"మాస్" నాయకత్వం లోపించిన భాజపా: కళ్యాణ్

భారతీయ జనతా పార్టీలో మాస్‌ను ఆకర్షించే నాయకుడు లేడని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, స్వతంత్ర ఎంపీ కళ్యాణ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఫలితంగా భాజపా గ్రామీణ మూలాల్లోకి వెళ్లలేక, తన ప్రాభవాన్ని కోల్పోతోందన్నారు.
Source: Yahoo! Telugu: News | 7 Jul 2009 | 7:55 pm

10న వస్తోన్న 'గోపి గోపిక గోదావరి'

వేణు, కమలినీ ముఖర్జీ హీరోహీరోయిన్లుగా నటించిన 'గోపి గోపిక గోదావరి'. వంశీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 10న విడుదలచేస్తున్నట్లు చిత్ర నిర్మాత వల్లూరిపల్లి రమేష్‌ అన్నారు. ఇటీవలే ఆదిత్య ద్వారా విడుదలైన ఆడియోకు శ్రోతల నుంచి మంచి స్పందన వచ్చిందనీ, ఎక్కువ భాగం ఈ పాటలను రింగ్‌టోన్స్‌గా కూడా ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Jul 2009 | 7:41 pm

ప్రతి పౌరునిపై రూ. 29800ల అప్పు...!

కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ననుసరించి దేశంలోని ప్రతి పౌరునిపై దాదాపు రూ. 1177ల విదేశీ అప్పు ఉంది. అది చిన్న పిల్లవాడైనాసరే అతనిపైకూడా ఈ అప్పు ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతోపాటు గృహావసరాల నిమిత్తం వాడేటటువంటి సబ్సిడీలను కూడా కలిపితే అప్పు ప్రతి భారతీయునిపై దాదాపు రూ. 29800లుగా ఉందని అంచనా
Source: Yahoo! Telugu: News | 7 Jul 2009 | 7:40 pm

అమ్మకాలు పెరిగిన టాటా స్టీల్

స్టీల్ ఉత్పత్తిలో అగ్రగామిగానున్న దేశీయ సంస్థ టాటా స్టీల్ సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్టీల్ అమ్మకాలు 22శాతం పెరిగి 14లక్షల టన్నులకు చేరుకుంది.
Source: Yahoo! Telugu: News | 7 Jul 2009 | 7:20 pm

త్వరలో నక్సల్ బాధిత రాష్ట్ర సీఎంల సదస్సు: పీసీ

వచ్చే నెలలో నక్సల్ బాధిత రాష్ట్ర ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించనున్నట్టు కేంద్ర హోం శాఖామంత్రి పి.చిదంబరం మంగళవారం తెలిపారు. ఈ సమావేశంలో నక్సల్ కార్యకలాపాల అణిచివేత తదితర అంశాలపై చర్చిస్తామని చిదంబరం తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 7 Jul 2009 | 6:41 pm

'ఎవరైనా ఎప్పుడైనా' సక్సెస్ మీట్

ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్‌పై వరుణ్‌సందేశ్‌, విమలారామన్‌ నటించిన 'ఎవరైనా ఎప్పుడైనా' చిత్రం సక్సెస్‌ మీట్‌ హైదరాబాదులో జరిగింది. ఈ సందర్భంగా.. చిత్ర దర్శకుడు మార్తాండ్‌ శంకర్‌ మాట్లాడుతూ, ఎవీఎం. వంటి ప్రతిష్టాత్మక బేనర్‌లో తొలి చిత్రాన్ని చేయడం సంతోషంగా ఉందన్నారు
Source: Yahoo! Telugu: Entertainment | 7 Jul 2009 | 6:34 pm

జాబ్ ఫెయిల్ ఏర్పాటు చేయనున్న జేఎన్టీయూ

జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (జేఎన్టీయూ) తొలి కెరీర్ అవేర్‌నెస్ అండ్ రిక్ర్యూట్‌మెంట్ డ్రైవ్ (సీఏఆర్డీ) కార్యక్రమానికి సన్నాహాలు చేస్తోంది. జేఎన్టీయూ కూకట్‌పల్లి ప్రాంగణంలో ఈ జాబ్ ఫెయిల్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలితో సంయుక్తంగా జేఎన్టీయూ ఈ జాబ్ ఫెయిర్ నిర్వహిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 7 Jul 2009 | 6:31 pm

తెలంగాణాకు అసలైన ద్రోహీ కేసీఆర్: రెహ్మాన్

ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు అసలుసిసలు ద్రోహి కే.చంద్రశేఖర రావేనని తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) అసమ్మతి నేత రెహ్మాన్ ఆరోపించారు. తన ఇష్టానుసారంగా వ్యవహరించి తెలంగాణా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని ఆయన దుయ్యబట్టారు.
Source: Yahoo! Telugu: News | 7 Jul 2009 | 6:25 pm

నిర్మాతకు హ్యాండ్ ఇచ్చిన చక్రి

మోహన్‌బాబు, శర్వానంద్‌ నటించిన "రాజుమహరాజు" చిత్రం ప్లాటినం డిస్క్‌ వేడుకలు సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగాయి. ఈ వేడుకకు కొత్త పెళ్లికొడుకు సంగీత దర్శకుడు చక్రి గైర్హాజరయ్యారు. ఆయన కోసమే ఏర్పాటు చేసిన ఈ వేడుకకు ఆయన డుమ్మా కొట్టడంతో తనను చాలా బాధించిందని చిత్ర నిర్మాత కుమారస్వామి ఆవేదన చెందారు. ఉదయం నుంచి వస్తానని చెప్పి ప్రోగ్రామ్‌ కూడా ఫిక్స్‌చేయించి ఇప్పుడు రాకపోవడం పట్ల తాను కలత చెందానన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Jul 2009 | 6:18 pm

90:10 ఎస్సెస్సీ అడ్మిషన్ కోటా అక్రమం

వేలాది మంది ఎస్సెస్సీయేతర బోర్డు విద్యార్థులకు ఊరట కల్పిస్తూ బాంబే హైకోర్టు సోమవారం మహారాష్ట్ర ప్రభుత్వ ఎస్సెస్సీ అడ్మిషన్ కోటా అక్రమమని తీర్పు ఇచ్చింది. మహారాష్ట్ర ప్రభుత్వం 11వ తరగతిలో చేరే ఎస్సెస్సీ బోర్డు విద్యార్థులకు 90 శాతం సీట్లు కేటాయించాలని నిర్ణయించింది. మిగిలినవారికి కేవలం పది సీట్లనే అందుబాటులో ఉంచింది.
Source: Yahoo! Telugu: News | 7 Jul 2009 | 6:18 pm

బడ్జెట్... వృద్ధులకు మంచిగుంది: ఏజ్.వెల్

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వృద్ధుల సంక్షేమం కోసం చాలా బాగుందని వృద్ధుల సంక్షేమంకోసం పని చేస్తున్న స్వచ్ఛంధసంస్థ(ఎన్‌జీఓ) ఏజ్.వెల్ ఫౌండేషన్ స్వాగతించింది
Source: Yahoo! Telugu: News | 7 Jul 2009 | 6:16 pm

ఉపశమనం: లాభాలతో ముగిసిన సెన్సెక్స్

నిన్న భారీ నష్టాలు నమోదైనా.. దాని నుండి ఉపశమనం పొందుతూ నేడు స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 127 పాయింట్లు పుంజుకుని 14,170 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 36 పాయింట్లు బలపడి 4,202 వద్ద ముగిసింది. పార్లమెంట్‌లో 2009-10 కేంద్ర బడ్జెట్ ప్రకటన అనంతరం సోమవారం 870 పాయింట్లు నష్టంతో సెన్సెక్స్ ముగిసిన విషయం తెలిసిందే.
Source: Yahoo! Telugu: News | 7 Jul 2009 | 6:14 pm

"నింగి నేల నాదే" గేమ్‌షో ప్రారంభం

"నింగి నేల నాదే" చిత్రానికి సంబంధించిన గేమ్‌షోను రాష్ట్ర విద్యాశాఖా మాత్యులు మాణిక్య వరప్రసాద్ ఆవిష్కరించారు. ఆన్‌లైన్ రియల్‌ గేమ్‌కు చెందిన దీనిని మహతీ శంకర్ రూపొందించారు. ఈ కార్యక్రమానికి ముందు ఈ చిత్రాన్ని పలువురికి ముందు ప్రదర్శించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Jul 2009 | 6:05 pm

ఫిలిప్పీన్స్‌లో బాంబు పేలుళ్లు: ఆరుగురి మృతి

ఫిలిప్పీన్స్‌లో మంగళవారం సంభవించిన జంట బాంబు పేలుళ్లలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో 40 మంది గాయపడ్డారు. అల్- ఖైదా తీవ్రవాద సంస్థతో సంబంధం ఉన్న గ్రూపులు ఈ బాంబు దాడులు చేసి ఉంటాయని అధికారిక వర్గాలు భావిస్తున్నాయి. జోలా ద్వీపంలో ఓ వ్యాపార ప్రదేశంలో తొలి బాంబు పేలుడు సంభవించింది.
Source: Yahoo! Telugu: News | 7 Jul 2009 | 6:03 pm

"రాఖీ" హీరోయిన్‌తో మళ్లీ జతకట్టనున్న ఎన్టీఆర్!

నందమూరి యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హీరోగా "కంత్రి" ఫేం మెహర్ రమేష్ దర్శకత్వంలో భారీ చిత్రం రూపుదిద్దుకోనుంది. మెగా ప్రొడ్యూసర్ సి. అశ్వనీదత్ వైజయంతీ మూవీస్ పతాకంపై ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. "రాఖీ" సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించిన అందాల తార ఇలియానా కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రముఖ నటులు ముఖ్యపాత్రల్ని పోషిస్తారు.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Jul 2009 | 4:50 pm

యూరప్‌లో "మగధీర"

"చిరు"తనయుడు, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా, సూపర్ సక్సెస్‌ఫుల్ డైరక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం "మగధీర". ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్న "మగధీర" ఆడియోకు శ్రోతల నుంచి మంచి స్పందన వచ్చిందని, సేల్స్ పరంగా రికార్డులు సృష్టిస్తోందని ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేష్ గుప్తా చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Jul 2009 | 4:13 pm

ఎక్స్‌ ఫాక్టర్‌ షోలో మడోన్నా నృత్య ప్రదర్శన?

ప్రసిద్ధ మ్యూజిక్ టాలెంట్ షో "ఎక్స్‌ఫాక్టర్"లో ఈ ఏడాది పాప్ రారాణి మడోన్నా ప్రదర్శన ఇవ్వబోతుందని సన్ వెబ్‌సైట్ వెల్లడించింది. ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేనంత భారీగా ఈ షో జరుగుతుందని ఈ వెబ్‌సైట్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సంగీత కళాకారులను ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్లు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఎక్స్ ఫాక్టర్ షో నిర్మాత సైమన్ కోవెల్ తెలిపారు. ఈ షోలో మడోన్నాతో పాటు, ప్రసిద్ధ పాప్ గాయకుడు రాబీ విలియమ్స్ కూడా పాలుపంచుకుంటానని సైమన్ వెల్లడించినట్లు సన్ వెబ్‌సైట్ తెలిపింది.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Jul 2009 | 3:41 pm

లిబ్‌డెమ్ ఎంపీతో కేటీ గ్రీన్ డేటింగ్?

లిబరల్ పార్టీ డెమొక్రాట్ ఎంపీ లింబిట్ ఓపిక్‌తో బ్రిటన్ మోడల్ కేటీ గ్రీన్ డేటింగ్ చేస్తుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మోడల్‌గా చూపరులను ఇట్టే ఆకట్టుకుంటున్న కేటీ గ్రీన్ ఈ మధ్య లింబెట్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుందని సమాచారం.గతవారం లండన్‌లోని ఓ హోటళ్లో లింబెట్‌తో కలిసి కేటీ గ్రీన్ ఏదో తింటూ మీడియా కళ్లకు చిక్కడం ఈ వాదనకు బలం చేకూరుతోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Jul 2009 | 3:36 pm

"మాస్" నాయకత్వం లోపించిన భాజపా: కళ్యాణ్

భారతీయ జనతా పార్టీలో మాస్‌ను ఆకర్షించే నాయకుడు లేడని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, స్వతంత్ర ఎంపీ కళ్యాణ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఫలితంగా భాజపా గ్రామీణ మూలాల్లోకి వెళ్లలేక, తన ప్రాభవాన్ని కోల్పోతోందన్నారు.
Source: జాతీయ | 7 Jul 2009 | 2:25 pm

త్వరలో నక్సల్ బాధిత రాష్ట్ర సీఎంల సదస్సు: పీసీ

వచ్చే నెలలో నక్సల్ బాధిత రాష్ట్ర ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించనున్నట్టు కేంద్ర హోం శాఖామంత్రి పి.చిదంబరం మంగళవారం తెలిపారు. ఈ సమావేశంలో నక్సల్ కార్యకలాపాల అణిచివేత తదితర అంశాలపై చర్చిస్తామని చిదంబరం తెలిపారు.
Source: జాతీయ | 7 Jul 2009 | 1:13 pm

"రాఖీ" హీరోయిన్‌తో మళ్లీ జతకట్టనున్న ఎన్టీఆర్!

నందమూరి యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హీరోగా "కంత్రి" ఫేం మెహర్ రమేష్ దర్శకత్వంలో భారీ చిత్రం రూపుదిద్దుకోనుంది. మెగా ప్రొడ్యూసర్ సి. అశ్వనీదత్ వైజయంతీ మూవీస్ పతాకంపై ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. "రాఖీ" సినిమాలో ఎన్టీఆర్ సరసన...
Source: వినోదం | 7 Jul 2009 | 1:06 pm

తెలంగాణాకు అసలైన ద్రోహీ కేసీఆర్: రెహ్మాన్

ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు అసలుసిసలు ద్రోహి కే.చంద్రశేఖర రావేనని తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) అసమ్మతి నేత రెహ్మాన్ ఆరోపించారు. తన ఇష్టానుసారంగా వ్యవహరించి తెలంగాణా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని ఆయన దుయ్యబట్టారు.
Source: ఏపీ న్యూస్ | 7 Jul 2009 | 12:56 pm

నా బాయ్‌ఫ్రెండ్స్ ఒత్తిడి చేస్తే రుచి చూస్తా

బాలీవుడ్ ముద్దుగుమ్మలు తమకు బాయ్‌ఫ్రెండ్స్ లేరంటే ఆశ్చర్యమేస్తుంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన తర్వాత మగస్నేహితుల ఆసరాను కథానాయికలు తప్పనిసరిగా కోరుకుంటారు. ప్రియాంకా చోప్రా కూడా తను రిలాక్స్.. అంటే షూటింగులు లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు తన ఇంటికి మగస్నేహితులను ఆహ్వానిస్తుందట. ఆ రోజు వాళ్లకు తనే స్వయంగా అన్నీ వడ్డించి వారికి కడుపారా భోజనం పెడుతుందట. ఏ బాయ్‌ఫ్రెండ్‌కు ఎలాంటి పదార్థాలు కావాలో ముందే ఫోనులో తెలుసుకుని వాటన్నిటినీ తెప్పిస్తుందట. ఆ తినుబండారాలను వాళ్లు తింటుంటే ప్రియాంక మాత్రం లొట్టలేసుకుంటూ వారివంక చూస్తూ కూచుంటుందట.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Jul 2009 | 11:58 am

నెవర్లాండ్ ఎస్టేట్‌లో జాక్సన్ ఆత్మ సంచారం?

పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ కోరికలు ఇంకా నెరవేరలేదో? ఏమో? అతని ఆత్మ.. ఆయనకు ఎంతో ఇష్టమైన నెవర్లాండ్ ఎస్టేట్ చుట్టూ తిరుగుతుందని వార్తలు గుప్పుమన్నాయి. నెవర్లాండ్‌లోని ఆయన స్వగృహం గోడలపై మైఖేల్ ఆత్మనీడ కనబడుతుందని ఆయన వీరాభిమానులే చెబుతున్నారని "సన్‌ ఆన్‌లైన్" పత్రిక తెలిపింది. సీఎన్ఎన్‌లో ప్రసారమైన "ఇన్‌సైడ్ నెవర్లాండ్" అనే కార్యక్రమంలో అక్కడి కారిడార్ గుండా ఓ నీడను నడుస్తున్నట్టుగా ఉన్న దృశ్యాలు కనబడ్డాయని ఆ పత్రిక ప్రచురించింది. ఈ కార్యక్రమంలో భాగంగా జాక్సన్ సోదరుడు జెర్మెయిన్‌తో ఇంటర్వ్యూ జరుగుతుండగానే, ఈ ఆత్మకు సంబంధించిన దృశ్యాలు కనబడినట్లు సమాచారం. మైఖేల్ ఆత్మ నీడలు సంచరించే క్లిప్పింగ్‌లు యూ ట్యూబ్‌లో దర్శనమిచ్చాయని సన్ ఆన్‌లైన్ తెలిపింది.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Jul 2009 | 11:40 am

శివసేన చీఫ్‌ బాల్‌థాక్రేకు యాంజియోగ్రఫీ

శివసేన అధ్యక్షుడు బాల్‌థాక్రేకు మంగళవారం ఉదయం యాంజియోగ్రఫీ వైద్య పరీక్ష చేశారు. ముంబై శివారు ప్రాంతమైన బాంద్రాలోని లీలావతి ఆస్పత్రిలో సోమవారం ఆయన చేరిన విషయం తెల్సిందే. ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందులు తలెత్తడం వల్ల ఆయన ఆస్పత్రిలో చేరారు.
Source: జాతీయ | 7 Jul 2009 | 11:11 am

కాంగ్రెస్ ఎంపీలకు ముఖం చాటేసిన మమత

రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలకు మరో చేదు అనుభవం ఎదురైంది. సాక్షాత్ కేంద్ర రైల్వే మంత్రి మమతా బెనర్జీ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. మిమ్మలను కలుసుకునే సమయం లేదంటూ ముఖంపైనే తేల్చి చెప్పారు. దీంతో మన ఎంపీలు ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.
Source: ఏపీ న్యూస్ | 7 Jul 2009 | 11:09 am

మాంద్యానికి అభివృద్ధి చెందిన దేశాలే కారణం

పెట్టుబడుల ప్రవాహాన్ని, ఎగుమతులను ప్రభావితం చేస్తున్న అంతర్జాతీయ ఆర్థిక మాంద్యానికి అభివృద్ధి చెందిన దేశాలే కారణమని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. పెట్టుబడులు, ఎగుమతులు మందగించడానికి ఆర్థిక మాంద్యం కారణమైన సంగతి తెలిసిందే.
Source: జాతీయ | 7 Jul 2009 | 10:32 am

కిరణ్ కుటుంబానికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా

దక్షిణాఫ్రికాలోని జోహెన్స్ బర్గ్‌లో దుండగుల కాల్పుల్లో మృతి చెందిన వరంగల్ జిల్లా ఆరేపల్లి వాసి బుద్ధె కిరణ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ప్రభుత్వ ఖర్చులతోనే కిరణ్ మృతదేహాన్ని భారత్‌కు రప్పిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. బాధిత కుటుంబానికి రూ. 5లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.
Source: ఏపీ న్యూస్ | 7 Jul 2009 | 9:58 am

మమతతో భేటీకానున్న కాంగ్రెస్ ఎంపీలు

రాష్ట్ర ప్రాజెక్టులపై వివక్ష చూపిన కేంద్ర రైల్వే మంత్రి మమతా బెనర్జీతో మన రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు మంగళవారం భేటీ కానున్నారు. ఇందుకోసం ఎంపీల ఫోరం కన్వీనర్‌గా పొన్నం ప్రభాకర్‌ను ఎంపీలందరు కలిసి ఎన్నుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 7 Jul 2009 | 8:33 am

సీఆర్‌పీఎఫ్‌ బలగాలను తొలగించలేం: ఒమర్

రాష్ట్ర భద్రతలో నిమగ్నమై ఉన్న సీఆర్‌పీఎఫ్ బలగాలను రాత్రికిరాత్రి ఉపసంహరించలేమని జమ్ముకాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఒకవేళ అలాంటి ప్రతిపాదన చేసే ముందు.. రాష్ట్ర పోలీసుల బలగాల సంఖ్యను, శక్తిసామర్థ్యాలను పరిశీలించి, తదనుగుణంగా శిక్షణ ఇవ్వాల్సి వుందన్నారు.
Source: జాతీయ | 7 Jul 2009 | 8:32 am

పార్టీ సీనియర్లతో బాబు అత్యవసర భేటీ

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలతో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అత్యవసరంగా సమావేశమయ్యారు. పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అతని అనుచరులు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డితో రహస్యంగా సమావేశమైనట్టు వార్తలు వచ్చాయి.
Source: ఏపీ న్యూస్ | 7 Jul 2009 | 7:17 am

ముంబై నగరం: నీటి సరఫరాలో 30 శాతం కోత

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో మంగళవారం నుంచినీటి కోతను అమలు చేస్తున్నారు. ప్రస్తుతం సరఫరా చేస్తున్న నీటిలో 30 శాత మేరకు కోత విధిస్తున్నట్టు బ్రిహాన్‌ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ప్రకటించింది.
Source: జాతీయ | 7 Jul 2009 | 6:45 am

కాంగ్రెస్ గూటికి తలసాని: ఛైర్మన్ గిరి తాయిలం!

హైదరాబాద్‌లో తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా ఉన్న పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ గూటికి చేరుకోవడం ఖాయమని తెలుస్తోంది.
Source: ఏపీ న్యూస్ | 7 Jul 2009 | 6:09 am

జీ-8 సదస్సుకు హాజరుకానున్న ప్రధాని మన్మోహన్

ప్రధాని మన్మోహన్ సింగ్ మంగళవారం మధ్యాహ్నం ఇటలీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఇటలీలోని లాఅక్విలాలో జరిగే జీ-8 సదస్సులో ఆయన పాల్గొంటారు. మొత్తం ఐదు రోజుల పాటు సాగే ఈ విదేశీ పర్యటనలో ఆయన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Source: జాతీయ | 7 Jul 2009 | 5:54 am

పేదలకు ఉపయోగపడని బడ్జెట్: జయప్రకాష్

కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రవేశపెట్టిన 2009-10 సాధారణ బడ్జెట్ సామాన్య ప్రజానీకానికి ఏమాత్రం ఉపయోగపడేలా లేదని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ అభిప్రాయపడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 7 Jul 2009 | 5:36 am

మరోమారు కుటుంబ సభ్యులతో వైఎస్ విహారం

ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి విహార యాత్రలపై విహార యాత్రలు చేపడుతున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇజ్రాయేల్‌కు వెళ్లి వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకుని వచ్చారు. తాజాగా మరోమారు గోవా విహారానికి సిద్ధమయ్యారు.
Source: ఏపీ న్యూస్ | 7 Jul 2009 | 5:17 am

పెళ్లయ్యాక ఎలాగూ మొదలవుతాయ్ కదా..!

ప్రియురాలు: "మన పెళ్లయ్యాక నీ బాధలన్నింటినీ పంచుకుంటాను డియర్" ప్రియుడు:
Source: వినోదం | 7 Jul 2009 | 4:53 am

పెళ్లి కాబోతుంది

"బాస్ నాకు పెళ్లి కాబోతోంది. దయచేసి లోన్ ఏర్పాటుచేయండి. దాంతో పాటు నా జీతం కూడా పెంచండి" అడిగాడు..
Source: వినోదం | 7 Jul 2009 | 4:49 am

మహా ప్రభుత్వ ఎస్సెస్సీ అడ్మిషన్ కోటా అక్రమం

వేలాది మంది ఎస్సెస్సీయేతర బోర్డు విద్యార్థులకు ఊరట కల్పిస్తూ బాంబే హైకోర్టు సోమవారం మహారాష్ట్ర ప్రభుత్వ ఎస్సెస్సీ అడ్మిషన్ కోటా అక్రమమని తీర్పు ఇచ్చింది. మహారాష్ట్ర ప్రభుత్వం 11వ తరగతిలో చేరే ఎస్సెస్సీ బోర్డు విద్యార్థులకు 90 శాతం సీట్లు కేటాయించాలని నిర్ణయించింది. మిగిలినవారికి కేవలం పది సీట్లనే అందుబాటులో ఉంచింది.
Source: జాతీయ | 7 Jul 2009 | 4:06 am

పార్టీలో మాట్లాడేవాళ్లు ఎక్కువయ్యారు: అద్వానీ

లోక్‌సభ ఎన్నికల పరాజయం అనంతరం పార్టీ సిద్ధాంతాలు, వ్యూహాలను విమర్శిస్తున్న సహచరులపై బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ బహిరంగంగా నిప్పులు చెరిగారు. పార్టీలో మాట్లాడేవాళ్లు ఎక్కువయ్యారని అద్వానీ విమర్శించారు. పార్టీలో మీడియాతో మాట్లాడే ప్రతినిధులు ఎక్కువయ్యారని పేర్కొన్నారు.
Source: జాతీయ | 7 Jul 2009 | 3:32 am

కంధమాల్ అల్లర్ల నిందితుడి ప్రమాణస్వీకారం

ఒరిస్సా అసెంబ్లీకి ఎన్నికయి ఏడు వారాల తరువాత కంధమాల్ అల్లర్ల నిందితుడు, బీజేపీ నేత మనోజ్ ప్రధాన్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మెల్యేగా ఆయన ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు. గత ఏడాది ఆగస్టులో కంధమాల్ జిల్లాలో జరిగిన అల్లర్లలో ప్రధాన నిందితుడిగా మనోజ్ ప్రధాన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
Source: జాతీయ | 6 Jul 2009 | 2:49 pm