక లోపాలను కనుగొన్నట్టు ఇస్రో ఛైర్మన్ మాధవన్ నాయర్ తెలిపారు.
Source: జాతీయ | 17 Jul 2009 | 7:41 am

ప్రజారాజ్యం ఎన్నికల గుర్తు 'సూర్యుడు': ఈసీ

ప్రజారాజ్యం పార్టీ తన ఎన్నికల గుర్తును మార్చుకుంది. అచ్చిరాని రైలుబండిని కాదని సూర్యుడు గుర్తును కైవసం చేసుకుంది. కిరణాలతో కూడిన సూర్యుని గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రజారాజ్యం పార్టీకి ఈసీ లేఖ రాసింది.
Source: ఏపీ న్యూస్ | 17 Jul 2009 | 7:24 am

అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకోవాలి

గోదావరి, కృష్ణా నదులపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టు నిర్మాణాలను అడ్డుకోవాలని రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ప్రతినిధులు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు శుక్రవారం కేంద్ర జలవనరుల శాఖామంత్రి పవన్ కుమార్ బన్సాల్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
Source: ఏపీ న్యూస్ | 17 Jul 2009 | 6:03 am

నేడు భారత్‌కు విచ్చేయనున్న హిల్లరీ క్లింటన్

అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ శుక్రవారం భారత్‌కు చేరుకోనున్నారు. ఐదు రోజుల పాటు సాగే ఆమె అధికారిక పర్యటనలో పలు కీలకాంశాలపై చర్చ జరుపుతారు. ప్రధాని మన్మోహన్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ఎం.కృష్ణతో పాటు.. పలువురు ప్రతిపక్ష నేతలతో ఆమె సమావేశమవుతారు.
Source: జాతీయ | 17 Jul 2009 | 5:54 am

హస్తినకు బయలుదేరి వెళ్లిన ముఖ్యమంత్రి

ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి శుక్రవారం దేశ రాజధాని న్యూఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రెండు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో పాటు.. ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, భారీ పరిశ్రమల శాఖామంత్రి విలాస్ రావ్ దేశ్‌ముఖ్‌లతో ఆయన భేటీ అవుతారు.
Source: ఏపీ న్యూస్ | 17 Jul 2009 | 5:40 am

గ్రేటర్‌‌లో ఈవీఎంలు వాడొద్దు: చంద్రబాబు

త్వరలో జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను వాడొద్దని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఈవీఎంల పనితీరుపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారని, వీటిని నివృత్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Source: ఏపీ న్యూస్ | 17 Jul 2009 | 5:16 am

గుజరాత్‌లో కుంభవృష్టి: జనజీవనం అస్తవ్యస్తం

రుతుపవనాలు ప్రవేశించడంతో కారణంగా గుజరాత్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా ఏకధాటిగా పడుతున్న కుంభవృష్టివల్ల అన్ని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటీలో మునిగిపోయాయి. జునాగఢ్ జిల్లాలో రికార్డు స్థాయిలో 216 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Source: జాతీయ | 17 Jul 2009 | 3:35 am

మావోల హింసలో 3,300 మంది బలి: హోంశాఖ

గత ఐదేళ్ళ కాలంలో దేశ వ్యాప్తంగా చోటు చేసుకున్న మావోయిస్టుల హింసాకాండలో 3300 మంది సాధారణ పౌరులు, పోలీసులు మృత్యువాతపడినట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తన వార్షిక నివేదికలో పేర్కొంది.
Source: జాతీయ | 17 Jul 2009 | 3:24 am

"పెళ్లైన కొత్తలో" హీరోయిన్ 'ప్రియమణి' పర్సనల్ టచ్

"పెళ్లైన కొత్తలో" చిత్రం ద్వారా టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకొచ్చిన సెక్సీతార ప్రియమణి. నవవసంతం, యమదొంగ వంటి చిత్రాల ద్వారా వెండితెర కథానాయికగా నిలదొక్కుకున్న ప్రియమణికి కోలీవుడ్ "పరుత్తివీరన్" సినిమా జాతీయ అవార్డును సంపాదించి పెట్టింది. "పరుత్తివీరన్"లో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ భామ కేరళలోని పాలక్కాడులో జన్మించింది. భయ్యా, ద్రోణ వంటి సినిమాల్లో టాలీవుడ్ సెక్సీతారగా అందాలను ఆరబోసిన ప్రియమణి తాజాగా జగపతిబాబుతో మళ్లీ జతకట్టింది. జగపతిబాబు హీరోగా నటించే "ప్రవరాఖ్యుడు" సినిమాలో ప్రియమణి నటిస్తోంది. పుట్టినరోజు: జూన్ 4, 1984,పూర్తిపేరు: ప్రియమణి,ముద్దుపేరు: మణి,విద్య: బి.కామ్,తొలి తెలుగు చిత్రం: పెళ్లైన కొత్తలో,హిట్ చిత్రాలు: యమదొంగ, పెళ్లైన కొత్తలో, నవవసంతం,అలవాట్లు: టీవీ చూడటం, టైమ్ పాస్: స్నేహితులతో చాటింగ్ చేయడం,నచ్చిన హీరోలు: అందరూ..!,నచ్చిన హీరోయిన్: శ్రీదేవి,నచ్చిన వంటకం: శాకాహారం ఏదైనా.. విత్ డైట్,నచ్చిన పానీయం: నీళ్లే..!,నచ్చిన దుస్తులు: జీన్స్ అండ్ టీ షర్ట్,పాజిటివ్ పాయింట్: ఫ్రెండ్లీనెస్.
Source: Yahoo! Telugu: Entertainment | 16 Jul 2009 | 6:58 pm

ఉత్తర అమెరికాలో "హ్యారీపోటర్" ప్రకంపనలు

హ్యారీపోటర్ సిరీస్‌లో తాజాగా వచ్చిన "హ్యారీపోటర్ అండ్ ది హాఫ్- బ్లడ్ ప్రిన్స్" సినిమా ఉత్తర అమెరికాలో బుధవారం విడుదలై ప్రకంపనలు సృష్టిస్తోంది. మంత్రతంత్ర విద్యలతో ఓ బాలుడు చేసే సాహసకృత్యాలను ఇతివృత్తంగా చేసుకొని రూపొందే హ్యారీపోటర్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభించింది.హ్యారీపోటర్ సిరీస్‌లో గతంలో వచ్చిన పలు చిత్రాలు రికార్డులను తిరగరాశాయి. తాజా చిత్రం కూడా అనేక ఉత్తర అమెరికా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతుందని హాలీవుడ్ సినీ పండితులు భావిస్తున్నారు. హ్యారీపోటర్ సిరీస్‌లో వచ్చిన ఆరో చిత్రమిది. అమెరికా, కెనడా థియేటర్లలో మిడ్‌నైట్ టిక్కెట్ల అమ్మకాల రికార్డును ఇప్పటికే ఈ సినిమా తిరగరాసింది. ఈ సినిమా మిడ్‌నైట్ టిక్కెట్ అమ్మకాలు 22.2 మిలియన్ డాలర్లు వసూలు చేశాయని పంపిణీదారు వార్నర్ బ్రదర్స్ తెలిపింది.
Source: Yahoo! Telugu: Entertainment | 16 Jul 2009 | 6:48 pm

రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ...?: లోక్‌సత్తా ప్రశ్న

సుప్రసిద్ధ కర్నాటక సంగీత విద్వాంసురాలు పట్టమ్మాళ్ (90) గురువారం చెన్నైలో స్వర్గస్తులైనారు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో గత కొన్ని రోజులుగా అనారోగ్యంగా ఉన్న పట్టమ్మాళ్ గురువారం మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 16 Jul 2009 | 3:49 pm

శాశ్వత నిద్రలోకి జారుకున్న డీకే.పట్టమ్మాళ్

సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, ప్రద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత డీకే.పట్టమ్మాళ్ గురువారం పరమదించారు. ఆమెకు వయస్సు 90 సంవత్సరాలు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆమె చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
Source: జాతీయ | 16 Jul 2009 | 3:28 pm

పేదల ఆర్థిక ఎదుగుదలకు పెద్దపీట: వైఎస్

రాష్ట్రంలోని పేదల బతుకులను మెరుగుపరిచేందుకు పెద్దపీట వేస్తున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తెలిపారు. పేదలు ఆర్థికంగా ఎదుగుదల సాధించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 16 Jul 2009 | 2:55 pm

18 నుంచి చిరంజీవి తిరుపతిలో పర్యటన

ప్రజారాజ్యం పార్టీ అధినేత, తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి ఈనెల 18వ తేదీ నుంచి రెండు రోజుల పాటు సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ కన్వీనర్ వూకా విజయకుమార్ గురువారం మీడియాకు వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 16 Jul 2009 | 2:44 pm

నోరు జారిన రీటా బహుగుణ జోషీ: కాంగ్రెస్

ఉత్తరప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు రీటా బహుగుణ జోషి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాయావతిని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. తమ పార్టీ నేత నోరు జారారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్ధన్ ద్వివేదీ అభిప్రాయపడ్డారు.
Source: జాతీయ | 16 Jul 2009 | 2:18 pm

మనిషి అనేవాడు ఖాళీగా ఉండకూడదు: నాగార్జున

"మనిషి అనేవాడు తన ఎనర్జీని ఎప్పుడూ ఉపయోగిస్తూ ఉండాలి. ఖాళీగా కూర్చోకూడదు. అందుకే నేను ఎప్పుడూ ఏదో ఒక పనిచేస్తూనే ఉంటాను. నా చుట్టుప్రక్కల వారికి కూడా ఇదే చెబుతుంటాను. మా అబ్బాయికి కూడా ఇదే చెబుతా" అని అంటున్నారు అక్కినేని నాగార్జున. తాజాగా "కింగ్" (నాగార్జున) కొత్త చిత్రం ఈనెల 24న ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆయన తన చిత్ర విషయాలకంటే తన వారసుని విషయాలను తెలియజేశారు. అందులో కొన్ని మీ కోసం...ప్రశ్న: నాగచైతన్యను సొంత బేనర్‌లో కాకుండా బయట నిర్మాతలకు అప్పగించడం పట్ల మీ అభిప్రాయం? జ: నాగచైతన్యను హీరోగా పరిచయం చేయాలనుకున్నప్పుడు.. దిల్‌రాజు నుంచి ఆఫర్ రావడంతో ఆయనకు అప్పగించాం.ప్రశ్న: ఆయనతో మీరు సినిమాలు చేయలేదు కదా? జ : చేయకపోయినా యూత్‌ సినిమాలు తీయడంలో దిల్‌రాజుకు మంచి పట్టుంది.ప్రశ: చైతన్య సెషన్ చూశారు కదా.? ప్రేక్షకుడిలా మీకేమైనా లోపాలు కన్పించాయా? జ: బాగున్నాడు. బాగా చేశాడు. ప్రశ్న: కొంతమంది యువ హీరోలు తక్కువగా చిత్రాలు చేయడంపై మీ ఫీలింగ్‌? జ: అది చాలా తప్పు. ప్రశ్న: మీ ఇద్దరు కలిసి నటించే అవకాశముందా? జ: ఇప్పుడే ఏమీ చెప్పలేను.
Source: Yahoo! Telugu: Entertainment | 16 Jul 2009 | 1:55 pm

జూబ్లీహిల్స్‌లో "సింగిల్ బ్రాండ్ సినీప్లెక్స్" ప్రారంభం

జూబ్లీహిల్స్‌లోని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావుకు చెందిన సినీమ్యాక్స్ ఇక నుంచి 'ఎయిర్‌టెల్‌ ఆర్‌.కె. సినీప్లెక్స్'గా మారింది. భారతదేశంలోనే మొదటిసారిగా సినీప్లెక్స్‌లో సింగిల్‌ బ్రాండ్‌గా ఎయిర్‌టెల్‌ శ్రీకారం చుట్టింది. ఒన్‌మాల్‌-ఒన్‌బ్రాండ్‌ నినాదంతో ఎయిర్‌టెల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ముందుకు వచ్చింది. తొలుతగా జూబ్లీహిల్స్‌లోని కె. రాఘవేంద్రరావుకు చెందిన సినీప్లెక్స్‌లో ఎయిర్‌టెల్‌ సింగిల్‌బ్రాండ్‌గా వ్యవహరిస్తోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 16 Jul 2009 | 1:22 pm

పోలీసుల లాఠీచార్జ్: కాంగ్రెస్ కార్యకర్త మృతి

పశ్చిమబెంగాల్‌లో మరోమారు ఖాకీలు తమ ప్రతాపాన్ని చూపించారు. శాంతియుతంగా బంద్ పాటిస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలపై లాఠీని ఝుళిపిచారు. ఫలితంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక కార్యకర్త ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Source: జాతీయ | 16 Jul 2009 | 12:38 pm

రీటా వ్యాఖ్యలతో పార్టీకి లింకు లేదు: సోనియా

ఉత్తరప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు రీటా బహుగుణ చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ సంఘటనపై సోనియా గాంధీ స్పందించక పోవడం విచారకరమని బీఎస్పీ అధినేత్రి మాయావతి వ్యాఖ్యానించారు.
Source: జాతీయ | 16 Jul 2009 | 12:03 pm

"లవ్వంటే మాయ.. లైఫే ఓ మాయ..!": దీపిక

"లవ్వంటే మాయ... లైఫే ఓ మాయ.... నచ్చినట్లు చేయండి." అని బాలీవుడ్‌ నటి దీపికా పడుకొనే అంటోంది. జయంత్‌ సి. ఫర్జానీ రూపొందిస్తున్న 'లవ్‌ ఫర్‌ ఎవర్‌' అనే చిత్రంలో ఆమె స్పెషల్‌ సాంగ్‌లో నటిస్తోంది. అహ్మద్‌ఖాన్‌ నృత్య దర్శకత్వంలో ఈ పాటను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని జయంత్‌ సి. ఫరాన్జీ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. అంతా కొత్తవారితో తీస్తున్న ఈ చిత్రానికి దీపిక పడుకొనే స్పెషల్‌ సాంగ్ ద్వారా ఎట్రాక్షన్‌ చేయించారు. ఈ సందర్భంగా దీపికా మాట్లాడుతూ... దక్షిణాదిలో చాలా ఆఫర్స్‌ వచ్చినా హిందీలో బిజీగా ఉండడం వల్ల అంగీకరించలేదన్నారు. జయంత్‌ తనకు ఫ్రెండ్‌ కావడంతో కథ నచ్చి అందులో ఇన్‌వాల్వ్‌ అవ్వాలనే పాట చేయడానికి ఒప్పుకున్నానని చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 16 Jul 2009 | 11:14 am

ఏడిద జీవితం స్ఫూర్తి : చిరంజీవి

డబ్బే ప్రధానంగా భావించి జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్న ఎందరికో ఏడిద జీవితం స్ఫూర్తికావాలని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అన్నారు. ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన చిత్రాలే కాదు, ఆయన కుటుంబ జీవితం కూడా మానవీయ విలువలకే ప్రథమస్థానమని చిరంజీవి కొనియాడారు.
Source: Yahoo! Telugu: Entertainment | 16 Jul 2009 | 10:57 am

మృగరాజుల స్థావరం "గిర్ అభయారణ్యం"

గుజరాత్ వనసీమల అందాల్లో పేర్కొనదగినది "గిర్ అభయారణ్యం" లేదా "గిర్ జాతీయవనం". ఇది ఆసియా ప్రాంతపు సింహాలకు నిలయం. ముళ్లపొదలతో నిండిన ఈ అరణ్యంలో అక్కడక్కడా పొదల్లో మృగరాజులు పొంచి ఉంటాయి.
Source: వినోదం | 16 Jul 2009 | 10:45 am