లాభాలతో ముగిసిన సెన్సెక్స్: 255 పాయింట్ల వృద్ధి

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) శుక్రవారం లాభాల్లో నడిచింది. ఆసియా, అమెరికా మార్కెట్‌‍ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడంతో 105 పాయింట్ల పతనమై 14,553 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం కాసేపటికే 14,500 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. అనంతరం బీఎస్ఈ సూచి క్రమక్రమంగా పుంజుకుంది.కేంద్ర బడ్జెట్ నుంచి ఆశాజనక సంకేతాలు రావడంతో ఒకానొక దశలో కనిష్ట స్థాయి నుంచి 446 పాయింట్లు వృద్ధి చెంది 14,946 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఆర్థిక సర్వే, రైల్వే బడ్జెట్ ఆశాజనక వాతావరణం సృష్టించడంతో మార్కెట్ ముగింపు వరకు లాభాల్లోనే కొనసాగింది. ముగింపు సమయానికి సెన్సెక్స్ 255 పాయింట్లు వృద్ధి చెంది 14,913 వద్ద స్థిరపడింది. ఇదిలా ఉంటే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (నిఫ్టీ) కూడా ఈ రోజు లాభాల్లోనే నడిచింది. నిఫ్టీ ముగింపు సమయానికి 75 పాయింట్లు పుంజుకొని 4424 వద్ద నిలిచింది.
Source: Yahoo! Telugu: News | 3 Jul 2009 | 5:41 pm

స్వలింగ సంపర్కం ఓ మానసిక రుగ్మత: రాందేవ్

స్వలింగ సంపర్కమనేది ఓ రకమైన మానసిక రుగ్మత అని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా అన్నారు. మానసికమైన రుగ్మతతో బాధపడుతున్నవారు ఇలాంటిబారిన పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Source: Yahoo! Telugu: News | 3 Jul 2009 | 5:36 pm

ప్రియమణి- తరుణ్ పెళ్లి చేసుకుంటారేమో...?!

ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్‌లోనూ అవకాశాలు అంతంతమాత్రంగా ఉండటంతో ప్రియమణి పెళ్లి చేసుకుని సెటిల్ అవుదామనే నిర్ణయానికి వచ్చినట్లు కోలీవుడ్ సినీజనం అనుకుంటున్నారు. తన సహజ నటనతో జాతీయ అవార్డు కైవసం చేసుకున్న ప్రియమణికి ఆ తర్వాత కోలీవుడ్‌లో అన్నీ అటువంటి "మురికి" పాత్రలే వచ్చాయట. అదేమంటే మీకు జాతీయ అవార్డు తెచ్చిన పాత్ర అటువంటిదే కదా అని ఆమెను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారట కోలీవుడ్ సినీజనం. దీంతో విసుగెత్తిన ప్రియమణి టాలీవుడ్‌లో తన జాతకాన్ని పరీక్షించుకునేందుకు బయలుదేరి వచ్చింది. అందాల ఆరబోతకు గేట్లను బార్లా తెరిచింది. బాలకృష్ణతో కలిసి "మిత్రుడు" చిత్రంలో బికినీ వేసుకుని నటించింది. కానీ 'లక్' కలిసి రాలేదు. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద బోర్లా పడింది.
Source: Yahoo! Telugu: Entertainment | 3 Jul 2009 | 4:55 pm

నీ మీద నాకు.. ఇదయ్యో.. అంటోన్న ఓ మగాడు!!

మోహన్ పేరుకు తగ్గట్టే అందంగా, హుందాగానూ ఉంటాడు. తన పనితాను చేసుకుపోయేతత్వంకల బుద్దిమంతుడు. అతడినికాని, అతడి పనినికాని ఏ ఒక్కరుకూడా వేలెత్తి చూపేంతవరకు పెట్టుకోడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కాని రాత్రి అయ్యేసరికి అతనిలోని ఓ అపరిచితుడు నిద్ర లేస్తాడు. అతనిలో ఎవరికీ తెలియని ఇంకో మనిషి దాగున్నాడు. అలాగని మద్యం సేవించడమో లేదా ధూమపానం చేయడమో లేదా గుట్కాలు తీసుకుంటాడునుకుంటే పొరపాటే. అతనికి అలాంటి మంచి అలవాట్లు లేవు.
Source: Yahoo! Telugu: News | 3 Jul 2009 | 4:51 pm

రైల్వేబడ్జెట్‌పై రాష్ట్ర ఎంపీల అసంతృప్తి

రైల్వేశాఖ మంత్రి మమత బెనర్జీ శుక్రవారం ప్రవేశపెట్టిన కేంద్ర రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరగలేదని రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. రైల్వే శాఖ మంత్రి మమత బెనర్జీ బడ్జెట్ ప్రసంగం పూర్తి చేసిన వెంటనే ఎంపీలు ఆమె వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. ఈసారి కూడా రాష్ట్రానికి రైల్వే బడ్జెట్‌లో అన్యాయం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Source: Yahoo! Telugu: News | 3 Jul 2009 | 4:48 pm

దక్షిణాసియాకు 6.6 బిలియన డాలర్ల సాయం

దక్షిణాసియా ప్రాంతానికి ప్రపంచబ్యాంకు జూన్ 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 6.6 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించింది. ఇందులో భారత్‌కే ఎక్కువ ఆర్థిక సాయం అందింది. మొత్తం నిధుల్లో భారత్‌కు 2,242 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందింది.
Source: Yahoo! Telugu: News | 3 Jul 2009 | 4:09 pm

5వందల కోట్లను సమకూర్చుకోనున్న ఎస్ బ్యాంక్

ఎస్ బ్యాంక్ ఈ ఏడాది సెప్టెంబర్ నెలలోపు 5 వందల కోట్ల రూపాయలను సమకూర్చేందుకు ప్రణాళికలను రూపొందించిందని ఆ బ్యాంక్ ప్రధాన కార్యనిర్వహణాధికారి మరియు మేనేజింగ్ డైరెక్టర్ రాణా కపూర్ తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 3 Jul 2009 | 4:01 pm

జులై 18న అంతర్జాతీయ మండేలా దినోత్సవం

దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా పుట్టినరోజును (జులై 18) అంతర్జాతీయ మండేలా దినోత్సవంగా ప్రకటించాలని ప్రపంచదేశాలకు ఆ దేశ ప్రభుత్వం పిలుపునిచ్చింది. నెల్సన్ మండేలా స్వాంతంత్ర్య సంగ్రామానికి నేతృత్వం వహించిన సంగతి తెలిసిందే.
Source: Yahoo! Telugu: News | 3 Jul 2009 | 3:54 pm

కంధమాల్ అల్లర్లకు మతమార్పిడిలే కారణం

ఒరిస్సాలోని సమస్యాత్మక కంధమాల్ జిల్లాలో గత ఏడాది చెలరేగిన అల్లర్లకు మతమార్పిడిలే ప్రధాన కారణమని ఆనాటి హింసాకాండపై దర్యాప్తు జరిపుతున్న ఓ న్యాయ విచారణ కమిషన్ వెల్లడించింది. కంధమాల్ అల్లర్లకు మతమార్పిడిలు ప్రధాన కారణమయ్యాయని ఈ కమిషన్ పేర్కొంది.
Source: Yahoo! Telugu: News | 3 Jul 2009 | 3:40 pm

పాక్‌లో సయీద్ విడుదలపై పిటిషన్ దాఖలు

ముంబయి ఉగ్రవాద దాడుల నిందితుడు హఫీజ్ మొహమ్మద్ సయీద్‌ను విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ పాకిస్థాన్ సుప్రీంకోర్టులో పంజాబ్ ప్రావీన్స్ ప్రభుత్వం శుక్రవారం పిటిషన్ దాఖలు చేసింది. గత ఏడాది ముంబయి ఉగ్రవాద దాడుల ప్రధాన నిందితుల్లో ఒకడైన సయీద్ నిషేధిత జాముదుత్ దవా తీవ్రవాద సంస్థ అధినేతగా వ్యవహరిస్తున్నాడు.
Source: Yahoo! Telugu: News | 3 Jul 2009 | 3:31 pm

భారీ లాభాల దిశగా స్టాక్ మార్కెట్

బాంబే స్టాక్ మార్కెట్ భారీ లాభాల దిశగా పయనిస్తోంది. బడ్జెట్ ప్రభావంతో శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి లాభాలను నమోదు చేసుకుంటున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో భారీగా వృద్ధి చెందింది. దీంతో సెన్సెక్స్ 247 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరుకుని, 14908 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 72 పాయింట్ల మేర లాభపడి, 4421 పాయింట్ల వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 3 Jul 2009 | 3:28 pm

స్వలింగ సంపర్కం ఓ మానసిక రుగ్మత: రాందేవ్

స్వలింగ సంపర్కమనేది ఓ రకమైన మానసిక రుగ్మత అని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా అన్నారు. మానసికమైన రుగ్మతతో బాధపడుతున్నవారు ఇలాంటిబారిన పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Source: జాతీయ | 3 Jul 2009 | 12:08 pm

రైల్వేబడ్జెట్‌పై రాష్ట్ర ఎంపీల అసంతృప్తి

రైల్వేశాఖ మంత్రి మమత బెనర్జీ శుక్రవారం ప్రవేశపెట్టిన కేంద్ర రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరగలేదని రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. రైల్వే శాఖ మంత్రి మమత బెనర్జీ బడ్జెట్ ప్రసంగం పూర్తి చేసిన వెంటనే ఎంపీలు ఆమె వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. ఈసారి కూడా రాష్ట్రానికి రైల్వే బడ్జెట్‌లో అన్యాయం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 3 Jul 2009 | 11:19 am

ప్రియాంకకు కొమ్ములు మొలిచాయ్.. నెట్టేయండి

ప్రియాంకా చోప్రా ఉన్నట్లుండి తన పారితోషికాన్ని ఆకాశమే హద్దన్నట్లు ఏకంగా రూ. 5 కోట్లకు పెంచిందట. దాంతో చిర్రెత్తిన నిర్మాతలు ఆమెకు సినీ అవకాశాలను ఇవ్వడం మానేద్దామని మూకుమ్మడిగా అనుకున్నారట. ఏదో ఒక్క సినిమా హిట్టయితే చాలు, తలపై కొమ్ములు మొలుస్తాయని బహిరంగంగానే తిట్ల దండకం ఎత్తుకుంటున్నారట. ప్రియాంక తన రేటును ఇంత భారీగా పెంచేయడానికి గల కారణం మాత్రం యాష్ రాజ్ ఫిలిమ్ అని చెపుతున్నారు బాలీవుడ్ సినీజనం. ఈ సినిమాకు ప్రియాంక మూడు కోట్ల రూపాయలను పారితోషికంగా అందుకుందట. ఇదే ఊపుతో తనతో సినిమాలు తీసేందుకు వచ్చిన నిర్మాతల వద్ద తలా ఒక రేటు చెప్పి బెంబేలెత్తించిందట. అయితే ఈ అంకెలన్నీ రూ.5 కోట్లకు పైనే ఉన్నాయని బాలీవుడ్ భోగట్టా.
Source: Yahoo! Telugu: Entertainment | 3 Jul 2009 | 11:11 am

కంధమాల్ అల్లర్లకు మతమార్పిడిలే కారణం

ఒరిస్సాలోని సమస్యాత్మక కంధమాల్ జిల్లాలో గత ఏడాది చెలరేగిన అల్లర్లకు మతమార్పిడిలే ప్రధాన కారణమని ఆనాటి హింసాకాండపై దర్యాప్తు జరిపుతున్న ఓ న్యాయ విచారణ కమిషన్ వెల్లడించింది. కంధమాల్ అల్లర్లకు మతమార్పిడిలు ప్రధాన కారణమయ్యాయని ఈ కమిషన్ పేర్కొంది.
Source: జాతీయ | 3 Jul 2009 | 10:10 am

తొలి స్వైన్ ఫ్లూ మరణం: కేరళలో నమోదు

దేశంలో తొలి స్వైన్ ఫ్లూ మరణం కేరళ రాష్ట్రంలో నమోదయినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఇప్పటివరకు స్వైన్ ఫ్లూ దేశంలో ప్రమాదకర స్థాయిలో లేదని, మిగిలిన దేశాలతో పోలిస్తే, ఇక్కడ స్వైన్ ఫ్లూ తీవ్రత అసలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్న సంగతి తెలిసిందే.
Source: జాతీయ | 3 Jul 2009 | 9:48 am

దేశంలో 116కు చేరుకున్న స్వైన్ ఫ్లూ కేసులు

దేశంలో ఇన్ఫ్లూయెంజా-ఏ ఎన్1హెచ్1. అంటే స్వైన్ ఫ్లూ అన్నమాట. గురువారం రాత్రికి మరో నలుగురు స్వైన్ ఫ్లూ బాధితులను కనుగొన్నారు. దీంతో దేశంలో స్వైన్ ఫ్లూ వ్యాధితో బాధపడుతున్న బాధితుల సంఖ్య 116కు చేరుకుంది. వీరిలో 80మంది రోగులను ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ చేసినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
Source: జాతీయ | 3 Jul 2009 | 9:47 am

సికింద్రాబాద్, తిరుపతిలకు ప్రపంచస్థాయి

రైల్వే శాఖ మంత్రి మమత బెనర్జీ శుక్రవారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో భాగంగా, సికింద్రాబాద్, తిరుపతి రైల్వేస్టేషన్లు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. అంతర్జాతీయ స్థాయి ద్వారా తిరుపతి, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లకు పలు అత్యాధునిక సదుపాయాలు చేకూరుతాయి.
Source: ఏపీ న్యూస్ | 3 Jul 2009 | 9:31 am

మమతా బెనర్జీ రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు

కేంద్ర రైల్వే శాఖ మంత్రి శుక్రవారం పార్లమెంట్‌లో రైల్వే బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. అందరూ ఊహించినట్లుగానే ఈసారి బడ్జెట్‌ను కూడా ప్రజాకర్షక నిర్ణయాలకు పెద్దపీట వేశారు. ఇది మరో ప్రజల బడ్జెట్ అని, ప్రజాస్వామ్య బడ్జెట్ అని బడ్జెట్ ప్రసంగం ప్రారంభిస్తున్న సందర్భంగా మమతా బెనర్జీ ప్రకటించారు.
Source: జాతీయ | 3 Jul 2009 | 8:23 am

వసతి గృహాలను తనిఖీ చేయండి: వైఎస్సార్

సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో వసతుల కల్పనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి శుక్రవారం సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేసం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ మాట్లాడుతూ.. జిల్లాలో పర్యటించే మంత్రులు విధిగా సంక్షేమ వసతి గృహాలను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు.
Source: ఏపీ న్యూస్ | 3 Jul 2009 | 8:10 am

దేశానికి దేశీయ రైల్వేమంత్రి ఎప్పుడు లభిస్తారో...?

మన భారతదేశానికి దేశీయ రైల్వే మంత్రి ఎప్పుడు లభిస్తారో...? ఇది ప్రతిసారి తలెత్తుతున్న ప్రశ్న. గత 13 సంవత్సరాలుగా చూస్తే బీహార్ రాష్ట్రంనుంచి లోక్‌సభకు ఎన్నికైనవారే రైల్వే మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. ప్రధానంగా పెద్ద పెద్ద ప్రణాళికలన్నీకూడా బీహార్ ప్రాంతానికే తరలిపోయాయి.
Source: జాతీయ | 3 Jul 2009 | 7:44 am

కొవ్వూరు ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల దీక్ష భగ్నం

కొవ్వూరు ఎమ్మెల్యే టీవీ రామారావుపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ఆయన కుటుంబ సభ్యుల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. రామారావు కుటుంబసభ్యుల ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని వైద్యులు నిర్ధారించడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారి దీక్షను భగ్నం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 3 Jul 2009 | 7:21 am

ఇది ప్రజల బడ్జెట్: లోక్‌సభలో మమతా బెనర్జీ

కేంద్ర రైల్వే శాఖ మంత్రి మమతా బెనర్జీ శుక్రవారం లోక్‌సభలో రైల్వే బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. లోక్‌సభలో మధ్యాహ్నం 12.00 గంటలకు ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. రైల్వేల్లో సౌకర్యాలు, స్టేషన్లలో జనతా భోజనాల సరఫరాను మెరుగుపరిచేందుకు తాజా బడ్జెట్‌లో చర్యలు ఉంటాయనే ఊహాగానాల నేపథ్యంలో మమతా బెనర్జీ ఈసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు.
Source: జాతీయ | 3 Jul 2009 | 7:19 am

ప్రియాంకకు కొమ్ములు మొలిచాయ్.. నెట్టేయండి

ప్రియాంకా చోప్రా ఉన్నట్లుండి తన పారితోషికాన్ని ఆకాశమే హద్దన్నట్లు ఏకంగా రూ. 5 కోట్లకు పెంచిందట. దాంతో చిర్రెత్తిన నిర్మాతలు ఆమెకు సినీ అవకాశాలను ఇవ్వడం మానేద్దామని మూకుమ్మడిగా అనుకున్నారట. ఏదో ఒక్క సినిమా హిట్టయితే చాలు, తలపై కొమ్ములు మొలుస్తాయని...
Source: వినోదం | 3 Jul 2009 | 5:42 am

భాష్యం పాఠశాల విద్యార్థి కిడ్నాప్

గాజువాకలోని భాష్యం పాఠశాలలో చదువుతున్న పవన్ అనే విద్యార్థి కిడ్నాప్‌కు గురయ్యాడు. స్కూల్‌కు వెళ్లిన తన కుమారుడు ఇంటికి తిరిగి రాకపోవడంతో పవన్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Source: ఏపీ న్యూస్ | 3 Jul 2009 | 5:38 am

నా ఫోటో ఇచ్చి...

"మా అమ్మ తప్పిపోయి నెల దాటిపోయింది. టీవీలో ప్రకటిద్దామంటే కనీసం ఒక్క ఫోటో కూడా లేదు...
Source: వినోదం | 3 Jul 2009 | 5:29 am

అణకువ కలిగిన అమ్మాయి

"మా వాడికి మంచి అణకువ కలిగిన అమ్మాయి కావాలి". "ఎదురు మాట్లాడకూడదు. వంచిన తల ఎత్తకూడదు" చెప్పాడు జగన్ రావు.
Source: వినోదం | 3 Jul 2009 | 5:21 am

జడ్జిల ఆస్తులు బయటపెట్టాల్సిన అవసరం లేదు

న్యాయమూర్తుల ఆస్తులను ప్రజాసమక్షంలో పెట్టాల్సిన అవసరం లేదని భారత ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్ అభిప్రాయపడ్డారు. ఆయన గురువారం మాట్లాడుతూ.. న్యాయమూర్తులను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని, ఇది కక్షిదారులకు తప్పుడు సంకేతాలు పంపించినట్లవుతుందని పేర్కొన్నారు.
Source: జాతీయ | 3 Jul 2009 | 4:15 am

నేడు లోక్‌సభలో మమత రైల్వే బడ్జెట్

కేంద్ర రైల్వే శాఖ మంత్రి మమతా బెనర్జీ శుక్రవారం లోక్‌సభలో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. తాజా బడ్జెట్‌లో మమత ప్రయాణికులపై వడ్డింపుల జోలికి వెళ్లే అవకాశం లేదని తెలుస్తోంది. రైల్వేస్టేషన్లలో సరఫరా చేసే జనతా భోజనాల సంఖ్యను 30 వేల నుంచి లక్షకు పెంచనున్నారు.
Source: జాతీయ | 3 Jul 2009 | 3:43 am

మీ డోర్ కొట్టి ఇంటికి వస్తా.. చూసుకోండి: శ్రియ

లక్స్‌ సోప్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న శ్రియ 'తలుపు కొట్టి ఇంటికి వస్తారు' పోటీని గురువారం ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మాధురీదీక్షిత్‌, ఐశ్వర్యారాయ్ వంటి అభిమాన నటీమణులు అంబాసిడర్‌గా ఉన్న సోప్‌కు తాను ఉండడం అదృష్టంగా భావిస్తున్నానంది. లక్స్ సబ్బులో కొన్ని సౌందర్య కారకాలున్నాయనీ వెల్లడించింది. కాగా మూడునెలలు నిర్వహించే 'తలుపు కొట్టి ఇంటికి వస్తారు' కాంటెస్ట్‌లో లక్స్‌సోప్‌ కొన్నవారు అందులో రేపర్‌ను ఓపెన్‌చేసి అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చని.. అప్పుడే వారి డోర్‌ కొట్టి ఇంటికి వెళతానని అంటోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Jul 2009 | 7:13 pm

మణిరత్నం శిష్యులూ.. షాలిని చెల్లెలూ... ఓయ్ ఓయ్!!

ప్రముఖ నిర్మాత దానయ్య నిర్మించిన చిత్రం "ఓయ్" రేపు టాలీవుడ్ తెరను తాకనుంది. దానయ్య ఎన్నో సినిమాలు తీశారు. అయితే ఈ ఓయ్ చిత్రానికి చాలా స్పెషాలిటీలు ఉన్నాయ్. ఈ చిత్రంలో హీరోగా నటించిన సిద్దార్థ, దర్శకుడుగా పనిచేసిన ఆనంద్ రంగ ఇద్దరూ మణిరత్నం శిష్యులట. బాంబే చిత్ర నిర్మాణ సమయంలో ఇద్దరూ మణిరత్నం వద్ద సహ దర్శకులుగా పనిచేశారట. ఆనంద్ దర్శకత్వ శాఖలో అలానే కొనసాగగా సిద్దార్థ మాత్రం నటనవైపు మొగ్గు చూపాడు. తనకంటూ ఓ ఇమేజ్‌ను సృష్టించుకున్నాడు. వీళ్లద్దరి సంగతి అలావుంచితే 'ఓయ్'తో హీరోయిన్‌గా షాలిని చెల్లెలు బేబీ షామిలి పరిచయమవుతోంది. అక్క షాలిని వద్ద సక్సెస్ సూత్రాలేమిటో తెలుసుకుని షాలిని రంగంలో దిగినట్లు సమచారం. మొత్తమ్మీద మణిరత్నం శిష్యులూ... షాలిని చెల్లెలూ.. ఆపై దానయ్య నిర్మాత. అన్నీ కలిసి టాలీవుడ్ ప్రేక్షకులను "ఓయ్.. ఓయ్" అనిపిస్తుందో లేదో చూడాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే..
Source: Yahoo! Telugu: Entertainment | 2 Jul 2009 | 2:18 pm

ర్యాంగింగ్‌ను ఎట్టిపరిస్థితుల్లో సహించం: వైఎస్సార్

ర్యాంగింగ్‌ను ఎట్టిపరిస్థితుల్లో సహించబోమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌ నగరంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో సీనియర్ విద్యార్థులు ఓ విద్యార్థిపై ర్యాంగింగ్‌కు పాల్పడిన వ్యవహారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ కళాశాలల్లో వెలుగుచూస్తున్న ర్యాంగింగ్ ఘటనలపై వైఎస్సార్ మండిపడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 2 Jul 2009 | 1:10 pm

వాళ్లు నిర్మాతల పాలిట బాబులు కాదు బాంబులు

నిర్మాతగా ఎలాంటి చిత్రాలు నిర్మించాలని వచ్చారు? సినిమా అనేది పూర్తి కమర్షియల్‌ అన్నమాట వాస్తవం. అయితే దానితోపాటు మానవతా విలువలకు కూడా ప్రాధాన్యతనిచ్చి సినిమా తీయాలన్నది నా ఉద్దేశ్యం. సినిమా ద్వారా మంచి చెప్పకపోయినా ఫర్వాలేదుకానీ చెడు మాత్రం చెప్పకూడదు. అన్ని వర్గాలు మెచ్చే కుటుంబ కథా చిత్రాలు తీయాలనేది నా అభిమతం. కథ నుండి క్యారెక్టర్‌ పుడితే ఆ కథకు అందం వస్తుంది. అలాంటి ప్రయోగమే వంశం, రాజు మహరాజు చిత్రాలు.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Jul 2009 | 12:31 pm

వెబ్‌దునియా తెలుగు సర్వే 2009లో పాల్గొనండి

వెబ్‌దునియా తెలుగు వీక్షకులకు నమస్సులు.... వెబ్‌ప్రపంచంలో 9 భారతీయ భాషలలో సేవలందిస్తున్న వెబ్‌దునియా ఓ సర్వేను చేపట్టింది. ఈ సర్వేలో మీరు వెబ్‌దునియా తెలుగును ఎప్పట్నుంచి వీక్షిస్తున్నారూ...? వెబ్‌దునియా తెలుగుతోపాటు మరే ఇతర వెబ్‌సైట్లను వీక్షిస్తున్నారూ..? ఇద్యాది అంశాలను తెలుసుకునేందుకు ప్రశ్నలను ఇవ్వడం జరిగింది.
Source: జాతీయ | 2 Jul 2009 | 12:22 pm

ఎన్నారైలూ.. తెలుగు సినిమా తీస్తే అంతే సంగతులు

తెలుగు చలనచిత్రరంగంలో రెగ్యులర్‌గా సినిమాలు తీసే నిర్మాతల శాతం తగ్గిపోయింది. దేవీవరప్రసాద్‌, కె.ఎస్‌.రామారావు. కె.ఎల్‌.నారాయణ, అశోక్ కుమార్‌... ఇలా చాలామంది సినిమా నిర్మాణానికి దూరంగా ఉంటున్నారు. వారంతా నిర్మాణవ్యయం పెరిగిపోవడం ప్రధానకారణంగా చెబుతారు.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Jul 2009 | 11:34 am

పశ్చిమగోదావరిలో రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి

పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ఇద్దరిని పొట్టనబెట్టుకుంది. జంగారెడ్డి గూడెం మండలం వేగవరం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 30 మంది గాయాల పాలయ్యారు. వేగవరం వద్ద వస్తోన్న ఆర్టీసీ బస్సును వేగంగా వచ్చిన లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.
Source: ఏపీ న్యూస్ | 2 Jul 2009 | 11:25 am

భూటాసింగ్‌ను కలిసిన టీడీపీ బృందం

కొవ్వూరు ఎమ్మెల్యే రామారావుపై రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసిన కేసుల వ్యవహారంపై తెలుగుదేశం మరో అడుగు ముందుకేసింది. ఒక దళిత ఎమ్మెల్యేపై రాష్ట్ర ప్రభుత్వం వేధింపులను ఆపాలంటూ మైసూరా రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ బృందం న్యూఢిల్లీలో జాతీయ ఎస్సీ-ఎస్టీ కమిషన్ ఛైర్మన్ భూటాసింగ్‌‌ను కలిసింది. దళిత ఎమ్మెల్యేపై వేధింపులను ఆపాలంటూ మైసూరారెడ్డి బృందం భూటాసింగ్‌కు ఓ వినతి పత్రం కూడా సమర్పించింది.
Source: ఏపీ న్యూస్ | 2 Jul 2009 | 11:23 am