|
బీహార్‌లో కూలిన బ్రిడ్జి: రైళ్ల సర్వీసులకు అంతరాయంబీహార్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమస్తిపురా డివిజన్‌లోని ఒరఖ్‌పూర్-నర్కతియాగంజ్ సెక్షన్‌లో రైల్వే బ్రిడ్జి కూలిపోయింది. దీంతో రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. బీహార్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వెస్ట్ చంప్రారణ్ జిల్లాలో ఈ బ్రిడ్జి కూలింది.Source: Yahoo! Telugu: News | 29 Jun 2009 | 4:03 pm స్వల్ప లాభాల్లో పయనిస్తున్న సెన్సెక్స్స్టాక్ మార్కెట్ ప్రస్తుతం స్వల్ప లాభాల్లో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 12 పాయింట్లు పెరిగి 14,777 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 3 పాయింట్లు స్వల్పంగా పెరిగి 4,379 వద్ద పయనిస్తోంది. ఇప్పటి వరకు మొత్తం 2,695 కంపెనీల వాటాలు ట్రేడ్ అవగా, 1,675 కంపెనీల వాటాలు లాభపడ్డాయి. అలాగే మిగిలిన కంపెనీల వాటాలు నష్టాల్లో పయనిస్తున్నాయి.Source: Yahoo! Telugu: News | 29 Jun 2009 | 3:36 pm ఉద్యోగాలు కోల్పోయిన 4 లక్షల మందిప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థికమాంద్యంకారణంగా వివిధ కంపెనీలలో ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఇది గడచిన ఆగష్టు నెల 2007వ సంవత్సరంనుంచి ఇప్పటివరకు ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య దాదాపు నాలుగు లక్షలమంది వరకు ఉంటుందని సర్వేలు తెలుపుతున్నాయి.Source: Yahoo! Telugu: News | 29 Jun 2009 | 3:34 pm దాడుల కేసులో రాజ్‌థాక్రేకు బెయిల్ మంజూరుఉత్తర భారతీయులపై దాడి చేసిన కేసులో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్‌థాక్రేకు స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తిగత పూచీతో పాటు.. లక్ష రూపాయల బాండ్ సమర్పించడంతో ఆయనకు కళ్యాణ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.Source: Yahoo! Telugu: News | 29 Jun 2009 | 3:22 pm ఆయనతో ఎఫైర్ నిజమే: అర్జెంటీనా మహిళఅమెరికా రిపబ్లికన్ పార్టీ భావి అధ్యక్ష అభ్యర్థిగా గుర్తింపు పొందిన దక్షిణ కరోలినా రాష్ట్ర గవర్నర్ మార్క్ స్టాన్‌ఫోర్డ్ ఓ అర్జెంటీనా మహిళతో సన్నిహితంగా ఉంటున్నట్లు వచ్చిన వార్తలు నిజమేనని ఆ మహిళ కూడా ధృవీకరించారు. అర్జెంటీనా మహిళతో సాన్నిహిత్యాన్ని స్టాన్‌ఫోర్డ్ ఇప్పటికే ధృవీకరించి క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.Source: Yahoo! Telugu: News | 29 Jun 2009 | 3:18 pm లాభాల్లో పయనిస్తన్న స్టాక్ మార్కెట్స్టాక్ మార్కెట్ ప్రస్తుతం లాభాల్లో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 123 పాయింట్లు బలపడి 14,887 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 52 పాయింట్లు లాభపడి 4,427 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.83 శాతం, నిఫ్టీ 1.19 శాతం చొప్పున వృద్ధి చెందాయి.Source: Yahoo! Telugu: News | 29 Jun 2009 | 3:06 pm ఎమ్మెల్యే రామారావు ఆమరణ దీక్ష భగ్నంతనపై మోపిన కేసులను ఎత్తివేయాలని కోరుతూ పశ్చిమగోదావరి జిల్లా కోవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే టీవీ.రామారావు సోమవారం చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అనంతరం ఆయనను అరెస్టు చేసి గాంధీనగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.Source: Yahoo! Telugu: News | 29 Jun 2009 | 2:52 pm "అనుపమ్‌ఖేర్" కీలక పాత్రలో "మార్నింగ్‌వాక్"రెండు కుటుంబాల మధ్య జరిగే అందమైన కథ 'మార్నింగ్‌వాక్'. ఐనాక్స్ మోషన్ పిక్చర్ ప్రొడక్షన్స్‌పై తొలి చిత్రంగా వస్తున్న ఈ సినిమాలో అనుపమ్‌ఖేర్, షర్మీలా ఠాగూర్, రజిత్ కపూర్, దివ్యా దత్త ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ఈ సినిమా జూలై 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కథాపరంగా చూస్తే.. జారు మోహన్ (అనుపమ్ ఖేర్) కొల్‌కతలో ప్రోఫేసర్‌గా పనిచేస్తుంటాడు. కొన్ని కారణాల వల్ల తన నివాసాన్ని ముంబైకి మారుస్తాడు. ఓ రోజు మార్నింగ్‌వాక్ చేస్తుండుగా తన ఓల్డ్ స్టూడెంట్ మరియు ఫ్రెండ్ అయిన నీలిమ (షర్మిలా ఠాగూర్) కలుస్తుంది. జారుమోహన్‌కు నీలిమ కుటుంబంతో గాఢానుబంధం ఏర్పడుతుంది. ఈ సంఘటన అతని జీవితంలోనే గాక ఆ రెండు కుటుంబాలలో అనూహ్యమైన మలుపులకు దారి తీస్తుంది. ఈ నేపథ్యంలో "మార్నింగ్‌వాక్" తెరకెక్కనుంది.Source: Yahoo! Telugu: Entertainment | 29 Jun 2009 | 2:25 pm 143 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్స్టాక్ మార్కెట్ ప్రస్తుతం లాభాల్లో పయనిస్తోంది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 143 పాయింట్లు పుంజుకుని 14,908 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 54 పాయింట్లు బలపడి 4,430 వద్ద పయనిస్తోంది. ఇప్పటి వరకు మొత్తం 2,600 కంపెనీల వాటాలు ట్రేడ్ అవగా, 1,690 కంపెనీల వాటాలు లాభపడ్డాయి.Source: Yahoo! Telugu: News | 29 Jun 2009 | 2:25 pm ఐదుగురు సిబ్బందిని విడిచిపెట్టిన ఇరాన్ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని బ్రిటన్ దౌత్యకార్యాలయానికి చెందిన ఐదుగురు సిబ్బందిని ఆ దేశ అధికారిక యంత్రాంగం విడిచిపెట్టినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. బ్రిటన్ దౌత్యకార్యాలయంలో పనిచేస్తున్న స్థానిక సిబ్బందిని ఇరాన్ అధికారిక వర్గాలు ఆదివారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.Source: Yahoo! Telugu: News | 29 Jun 2009 | 1:49 pm గగుర్పొడిచే మైఖేల్ శవ రిపోర్టుమైఖేల్ శవపంచనామాలో గగుర్పొడిచే అంశాలెన్నో వెలుగులోకి వచ్చినట్లు న్యూయార్క్‌కి చెందిన ఓ పత్రిక వెల్లడించింది. మరణించేనాటికి మైఖేల్ భౌతిక పరిస్థితి అతి దారుణంగా ఉంది. జాక్సన్ పూర్తిగా ఎముకల గూడులా మారిపోయాడు. అతని కడుపులో మాత్రలు తప్ప ఇంకేమీ లేవు. అతని తలపై ఒక్క వెంట్రుక కూడా లేదు.Source: Yahoo! Telugu: News | 29 Jun 2009 | 1:45 pm శాంటాక్లారా వర్శిటీలో బాలకృష్ణ కుమార్తె డిస్టింక్షన్యువరత్న బాలకృష్ణ కుమార్తె, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి కోడలు బ్రాహ్మిణి కాలిఫోర్నియాలోని శాంటాక్లారా యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చేసి డిస్టింక్షన్ సాధించింది. డిస్టింక్షన్‌లో డిగ్రీ సాధించడమేగాక యూనివర్సిటీలో మూడు అవార్డుల్ని కూడా బ్రాహ్మిణి గెలుచుకున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 29 Jun 2009 | 1:26 pm నితిన్, ఇలియానాల "రెచ్చిపో" లోగో ఆవిష్కరణనితిన్, ఇలియానా నటిస్తున్న చిత్రానికి 'రెచ్చిపో' (ఫర్ లవ్) అనే పేరును ఖరారు చేశారు. ఈ చిత్ర లోగోను ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో నితిన్ ఆవిష్కరించారు. ఈ చిత్రాన్ని శ్రీ స్పెక్ట్రా మీడియా పతాకంపై జి.వి. రమణ నిర్మించగా, పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా గురించి నితిన్ మాట్లాడుతూ, షూటింగ్ దాదాపు పూర్తికావచ్చిందన్నారు. ఇంకా రెండుపాటలు, రెండురోజుల ప్యాచ్‌వర్క్ మిగిలి ఉందని చెప్పారు. ఈ చిత్రంలో రఘుబాబు ఎంటర్‌టైన్‌మెంట్ అద్భుతంగా వచ్చింది. అవార్డు వస్తుందనుకుంటున్నానని వివరించారు.Source: Yahoo! Telugu: Entertainment | 29 Jun 2009 | 12:56 pm "అమాయకుడు"గా వస్తోన్న 'వినాయకుడు'హ్యాపీడేస్, వినాయకుడు ఫేమ్ కృష్ణుడు కథానాయకుడిగా "అమాయకుడు" అనే సినిమా ప్రారంభమైంది. ఆక్టాగాన్ మూవీస్ పతాకంపై భారతిగణేష్ దర్శకుడిగా ఎం.బాలమురగన్ అనిల్ ఎస్.నాయర్, సుదర్శన్ శర్మలు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. తొలిషాట్‌కు సినీ నటుడు శ్రీహరి క్లాప్ కొట్టగా, నిర్మాత అనిల్ ఎస్.నాయర్ స్విచ్ఛాన్ చేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 29 Jun 2009 | 12:47 pm జూలై 3న వస్తోన్న "నింగి నేల నాదే"చైనాలోని ఓ అమ్మాయి రియల్ లైఫ్ ఆధారంగా రూపొందిన చిత్రాన్ని తెలుగులో "నింగి నేల నాదే"గా చావా సుధారాణి డబ్బింగ్ చేశారు. ఈ చిత్రాన్ని జూలై 3న విడుదల చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఫెంగ్ బెంజి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇంటర్నేషనల్ ఫిలింఫెస్టివల్‌లో అవార్డు కూడా సాధించింది.Source: Yahoo! Telugu: Entertainment | 29 Jun 2009 | 12:28 pm "అక్కడ ఎవడిగోల వాడిదే": చిరంజీవి''ఏడాదిన్నర అయ్యింది మీ అప్యాయతలు, మీ కేరింతలు చూసి. ఇంతమందిని, ఇండస్ట్రీని వదిలేసి వెళ్ళాల్సివస్తుందనుకోలేదు. ఇండస్ట్రీకి వస్తే సొంతింటికి వచ్చినట్లుంది" అని పీఆర్పీ అధినేత, మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఇక్కడ అందరూ ఒకరి బాగోగులు ఒకరు కోరుకుంటారు. అక్కడ ఎవడిగోలవాడిదే..." ఏదైనా చాలా మిస్ అయ్యాను. అంతా దైవనిర్ణంయ ఎలా జరగాలని ఉందో? అలానే జరుగుతుంది. నేను మళ్ళీ నటించాలని పరుచూరి వెంకటేశ్వరరావు అడిగారు. సినిమా చేయమన్నారు. కానీ కమిట్ అవ్వను. పరిస్థితులు వస్తే.. ఏమిటి అనేది చెబుతానని'' చిరు మగధీర ఆడియో వేడుకలో తెలిపారు.Source: Yahoo! Telugu: Entertainment | 29 Jun 2009 | 12:02 pm షాహిద్ కపూర్‌కి సేఫ్ సెక్స్ కావాలటనటులు అప్పుడప్పుడు సామాజిక కార్యక్రమాలలో పాలుపంచుకుంటుంటారు. అలాగే ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు తమ సినిమాల్లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తుంటారు. తాజాగా షాహిద్ కపూర్‌కు ఇదే ఆలోచన వచ్చిందట. అంతే... వెంటనే తను నటించిన కామినీ చిత్రంలో ఎయిడ్స్‌పై అవగాహన తెలియజేసే సన్నివేశాలను చొప్పించాలని దర్శకునితో చెప్పాడట.Source: Yahoo! Telugu: Entertainment | 29 Jun 2009 | 11:50 am బీహార్‌లో కూలిన బ్రిడ్జి: రైళ్ల సర్వీసులకు అంతరాయంబీహార్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమస్తిపురా డివిజన్‌లోని ఒరఖ్‌పూర్-నర్కతియాగంజ్ సెక్షన్‌లో రైల్వే బ్రిడ్జి కూలిపోయింది. దీంతో రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. బీహార్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వెస్ట్ చంప్రారణ్ జిల్లాలో ఈ బ్రిడ్జి కూలింది.Source: జాతీయ | 29 Jun 2009 | 10:33 am దాడుల కేసులో రాజ్‌థాక్రేకు బెయిల్ మంజూరుఉత్తర భారతీయులపై దాడి చేసిన కేసులో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్‌థాక్రేకు స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తిగత పూచీతో పాటు.. లక్ష రూపాయల బాండ్ సమర్పించడంతో ఆయనకు కళ్యాణ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.Source: జాతీయ | 29 Jun 2009 | 9:53 am ఎమ్మెల్యే రామారావు ఆమరణ దీక్ష భగ్నంతనపై మోపిన కేసులను ఎత్తివేయాలని కోరుతూ పశ్చిమగోదావరి జిల్లా కోవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే టీవీ.రామారావు సోమవారం చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అనంతరం ఆయనను అరెస్టు చేసి గాంధీనగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.Source: ఏపీ న్యూస్ | 29 Jun 2009 | 9:24 am ఆస్ట్రేలియా దాడులు: కేంద్రానికి సుప్రీం అక్షింతలుఆస్ట్రేలియాలోని భారతీయ విద్యార్థులపై జరుగుతున్న దాడుల పట్ల దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దాడుల పట్ల కేంద్ర అనుసరిస్తున్న వైఖరిని తప్పుపడుతూ, చీవాట్లు పెట్టింది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా దాడులు ఆగలేదని గుర్తు చేసింది.Source: జాతీయ | 29 Jun 2009 | 7:52 am టాలీవుడ్‌లో మళ్లీ "మెగా" ఎంట్రీప్రజారాజ్యం వ్యవస్థాపకుడు పద్మభూషణ్ చిరంజీవి తన మనస్సు మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. మళ్లీ వెండితెరపై మెగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తన కుమారుడు నటించిన "మగధీర" చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో చిరు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా ఉన్నాయి.Source: ఏపీ న్యూస్ | 29 Jun 2009 | 6:47 am కళ్యాణ్ కోర్టులో లొంగిపోయిన రాజ్‌థాక్రే!మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్‌థాక్రే సోమవారం ఉదయం కోర్టులో లొంగిపోయారు. 2008లో జరిగిన అల్లర్ల కేసుకు సంబంధించి ఆయన కళ్యాణ్ కోర్టు మేజిస్ట్రేట్ ఎదుట హాజరయ్యారు.Source: జాతీయ | 29 Jun 2009 | 6:42 am పీవీకి భారతరత్న ఇవ్వాలి : చిరంజీవి డిమాండ్బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు, దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి డిమాండ్ చేశారు.Source: ఏపీ న్యూస్ | 29 Jun 2009 | 5:40 am "గ్రేటర్" ఎన్నికలపై కాంగ్రెస్ కసరత్తు: మొయిలీ రాకఅసెంబ్లీ ఎన్నికల్లో లభించిన విజయంతో అధికార కాంగ్రెస్ పార్టీ మంచి ఊపు మీద ఉంది. దీంతో మరి కొద్ది రోజుల్లో జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా విజయభేరీ మోగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకోసం అవసరమైన కసరత్తులను ఇప్పటికే ఆ పార్టీ ముమ్మరం చేసింది.Source: ఏపీ న్యూస్ | 29 Jun 2009 | 5:37 am కేరళలో వెలుగుచూసిన రెండు స్వైన్ ఫ్లూ కేసులుస్వైన్ బాధిత రాష్ట్రాల్లో కేరళ కూడా చేరింది. ఇక్కడ తాజాగా రెండు కేసులు వెలుగు చూశాయి. అలాగే, దేశ వ్యాప్తంగా మరో ఆరు కేసులు వెలుగు చూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 96కు చేరుకుంది.Source: జాతీయ | 29 Jun 2009 | 5:23 am ముంబై దాడులకు స్థానికులు సహకరించారా...!గత ఏడాది నవంబర్ మాసం 26న ముంబైలో జరిగిన ఉగ్రవాదుల దాడులకు ముంబైలోని స్థానికులు సహకరించి ఉంటారని బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ న్యూస్ ఛానెల్ అనుమానం వ్యక్తం చేసింది.Source: జాతీయ | 29 Jun 2009 | 4:23 am కొత్త రాష్ట్రాలుగా విభజించాలి...వినతుల వెల్లువ!దేశంలోని పలు రాష్ట్రాలలోని వివిధ పార్టీలు తమ ప్రాంతాలను రాష్ట్రాలుగా విభజించాలని డిమాండ్లు అందాయని గృహ మంత్రిత్వశాఖ తెలిపింది.Source: జాతీయ | 29 Jun 2009 | 4:09 am కరీంనగర్‌లో అతిసారం: 50 మందికి అస్వస్థతకరీంనగర్ జిల్లాలో అతిసార వ్యాధి బారినపడి 50 మంది అస్వస్థతకు గురైయ్యారు. ప్రభుత్వ పాలనా యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా కరీంనగర్ జిల్లాలోని పలు గ్రామాల్లో అతిసార వ్యాధి ప్రబలుతోంది. కరీంనగర్ జిల్లా గంభీరావుపేట మండలం సముద్రలింగాపురం పంచాయతీ పరిధిలోని మల్లుపల్లె గ్రామంలో అతిసార వ్యాధి సోకి శనివారం 50 మంది మంచంపట్టారు.Source: ఏపీ న్యూస్ | 28 Jun 2009 | 12:38 pm తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌కు ప్రతిపక్ష నేతకొవ్వూరు ఎమ్మెల్యే రామారావుపై అధికార పక్షం వేధింపులు మానుకోవాలని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఆదివారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నా చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మేల్యేలను పోలీసులు అరెస్టు చేసి తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.Source: ఏపీ న్యూస్ | 28 Jun 2009 | 12:31 pm వైఎస్ ముఠా నాయకుడు: చంద్రబాబురాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కరుడగట్టిన ముఠా నాయకుడిలాగా ప్రవర్తిస్తున్నాడని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆదివారం సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ధర్నా నిర్వహించారు. వీరిని పోలీసులు తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.Source: ఏపీ న్యూస్ | 28 Jun 2009 | 12:22 pm దేశంలో 89కి చేరిన స్వైన్ ఫ్లూ కేసులుదేశంలో స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుంది. కొత్తగా మరో తొమ్మిది స్వైన్ ఫ్లూ కేసులు వెలుగుచూశాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నిర్ధారించబడిన స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య 89కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు ఆదివారం వెల్లడించారు.Source: జాతీయ | 28 Jun 2009 | 11:53 am దేశంలో కరువు పరిస్థితులు లేవు: పవార్దేశంలో కరువు పరిస్థితులు లేవని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ తెలిపారు. రుతుపవనాలు ఆశాజనకంగా లేకపోవడంతో దేశవ్యాప్తంగా రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. రుతుపవనాల జాప్యమైనప్పటికీ, దేశంలో కరువు పరిస్థితులు నెలకొని లేవని స్పష్టం చేశారుSource: జాతీయ | 28 Jun 2009 | 11:43 am మురికివాడలు లేని రాష్ట్రంగా తీర్చి దిద్దండి: వైఎస్2014 కల్లా రాష్ట్రాన్ని మురికి వాడలు లేని ప్రాంతంగా తీర్చి దిద్దాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర ఇచ్చిన నిధులతో చేపట్టిన పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి మురికి వాడల రహిత రాష్ట్రాన్ని రూపొందించాలని ఆయన సూచించారు. హైదరాబాద్‌లో వైఎస్ తన సచివాలయంలో మున్సిపల్ అధికారులను ఉద్ధేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.Source: ఏపీ న్యూస్ | 28 Jun 2009 | 10:44 am విదేశాల్లో భారతీయల కోసం డేటా బ్యాంక్విదేశాలకు వెళుతున్న భారతీయుల ఉపయోగార్థం కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మక డేట్ బ్యాంకు ప్రాజెక్టు చేపట్టింది. విదేశాల్లో ఇటీవల కొందరు భారతీయ విద్యార్థులపై వరుసగా దాడులు జరిగిన నేపథ్యంలో విదేశీ వ్యవహారాల శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.Source: జాతీయ | 28 Jun 2009 | 10:41 am
|