దేశంలో మొబైల్ వాడకం దార్ల సంఖ్య 41.52 కోట్లు !

నిరుడు ఆర్థిక సంవత్సరం అంటే 2009 మార్చి నెల 31 నాటికి దేశంలో మొబైల్ టెలిఫోన్ కనెక్షన్ల సంఖ్య 41 కోట్ల 52.5 లక్షలుగా నమోదైంది. దేశంలో ప్రజలు ప్రస్తుతం ప్రతి నెల కోటి ఫోన్ కనెక్షన్లను తీసుకుంటున్నారని కేంద్ర మంత్రి గురుదాస్ గుప్త రాజ్యసభలో వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 10 Jul 2009 | 4:00 pm

కత్రినాకు సల్మాన్ భయం పట్టుకుందట..

కత్రినాకైఫ్‌కు కొత్తగా సల్మాన్ ఖాన్ భయం పట్టుకుందట. మొన్నటివరకూ చేతుల్లో చేతులేసుకుని ఎంతో సన్నిహితంగా సల్మాన్‌తో తిరిగిన ఈ భామ పుటుక్కున ఆ బంధాన్ని తెంచేసుకుంది. అది చాలక తోటి హీరోలతో నటిస్తున్న సినిమాల్లో లిప్-టు-లిప్ కిస్‌లిస్తోంది. కత్రినా వ్యవహారాన్ని చూసిన సల్మాన్ పళ్లు పటపట కొరుకుతున్నాడట. తన స్నేహితుల వద్ద తన అక్కసును వెళ్లగక్కుతున్నాడట. సల్మాన్ కోపాన్ని గమనించిన కత్రినా ప్రస్తుతం తను ఉంటున్న ఇల్లును ఖాళీ చేసి వేరే ఇల్లుకు మారిపోవాలని చూస్తోందట.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Jul 2009 | 3:44 pm

279 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం 279 పాయింట్లు కోల్పోవడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 13,478 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 91 పాయింట్లు నష్టపోయి 3,990 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 2.03 శాతం, నిఫ్టీ 2.23 శాతం మేరకు క్షీణించాయి.
Source: Yahoo! Telugu: News | 10 Jul 2009 | 3:39 pm

పీఆర్పీలో సైద్ధాంతిక లోపాలు: దేవేందర్ గౌడ్

ప్రజారాజ్యం పార్టీ సైద్ధాంతిక లోపాలతో కొట్టుమిట్టాడుతోందని ఆ పార్టీ సీనియర్ నేత తూళ్ళ దేవేందర్ గౌడ్ అభిప్రాయపడ్డారు. వీటిని సరిచేసి భవిష్యత్‌లో ప్రబలమైన శక్తిగా ఎదుగుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Source: Yahoo! Telugu: News | 10 Jul 2009 | 3:30 pm

కోరస్‌లో 366మందికి ఉద్వాసన

బ్రిటన్‌లోని కంపెనీలో దాదాపు 366మంది ఉద్యోగులను తీసివేయనున్నట్లు దేశీయ టాటా సంస్థలకు చెందిన యూరోప్ ఉక్కు కర్మాగారమైన కోరస్ సంస్థ తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 10 Jul 2009 | 3:30 pm

అమెరికా సైన్యంలో ఆత్మహత్యలు..!

అమెరికా సైన్యంలో ఆత్మహత్యలు పెరిపోతున్నాయి. ప్రస్తుత ఏడాది తొలి ఆరు నెలల్లోనే దాదాపు 88మంది సైనికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని పెంటగాన్ ప్రకటించింది
Source: Yahoo! Telugu: News | 10 Jul 2009 | 3:15 pm

25 నుంచి ఎంసెట్ కౌన్సిలింగ్

ఇంజనీరింగ్, మెడిసన్‌ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్ కౌన్సిలింగ్ ఈ నెల 25న ప్రారంభం కానుంది. ఈ మేరకు శుక్రవారం ఉన్నత విద్యాశాఖ ఉమ్మడి నోటిఫికేషన్‌ను జారీ చేసింది.
Source: Yahoo! Telugu: News | 10 Jul 2009 | 3:12 pm

కన్యస్త్రీపై అత్యాచారం: మరో నిందితుడు అరెస్టు

పది నెలల క్రితం ఒరిస్సా రాష్ట్రంలోని కంధమాల్‌ జిల్లాలో కన్యస్త్రీపై జరిగిన అత్యాచారం కేసుకు సంబంధించి మరో కీలక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టు చేసిన వారి సంఖ్య 18కు చేరుకుంది.
Source: Yahoo! Telugu: News | 10 Jul 2009 | 3:03 pm

లాభాల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ వృద్ధి

ఆసియా మార్కెట్లు మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకోవడం, యూరోపియా మార్కెట్లు ట్రేడింగ్ బలహీనత వంటి కారణాలతో ఒడిదుడుకులను ఎదుర్కొన్న బాంబే స్టాక్ మార్కెట్, మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో లాభాలను నమోదు చేసుకుంది. దీంతో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 122 పాయింట్లు లాభపడి, 13,879 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 42 పాయింట్లు పుంజుకుని, 4,123 పాయింట్ల వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 10 Jul 2009 | 2:25 pm

మాయావతికి ఊరట - మేం జోక్యం చేసుకోం: సుప్రీం

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతికి పెద్ద ఊరట లభించింది. రాష్ట్రంలో ఆమె తో పాటు.. దళిత నేతల విగ్రహాల ఏర్పాటు విషయంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు శుక్రవారం తేల్చిచెప్పింది.
Source: Yahoo! Telugu: News | 10 Jul 2009 | 2:07 pm

మెదడుతోనే మైఖేల్ జాక్సన్ మృతదేహం ఖననం

పాప్ సంగీత రారాజు మైఖేల్ జాక్సన్ భౌతికకాయాన్ని అతని మెదడుతో కలిపి అంతిమంగా ఖననం చేయాలని ఆయన కుటుంబ సభ్యులు యోచిస్తున్నారు. జాక్సన్ మృతిపై ఏర్పడిన సందేహాల నేపథ్యంలో ప్రస్తుతం వైద్య నిపుణులు ఆయన మెదడుకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. జాక్సన్ అంతిమ అంత్యక్రియలు హాలీవుడ్‌లోని ఫారెస్టు లాన్ శ్మశానవాటికలో నిర్వహించనున్నట్లు బ్రిటన్ పత్రిక ది సన్ పేర్కొంది. ఈ నేపథ్యంలో.. మైఖేల్ మెదడుతో కలిపి జాక్సన్ మృతదేహానికి ఖననం నిర్వహించేందుకే ఆయన కుటుంబసభ్యులు అంతిమ అంత్యక్రియలను జాప్యం చేస్తున్నట్లు లండన్‌కు చెందిన మిర్రర్ ఆన్‌లైన్ ఓ కథనంలో తెలిపింది.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Jul 2009 | 1:48 pm

ద.కొరియా, అమెరికాలో సైబర్ దాడులు !

దక్షిణ కొరియాలో మూడోసారి ప్రభుత్వ వెబ్ సైట్లపై సైబర్ దాడులు జరిగాయి. సైబర్ దాడులపని ఉత్తర కొరియాదై ఉంటుందని ఆ దేశం అనుమానాలు వ్యక్తం చేసింది
Source: Yahoo! Telugu: News | 10 Jul 2009 | 1:35 pm

టైట్ ఫిట్స్‌లో సెక్సీ షీలా బాడీ లుక్... లుక్!!

టాలీవుడ్‌లో ఐరెన్ లెగ్ అనిపించుకున్న షీలా శాండల్‌వుడ్‌లో కుర్రకారు హృదయాలకు లంగరు వేయడానికి చూస్తోంది. కన్నడంలో ఆమె తొలిసారిగా నటించిన ప్రేమ్ కహానీ చిత్రం తాలూకు ఆడియో ఫంక్షన్‌కు ఒళ్లంతా కనిపించే పొట్టి దుస్తులతో దర్శనమిచ్చిందట. కార్యక్రమానికి వచ్చినవారందరికీ షీలా అందాలను చూసేందుకే టైమ్ సరిపోయిందట. అతిథులు చెప్పే మాటలు వినక షీలాను చూడటం మొదలుపెట్టారట. కొందరు కుర్రాళ్లయితే, "చూపు ఎంత తిప్పుకుందామన్నా టైట్ ఫిట్స్‌లో షీలా బాడీ లుక్... లుక్ చేయమంటూనే ఉంద"ని తమ తోటి స్నేహితులతో చెపుతున్నారట. ఇదే విషయాన్ని షీలాను అడిగితే, నా డ్రెస్ సెన్స్ అంత బ్యూటీగా ఉందా..? అందరూ నన్నే చూశారంటే... శాండల్ వుడ్‌లో నేననుకున్న స్థానానికి చేరడం ఖాయం అని ఎంతో సంబరపడిపోతూ చెప్పిందట. తెలుగులో ఐరెన్ లెగ్ అయినా శాండల్‌వుడ్‌లో గోల్డెన్ లెగ్ అనిపించుకుంటుందేమో చూద్దాం...
Source: Yahoo! Telugu: Entertainment | 10 Jul 2009 | 11:58 am

పీఆర్పీలో సైద్ధాంతిక లోపాలు: దేవేందర్ గౌడ్

ప్రజారాజ్యం పార్టీ సైద్ధాంతిక లోపాలతో కొట్టుమిట్టాడుతోందని ఆ పార్టీ సీనియర్ నేత తూళ్ళ దేవేందర్ గౌడ్ అభిప్రాయపడ్డారు. వీటిని సరిచేసి భవిష్యత్‌లో ప్రబలమైన శక్తిగా ఎదుగుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 10 Jul 2009 | 10:22 am

కన్యస్త్రీపై అత్యాచారం: మరో నిందితుడు అరెస్టు

పది నెలల క్రితం ఒరిస్సా రాష్ట్రంలోని కంధమాల్‌ జిల్లాలో కన్యస్త్రీపై జరిగిన అత్యాచారం కేసుకు సంబంధించి మరో కీలక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టు చేసిన వారి సంఖ్య 18కు చేరుకుంది.
Source: జాతీయ | 10 Jul 2009 | 9:34 am

మాయావతికి ఊరట - మేం జోక్యం చేసుకోం: సుప్రీం

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతికి పెద్ద ఊరట లభించింది. రాష్ట్రంలో ఆమె తో పాటు.. దళిత నేతల విగ్రహాల ఏర్పాటు విషయంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు శుక్రవారం తేల్చిచెప్పింది.
Source: జాతీయ | 10 Jul 2009 | 8:37 am

అమ్మాయి నిశ్చితార్థం.. అందరూ సహకరించండి

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా నిశ్చితార్థం శుక్రవారం (నేడు) వైభవంగా జరుగనుంది. ఈ నేపథ్యంలో మా అమ్మాయి నిశ్చితార్థానికి అందరూ సహకరించాలని సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా కోరారు. సానియా జీవితంలో ఇది ఓ ప్రత్యేకమైన రోజని, ఆమె ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ఎంజాయ్ చేసేలా అవకాశం ఇవ్వండని సూచించారు.
Source: ఏపీ న్యూస్ | 10 Jul 2009 | 7:24 am

వామపక్షాల్లో "మంగళగిరి" మంటలు

వామపక్ష పార్టీల మధ్య మంగళగిరి నియోజకవర్గ వివాదం ఇంకా కొనసాగుతోంది. ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో మహాకూటమిలో ఉన్న లెఫ్ట్ పార్టీలు తమకు కేటాయించిన సీట్లలో పోటీ చేశాయి. అయితే, మంగళగిరి నియోజకవర్గంలో ఇరు పార్టీలకు మంచి పట్టుంది.
Source: ఏపీ న్యూస్ | 10 Jul 2009 | 7:22 am

హైదరాబాదులో వైఎస్సార్ సుడిగాలి పర్యటన

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఈ నెల 13, 14, 15 తేదీల్లో రాజధాని నగరం హైదరాబాదులో సుడిగాలి పర్యటన చేస్తారు. బల్దియా ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ హైదరాబాద్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. కాంగ్రెస్ చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా గ్రేటర్ ఎన్నికల్లోనూ భారీ విజయాన్ని సాధించే దిశగా కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
Source: ఏపీ న్యూస్ | 10 Jul 2009 | 6:59 am

ఢిల్లీలో 7-8 నెలల పాటు విద్యుత్ సమస్య: షిండే

ఢిల్లీలో మరో ఏడు ఎనిమిది నెలల పాటు విద్యుత్ సమస్య తప్పదని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. వచ్చే యేడాది జరుగనున్న కామన్వెల్త్ క్రీడల కోసం చేపట్టిన విద్యుత్ ప్రాజెక్టులు పూర్తయి, ఉత్పత్తి ఆరంభమయ్యేంత వరకు విద్యుత్ కొరత ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.
Source: జాతీయ | 10 Jul 2009 | 6:25 am

బ్రహ్మణి పైప్‌లైన్ పనులు వెంటనే ఆపాలి!

కడపజిల్లా మైలవరం జలాశయానికి అడ్డుకట్ట వేస్తున్న బ్రహ్మణి వ్యవహారంపై ఇరిగేషన్ అధికారుల బృందం విచారణ చేపట్టింది. అక్రమంగా నిర్మిస్తున్న పంప్ హౌస్ సాగునీటి పరిశీలకుల బృందం పరిశీలించింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్న బ్రహ్మణి యజమాన్యంపై అధికారుల బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే పైప్‌లైన్ పనులు నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Source: ఏపీ న్యూస్ | 10 Jul 2009 | 6:04 am

నేడే టెన్నిస్ తార సానియా నిశ్చితార్థం!

భారత సంచలన టెన్నిస్ ఆశాకిరణం సానియా మీర్జా త్వరలో పెళ్లి కూతురు కాబోతుంది. టెన్నిస్‌తో పాటు తన అందచందాలతో అందరినీ ఆకట్టుకున్న సానియా మీర్జా నిశ్చితార్థం ఈ రోజు (శుక్రవారం) రాత్రి 8.30 గంటలకు తాజ్ కృష్ణ హోటల్‌లో వైభవంగా జరుగనుంది.
Source: ఏపీ న్యూస్ | 10 Jul 2009 | 5:58 am

కల్తీమద్యం విషాదంలో 103కు చేరిన మృతులు

గుజరాత్‌ రాష్ట్రాన్ని కుదిపేసిన కల్తీ మద్యం విషాదం ఇప్పట్లో సమసి పోయేలా కనిపించడం లేదు. ఈ మద్యాన్ని సేవించి మరణించిన వారి సంఖ్య శుక్రవారానికి 103కు చేరుకుంది. మరో 200 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Source: జాతీయ | 10 Jul 2009 | 5:36 am

ప్రణాళికా సంఘం సభ్యునిగా కస్తూరి

ప్రముఖ శాస్త్రవేత్త, ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్‌ను కేంద్ర ప్రణాళికా సంఘం సభ్యునిగా ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్న కస్తూరి రంగన్ ప్రణాళికా సంఘంలో సభ్యునిగా చేరేందుకు రాజ్యసభ సభ్యత్వానికి ఆయన గురువారంనాడు రాజీమానా చేశారు
Source: జాతీయ | 10 Jul 2009 | 4:27 am

'ఢిల్లీ' టు 'సికింద్రాబాద్‌'...నాన్‌స్టాప్: మమత

రైల్వే బడ్జెట్‌లో భాగంగా రైల్వే మంత్రి మమతా బెనర్జీ రాష్ట్రానికి 5 కొత్త రైళ్లను ప్రకటించారు. వాటిలో న్యూఢిల్లీ... సికింద్రాబాద్ నాన్‌ స్టాప్‌ రైలు కూడా ఉండటం విశేషం. మిగిలిన నాలుగు కొత్త రైళ్ల వివరాలను తరువాత వెల్లడించగలనని గురువారం లోక్‌సభలో మమత ప్రకటించారు.
Source: జాతీయ | 10 Jul 2009 | 3:57 am

13 ఏళ్ల అబ్బాయిని ప్రేమిస్తున్న కిరణ్‌ రాథోడ్‌...!!?

చదివింది లెవెంత్‌స్టాండర్డ్‌ అయినా ఆ తర్వాత మోడలింగ్‌లో పలు వాణిజ్య ప్రకటనల ద్వారా హిందీ చిత్రసీమ దృష్టిని ఆకర్షించిన నటి "కిరణ్‌ రాథోడ్‌". హిందీ, తమిళ, తెలుగు చిత్రాల్లో నటిస్తోన్న కిరణ్‌ రాథోడ్‌ తాను చదువుకోవడానికి సమయం సరిపోవడంలేదని చెబుతోంది. 'శుభముహూర్తం' ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఆమె తరుణ్‌తో 'నువ్వులేక నేనులేను' చిత్రంలో నటించింది. ఆమెతో జరిపిన ఇంటర్వ్యూ వివరాలు మీకోసం..ప్రశ్న: మీ నేపథ్యం గురించి వివరించండి?జ : మాది జైపూర్‌. పెరిగింది ముంబైలో. నాన్నగారు అరుణ్‌ రాథోడ్‌. జైపూర్‌లో వైన్‌ షాప్స్‌ ఉన్నాయి. అమ్మేమో గృహిణి. ఇద్దరు బ్రదర్స్‌ ఉన్నారు.ప్రశ్న: ఎటువంటి తరహా పాత్రలంటే ఇష్టపడతారు?జ: జాబ్‌ సాటిఫ్యాక్షన్‌ పాత్రలు ఏవైనా చేస్తాను.ప్రశ్న: అయితే ఎక్స్‌పోజింగ్‌ చేయాల్సివస్తే..?జ: నటిగా తప్పనిసరిగా చేయాలి. ప్రశ్న: మీ అభిమాన నటి?జ : ఐశ్వర్యారాయ్. ప్రశ్న: ఐష్ పెళ్లి కూడా చేసుకుంది? మరి మీకెప్పుడు...?జ: ఐదు సంవత్సరాల వరకు ఆ ప్రసక్తేలేదు.ప్రశ్న: ప్రేమ వివాహమా..?జ: అవును. ప్రేమ వివాహానికే ఇష్టపడతాను. కానీ ఇంకా ఎవరినీ ప్రేమించలేదు.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jul 2009 | 6:34 pm

పరిశోధన నేపథ్యంలో "అనగనగా ఒక అరణ్యం"

కౌశిక్ హీరోగా టి. సుల్తాన్‌ నిర్మించిన ' అనగనగా ఒక అరణ్యం' చిత్రం కొంతమంది విద్యార్థుల పరిశోధన నేపథ్యంలో సాగుతోంది. ఈ చిత్రానికి శేఖర్‌ చంద్ర దర్శకుడు. పోస్ట్‌ప్రొడక్షన్స్‌ పూర్తయిన ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవలే జరిగింది.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jul 2009 | 6:08 pm

నాన్నను ఎంతో ప్రేమించా: ప్యారిస్

ప్రపంచాన్ని ఎంతో సంతోషపెట్టి అభిమానుల మనస్సుల్లో నాటుకుపోయిన మైఖేల్ జాక్సన్.. తన పిల్లల మదిలో చెరగని తండ్రిగా బలంగా నిలిచిపోయాడు. మంగళవారం జరిగిన సంస్మరణ సభలో మైఖేల్ జాక్సన్ కుమార్తె ప్యారిస్ మాట్లాడిన మాటలు ఆ సభకు హాజరైన అందరినీ కంటతడిపెట్టించింది. ఏడుపును అదుపుచేసుకోలేక ఆ చిట్టి తల్లి మాట్లాడిన తీరు అందరినీ కలచివేసింది. "నాకు నాన్నంటే చాలా ఇష్టం. ఆయన్ను ఎంతో ప్రేమించా..." అంటూ ఏడుపును అదుపు చేసుకోలేక ప్యారిస్ కంటతడిపెట్టింది. కానీ ఎలాగో దుఃఖాన్ని దిగమింగుకుని చివరిగా "ఐ జస్ట్ వాంటెడ్ టు సే ఐ లవ్ హిమ్- సో మచ్" అని చెప్పి తన సోదరులు, మేనత్తను కౌగిలించుకుని తిరిగి ఏడ్వసాగింది.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jul 2009 | 4:39 pm

సాహితీవేత్త ముర్కత్ రామున్ని కన్నుమూత

ప్రముఖ సాహితీవేత, మాజీ దౌత్యవేత్త ముర్కత్ రామున్ని గురువారం కన్నుమూశారు. ఆయనకు వయస్సు 95 సంవత్సరాలు. కన్నూరు సమీపంలోని ఒక ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
Source: జాతీయ | 9 Jul 2009 | 3:01 pm

రాష్ట్రంలో మరో స్వైన్ ఫ్లూ కేసు నమోదు

రాష్ట్రంలో మరో స్వైన్ ఫ్లూ కేసు నమోదైంది. హోస్టన్ నుంచి హైదరాబాద్‌కు ఖతార్ ఎయిర్‌వేస్‌లో వచ్చిన 28 సంవత్సరాల వ్యక్తికి ఈ వ్యాధి సోకినట్టు రాజధానిలోని ఛాతి ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు.
Source: ఏపీ న్యూస్ | 9 Jul 2009 | 12:49 pm

వచ్చే వారంలో గిలానీతో భేటీ కానున్న ప్రధాని

ప్రధాని మన్మోహన్ సింగ్, పాకిస్థాన్ ప్రధాని యూసఫ్ రజా గిలానీలు వచ్చేవారం ఈజిప్టులో సమావేశం కానున్నారు. అలీనోద్యమ (నామ్) సదస్సులో భాగంగా వీరిద్దరి మధ్య ఈ సమావేశం జరుగుతుందని ఇరు దేశాల ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి.
Source: జాతీయ | 9 Jul 2009 | 12:39 pm

సెలీనా చీర "ముదురు" సంగతులు

సెలీనా జైట్లీని ముంబయిలోని "జాషన్ శారీస్" స్టోర్ ఆహ్వానించింది. ఆమె చేతుల మీదుగా వస్త్ర దుకాణాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా సెలీనాను చీర గురించి రెండు ముక్కలు మాట్లాడమని అడిగితే ఇలా చెప్పుకొచ్చింది. "అనుకుంటాం కానీ, చీరలోనే సెక్సీ ఉంది. శరీరాన్ని పూర్తిగా కప్పేసిన చీరలో నుంచి ఓరగా కనబడే ఏ శరీర భాగమైనా చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అంతెందుకు నేను మోడ్రన్ డ్రెస్ వేసుకున్నప్పుడుకంటే చీర కట్టుకున్నప్పుడే చాలామంది నా వంక చూస్తుంటారు. అంటే చీరలోనే నేను ఆకర్షణీయంగా ఉన్నాని కదా అర్థం" అమ్మో సెలీనా... సామాన్యురాలు కాదు... చీర "ముదురు". ఏమంటారు...?
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jul 2009 | 12:08 pm

అమ్మో..! 'హన్సిక' నిజంగానే "దేశముదుర"ట!

"దేశముదురు" చిత్రంలో "బన్ని" సరసన నటించిన అందాల ముద్దుగుమ్మ "హన్సిక" నిజంగానే దేశముదురు అంటున్నారు.. నిర్మాతలు. ఈ మధ్య నిర్మాతల వద్ద హన్సిక బాగా డబ్బులు లాగేస్తుందని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.అయితే తాను డబ్బు మనిషికాదని, అయినప్పటికీ తనపై రకరకాల వదంతులు వస్తున్నాయని ఇటీవలే హన్సిక ఓ ఇంటర్వ్యూలో సెలవిచ్చింది. ఇంకా చిన్న చిన్న చిత్రాలు చేయనని, భారీ బడ్జెట్ చిత్రాల్లోనే హన్సిక నటిస్తానంటుందని ఏవేవో రాసేస్తున్నారని మండిపడింది. ఇలాంటి వార్తలు అసలు నిజం కావని కొట్టిపారేసింది.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jul 2009 | 11:52 am

కాంగ్రెస్ బస్సులో సీట్లు ఖాళీలేవు: రోశయ్య

తెలుగుదేశం పార్టీ నేతలను కాంగ్రెస్ పార్టీలోకి రప్పించే దిశగా కాంగ్రెస్ పార్టీ ఏ ప్రయత్నం చేయలేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి రోశయ్య స్పష్టం చేశారు. మొత్తానికి తెదేపా నేతలను ఆకర్షించే అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదని రోశయ్య తేల్చి చెప్పారు. ఇంకా చెప్పాలంటే.. కాంగ్రెస్ బస్సులో సీట్లు ఖాళీగా లేవన్నారు.
Source: ఏపీ న్యూస్ | 9 Jul 2009 | 11:39 am

రాష్ట్రానికి మరో నాలుగు స్వైన్ ఫ్లూ కేసులు

ప్రపంచ ప్రజలను వణికిస్తోన్న స్వైన్ ఫ్లూ కేసులు రాష్ట్రంలో పెరుగుతున్నాయి. తాజాగా సింగపూర్ నుంచి వచ్చిన ఓ మహిళలకు, సౌదీ అరేబియా నుంచి వచ్చిన మరో ముగ్గురికి స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వీరికి స్వైన్‌ఫ్లూ పరీక్షలు, చికిత్స కోసం చెస్ట్ ఆస్పత్రిలో చేర్పించారు.
Source: ఏపీ న్యూస్ | 9 Jul 2009 | 10:46 am

మధురానుభూతుల సమ్మేళనం "కదళీవనం"

దత్తాత్రేయ అవతారంగా చెప్పబడే శ్రీ నరసింహ సరస్వతీ స్వామి ఎన్నో సంవత్సరాలుగా తపస్సుచేసి "అక్కల్ కోట మహరాజ్"గా పేరుగాంచారు. ఈ మహానుభావుడు తపస్సు చేసిన చోటే "కదళీవనం"గా ప్రసిద్ధిగాంచింది. శ్రీశైలానికి దగ్గర్లో ఉండే ఈ ప్రాంతంలో సరస్వతీ స్వామివారు తపస్సు చేసి...
Source: వినోదం | 9 Jul 2009 | 10:42 am

సానియా ఇంటిముందు ప్రేమపిచ్చోళ్ల క్యూ

నిన్న కేరళకు చెందిన ఓ కుర్రాడు సానియా మీర్జాను పెళ్లాడుతానన్న సంఘటన మరిచిపోక ముందే ఈరోజు ఉత్తరప్రదేశ్‌కు చెందిన మరో కుర్రాడు సానియాను వివాహమాడతానని ఆమె ఇంటి ముందు తిష్ట వేశాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 9 Jul 2009 | 10:22 am

గుజరాత్‌లో 73కు పెరిగిన కల్తీ మద్యం మృతులు

గుజరాత్‌ రాష్ట్రంలోని నరేంద్ర మోడీ సర్కారు చిక్కుల్లో పడింది. కల్తీ మద్యం సేవించి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య గురువారానికి 73కు చేరుకుంది. దీనిపై విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఆరోపిస్తున్నాయి.
Source: జాతీయ | 9 Jul 2009 | 10:17 am

ఢిల్లీ హైకోర్టు తీర్పును సమీక్షిస్తాం: మంత్రి మొయిలీ

స్వలింగ సంపర్కంపై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించనున్నట్టు కేంద్ర న్యాయ శాఖామంత్రి వీరప్ప మొయిలీ తెలిపారు. హైకోర్టు జడ్జిమెంట్‌పై సమీక్ష జరిపి, అభిప్రాయాలు స్వీకరిస్తామని ఆయన గురువారం మీడియాకు చెప్పారు.
Source: జాతీయ | 9 Jul 2009 | 9:54 am