గంగవరం పోర్టు జాతికి అంకితం: వైఎస్

విశాఖపట్నంలోని గంగవరం వద్ద నిర్మించిన పోర్టును ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి జాతికి అంకితం చేశారు. గంగవరం పోర్టును జాతికి అంకితం చేసిన ముఖ్యమంత్రి మాట్లాడుతూ... విశాఖపట్నం జిల్లా గంగవరంలో నిర్మించిన గంగవరం పోర్టును జాతికి అంకితమిస్తున్నామని, జిల్లా అభివృద్ధికి ఈ పోర్టు దోహదపడుతుందని ఆయన అన్నారు.
Source: Yahoo! Telugu: News | 12 Jul 2009 | 6:26 pm

లాడెన్ ఆఫ్గనిస్థాన్‌లోనే ‌: పాక్‌ మంత్రి

ఒసామా బిన్‌లాడెన్‌తో సహా అల్‌ ఖైదా అగ్ర నేతలంతా అఫ్గనిస్థాన్‌లోనే ఉన్నారని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖామంత్రి రెహ్మాన్‌ మాలిక్‌ అన్నారు. పాక్‌లో లాడెన్‌ ఉండే ఆస్కారం లేదని ఆయన స్పష్టం చేశారు.
Source: Yahoo! Telugu: News | 12 Jul 2009 | 6:09 pm

కేరళ సీఎంను పొలిట్ బ్యూరోనుంచి తొలగించిన సీపీఎం

కేరళ ముఖ్యమంత్రి అచ్యుతానందన్‌ను సీపీఎం పొలిట్‌బ్యూరోనుంచి తొలగిస్తూ కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీకి చెందిన కేరళ సభ్యుల సమస్యల పరిష్కారం కోసం సీపీఎం కేంద్ర కమిటీ ఆదివారం మళ్ళీ సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది..
Source: Yahoo! Telugu: News | 12 Jul 2009 | 5:57 pm

7 నెలల్లో 53 అమెరికా బ్యాంకుల మూత

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థికమాంద్యం కారణంగా అమెరికాలోని ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. దీంతో అమెరికాలోని బ్యాంకులు చాలావరకు మూతపడ్డాయి. ఇందులో భాగంగా ప్రస్తుత ఏడాది మూతపడిన బ్యాంకులు 53కు చేరుకున్నాయి.
Source: Yahoo! Telugu: News | 12 Jul 2009 | 5:21 pm

కష్టాల్లో అచ్యుతానందన్...!

కేరళ ముఖ్యమంత్రి అచ్యుతానందన్ మరోసారి‌ కష్టాల్లో పడ్డారు. అచ్యుతానందన్‌పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయనను పార్టీకి చెందిన అన్ని పదవులనుంచి తప్పించాలని సీపీఎం పొలిట్‌బ్యూరో బావిస్తోంది
Source: Yahoo! Telugu: News | 12 Jul 2009 | 4:46 pm

లాభాలు తగ్గిన బ్లూచిప్ కంపెనీలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశంలోని బ్లూచిప్ కంపెనీల్లో దాదాపు 10శాతం లాభాలు తగ్గాయి. రియల్ ఎస్టేట్ మరియు వివిధ రంగాలలో ఆదాయం తగ్గిన నేపథ్యంలో కంపెనీల ఆదాయంపై తీవ్రమైన ప్రభావం పడిందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు
Source: Yahoo! Telugu: News | 12 Jul 2009 | 4:15 pm

ఆసుపత్రిలో చేరిన జ్యోతిబసు

మార్క్స్‌వాదీ కమ్యూనిస్టు పార్టీకి చెందిన కురువృద్ధుడు మరియు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతీబసుకు శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది రావడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆయనను ఆదివారంనాడు స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు.
Source: Yahoo! Telugu: News | 12 Jul 2009 | 3:33 pm

చిత్తూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం

బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో ఆదివారంనాడు భారీగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు పదికోట్ల రూపాయల ఆస్తినష్టం సంభవించినట్లు మార్కెట్ యార్ట్ వర్గాలు వెల్లడించాయి.
Source: Yahoo! Telugu: News | 12 Jul 2009 | 3:10 pm

ప్రధాన నగరాల్లోని వస్తువుల మార్కెట్ల ధరలు

దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో గల మార్కెట్లలో వస్తువుల ధరలు... కోల్హాపూర్ మార్కెట్‌లో చక్కెర ధర (100 కేజీలు) - రూ. 2,294 గుంటూరు మార్కెట్‌లో ఎండుమిరపకాయలు (100 కేజీలు) - రూ. 5,447 హజీరాబాద్ మార్కెట్‌లో సహజవాయువు (1ఎంఎంబీటీయు) - రూ. 164.20 ముంబాయి మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ (1బీబీఎల్) - రూ. 2,916
Source: Yahoo! Telugu: News | 12 Jul 2009 | 3:00 pm

తాలిబన్లను తరిమికొట్టిన సైన్యం: ఒబామా

ఆఫ్గనిస్థాన్‌లో అమెరికా ఆఫ్గన్ సైన్యం కలిసి అక్కడ నివాసమేర్పరచుకుని ఉన్న తాలిబన్లను తరిమికొట్టారని అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా అన్నారు. కాని ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు చివరివరకు పోరాడుతామని ఆయన తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 12 Jul 2009 | 2:13 pm

గంగవరం పోర్టు జాతికి అంకితం: వైఎస్

విశాఖపట్నంలోని గంగవరం వద్ద నిర్మించిన పోర్టును ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి జాతికి అంకితం చేశారు. గంగవరం పోర్టును జాతికి అంకితం చేసిన ముఖ్యమంత్రి మాట్లాడుతూ... విశాఖపట్నం జిల్లా గంగవరంలో నిర్మించిన గంగవరం పోర్టును జాతికి అంకితమిస్తున్నామని, జిల్లా అభివృద్ధికి ఈ పోర్టు దోహదపడుతుందని ఆయన అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 12 Jul 2009 | 12:56 pm

కేరళ సీఎంను పొలిట్ బ్యూరోనుంచి తొలగించిన సీపీఎం

కేరళ ముఖ్యమంత్రి అచ్యుతానందన్‌ను సీపీఎం పొలిట్‌బ్యూరోనుంచి తొలగిస్తూ కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీకి చెందిన కేరళ సభ్యుల సమస్యల పరిష్కారం కోసం సీపీఎం కేంద్ర కమిటీ ఆదివారం మళ్ళీ సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది..
Source: జాతీయ | 12 Jul 2009 | 12:28 pm

కష్టాల్లో అచ్యుతానందన్...!

కేరళ ముఖ్యమంత్రి అచ్యుతానందన్ మరోసారి‌ కష్టాల్లో పడ్డారు. అచ్యుతానందన్‌పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయనను పార్టీకి చెందిన అన్ని పదవులనుంచి తప్పించాలని సీపీఎం పొలిట్‌బ్యూరో బావిస్తోంది
Source: జాతీయ | 12 Jul 2009 | 11:17 am

ఆసుపత్రిలో చేరిన జ్యోతిబసు

మార్క్స్‌వాదీ కమ్యూనిస్టు పార్టీకి చెందిన కురువృద్ధుడు మరియు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతీబసుకు శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది రావడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆయనను ఆదివారంనాడు స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు.
Source: జాతీయ | 12 Jul 2009 | 10:04 am

చిత్తూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం

బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో ఆదివారంనాడు భారీగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు పదికోట్ల రూపాయల ఆస్తినష్టం సంభవించినట్లు మార్కెట్ యార్ట్ వర్గాలు వెల్లడించాయి.
Source: ఏపీ న్యూస్ | 12 Jul 2009 | 9:40 am

బాగ్లీహార్ డ్యామ్ పేల్చివేతకు లష్కరే కుట్ర భగ్నం!

జమ్మూ...కాశ్మీర్‌లోని బాగ్లీహార్ డ్యామ్‌ను పేల్చివేసేందుకు లష్కర్-ఏ- తోయిబా కుట్రపన్నింది. ఈ కుట్రను పసిగట్టిన దేశీయ భద్రతా దళాలు భగ్నంచేశాయి.
Source: జాతీయ | 12 Jul 2009 | 8:11 am

తెదేపాలో కుమ్ములాటలు లేవు: ఎన్టీఆర్

తెలుగుదేశం పార్టీలో అంతర్గత కుమ్ములాటలేవీ లేవని జూనియర్ ఎన్టీఆర్ స్పష్టం చేశాడు. గత అసెంబ్లీ ఎన్నికల పర్యటనలో నల్గొండలో కారు ప్రమాదానికి గురైన తర్వాత తొలిసారిగా మళ్లీ ప్రజల ముందుకు వచ్చాడు. తన తాతయ్య స్వగ్రామమైన నిమ్మకూరులో తాతయ్య, నానమ్మ విగ్రహాలకు పూలమాలలు వేశాడు.
Source: ఏపీ న్యూస్ | 12 Jul 2009 | 7:56 am

ఆళ్ళగడ్డవద్ద బస్సు ప్రమాదం: పదిమంది మృతి

రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ మండలంలోని పెద్ద కందుకూరువద్ద జరిగిన బస్సు ప్రమాదంలో పదిమంది మృతి చెందగా 20మందికిపైగా తీవ్ర గాయాలపాలైనట్లు తెలిసింది.
Source: ఏపీ న్యూస్ | 12 Jul 2009 | 6:01 am

సికింద్రాబాద్‌లో ప్రారంభమైన లష్కరే బోనాలు

చరిత్రాత్మకమైన ఉజ్జయినీ మహాంకాళీ బోనాల ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమైనాయి. తెల్లవారుఝామున నాలుగు గంటలనుంచే అమ్మవారి దర్శనంకోసం వేలాదిమంది భక్తులు బారులు తీరి నిలబడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 12 Jul 2009 | 5:27 am

కూలిన మెట్రో ఫ్లై ఓవర్: నలుగురు మృతి

దేశ రాజధాని ఢిల్లీలో నిర్మాణంలో ఉన్న మెట్రో రైలు ప్రాజెక్ట్ ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఈ సంఘటనలో నలుగురు మృతి చెందగా మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ రోజు ఉదయం 5.00 గంటల సమయంలో దక్షిణ ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీకి సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది.
Source: జాతీయ | 12 Jul 2009 | 3:37 am

మద్య నిషేధాన్ని సమీక్షించండి: విజయ్ మాల్యా

గుజరాత్‌లో సంపూర్ణ మద్య నిషేధాన్ని ఎత్తి వేసే విషయంపై సమీక్షించాల్సిందిగా యునైటెడ్ బ్రివరీస్ ఛైర్మన్ విజయ్ మాల్యా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల రాష్ట్రంలో కల్తీ సారా మద్యం విషాదం చోటు చేసుకున్న నేపథ్యంలో మాల్యా ఈ వ్యాఖ్యలు చేశారు.
Source: జాతీయ | 12 Jul 2009 | 3:21 am

జూలై 24న "ఆంజనేయులు" ఆడియో విడుదల

క్రేజీస్టార్ రవితేజ, అందాలతార నయనతార జంటగా పరశురామ్ దర్శకత్వంలో నటుడు గణేష్ బాబు పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రం ఆంజనేయులు షూటింగ్ పూర్తికావస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత గణేష్ బాబు మాట్లాడుతూ... " జూలై 24న ఆంజనేయులు చిత్రం ఆడియోను ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేస్తున్నాం. రవితేజ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ చిత్రంగా ఆంజనేయులు సంచలనం క్రియేట్ చేస్తుంది" అన్నారు. క్రేజీస్టార్ రవితేజ, అందాల తార నయనతార జంటగా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో ప్రకాష్‌రాజ్, షాయాజీ షిండె, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, నాజర్, జయప్రకాష్ రెడ్డి, ఆహుతి ప్రసాద్, రాజా రవీంద్ర, ఎం.ఎస్ నారాయణ, సన, వినయ ప్రసాద్, మాస్టర్ భరత్, జీవా, 'సత్యం' రాజేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 11 Jul 2009 | 4:14 pm

విశాఖ-నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్‌‌కు తప్పిన ప్రమాదం

విశాఖపట్నంనుంచి నిజాముద్దీన్ బయలుదేరిన ఎక్స్‌ప్రెస్ రైలుకు శనివారంనాడు పెద్ద ప్రమాదమే తప్పింది. విశాఖ-నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ రైలుకు బ్రేక్ బీమ్ ఫెయిల్ కావడంతో రైలును తూర్పుగోదావరి జిల్లాలోని తునిలో అరగంటపాటు నిలిపేశారు.
Source: ఏపీ న్యూస్ | 11 Jul 2009 | 3:49 pm

కల్తీ మద్యం మరణాలు: ఆత్మహత్యలుగా చిత్రీకరణ

గుజరాత్‌ రాష్ట్రాన్ని కుదిపేసిన కల్తీ మద్యం విషాదం ఇప్పట్లో సమసి పోయేలా కనిపించడం లేదు. ఈ మద్యాన్ని సేవించి మరణించిన వారి సంఖ్య శనివారానికి 127కు చేరుకుంది. మరో 200 మందిని వివిధ ఆస్పత్రుల్లో చేర్పించినట్లు సమాచారం. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది.
Source: జాతీయ | 11 Jul 2009 | 3:43 pm

మౌళికసదుపాయాలపై కేబినెట్ కమిటీ ఏర్పాటు

ఆర్థిక కార్యకలాపాలకు మరింత ఊతమిచ్చేందుకు ప్రభుత్వం మౌళికసదుపాయాల కేబినెట్ కమిటీని (సీసీఐ) ఏర్పాటు చేసింది. మౌళికసదుపాయాల రంగానికి సంబంధించి వేగంగా ప్రాజెక్టులు అమలు చేయడానికి మరియు వాటి పర్యవేక్షణ సత్వరమే జరిగేలా చూసేందుకు ఈ కమిటినీ ఏర్పాటు చేయడం జరిగింది.
Source: జాతీయ | 11 Jul 2009 | 1:31 pm