ప్రతిపక్షాలను కాదు.. ప్రజలను ఆకర్షించండి: చిరు

"ఆపరేషన్ ఆకర్ష" పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ ప్రతిపక్షాలను బలహీనం చేయాలని చూస్తున్నారని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఆరోపించారు. నాయకులను ఆకర్షించడం కంటే ప్రజా సమస్యలను పరిష్కరించి వారిని ఆకట్టుకోవాలని హితవు పలికారు.
Source: Yahoo! Telugu: News | 11 Jul 2009 | 3:58 pm

ఎమ్ఎఫ్ఐపైకూడా మాంద్యం ప్రభావం

రుణాల చెల్లింపులలో పెరుగుతున్న జాప్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థికమాంద్యం ప్రభావం మైక్రో ఫైనాన్స్ సంస్థల లాభాలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 11 Jul 2009 | 3:14 pm

చైనా మత ఘర్షణల్లో పెరిగిన మృతుల సంఖ్య

చైనాలోని జిన్‌జియాంగ్‌లో చెలరేగిన మత ఘర్షణలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకూ ఈ కలహాల్లో 184 మంది మృతి చెందగా, వెయ్యి మందికిపైగా గాయాల పాలైనట్లు ప్రభుత్వం ప్రకటించింది
Source: Yahoo! Telugu: News | 11 Jul 2009 | 3:02 pm

ఉగ్రవాదాన్ని అంతం చేస్తేనే స్నేహం: ప్రధాని

భారతదేశానికి వ్యతిరేకంగా పాక్ భూభాగంలో జరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలను అంతం చేయాలని ప్రధాని మన్మోహన్ సింగ్ పాకిస్తాన్‌ను కోరారు. మరో వారం రోజుల్లో ఈజిప్టులో పాకిస్తాన్ ప్రధాని యూసఫ్ రజా గిలాని- మన్మోహన్ సమావేశం కానున్న తరుణంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.
Source: Yahoo! Telugu: News | 11 Jul 2009 | 2:44 pm

నాణేల కొరత లేదు: రిజర్వ్ బ్యాంక్

ప్రస్తుతం దేశంలో నాణేలు మరియు కరెన్సీ నోట్ల కొరత లేదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. ప్రజలు చిరిగిపోయిన నోట్లను మార్చుకునే సౌకర్యం అన్ని ప్రధాన బ్యాంకుల్లోనూ కల్పించినట్లు రిజర్వ్ బ్యాంక్ చండీగఢ్‌లో ఓ ప్రకటనలో తెలిపింది
Source: Yahoo! Telugu: News | 11 Jul 2009 | 2:27 pm

అమెరికాలోనూ భూ కబ్జా

భారతదేశంలో భూకబ్జా అనే విషయం తరచూ వింటుంటాం. అందునా ఆంధ్రప్రదేశ్‌లో అయితే మరీ ఎక్కువ. కాని ప్రపంచంలోనే అగ్రరాజ్యమైన అమెరికాలోకూడా భూకబ్జాల బెడద తప్పడం లేదు.
Source: Yahoo! Telugu: News | 11 Jul 2009 | 1:54 pm

సెన్సెక్స్: ఎనిమిది నెలల్లో గరిష్ఠ క్షీణత

శుక్రవారం స్టాక్ మార్కెట్ ముగింపులో సెన్సెక్స్ 1.8 శాతం మేరకు క్షీణించింది. ఒకే వారంలో ఇంత స్థాయిలో క్షీణించడం ఎనిమిదేళ్ల తర్వాత ఇదే తొలిసారి అని మార్కెట్ వర్గాలు తెలిపాయి. నిన్న సెన్సెక్స్ 253 పాయింట్లు కోల్పోయి 13,504 వద్ద ముగిసిన విషయం తెలిసిందే. ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి ఉందనే వార్తలతో దేశీయ, విదేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు లాభార్జనకై తెగబడ్డారు.
Source: Yahoo! Telugu: News | 11 Jul 2009 | 1:42 pm

చంద్రబాబుకు మతి చెడింది: మంత్రి రోశయ్య

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు మతి చెడిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి కొణిజేటి రోశయ్య ఆరోపించారు. అందువల్లే ఆయనతో పాటు ఆ పార్టీకి చెందిన నేతలు మతిభ్రమించినట్టు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
Source: Yahoo! Telugu: News | 11 Jul 2009 | 12:36 pm

ఎయిర్ ఇండియాపై ఇప్పుడే చెప్పలేను: టాటా

టాటా ఛైర్మెన్‌ రతన్ టాటాను కేంద్ర ప్రభుతం ఎయిర్ ఇండియా సంస్థలో అంతర్జాతీయ సలహాకారునిగా నియమించాలని అనుకోవడంతో ప్రస్తుతం ఆ విషయంపై తానేమీ మాట్లాడదలచుకోలేదని ఆయన తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 11 Jul 2009 | 12:32 pm

ఆఫ్గన్‌లో భారతీయులపై దాడి జరగలేదు: కేంద్రం

ఆఫ్గనిస్థాన్‌లో భారతీయులపై తాలిబన్ తీవ్రవాదులు దాడి జరిపినట్టు వచ్చిన వార్తలను కేంద్రం ఖండించింది. అక్కడ ఎలాంటి దాడులు జరగలేదని స్పష్టం చేసింది. ఈ వార్తలను ప్రసారం చేసిన పాకిస్థాన్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
Source: Yahoo! Telugu: News | 11 Jul 2009 | 12:22 pm

గో..గో..గో.. గోపి.. గోపిక... గోదావరి!!

నటీనటులు: వేణు తొట్టెంపూడి, కమలినీ ముఖర్జీ, కొండవలస, జీవ, కృష్ణభగవాన్‌ తదితరులు సాంకేతిక సిబ్బంది: కెమెరా: లోకి, కథ: శంకరమంచి, ఎడిటింగ్‌: పైడిరెడ్డి, సంభాషణలు: పడాల శివ సుబ్రహ్మణ్యం, పాటలు: రామజగోయ్యశాస్త్రి, నిర్మాత: వల్లూరిపల్లి రమేష్‌, సమర్పణ: ఆనంది ఆర్ట్స్‌, బేనర్‌: మహర్షి సినిమా, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీ. గోదావరి చిత్రాలంటే వంశీ చిత్రాలే అన్నట్లుగా గతంలో ఉండేవి. రాను రాను ఆయన చిత్రాలు కాస్త గతి తప్పాయి. శ్రీకాంత్‌తో దొంగరాముడు అండ్‌ పార్టీ, శివాజీతో టచ్‌లో ఉంటే చెబుతా ఆర్యన్‌రాజేష్‌తో అనుమానాస్పదం చిత్రాలు ఆశాజనంగా లేవు. మళ్ళీ కాస్త గ్యాప్‌తో వంశీ చేసిన చిత్రం 'గోపి..గోపిక..గోదావరి'లో గోదావరి అందాలు మినహా కథలో కొత్తదనం లోపం స్పష్టమవుతోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 11 Jul 2009 | 12:16 pm

ప్రతిపక్షాలను కాదు.. ప్రజలను ఆకర్షించండి: చిరు

"ఆపరేషన్ ఆకర్ష" పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ ప్రతిపక్షాలను బలహీనం చేయాలని చూస్తున్నారని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఆరోపించారు. నాయకులను ఆకర్షించడం కంటే ప్రజా సమస్యలను పరిష్కరించి వారిని ఆకట్టుకోవాలని హితవు పలికారు.
Source: ఏపీ న్యూస్ | 11 Jul 2009 | 10:30 am

ఉగ్రవాదాన్ని అంతం చేస్తేనే స్నేహం: ప్రధాని

భారతదేశానికి వ్యతిరేకంగా పాక్ భూభాగంలో జరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలను అంతం చేయాలని ప్రధాని మన్మోహన్ సింగ్ పాకిస్తాన్‌ను కోరారు. మరో వారం రోజుల్లో ఈజిప్టులో పాకిస్తాన్ ప్రధాని యూసఫ్ రజా గిలాని- మన్మోహన్ సమావేశం కానున్న తరుణంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.
Source: జాతీయ | 11 Jul 2009 | 9:14 am

చంద్రబాబుకు మతి చెడింది: మంత్రి రోశయ్య

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు మతి చెడిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి కొణిజేటి రోశయ్య ఆరోపించారు. అందువల్లే ఆయనతో పాటు ఆ పార్టీకి చెందిన నేతలు మతిభ్రమించినట్టు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 11 Jul 2009 | 7:06 am

ఆఫ్గన్‌లో భారతీయులపై దాడి జరగలేదు: కేంద్రం

ఆఫ్గనిస్థాన్‌లో భారతీయులపై తాలిబన్ తీవ్రవాదులు దాడి జరిపినట్టు వచ్చిన వార్తలను కేంద్రం ఖండించింది. అక్కడ ఎలాంటి దాడులు జరగలేదని స్పష్టం చేసింది. ఈ వార్తలను ప్రసారం చేసిన పాకిస్థాన్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
Source: జాతీయ | 11 Jul 2009 | 6:53 am

హైదరాబాద్‌లో రాత్రి బజార్: మంత్రి గీతారెడ్డి

దేశ, రాష్ట్ర రాజధానులైన న్యూఢిల్లీ, హైదరాబాద్‌లలో రాత్రి బజార్లను ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని కేంద్ర పర్యాటక శాఖామంత్రి జె.గీతారెడ్డి తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 11 Jul 2009 | 6:22 am

కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం తెదేపాయే: చంద్రబాబు

రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం తెలుగుదేశం పార్టీ మాత్రమేనని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఇటీవల కొత్తగా పుట్టుకొచ్చిన చిన్నాచితక పార్టీల వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరబోదని ఆయన జోస్యం చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 11 Jul 2009 | 6:09 am

రాజధానికి చేరుకున్న కిరణ్‌ మృతదేహం

దక్షిణాఫ్రికాలోని నల్లజాతి దుండగుల చేతిలో హతమైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కిరణ్ మృతదేహం శనివారం హైదరాబాద్‌కు చేరుకుంది. జోహెన్నెస్‌బర్గ్‌ నుంచి విమానంలో కిరణ్‌ కుటుంబసభ్యులు అతని మృతదేహాన్ని రాజధానికి తీసుకొచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 11 Jul 2009 | 5:59 am

ధృవ్ హెలికాఫ్టర్ల కొనుగోళ్ళపై కాగ్ అక్షింతలు

దేశ రక్షణ రంగం కోసం ధృవ్ హెలికాఫ్టర్లను కొనుగోలు వ్యవహారంపై కాగ్ తీవ్రంగా మండిపడింది. రక్షణ శాఖ కొనుగోళ్ళలో భారీగా నిధుల దుర్వనియోగం జరుగుతోందని గతంలో పలుమార్లు హెచ్చిరించినా.. ఆ శాఖ అధికారులకు మాత్రం చీమకుట్టినా లేదు.
Source: జాతీయ | 11 Jul 2009 | 5:20 am

ఆర్భాటంగా సానియా-సోహ్రాబ్‌ నిశ్చితార్థం

భారత సంచలన టెన్నిస్ ఏస్, హైదరాబాద్ సుందరాంగి సానియా మీర్జాకు పెళ్లి నిశ్చయైంది. యావత్‌ భారతం ఆసక్తిగా ఎదురుచూసిన వివాహనిశ్చయ వేడుకకు రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలోని తాజ్‌కృష్ణ ఐదునక్షత్రాల హోటల్ వేదికగా నిలిచింది.
Source: జాతీయ | 11 Jul 2009 | 3:12 am

"రైల్వే" పనితీరుపై శ్వేతపత్రానికి లాలూ డిమాండ్

తన హయాంలో రైల్వే శాఖ పనితీరుపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ శుక్రవారం డిమాండ్ చేశారు. అలాగే రైల్వే ఉద్యోగులకు డివిడెండ్‌ చెల్లించడంలో ప్రస్తుత మంత్రి మమతా బెనర్జీ విఫలమయ్యారని ఆయన ఆరోపించారు.
Source: జాతీయ | 11 Jul 2009 | 3:12 am

"ఎస్" అంటే ఓకే..! లేదంటే 'నో'..!: అమృత

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సరసన "అతిథి" సినిమాలో నటించిన బాలీవుడ్ చిన్నది అమృతారావుకు కొత్త సెంటిమెంట్ ఎక్కడ నుంచో పుట్టుకొచ్చిందట. అమృత కెరీర్‌పరంగా ఓ సెంటిమెంట్‌ను ఫాలో అవుతోందని సినీజనం చెప్పుకుంటున్నారు. 'ఎస్‌' అక్షరంతో మొదలయ్యే హీరోలతో చేస్తేనే సక్సెస్‌ వస్తుందని అమృత నమ్ముతున్నట్లు తెలిసింది. దీనికి షారూఖ్‌, షాహిద్‌, శ్రేయాస్‌ కాంబినేషన్‌లో అమృత చేసిన సినిమాలు హిట్‌ అవడమే కారణమని సమాచారం. దీంతో "ఎస్" అనే అక్షరంతో మొదలయ్యే పేరుగల హీరో సరసనే నటించాలని అమృత భావిస్తోందట. దీనికోసం మంచి మంచి ఛాన్సులు కూడా అమ్మడు మిస్ చేసుకుంటోందట. అంతేకాదు..? "ఎస్" అంటే ఓకే.. లేదంటే "నో" అంటుందని తెలిసింది.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Jul 2009 | 7:03 pm

బాయ్‌ఫ్రెండ్ కోసం మతం మారనున్న బ్రిట్నీ!

ప్రముఖ పాప్ గాయని బ్రిట్నీ స్పియర్స్ తన బాయ్‌ఫ్రెండ్ జాసన్ ట్రావిక్ కోసం యూదు మతాన్ని స్వీకరించేందుకు నిర్ణయించుకున్నట్టు హాలీవుడ్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్రిట్నీ స్పియర్స్ ట్రావిక్ మతానికి మారేందుకు సిద్ధపడిందని సన్ వెబ్‌సైట్ తెలిపింది. దీనికి తోడు బ్రిట్నీ స్పియర్స్ మెడలో డేవిడ్ సింబల్‌తో కనిపించే నెక్లెసే సాక్షి అని ఆ సైట్ పేర్కొంది. అంతేకాదు.. యూదు మతంపై బ్రిట్నీకి రోజుకు రోజుకు నమ్మకం పెరిగిపోతుందని ఆ బ్రిటన్ వెబ్‌సైట్ వెల్లడించింది. పాప్ స్టార్ మడొన్నా సలహా మేరకు గతంలో ఈ ముద్దుగుమ్మ బాప్టిస్ట్ మతాన్ని కూడా స్వీకరించిన సంగతి విదితమే.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Jul 2009 | 5:32 pm

'గీతాంజలి'కి- 'ఓయ్‌'కి పోలికుంది: నాగార్జున

'కొంచెం ఇష్టం-కొంచెం కష్టం' ఫేమ్ సిద్దార్థ, 'అంజలి పాప' "షామిలి" హీరోహీరోయిన్లుగా నటించిన 'ఓయ్' చిత్రాన్ని అక్కినేని నాగార్జున తిలకించి "గీతాంజలి"తో పోల్చారు. ఈ విషయాన్ని సిద్దార్థ చెబుతూ... తాను నటించిన 'ఓయ్' చిత్రాన్ని నాగార్జున చూసి గీతాంజలితో పోలుస్తున్నారని ఇండస్ట్రీలో చాలామంది తనకు తెలియజేసినట్లు చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Jul 2009 | 5:22 pm

సుశాంత్ "కరెంట్‌"‌లో ఆ సీన్‌పై అభ్యంతరం!

"కరెంట్‌"లో సుశాంత్‌, హీరోయిన్‌ స్నేహ ఉల్లాల్‌ బొడ్డుపై ఏదో రాస్తున్నట్లు వేసిన పోస్టర్లపై అభ్యంతరం తెలిపారు. ఇది చిలికి చిలికి గాలివానలా మారింది. దీంతో అక్కడి అక్కినేని అభిమానులకు, వారికి మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ విషయమై నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఇదంతా పబ్లిసిటీలో భాగమేనని అందులో తప్పేమిలేదని నచ్చచెప్పారు. అవసరమైతే మీ అందరికీ మరోసారి షో వేసి చూపిస్తామనీ, సినిమాలో అభ్యంతరమని భావిస్తే తీసేస్తామని అని కూడా తెలిపారు. దీంతో వారంతా సర్దుకున్నారని నిర్మాత చింతలపూడి అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Jul 2009 | 5:05 pm

బుల్లితెరపై "పోకిరి" సతీమణి నమ్రతా!

టాలీవుడ్ ప్రిన్స్, పోకిరి మహేష్‌బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్‌ బుల్లితెరపై ప్రత్యక్షం కానుంది. పెండ్లికిముందు యువరాజుతో వెండితెరపై ఓ వెలుగు వెలిగిన నమ్రత పెళ్లి తర్వాత నటనకు స్వస్తి చెప్పింది. తాజాగా వ్యాపకం కోసం నిర్మాతగామారి బుల్లితెరకు దగ్గరవుతోంది. మరాఠీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్‌ కోసం ఈ షో రూపకల్పన జరుగుతోందని నమ్రత తెలిపింది.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Jul 2009 | 4:48 pm

కత్రినాకు సల్మాన్ భయం పట్టుకుందట..

కత్రినాకైఫ్‌కు కొత్తగా సల్మాన్ ఖాన్ భయం పట్టుకుందట. మొన్నటివరకూ చేతుల్లో చేతులేసుకుని ఎంతో సన్నిహితంగా సల్మాన్‌తో తిరిగిన ఈ భామ పుటుక్కున ఆ బంధాన్ని తెంచేసుకుంది. అది చాలక తోటి హీరోలతో నటిస్తున్న సినిమాల్లో లిప్-టు-లిప్ కిస్‌లిస్తోంది. కత్రినా వ్యవహారాన్ని చూసిన సల్మాన్ పళ్లు పటపట కొరుకుతున్నాడట. తన స్నేహితుల వద్ద తన అక్కసును వెళ్లగక్కుతున్నాడట. సల్మాన్ కోపాన్ని గమనించిన కత్రినా ప్రస్తుతం తను ఉంటున్న ఇల్లును ఖాళీ చేసి వేరే ఇల్లుకు మారిపోవాలని చూస్తోందట.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Jul 2009 | 3:44 pm

సొంత గూటికి పీఆర్పీ నేత తమ్మినేని!

ప్రజారాజ్యం పార్టీకి చెందిన మాజీ తెలుగుదేశం పార్టీ నేతలు తిరిగి సొంత గూటికి చేరుకుంటున్నారు. శుక్రవారం తెదేపా మాజీ నేత మాల్యాల రాజయ్య ప్రజారాజ్యం పార్టీకి గుడ్‌బై చెప్పారు. అదేబాటలో మరో సీనియర్ నేత తమ్మినేని సీతారాం తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వినికిడి.
Source: ఏపీ న్యూస్ | 10 Jul 2009 | 3:19 pm

లేఖ రాసేందుకు అనుమతివ్వండి: కసబ్

దుబాయ్‌లో ఉన్న తన స్నేహితునికి లేఖ రాసేందుకు అనుమతి ఇవ్వాలని పాకిస్థాన్ తీవ్రవాది అజ్మల్ కసబ్ కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. కసబ్‌ను శుక్రవారం మరోమారు కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా న్యాయమూర్తికి తన విన్నపాన్ని తెలిపారు.
Source: జాతీయ | 10 Jul 2009 | 3:00 pm

త్వరలో తీరవాసులకు స్మార్ట్ కార్డుల జారీ: పీసీ

దేశ భద్రత దృష్ట్యా తీర ప్రాంతంలోని కోస్తావాసులకు స్మార్ట్ కార్టులను అందజేయనున్నట్టు కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం తెలిపారు. తొమ్మిది కోస్తా జిల్లాలలో సహా, నాలుగు కేంద్ర పాలిత రాష్ట్రాల్లోని 3,331 గ్రామ వాసులకు ఈ కార్డులను వచ్చే 2010 నాటికి అందజేస్తామని చెప్పారు.
Source: జాతీయ | 10 Jul 2009 | 1:50 pm

మెదడుతోనే మైఖేల్ జాక్సన్ మృతదేహం ఖననం

పాప్ సంగీత రారాజు మైఖేల్ జాక్సన్ భౌతికకాయాన్ని అతని మెదడుతో కలిపి అంతిమంగా ఖననం చేయాలని ఆయన కుటుంబ సభ్యులు యోచిస్తున్నారు. జాక్సన్ మృతిపై ఏర్పడిన సందేహాల నేపథ్యంలో ప్రస్తుతం వైద్య నిపుణులు ఆయన మెదడుకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. జాక్సన్ అంతిమ అంత్యక్రియలు హాలీవుడ్‌లోని ఫారెస్టు లాన్ శ్మశానవాటికలో నిర్వహించనున్నట్లు బ్రిటన్ పత్రిక ది సన్ పేర్కొంది. ఈ నేపథ్యంలో.. మైఖేల్ మెదడుతో కలిపి జాక్సన్ మృతదేహానికి ఖననం నిర్వహించేందుకే ఆయన కుటుంబసభ్యులు అంతిమ అంత్యక్రియలను జాప్యం చేస్తున్నట్లు లండన్‌కు చెందిన మిర్రర్ ఆన్‌లైన్ ఓ కథనంలో తెలిపింది.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Jul 2009 | 1:48 pm

పాక్‌ను ఉగ్రవాద రాజ్యంగా ప్రకటించాలి: భాజపా

పాకిస్తాన్‌ను ఉగ్రవాద రాజ్యంగా ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ పాక్ మిలిటెంట్లకు మద్దతు ఇస్తున్నారని భాజపా ఆరోపించింది. ఉగ్రవాదులను తుదముట్టించాల్సిన పాకిస్తాన్ ఉదాశీన వైఖరితో మిన్నకుంటుందోని, అది పాకిస్తాన్‌కు ఎంతో ప్రమాదమని తెలిపింది.
Source: జాతీయ | 10 Jul 2009 | 1:34 pm

టైట్ ఫిట్స్‌లో సెక్సీ షీలా బాడీ లుక్... లుక్!!

టాలీవుడ్‌లో ఐరెన్ లెగ్ అనిపించుకున్న షీలా శాండల్‌వుడ్‌లో కుర్రకారు హృదయాలకు లంగరు వేయడానికి చూస్తోంది. కన్నడంలో ఆమె తొలిసారిగా నటించిన ప్రేమ్ కహానీ చిత్రం తాలూకు ఆడియో ఫంక్షన్‌కు ఒళ్లంతా కనిపించే పొట్టి దుస్తులతో దర్శనమిచ్చిందట. కార్యక్రమానికి వచ్చినవారందరికీ షీలా అందాలను చూసేందుకే టైమ్ సరిపోయిందట. అతిథులు చెప్పే మాటలు వినక షీలాను చూడటం మొదలుపెట్టారట. కొందరు కుర్రాళ్లయితే, "చూపు ఎంత తిప్పుకుందామన్నా టైట్ ఫిట్స్‌లో షీలా బాడీ లుక్... లుక్ చేయమంటూనే ఉంద"ని తమ తోటి స్నేహితులతో చెపుతున్నారట. ఇదే విషయాన్ని షీలాను అడిగితే, నా డ్రెస్ సెన్స్ అంత బ్యూటీగా ఉందా..? అందరూ నన్నే చూశారంటే... శాండల్ వుడ్‌లో నేననుకున్న స్థానానికి చేరడం ఖాయం అని ఎంతో సంబరపడిపోతూ చెప్పిందట. తెలుగులో ఐరెన్ లెగ్ అయినా శాండల్‌వుడ్‌లో గోల్డెన్ లెగ్ అనిపించుకుంటుందేమో చూద్దాం...
Source: Yahoo! Telugu: Entertainment | 10 Jul 2009 | 11:58 am

దీవుల తోరణంతో స్వాగతం పలికే "ఇండోనేషియా"

హిందూ, ముస్లిం సంస్కృతుల సమ్మేళనంతో, అందమైన సెలయేళ్ళు, పచ్చని అడవుల ప్రకృతి అందాలతో కనువిందు చేసే ప్రాంతమే ఇండోనేషియా. మన దేశంలో పెట్టుకునే పేర్లయిన వరలక్ష్మి, శకుంతలా దేవి, దమయంతి, తీర్థాదేవి అనేవి హిందూ స్త్రీల పేర్లుగానే మనకు తెలుసు. కానీ, ఇండోనేషియాలోని...
Source: వినోదం | 10 Jul 2009 | 11:56 am

రైల్వే శాఖ ఖాళీల భర్తీపై పరిశీలన: మమత

రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు కేంద్ర రైల్వే శాఖామంత్రి మమతా బెనర్జీ తెలిపారు. ప్రస్తుతం ఈ శాఖలో దేశ వ్యాప్తంగా 1.7 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు శుక్రవారం రైల్వే మంత్రి వెల్లడించారు.
Source: జాతీయ | 10 Jul 2009 | 11:24 am

బుల్లితెరపై "పోకిరి" సతీమణి నమ్రతా!

టాలీవుడ్ ప్రిన్స్, పోకిరి మహేష్‌బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్‌ బుల్లితెరపై ప్రత్యక్షం కానుంది. పెండ్లికిముందు యువరాజుతో వెండితెరపై ఓ వెలుగు వెలిగిన నమ్రత పెళ్లి తర్వాత నటనకు స్వస్తి చెప్పింది. తాజాగా వ్యాపకం కోసం నిర్మాతగామారి బుల్లితెరకు దగ్గరవుతోంది. మరాఠీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్‌ కోసం ఈ షో రూపకల్పన జరుగుతోందని నమ్రత తెలిపింది.
Source: వినోదం | 10 Jul 2009 | 11:21 am

పీఆర్పీలో సైద్ధాంతిక లోపాలు: దేవేందర్ గౌడ్

ప్రజారాజ్యం పార్టీ సైద్ధాంతిక లోపాలతో కొట్టుమిట్టాడుతోందని ఆ పార్టీ సీనియర్ నేత తూళ్ళ దేవేందర్ గౌడ్ అభిప్రాయపడ్డారు. వీటిని సరిచేసి భవిష్యత్‌లో ప్రబలమైన శక్తిగా ఎదుగుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 10 Jul 2009 | 10:22 am

కత్రినాకు సల్మాన్ భయం పట్టుకుందట..

కత్రినాకైఫ్‌కు కొత్తగా సల్మాన్ ఖాన్ భయం పట్టుకుందట. మొన్నటివరకూ చేతుల్లో చేతులేసుకుని ఎంతో సన్నిహితంగా సల్మాన్‌తో తిరిగిన ఈ భామ పుటుక్కున ఆ బంధాన్ని తెంచేసుకుంది. అది చాలక తోటి హీరోలతో నటిస్తున్న సినిమాల్లో లిప్-టు-లిప్ కిస్‌లిస్తోంది. కత్రినా వ్యవహారాన్ని...
Source: వినోదం | 10 Jul 2009 | 10:18 am