డెట్రాయిట్ బస్‌స్టాప్‌లో కాల్పులు

అమెరికాలోని డెట్రాయిట్‌ నగరంలోనున్న ఓ బస్‌‌స్టాప్‌లో నిలబడి ఉన్న ఏడుగురు యువకులపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి పారిపోయారు.
Source: Yahoo! Telugu: News | 1 Jul 2009 | 7:46 pm

రామారావును వేధించడం సరికాదు: బాబు

దళితుడైన రామారావును వేధించడం సరికాదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కొవ్వూరు ఎమ్మేల్యే రామారావు విషయంలో నిర్దోషి అని తేలినా, ఆయనపై కేసులు ఎత్తివేయాలని విపక్షాలు, విద్యార్థులు కోరుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఏ మాత్రం పట్టించుకోవడం లేదని బాబు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 1 Jul 2009 | 7:42 pm

మళ్ళీ పెరిగిన పెట్రోలు ధరలు

దేశంలో మరో మారు పెట్రోలు ధరలు భగ్గుమన్నాయి. పెట్రోలు, డీజిల్‌ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు పెట్రోలియం శాఖ మంత్రి మొరళీదేవరా ప్రకటించారు.
Source: Yahoo! Telugu: News | 1 Jul 2009 | 7:17 pm

జూలై మూడో వారంలో వస్తోన్న "రోమియో"

శ్రీహరి, ఆర్యన్ రాజేష్‌లు కలిసి నటించిన చిత్రం "రోమియో". శ్రద్ధాఆర్య కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ఎ డిఫరెంట్ లవర్‌ (ట్యాగ్ లైన్)గా ఆర్యన్ రాజేష్ కన్పిస్తారు. సుధ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని జూలై మూడో వారంలో తెరకెక్కనుందని నిర్మాత శ్రీనివాస్ తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Jul 2009 | 6:36 pm

రైల్వే బడ్జెట్...ప్రజల బడ్జెట్‌గా ఉంటుంది: మమతా బెనర్జీ

లోక్‌సభలో జులైనెల 3వ తేదీన ప్రవేశపెట్టబోయే రైల్వేబడ్జెట్ ప్రజల బడ్జెట్‌గా ఉంటుందని ఆ శాఖామంత్రిణి మమతా బెనర్జీ అన్నారు
Source: Yahoo! Telugu: News | 1 Jul 2009 | 6:22 pm

జూలై 10న తెరపైకి వస్తోన్న 'ఊహాచిత్రం'

ప్రముఖ నిర్మాత కె. పైడిబాబు లిఖిత్ ఆర్ట్స్ పతాకంపై నిర్మించిన "ఊహాచిత్రం" ఈ నెల 10వ తేదీన తెరపైకి రానుంది. డా. పెదవీర్రాజు సమర్పణలో నూతన దర్శకుడు సత్య మలచిన ఈ చిత్రంలో వంశీకృష్ణ-కావేరీ ఝాలు జంటగా నటించారు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకున్న "ఊహాచిత్రం" వైవిధ్యమైన కథాంశంతో జూలై పదోతేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర సమర్పకుడు పెదవీర్రాజు అన్నారు. షూటింగ్, సెన్సార్, పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని సమర్పకుడు ఆశాభావం వ్యక్తం చేశారు..
Source: Yahoo! Telugu: Entertainment | 1 Jul 2009 | 6:15 pm

వచ్చే జన్మలో మైఖేల్ జాక్సన్ స్త్రీగా పుడతాడట.!

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పాప్ సంగీత విద్వన్మణి, డాన్స్ రంగంలో ఓ చరిత్ర సృష్టించిన మైఖేల్ జాక్సన్ మరు జన్మలో స్త్రీగా పుట్టబోతున్నాడట. ఈ విషయం ఆశ్చర్యంగానే ఉంటుంది. కాని ఇది నిజం అంటున్నారు వాల్టర్ సెంక్యూ.
Source: Yahoo! Telugu: News | 1 Jul 2009 | 5:47 pm

ఎంబీఏ కోర్సుకు ఏఐసీటీఈ గుర్తింపు

గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో ఉన్న పీఎన్సీ అండ్ కేఆర్ పీజీ కళాశాల నిర్వహిస్తున్న ఎంబీఏ కోర్సుకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ), న్యూఢిల్లీ ఆమోదం లభించింది. ఈ విషయాన్ని కళాశాల యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 1 Jul 2009 | 5:22 pm

జులై 7న ఏఎన్‌యూ ఇన్‌స్టాంట్ ఎగ్జామ్స్

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ) డిగ్రీ పరీక్షల రీవాల్యూషన్ ఫలితాలను ప్రకటించింది. అంతేకాకుండా చివరి ఏడాది విద్యార్థుల ఇన్‌స్టాంట్ ఎగ్జామ్స్ జరిగే తేదీని కూడా వెల్లడించారు. మొదటి, రెండో ఏడాది అన్ని సబ్జెక్ట్‌లలో ఉత్తీర్ణులై, చివరి ఏడాది ఒక సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు.
Source: Yahoo! Telugu: News | 1 Jul 2009 | 5:10 pm

అమ్మకాలు పెంచుకున్న మారుతి

దేశీయ కార్ల ఉత్పత్తిలో అగ్రగామిగానున్న మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ సంస్థ మారుతి కార్ల అమ్మకాలలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ నెలలో 22.63శాతం పెరిగి 75,109 వాహనాలు అమ్ముడు పోయాయని ఆసంస్థ తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 1 Jul 2009 | 4:53 pm

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 152 పాయింట్లు పుంజుకుని 14,646 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 59 పాయింట్లు లాభపడి 4,350 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 1.05 శాతం, నిఫ్టీ 1.36 శాతం చొప్పున వృద్ధి చెందాయి.
Source: Yahoo! Telugu: News | 1 Jul 2009 | 4:29 pm

పశ్చిమ తీరానికి తీవ్రవాద ముప్పు: హోంశాఖ

దేశ పశ్చిమ తీరానికి తీవ్రవాద ముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయని హోం శాఖ మంత్రి పి.చిదంబరం వెల్లడించారు. ఆయన బుధవారం మాట్లాడుతూ.. దేశ పశ్చిమతీరానికి తీవ్రవాద ముప్పు పొంచివుందని నిఘా వర్గాలకు సంకేతాలు అందాయి. అయితే వెంటనే తీవ్రవాద దాడి జరిగే ప్రమాదమేమీ లేదని చిదంబరం తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 1 Jul 2009 | 4:24 pm

తమన్నా నాకు సరైన జోడి: వరుణ్ సందేశ్

"హ్యాపీడేస్"లో అందాల సెక్సీతారతో జతకట్టిన వరుణ్ సందేశ్, మళ్లీ మళ్లీ ఆమెతోనే నటించాలని కోరుకుంటున్నాడు. హ్యాపీడేస్‌లో బక్కగా ఉన్న తనతో తమన్నా కెమిస్ట్రీ అదిరిందని వరుణ్ అంటున్నాడు. కొత్తబంగారులోకం, ఎవరైనా ఎప్పుడైనా వంటి ఎన్ని చిత్రాలు చేసిన తనకు తమన్నా సరైన జోడీ అని వరుణ్‌ సందేశ్ చెబుతున్నాడు. తాజాగా ప్రతిష్టాత్మక ఏవీఎం సంస్థపై రూపుదిద్దుకున్న "ఎవరైనా ఎప్పుడైనా"లో తన సరసన నటించిన విమలారామన్‌ తనకంటే పెద్దదిగా కన్పించిన మాట వాస్తవమేననీ, కానీ అది దర్శక నిర్మాతల నిర్ణయం కనుక తానేమీ చేయలేకపోయానని మనసులోని మాటను వరుణ్ సందేశ్ చెప్పాడు. "ఎవరైనా ఎప్పుడైనా" (ప్రేమలో పడొచ్చు) సినిమాలోలాగా ఇంకా తాను ప్రేమలో పడలేదనీ, తమన్నా వంటి జోడి కుదిరితే తప్పకుండా ప్రేమలో పడటమే కాదు.. ఏకంగా పెళ్లి కూడా చేసుకుంటానని వరుణ్ అసలు విషయాన్ని వరుణ్ బయటపెట్టేశాడు. మరి సెక్సీ క్వీన్ తమన్నా ఈ మాట వింటే ఏమంటుందో..? వేచి చూడాల్సిందే..!.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Jul 2009 | 3:54 pm

జాన్.. ఓ తెలివితక్కువ మేళాం: బిపాస

ఇటీవల ఓ షూటింగ్‌లో బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాంకు ప్రమాదవశాత్తూ కాలికి గాయమైంది. క్రికెట్ ఆట ఆడుతున్నట్లు ఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగా బంతి అతని కాలికి బలంగా వచ్చి తగిలింది. దాంతో జాన్ మెలికలు తిరుగుతూ గ్రౌండ్‌పై కూలబడ్డాడు. నిర్మాతకు నష్టం కలుగకూడదనే తలంపుతో ఆ సాయంత్రం వరకూ కుంటుతూనే షూటింగ్ లో పాల్గొన్నాడట జాన్. పొద్దుపోయేసరికి కాలు వాచిపోయిందట. దీంతో వైద్యుని సంప్రదించగా వైద్యుడు అతనిపై విరుచుకుపడ్డాడట. కాలికి దెబ్బతగిలినా అలానే నడవడం వల్ల గాయం మరింత పెద్దదైందనీ, నెలరోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పాడట.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Jul 2009 | 2:43 pm

రామారావును వేధించడం సరికాదు: బాబు

దళితుడైన రామారావును వేధించడం సరికాదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కొవ్వూరు ఎమ్మేల్యే రామారావు విషయంలో నిర్దోషి అని తేలినా, ఆయనపై కేసులు ఎత్తివేయాలని విపక్షాలు, విద్యార్థులు కోరుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఏ మాత్రం పట్టించుకోవడం లేదని బాబు తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 1 Jul 2009 | 2:12 pm

షూటింగ్‌లో పాల్గొన్న నందమూరి "యంగ్‌టైగర్"

నందమూరి యంగ్‌టైగర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ డైరక్టర్ వి.వి. వినాయక్ దర్శకత్వంలో కొత్త చిత్రం రూపుదిద్దుకుంటోంది. కొడాలి నాని సమర్పణలో వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై వల్లభనేని వంశీ మోహన్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం తాజా షెడ్యూల్‌లో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు. బుధవారం...
Source: వినోదం | 1 Jul 2009 | 1:10 pm

నాకూ చుంబించే ఛాన్సివ్వరూ: ఏవీఎస్

లక్స్‌పాప.. ఆశాషైనీ నటించిన "ఆ ఇంట్లో.." హార్రర్‌ చిత్రంలోని ఓ పాటలో చిన్నా ఆమె పెదాలను గాఢంగా చుంబించే సన్నివేశం ఉంది. ఆ సన్నివేశాన్ని సినిమా ట్రైలర్స్‌‌లో ప్రదర్శించారు. దాన్ని చూసిన వెంటనే నటుడు ఏవీఎస్‌ స్పందిస్తూ... తనకు అన్నిటికంటే మనసు దోచింది మయూర( లక్స్‌పాప పేరు మార్చుకుంది లెండి) పెదాలను చిన్నా ముద్దుపెట్టుకున్న సన్నివేశమనీ చెప్పుకొచ్చాడు.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Jul 2009 | 11:54 am

మాస్టర్ బ్లాస్టర్‌కు నెల్లూరులో రేషన్ కార్డులు!

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ పేరుతో నెల్లూరు జిల్లాలో ఏకంగా రెండు రేషన్ కార్డులు జారీ అయ్యాయి. నెల్లూరు జిల్లాలో బోగస్ రేషన్ కార్డుల ఏరివేత ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. ఈ ఏరివేతలో బోగస్ కార్డుల వ్యవహారం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. చిత్రంగా టీం ఇండియా బ్యాట్స్‌మన్, క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరుతో ఏకంగా రెండు రేషన్ బోగస్ రేషన్ కార్డులు జారీ కావడం అందరిని ఆశ్చర్యచకితులను చేసింది.
Source: ఏపీ న్యూస్ | 1 Jul 2009 | 11:47 am

షూటింగ్‌లో పాల్గొన్న నందమూరి "యంగ్‌టైగర్"

నందమూరి యంగ్‌టైగర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ డైరక్టర్ వి.వి. వినాయక్ దర్శకత్వంలో కొత్త చిత్రం రూపుదిద్దుకుంటోంది. కొడాలి నాని సమర్పణలో వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై వల్లభనేని వంశీ మోహన్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం తాజా షెడ్యూల్‌లో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు. బుధవారం ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న ఎన్టీఆర్ మాట్లాడుతూ.. నేటి నుంచి ఏకధాటిగా సినిమా పూర్తయ్యే వరకు షూటింగ్ జరుగుతుందన్నారు. ఆది, సాంబ తర్వాత వినయ్ డైరక్షన్‌లో చేస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులు, అభిమానుల అంచనాలకు అనుగుణంగా ఉంటుందని చెప్పారు. అత్యాధునిక సాంకేతిక విలువలో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వినయ్ అద్భుతంగా రూపొందిస్తున్నారని తెలిపారు. సెన్సేషనల్ డైరక్టర్ వి.వి. వినాయక్ మాట్లాడుతూ.. తారక్‌తో తాను చేస్తున్న మూడో సినిమా ఇదని చెప్పారు. తారక్ ఇమేజ్‌కి తగినట్లుగా ఉంటుందన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Jul 2009 | 11:32 am

ఎంపీ మందాను వివరణ కోరిన అధిష్టానం : మెయిలీ

మహబూబ్‌ నగర్‌ జిల్లా ఉప్పునూతల గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ మేనేజర్‌పై చేయిచేసుకున్న నాగర్‌కర్నూల్‌ ఎంపీ మందా జగన్నాథంను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వివరణ కోరింది.
Source: జాతీయ | 1 Jul 2009 | 11:21 am

పశ్చిమ తీరానికి తీవ్రవాద ముప్పు: హోంశాఖ

దేశ పశ్చిమ తీరానికి తీవ్రవాద ముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయని హోం శాఖ మంత్రి పి.చిదంబరం వెల్లడించారు. ఆయన బుధవారం మాట్లాడుతూ.. దేశ పశ్చిమతీరానికి తీవ్రవాద ముప్పు పొంచివుందని నిఘా వర్గాలకు సంకేతాలు అందాయి. అయితే వెంటనే తీవ్రవాద దాడి జరిగే ప్రమాదమేమీ లేదని చిదంబరం తెలిపారు.
Source: జాతీయ | 1 Jul 2009 | 10:54 am

క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు: మందా జగన్నాథం

బ్యాంక్ మేనేజర్‌పై చేయి చేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ జగన్నాథం, ఈ వ్యవహారంపై సదరు బ్యాంక్ మేనేజరుకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎస్సీల అభివృద్ధి పథకాలను బ్యాంకర్లు అడ్డుకుంటున్నారని మంద ఆరోపించారు.
Source: ఏపీ న్యూస్ | 1 Jul 2009 | 10:31 am

భగ్గుమన్న బారాముల్లా: నలుగురి మృతి

జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలోని సమస్యాత్మక బారాముల్లా పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కర్ఫ్యూ విధించిన ఈ పట్టణంలో నిరసనకారులపైకి భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. పట్టణంలో గత కొన్నిరోజులుగా జరిగిన హింసాకాండలో మృతి చెందినవారి సంఖ్య బుధవారం నలుగురికి చేరింది.
Source: జాతీయ | 1 Jul 2009 | 9:35 am

బోరింగ్ చెడిపోయిందమ్మా..!

"ఏం రాజూ... ఈ మధ్య పాలు బాగా చిక్కగా ఉంటున్నాయి. ఎప్పుడూ అలాగే పోయచ్చుగా" అన్నది మంగమ్మ పాల వాడితో. "మా ఇంట్లో బోరింగ్ చెడిపోయిందమ్మా...
Source: వినోదం | 1 Jul 2009 | 9:24 am

గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించండి

"నాకీ మధ్య నిద్ర సరిగ్గా పట్టడం లేదండీ" డాక్టరుతో అన్నాడు రాము "ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించండి. మీ సమస్య తీరుతుంది"...
Source: వినోదం | 1 Jul 2009 | 9:24 am

కంధమాల్ నుంచి కేంద్ర బలగాల ఉపసంహరణ

ఒరిస్సాలోని సమస్యాత్మక కంధమాల్ జిల్లాలోని నాలుగు కంపెనీల కేంద్ర పారామిలిటరీ దళాలను బుధవారం ఉపసంహరించారు. గత ఏడాది మత ఘర్షణల కారణంగా శాంతి, భద్రతలను పరిరక్షించేందుకు కంధమాల్ జిల్లాలో కేంద్ర బలగాలను మోహరించారు.
Source: జాతీయ | 1 Jul 2009 | 9:20 am

ప్రజారక్షణ కమిటీని వెంటనే రద్దు చేయాలి: నారాయణ

ప్రజారక్షణ కమిటీని వెంటనే రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. రాష్ట్ర భద్రతా సలహాదారు ఛైర్మన్‌గా కేవీపీ నియామకాన్ని ఆయన తప్పు పట్టారు. అధికార దురహంకారంతోనే బ్యాంక్ మేనేజర్‌పై మంద జగన్నాథం దాడికి పాల్పడ్డారని నారాయణ వ్యాఖ్యానించారు. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజా రక్షణ కమిటి రాజ్యాంగేతర శక్తిగా ఎదుగుతుందని నారాయణ అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 1 Jul 2009 | 8:40 am

మమత రైల్వే బడ్జెట్‌లో ఛార్జీల పాక్షిక సవరణ

రెండోసారి రైల్వే శాఖ బాధ్యతలు చేపట్టిన మమతా బెనర్జీ ఈ నెల 3న ప్రవేశపెట్టబోయే ప్రస్తుత యూపీఏ కూటమి ప్రభుత్వ తొలి రైల్వే బడ్జెట్‌లో ఛార్జీల పాక్షిక సవరణ, సరుకు రవాణాపై ప్రోత్సాహకాలు, భద్రతకు అదనపు నిధులు, చిన్నవ్యాపారులకు రూ.20లకే సీజన్ పాస్‌లు అందజేసే చర్యలు హైలెట్స్ కానున్నాయి.
Source: జాతీయ | 1 Jul 2009 | 7:58 am

కేసీఆరూ.. ఇకనైనా మారవయ్యా బాబూ..!

రాజీనామా డ్రామా చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఇకనైనా మారాలని ఆ పార్టీ మాజీ ఎంపీ వినోద్ కుమార్ సూచించారు. విమర్శలను ప్రజాస్వామ్య స్ఫూర్తితో స్వీకరించుకుంటే కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు వ్యతిరేకిస్తారని ఆ అభిప్రాయం వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 1 Jul 2009 | 7:43 am

ఎన్ఎస్‌జీ హబ్‌లలో ఆర్మీ ప్రత్యేక దళాలు

బెంగళూరు, జోధ్‌పూర్ నగరాల్లో ఏర్పాటు చేసే తీవ్రవాద నిరోధక హబ్‌లలో ఆర్మీ ప్రత్యేక దళాలను ఉపయోగిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి పి.చిదంబరం బుధవారం చెన్నైలో విలేకరులతో చెప్పారు. రెండో జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్‌జీ) హబ్‌ను చెన్నైలో చిదంబరం ప్రారంభించారు.
Source: జాతీయ | 1 Jul 2009 | 6:53 am

ఉత్తర కోస్తా, తెలంగాణలలో 24 గంటల్లో వర్షాలు

వచ్చే 24 గంటల్లో ఉత్తర కోస్తా, ఉత్తర తెలంగాణా ప్రాంతాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఒరిస్సా నుంచి దక్షిణ తమిళనాడు తీరం వెంబడి ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనంగా ఉంది. ఈ కారణంగా రాష్ట్రంలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు కురస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
Source: ఏపీ న్యూస్ | 1 Jul 2009 | 6:51 am

రాష్ట్రంలో ఎన్ఎస్‌జీ కేంద్రాన్ని ప్రారంభించిన చిదంబరం

దేశంలో పెరిగిపోతున్న ఉగ్రవాదుల చర్యలను తిప్పికొట్టేందుకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్‌జీ) కేంద్రాన్ని హోంశాఖామంత్రి పి. చిదంబరం బుధవారం ప్రారంభించారు.
Source: ఏపీ న్యూస్ | 1 Jul 2009 | 6:25 am

భారత కొత్త విదేశాంగ కార్యదర్శిగా నిరుపమ

చైనాకు భారత దౌత్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న నిరుపమరావు విదేశాంగ శాఖ కార్యదర్శి బాధ్యతలు చేపట్టనున్నారు. విదేశాంగ కార్యదర్శి బాధ్యతల్లో నియమించబడుతున్న రెండో మహిళ నిరుపమరావు. గత ఏడాది ముంబయి ఉగ్రవాద దాడుల తరువాత భారత్, పాకిస్థాన్ మధ్య సత్సంబంధాలు లేని సమయంలో ఆమె ఈ బాధ్యతలు స్వీకరించనుండటం గమనార్హం.
Source: జాతీయ | 1 Jul 2009 | 5:26 am

దేశవ్యాప్తంగా 113 స్వైన్ ఫ్లూ కేసుల నమోదు

దేశంలో స్వైన్ ఫ్లూ వ్యాధి కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుంది. తాజాగా మరో తొమ్మిది మందికి స్వైన్ ఫ్లూ వ్యాధి సోకినట్లు అధికారిక వర్గాలు నిర్ధారణకు వచ్చాయి. దీంతో దేశవ్యాప్తంగా వెలుగుచూసిన మొత్తం స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య 113కి చేరుకుంది.
Source: జాతీయ | 1 Jul 2009 | 4:38 am

ప్రతిపాదిత తొలి ఎన్ఎస్‌జీ హబ్ ప్రారంభం

జాతీయ భద్రతా దళ (ఎన్ఎస్‌జీ) కమాండోలతో భారత్ మంగళవారం తొలి హబ్‌ను ప్రారంభించింది. గత ఏడాది ముంబయి ఉగ్రవాద దాడులు భయానక వాతావరణం సృష్టించిన నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎన్ఎస్‌జీ హబ్‌లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Source: జాతీయ | 1 Jul 2009 | 3:57 am

దాసరిచే 'ఆ ఇంట్లో' ఆడియో విడుదల

యు9 ఎంటర్‌టైన్స్‌మెంట్స్‌ పతాకంపై తన స్నేహితులతో కలిసి నటుడు చిన్నా దర్శకునిగా 'ఆ ఇంట్లో' అనే హార్రర్‌ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఆడియో దర్శకరత్న డా. దాసరి నారాయణరావు చేతుల మీదుగా విడుదలైంది.
Source: Yahoo! Telugu: Entertainment | 30 Jun 2009 | 7:32 pm

సొంత విన్యాసాలకు మేగన్ ఫాక్స్ ప్రాధాన్యం

"ట్రాన్స్‌ఫార్మర్స్" భామ మేగన్ ఫాక్స్ ఇప్పుడు సొంతంగా విన్యాసాలు చేసేందుకు ఆసక్తి చూపుతోంది. స్టంట్‌లను డూప్‌లు లేకుండా చేయడం ప్రమాదకరమైనప్పటికీ, ఆ అమ్మడు మాత్రం వెనక్కుతగ్గే ప్రసక్తే లేదంటుంది. తాజాగా ట్రాన్స్‌‍ఫార్మర్స్‌ను హాస్యభరిత యాక్షన్ చిత్రంగా మలిచారు. ఇందులో నటించిన మేగన్ ఫాక్స్ సొంతంగా విన్యాసాలు చేయడం అలవాటు చేసుకుంది. సాధ్యమైనన్ని స్టంట్‌లను డూప్‌లు లేకుండా చేయాలనుకుంటున్నాను. తన శక్తికొలది స్టంట్స్ సొంతంగానే చేస్తానని ఫాక్స్ చెప్పింది. ట్రాన్స్‌ఫార్మర్స్‌లో 40 శాతం స్టంట్స్ సొంతంగా చేశాను. రాబోయే చిత్రంలో అన్ని స్టంట్స్ పూర్తిగా నేనే చేయాలనుకుంటున్నానని ఫాక్స్ చెప్పినట్లు ది సన్ వెల్లడించింది.
Source: Yahoo! Telugu: Entertainment | 30 Jun 2009 | 7:30 pm

స్వలింగ సంపర్కానికి బాలీవుడ్ మద్దతు!

స్వలింగ సంపర్కారనికి బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులతో పాటు.. మోడళ్ళ మద్దతు తెలుపుతున్నారు. మరోవైపు బాలీవుడ్‌లోనే అనేక మంది స్వలింగ సంపర్కులు ఉన్నారని ప్రముఖ నటి సెలీనా జైట్లీ బాంబు పేల్చారు.
Source: Yahoo! Telugu: Entertainment | 30 Jun 2009 | 5:46 pm

ఎంతకావాలో.. అంత చూపిస్తుందట శ్వేతాబసు

'కొత్త బంగారులోకం', 'రైడ్' వంటి చిత్రాలతో టాలీవుడ్ టీనేజ్ కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన శ్వేతాబసు భవిష్యత్తులో నటించబోయే సినిమాల్లో గ్లామర్‌ను ఎంత కావాలో అంత చూపిస్తానంటోందట. "సన్నివేశం డిమాండ్ బట్టి గ్లామర్ ఆరబోస్తా.." వంటి పాత చింతకాయ పచ్చడి మాటలు చెప్పడమంటే తనకు మహా చిరాకట. అసలు ప్రేక్షకులు తన అందాన్ని ఎంతవరకు చూడగలరో బసుకు బాగా తెలుసునట. వారి అభీష్టం మేరకు తన గ్లామర్‌ను ఆరబోస్తుందట. కొందరు దీన్నే ఎక్స్‌పోజింగ్ అంటారేమో మిస్ అని కదిలిస్తే... చివాల్న చూసి "అలా అని ఎవరంటారు..?" అని ఎదురు ప్రశ్నలు వేస్తోందట.
Source: Yahoo! Telugu: Entertainment | 30 Jun 2009 | 5:19 pm

'సకల దేవతల' నిలయం "కళాధామం"

"కృషి ఉంటే మనుషులు రుషులవుతారు, మహా పురుషులవుతారు" అన్నది నాటి మాట. "మనిషి తలచుకుంటే ఈ సృష్టికే ప్రతిసృష్టి చేయగలడు" అనేది నేటి మాట. చాలా సందర్భాల్లో ఈ విషయం తేటతెల్లమైనప్పటికీ...
Source: వినోదం | 30 Jun 2009 | 2:44 pm

పార్లమెంట్ సమావేశాల్లో బాబ్రీ చర్చ: భాజపా

జులై రెండో తేదీ నుంచి ప్రారభంకానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బాబ్రీ మసీదు విధ్వంస ఘటనపై జస్టీస్ లిబ్రహాన్ కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చించాలని కోరుతామని భారతీయ జనతా పార్టీ తెలిపింది.
Source: జాతీయ | 30 Jun 2009 | 1:42 pm

ఎంపీ మందా జగన్నాథంపై కేసు నమోదు

బ్యాంకు మేనేజర్‌పై చేయి చేసుకున్న వ్యవహారానికి సంబంధించి నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు మందా జగన్నాథంపై పోలీసులు కేసు నమోదు చేసింది. బ్యాంకు మేనేజర్ పట్ల దురుసుగా ప్రవర్తించి, చేయి చేసుకున్నారని ఉప్పునుంతల గ్రామీణ వికాస బ్యాంకు మేనేజర్ రవీందర్ రెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Source: ఏపీ న్యూస్ | 30 Jun 2009 | 1:42 pm