Loading...






మీ డోర్ కొట్టి ఇంటికి వస్తా.. చూసుకోండి: శ్రియ

లక్స్‌ సోప్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న శ్రియ 'తలుపు కొట్టి ఇంటికి వస్తారు' పోటీని గురువారం ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మాధురీదీక్షిత్‌, ఐశ్వర్యారాయ్ వంటి అభిమాన నటీమణులు అంబాసిడర్‌గా ఉన్న సోప్‌కు తాను ఉండడం అదృష్టంగా భావిస్తున్నానంది. లక్స్ సబ్బులో కొన్ని సౌందర్య కారకాలున్నాయనీ వెల్లడించింది. కాగా మూడునెలలు నిర్వహించే 'తలుపు కొట్టి ఇంటికి వస్తారు' కాంటెస్ట్‌లో లక్స్‌సోప్‌ కొన్నవారు అందులో రేపర్‌ను ఓపెన్‌చేసి అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చని.. అప్పుడే వారి డోర్‌ కొట్టి ఇంటికి వెళతానని అంటోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Jul 2009 | 7:13 pm

ర్యాంగింగ్‌ను ఎట్టిపరిస్థితుల్లో సహించం: వైఎస్సార్

ర్యాంగింగ్‌ను ఎట్టిపరిస్థితుల్లో సహించబోమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌ నగరంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో సీనియర్ విద్యార్థులు ఓ విద్యార్థిపై ర్యాంగింగ్‌కు పాల్పడిన వ్యవహారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ కళాశాలల్లో వెలుగుచూస్తున్న ర్యాంగింగ్ ఘటనలపై వైఎస్సార్ మండిపడ్డారు.
Source: Yahoo! Telugu: News | 2 Jul 2009 | 6:40 pm

29.2 శాతం తగ్గిన ఎగుమతులు

మే నెలలో ఎగుమతులు 29.2 శాతం మేర తగ్గాయి. వరుసగా ఎనిమిది నెలల నుంచి ఎగుమతులు తగ్గుముఖం పడుతున్నాయి. గత సంవత్సరం యూరప్‌, అమెరికా దేశాలకు ఎగుమతులు సుమారు 15.55 బిలియన్‌ డాలర్ల మేర క్షీణించాయి.
Source: Yahoo! Telugu: News | 2 Jul 2009 | 5:56 pm

వెబ్‌దునియా తెలుగు సర్వే 2009లో పాల్గొనండి

వెబ్‌దునియా తెలుగు వీక్షకులకు నమస్సులు.... వెబ్‌ప్రపంచంలో 9 భారతీయ భాషలలో సేవలందిస్తున్న వెబ్‌దునియా ఓ సర్వేను చేపట్టింది. ఈ సర్వేలో మీరు వెబ్‌దునియా తెలుగును ఎప్పట్నుంచి వీక్షిస్తున్నారూ...? వెబ్‌దునియా తెలుగుతోపాటు మరే ఇతర వెబ్‌సైట్లను వీక్షిస్తున్నారూ..? ఇద్యాది అంశాలను తెలుసుకునేందుకు ప్రశ్నలను ఇవ్వడం జరిగింది.
Source: Yahoo! Telugu: News | 2 Jul 2009 | 5:51 pm

రైల్వే బడ్జెట్ ప్రభావం: స్వల్పలాభాలతో ముగిసిన సెన్సెక్స్

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా, శుక్రవారం కేంద్ర ప్రభుత్వం రైల్వే బడ్జెట్ ప్రకటించనుంది. దీంతో బాంబే స్టాక్ మార్కెట్ గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి స్వల్పలాభాలను ఆర్జించింది. గురువారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఒడిదుడుకులను ఎదుర్కొన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, ట్రేడింగ్ ముగిసే సమయానికి 13 పాయింట్ల మేర లాభపడి 14,658 పాయింట్ల మార్కు వద్ద నిలిచింది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 7 పాయింట్ల స్వల లాభంతో 4,348 పాయింట్ల వద్ద ముగిసింది.
Source: Yahoo! Telugu: News | 2 Jul 2009 | 5:47 pm

మాంద్యంతో మలమల మాడిపోతున్నారు

యుక్తవయసులోనున్న అమ్మాయో, అబ్బాయో చిత్రంగా ప్రవర్తించడం మొదలు పెట్టారంటే వారు ప్రేమలో పడ్డట్టే. మరి ఉద్యోగం చేస్తున్న వారు అప్పటి వరకు ప్రవర్తించిన దానికి పూర్తి భిన్నంగా, చిత్రంగా ప్రవర్తించడం, డబ్బులను మంచినీళ్లలా ఖర్చు చేసేవారు కాస్తా పొదుపరులుగా మారిపోవడంతో ఖర్చు అంటేనే భయపడటం, నిద్రలేని రాత్రులు గడపడం, కలవరించడం వంటివి చేస్తున్నారంటే అది ఆర్థిక మాంద్యం ప్రభావమేనన్నమాట!
Source: Yahoo! Telugu: News | 2 Jul 2009 | 4:58 pm

షైనీ అహుజా జ్యూడీషియల్ కస్టడీ పొడిగింపు

పనిమనిషిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటుడు షైనీ అహుజా జ్యూడీషియల్ కస్టడీని జులై 16 వరకు పొడిగించారు. అంథేరీ కోర్టు రేప్ కేసుపై తదుపరి దర్యాప్తు జరిపేందుకు వీలుగా అహుజా జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది
Source: Yahoo! Telugu: News | 2 Jul 2009 | 4:56 pm

పశ్చిమగోదావరిలో రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి

పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ఇద్దరిని పొట్టనబెట్టుకుంది. జంగారెడ్డి గూడెం మండలం వేగవరం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 30 మంది గాయాల పాలయ్యారు. వేగవరం వద్ద వస్తోన్న ఆర్టీసీ బస్సును వేగంగా వచ్చిన లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.
Source: Yahoo! Telugu: News | 2 Jul 2009 | 4:54 pm

బ్రహ్మపుత్రా వరదలు: అసోంలో రెడ్‌అలర్ట్

ఎగువ అసోం జిల్లాలను బ్రహ్మపుత్రా నది వరదలు వణికిస్తున్నాయి. లఖీంపూర్ జిల్లాలో అధికారిక యంత్రాంగం రెడ్అలర్ట్ ప్రకటించింది. బ్రహ్మపుత్రా నది పొంగిపొర్లుతుండటంతో నీరు నిల్వచేసేందుకు ఏర్పాటు చేసిన పెద్దకట్ట తెగిపోయింది. అంతేకాకుండా అనేక గ్రామాలు జలమయ్యాయి.
Source: Yahoo! Telugu: News | 2 Jul 2009 | 4:47 pm

ఉత్తర వజీరిస్థాన్‌లో సైనిక చర్య ఉండదు: పాక్

ఉత్తర వజీరిస్థాన్‌లో తాలిబాన్ తీవ్రవాదులపై సైనిక చర్య చేపట్టబోమని పాకిస్థాన్ ఆర్మీ తెలిపింది. స్థానిక గిరిజనులతో ప్రభుత్వం కుదుర్చుకున్న శాంతి ఒప్పందాన్ని తాము గౌరవిస్తామని తెలిపింది. ఈ ప్రాంతంలో భద్రతా దళాలపై ఇటీవల కాలంలో దాడులు పెరిగిపోయాయి. అయినప్పటికీ ఉత్తర వజీరిస్థాన్‌లో సైనిక ఆపరేషన్ చేపట్టబోమని పాక్ ఆర్మీ స్పష్టం చేసింది.
Source: Yahoo! Telugu: News | 2 Jul 2009 | 4:28 pm

3నెలల్లో 6 లక్షలమంది ఉద్యోగాలు ఫట్

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా ప్రపంచంలోని చాలా సంస్థలు తమ ఉద్యోగులను ఇంటికి పంపింది. అదే తరహాలో భారతదేశంలోకూడా పలు కంపెనీలు దాదాపు ఐదు లక్షల మంది ఉద్యోగులను ఇండ్లకు పంపాయి.
Source: Yahoo! Telugu: News | 2 Jul 2009 | 4:27 pm

మణిరత్నం శిష్యులూ.. షాలిని చెల్లెలూ... ఓయ్ ఓయ్!!

ప్రముఖ నిర్మాత దానయ్య నిర్మించిన చిత్రం "ఓయ్" రేపు టాలీవుడ్ తెరను తాకనుంది. దానయ్య ఎన్నో సినిమాలు తీశారు. అయితే ఈ ఓయ్ చిత్రానికి చాలా స్పెషాలిటీలు ఉన్నాయ్. ఈ చిత్రంలో హీరోగా నటించిన సిద్దార్థ, దర్శకుడుగా పనిచేసిన ఆనంద్ రంగ ఇద్దరూ మణిరత్నం శిష్యులట. బాంబే చిత్ర నిర్మాణ సమయంలో ఇద్దరూ మణిరత్నం వద్ద సహ దర్శకులుగా పనిచేశారట. ఆనంద్ దర్శకత్వ శాఖలో అలానే కొనసాగగా సిద్దార్థ మాత్రం నటనవైపు మొగ్గు చూపాడు. తనకంటూ ఓ ఇమేజ్‌ను సృష్టించుకున్నాడు. వీళ్లద్దరి సంగతి అలావుంచితే 'ఓయ్'తో హీరోయిన్‌గా షాలిని చెల్లెలు బేబీ షామిలి పరిచయమవుతోంది. అక్క షాలిని వద్ద సక్సెస్ సూత్రాలేమిటో తెలుసుకుని షాలిని రంగంలో దిగినట్లు సమచారం. మొత్తమ్మీద మణిరత్నం శిష్యులూ... షాలిని చెల్లెలూ.. ఆపై దానయ్య నిర్మాత. అన్నీ కలిసి టాలీవుడ్ ప్రేక్షకులను "ఓయ్.. ఓయ్" అనిపిస్తుందో లేదో చూడాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే..
Source: Yahoo! Telugu: Entertainment | 2 Jul 2009 | 2:18 pm

ర్యాంగింగ్‌ను ఎట్టిపరిస్థితుల్లో సహించం: వైఎస్సార్

ర్యాంగింగ్‌ను ఎట్టిపరిస్థితుల్లో సహించబోమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌ నగరంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో సీనియర్ విద్యార్థులు ఓ విద్యార్థిపై ర్యాంగింగ్‌కు పాల్పడిన వ్యవహారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ కళాశాలల్లో వెలుగుచూస్తున్న ర్యాంగింగ్ ఘటనలపై వైఎస్సార్ మండిపడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 2 Jul 2009 | 1:10 pm

వాళ్లు నిర్మాతల పాలిట బాబులు కాదు బాంబులు

నిర్మాతగా ఎలాంటి చిత్రాలు నిర్మించాలని వచ్చారు? సినిమా అనేది పూర్తి కమర్షియల్‌ అన్నమాట వాస్తవం. అయితే దానితోపాటు మానవతా విలువలకు కూడా ప్రాధాన్యతనిచ్చి సినిమా తీయాలన్నది నా ఉద్దేశ్యం. సినిమా ద్వారా మంచి చెప్పకపోయినా ఫర్వాలేదుకానీ చెడు మాత్రం చెప్పకూడదు. అన్ని వర్గాలు మెచ్చే కుటుంబ కథా చిత్రాలు తీయాలనేది నా అభిమతం. కథ నుండి క్యారెక్టర్‌ పుడితే ఆ కథకు అందం వస్తుంది. అలాంటి ప్రయోగమే వంశం, రాజు మహరాజు చిత్రాలు.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Jul 2009 | 12:31 pm

వెబ్‌దునియా తెలుగు సర్వే 2009లో పాల్గొనండి

వెబ్‌దునియా తెలుగు వీక్షకులకు నమస్సులు.... వెబ్‌ప్రపంచంలో 9 భారతీయ భాషలలో సేవలందిస్తున్న వెబ్‌దునియా ఓ సర్వేను చేపట్టింది. ఈ సర్వేలో మీరు వెబ్‌దునియా తెలుగును ఎప్పట్నుంచి వీక్షిస్తున్నారూ...? వెబ్‌దునియా తెలుగుతోపాటు మరే ఇతర వెబ్‌సైట్లను వీక్షిస్తున్నారూ..? ఇద్యాది అంశాలను తెలుసుకునేందుకు ప్రశ్నలను ఇవ్వడం జరిగింది.
Source: జాతీయ | 2 Jul 2009 | 12:22 pm

ఎన్నారైలూ.. తెలుగు సినిమా తీస్తే అంతే సంగతులు

తెలుగు చలనచిత్రరంగంలో రెగ్యులర్‌గా సినిమాలు తీసే నిర్మాతల శాతం తగ్గిపోయింది. దేవీవరప్రసాద్‌, కె.ఎస్‌.రామారావు. కె.ఎల్‌.నారాయణ, అశోక్ కుమార్‌... ఇలా చాలామంది సినిమా నిర్మాణానికి దూరంగా ఉంటున్నారు. వారంతా నిర్మాణవ్యయం పెరిగిపోవడం ప్రధానకారణంగా చెబుతారు.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Jul 2009 | 11:34 am

షైనీ అహుజా జ్యూడీషియల్ కస్టడీ పొడిగింపు

పనిమనిషిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటుడు షైనీ అహుజా జ్యూడీషియల్ కస్టడీని జులై 16 వరకు పొడిగించారు. అంథేరీ కోర్టు రేప్ కేసుపై తదుపరి దర్యాప్తు జరిపేందుకు వీలుగా అహుజా జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది
Source: జాతీయ | 2 Jul 2009 | 11:26 am

పశ్చిమగోదావరిలో రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి

పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ఇద్దరిని పొట్టనబెట్టుకుంది. జంగారెడ్డి గూడెం మండలం వేగవరం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 30 మంది గాయాల పాలయ్యారు. వేగవరం వద్ద వస్తోన్న ఆర్టీసీ బస్సును వేగంగా వచ్చిన లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.
Source: ఏపీ న్యూస్ | 2 Jul 2009 | 11:25 am

భూటాసింగ్‌ను కలిసిన టీడీపీ బృందం

కొవ్వూరు ఎమ్మెల్యే రామారావుపై రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసిన కేసుల వ్యవహారంపై తెలుగుదేశం మరో అడుగు ముందుకేసింది. ఒక దళిత ఎమ్మెల్యేపై రాష్ట్ర ప్రభుత్వం వేధింపులను ఆపాలంటూ మైసూరా రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ బృందం న్యూఢిల్లీలో జాతీయ ఎస్సీ-ఎస్టీ కమిషన్ ఛైర్మన్ భూటాసింగ్‌‌ను కలిసింది. దళిత ఎమ్మెల్యేపై వేధింపులను ఆపాలంటూ మైసూరారెడ్డి బృందం భూటాసింగ్‌కు ఓ వినతి పత్రం కూడా సమర్పించింది.
Source: ఏపీ న్యూస్ | 2 Jul 2009 | 11:23 am

బ్రహ్మపుత్రా వరదలు: అసోంలో రెడ్‌అలర్ట్

ఎగువ అసోం జిల్లాలను బ్రహ్మపుత్రా నది వరదలు వణికిస్తున్నాయి. లఖీంపూర్ జిల్లాలో అధికారిక యంత్రాంగం రెడ్అలర్ట్ ప్రకటించింది. బ్రహ్మపుత్రా నది పొంగిపొర్లుతుండటంతో నీరు నిల్వచేసేందుకు ఏర్పాటు చేసిన పెద్దకట్ట తెగిపోయింది. అంతేకాకుండా అనేక గ్రామాలు జలమయ్యాయి.
Source: జాతీయ | 2 Jul 2009 | 11:18 am

అహ్మదాబాద్ పేలుళ్ల నిందితుడు అరెస్ట్

అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల నిందితుడిని మధ్యప్రదేశ్ తీవ్రవాద నిరోధక దళం అరెస్టు చేసింది. అతని పేరు మొహమ్మెద్ ఇర్ఫాన్ అలియాస్ కరేలీ. ఇతడిని మధ్యప్రదేశ్ రాజధాని నగరం బోపాల్‌లోని కర్నాడ్‌లో అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు.
Source: జాతీయ | 2 Jul 2009 | 11:07 am

నర్మదా నదీమతల్లి జన్మస్థలం "అమర్ కంటక్"

దారిపొడవునా దేవదారు, సాల్, టేకు, దుగ్గిలం, కెండు లాంటి పేర్లుండే పెద్ద పెద్ద పచ్చటి వృక్షాలు, పేర్లు తెలియని తీగలతో అల్లుకున్న పొదలు, చీకటిగా, మౌన గంభీరంగా ఉండే ఆ ప్రాంతం పట్టపగలే ఎవరికైనా సరే వెన్నులో వణుకు పుట్టిస్తుంది. అలా వెళ్ళగా, వెళ్ళగా కనుచూపుమేరలో ఎత్తైన..
Source: వినోదం | 2 Jul 2009 | 10:34 am

కోర్టు తీర్పు సరికాదు: ముస్లిం లా బోర్డు

స్వలింగ సంపర్కానికి చట్టబద్దత కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై అఖిల భారత ముస్లిం లా బోర్డు తీవ్రంగానే మండిపడింది.
Source: జాతీయ | 2 Jul 2009 | 10:12 am

మందా జగన్నాథంకు సోనియా సమన్లు

బ్యాంకు మేనజర్‌పై చేయిచేసుకున్న నాగర్‌‍కర్నూల్ ఎంపీ మందా జగన్నాథానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఓ గ్రామీణ బ్యాంకు మేనజర్‌పై చేయిచూసుకుంటూ మందా జగన్నాథం టీవీ కెమేరాల కంట్లో పడటంతో పెద్దఎత్తున దుమారం రేగింది.
Source: జాతీయ | 2 Jul 2009 | 8:57 am

మణిరత్నం శిష్యులూ.. షాలిని చెల్లెలూ... ఓయ్ ఓయ్!!

ప్రముఖ నిర్మాత దానయ్య నిర్మించిన చిత్రం "ఓయ్" రేపు టాలీవుడ్ తెరను తాకనుంది. దానయ్య ఎన్నో సినిమాలు తీశారు. అయితే ఈ ఓయ్ చిత్రానికి చాలా స్పెషాలిటీలు ఉన్నాయ్. ఈ చిత్రంలో హీరోగా నటించిన సిద్దార్థ, దర్శకుడుగా పనిచేసిన ఆనంద్ రంగ ఇద్దరూ మణిరత్నం శిష్యులట.
Source: వినోదం | 2 Jul 2009 | 8:50 am

ఆర్టీసీ ఛార్జీలను పెంచేది లేదు: శత్రుచర్ల

పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో ఆర్టీసీ ఛార్జీలను పెంచేది లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు స్పష్టం చేశారు. పెరిగిన ధరలో ఆర్టీసీపై అదనపు భారం పడుతుందని, అయినప్పటికీ ప్రయాణీకులపై అదనపు భారం వేసే ఆలోచనలో ప్రభుత్వం లేదని శత్రుచర్ల వెల్లడించారు
Source: ఏపీ న్యూస్ | 2 Jul 2009 | 8:11 am

స్వలింగ సంపర్కం చట్టబద్ధమే: ఢిల్లీ హైకోర్టు

స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు గురువారం చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత సబబేనని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. స్వలింగ సంపర్కాన్ని భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 377 నేరంగా పేర్కొంటున్న సంగతి తెలిసిందే.
Source: జాతీయ | 2 Jul 2009 | 7:25 am

అందుకే మహిళలపై దాడులు: నన్నపనేని

రాష్ట్రంలో మహిళలపై దాడులు నానాటికి పెచ్చరిల్లిపోతున్నాయని టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం నన్నపనేని మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలంటే హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, మహిళా సంఘాలతో చర్చలు జరపడం ద్వారానే సమస్యకు పరిష్కారం లభిస్తుందని రాజకుమారి తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 2 Jul 2009 | 7:16 am

ఎగ్జిబిషన్ మైదానంలో "వరుణ యాగం" ప్రారంభం

రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న వరుణయాగం గురువారం ప్రారంభమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో గురువారం ఉదయం 9 గంటలకు వరుణయాగం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు ఈ వరుణయాగం కార్యక్రమం కొనసాగుతుంది. తొలి రోజైన గురువారం ఈ వరుణ యాగానికి భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 2 Jul 2009 | 6:40 am

సారీ మేనేజర్‌: మందా జగన్నాథం

ఉప్పునుంతల గ్రామీణ బ్యాంక్‌ మేనేజర్‌పై చేయిచేసుకున్న నాగర్‌కర్నూల్‌ ఎంపీ మందా జగన్నాథం ఎట్టకేలకు క్షమాపణ చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 2 Jul 2009 | 6:26 am

ఈ రోజు పార్లమెంట్ సమావేశాల్లో ఆర్థిక సర్వే

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు గురువారం ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు జులై 27 వరకు జరుగుతాయి. తొలి రోజు పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనుంది. ఈ ఆర్థిక సర్వేలో భారత ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం ప్రభావాన్ని అంచనా వేయనున్నారు.
Source: జాతీయ | 2 Jul 2009 | 6:06 am

ఏ ధైర్యంతో అక్కడ నిల్చుని తిడుతున్నారు?

"ఏ ధైర్యంతో మీరు అక్కడ నిలుచుని తిడుతున్నారు?" కోపంగా అన్నది భార్య. "నేనీ వంటింట్లో నుంచి...
Source: వినోదం | 2 Jul 2009 | 5:32 am

అమ్మ మాట విని...

"ఛి...ఛీ... మా అమ్మమాట విని పెద్ద పుట్ బాల్ ప్లేయర్నయ్యే ఛాన్న్ పోగొట్టుకున్నాను" అన్నాడు రాజు. "ఏం విన్నావు?"...
Source: వినోదం | 2 Jul 2009 | 5:30 am

గోద్రా కేసు: నిందితులకు బెయిల్ నిరాకరణ

2002నాటి గోద్రా రైలు మారణహోమం కేసుపై విచారణ జరుపుతున్న ప్రత్యేక కోర్టు బుధవారం ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 40 మంది నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. గోద్రా అల్లర్ల కేసు నిందితులు 40 మంది దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ప్రత్యేక కోర్టు తోసిపుచ్చింది.
Source: జాతీయ | 2 Jul 2009 | 4:12 am

బారాముల్లా నుంచి సీఆర్పీఎఫ్ ఉపసంహరణ

జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలోని సమస్యాత్మక బారాముల్లా పట్టణం నుంచి సీఆర్పీఎఫ్ సిబ్బందిని ఉపసంహరించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న ఈ పట్టణంలో గత కొన్నిరోజులుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి.
Source: జాతీయ | 2 Jul 2009 | 3:58 am

అసిన్.. మీ నాన్నను తీసుకురావద్దు: హీరోలు

హిందీ 'గజినీ'తో బాలీవుడ్‌లో అసిన్‌కు అవకాశాలు దండిగానే వస్తున్నాయి. వచ్చిన అవకాశాన్ని వచ్చినట్లు అంగీకరిస్తుంది కూడా. ప్రస్తుతం కత్రినా ప్రియుడు సల్మాన్‌తో కలిసి "లండన్ డ్రీమ్స్" చిత్రంలో నటిస్తోంది. సినిమా బ్రహ్మాండంగా వస్తోందట. అయితే షూటింగ్ జరిగిన అనంతరం హీరోలు తమ ముఖాలను కందగడ్డల్లా పెట్టుకుని కూచుంటున్నారట. దీనికి కారణం ప్రతిరోజూ షూటింగ్ స్పాట్‌కు అసిన్ తన తండ్రిని వెంటేసుకుని రావడమేనట. అసిన్ తండ్రి వారికి ఏ విషయంలో అడ్డు తగిలాడో ఏమోగానీ.. సల్మాన్, అజయ్ దేవగన్ ఇద్దరూ అసిన్‌తో "షూటింగులకు మీ నాన్నను తీసుకురావద్దు" అని ముఖం మీద చెప్పేశారట. అంతే... అసిన్ తన తండ్రికి విషయాన్ని చెప్పి రావద్దందట.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Jul 2009 | 9:05 pm

జూలై మూడో వారంలో వస్తోన్న "రోమియో"

శ్రీహరి, ఆర్యన్ రాజేష్‌లు కలిసి నటించిన చిత్రం "రోమియో". శ్రద్ధాఆర్య కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ఎ డిఫరెంట్ లవర్‌ (ట్యాగ్ లైన్)గా ఆర్యన్ రాజేష్ కన్పిస్తారు. సుధ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని జూలై మూడో వారంలో తెరకెక్కనుందని నిర్మాత శ్రీనివాస్ తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Jul 2009 | 6:36 pm

జూలై 10న తెరపైకి వస్తోన్న 'ఊహాచిత్రం'

ప్రముఖ నిర్మాత కె. పైడిబాబు లిఖిత్ ఆర్ట్స్ పతాకంపై నిర్మించిన "ఊహాచిత్రం" ఈ నెల 10వ తేదీన తెరపైకి రానుంది. డా. పెదవీర్రాజు సమర్పణలో నూతన దర్శకుడు సత్య మలచిన ఈ చిత్రంలో వంశీకృష్ణ-కావేరీ ఝాలు జంటగా నటించారు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకున్న "ఊహాచిత్రం" వైవిధ్యమైన కథాంశంతో జూలై పదోతేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర సమర్పకుడు పెదవీర్రాజు అన్నారు. షూటింగ్, సెన్సార్, పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని సమర్పకుడు ఆశాభావం వ్యక్తం చేశారు..
Source: Yahoo! Telugu: Entertainment | 1 Jul 2009 | 6:15 pm

తమన్నా నాకు సరైన జోడి: వరుణ్ సందేశ్

"హ్యాపీడేస్"లో అందాల సెక్సీతారతో జతకట్టిన వరుణ్ సందేశ్, మళ్లీ మళ్లీ ఆమెతోనే నటించాలని కోరుకుంటున్నాడు. హ్యాపీడేస్‌లో బక్కగా ఉన్న తనతో తమన్నా కెమిస్ట్రీ అదిరిందని వరుణ్ అంటున్నాడు. కొత్తబంగారులోకం, ఎవరైనా ఎప్పుడైనా వంటి ఎన్ని చిత్రాలు చేసిన తనకు తమన్నా సరైన జోడీ అని వరుణ్‌ సందేశ్ చెబుతున్నాడు. తాజాగా ప్రతిష్టాత్మక ఏవీఎం సంస్థపై రూపుదిద్దుకున్న "ఎవరైనా ఎప్పుడైనా"లో తన సరసన నటించిన విమలారామన్‌ తనకంటే పెద్దదిగా కన్పించిన మాట వాస్తవమేననీ, కానీ అది దర్శక నిర్మాతల నిర్ణయం కనుక తానేమీ చేయలేకపోయానని మనసులోని మాటను వరుణ్ సందేశ్ చెప్పాడు. "ఎవరైనా ఎప్పుడైనా" (ప్రేమలో పడొచ్చు) సినిమాలోలాగా ఇంకా తాను ప్రేమలో పడలేదనీ, తమన్నా వంటి జోడి కుదిరితే తప్పకుండా ప్రేమలో పడటమే కాదు.. ఏకంగా పెళ్లి కూడా చేసుకుంటానని వరుణ్ అసలు విషయాన్ని వరుణ్ బయటపెట్టేశాడు. మరి సెక్సీ క్వీన్ తమన్నా ఈ మాట వింటే ఏమంటుందో..? వేచి చూడాల్సిందే..!.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Jul 2009 | 3:54 pm

జాన్.. ఓ తెలివితక్కువ మేళాం: బిపాస

ఇటీవల ఓ షూటింగ్‌లో బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాంకు ప్రమాదవశాత్తూ కాలికి గాయమైంది. క్రికెట్ ఆట ఆడుతున్నట్లు ఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగా బంతి అతని కాలికి బలంగా వచ్చి తగిలింది. దాంతో జాన్ మెలికలు తిరుగుతూ గ్రౌండ్‌పై కూలబడ్డాడు. నిర్మాతకు నష్టం కలుగకూడదనే తలంపుతో ఆ సాయంత్రం వరకూ కుంటుతూనే షూటింగ్ లో పాల్గొన్నాడట జాన్. పొద్దుపోయేసరికి కాలు వాచిపోయిందట. దీంతో వైద్యుని సంప్రదించగా వైద్యుడు అతనిపై విరుచుకుపడ్డాడట. కాలికి దెబ్బతగిలినా అలానే నడవడం వల్ల గాయం మరింత పెద్దదైందనీ, నెలరోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పాడట.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Jul 2009 | 2:43 pm

రామారావును వేధించడం సరికాదు: బాబు

దళితుడైన రామారావును వేధించడం సరికాదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కొవ్వూరు ఎమ్మేల్యే రామారావు విషయంలో నిర్దోషి అని తేలినా, ఆయనపై కేసులు ఎత్తివేయాలని విపక్షాలు, విద్యార్థులు కోరుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఏ మాత్రం పట్టించుకోవడం లేదని బాబు తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 1 Jul 2009 | 2:12 pm