వరుణుడి కోసం రాష్ట్రం, కేంద్రం పడిగాపులు

వరుణ దేవుని కరుణకోసం ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి రాష్ట్రంలోని దేవాలయాల్లో యాగాలు చేయమని పిలుపునిచ్చారు. ఇవాల్టి నుంచి రాష్ట్రంలో యాగాలు మొదలయ్యాయి కూడా. ఇదిలావుంటే దేశంలోనూ వరుణుడి జాడ కనిపించక పోవడంతో కేంద్ర వ్యవసాయ, జలవనరుల శాఖామంత్రి అత్యవసరంగా మంగళవారం వాతావరణ శాఖ అధికారులతో సమావేశమై పరిస్థితిపై చర్చించారు.
Source: Yahoo! Telugu: News | 24 Jun 2009 | 6:39 pm

జలయజ్ఞంలో అలసత్వం వద్దు: ముఖ్యమంత్రి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అలసత్వం చూపించవద్దని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి హెచ్చరించారు. తెలంగాణా ప్రాంతాల్లో చేపట్టిన నీటి ప్రాజెక్టుల నిర్మాణం పనులపై ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు
Source: Yahoo! Telugu: News | 24 Jun 2009 | 6:35 pm

నానో ఎక్కడ తయారవుతుందో తెలుసా...?

టాటా మోటార్స్‌కు చెందిన నానోకారు ఉత్తరాఖండ్‌లోని పంత్ నగర్ ప్లాంట్‌లో రూపొందించపబడుతున్నాయి. ఈ ప్లాంట్‌లో ఏడాదికి కేవలం 50వేల వాహనాలే తయారవుతాయి.
Source: Yahoo! Telugu: News | 24 Jun 2009 | 6:21 pm

ప్రజా రవాణా వ్యవస్థను పటిష్ట పరుస్తాం: వైఎస్

రాష్ట్ర ప్రజానీకానికి మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్ట పరుస్తామని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తెలిపారు. ఇందుకోసం ప్రతియేటా 500 బస్సులను కొత్తగా చేర్చేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 24 Jun 2009 | 6:13 pm

మార్కెట్‌లో లాభాలు: సెన్సెక్స్ 99 పాయింట్ల వృద్ధి

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) బుధవారం లాభాల బాటలో నడిచింది. 53 పాయింట్ల వృద్ధితో 14,377 వద్ద ప్రారంభమైన సూచి అనంతరం క్రితం ముగింపు నుంచి 117 పాయింట్ల మేర పతనమై 14,207 పాయింట్ల కనిష్ట స్థాయికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌ల నుంచి బలహీన సంకేతాలు రావడంతో ఈ పరిణామం ఏర్పడింది.ఆపై మళ్లీ లాభాల్లోకి వచ్చిన సెన్సెక్స్ కనిష్ట స్థాయి నుంచి 273 పాయింట్లు వృద్ధి చెంది 14,480 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. సాయంత్రం ట్రేడింగ్ ముగింపు సమయానికి బీఎస్ఈ సూచి 99 పాయింట్ల లాభపడి 14,423 పాయింట్ల వద్ద స్థిరపడింది.ఇదే విధంగా... నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (నిఫ్టీ) కూడా ఈ రోజు లాభాల్లోనే నడిచింది. నిఫ్టీ ముగింపు సమయానికి 46 పాయింట్లు వృద్ధి చెంది 4293 వద్ద నిలిచింది.
Source: Yahoo! Telugu: News | 24 Jun 2009 | 6:05 pm

300మందిని తొలగించనున్న మై స్పేస్

సోషల్ నెట్ వర్కింగ్ సైట్ అయిన మై స్పేస్ ప్రపంవ్యాప్తంగానున్న తన ఉద్యోగులలో దాదాపు 300మందిని తొలగించనుంది.
Source: Yahoo! Telugu: News | 24 Jun 2009 | 5:50 pm

ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా పొఖ్రియాల్

ఉత్తరాఖండ్ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి రమేష్ పొఖ్రియాల్ ఎంపికయ్యారు. భారతీయ జనతా పార్టీకి చెందిన 35 మంది శాసన సభ్యులు రమేష్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రి పదవికి రమేష్ పేరును మాజీ ముఖ్యమంత్రి బీసీఖండూరీ ప్రతిపాదించారు.
Source: Yahoo! Telugu: News | 24 Jun 2009 | 5:20 pm

ఎంఏఎన్‌యూయూ డిప్లమా కోర్సుల అడ్మిషన్లు

మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (ఎంఏఎన్‌యూయూ) డిప్లమా కోర్సుల అడ్మిషన్ల గడువును పొడిగించారు. ఎంఏఎన్‌యూయూ పరిధిలోని మూడు పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లమా కోర్సుల్లో ప్రవేశం కోసం చివరి తేదీని జులై 10 వరకు పొడిగించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Source: Yahoo! Telugu: News | 24 Jun 2009 | 4:39 pm

13శాతం లాభాలు పెంచుకున్న సన్ టీవీ

దక్షిణ భారతదేశంలో మీడియా రంగంలో అగ్రగామిగానున్న సన్ టీవీ నెట్‌వర్క్ సంస్థ నికరలాభం 13శాతానికి పెంచుకుని రూ. 368.33 కోట్లకు చేరుకుంది.
Source: Yahoo! Telugu: News | 24 Jun 2009 | 4:35 pm

ఏయూ ఆర్ట్స్ కోర్సుల కౌన్సిలింగ్ ప్రారంభం

ఆంధ్రా విశ్వవిద్యాలయం (ఏయూ) అందించే ఆర్ట్స్ కోర్సుల తొలి దశ కౌన్సెలింగ్ మంగళవారం ప్రారంభమైంది. క్యాంపస్ కళాశాల, అనుబంధ కళాశాలలు, కొత్తగా ఏర్పాటయిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యయం (శ్రీకాకుళం)లలో ఆర్ట్స్ కోర్సులు చదవాలనుకునే విద్యార్థులకు విశాఖపట్నంలోని సర్ సీఆర్ రెడ్డి కాన్వోకేషన్ హాలులో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.
Source: Yahoo! Telugu: News | 24 Jun 2009 | 4:28 pm

అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలనే ఆశ లేదు: అద్వానీ

పార్టీ అధ్యక్ష బాధ్యతలను మరోమారు చేపట్టాలనే ఆశ తనకు లేదని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ స్పష్టం చేశారు. పార్టీలో అనేక మంది సమర్థులైన కొత్త నేతలు ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ఇకపై అలాంటి వారు పార్టీ బరువు బాధ్యతలను మోస్తారని ఆయన చెప్పుకొచ్చారు.
Source: జాతీయ | 24 Jun 2009 | 1:55 pm

"మగధీర" "మగమహారాజు" అంతటివాడవుతాడా...?

మెగాస్టార్ పుత్రరత్నం రామ్ చరణ్ తేజ "చిరుత" తర్వాత "మగధీర"గా రాబోతున్నాడు. సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన ఎస్ఎస్ రాజమౌళి ఈ మగధీరను తీర్చిదిద్దుతున్నాడు. చరణ్ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. గ్లామర్ నటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆమెకు 'మగధీర' ప్లస్ అవుతుందో, 'మగధీర'కు ఆమే ప్లస్ అవుతుందో చిత్రం వచ్చాక కాని తెలియదు. రియల్ స్టార్ శ్రీహరి నటించడం ఖచ్చితంగా ఈ చిత్రానికి ప్లస్ పాయింటే అవుతుందంటున్నారు తెలుగు సినీ పండితులు.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Jun 2009 | 1:35 pm

వరుణుడి కోసం రాష్ట్రం, కేంద్రం పడిగాపులు

వరుణ దేవుని కరుణకోసం ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి రాష్ట్రంలోని దేవాలయాల్లో యాగాలు చేయమని పిలుపునిచ్చారు. ఇవాల్టి నుంచి రాష్ట్రంలో యాగాలు మొదలయ్యాయి కూడా. ఇదిలావుంటే దేశంలోనూ వరుణుడి జాడ కనిపించక పోవడంతో కేంద్ర వ్యవసాయ, జలవనరుల శాఖామంత్రి అత్యవసరంగా మంగళవారం వాతావరణ శాఖ అధికారులతో సమావేశమై పరిస్థితిపై చర్చించారు.
Source: జాతీయ | 24 Jun 2009 | 1:10 pm

జలయజ్ఞంలో అలసత్వం వద్దు: ముఖ్యమంత్రి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అలసత్వం చూపించవద్దని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి హెచ్చరించారు. తెలంగాణా ప్రాంతాల్లో చేపట్టిన నీటి ప్రాజెక్టుల నిర్మాణం పనులపై ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు
Source: ఏపీ న్యూస్ | 24 Jun 2009 | 1:07 pm

ప్రజా రవాణా వ్యవస్థను పటిష్ట పరుస్తాం: వైఎస్

రాష్ట్ర ప్రజానీకానికి మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్ట పరుస్తామని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తెలిపారు. ఇందుకోసం ప్రతియేటా 500 బస్సులను కొత్తగా చేర్చేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 24 Jun 2009 | 12:44 pm

వాళ్లిద్దరి మధ్య వేడి వేడి సంబంధం కుదిరిందట

"న్యూయార్క్" చిత్రం ఇంకా వెలుపలికి రాలేదు. కానీ ఆ చిత్రంలో నటించిన కత్రినా కైఫ్, జాన్ అబ్రహాంల సంబంధం గురించి బాలీవుడ్ సినీజనం తెగ చర్చించుకుంటున్నారు. జాన్, కత్రినాల మధ్య వేడి వేడి స్నేహ సంబంధం కుదిరినట్లు గుసగుసలు పోతున్నారు. దీనికి బలాన్ని చేకూర్చే సంఘటన కూడా జరిగిందని వారు వాదిస్తున్నారు. న్యూయార్క్ చిత్రంలో కత్రినా కైఫ్, జాన్ అబ్రహాంల మధ్య ఓ ముద్దు సన్నివేశం ఉన్నదట. ఈ "ముద్దు" చిత్రీకరణలో ముద్దు సరిగా రాక రెండు మూడుసార్లు చిత్రీకరించాల్సి వచ్చిందట. ఇటువంటి సందర్భాల్లో హీరోయిన్లు మళ్లీ మళ్లీ ముద్దంటే ఒప్పుకోరు. అయితే కత్రినా కైఫ్ మాత్రం ఎన్నిసార్లు ముద్దివ్వమన్నా అలా ఇస్తూనే ఉన్నదట.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Jun 2009 | 12:03 pm

ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా పొఖ్రియాల్

ఉత్తరాఖండ్ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి రమేష్ పొఖ్రియాల్ ఎంపికయ్యారు. భారతీయ జనతా పార్టీకి చెందిన 35 మంది శాసన సభ్యులు రమేష్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రి పదవికి రమేష్ పేరును మాజీ ముఖ్యమంత్రి బీసీఖండూరీ ప్రతిపాదించారు.
Source: జాతీయ | 24 Jun 2009 | 11:51 am

సృష్టికర్త మాయాజాలం "బ్రహ్మ లింగేశ్వరుడు"

కనుచూపుమేరలో పెద్ద బండ, దానిపై ఆకర్షణీయమైన ఆలయం, అందులో కొలువుదీరిన స్వామివారిని చూడాలంటే... విజయనగరం జిల్లా, వేపాడ మండలం, గుడివాడలోని శైవక్షేత్రానికి తరలి వెళ్లాల్సిందే. సాక్షాత్తూ ఆ బ్రహ్మదేవుడే ముక్కంటిని ఏకశిలపై ప్రతిష్టించమే ఇక్కడి ఆలయ ప్రత్యేకతగా...
Source: వినోదం | 24 Jun 2009 | 11:30 am

భావ సారూప్య పార్టీలతో పొత్తుకు సై: సీపీఎం

భావ సారూప్యత కలిగిన పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు సీపీఎం పార్టీ రాష్ట్ర శాఖ కార్యదర్శి బీవీ.రాఘవులు చెప్పారు. అలాగే, ప్రజారాజ్యం పార్టీతో ఎలాంటి షరతులు లేని పొత్తుకు మాత్రమే తాము ఆసక్తి చూపుతామని ఆయన ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 24 Jun 2009 | 10:15 am

రాష్ట్ర వ్యాప్తంగా వరుణ యాగాలు

ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ఆదేశం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వరుణ యాగాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల్లో బుధవారం వరుణ జపాలు ప్రారంభమయ్యాయి. నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంలో ఆలస్యం కావడంతో వర్షాభావ పరిస్థితుల ఏర్పడ్డాయి.
Source: ఏపీ న్యూస్ | 24 Jun 2009 | 10:01 am

యాసిడ్ దాడులపై ప్రత్యేక చట్టం: మంత్రి సబిత

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న యాసిడ్ దాడులపై ఉక్కుపాదం మోపుతామని హోంమంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ చట్టం తీసుకువస్తామని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 24 Jun 2009 | 9:49 am

సరబ్జీత్‌కు దారులు మూసుకు పోలేదు: కేంద్రం

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రొవియన్స్‌లో జరిగిన పేలుళ్ళ కేసులో ఉరిశిక్ష పడిన భారత ఖైదీ సరబ్జీత్‌ సింగ్‌కు క్షమాభిక్ష దారులు మూసుకుని పోలేదని కేంద్రం అభిప్రాయపడింది. సరబ్జీత్‌కు ఆ దేశ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ క్షమాభిక్ష పెట్టేందుకు మార్గం ఉందని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది.
Source: జాతీయ | 24 Jun 2009 | 9:42 am

భూమి కొనుగోలు వివాదం: ఐష్‌పై కేసు

ప్రపంచ మాజీ సుందరి, బాలీవుడ్ నటీమణి ఐశ్వర్యా రాయ్‌ భూమి కొనుగోలు వివాదంలో చిక్కున్నారు. దీంతో ఆమెతో పాటు.. సుజ్లాన్ కంపెనీ ఛైర్మన్ తుల్సీభాయ్ తంతీ, మరికొందరు ప్రముఖులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Source: జాతీయ | 24 Jun 2009 | 7:52 am

ఖండూరీ వారసుడి కోసం భాజపా ఎమ్మెల్యేల భేటీ

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన బీసీ ఖండూరీ స్థానంలో కొత్త నేతను ఆ పార్టీ ఎమ్మెల్యేలు బుధవారం ఎన్నుకోనున్నారు. ఇందుకోసం దేశ రాజధాని ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో వీరంతా సమావేశం కానున్నారు.
Source: జాతీయ | 24 Jun 2009 | 6:36 am

వాళ్లిద్దరి మధ్య వేడి వేడి సంబంధం కుదిరిందట

"న్యూయార్క్" చిత్రం ఇంకా వెలుపలికి రాలేదు. కానీ ఆ చిత్రంలో నటించిన కత్రినా కైఫ్, జాన్ అబ్రహాంల సంబంధం గురించి బాలీవుడ్ సినీజనం తెగ చర్చించుకుంటున్నారు. జాన్, కత్రినాల మధ్య వేడి వేడి స్నేహ సంబంధం కుదిరినట్లు గుసగుసలు పోతున్నారు. దీనికి బలాన్ని చేకూర్చే సంఘటన కూడా...
Source: వినోదం | 24 Jun 2009 | 6:36 am

తెలంగాణా కమిటీ పునర్వ్యవస్థీకరిస్తాం: రోశయ్య

ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అంశంపై వైఎస్ సర్కారు ఏర్పాటు చేసిన శాసనసభా కమిటీని పునర్వ్యవస్థీకరిస్తామని ఆర్థిక మంత్రి కొణిజేటి రోశయ్య తెలిపారు. ప్రస్తుతం ఈ కమిటీలో సభ్యులుగా ఉన్న కొందరు ముగిసిన ఎన్నికల్లో పరాజయం పాలయ్యారని ఆయన గుర్తు చేశారు.
Source: ఏపీ న్యూస్ | 24 Jun 2009 | 5:46 am

అంతర్జాతీయ సదస్సులో జేపీ కీలకోపన్యాసం

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో బుధవారం నుంచి జరుగనున్న అంతర్జాతీయ సదస్సులో లోక్‌సత్తా అధినేత డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ కీలకోపన్యాసం చేయనున్నారు. ఈ సదస్సు ముంబైలోని తాజ్ హోటల్‌లో మూడు రోజుల పాటు జరుగుతుంది.
Source: ఏపీ న్యూస్ | 24 Jun 2009 | 5:34 am

"చాముండి" లీలలపై విచారణకు ఆదేశం

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి చాముండేశ్వరినాథ్‌పై విచారణకు హోం మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. చాముండేశ్వరినాథ్‌ వ్యవహారంలో వచ్చిన వివిధ ఆరోపణలపై ప్రత్యేక అధికారితో విచారణ జరిపించాలని హోం మంత్రి డీజీపీ ఎస్.ఎస్.వి.యాదవ్‌ను ఆదేశించారు.
Source: ఏపీ న్యూస్ | 24 Jun 2009 | 5:25 am

ఇద్దరు నడపాల్సిన బస్సును...

"సుబ్బు హైదరాబాదుకు రావటం అదే మొదటిసారి" "అక్కడ డబుల్ టక్కర్ బస్సెక్కి కండక్టరు అప్పారావుతో....
Source: వినోదం | 24 Jun 2009 | 5:23 am

చల్లగా ఉండాలని..

భర్త: "ఏమే.! నీ మెడలో తాళి ఏది?" భార్య: "మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్‌లో పెట్టానండీ..!"
Source: వినోదం | 24 Jun 2009 | 5:17 am

ఉత్తరాఖండ్ సీఎం పదవికి ఖండూరీ రాజీనామా

పార్టీలో ఒత్తిళ్లు పెరిగిపోవడంతో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవికి బీసీ ఖండూరీ మంగళవారం రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రదర్శన ఆశాజనకంగా లేకపోవడంపై ఖండూరీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల ఫలితాలకు ఖండూరీని బాధ్యుడిని చేస్తూ మిగిలిన నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
Source: జాతీయ | 24 Jun 2009 | 4:45 am

జమ్ములో రోడ్డు ప్రమాదం: 12 మంది మృతి

జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. జమ్ము- కత్రా రహదారిపై పాంతల్ వద్ద బస్సు ఇరుకైన లోయలో పడిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదంలో 12 మంది మృతి చెందగా, అనేక మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదానికి సంబంధించి మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది.
Source: జాతీయ | 24 Jun 2009 | 4:34 am

పశ్చిమబెంగాల్: చర్చలకు మావోల సంసిద్ధత

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మావోయిస్టుల ఆక్రమణతో గత కొన్ని రోజులగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న లాల్‌గఢ్‌లో పోలీసుల ఆపరేషన్ కొనసాగుతుందని రాష్ట్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే మంగళవారం లాల్‌గఢ్‌లో కాల్పుల విరమణ ప్రకటిస్తే, తాము చర్చలు జరిపేందుకు ముందుకొస్తామని మావోయిస్టులు తెలిపారు.
Source: జాతీయ | 24 Jun 2009 | 3:50 am

హఫీజ్, లఖ్వీలపై అరెస్ట్ వారెంట్లు జారీ

పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్, మరో 22 మంది పాకిస్థానీయులపై ముంబయి కోర్టు మంగళవారం నాన్- బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. లష్కరే తోయిబా ఆపరేషన్స్ కమాండర్ జాకీవుర్ రెహమాన్ లఖ్వీ, పాకిస్థాన్ మాజీ మిలిటరీ అధికారి కల్నల్ ఆర్ సాదత్ ఉల్లాలకు కూడా కోర్టు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.
Source: జాతీయ | 24 Jun 2009 | 3:13 am

ఆ హీరో భలే "ముద్దు"గాడట

బాలీవుడ్‌లో హీరోహీరోయిన్ల పెదవుల బిగింపులు సర్వసాధారణమే. ఆ ముద్దుల శృంగారం ముదిరేటపుడు "సీన్"ను సింక్ చేసేవారు ఒకప్పుడు. అయితే శరీర రాపిడిలను మాత్రం చాలా స్పష్టంగా తెరపైకి ఎక్కించేవారు. ఇప్పుడు ఆ శరీర రాపిడులతోపాటు నాయకానాయికల పెదవుల బిగింపును మరింత దగ్గరగా, స్పష్టంగా చూపించడం ట్రెండ్‌గా మారింది. ఈ వేడి ముద్దులను వెండితెరపై ప్రదర్శించే సంగతిని అలా ఉంచితే... ఏ హీరో చుంబన భలేగా ఉంటుందో విడమర్చి చెపుతున్నారు కొందరు బాలీవుడ్ సెక్సీతారలు.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Jun 2009 | 7:24 pm

నటించింది చాలు.. పిల్లల్ని కనండి

బాలీవుడ్ పర్‌ఫెక్ట్ కపుల్ అభి-ఐష్‌లపై పిల్లల్ని కనమని ఒత్తిడి పెరుగుతోందట. వాళ్లిద్దరూ ఎవరికంటబడినా "విశేషం ఎప్పుడు చెపుతారూ...?" అని నిలదీస్తున్నారట. మరికొందరైతే, "పిల్లలు ఎందుకు పుట్టడం లేదో ఒకసారి చెక్ చేయించుకోకూడదూ...?" అన్న లెవల్లో లెక్చర్లిస్తున్నారట. ఈ ప్రశ్నలతో ఐష్‌కు చిర్రెత్తిందో లేదో కానీ, అభిషేక్‌కి మాత్రం కోపం నషాలనికి అంటుతోందట. తను నటించబోయే చిత్రాల తాలూకు షూటింగ్‌లను ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది నవంబరు నెలాఖరుకల్లా పూర్తి చేసుకుని పిల్లల్ని కనే పనిలో పడాలని ఆలోచిస్తున్నాడట. ఇదే విషయాన్ని ఐశ్వర్యారాయ్‌కి కూడా చెప్పేశాడట.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Jun 2009 | 4:40 pm

ఎంతవరకు చూపించాలో నాకు తెలుసు: నీతూ చంద్ర

అరసైజు బికినీలో అందాలన్నీ ఆరబోస్తూ నీతూ చంద్ర ఇచ్చిన కిక్కుకు బాలీవుడ్ బోర్లా పడి చొంగ కార్చుకుంటోంది. ఆమె ఎక్కడ ఉందో తెలుసుకుని తమ సినిమాలలో నటించమని నిర్మాతలు ఆమె వెంటబడుతున్నారట. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా అడిగినవారికి కాదనకుండా, కనీసం సినిమాలో తను నటించబోయే పాత్ర ఏమిటని అడగకుండా అగ్రిమెంట్ పేపర్లపై తన సంతకాన్ని బరబరలాడించేస్తోందట ఈ బికినీ సుందరి.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Jun 2009 | 2:07 pm