ఒడిదుడుకుల మధ్య స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం ఒడిదుడుకుల మధ్య పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 46 పాయింట్లు పుంజుకుని 13,815 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 25 పాయింట్లు లాభపడి 4,104 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.33 శాతం, నిఫ్టీ 0.61 శాతం మేరకు వృద్ధి చెందాయి.
Source: Yahoo! Telugu: News | 9 Jul 2009 | 2:19 pm

ఆఫ్గనిస్తాన్‌లో భారీ పేలుడు: 14 మంది మృతి

మధ్య ఆఫ్గనిస్థాన్‌లో దుండగులు భారీ పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో పదిమంది సాధారణ పౌరులతోపాటు నలుగురు పోలీసులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం.
Source: Yahoo! Telugu: News | 9 Jul 2009 | 2:07 pm

"గే" సెక్స్‌పై సుప్రీంకు వెళ్లనున్న రామ్‌దేవ్

స్వలింగ సంపర్కంపై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశంలో మెల్లగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీకి చెందిన జ్యోతిష్యుడు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో పిటీషన్ దాఖలు చేశారు. ఆ కోవలోనే ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు.
Source: Yahoo! Telugu: News | 9 Jul 2009 | 1:56 pm

సామాన్యుడికి భారంకానున్న సీటీటీ రద్దు

కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో సరుకుల లావా దేవీల పన్నును (సీటీటీ) రద్దు చేయడం అత్యంత ప్రమాదకరమని, దీంతో ఆహార ఉత్పత్తులతోపాటు అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతాయని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Source: Yahoo! Telugu: News | 9 Jul 2009 | 1:36 pm

లాభాల్లో పయనిస్తున్న సెన్సెక్స్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం లాభాల్లో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 48 పాయింట్లు పుంజుకుని 13,818 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 22 పాయింట్లు లాభపడి 4,101 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.35 శాతం, నిఫ్టీ 0.54 శాతం మేరకు లాభపడ్డాయి.
Source: Yahoo! Telugu: News | 9 Jul 2009 | 1:34 pm

ఆగస్టు 16న ఇగ్నో ప్రవేశ పరీక్ష

ఎంబీఏ, బీఈడీ కోర్సుల్లో చేరగోరు విద్యార్థుల కోసం ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (ఇగ్నో) ఆగస్టు 16న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోంది. ఈ పరీక్షకు హాజరు కాదలచుకున్న విద్యార్థులు ఈ నెల 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఇగ్నో రీజినల్ డైరక్టర్ పి. అశోక్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 9 Jul 2009 | 1:15 pm

పాక్‌కు సహాయం చేస్తాం: జీ-8

పాకిస్థాన్ దేశంలో వేళ్ళూనుకుని ఉన్న తాలిబన్ ఉగ్రవాదులతో పోరాడేందుకు ఆ దేశం చేస్తున్న ప్రయత్నాలను జీ-8లో సభ్యత్వమున్న దేశాలన్నీ సమర్థించాయి. ఉగ్రవాదంపై పోరాడేందుకు జీ-8దేశాలన్నీ పాక్ దేశానికి సహాయ సహకారాలందిస్తాయని ఉద్ఘాటించాయి.
Source: Yahoo! Telugu: News | 9 Jul 2009 | 1:06 pm

ఎమ్మెల్యే రామారావు అరెస్టుకు సీఐడీ యత్నం!

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కోవ్వూరు ఎమ్మెల్యే టీవీ.రామారావు అరెస్టుకు రాష్ట్ర సీఐడీ పోలీసులు గురువారం ప్రయత్నిస్తున్నారు. రామారావు నడుపుతున్న నర్సింగ్ కళాశాలలో చదువుకున్న కేరళ రాష్ట్రానికి చెందిన ముగ్గురు విద్యార్థినులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు అరెస్టుకు సిద్ధపడుతున్నారు.
Source: Yahoo! Telugu: News | 9 Jul 2009 | 12:57 pm

అమెరికా, ఆసియా స్టాక్ మార్కెట్లు

అమెరికా మార్కెట్లు... డౌ జోన్స్ ఇండస్ట్రియల్ ఇండెక్స్ - 0.18 శాతంతో 14.81 పాయింట్లు లాభపడి 8,178.41 వద్దకు చేరుకుంది. స్టాండార్డ్ అండ్ పూర్ 500 ఇండెక్స్ - 0.17 శాతంతో 1.47 పాయింట్లు నష్టపోయి 879.56 వద్దకు చేరుకుంది. నాస్‌డాక్ కంపోజిట్ ఇండెక్స్ - 0.06 శాతంతో 1.00 పాయింట్లు స్వల్పంగా లాభపడి 1,747.17 వద్దకు చేరుకుంది. ఆసియా మార్కెట్లు... హాంగ్ సెంగ్ (హాంకాంగ్) - 103 పాయింట్లు కోల్పోయి 17,618 వద్దకు చేరుకుంది. నిక్కీ (జపాన్) - 86 పాయింట్లు నష్టపోయి 9,335 వద్దకు చేరుకుంది. షాంఘై (చైనా) - 3,084 వద్ద, సియోల్ కంపోజిట్ - 1,434 వద్ద స్థిరంగా ఉన్నాయి.
Source: Yahoo! Telugu: News | 9 Jul 2009 | 12:49 pm

తెదేపాను వీడే ప్రసక్తే లేదు: తలసాని

తెలుగుదేశం పార్టీ తనకు కన్నతల్లిలాంటిదని సమైకాంధ్రవాదంతో పార్టీలో తిరుగుబాటు బావుటా ఎగురవేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. 22 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నానని, తెదేపాను వీడే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. తనపై మీడియాలో వచ్చిన వార్తలపై ఆయన స్పందిస్తూ... రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డిని అసలు కలవనే లేదన్నారు.
Source: Yahoo! Telugu: News | 9 Jul 2009 | 12:42 pm

సెలీనా చీర "ముదురు" సంగతులు

సెలీనా జైట్లీని ముంబయిలోని "జాషన్ శారీస్" స్టోర్ ఆహ్వానించింది. ఆమె చేతుల మీదుగా వస్త్ర దుకాణాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా సెలీనాను చీర గురించి రెండు ముక్కలు మాట్లాడమని అడిగితే ఇలా చెప్పుకొచ్చింది. "అనుకుంటాం కానీ, చీరలోనే సెక్సీ ఉంది. శరీరాన్ని పూర్తిగా కప్పేసిన చీరలో నుంచి ఓరగా కనబడే ఏ శరీర భాగమైనా చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అంతెందుకు నేను మోడ్రన్ డ్రెస్ వేసుకున్నప్పుడుకంటే చీర కట్టుకున్నప్పుడే చాలామంది నా వంక చూస్తుంటారు. అంటే చీరలోనే నేను ఆకర్షణీయంగా ఉన్నాని కదా అర్థం" అమ్మో సెలీనా... సామాన్యురాలు కాదు... చీర "ముదురు". ఏమంటారు...?
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jul 2009 | 12:08 pm

అమ్మో..! 'హన్సిక' నిజంగానే "దేశముదుర"ట!

"దేశముదురు" చిత్రంలో "బన్ని" సరసన నటించిన అందాల ముద్దుగుమ్మ "హన్సిక" నిజంగానే దేశముదురు అంటున్నారు.. నిర్మాతలు. ఈ మధ్య నిర్మాతల వద్ద హన్సిక బాగా డబ్బులు లాగేస్తుందని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.అయితే తాను డబ్బు మనిషికాదని, అయినప్పటికీ తనపై రకరకాల వదంతులు వస్తున్నాయని ఇటీవలే హన్సిక ఓ ఇంటర్వ్యూలో సెలవిచ్చింది. ఇంకా చిన్న చిన్న చిత్రాలు చేయనని, భారీ బడ్జెట్ చిత్రాల్లోనే హన్సిక నటిస్తానంటుందని ఏవేవో రాసేస్తున్నారని మండిపడింది. ఇలాంటి వార్తలు అసలు నిజం కావని కొట్టిపారేసింది.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jul 2009 | 11:52 am

మరో ఐదు రైళ్లు: ఫలించిన కాంగీ ఎంపీల లాబీ!

కేంద్ర రైల్వే శాఖామంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంపై కరుణ చూశారు. రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు చేసిన కృషి ఎట్టకేలకు ఫలించింది. దీంతో రాష్ట్రానికి కొత్తగా మరో ఐదు రైళ్ళను కేటాయించారు.
Source: ఏపీ న్యూస్ | 9 Jul 2009 | 9:29 am

"గే" సెక్స్‌పై సుప్రీంకు వెళ్లనున్న రామ్‌దేవ్

స్వలింగ సంపర్కంపై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశంలో మెల్లగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీకి చెందిన జ్యోతిష్యుడు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో పిటీషన్ దాఖలు చేశారు. ఆ కోవలోనే ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు.
Source: జాతీయ | 9 Jul 2009 | 8:27 am

ఎమ్మెల్యే రామారావు అరెస్టుకు సీఐడీ యత్నం!

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కోవ్వూరు ఎమ్మెల్యే టీవీ.రామారావు అరెస్టుకు రాష్ట్ర సీఐడీ పోలీసులు గురువారం ప్రయత్నిస్తున్నారు. రామారావు నడుపుతున్న నర్సింగ్ కళాశాలలో చదువుకున్న కేరళ రాష్ట్రానికి చెందిన ముగ్గురు విద్యార్థినులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు అరెస్టుకు సిద్ధపడుతున్నారు.
Source: ఏపీ న్యూస్ | 9 Jul 2009 | 7:28 am

తెదేపాను వీడే ప్రసక్తే లేదు: తలసాని

తెలుగుదేశం పార్టీ తనకు కన్నతల్లిలాంటిదని సమైకాంధ్రవాదంతో పార్టీలో తిరుగుబాటు బావుటా ఎగురవేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. 22 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నానని, తెదేపాను వీడే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. తనపై మీడియాలో వచ్చిన వార్తలపై ఆయన స్పందిస్తూ... రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డిని అసలు కలవనే లేదన్నారు.
Source: ఏపీ న్యూస్ | 9 Jul 2009 | 7:13 am

స్వలింగ సంపర్కం: కేంద్రానికి సుప్రీం నోటీసులు

స్వలింగ సంపర్కంపై ఢిల్లీ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై ఒక జ్యోతిష్యుడు దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై ఈనెల 20వ తేదీలోగా వివరణ ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి నోటీసు జారీ చేసింది.
Source: జాతీయ | 9 Jul 2009 | 7:13 am

నేడు హైదరాబాద్‌కు రానున్న ఆసీస్ బృందం

ఆస్ట్రేలియాలో భారతీయులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో... గురువారం ఆస్ట్రేలియా బృందం రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్‌లో పర్యటించనుంది. ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై వరుసగా జరుగుతున్న దాడుల నేపథ్యంలో.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు భద్రతపై హామీ ఇచ్చేందుకు ఆసీస్ బృందం సమావేశంకానుంది.
Source: ఏపీ న్యూస్ | 9 Jul 2009 | 6:50 am

ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సుప్రీం నేడు విచారణ!

స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇటీవల ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటీషన్‌పై సుప్రీం కోర్టు గురువారం విచారించే అవకాశం ఉంది. ఢిల్లీకి చెందిన సురేష్ కుమార్ కుషాల్ అనే జ్యోతిష్కుడు ఈ పిటీషన్‌ను దాఖలు చేశారు.
Source: జాతీయ | 9 Jul 2009 | 6:44 am

తెరాసకు మరో షాక్: "గ్రేటర్" నేత గుడ్‌బై

మరికొన్ని రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్‌కు ఎన్నికలు జరుగనున్న తరుణంలో తెలంగాణా రాష్ట్ర సమితికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీలో ఏర్పడిన అసంతృప్తి సెగలు చల్లారక ముందే తాజాగా గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన తెరాస యువజ విభాగం అధ్యక్షుడు కెవి.వివేకానంద్ పార్టీకి రాజీనామా చేశారు.
Source: ఏపీ న్యూస్ | 9 Jul 2009 | 5:41 am

తెదేపా అధినేతతో సమావేశమైన తలసాని

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో సమైక్యాంధ్ర తిరుగుబాటు నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం భేటీ అయ్యారు. కొన్ని రోజులుగా తలసాని వ్యవహరిస్తున్న తీరుపై పార్టీ సీనియర్లతో బాబు బుధవారం చర్చించిన విషయం తెల్సిందే.
Source: ఏపీ న్యూస్ | 9 Jul 2009 | 5:36 am

మెడికల్ కాలేజీ అడ్మిషన్లపై సుప్రీంకోర్టు గరంగరం!

మెడికల్, డెంటల్ కాలేజీల అడ్మిషన్ల వ్యవహారంపై మరో మారు సుప్రీంకోర్టు మండిపడింది. మెరిట్ ప్రాతిపదికన సీట్లు భర్తీ చేయకుండా, మేనేజ్‌మెంట్ కోటా కింద భర్తీ చేయటానికి యాజమాన్యాలు ఆసక్తి చూపటంపై చీఫ్ జస్టిస్ లక్షణ్‌లతో కూడిన బెంచ్ తప్పు పట్టింది
Source: జాతీయ | 9 Jul 2009 | 4:27 am

మనుషుల విక్రయాలకు చెక్: చిదంబరం

దేశంలోని పలు రాష్ట్రాల్లో మనుషుల అక్రమ రవాణా నిరోధక కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనిపై ఖచ్చితమైన చర్యలు తీసుకునేందుకు జాతీయ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు హోంశాఖ మంత్రి చిదంబరం రాజ్యసభలో వెల్లడించారు.
Source: జాతీయ | 9 Jul 2009 | 4:06 am

"వరుడి"కి అచ్చిరాని సెకండ్ హీరోయిన్స్!

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, అనుష్క హీరోహీరోయిన్లుగా, త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రెడీ అవుతున్న 'వరుడు' (ఇంకా పేరు నిర్ణయించలేదు)లో సెకండ్‌ హీరోయిన్‌ ఎంపిక వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. "వరుడి" సరసన సెకండ్ హీరోయిన్‌గా నటించేందుకు అగ్రహీరోయిన్లు ముందుకు రానంటున్నారట. ఈ సినిమాలో రెండో కథానాయిక పాత్ర నిడివి చాలా తక్కువని, అందుకే పేరున్న హీరోయిన్లు ఇందులో నటించేందుకు తలను ఇటూ.. అటూ ఊపుతున్నారని సినీ జనం చెప్పుకుంటున్నారు. అంతేగాకుండా తాము డాన్స్‌‌లో నెంబర్‌ వన్ కావడం కోసమో, కొన్ని రొమాన్స్‌ సీన్స్‌ కోసమో పరిమితం కాలేమని హీరోయిన్స్‌ తేల్చి చెప్పేస్తున్నారట.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Jul 2009 | 6:24 pm

దీపావళికి తెరపైకి వస్తోన్న "కొమరం పులి'!

టాలీవుడ్‌ పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్‌ నటిస్తోన్న తాజా చిత్రం 'కొమరం పులి'. "ఖుషి" చిత్రాన్ని రూపొందించిన ఎస్.జె. సూర్య మళ్ళీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. క్వాలిటీపరంగానే ఈ సినిమా షూటింగ్‌‌కు ఎక్కువ కాలం పట్టిందని దర్శకుడు సూర్య వెల్లడించారు. ఇప్పటికే బిజినెస్‌పరంగా ఆశాజనకంగా ఉన్న ఈ చిత్రాన్ని, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని దీపావళికి విడుదల చేస్తున్నట్లు సూర్య తెలిపారు. తమిళంలో తానే హీరోగా "పులి" చిత్రాన్ని రూపొందిస్తున్నానని సూర్య పేర్కొన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Jul 2009 | 5:51 pm

క్లోనింగ్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న "వ్యాపారి"

తమిళంలో రూపొందిన "వ్యాపారి"ని తెలుగులో అదే పేరుతో ప్రణతి క్రియేషన్స్‌పై కూనిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనువదించారు. ఈ చిత్రాన్ని ఈనెల 11న విడుదలచేస్తున్నట్లు బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత తెలియజేశారు. మనిషిని పోలిన మనిషిని చేసే క్లోనింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో చిత్ర కథ రూపొందిందని చెప్పారు. ఖుషి దర్శకుడు ఎస్‌.జె. సూర్య ఇందులో ద్విపాత్రాభినయం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న ఓ వ్యక్తి కోటీశ్వరునిగా మారిన తర్వాత ఏం జరుగుతుందనేది ఈ చిత్రకథని నిర్మాత చెప్పారు. ఇందులో పాటలన్నీ బాగున్నాయని, మంజునాథ ఫిలిమ్స్‌ ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో విడుదలచేస్తోందని నిర్మాత తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Jul 2009 | 5:49 pm

ప్రధాని సలహా సంఘంలో అమర్త్యసేన్-మిట్టల్

కేంద్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన ఏర్పాటైన సలహా సంఘంలో ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్య సేన్‌కు చోటు కల్పించారు. అలాగే, వ్యాపార దిగ్గజం లక్ష్మీ మిట్టల్, పెప్సికో సీఈఓ ఇంద్రనూయీతో పాటు.. మరికొంత మంది మేధావులు ఉన్నారు.
Source: జాతీయ | 8 Jul 2009 | 3:08 pm

తలసానిపై చర్యకు ప్రత్యేక కమిటీ: తెదేపా

తెలుగుదేశం పార్టీలో తుఫాను సృష్టిస్తున్న మాజీ మంత్రి, సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై చర్య తీసుకునేందుకు ఆ పార్టీ సమాయత్తమైంది. ఇందుకోసం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ కె.ఎర్రన్నాయుడు నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
Source: ఏపీ న్యూస్ | 8 Jul 2009 | 3:03 pm

ప్లీజ్, బోర్ కొడుతోంది.. పుస్తకాలు ఇవ్వండి: కసబ్

ఆర్థూర్ రోడ్ జైలులో కారాగారవాసం గడుపుతున్న పాకిస్థాన్ తీవ్రవాది అజ్మల్ కసబ్ ముంబై దాడుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తికి తాజాగా మరో విజ్ఞప్తి చేశాడు. జైల్లో ఒంటరిగా ఉండటం వల్ల బోర్ కొడుతోందని, అందువల్ల చదువుకునేందుకు పుస్తకాలు సమకూర్చాలని కోరాడు.
Source: జాతీయ | 8 Jul 2009 | 2:02 pm

ఇంద్రకీలాద్రిపై నుంచి దూకి వివాహిత ఆత్మహత్య

ఇంద్రకీలాద్రిపై వెలసిన బెజవాడ కనకదుర్గ ఆలయంలో బుధవారం ఓ ఉదంతం చోటుచేసుకుంది. కనకదుర్గమ్మ గుడి వారధి నుంచి దూకి రాధ అనే ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. బుధవారం ఉదయం దుర్గమ్మ గుడికి చేరుకున్న రాధ అమ్మవారి దర్శనం చేసుకుని గుడి ఓం టర్నింగ్ వద్ద చాలాసేపు కూర్చుని అందరూ చూస్తుండగానే కిందికి దూకింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన రాధ అక్కడికక్కడే మృతి చెందింది.
Source: ఏపీ న్యూస్ | 8 Jul 2009 | 1:20 pm

నాకు అబ్బాయిలంటే మహా ఇష్టం: కరీనా

బాలీవుడ్ అందాల తార కరీనా కపూర్‌కు అబ్బాయిలంటే తెగ ఇష్టమట. అందుకే యవ్వనంలో ఉండే కుర్రకారుతో స్నేహం చేయడం కోసం ఎక్కువ ఆసక్తి చూపుతానంటోంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల కరీనా, అక్షయ్ నటించిన "కంబక్త్ ఇష్క్" అనే చిత్రంలో విడుదలైంది.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Jul 2009 | 1:08 pm

మైఖేల్ నెవర్లాండ్ ఎస్టేట్ పరుల పాలు

పాప్ రారాజు మైఖేల్ జాక్సన్ ఎంతో ఇష్టమైన నెవర్లాండ్ ఎస్టేట్ చేజారిపోయింది. జాక్సన్ ఎస్టేట్‌ను పొందేందుకు ఆయన తల్లి కేథరిన్ చేసిన ప్రయత్నం విఫలమైంది. ఈ ఆస్తిని మాజీ న్యాయవాది జాన్ బ్రాంకా, సంగీత నిర్మాత జాన్ మెక్‌క్లెయిన్ స్వాధీనం చేసుకున్నారు. లాజ్ ఏంజెలిస్ కౌంటీ సుపీరియర్ కోర్టు న్యాయమూర్తి ఈ ఎస్టేట్‌ను వీరికి తాత్కాలికంగా అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. జాక్సన్ అంత్యక్రియలు జరగకముందే ఇలా ఎస్టేట్ పరుల పాలు కావడం పట్ల కేథరిన్ తీవ్ర విచారణలో ఉన్నారని ఆమె న్యాయవాదులు తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Jul 2009 | 1:03 pm

నయనతార ఎదపై "దేవ" రహస్యం!

నయనతార- ప్రభుదేవాల మధ్య మొలకెత్తిన బంధం మరింత ముదిరి పాకానపడి పచ్చబొట్టు పొడిపించుకునేవరకూ వెళ్లిపోయింది. ప్రభుదేవా పేరులోని మొదటి అక్షరాన్ని నయనతార పచ్చబొట్టుగా పొడిపించుకుందన్న వార్తలు టాలీవుడ్‌లో సంచరిస్తున్నాయి. దీనికి బలాన్ని చేకూర్చే విధంగా ఓ సంకేతం కనబడింది. మొన్నామధ్య ఓ తెలుగు సినిమా షూటింగ్ కోసం నయన స్లీవ్‌లెస్ టాప్ వేసుకుని వచ్చిందట. షూటింగ్ గ్యాప్‌లో నయన ఓ చెట్టు కింద సేద తీరుతుండగా ఫోటోగ్రాఫర్లు ఆమెను తమ కెమేరాల్లో బంధించడానికి ఎగబడ్డారట. వాళ్ల ఆరాటాన్ని చూసిన నయన, సరేనన్నట్లు వివిధ ఫోజులను ఇచ్చిందట. అయితే ఓ ఫోజులో ఆమె ఎడమచేయి మోచేతి కిందవైపు "P" అనే అక్షరం ఇంగ్లీషులోనూ, ఆ తర్వాత అక్షరాలేవో తమిళంలోనూ కనబడ్డాయిట. ఈ స్టిల్ చూసిన టాలీవుడ్ సినీజనం "P" అంటే ప్రభుదేవా అని వాదిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Jul 2009 | 12:43 pm

జమ్ములో విద్యార్థి మృతి: చెలరేగిన ఘర్షణలు

జమ్ముకాశ్మీర్ రాష్ట్రం, శ్రీనగర్‌ బుధవారం ఘర్షణలతో అట్టుడుకి పోయింది. ఆరు రోజుల క్రితం కనిపించకుండా పోయిన ఆష్రార్‌ ముస్తాక్‌దార్‌ అనే విద్యార్థి బుధవారం శవంగా కనిపించాడు. శవాన్ని చూసిన స్థానికులు ఆగ్రహంతో రగిలి పోయారు. ఇది పోలీసుల పనేనంటూ స్థానికులు ఆందోళనకు దిగారు.
Source: జాతీయ | 8 Jul 2009 | 12:06 pm

సంకల్పాన్ని నింపే 'నింగి..నేల..నాదే..'

నటీనటులు: లీచింగ్‌ యావో, మీచింగ్‌ మావో తదితరులు,దర్శకత్వం: ఫెంగ్‌ జెంజి, మాటలు, పాటలు: వెన్నెలకంటి, నిర్మాత: చావా సుధారాణి.ఇందులో నటీనటులు, సాంకేతిక సిబ్బంది అంతా చైనావారు. చైనాకు చెందిన లీచింగ్‌ యావో అనే అమ్మాయి జీవితంలో చోటుచేసుకున్న పెను విషాదాన్ని సినిమాగా తీశారు. సినీమాలు జీవితాలపై ప్రభావం చూపుతాయనేందుకు ఈ చిత్రం ఉదాహరణ.ఇక కథలోకి వెళితే..... గాలిపటాలు తయారుచేసే కుటుంబం లీచింగ్‌ యావోది. చదువుల పుట్ట అయిన యావో ఆటపాటల్లోనూ దిట్ట. డాక్టర్‌ కావాలనేదే ఆమె సంకల్పం. ఒకసారి ఇంటికి దగ్గరలోనే గాలిపటాన్ని ఎగరేస్తుండగా ఆ పటం కరెంట్‌ ట్రాన్స్‌ఫారమ్‌కు చిక్కుకుంటుంది.దాన్ని తీసే క్రమంలో యావో పెనుప్రమాదానికి చిక్కుకుని రెండుచేతులు కోల్పోతుంది. ఆ షాక్‌తో ఆమె తల్లి మతి కోల్పోతుంది. అయితే యావో తండ్రి మొక్కవోని ధైర్యంతో ఆమెను పెంచుతాడు. ఇలా తండ్రి ప్రోత్సాహంతో యావో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణురాలైనా వికలాంగురాలైనందువల్ల మెడిసిన్‌కు చదివేందుకు అనర్హురాలిగా యూనివర్శిటీ ప్రకటిస్తుంది.ఆ తర్వాత ఈతలో ప్రథమశ్రేణి సాధించిన యావో విజయానికి కానుకగా డాక్టర్ యూనివర్శిటీ ఆహ్వానం పలుకుతుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Jul 2009 | 11:10 am

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావం వల్ల రాష్ట్రంలో పలు చోట్ల విస్తారంగాను, మరి కొన్ని చోట్ల సాధారణంగా, చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కోస్తా ఆంధ్రాలో అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా వర్షాలు కురుస్తున్నాయి.
Source: ఏపీ న్యూస్ | 8 Jul 2009 | 11:05 am

బాబు గారూ.. చర్చకు సిద్ధమా: జేపీ సవాల్

లోక్‌సత్తా పార్టీపై అవినీతి ఆరోపణలు చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ ఒక సవాల్ విసిరారు. తమ పార్టీ ఆవిర్భావం, రాజకీయం, క్రితం ఎన్నికల కోసం నిధుల సేకరణ, ఖర్చు తదితర అంశాలపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు.
Source: ఏపీ న్యూస్ | 8 Jul 2009 | 10:53 am

బాలీవుడ్ నటుడు అహుజాకు బెయిల్ నిరాకరణ

ఇంటి పని మనిషిపై అత్యాచారం చేసిన కేసులో అరెస్టయి కటకటాల్లో ఉంటున్న బాలీవుడ్ నటుడు అహుజా షైనీకి ముంబై సెషన్స్ కోర్టు బుధవారం బెయిల్ తిరస్కరించింది. ఫలితంగా మరికొన్ని రోజుల పాటు జైలులోనే మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Source: జాతీయ | 8 Jul 2009 | 10:38 am

శివయ్య లింగరూపంలో వెలసిన "పుణ్యగిరి"

చుట్టూ ఎత్తైన కొండలు, వాటి మధ్యలో జలపాతాల హోరు, కనువిందు చేసే ప్రకృతి సౌందర్యం, ఆ కొండలపై వెలసిన ఉమా కోటిలింగేశ్వర స్వామి, వెరసి భక్తుల మదిని పులకింపజేసేదే "పుణ్యగిరి" దేవాలయం. ఇక్కడ స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటే సర్వపాపాలూ వైదొలగుతాయని...
Source: వినోదం | 8 Jul 2009 | 10:14 am

గుజరాత్‌లో కల్తీసారాకు 25 మంది మృతి

గుజరాత్ రాష్ట్రంలో కల్తీసారాకు 25 మంది మృత్యువాత పడ్డారు. మరో 20 మందికిపైగా అస్వస్థతకు గురై నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా మృతి చెందిన వారిలో 11 మంది చికిత్స పొందుతూ మరణించగా, మిగిలిన వారు సారా సేవించిన కొద్ది సేపటికే ప్రాణాలు కోల్పోయారు.
Source: జాతీయ | 8 Jul 2009 | 9:50 am