|
ఒడిదుడుకుల మధ్య స్టాక్ మార్కెట్స్టాక్ మార్కెట్ ప్రస్తుతం ఒడిదుడుకుల మధ్య పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 8 పాయింట్లు పెరిగి 14,262 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 6 పాయింట్లు స్వల్పంగా నష్టపోయి 4,228 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.06 శాతం వృద్ధి చెందగా.. నిఫ్టీ 0.13 శాతం మేరకు క్షీణించింది.Source: Yahoo! Telugu: News | 16 Jul 2009 | 3:30 pm ప్రపంచ స్థాయిలో భారత్ కీలకపాత్ర: హిల్లరీరష్యా, చైనా, టర్కీ, భారత్‌లు కీలకమైన అంతర్జాతీయ శక్తులుగా ఎదుగుతున్నాయని అమెరికా గుర్తించింది. వాతావరణ మార్పులు, తీవ్రవాదం, ఆర్థిక మాంద్యం, నిరాయుధీకరణ వంటి కీలక అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోవడంలో అమెరికా ఈ దేశాలతో భాగస్వామ్యాన్ని నిర్మించుకోవాలని అమెరికా కోరుకుంటోంది.Source: Yahoo! Telugu: News | 16 Jul 2009 | 3:03 pm మాయా సర్కారును బర్తరఫ్ చేయాలి: బీజేపీ-ఎస్పీవ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ, సమాజ్‌వాదీ పార్టీల నేతలు డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్ పీసీసీ చీఫ్ రీటా బహుగుణ ఇంటిపై బీఎస్పీ కార్యకర్తలు దాడి చేసి నిప్పు పెట్టడాన్ని ఈ పార్టీల నేతలు తీవ్రంగా ఖండించారు.Source: Yahoo! Telugu: News | 16 Jul 2009 | 2:57 pm జెట్ ఇంధన ధరలు తగ్గించిన చమురు కంపెనీలుప్రభుత్వ రంగ చమురు కంపెనీలు జెట్ ఇంధన ధరలను 5.7 శాతం మేర తగ్గించాయి. ఇంతకుముందు కంపెనీలు వరుసగా నాలుగుసార్లు జెట్ ఇంధన ధరలు పెంచాయి. నిర్వహణ వ్యయం భారీగా పెరగడం, డిమాండ్ పడిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎయిర్‌లైన్స్‌కు తాజాగా జెట్ ఇంధన ధరలు తగ్గించడం ద్వారా చమురు కంపెనీలు ఉపశమనం కలిగించాయి. తాజా తగ్గింపు గత రాత్రి నుంచి అమల్లోకి వచ్చింది.Source: Yahoo! Telugu: News | 16 Jul 2009 | 2:52 pm స్వల్ప నష్టాల్లో పయనిస్తున్న సెన్సెక్స్స్టాక్ మార్కెట్ ప్రస్తుతం స్వల్ప నష్టాల్లో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 5 పాయింట్లు కోల్పోయి 14,248 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 7 పాయింట్లు బలహీనపడి 4,226 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.04 శాతం, నిఫ్టీ 0.17 శాతం చొప్పున క్షీణించాయి.Source: Yahoo! Telugu: News | 16 Jul 2009 | 2:19 pm మనిషి అనేవాడు ఖాళీగా ఉండకూడదు: నాగార్జున"మనిషి అనేవాడు తన ఎనర్జీని ఎప్పుడూ ఉపయోగిస్తూ ఉండాలి. ఖాళీగా కూర్చోకూడదు. అందుకే నేను ఎప్పుడూ ఏదో ఒక పనిచేస్తూనే ఉంటాను. నా చుట్టుప్రక్కల వారికి కూడా ఇదే చెబుతుంటాను. మా అబ్బాయికి కూడా ఇదే చెబుతా" అని అంటున్నారు అక్కినేని నాగార్జున. తాజాగా "కింగ్" (నాగార్జున) కొత్త చిత్రం ఈనెల 24న ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆయన తన చిత్ర విషయాలకంటే తన వారసుని విషయాలను తెలియజేశారు. అందులో కొన్ని మీ కోసం...ప్రశ్న: నాగచైతన్యను సొంత బేనర్‌లో కాకుండా బయట నిర్మాతలకు అప్పగించడం పట్ల మీ అభిప్రాయం? జ: నాగచైతన్యను హీరోగా పరిచయం చేయాలనుకున్నప్పుడు.. దిల్‌రాజు నుంచి ఆఫర్ రావడంతో ఆయనకు అప్పగించాం.ప్రశ్న: ఆయనతో మీరు సినిమాలు చేయలేదు కదా? జ : చేయకపోయినా యూత్ సినిమాలు తీయడంలో దిల్‌రాజుకు మంచి పట్టుంది.ప్రశ: చైతన్య సెషన్ చూశారు కదా.? ప్రేక్షకుడిలా మీకేమైనా లోపాలు కన్పించాయా? జ: బాగున్నాడు. బాగా చేశాడు. ప్రశ్న: కొంతమంది యువ హీరోలు తక్కువగా చిత్రాలు చేయడంపై మీ ఫీలింగ్? జ: అది చాలా తప్పు. ప్రశ్న: మీ ఇద్దరు కలిసి నటించే అవకాశముందా? జ: ఇప్పుడే ఏమీ చెప్పలేను.Source: Yahoo! Telugu: Entertainment | 16 Jul 2009 | 1:55 pm స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్స్టాక్ మార్కెట్ ప్రస్తుతం స్వల్ప లాభాల్లో కొనసాగుతుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 25 పాయింట్లు పుంజుకుని 14,278 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 10 పాయింట్లు కోల్పోయి 4,224 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.17 శాతం వృద్ధి చెందగా.. నిఫ్టీ 0.23 శాతం మేరకు బలహీనపడింది.Source: Yahoo! Telugu: News | 16 Jul 2009 | 1:41 pm ఇరాన్‌తో చర్చలకు ఇప్పటికీ సిద్ధమే: యూఎస్అమెరికా ప్రభుత్వం ఇప్పటికీ ఇరాన్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉందని ఆ దేస విదేశాంగ శాఖ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ తెలిపారు. తమను శత్రువులుగా పరిగణిస్తున్న దేశాలతో చర్చలు జరిపేందుకు అమెరికా ఇప్పుడు కూడా సిద్ధంగా ఉందన్నారు. అయితే దీనిని బలహీనతగా పరిగణించరాదని హిల్లరీ క్లింటన్ హెచ్చరించారు.Source: Yahoo! Telugu: News | 16 Jul 2009 | 1:37 pm ధరలు నియంత్రణలో ప్రభుత్వం విఫలం: చిరునిత్యావసర ధరల పెరుగుదలను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఆరోపించారు. గడచిన రెండు నెలల కాలంలో ఈ ధరలు వంద శాతం మేరకు పెరిగినప్పటికీ.. ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.Source: Yahoo! Telugu: News | 16 Jul 2009 | 1:29 pm జూబ్లీహిల్స్‌లో "సింగిల్ బ్రాండ్ సినీప్లెక్స్" ప్రారంభంజూబ్లీహిల్స్లోని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావుకు చెందిన సినీమ్యాక్స్ ఇక నుంచి 'ఎయిర్‌టెల్ ఆర్.కె. సినీప్లెక్స్'గా మారింది. భారతదేశంలోనే మొదటిసారిగా సినీప్లెక్స్‌లో సింగిల్ బ్రాండ్‌గా ఎయిర్‌టెల్ శ్రీకారం చుట్టింది. ఒన్‌మాల్-ఒన్‌బ్రాండ్ నినాదంతో ఎయిర్‌టెల్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ముందుకు వచ్చింది. తొలుతగా జూబ్లీహిల్స్‌లోని కె. రాఘవేంద్రరావుకు చెందిన సినీప్లెక్స్‌లో ఎయిర్‌టెల్ సింగిల్‌బ్రాండ్‌గా వ్యవహరిస్తోంది.Source: Yahoo! Telugu: Entertainment | 16 Jul 2009 | 1:22 pm హాలీవుడ్‌లో రిలయన్స్ ప్రవేశానికి రంగం సిద్ధంఅనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ బిగ్ ఎంటర్‌టైన్‌మెంట్, హాలీవుడ్ నిర్మాత స్టీవెన్ స్పీల్‌బర్గ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అంతర్జాతీయ సినిమా ప్రేక్షకుల కోసం ఏడాదికి ఆరు సినిమాలు నిర్మించేందుకు స్పీల్‌బర్గ్ నేతృత్వంలోని లాస్ ఏంజెలెస్‌కు చెందిన సినిమా నిర్మాణ సంస్థ డ్రీమ్‌వర్క్స్ స్టూడియోస్‌తో రిలయన్స్ ఈ ఒప్పందంలోకి అడుగుపెట్టింది.Source: Yahoo! Telugu: News | 16 Jul 2009 | 1:17 pm రీటా బహుగుణ అరెస్టుపై దద్దరిల్లిన లోక్సభఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షురాలు, ఆ పార్టీ సీనియర్ మహిళా నేత రీటా బహుగుణ అరెస్టు ఘటన పార్లమెంట్ ఉభసభలను కుదిపేసింది. రీటాను ఉత్తరప్రదేశ్‌లోని మాయావతి సర్కారు అరెస్టు చేయడం పట్ల ఉభయసభల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలకు దారితీసింది.Source: Yahoo! Telugu: News | 16 Jul 2009 | 1:02 pm "లవ్వంటే మాయ.. లైఫే ఓ మాయ..!": దీపిక"లవ్వంటే మాయ... లైఫే ఓ మాయ.... నచ్చినట్లు చేయండి." అని బాలీవుడ్ నటి దీపికా పడుకొనే అంటోంది. జయంత్ సి. ఫర్జానీ రూపొందిస్తున్న 'లవ్ ఫర్ ఎవర్' అనే చిత్రంలో ఆమె స్పెషల్ సాంగ్‌లో నటిస్తోంది. అహ్మద్‌ఖాన్ నృత్య దర్శకత్వంలో ఈ పాటను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని జయంత్ సి. ఫరాన్జీ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. అంతా కొత్తవారితో తీస్తున్న ఈ చిత్రానికి దీపిక పడుకొనే స్పెషల్ సాంగ్ ద్వారా ఎట్రాక్షన్ చేయించారు. ఈ సందర్భంగా దీపికా మాట్లాడుతూ... దక్షిణాదిలో చాలా ఆఫర్స్ వచ్చినా హిందీలో బిజీగా ఉండడం వల్ల అంగీకరించలేదన్నారు. జయంత్ తనకు ఫ్రెండ్ కావడంతో కథ నచ్చి అందులో ఇన్‌వాల్వ్ అవ్వాలనే పాట చేయడానికి ఒప్పుకున్నానని చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 16 Jul 2009 | 11:14 am ఏడిద జీవితం స్ఫూర్తి : చిరంజీవిడబ్బే ప్రధానంగా భావించి జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్న ఎందరికో ఏడిద జీవితం స్ఫూర్తికావాలని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అన్నారు. ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన చిత్రాలే కాదు, ఆయన కుటుంబ జీవితం కూడా మానవీయ విలువలకే ప్రథమస్థానమని చిరంజీవి కొనియాడారు.Source: Yahoo! Telugu: Entertainment | 16 Jul 2009 | 10:57 am మాయా సర్కారును బర్తరఫ్ చేయాలి: బీజేపీ-ఎస్పీవ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ, సమాజ్‌వాదీ పార్టీల నేతలు డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్ పీసీసీ చీఫ్ రీటా బహుగుణ ఇంటిపై బీఎస్పీ కార్యకర్తలు దాడి చేసి నిప్పు పెట్టడాన్ని ఈ పార్టీల నేతలు తీవ్రంగా ఖండించారు.Source: జాతీయ | 16 Jul 2009 | 9:28 am గజియాబాద్‌లో రీటా బహుగుణా జోషి అరెస్ట్ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ యూనిట్ అధ్యక్షురాలు రీటా బహుగుణా జోషిని బుధవారం గజియాబాద్ జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే జోషి నివాసంలోని కొంత భాగానికి బీజేపీ మద్దతుదారులు నిప్పంటించారు. మొరదాబాద్‌లో రెచ్చగొట్టే ప్రసంగం చేశారనే ఆరోపణలపై బీజేపీ మద్దతుదారులుగా భావిస్తున్న కొందరు కార్యకర్తలు ఆందోళనకు దిగారు.Source: జాతీయ | 16 Jul 2009 | 9:10 am ధరలు నియంత్రణలో ప్రభుత్వం విఫలం: చిరునిత్యావసర ధరల పెరుగుదలను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఆరోపించారు. గడచిన రెండు నెలల కాలంలో ఈ ధరలు వంద శాతం మేరకు పెరిగినప్పటికీ.. ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.Source: ఏపీ న్యూస్ | 16 Jul 2009 | 8:01 am రీటా బహుగుణ అరెస్టుపై దద్దరిల్లిన లోక్సభఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షురాలు, ఆ పార్టీ సీనియర్ మహిళా నేత రీటా బహుగుణ అరెస్టు ఘటన పార్లమెంట్ ఉభసభలను కుదిపేసింది. రీటాను ఉత్తరప్రదేశ్‌లోని మాయావతి సర్కారు అరెస్టు చేయడం పట్ల ఉభయసభల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలకు దారితీసింది.Source: జాతీయ | 16 Jul 2009 | 7:32 am పీఆర్పీ గుర్తు 'సూర్యుడు' లేదా 'బండిచక్రం'!!ప్రజారాజ్యం పార్టీ తన ఎన్నికల గుర్తును మార్చుకోనుంది. సూర్యుడు లేదా పది ఆకులు కలిగిన బండిచక్రంలలో ఏదో ఒక గుర్తును కేటాయించాలని ఆ పార్టీ ప్రతినిధులు కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు.Source: ఏపీ న్యూస్ | 16 Jul 2009 | 6:38 am ఢిల్లీ మెట్రో రైల్ ప్రాజెక్టు-2 డైరక్టర్ తొలగింపుఢిల్లీ మెట్రో రైల్ పిల్లర్ కూలిపోయిన సంఘటనకు సంబంధించి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు స్పందించారు. ఈ ప్రాజెక్టు-2 డైరక్టర్‌ను తొలగించారు. ఈ మేరకు డీఎంఆర్‌సీ మేనేజింగ్ డైరక్టర్ ఇ.శ్రీధరన్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు.Source: జాతీయ | 16 Jul 2009 | 6:26 am గ్రేటర్ ఎన్నికల్లో తెరాసతో పొత్తు ఉండదు: తెదేపాత్వరలో జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలంగాణా రాష్ట్ర సమతితో పొత్తు ఉండబోదని తెలుగుదేశం పార్టీ స్పష్టం చేసింది. ఈ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఆ పార్టీ సీనియర్ నేతలు విజయరామారావు, మహేందర్ రెడ్డిలు స్పష్టం చేశారు.Source: ఏపీ న్యూస్ | 16 Jul 2009 | 6:11 am న్యూయార్క్ సదస్సుకు మంత్రి పురంధేశ్వరివచ్చే సెప్టెంబరులో న్యూయార్క్‌లో ఒక ఉన్నతస్థాయి సదస్సు జరుగనుంది. ఈ సదస్సుకు ప్రధాని మన్మోహన్ సింగ్ తరపున కేంద్ర మానవవనరుల శాఖ సహాయ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి హాజరుకానున్నారు. వచ్చే సెప్టెంబరు 22 నుంచి 25 తేదీల మధ్య ఈ సదస్సు జరుగనుంది.Source: ఏపీ న్యూస్ | 16 Jul 2009 | 6:01 am వామపక్షాల కోటలకు బీటలు: ధర్మపురిరాష్ట్రంలో వామపక్షాలకు కోటలుగా ఉన్న స్థానాలకు బీటలు వారుతున్నాయని ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోనే కాకుండా, కమ్యూనిస్టు కంచుకోటలుగా చెప్పుకునే బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో కూడా పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ఆయన జోస్యం చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 16 Jul 2009 | 5:28 am నేటి నుంచి ప్రజారాజ్యం మహాధర్నాలునిత్యావసరాల ధరల పెరుగుదలను నిరసిస్తూ ప్రజారాజ్యం పార్టీ గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయనుంది. జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించి కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించాలని జిల్లా నేతలకు పీఆర్పీ అధినాయకత్వం ఆదేశించింది.Source: ఏపీ న్యూస్ | 16 Jul 2009 | 5:17 am ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు: వరుణ్‌పై ఛార్జిషీట్లోక్సభ ఎన్నికల సందర్భంగా ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీపై ఛార్జిషీటు దాఖలైంది. పిలిభిత్ నియోజకవర్గం నుంచి ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వరుణ్ గాంధీ గెలుపొందిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో వరుణ్ మతప్రాతిపదికన విద్వేషాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.Source: జాతీయ | 16 Jul 2009 | 3:41 am సల్మాన్- 43, కత్రినా- 26. ఎలా కుదురుతుందీ..?సల్మాన్ ముసలివాడయ్యాడా..? అందుకే కత్రినా హ్యాండ్ ఇచ్చిందా...? అవుననే అంటున్నారు బాలీవుడ్ సినీజనం. ప్రస్తుతం సల్మాన్ వయసు 43 సంవత్సరాలు. కత్రినా కైఫ్ రేపటి జూలై 16తో 26 ఏటలోకి ప్రవేశిస్తుంది. ఇద్దరి వయసులను పోల్చి చూస్తే సల్మాన్ వయసులో కత్రినా వయసు సగం. ఈ సంగతి తెలుసుకున్న కత్రినా క్రమంగా సల్మాన్‌కు దూరమైనట్లు బాలీవుడ్ సినీజనం అనుకుంటున్నారు. దీనికితోడు సల్మాన్ ఖాన్ కూడా ఈ మధ్య మీసాలు, గడ్డాలతో ఉన్న పాత్రలవైపు మొగ్గు చూపుతున్నాడట. వయసు మీద పడటం వల్లనే ఇటువంటి క్యారెక్టర్లకు సల్మాన్ సిద్ధమవుతున్నట్లు మరికొందరు వాదిస్తున్నారు. అయితే సినిమాల్లో క్యారెక్టర్లకు తగ్గట్లుగా గడ్డాలు, మీసాలు పెంచుకోవడం... పెట్టుకోవడం సహజమేనని సల్మాన్ సన్నిహితులు వాదిస్తున్నారు. సల్మాన్ వయసు 43 అయినా చూసేందుకు 30లా కనిపిస్తాడని బల్లగుద్ది చెపుతున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 15 Jul 2009 | 7:27 pm ఆహ్లాదంగా జరిగిన 'బిల్లా' శతదినోత్సవ వేడుకయంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా, అనుష్క, నమిత నాయికలుగా డా. కృష్ణంరాజు సమర్పణలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గోపికృష్ణ మూవీస్ పతాకంపై తెరకెక్కిన చిత్రం "బిల్లా". నరేంద్ర, ప్రభోద్‌లు నిర్మాతలుగా యంగ్ అండ్ ఎనర్జిటిక్ డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన 'బిల్లా' ఇటీవలే ద్విగ్విజయంగా 13 కేంద్రాల్లో శతదినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంది. కాగా ఈ చిత్ర శతదినోత్సవ వేడుక జూలై 14న హైదరాబాద్‌లోని హోటల్ మారియట్‌లో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫ్యామిలీ ఫంక్షన్‌లా జరిగింది.Source: Yahoo! Telugu: Entertainment | 15 Jul 2009 | 6:58 pm కొంచెం భయంగానే ఉంది: కలర్స్ స్వాతి"అష్టాచమ్మా" సినిమా ద్వారా యాంకర్ కలర్స్ స్వాతి హీరోయిన్ అయిన విషయం తెలిసిందే. తాజాగా 'కలవరమాయే మదిలో' చిత్రంలో ఆమె నటించింది. సంగీత ప్రధానంగా రూపొందిన ఈ చిత్రంలో ఆమె నటన అద్భుతమని ఇండస్ట్రీ భావిస్తోంది. ఇటువంటి చిత్రంలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని కలర్స్ స్వాతి చెప్పింది. ఈనెల 17న విడుదలకానున్న ఈ చిత్రాన్ని ముందుగానే మెచ్చుకోవడం కూడా ఒకింత భయంగా ఉందని స్వాతి చెప్పింది.Source: Yahoo! Telugu: Entertainment | 15 Jul 2009 | 6:29 pm 17న 'వెంగమాంబ'గా తెరపైకి వస్తోన్న మీనాప్రముఖ నటి మీనా తరిగొండ "వెంగమాంబ"గా నటించిన చిత్రాన్ని ఈనెల 17న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాత వి. దొరస్వామిరాజు తెలియజేశారు. బుధవారం ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, ప్రారంభం నుంచి ఎలాంటి విఘ్నాలు లేకుండా చిత్రాన్ని పూర్తిచేశామన్నారు. అన్నమాచార్యులు తర్వాత శ్రీవేంకటేశ్వరస్వామిని కీర్తించిన కవయిత్రి తరిగొండ వెంగమాంబ. కొండపై ఆయన కొలువున్నంతవరకు ఈమె పేరు నిలిచిపోతుంది. 17వ శతాబ్దానికి చెందిన వెంగమాంబ 17 గ్రంథాలను రచించింది. అన్నమయ్య తర్వాత వెంగమాంబ చిత్రాన్ని తీయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని నిర్మాత వెల్లడించారు.Source: Yahoo! Telugu: Entertainment | 15 Jul 2009 | 6:12 pm సిడ్నీ చుట్టొచ్చిన గోపిచంద్, త్రిషల 'శంఖం'గోపీచంద్, త్రిష సిడ్నీలోని అందమైన లొకేషన్లలో పాటలు పాడుకుని తిరిగి వచ్చారు. చలి ఎక్కువగా ఉన్న సమయంలో పాటలు ముగించుకుని తిరిగి వచ్చారు. వీరికి ఈ అవకాశాన్ని 'శంఖం' నిర్మాతలు జె. భగవాన్, జె. పుల్లారావు కల్పించారు. శివ దర్శకత్వ పర్యవేక్షణ చేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 15 Jul 2009 | 6:00 pm 'శివ' రీమేక్‌లో నాగచైతన్య..!?నాగార్జున హీరోగా, రామ్‌గోపాల్ వర్మని దర్శకుడిగా పరిచయం చేస్తూ అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని వెంకట్ 'శివ' అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు ఈ సినిమా స్టార్‌డమ్ తెచ్చిపెట్టింది. మళ్ళీ అదే చిత్రాన్ని నాగార్జున తన తనయుడు నాగచైతన్యతో రీమేక్ చేయాలని భావిస్తున్నారని తెలిసింది. ఈ చిత్రానికి జె.డి. చక్రవర్తి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం జె.డి. చక్రవర్తి నాగచైతన్య నటిస్తోన్న 'జోష్'లో కీలక పాత్ర పోషించారు. ఇంకా "జోష్" చిత్రంలో నటి రాధ పెద్ద కుమార్తె కార్తీక హీరోయిన్‌గా నటిస్తోంది.Source: Yahoo! Telugu: Entertainment | 15 Jul 2009 | 5:46 pm తీవ్రవాద దేశాలను చట్టం ముందుకు తేవాలితీవ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశాలను, సంస్థలను చట్టం ముందుకు తీసుకురావాలని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ డిమాండ్ చేశారు. ఈజిప్టులో జరుగుతున్న 15వ అలీనోద్యమ దేశాల (నామ్) సదస్సులో ప్రధాని మన్మోహన్ బుధవారం మాట్లాడుతూ.. తీవ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశాలపై నిప్పులు చెరిగారు.Source: జాతీయ | 15 Jul 2009 | 3:12 pm ఐడెంటిటీ కార్డుల ప్రాజెక్టు సీఈఓగా శర్మకేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జాతీయ గుర్తింపు కార్డుల ప్రాజెక్టు ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో)గా జార్ఖండ్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రాంసేవక్ శర్మ నియమితులు కానున్నారు. 1978 బ్యాచ్‌కు చెందిన ఈ ఐఏఎస్ అధికారి... కాన్పూర్ ఐఐటీ నుంచి గణితంలో మాస్టర్ట్ డిగ్రీని పొందారు.Source: జాతీయ | 15 Jul 2009 | 1:50 pm పీఆర్పీ విధానాలపై మండిపడిన కేఎస్ఆర్.మూర్తిప్రజారాజ్యం పార్టీలో మరో అసంతృప్తి గళం బయటపడింది. రాజకీయాల్లో సీనియర్‌గా ముద్రపడిన కేఎస్ఆర్.మూర్తి ఆ పార్టీ విధి విధానాలపై తన అసంతృప్తిని వెళ్లగక్కారు. సీనియర్ల సలహాలను అధ్యక్షుడు చిరంజీవి బుట్టదాఖలు చేస్తున్నారని ఆయన ఒకింత నిరాశను వ్యక్తం చేశారు.Source: ఏపీ న్యూస్ | 15 Jul 2009 | 12:57 pm 17న భారత్‌కు రానున్న హిల్లరీ క్లింటన్అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ ఈనెల 17వ తేదీన భారత్‌కు రానున్నారు. ఈనెల 17వ తేదీన అమెరికా నుంచి ముంబైకు చేరుకునే హిల్లరీ క్లింటన్.. తన ఐదు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా ముంబై దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి అంజలి ఘటిస్తారు.Source: జాతీయ | 15 Jul 2009 | 12:28 pm నిఘా వర్గాల హెచ్చరిక: ముంబైలో హైఅలెర్ట్నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో దేశ వాణిజ్య రాజధాని ముంబైలో హైఅలెర్ట్‌ను ప్రకటించారు. ముంబైలోని ఏడు ప్రాంతాల్లో తీవ్రవాదులు దాడులకు తెగబడవచ్చని ఇటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీంతో హైఅలెర్ట్‌ను ప్రకటించడమే కాకుండా, భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది.Source: జాతీయ | 15 Jul 2009 | 11:44 am నల్గొండ జిల్లా కాంగ్రెస్‌లో అసమ్మతి లేదునల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి అసమ్మతి లేదని ఆ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉప్పునూతల పురుషోత్తమ్ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రివర్గంలో ఎవరిని తీసుకోవాలో.. తీసుకోరాదో అదంతా ముఖ్యమంత్రి ఇష్టాఇష్టాలపై ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.Source: ఏపీ న్యూస్ | 15 Jul 2009 | 10:52 am పన్నులు, సుంకాలు లేని "లంఘావీ"లో వాలిపోదామా...?!లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన దీవులు, వాటిపైన సూరీడు, కింద ఎటుచూసినా సముద్రం, ఇసుక... వీటన్నింటి కలబోతే "లంఘావీ". అతి ప్రాచీనమైన 99 దీవుల సముదాయమైన ఈ లంఘావీ దీవి మలేషియాలో ఉంది.Source: వినోదం | 15 Jul 2009 | 10:46 am "గ్రేటర్" ఎన్నికల్లో 30 స్థానాల్లో పోటీ: నారాయణవచ్చే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సీపీఐ పార్టీ 30 స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట స్థాయి కార్యదర్శి నారాయణ చెప్పారు. ప్రజా సమస్యలపై సీపీఐ బుధవారం రాజధానిలో పాదయాత్ర ప్రారంభించింది.Source: ఏపీ న్యూస్ | 15 Jul 2009 | 10:43 am సుజలాం సుఫలాంకు మంత్రివర్గం ఆమోదంరాష్ట్రంలోని గ్రామాలలోనున్న ప్రజలకు మినరల్ వాటర్ అందించే ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న సుజలాం సుఫలాం పథకానికి రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.Source: ఏపీ న్యూస్ | 15 Jul 2009 | 10:40 am బాబ్రీ ఫైళ్ల మాయంపై సీబీఐ విచారణకు ఆదేశంబాబ్రీ మసీదు కూల్చివేత సంఘటనకు సంబంధించిన కేసులో కీలక ఫైళ్లు మాయం కావడం పట్ల అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఫైళ్ళ మాయంపై నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణకు కోర్టు బుధవారం ఆదేశించింది. బాబ్రీ మసీదు-రామ్‌జన్మభూమి కేసుకు సంబంధించిన 23 ఫైళ్లు మాయమైనట్టు సమాచారం.Source: జాతీయ | 15 Jul 2009 | 10:11 am
|