|
"సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్"గా వస్తోన్న "ఇంకోసారి""రాజా" కథానాయకుడిగా బే మూవీస్ పతాకంపై సుమన్ పాతూరి దర్శకుడిగా కళ్యాణ్ పల్ల నిర్మిస్తున్న చిత్రం 'ఇంకోసారి'. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను తెలియజేసేందుకు సారథి స్టూడియోస్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో రాజా మాట్లాడుతూ, ఈ సినిమా టైటిల్ చాలా బాగుంది. స్నేహితుల మధ్య ఉండే అనుబంధాలను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నామన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 6 Jul 2009 | 6:11 pm రష్యా పర్యటనకు విచ్చేసిన బరాక్ ఒబామాఅమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సోమవారం రష్యా పర్యటనకు విచ్చేశారు. ఇరుదేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను పటిష్టపరుచుకునే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సమావేసంలో రష్యా నేతలతో బరాక్ ఒబామా భేటీ అవతారు. అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తరువాత బరాక్ ఒబామా రష్యాలో పర్యటించడం ఇదే తొలిసారి.Source: Yahoo! Telugu: News | 6 Jul 2009 | 6:03 pm బడ్జెట్‌పై ప్రతిపక్ష నేతల పెదవి విరుపుకేంద్ర విత్తమంత్రి ప్రణబ్ ముఖర్జీ సోమవారం పార్లమెంట్‌కు సమర్పించిన సాధారణ బడ్జెట్‌పై దేశ ప్రతిపక్ష పార్టీలు పెదవి విరిచాయి. కేంద్ర ప్రభుత్వానికి భేషరతు మద్దతు ప్రకటించిన ఎస్పీ, ఆర్జేడీ, జేడీఎస్ వంటి పార్టీలు కూడా ప్రతిపక్ష పార్టీలతో గొంతు కలిపాయి.Source: Yahoo! Telugu: News | 6 Jul 2009 | 6:02 pm 10న వస్తోన్న సుమన్, శ్రీహరిల "సామ్రాజ్యం"ప్రేమతో ఏమైనా సాధించుకోవచ్చుననే పాయింట్‌తో "సామ్రాజ్యం" చిత్రం రూపుదిద్దుకుంది. శ్రీహరి హీరోగా నటించిన ఈ చిత్రానికి ముత్యాల ఆంజనేయులు నిర్మాత. వీరుద్వైత్ దర్శకుడు. సుమన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాలో మాళవిక, ప్రియాంక కొఠారి, సమీక్షలు కథానాయికలుగా నటించారు. ఇప్పటికే తొలికాపీ సిద్ధమైన ఈ చిత్రాన్ని ఈ నెల 10న విడుదలచేస్తున్నట్లు నిర్మాత వెల్లడించారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇదని, శ్రీహరి ఫ్యాక్షన్ నాయకుడిగా కన్పిస్తారని నిర్మాత అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 6 Jul 2009 | 5:54 pm తొమ్మిది శాతం వృద్ధి రేటే లక్ష్యం: ప్రణబ్అధిక వృద్ధి రేటు సాధించేందుకు సోమవారం ప్రకటించిన సాధారణ బడ్జెట్‌లో తాను పెద్ద సాహసం చేశానని ఆర్థిక మంత్రి పి.చిదంబరం పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి దేశ ఆర్థికాభివృద్ధి రేటు తొమ్మిది శాతానికి చేరుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. అధిక ఆర్థిక లోటును ఉంచడం ద్వారా తాను పెద్ద సాహసం చేశానని ప్రణబ్ వ్యాఖ్యానించారు.Source: Yahoo! Telugu: News | 6 Jul 2009 | 5:49 pm ముగ్గురు హీరోయిన్లతో "వ్యాపారి" రొమాన్స్ఖుషి, కొమరంపులి దర్శకుడు ఎస్.జె. సూర్యా ద్విపాత్రాభినయం చేసిన "వ్యాపారి" చిత్రం ఈ నెల 11వ తేదీన తెరపైకి రానుంది. సెక్సీతారలు తమన్నా, నమిత, మాళవికలు "వ్యాపారి" చిత్రంలో అందాలను ఆరబోశారని ఇండస్ట్రీలో టాక్. సెన్సార్ ప్రశంసలు పొందిన ఈ చిత్రాన్ని ఈనెల 11వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలిపారు. శక్తి చిదంబరం దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో నాజర్ సైంటిస్ట్‌గా నటించారు. ఎస్.జె. సూర్య నటన, నమిత, మాళవిక, తమన్నాలతో ఆయన చేసే రొమాన్స్ మాస్‌ను ఆకట్టుకుంటుందని నిర్మాత చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 6 Jul 2009 | 5:40 pm రూ.10 లక్షల కోట్లు దాటిన ప్రణబ్ బడ్జెట్దేశ సాధారణ బడ్జెట్ తొలిసారి రూ.10లక్షల కోట్లు దాటి రికార్డు సృష్టించింది. మొత్తం బడ్జెట్ వ్యయం ఈసారి రూ.10,20,838 కోట్లు. ఈ బడ్జెట్‌లో రాయితీలకు, రక్షణ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. బడ్జెట్‌లో సబ్సిడీల భారమే రూ. లక్ష కోట్లు ఉంది. ఇదిలా ఉంటే ప్రణాళిక వ్యయం రూ.3,25,149 కోట్లు, ప్రణాళికేతర వ్యయం రూ.6,95,690 కోట్ల వద్ద ఉంది.Source: Yahoo! Telugu: News | 6 Jul 2009 | 5:36 pm బడ్జెట్ డే: భారీ నష్టాలతో ముగిసిన సెన్సెక్స్బడ్జెట్ డే.. స్టాక్ మార్కెట్‌కు బ్లాక్ డేగా ముగిసింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 870 పాయింట్లు కోల్పోయి 14,043 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 259 పాయింట్లు నష్టపోయి 4,166 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 5.83 శాతం, నిఫ్టీ 5.84 శాతం మేరకు క్షీణించాయి.Source: Yahoo! Telugu: News | 6 Jul 2009 | 5:29 pm మరింత చౌకగా ఎలక్ట్రానిక్ వస్తువులుఎల్సీడీ ప్యానెల్‌లపై కస్టమ్స్ పన్నును తగ్గిస్తున్నట్లు బడ్జెట్‌లో భాగంగా ప్రభుత్వం చేసిన ప్రకటనతో ఫ్లాట్ స్క్రీన్ టెలివిజన్‌లు మరియు కంప్యూటర్ మోనిటర్లు మరింత చౌకగా మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. అంతకుముందు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 10 శాతం పన్ను ఉండేది. ప్రభుత్వ ప్రకటన అనంతరం ఇప్పుడది 5 శాతానికి చేరుకుంది.Source: Yahoo! Telugu: News | 6 Jul 2009 | 5:00 pm ఆర్థిక సమతుల్యతకు ప్రతీక బడ్జెట్: ప్రధానిదేశ ఆర్థిక సమతుల్యతకు ఈ సాధారణ బడ్జెట్ నిదర్శనమని ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా రూపొందించిన బడ్జెట్ అని ఆయన వ్యాఖ్యానించారు.Source: Yahoo! Telugu: News | 6 Jul 2009 | 4:52 pm రైతు సంక్షేమం ఊసెత్తని ప్రణబ్ బడ్జెట్: ఎర్రన్నకేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ సోమవారం పార్లమెంట్‌లో సమర్పించిన సాధారణ బడ్జెట్‌లో రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ కె.ఎర్రన్నాయుడు ఆరోపించారు. ఈ తాజా బడ్జెట్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఆయన జోస్యం చెప్పారు.Source: Yahoo! Telugu: News | 6 Jul 2009 | 4:31 pm భారత్‌ను ముప్పుగానే పరిగణిస్తున్న పాకిస్థాన్పాకిస్థాన్కు నిజమైన ముప్పు భారత్ కాదని, తాలిబాన్ తీవ్రవాదులని ఆ దేశ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ చెబుతున్నారు. అయితే పాకిస్థాన్ ఆర్మీ మాత్రం ఇందుకు భిన్నమైన అభిప్రాయం కలిగివుంది. పాకిస్థాన్ ఆర్మీ ఇప్పటికీ భారత్‌ను ముప్పుగానే పరిగణిస్తుందని అమెరికా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.Source: Yahoo! Telugu: News | 6 Jul 2009 | 4:30 pm సయీద్ విడుదలపై ప్రభుత్వ పిటిషన్ల కొట్టివేతముంబయి ఉగ్రవాద దాడుల ప్రధాన నిందితుడు, జామాదుత్ దవా తీవ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ మొహమ్మద్ సయీద్‌ను విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన రెండు పిటిషన్లను పాకిస్థాన్ సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. సాంకేతిక కారణాలతో పాక్ సుప్రీంకోర్టు సయీద్ విడుదలపై దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది.Source: Yahoo! Telugu: News | 6 Jul 2009 | 4:03 pm ఇక లాభం లేదు... బికినీలో నటించాల్సిందేబాలీవుడ్లో హోమ్లీ పాత్రలను పోషిస్తూ వచ్చిన అమృతారావు ఇక నుంచి పూర్తిస్థాయిలో ఎక్స్‌పోజింగ్ చేస్తానని బాలీవుడ్ దర్శక నిర్మాతలకు చెపుతోందట. కెరీర్ ప్రారంభంలో తొడలు కనిపించే దుస్తులు వేసుకోవాలని కొందరు దర్శకులు పెట్టిన షరతులను ఆమె తోసిపుచ్చి అసలు అటువంటి "A" సినిమాల్లో నటించనని చెప్పిందట. దాంతో చాలామంది బాలీవుడ్ దర్శకులు అమృతను అలా వదిలేశారట. పరిస్థితిని గమనించిన అమృతారావు తనే చొరవ చూపి దర్శకనిర్మాతల వెంటబడుతున్నా సినిమా ఛాన్సులు ఇవ్వట్లేదట. అందుకేనేమో ఆ మధ్య టాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చింది. మహేష్‌తో అతిథిలో నటించింది. ఏమైందో తెలియదు కానీ మళ్లీ ఈ వంక చూడలేదు. చివరికి ఎలాగైనా బాలీవుడ్‌లోనే నిలదొక్కుకోవాలనే తలంపుతో పొదుపైన బికినీల్లో సైతం దర్శనమిస్తానని చెపుతోందట. అమృతలో మార్పు వచ్చింది సరే... మరి నిర్మాతలలో కూడా రావాలిగా..?Source: Yahoo! Telugu: Entertainment | 6 Jul 2009 | 2:47 pm రెఫెల్లి నగ్నదృశ్యాలు ఆన్‌లైన్‌లో హల్ ఛల్!లినార్డొ డి కాప్రియో గర్ల్‌ఫ్రెండ్, సూపర్ మోడల్ బార్ రెఫెల్లి నగ్న దృశ్యాలు ఆన్‌లైన్‌లో షికార్లు చేస్తున్నాయి. 24 ఏళ్ల ఈ ఇజ్రాయేల్ మోడల్ రెఫెల్లి తన శరీర అందాలను వీడియో ప్రమోషన్ నిమిత్తం ప్రదర్శించిందని డైలీ స్టార్ పేర్కొంది. ఈ ఫోటోలు ఎలా ఉన్నాయంటే..? సోఫాలో కూర్చొన్న రెఫెల్లీ.. తన శరీర అందాలను ఒక పలుచటి వస్త్రంతో దాచుకున్నట్టు డైలీ స్టార్ పత్రిక తెలిపింది. కేవలం వీడియో దృశ్యాలతో మాత్రమే ఈ క్లిప్పింగ్స్ ఆన్‌లైన్‌లో దర్శనమిస్తున్నట్టు డైలీ స్టార్ పేర్కొంది.Source: Yahoo! Telugu: Entertainment | 6 Jul 2009 | 1:43 pm బిల్లీజీన్ ట్యూన్స్‌కు స్టెప్పులేసిన మడోన్నా!పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్‌కు, ప్రముఖ పాప్ గాయని మడోన్నా ఘనంగా నివాళులర్పించారు. లండన్‌లో శనివారం రాత్రి నుంచి మడోన్నా "స్టిక్కీ అండ్ స్వీట్" ప్రపంచ సంగీత యాత్రను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన షో సగంలో ఉండగా వెనక తెరమీద జాక్సన్ ఫోటోలు ప్రదర్శిస్తూ తన నృత్యాన్ని ఆపేసింది. ఆ తర్వాతి నుంచి అచ్చం జాక్సన్ లాగానే నలుపు, తెలుపు దుస్తులు ధరించి, చేతికి తెల్లటి గ్లోవ్స్, తలపై వెడల్పాటి టోపీ పెట్టుకుని బిల్లీజీన్ ట్యూన్స్‌కు జాక్సన్ వేసే మూన్‌వాక్ స్టెప్పులు వేసింది.Source: Yahoo! Telugu: Entertainment | 6 Jul 2009 | 1:28 pm రైతు సంక్షేమం ఊసెత్తని ప్రణబ్ బడ్జెట్: ఎర్రన్నకేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ సోమవారం పార్లమెంట్‌లో సమర్పించిన సాధారణ బడ్జెట్‌లో రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ కె.ఎర్రన్నాయుడు ఆరోపించారు. ఈ తాజా బడ్జెట్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఆయన జోస్యం చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 6 Jul 2009 | 12:51 pm బడ్జెట్‌పై ప్రతిపక్ష నేతల పెదవి విరుపుకేంద్ర విత్తమంత్రి ప్రణబ్ ముఖర్జీ సోమవారం పార్లమెంట్‌కు సమర్పించిన సాధారణ బడ్జెట్‌పై దేశ ప్రతిపక్ష పార్టీలు పెదవి విరిచాయి. కేంద్ర ప్రభుత్వానికి భేషరతు మద్దతు ప్రకటించిన ఎస్పీ, ఆర్జేడీ, జేడీఎస్ వంటి పార్టీలు కూడా ప్రతిపక్ష పార్టీలతో గొంతు కలిపాయి.Source: జాతీయ | 6 Jul 2009 | 12:34 pm మిస్ యూనివర్స్ "సుస్మితాసేన్" పర్సనల్ టచ్హిందీ, తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన అందాల తార సుస్మితా సేన్. 1994లో భారతదేశానికి మొట్టమొదటి యూనివర్స్ కిరీటాన్ని అందించి ఘనత సాధించిన సుస్మితాసేన్ మాతృభాష బెంగాలీ. తండ్రి షుబీర్ సేన్. భారత వాయుసేనలో కమాండర్‌గా పనిచేశారు. తల్లి శుభ్రాసేన్ ఫ్యాషన్ డిజైనర్. "రక్షకుడు" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సుస్మితాసేన్ హైదరాబాదులో జన్మించింది. ఢిల్లీలో ఆమె విద్యాభ్యాసం కొనసాగింది. 1994వ సంవత్సరంలో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనే సమయంలో సుస్మితాసేన్‌కు 18 సంవత్సరాలు. సుస్మితాసేన్ పుట్టినరోజు: 19-11-1975,ఎత్తు: 5 అడుగుల 11 అంగుళాలు,నచ్చే ఆహారం: చైనీస్ ఫుడ్, నచ్చే రంగు: నలుపు, హ్యాబీస్: సంగీతం వినడం, కవిత్వం రాయడం, మర్చిపోలేనిది: మొదటిసారి రెనీ (సుస్మితా కూతురు) అమ్మా అని పిలిచినపుడు కలిగిన సంతోషం.Source: Yahoo! Telugu: Entertainment | 6 Jul 2009 | 11:37 am ఆర్థిక సమతుల్యతకు ప్రతీక బడ్జెట్: ప్రధానిదేశ ఆర్థిక సమతుల్యతకు ఈ సాధారణ బడ్జెట్ నిదర్శనమని ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా రూపొందించిన బడ్జెట్ అని ఆయన వ్యాఖ్యానించారు.Source: జాతీయ | 6 Jul 2009 | 11:24 am రామోజీ ఫిలింసిటిలో "బన్ని" కొత్త చిత్రం షెడ్యూల్స్టైలిష్స్టార్ అల్లు అర్జున్ హీరోగా, యూనివర్శల్ మీడియా పతాకంపై సూపర్ హిట్ చిత్రాల నిర్మాత డి.వి.వి. దానయ్య నిర్మిస్తోన్న తాజా చిత్రం నాలుగో షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రానికి డైనమిక్ డైరక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 6 Jul 2009 | 11:11 am పంజాబ్‌లో మరో రెండు స్వైన్ ఫ్లూ కేసులు గుర్తింపుపంజాబ్ రాష్ట్రంలో మరో రెండు స్వైన్ ఫ్లూ కేసులు వెలుగుచూశాయి. ఇటీవల థాయ్‌లాండ్ నుంచి వచ్చిన ఓ దంపతుల జంటకు ఈ వ్యాధి సోకినట్టు వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో వెల్లడైంది. పంజాబ్‌కు చెందిన కుల్వంత్ సింగ్, ఆయన భార్య అనితా కల్రాలు ఇటీవల థాయ్‌లాండ్ నుంచి స్వదేశానికి వచ్చారు.Source: జాతీయ | 6 Jul 2009 | 10:13 am బాబుతో పొత్తు వల్లే ఓటర్లు బుద్ధి చెప్పారు: హరీష్తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోవడం వల్లే ఓటర్లు తమకు తగిన బుద్ధి చెప్పారని తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) సీనియర్ నేత హరీష్ రావు అభిప్రాయపడ్డారు. ఎన్నికలు ముగిసిన తర్వాత దీనిపై చర్చిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండబోదన్నారు.Source: ఏపీ న్యూస్ | 6 Jul 2009 | 9:38 am ఆస్పత్రిలో చేరిన శివసేన అధినేత బాల్థాక్రేశివసేన అధినేత బాల్‌థాక్రే అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను ఆస్పత్రిలో చేర్చారు. బంద్రా శివారు ప్రాంతంలో ఉన్న ఆస్పత్రిలో ఆయనను సోమావారం చేరినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 82 సంవత్సరాల బాల్‌థాక్రే రోజువారీ వైద్య పరీక్షల నిమిత్తమే లీలావతి ఆస్పత్రిలో చేరారని శివసేన పార్టీ వర్గాలు వెల్లడించాయి.Source: జాతీయ | 6 Jul 2009 | 8:05 am దోడా జిల్లాలో లష్కర్ దగ్గరి సన్నిహితుడి అరెస్టుజమ్ముకాశ్మీర్ రాష్ట్రంలోని దోడా జిల్లాలో లష్కర్ తోయిబా దగ్గరి సన్నిహితుడిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. ఈయన ప్రజా పంపిణీ స్టోరు (రేషన్ షాపు)లో పని చేస్తుండగా గుర్తించి సోమవారం అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.Source: జాతీయ | 6 Jul 2009 | 7:41 am నేటి నుంచి బంద్రా-వొర్లీ మార్గంలో టోల్ ఫీజులుదేశ వాణిజ్య రాజధాని ముంబైలోని బంద్రా-వొర్లీ ప్రాంతాలను కలుపుతూ కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన సముద్ర మార్గంలో నేటి నుంచి టోల్ ఫీజులను వసూలు చేస్తున్నారు. రహదారిని ఒకసారి ఉపయోగించుకునేందుకు రూ.50 చొప్పున టోల్ ఫీజును నిర్ణయించారు.Source: జాతీయ | 6 Jul 2009 | 6:58 am అధికారం లేక మతిభ్రమించిన బాబు: పీఆర్పీఅధికారానికి దూరమైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు మతిభ్రమించడంతో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని ప్రజారాజ్యం పార్టీ ఆరోపించింది. ఆయన్ను తక్షణం మెంటల్ ఆస్పత్రికి తరలించి తగిన వైద్య చికిత్స చేయించాలని ఆ పార్టీ నేతలు సి.రామచంద్రయ్య, వాసిరెడ్డి పద్మ, ఉమా మహేశ్వర రావులు ఆరోపించారు.Source: ఏపీ న్యూస్ | 6 Jul 2009 | 6:05 am తెదేపాతో తలపడిన లోక్‌సత్తా కార్యకర్తలులోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ కాంగ్రెస్‌కు అమ్ముడు పోయారంటూ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు లోక్‌సత్తా కార్యకర్తల్లో ఆగ్రహం తెప్పించాయి. దీంతో ఆదివారం లోక్‌సత్తా ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దగ్గర నిర్వహించిన మౌన ప్రదర్శన రసాభాసగా మారింది.Source: ఏపీ న్యూస్ | 6 Jul 2009 | 5:30 am పెట్రో వడ్డనపై దేశ వ్యాప్త ఆందోళన: భాజపాఇటీవల కేంద్రం పెంచిన పెట్రోల్, డీజల్ ధరలపై దేశ వ్యాప్త ఆందోళన చేపట్టనున్నట్టు ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రకాష్ జావ్‌దేకర్ తెలిపారు.Source: జాతీయ | 6 Jul 2009 | 5:15 am వరుణ్ భద్రతపై ప్రధానికి మేనక గాంధీ లేఖతన కుమారుడు, ఫిలిభిత్ లోక్‌సభ సభ్యుడు వరుణ్ గాంధీకి భద్రత కల్పించాలని కోరుతూ వరుణ్ తల్లి, భాజపా ఎంపీ మేనకా గాంధీ.. ప్రధాని మన్మోహన్ సింగ్‌కు లేఖ రాశారు. ఈ లేఖలో ఆమె ఘాటుగానే స్పందించారు. వరుణ్‌కు భద్రత కల్పించే విషయంపై కేంద్ర హోం శాఖ ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.Source: జాతీయ | 6 Jul 2009 | 4:00 am ఈవీఎంల పనితీరుపై అనుమానాలొద్దు: ఈసీఈవీఎంల పనితీరుపై రాజకీయ పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలపై ఎలక్షన్ కమిషన్ స్పందించింది. ఈవీఎంల పనితీరుపై ఉన్న అన్ని రకాల అనుమానాలను నివృత్తి చేస్తామని స్పష్టం చేసింది. ఈవీఎంలో టాంపరింగ్ జరిగిందన్న అద్వానీ చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని ఎన్నికల సంఘం పేర్కొంది.Source: జాతీయ | 6 Jul 2009 | 3:35 am విపక్షాల ఐక్యతను దెబ్బతీసేందుకు బాబు కుట్రవిపక్షాల ఐక్యతను దెబ్బతీసేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుట్ర పన్నుతున్నారని ప్రజారాజ్యం పార్టీ ఆరోపించింది. ప్రరాపా కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయిందని బాబు చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు.Source: ఏపీ న్యూస్ | 5 Jul 2009 | 12:16 pm గిరిజనులకు 12లక్షల ఎకరాల భూమి: వైఎస్అటవీ హక్కుల చట్టం ద్వారా రాష్ట్రంలోని 3లక్షల మంది గిరిజనులకు 12లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేసేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి అన్నారు. రాబోయే రెండేళ్లలో ఐటీడీఎ పరిధిలోని అన్ని ప్రాంతాలకు మంచినీటి సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు సీఎం చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 5 Jul 2009 | 11:46 am అమెరికాలో ముగిసిన తానా సంబరాలుఉత్తర అమెరికా తెలుగు సంఘాలు తానా, నాట్స్ వేడుకలు మూడురోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి. 17వ తానా ద్వైవార్షిక మహాసభలకు వేదికగా నిలిచిన చికాగోలోని రోజ్‌మాంట్ కన్వెన్షన్ సెంటర్ మూడురోజుల పాటు తెలుగువారితో నిండిపోయింది.Source: ఏపీ న్యూస్ | 5 Jul 2009 | 11:20 am
|