|
ఇరాన్: బ్రిటీష్ దౌత్యకార్యాలయ సిబ్బంది అరెస్ట్ఇరాన్లో ఈ నెల 12న జరిగిన వివాదాస్పద అధ్యక్ష ఎన్నికల అనంతరం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పటికీ సద్దుమణగలేదు. ఇరాన్‌లో అశాంతి నెలకొనడంపై ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి నెలకొన్న ఉద్రిక్తతలపై పశ్చిమదేశాలు, ఇరాన్ నేతల మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం జరుగుతోంది.Source: Yahoo! Telugu: News | 28 Jun 2009 | 4:37 pm ప్రధాన నగరాల్లోని వస్తువుల మార్కెట్ల ధరలుదేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో గల మార్కెట్లలో వస్తువుల ధరలు... కోల్హాపూర్ మార్కెట్‌లో చక్కెర ధర (100 కేజీలు) - రూ. 2,355 గుంటూరు మార్కెట్‌లో ఎండుమిరపకాయలు (100 కేజీలు) - రూ. 5,571 హజీరాబాద్ మార్కెట్‌లో సహజవాయువు (1ఎంఎంబీటీయు) - రూ. 199.10 ముంబాయి మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ (1బీబీఎల్) - రూ. 3,355Source: Yahoo! Telugu: News | 28 Jun 2009 | 4:23 pm మురికివాడలు లేని రాష్ట్రంగా తీర్చి దిద్దండి: వైఎస్2014 కల్లా రాష్ట్రాన్ని మురికి వాడలు లేని ప్రాంతంగా తీర్చి దిద్దాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర ఇచ్చిన నిధులతో చేపట్టిన పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి మురికి వాడల రహిత రాష్ట్రాన్ని రూపొందించాలని ఆయన సూచించారు. హైదరాబాద్‌లో వైఎస్ తన సచివాలయంలో మున్సిపల్ అధికారులను ఉద్ధేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.Source: Yahoo! Telugu: News | 28 Jun 2009 | 4:13 pm విదేశాల్లో భారతీయల కోసం డేటా బ్యాంక్విదేశాలకు వెళుతున్న భారతీయుల ఉపయోగార్థం కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మక డేట్ బ్యాంకు ప్రాజెక్టు చేపట్టింది. విదేశాల్లో ఇటీవల కొందరు భారతీయ విద్యార్థులపై వరుసగా దాడులు జరిగిన నేపథ్యంలో విదేశీ వ్యవహారాల శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.Source: Yahoo! Telugu: News | 28 Jun 2009 | 4:11 pm పాక్షిక ఓట్ల లెక్కింపుకు మౌసావి విముఖతఇరాన్లో ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించే శక్తివంతమైన గార్డియన్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన కమిటీకి మద్దతు ఇచ్చేందుకు ప్రతిపక్ష నేత, మాజీ ప్రధానమంత్రి మీర్ హుస్సేన్ మౌసావి నిరాకరించారు. ఈ నెల 12న జరిగిన వివాదాస్పద అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి జరిపే పాక్షిక రీకౌంటింగ్ కోసం గార్డియన్ కౌన్సిల్ ఈ కమిటీ ఏర్పాటుకు ఆదేశించింది.Source: Yahoo! Telugu: News | 28 Jun 2009 | 3:52 pm నాటో, రష్యా మిలిటరీ సంబంధాల పునరుద్ధరణగత ఏడాది జార్జియా యుద్ధం సందర్భంగా తెగిపోయిన నాటో- రష్యా మిలిటరీ సంబంధాల పునరుద్ధరణకు ఇరుపక్షాల మధ్య అంగీకారం కుదిరింది. నాటో, రష్యా విదేశాంగ మంత్రుల సమావేశంలో శనివారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.Source: Yahoo! Telugu: News | 28 Jun 2009 | 3:37 pm సల్వాజుడుం నేతను హత్య చేసిన మావోలుచత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఆదివారం మావోయిస్టులు సల్వాజుడుం ఉద్యమానికి చెందిన ఓ ప్రముఖ నేతను హత్య చేశారు. చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు వ్యతిరేక పౌర సాయుధ దళాన్ని సల్వాజుడుంగా పిలుస్తారు. ఈ దళానికి చత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఉంది.Source: Yahoo! Telugu: News | 28 Jun 2009 | 3:04 pm జాగువార్, లాండ్‌రోవర్ బ్రాండ్‌ల ఆవిష్కరణదేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఆదివారం భారత్‌లో జాగువార్, లాండ్‌రోవర్ కారు బ్రాండ్లను ఆవిష్కరించింది. అమెరికా కార్ల తయారీ దిగ్గజం ఫోర్డ్ నుంచి టాటా మోటార్స్ ఈ రెండు లగ్జరీ బ్రాండ్లను కొనుగోలు చేసింది.Source: Yahoo! Telugu: News | 28 Jun 2009 | 2:31 pm పాక్‌లో సరబ్‌జీత్ సింగ్‌కు కొత్త న్యాయవాదిపాకిస్థాన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ ఖైదీ సరబ్‌జీత్ సింగ్‌కు ఈ దేశ ప్రభుత్వం కొత్త న్యాయవాదిని ఏర్పాటు చేసింది. బాంబు పేలుళ్ల కేసులో దోషిగా నిర్ధారించబడి గత 18 ఏళ్లుగా జైలుజీవితం గడుపుతున్న సరబ్‌జీత్ సింగ్‌కు పాకిస్థాన్ తీవ్రవాద నిరోధక కోర్టు మరణ దండన విధించిన సంగతి తెలిసిందే.Source: Yahoo! Telugu: News | 28 Jun 2009 | 2:13 pm నేటి బులియన్ మార్కెట్ ధరలునేటి బులియన్ మార్కెట్‌లో బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి... హైదరాబాద్ 24 క్యారెట్ - రూ. 14,900 - రూ. 15,100, వెండి కిలో - రూ. 23,000 - రూ. 23,300. చెన్నై 24 క్యారెట్ - రూ. 14,715 - రూ. 14,775, వెండి కిలో - రూ. 25,390 - రూ. 23,700. విజయవాడ - రూ. 14,845 - రూ. 14,945, వెండి కిలో - రూ. 22,900 - రూ. 23,000.Source: Yahoo! Telugu: News | 28 Jun 2009 | 1:04 pm మురికివాడలు లేని రాష్ట్రంగా తీర్చి దిద్దండి: వైఎస్2014 కల్లా రాష్ట్రాన్ని మురికి వాడలు లేని ప్రాంతంగా తీర్చి దిద్దాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర ఇచ్చిన నిధులతో చేపట్టిన పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి మురికి వాడల రహిత రాష్ట్రాన్ని రూపొందించాలని ఆయన సూచించారు. హైదరాబాద్‌లో వైఎస్ తన సచివాలయంలో మున్సిపల్ అధికారులను ఉద్ధేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.Source: ఏపీ న్యూస్ | 28 Jun 2009 | 10:44 am విదేశాల్లో భారతీయల కోసం డేటా బ్యాంక్విదేశాలకు వెళుతున్న భారతీయుల ఉపయోగార్థం కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మక డేట్ బ్యాంకు ప్రాజెక్టు చేపట్టింది. విదేశాల్లో ఇటీవల కొందరు భారతీయ విద్యార్థులపై వరుసగా దాడులు జరిగిన నేపథ్యంలో విదేశీ వ్యవహారాల శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.Source: జాతీయ | 28 Jun 2009 | 10:41 am సల్వాజుడుం నేతను హత్య చేసిన మావోలుచత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఆదివారం మావోయిస్టులు సల్వాజుడుం ఉద్యమానికి చెందిన ఓ ప్రముఖ నేతను హత్య చేశారు. చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు వ్యతిరేక పౌర సాయుధ దళాన్ని సల్వాజుడుంగా పిలుస్తారు. ఈ దళానికి చత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఉంది.Source: జాతీయ | 28 Jun 2009 | 9:34 am కేంద్రం వద్ద పది కొత్త రాష్ట్రాల డిమాండ్లుదేశంలో పది కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చిన ప్రతిపాదనలు కేంద్ర హోంశాఖ వద్ద ఉన్నాయి. హోంశాఖకు పది కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి డిమాండ్‌లు వచ్చాయని అధికారిక వర్గాలు తెలిపాయి. వీటిలో బీహార్‌లో మిథిలిలాంచల్ అనే కొత్త రాష్ట్రం ఏర్పాటు డిమాండ్ కూడా ఉంది.Source: జాతీయ | 28 Jun 2009 | 7:17 am వాతావరణ మార్పు ఉగ్రవాదులకు సాయం కావచ్చువాతావరణ మార్పు ఉగ్రవాదాల కార్యకలాపాలకు మరింతగా ఉపకరించే అవకాశం ఉందని ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త ఆర్‌కే పచూరి అభిప్రాయపడ్డారు. భారత ఉపరితల వాతావరణంలో మార్పుతో ఉత్తర హిమాలయాల్లో మంచు కరుగుతోందని దీంతో సముద్ర మట్టం కూడా పెరుగుతోందన్నారు.Source: జాతీయ | 28 Jun 2009 | 5:48 am బెంగాల్: రామ్‌గఢ్ భద్రతా దళాల కైవసంపశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని పశ్చిమ మిడ్నపూర్ జిల్లాలో మావోయిస్టుల ఆధీనంలోని ఓ కీలక ప్రాంతాన్ని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. జిల్లాలోని సమస్యాత్మక లాల్‌గఢ్ ప్రాంతంలో భద్రతా సిబ్బంది గత వారం రోజులుగా మావోయిస్టుల ఆధీనంలోని ప్రదేశాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.Source: జాతీయ | 28 Jun 2009 | 5:20 am రెండో ఇన్నింగ్స్‌లో నీలవేణిగా వస్తున్న ఆర్తీఆర్తీ అగర్వాల్ "నీలవేణి"గా నటిస్తోన్న చిత్రం శనివారం రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. ఈ చిత్రంలో ఆర్తి సరసన ముకుల్‌దేవ్ నటిస్తున్నాడు. పోసాని కృష్ణ మురళి కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఎంజీఆర్ కంబైన్స్ పతాకంపై గిరీష్ కుమార్ నిర్మిస్తుండగా భరత్ పారేపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. తొలిషాట్‌కు రామానాయుడు క్లాప్ కొట్టగా, డి. సురేష్ బాబు స్విచ్చాన్ చేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 27 Jun 2009 | 8:01 pm నగ్నంగా నటించమని.. హాలీవుడ్ అడిగిందట!!నగ్నంగా నటించే సెక్స్ బాంబులు, ఓవర్ ఎక్స్‌పోజింగ్ చేసే సెక్సీ భామలు, బికినీలేసుకుని ఈత కొలనులో చేపపిల్లల్లా ఈదే రమణులు అందరూ చెప్పేమాట- "సన్నివేశం అడిగింది- అందుకే చేశామ"ని. ఇప్పుడు ఇదేమాటను బాలీవుడ్ సెక్సిణి నందనాసేన్ కూడా చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు భోగట్టా. ఇదిలావుంటే నందనా సేన్ అందాలకు గులామైన ఎందరో హాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆమెను తమ సినిమాలలో నటింపజేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారట. ఇందులో భాగంగా ఆమె ఇప్పటికే ఎన్నో హాలీవుడ్ చిత్రాలను అంగీకరించిందట. వీటిలో ఒకటి ఇటాలియన్ నిర్మాత చిత్రం కూడా ఉందట.Source: Yahoo! Telugu: Entertainment | 27 Jun 2009 | 3:14 pm తెరాస అసమ్మతివాదులపై సస్పెన్షన్ రద్దు: కేసీఆర్తెలంగాణ రాష్ట్ర సమితి అసమ్మతి నాయకులపై పార్టీ వేసిన బహిష్కరణ వేటును ఉపసంహరించుకున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు ప్రకటించారు. శనివారం పార్టీలో కొనసాగిన కీలక పరిణామాల అనంతరం కేసీఆర్ బహిష్కృత నేతలతో కలిసి తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 27 Jun 2009 | 1:47 pm ములాయం సింగ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపాటుఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మాయావతి హయాంలో ప్రతిష్టించిన అన్ని విగ్రహాలను కూల్చుతామని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీ మండిపడింది.Source: జాతీయ | 27 Jun 2009 | 1:43 pm మహిళా బిల్లులో ఉప కోటా కోరుతున్న మహిళలుకేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టాలని భావిస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లులో ఉప కోటా (సబ్ కోటా) బిల్లును ప్రవేశపెట్టాలని పలు ముస్లిం, దళిత సంఘాలకు చెందిన మహిళలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత రూపంలో మహిళా బిల్లును ప్రవేశపెడితే ఉన్నతవర్గాలకు చెందిన మహిళలే లబ్ధి పొందుతారని వారు అభిప్రాయపడ్డారు.Source: జాతీయ | 27 Jun 2009 | 12:55 pm బాబ్లీ వ్యవహారంపై మహారాష్ట్రకు లీగల్ 'నోటీస్'గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టు వ్యవహారంపై ఆ రాష్ట్రానికి లీగల్ నోటీస్ పంపించినట్లు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య స్పష్టం చేశారు. రాష్ట్రంలోని జలవనరులపై ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 27 Jun 2009 | 12:19 pm "ఎవరైనా ఎప్పుడైనా" తప్పుచేయొచ్చు!రొటీన్‌గా తెలుగు సినిమాల్లో హీరోకు ఉండే డ్యూటీనే... పెద్దగా పనుండదు. హాయిగా ఎంజాయ్ చేస్తూ తిరిగే యువకుడు వెంకట్(వరుణ్‌సందేశ్). చిన్నా పెద్దా తేడాలేకుండా పరాచకాలు ఆడుతూంటాడు. అమ్మమ్మకు బాగోలేకపోతే ఆసుపత్రిలో సపర్యలు చేస్తాడు. అదే ఆసుపత్రిలో పక్కనే మధుమిత (విమలారామన్) తన నానమ్మకు బాగోకపోతే వస్తుంది. ఆమెను ఎలాగైనా ప్రసన్నం చేసుకోవాలని వెంకట్ ప్రయత్నాలు చేస్తాడు. కానీ వెంకట్ చేసిన పొరపాటు వారి కుటుంబంలో కల్లోలం సృష్టిస్తుందిSource: Yahoo! Telugu: Entertainment | 27 Jun 2009 | 11:57 am ఉత్తరాఖండ్ సీఎంగా పొక్రియాల్ ప్రమాణ స్వీకారంఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రమేష్ పొక్రియాల్ నిషాంక్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో ఆ రాష్ట్ర గవర్నర్ బీఎల్.జోషీ ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, పార్టీ సీనియర్ నేతలు ఎంఎం.జోషీ, యోగా గురువు రాందేవ్ బాబా, పర్మార్థ్ నికేతన్ ఆశ్రమం ముని చిదానంద్ తదితరులు హాజరయ్యారు.Source: జాతీయ | 27 Jun 2009 | 11:28 am దీపిక వెళ్లింది.. అక్కడ టెంపరేచర్ పెరిగిందియువ హృదయాలను అవలీలగా కొల్లగొట్టగల నున్ననైన సన్నజాజి ముద్దుగుమ్మ దీపికా పదుకునే ఎక్కడికి వెళితే అక్కడ టెంపరేచర్ ఎకాఎకిన పెరిగిపోతోందట. ఇదేదో జ్వరం లాంటిదనుకునేరు. ఎండలట.. దీపిక పదుకునే ఎక్కడ అడుగుపెడితే చాలు అక్కడ బండలు పగిలే ఎండలు కాస్తున్నాయట. ఇటీవల ఢిల్లీలో ఓ వాచీల కంపెనీ దీపికా పదుకునేతో తమ వాచ్ షో రూమ్‌ను ప్రారంభించాలని ఆమెను ఆహ్వానించిందట. అంతకుముందు రోజు వరకూ కాస్త చల్లగా ఉన్నదనిపించిన ఢిల్లీ, పదుకునే రావడంతో మహా వేడెక్కిందట. ఇదిలావుంటే పదుకునేను చూసేందుకు కుర్రకారు ఆ షాపు వద్దకు తోసుకుంటూ వచ్చి ఆమెపై ఎగబడ్డారట. టీనేజ్ కుర్రకారు అందరూ ఒకేచోట గుంపుగా చేరడంతో బయట వేడీ, లోపల వేడీ అంతా కలిసి పదుకునేకు చమటలు పట్టించాయట. దీంతో "అయ్య బాబోయ్... నేనీ వేడిని తట్టుకోలేను.." అంటూ దీపిక అక్కడ నుంచి ఉడాయించిదట. మరి సన్నూ, సన్ ఆఫ్‌లతో పెట్టుకుంటే అంతే మరి...Source: Yahoo! Telugu: Entertainment | 27 Jun 2009 | 11:10 am దసరా తర్వాత ఆకస్మిక తనిఖీలు: వైఎస్ఆధికారుల పనితీరును పరిశీలించేందుకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తెలిపారు. దసరా పండుగ తర్వాత ఈ తనిఖీలను ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 27 Jun 2009 | 9:55 am దేశ రాజధానిలో మరో యువతిపై గ్యాంగ్ రేప్దేశ రాజధాని న్యూఢిల్లీలో సామూహిక అత్యాచారాల సంఖ్య పెరుగుతోంది. ఇక్కడ మహిళలపై ఎక్కువ సంఖ్యలో అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి. శుక్రవారం కూడా ఒక యువతి సామూహిక అత్యాచారానికి గురైంది.Source: జాతీయ | 27 Jun 2009 | 9:47 am
|