మైఖేల్ జాక్సన్ అప్పులు రూ. 2,500 కోట్లు

కింగ్ ఆఫ్ పాప్ మైఖేల్ జాక్సన్‌ జీవితం ఏమాత్రం సాఫీగా సాగలేదంటున్నారు అతని సన్నిహితులు. అతనికి సుమారు రెండున్నరవేల కోట్ల రూపాయలు దాకా అప్పులుకూడా ఉన్నాయని అతని సన్నిహితులిచ్చిన సమాచారం.
Source: Yahoo! Telugu: News | 26 Jun 2009 | 7:30 pm

త్వరలో ప్రాంతీయ విమానాశ్రయాలకు బిడ్డింగ్‌

రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్‌, కర్నూలు, రాజమండ్రి, తాడేపల్లిగూడెంలలో త్వరలో ఏర్పాటు చేయనున్న ప్రాంతీయ విమానాశ్రయాలకు బిడ్డింగ్‌ ప్రక్రియ చేపట్టనున్నట్లు మౌళిక సదుపాయాల ఉన్నత స్థాయి అధికారులు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 26 Jun 2009 | 7:06 pm

అవంతా మీడియా సృష్టే: మిజోరాం సీఎం తన్హావ్లా

తమ దేశంలో కూడా తాను జాతివివక్షను ఎదుర్కొన్నట్టు మీడియాలో వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని మిజోరాం ముఖ్యమంత్రి లాల్ తన్హావ్లా వివిరణ ఇచ్చారు. తన మాటలను మీడియా వక్రీకరించిందని పేర్కొన్నారు.
Source: Yahoo! Telugu: News | 26 Jun 2009 | 6:39 pm

విజయవాడలో "కరెంట్‌" ప్లాటినం డిస్క్‌వేడుక

యంగ్ హీరో సుశాంత్, స్నేహా ఉల్లాల్ హీరోహీరోయిన్లుగా నటించిన "కరెంట్" చిత్రం ట్రిపుల్ ప్లాటినం డిస్క్ వేడుకకు చేరువైంది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ నెల 28న సుశాంత్‌ 'కరెంట్‌' చిత్రం ట్రిపుల్‌ ప్లాటినం డిస్క్‌వేడుకను వైభవంగా నిర్వహించనున్నట్లు చిత్ర నిర్మాత శ్రీనివాసరావు, నాగసుశీల తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 26 Jun 2009 | 6:25 pm

తెలుగు వెబ్‌సైట్‌లోకి "రాజశ్రీ మీడియా"

హిందీలో పలు సీరియల్స్‌, సినిమాలు నిర్మించిన రాజశ్రీ మీడియా సంస్థ తెలుగు.కామ్‌ పేరుతో ఇంటర్నెట్‌ రంగంలోకి ప్రవేశించింది. మూవీమొగల్‌ డా. డి. రామానాయుడు ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎ. బర్‌జాత్యా తెలియజేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 26 Jun 2009 | 6:15 pm

ఉదయ్‌కిరణ్, శ్వేతబసు జంటగా కొత్త చిత్రం

టాలీవుడ్ యంగ్ హీరో ఉదయ్‌కిరణ్‌ చాలాకాలం తర్వాత నటుడిగా తన పుట్టినరోజును శుక్రవారంనాడు జరుపుకున్నారు. ఉదయ్‌కిరణ్, శ్వేతబసుప్రసాద్‌ కాంబినేషన్‌లో ఓ కొత్త చిత్రం తెరపైకి రాబోతుంది. ఈ సినిమా విశేషాలను ఉదయ్‌కిరణ్ పుట్టిన రోజు నాడే ప్రకటించడం విశేషం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బర్త్ డే ఫంక్షన్లో ఉదయ్ కిరణ్ కేక్ కట్ చేశారు. అనంతరం కేక్‌ముక్కను హీరోయిన్ శ్వేతబసు ఉదయ్‌కు తినిపించింది.
Source: Yahoo! Telugu: Entertainment | 26 Jun 2009 | 6:02 pm

తెలంగాణ ఏర్పాటుకు వైఎస్ అడ్డంకి: కేసీఆర్

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ఒక్కరే అడ్డుకట్ట వేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు ఆరోపించారు. ఆరునూరైనా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Source: Yahoo! Telugu: News | 26 Jun 2009 | 5:53 pm

డీఎస్ సమక్షంలో బెజవాడ కాంగ్రెస్‌లో రగడ

కృష్ణ జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశం రసాభాసాగా మారింది. పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ సమక్షంలోనే కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో డీఎస్ సమీక్షా సమావేశం నుంచి అర్థాంతరంగా నిష్క్రమించారు.
Source: Yahoo! Telugu: News | 26 Jun 2009 | 5:43 pm

చెరకు మద్దతు ధరకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చెరకు మద్దతు ధర క్వింటాల్‌ రూ. 107.76లకి ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ సంఘం అనుమతించింది. అదే నిరుడు ఆర్థిక సంవత్సరంలో ఇదే సీజన్‌కు చక్కెరకు మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 81.18లుగా ఉండింది.
Source: Yahoo! Telugu: News | 26 Jun 2009 | 5:40 pm

నేను ఏడ్వటాన్ని ఆపలేను: మడోన్నా

పాప్ ప్రపంచపు రారాజు మైఖేల్ జాక్సన్ మరణ వార్త తన హృదయాన్ని కలచివేసిందని పాప్ స్టార్ మడోన్నా పేర్కొన్నది. జాక్సన్ భౌతికంగా లేకపోయినా తన మనసు ఎప్పుడూ మైఖేల్‌ను స్మరిస్తూనే ఉంటుందని చెప్పింది. ప్రపంచం ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయింది. అయితే మైఖేల్ తన సంగీతం రూపంలో ప్రతి ఒక్కరి మనసులో చిరస్మరిణీయులుగానే ఉంటారని మడోన్నా గద్గద స్వరంతో చెప్పింది. మైఖేల్ జాక్సన్ కుటుంబ సభ్యులకు మడోన్నా తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.
Source: Yahoo! Telugu: Entertainment | 26 Jun 2009 | 5:32 pm

కంధమాల్ బాధితులకు హోం మంత్రి క్షమాపణ

ఒరిస్సా రాష్ట్రంలోని కంధమాల్‌లో గత యేడాది చోటు చేసుకున్న ఘర్షణలకు సంబంధించిన బాధితులకు కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం క్షమాపణలు చెప్పారు. రెండు రోజుల పాటు ఒరిస్సాలో పర్యటిస్తున్న పీసీ.. బాధితుల కోసం ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాల్లో ఒకదాన్ని ఆయన సందర్శించి, బాధితులను పరామర్శించారు.
Source: Yahoo! Telugu: News | 26 Jun 2009 | 5:19 pm

కేసుల పరిష్కారానికి సత్వర చర్యలు: మొయిలీ

దేశ వ్యాప్తంగా కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్టు కేంద్ర న్యాయ శాఖామంత్రి వీరప్ప మొయిలీ తెలిపారు. ఇందులోభాగంగా ఉదయం, సాయంత్రం వేళల్లో పని చేసే కోర్టులను ఏర్పాటు చేయనున్నట్టు ఆయన శుక్రవారం వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 26 Jun 2009 | 4:47 pm

ఆస్ట్రేలియాలో నాలుగో స్వైన్ ఫ్లూ మరణం

ఆస్ట్రేలియాలో గడిచిన వారం రోజుల్లో నలుగురు పౌరులు స్వైన్ ఫ్లూ వ్యాధి బారినపడి మరణించారు. తాజాగా 71 ఏళ్ల మహిళ ఒకరు స్వైన్ ఫ్లూ వ్యాధి కారణంగా అనారోగ్యంతో మృతి చెందారు. దేశంలో ఇది నాలుగో స్వైన్ ఫ్లూ మరణమని ఆస్ట్రేలియా అధికారిక వర్గాలు తెలిపాయి.
Source: Yahoo! Telugu: News | 26 Jun 2009 | 4:44 pm

వారాంతంలో భారీగా లాభపడ్డ సెన్సెక్స్

స్టాక్ మార్కెట్ వారాంతంలో భారీ లాభాలతో ముగిసింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 419 పాయింట్లు పుంజుకుని 14,765 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 134 పాయింట్లు లాభపడి 4,376 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 2.92 శాతం, నిఫ్టీ 3.15 శాతం చొప్పున వృద్ధి చెందాయి.
Source: Yahoo! Telugu: News | 26 Jun 2009 | 4:42 pm

ఇకపై ఆస్కార్ నామినేషన్‌కు 10 చలన చిత్రాలు

ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు కోసం ఇకపై పది చలన చిత్రాలను నామినేట్ చేయనున్నారు. ఈ ఏడాది నుంచి ఆస్కార్ ఉత్తమ చలన చిత్రాల విభాగంలో నామినేట్ చేస్తారు. ఇప్పటివరకు 5 చిత్రాలను మాత్రమే నామినేటే చేసేవారు. అయితే ఈ విభాగంలో పోటీ తీవ్రంగా ఉండటంతోనే ఈ ఏడాది నుంచి 10 సినిమాలను నామినేట్ చేయనున్నట్లు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ సైన్స్ అధ్యక్షుడు సిడ్ గానిస్ వెల్లడిచారు. మిగిలిన విభాగాల్లో ఎప్పటిలాగానే ఐదేసి చిత్రాలనే నామినేట్ చేస్తారని గానిస్ చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 26 Jun 2009 | 3:51 pm

"గౌరి పండిట్" పర్సనల్ టచ్

గోపిచంద్ హీరోగా నటించిన "ఆంధ్రుడు" సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన అందాల ముద్దుగుమ్మ గౌరి పండిట్. అర్చనగా ఆంధ్రుడులో కనిపించిన గౌరి పండిట్.. తన నటనా ప్రతిభతో అగ్రహీరోయిన్ల సరసన చేరింది. తెలుగు తెరపై హోమ్లీగర్ల్‌గా కనిపించే గౌరి పండిట్, తాజాగా అల్లరి నరేష్ హీరోగా నటించే "ఆకాశరామన్న" చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. అదేవిధంగా.. "హౌస్‌ఫుల్" చిత్రంలోనూ కథానాయికగా నటిస్తోంది. పూర్తిపేరు: గౌరి పండిట్ముద్దుపేరు : గౌరి,నటించిన చిత్రాలు : మూడు,అందం రహస్యం: వ్యాయామం, స్విమ్మింగ్, తీసుకునే ఆహారం: హెల్తీఫుడ్.
Source: Yahoo! Telugu: Entertainment | 26 Jun 2009 | 3:15 pm

షారూక్ చిత్రంలో కో స్టార్‌గా "నల్ల సూరీడు"

ఐపీఎల్‌లో క్లీన్ బౌల్డ్ అయినా బాలీవుడ్‌లో మాత్రం ఫుల్‌ఫామ్‌లోకి రాబోతున్నాడు కింగ్ ఖాన్. ఈ ఖాన్ నటించే తదుపరి చిత్రంలో కో స్టార్‌గా నల్లజాతి సూరీడు బరాక్ ఒబామా నటించే అవకాశం ఉంది. అయితే, అతని డేట్స్ కోసం షారూక్ చిత్రం దర్శకుడు కరణ్ జోహార్ తీవ్రంగా కృషి చేస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 26 Jun 2009 | 3:12 pm

ఒకే యాత్రతో "టాప్"లో నిలిచిన మడోన్నా

ప్రముఖ పాప్ మహారాణి మడోన్నా ప్రపంచంలోనే అత్యంత సంపన్నురాలైన పాప్ గాయనిగా నిలిచింది. జూన్ 2008 నుంచి జూన్ 2009 మధ్య కాలంలో మడోన్నా ఏకంగా రూ.528 కోట్లు సంపాదించిందని ఫోర్బ్స్ పత్రిక సర్వేలో తేలింది.ఇదే ఫోర్బ్స్ జాబితాలో సెలీన్ డయాన్, బెయాన్స్ నోల్స్‌లు అనే పాప్ గాయనీమణులు మడోన్నా తరువాతి స్థానాల్లో నిలిచారు. అదేవిధంగా గాయకులు బ్రూస్ స్ప్రింగ్ స్టీన్, కెన్సీ చెస్నీలు నాలుగైదు స్థానాల్లో నిలిచారట.
Source: Yahoo! Telugu: Entertainment | 26 Jun 2009 | 2:12 pm

మైఖేల్ జాక్సన్: పాప్ సంగీతానికి చిరునామా

మైఖేల్ జోసఫ్ జాక్సన్. ఈ పేరు కొన్నేళ్లపాటు పాప్ సంగీత ప్రపంచాన్ని శాసించింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సంగీత ప్రియులను పులకింపజేసింది. పాప్ సంగీత ప్రపంచపు రారాజుగా ఎన్నో ఏళ్లు అభిమానాలు నీరాజనాలు అందుకున్న మైఖేల్ జాక్సన్ గురించి ఎంత చెప్పుకున్నా, ఆయన జీవితం మొత్తాన్ని స్పృశించడం సులభసాధ్యం కాదు.
Source: Yahoo! Telugu: Entertainment | 26 Jun 2009 | 1:34 pm

అవంతా మీడియా సృష్టే: మిజోరాం సీఎం తన్హావ్లా

తమ దేశంలో కూడా తాను జాతివివక్షను ఎదుర్కొన్నట్టు మీడియాలో వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని మిజోరాం ముఖ్యమంత్రి లాల్ తన్హావ్లా వివిరణ ఇచ్చారు. తన మాటలను మీడియా వక్రీకరించిందని పేర్కొన్నారు.
Source: జాతీయ | 26 Jun 2009 | 1:09 pm

తెలంగాణ ఏర్పాటుకు వైఎస్ అడ్డంకి: కేసీఆర్

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ఒక్కరే అడ్డుకట్ట వేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు ఆరోపించారు. ఆరునూరైనా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 26 Jun 2009 | 12:25 pm

డీఎస్ సమక్షంలో బెజవాడ కాంగ్రెస్‌లో రగడ

కృష్ణ జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశం రసాభాసాగా మారింది. పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ సమక్షంలోనే కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో డీఎస్ సమీక్షా సమావేశం నుంచి అర్థాంతరంగా నిష్క్రమించారు.
Source: ఏపీ న్యూస్ | 26 Jun 2009 | 12:14 pm

అంతర్జాతీయ స్థాయిలో 'ఓ మై గాడ్‌'

అంతర్జాతీయ ప్రమాణాలతో థాయ్‌లాండ్‌తోపాటు పలు ప్రాంతాల్లో మన తెలుగు చిత్రాన్ని ప్రదర్శించేందుకు వైట్‌ లోటస్‌ సంస్థ సన్నాహాలు చేస్తోంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన యోగ గురువు, మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం సంపాదించిన కమల్‌ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి 'ఓ మై గాడ్‌' అనే పేరు పెట్టారు.
Source: Yahoo! Telugu: Entertainment | 26 Jun 2009 | 11:55 am

కంధమాల్ బాధితులకు హోం మంత్రి క్షమాపణ

ఒరిస్సా రాష్ట్రంలోని కంధమాల్‌లో గత యేడాది చోటు చేసుకున్న ఘర్షణలకు సంబంధించిన బాధితులకు కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం క్షమాపణలు చెప్పారు. రెండు రోజుల పాటు ఒరిస్సాలో పర్యటిస్తున్న పీసీ.. బాధితుల కోసం ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాల్లో ఒకదాన్ని ఆయన సందర్శించి, బాధితులను పరామర్శించారు.
Source: జాతీయ | 26 Jun 2009 | 11:52 am

కేసుల పరిష్కారానికి సత్వర చర్యలు: మొయిలీ

దేశ వ్యాప్తంగా కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్టు కేంద్ర న్యాయ శాఖామంత్రి వీరప్ప మొయిలీ తెలిపారు. ఇందులోభాగంగా ఉదయం, సాయంత్రం వేళల్లో పని చేసే కోర్టులను ఏర్పాటు చేయనున్నట్టు ఆయన శుక్రవారం వెల్లడించారు.
Source: జాతీయ | 26 Jun 2009 | 11:19 am

ముంబైలో 30న ఎన్.ఎస్.జి కేంద్రం ప్రారంభం

దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో తలపెట్టిన నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కేంద్రాల కార్యకలాపాలు వచ్చే వారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఒక్కో కేంద్రంలో 241 మంది ఎన్.ఎస్.జి కమెండోలు విధులు నిర్వహిస్తారు. తీవ్రవాద నిరోధక, హైజాక్ నిరోధక కార్యకలాపాల్లో పాల్గొనడం ఈ విర ప్రధాన కర్తవ్యం.
Source: జాతీయ | 26 Jun 2009 | 9:17 am

మైఖేల్ జాక్సన్: పాప్ సంగీతానికి చిరునామా

మైఖేల్ జోసఫ్ జాక్సన్. ఈ పేరు కొన్నేళ్లపాటు పాప్ సంగీత ప్రపంచాన్ని శాసించింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సంగీత ప్రియులను పులకింపజేసింది. పాప్ సంగీత ప్రపంచపు రారాజుగా ఎన్నో ఏళ్లు అభిమానాలు నీరాజనాలు అందుకున్న...
Source: వినోదం | 26 Jun 2009 | 8:47 am

జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి వైఎస్ హితబోధ

జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి హితబోధ చేశారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాల అమల్లో మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు.
Source: ఏపీ న్యూస్ | 26 Jun 2009 | 8:01 am

తెలంగాణాపై తెదేపాలో స్పష్టత రావాలి: తలసాని

తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సృష్టించిన తుఫాను ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. మరో రెండు నెలల్లో జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముందే ప్రత్యేక తెలంగాణాపై తెలుగుదేశం పార్టీ ఓ స్పష్టతకు రావాలని ఆ తలసాని అభిప్రాయపడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 26 Jun 2009 | 7:40 am

బాబూ.. చిరుని చూసి నేర్చుకో: రోశయ్య

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు రాష్ట్ర ఆర్థిక మంత్రి కొణిజేటి రోశయ్య చురక అంటించారు. పార్టీని ఎలా నడిపించాలో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని చూసి నేర్చుకోవాలని ఆయన బాబుకు హితవు పలికారు.
Source: ఏపీ న్యూస్ | 26 Jun 2009 | 7:10 am

లోక్‌సత్తా పార్టీకి "ఈల" గుర్తు కేటాయింపు

మరో రెండు నెలల్లో జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో లోక్‌సత్తా పార్టీకి ఈల గుర్తును రాష్ట్ర ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ ఎన్నికల వరకే ఈ గుర్తును కేటాయిస్తున్నట్టు ఈసీ తన ప్రకటనలో స్పష్టం చేసింది.
Source: ఏపీ న్యూస్ | 26 Jun 2009 | 6:56 am

ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో భారీ ఎత్తున "వరుణ యాగం"

వచ్చేనెల 2, 3, 4 తేదీల్లో హైదరాబాదులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో భారీ ఎత్తున "వరుణ యాగం" నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పుష్కలంగా వర్షాలు కురవాలని కోరుతూ.. తిరుమల-తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ వరుణయాగం జరుగుతుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి గాదె వెంకటరెడ్డి విలేకరులతో తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 26 Jun 2009 | 6:47 am

యూఐడీఏఐ ఛైర్మన్‌గా నందన్ నీలేకని

దేశ పౌరులందరికీ జారీ చేసే బహుముఖ ప్రయోజన గుర్తింపు కార్డుల (యూనిక్ ఐడెంటిఫికేషన్ డేటాబేస్ అథార్టీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ)ను రూపొందించే సంస్థ ఛైర్మన్‌గా ఇన్ఫోసిస్ కో-ఛైర్మన్ నందన్ ఎం.నీలేకనిని ప్రధాని మన్మోహన్ సింగ్ నియమించారు.
Source: జాతీయ | 26 Jun 2009 | 6:41 am

"బీచ్ కార్నివాల్స్"తో సందడి చేసే సుందర దీవి

పక్షుల కిలకిలా రావాలు, ఎటువైపు చూసినా కనువిందు చేసే పచ్చదనం, పూల సుగంధ పరిమళాలు కలగలిపిన స్వచ్ఛమైనగాలి, సముద్ర తీరం హొయలు... వీటన్నింటినీ కలగలిపి చెప్పాలంటే వర్ణించటం చాలా కష్టం. అయితే, స్వయంగా ఆస్వాదించాలంటే మాత్రం, మన దేశ పటానికి చివర్లో చిన్న దీవి లాగా కనిపించే దేశమైన "శ్రీలంక"కు వెళ్ళాల్సిందే మరి..!
Source: వినోదం | 26 Jun 2009 | 5:48 am

వన్ మినిట్‌కి ఢిల్లీకి రైలుందట!

గురువుగారు: శిష్యా! నేను ఢిల్లీకి వెళ్ళాలి, రైలెంతకుందో ఫోన్ చేసి కనుక్కో! శిష్యుడు: సరేనండీ.
Source: వినోదం | 26 Jun 2009 | 5:23 am

ఏనుగును ముంచేయి రా..!

ఒక కొలనులో కొన్ని చీమలు ఈదుతున్నాయి. అంతలో ఏనుగులు కొన్ని వచ్చి ఆ కొలనులో దుమికాయి.
Source: వినోదం | 26 Jun 2009 | 5:19 am

అస్సోం గవర్నర్ ఎస్.సి.మాథూర్ కన్నుమూత

అస్సోం రాష్ట్ర గవర్నర్ శివ చరణ్ మాథూర్ గురువారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన న్యూఢిల్లీలోని ఎస్కార్ట్స్ హార్ట్ ఇనిస్టిట్యూట్‌లో చేరి చికిత్స పొందుతూ వచ్చారు. 83 సంవత్సరాల మాథూర్‌ను గురువారం సాయంత్రమే ఇంటికి డిశ్చార్జ్ చేశారు.
Source: జాతీయ | 26 Jun 2009 | 5:11 am

ముంబయి అనుమానితులను అప్పగించం: పాక్

ముంబయి ఉగ్రవాద దాడులకు సంబంధించిన అనుమానితులెవరినీ భారత్‌కు అప్పగించబోమని పాకిస్థాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. గత ఏడాది ముంబయి మహానగరంలో ఉగ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన దాడుల్లో 180 మందికిపైగా మృతి చెందిన సంగతి తెలిసిందే.
Source: జాతీయ | 26 Jun 2009 | 4:49 am

దేశంలో మరో ఐదుగురికి స్వైన్ ఫ్లూ వ్యాధి

ప్రపంచ దేశాలను వణికిస్తున్న స్వైన్ ఫ్లూ వ్యాధి దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరిస్తోంది. గురువారం కొత్తగా మరో ఐదు స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక కేసు దేశ రాజధానిలోనే వెలుగుచూడగా, గూర్గావ్‌లో రెండు కేసులు బయటపడ్డాయి.
Source: జాతీయ | 26 Jun 2009 | 4:25 am

జులై- ఆగస్టు వర్షాలు కాపాడతాయి: కేంద్రం

దేశంలో వర్షాభావం వలన కరువు నెలకొనే పరిస్థితి లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. జులై- ఆగస్టు నెలల్లో కురిసే వర్షాలు వ్యవసాయ రంగాన్ని ఆదుకుంటాయని నమ్మకం వ్యక్తం చేసింది. గత ఏడాది స్థాయిలోనే పంటల దిగుబడి వస్తుందని పేర్కొంది.
Source: జాతీయ | 26 Jun 2009 | 3:30 am

పాక్‌తో శాంతి "వన్ వే ట్రాఫిక్‌" కాదు: ఆంటోనీ

దాయాది దేశం పాకిస్థాన్‌తో శాంతిని కాంక్షిచడం 'వన్ వే ట్రాఫ్రిక్‌'లాంటిది కాదని కేంద్ర రక్షణ శాఖామంత్రి ఏకే.ఆంటోనీ అభిప్రాయపడ్డారు. ఆ దేశ భూభాగంలో భారత్‌కు వ్యతిరేకంగా తీవ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న తీవ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవాలన్నారు.
Source: జాతీయ | 25 Jun 2009 | 2:53 pm