మార్కెట్లోకి పల్సర్ కొత్త మోడల్

దేశంలో ద్విచక్ర వాహనాల నిర్మాణరంగంలో అగ్రగామిగానున్న బజాజ్ ఆటో కంపెనీ మంగళవారం పల్సర్ కొత్త మోడల్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. పల్సర్ కొత్త మోడల్ ధర రూ. 70వేలుగా ఉంటుందని కంపెనీ ప్రకటించింది.
Source: Yahoo! Telugu: News | 23 Jun 2009 | 7:37 pm

ఆ హీరో భలే "ముద్దు"గాడట

బాలీవుడ్‌లో హీరోహీరోయిన్ల పెదవుల బిగింపులు సర్వసాధారణమే. ఆ ముద్దుల శృంగారం ముదిరేటపుడు "సీన్"ను సింక్ చేసేవారు ఒకప్పుడు. అయితే శరీర రాపిడిలను మాత్రం చాలా స్పష్టంగా తెరపైకి ఎక్కించేవారు. ఇప్పుడు ఆ శరీర రాపిడులతోపాటు నాయకానాయికల పెదవుల బిగింపును మరింత దగ్గరగా, స్పష్టంగా చూపించడం ట్రెండ్‌గా మారింది. ఈ వేడి ముద్దులను వెండితెరపై ప్రదర్శించే సంగతిని అలా ఉంచితే... ఏ హీరో చుంబన భలేగా ఉంటుందో విడమర్చి చెపుతున్నారు కొందరు బాలీవుడ్ సెక్సీతారలు.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Jun 2009 | 7:24 pm

వరుణ్ గాంధీపై చార్జిషీటు!

భారతీయ జనతా పార్టీకి చెందిన యువనాయకుడు పిలిబిత్ లోక్‌సభ సభ్యుడు వరుణ్ గాంధీపై చార్జిషీట్ దాఖలు చేసేందుకు ఉత్తరప్రదేశ్ పోలీసులు నడుం బిగించారు.
Source: Yahoo! Telugu: News | 23 Jun 2009 | 7:21 pm

ఒబామా ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఫిక్కీ

గతంలో వ్యాపర పరంగా కొన్ని వివాదాస్పద వ్యాఖలు చేసిన అమెరికా అధ్యక్షుడు ఒబామా ఇకపై అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే మంచిదని ఫిక్కీ హెచ్చరించింది.
Source: Yahoo! Telugu: News | 23 Jun 2009 | 6:34 pm

బెంగాల్‌లో మావోయిస్టులపై నిషేధం: బుద్ధదేవ్

కమ్యూనిస్టుల కంచుకోట పశ్చిమబెంగాల్‌లో కూడా మావోయిస్టులపై నిషేధం విధించినట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య తెలిపారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర సర్కారు కూడా సమర్థిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంపై ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
Source: Yahoo! Telugu: News | 23 Jun 2009 | 5:40 pm

జూన్ చివరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు

జూన్ చివరినాటికి పెండింగ్‌లో ఉన్న విద్యార్థి స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలని సామాజిక సంక్షేమ విభాగానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన 25 లక్షల మంది విద్యార్థులు కొత్త విద్యా సంవత్సరంలో స్కాలర్‌షిప్‌లు పొందనున్నారు.
Source: Yahoo! Telugu: News | 23 Jun 2009 | 5:28 pm

ప్రైవేట్ పాఠశాలల ఫీజులపై నిరసన

ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అడ్మిషన్ల కోసం పెద్దమొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపిస్తూ సంగారెడ్డిలో కలెక్టర్ కార్యాలయం ఎదుట విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు.
Source: Yahoo! Telugu: News | 23 Jun 2009 | 5:14 pm

స్కాలర్‌షిప్ నిధులు విడుదల

రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అర్హత ఉన్న విద్యార్థులకు సాధ్యమైనంత త్వరలో ఉపకారవేతనాలు అందజేయనుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ వేగంగా జరుగుతోంది. హైదరాబాద్ జాకత్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ రాష్ట్రవ్యాప్తంగా స్కాలర్‌షిప్ దరఖాస్తుల పరిశీలనకు వివిధ జిల్లాలకు 150 మంది సిబ్బందిని పంపింది.
Source: Yahoo! Telugu: News | 23 Jun 2009 | 5:08 pm

జులై 26- ఆగస్టు 19 మధ్య ఇరాన్‌లో కొత్త ప్రభుత్వం

ఇరాన్‌లో వచ్చే నెల 26 నుంచి కొత్త ప్రభుత్వం కొలువుతీరే ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈ ప్రక్రియ జులై 26 నుంచి ఆగస్టు 19 వరకు జరుగుతుంది. ఇటీవల ఇరాన్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అహ్మదీనెజాద్ తిరిగి విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజా ఎన్నికల్లో భారీ విజయం సాధించిన అహ్మదీనెజాద్ ఇరాన్ అధ్యక్ష పగ్గాలు వరుసగా రెండోసారి చేపట్టబోతున్నారు.
Source: Yahoo! Telugu: News | 23 Jun 2009 | 4:51 pm

స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిసింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 2 పాయింట్లు నష్టపోయి 14,324 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 12 పాయింట్లు లాభపడి 4,247 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.02 శాతం క్షీణించగా.. నిఫ్టీ 0.28 శాతం మేరకు లాభపడింది.
Source: Yahoo! Telugu: News | 23 Jun 2009 | 4:43 pm

భారతీయుల వీసా ఉల్లంఘనలే ఎక్కువ

ఆస్ట్రేలియాలో వీసా ఉల్లంఘనల్లో భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఉన్నారని ఆ దేశ ఇమ్మిగ్రేషన్, పౌరసత్వ శాఖ పేర్కొంది. విద్యార్థి వీసా కార్యక్రమంపై ఈ శాఖ జరిపిన సమీక్షలో ఆస్ట్రేలియాలో వీసా ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిలో బంగ్లాదేశీయులు, కాంబోడియన్లు, భారతీయులు ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
Source: Yahoo! Telugu: News | 23 Jun 2009 | 4:42 pm

నటించింది చాలు.. పిల్లల్ని కనండి

బాలీవుడ్ పర్‌ఫెక్ట్ కపుల్ అభి-ఐష్‌లపై పిల్లల్ని కనమని ఒత్తిడి పెరుగుతోందట. వాళ్లిద్దరూ ఎవరికంటబడినా "విశేషం ఎప్పుడు చెపుతారూ...?" అని నిలదీస్తున్నారట. మరికొందరైతే, "పిల్లలు ఎందుకు పుట్టడం లేదో ఒకసారి చెక్ చేయించుకోకూడదూ...?" అన్న లెవల్లో లెక్చర్లిస్తున్నారట. ఈ ప్రశ్నలతో ఐష్‌కు చిర్రెత్తిందో లేదో కానీ, అభిషేక్‌కి మాత్రం కోపం నషాలనికి అంటుతోందట. తను నటించబోయే చిత్రాల తాలూకు షూటింగ్‌లను ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది నవంబరు నెలాఖరుకల్లా పూర్తి చేసుకుని పిల్లల్ని కనే పనిలో పడాలని ఆలోచిస్తున్నాడట. ఇదే విషయాన్ని ఐశ్వర్యారాయ్‌కి కూడా చెప్పేశాడట.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Jun 2009 | 4:40 pm

ఎంతవరకు చూపించాలో నాకు తెలుసు: నీతూ చంద్ర

అరసైజు బికినీలో అందాలన్నీ ఆరబోస్తూ నీతూ చంద్ర ఇచ్చిన కిక్కుకు బాలీవుడ్ బోర్లా పడి చొంగ కార్చుకుంటోంది. ఆమె ఎక్కడ ఉందో తెలుసుకుని తమ సినిమాలలో నటించమని నిర్మాతలు ఆమె వెంటబడుతున్నారట. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా అడిగినవారికి కాదనకుండా, కనీసం సినిమాలో తను నటించబోయే పాత్ర ఏమిటని అడగకుండా అగ్రిమెంట్ పేపర్లపై తన సంతకాన్ని బరబరలాడించేస్తోందట ఈ బికినీ సుందరి.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Jun 2009 | 2:07 pm

వరుణ్ గాంధీపై చార్జిషీటు!

భారతీయ జనతా పార్టీకి చెందిన యువనాయకుడు పిలిబిత్ లోక్‌సభ సభ్యుడు వరుణ్ గాంధీపై చార్జిషీట్ దాఖలు చేసేందుకు ఉత్తరప్రదేశ్ పోలీసులు నడుం బిగించారు.
Source: జాతీయ | 23 Jun 2009 | 1:51 pm

బెంగాల్‌లో మావోయిస్టులపై నిషేధం: బుద్ధదేవ్

కమ్యూనిస్టుల కంచుకోట పశ్చిమబెంగాల్‌లో కూడా మావోయిస్టులపై నిషేధం విధించినట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య తెలిపారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర సర్కారు కూడా సమర్థిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంపై ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
Source: జాతీయ | 23 Jun 2009 | 12:12 pm

సావిత్రి- జి.వరలక్ష్మి మధ్య కప్పు-గ్లాసుల తేడా

నాటి వెండితెర లోకంలో పెద్ద హీరోయిన్, చిన్న హీరోయిన్, జూనియర్ ఆర్టిస్టు... వగైరా తేడాలను బట్టి వారివారి హోదాలు పేరుకు మాత్రమే ఉండేవి. అప్పటి తరం అగ్రనాయకానాయికలు అసలు ఈ హోదాలను పట్టించుకునేవారు కాదట. చిన్న చిన్న నటులతో సైతం కలసిమెలసి ఉండేవారట. దీనికి ఉదాహరణగా మహానటి సావిత్రి జీవితంలోని ఓ సంఘటనను చెప్పుకోవచ్చు.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Jun 2009 | 11:27 am

రాష్ట్రంలో వరుణ యాగాలు నిర్వహించండి: వైఎస్

వర్షం కోసం రాష్ట్ర వ్యాప్తంగా వరుణ యాగాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన హిందూ దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని శివాలయాల్లో సహస్ర ఘట్టాభిషేకం, వరుణజపాన్ని నిర్వహించాలని ఆయన కోరారు.
Source: ఏపీ న్యూస్ | 23 Jun 2009 | 10:59 am

ఎవరెళ్లిపోయినా ప్రజారాజ్యం నడుస్తుంది: చిరంజీవి

ప్రజారాజ్యం పార్టీ నుంచి కొంతమంది వెళ్లిపోయినంత మాత్రాన పార్టీకి నష్టమేమీ వాటిల్లదని ఆ పార్టీ అధినేత చిరంజీవి పేర్కొన్నారు. అసలు తను లేకపోయినా ప్రజారాజ్యం పార్టీ నడుస్తుందని స్పష్టం చేశారు. త్వరలో జరుగనున్న గ్రేటర్ ఎన్నికల్లో తమ పార్టీ విజయఢంకా మోగిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీతో వామపక్షాలు తమ సంబంధాలను తెగతెంపులు చేసుకుంటే వారితో పొత్తు పెట్టుకునేందుకు తాము సిద్ధమేనని చిరంజీవి వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 23 Jun 2009 | 10:47 am

ప్రజలకు కేసీఆర్ సారీ చెప్పాలి: చంద్రశేఖర్

తెలంగాణాలో రెండో దశ ఉద్యమానికి సృష్టికర్తనను తానేనని తెరాస అధినేత కె.చంద్రశేఖర రావు ప్రకటించుకోవడం పట్ల తెరాస అసమ్మతి నేతలు, పలు సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ విషయంలో వెంటనే కేసీఆర్ ప్రజలకు తక్షణం క్షమాపణలు చెప్పాలని అసమ్మతి నాయకుడు డాక్టర్ ఎ.చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.
Source: ఏపీ న్యూస్ | 23 Jun 2009 | 10:47 am

రాయలసీమలో సైనిక పాఠశాల: మంత్రి పళ్ళం

రాయలసీమలో సైనిక పాఠశాలను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి ఎంఎం.పళ్ళం రాజు తెలిపారు. ఇందుకు అవసరమైన సదుపాయలను కల్పించాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డికి విజ్ఞప్తి చేసినట్టు ఆయన వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 23 Jun 2009 | 10:39 am

ఠాణాలో అత్యాచారం చేశారు: మహిళ ఫిర్యాదు

తన భర్త గురించి వివరాలు కావాలని తనను పోలీసు స్టేషనుకు తీసుకువెళ్లిన పోలీసులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని మంగళవారం ఓ మహిళ ఢిల్లీలోని ఇందర్‌పురి పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసింది.
Source: జాతీయ | 23 Jun 2009 | 8:38 am

బాధ్యతల నుంచి తప్పుకోండి: ఖండూరీకి ఆదేశం

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి బీసీ.ఖండూరీ విధుల నుంచి తప్పించాలని భారతీయ జనతా పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఫలితంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందిగా ఖండూరీనీ కోరింది. ఈ మేరకు దేశ రాజధానిలో ఉన్న ఖండూరీని అధిష్టానం కోరినట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Source: జాతీయ | 23 Jun 2009 | 8:38 am

విజయవంతంగా సాగుతున్న లాల్‌గఢ్ ఆపరేషన్

మావోయిస్టుల చెరలో ఉన్న గ్రామాలను విముక్తి చేసేందుకు స్థానిక పోలీసుల సహాయంతో భద్రతా దళాలు చేపట్టిన లాల్‌గఢ్ ఆపరేషన్ విజయవంతంగా ముందుకు సాగుతోంది. మావోల ఆధీనంలోని మొత్తం 44 గ్రామాలకు గాను 22 గ్రామాలకు విముక్తి కల్పించారు.
Source: జాతీయ | 23 Jun 2009 | 8:26 am

దేశవ్యాప్తంగా 63కి చేరిన స్వైన్ ఫ్లూ కేసులు

దేశంలో కొత్తగా మరో నాలుగు స్వైన్ ఫ్లూ కేసులు వెలుగుచూశాయి. దీంతో దేశవ్యాప్తంగా ఈ వ్యాధి బారినపడిన వారి సంఖ్య 62కి చేరింది. దేశ రాజధానిలో తాజాగా మరో ఇద్దరికి స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణకు వచ్చారు. ఇదిలా ఉంటే దేశంలో స్వైన్ ఫ్లూ వ్యాధిని అదుపు చేసేందుకు బహుముఖ వ్యూహాన్ని పాటించామని, అది సత్ఫలితాలను ఇస్తోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
Source: జాతీయ | 23 Jun 2009 | 7:53 am

బెంగాల్‌లో మూడు జిల్లాలపై బంద్ ప్రభావం

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో నక్సల్స్ ప్రభావిత మూడు జిల్లాల్లో బంద్ కారణంగా వరుసగా రెండో రోజు కూడా సాధారణ జనజీవనం స్తంభించింది. మావోయిస్టులు సోమవారం దేశవ్యాప్తంగా 48 గంటల బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ బంద్ కారణంగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో నక్సల్స్ ప్రభావిత జిల్లాలుగా గుర్తించబడిన పశ్చిమ మిడ్నపూర్, పురూలియా, బాంకురా జిల్లాల్లో సాధారణ ప్రజాజీవనం దెబ్బతింది.
Source: జాతీయ | 23 Jun 2009 | 7:15 am

రాష్ట్రవ్యాప్త పాఠశాలల బంద్‌కు ఏబీవీపి పిలుపు

రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు తమ ఇష్టానికి ఫీజులను పెంచుతున్నాయని, వాటిని తక్షణమే తగ్గించాలని ఏబీవీపి డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చింది. రాష్ట్రరాజధాని హైదరాబాదులో బంద్ పిలుపును ఖాతరు చేయని కొన్ని కార్పొరేట్ పాఠశాలలను బలవంతంగా మూసివేయించారు.
Source: ఏపీ న్యూస్ | 23 Jun 2009 | 6:59 am

ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు: బాలికలదే పైచేయి

ఇంటర్ మొదటి సంవత్సరం అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు ఈ ఫలితాలను ఉదయం 11.30 గంటలకు విడుదల చేసింది. ఈ ఫలితాలను రాష్ట్రంలోని ఏపీ ఆన్‌లైన్ సెంటర్ల నుంచి తెలుసుకోవచ్చు. కాగా పరీక్షకు హాజరైనవారిలో 58.20 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ పరీక్షలలోనూ బాలికలదే పైచేయిగా నిలిచింది.
Source: ఏపీ న్యూస్ | 23 Jun 2009 | 6:38 am

పదవి కోసం వెంపర్లాడే వ్యక్తిని కాదు: సిన్హా

లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం అనంతరం పార్టీ నడుస్తున్న తీరుపై అసంతృప్తితో బీజేపీలో అన్ని పదవులకు రాజీనామా చేసిన సీనియర్ నేత యశ్వంత్ సిన్హా సోమవారం తనపై వస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండించారు. తాను పదవుల కోసం వెంపర్లాడే వ్యక్తిని కాదన్నారు.
Source: జాతీయ | 23 Jun 2009 | 4:25 am

స్వైన్ ఫ్లూపై బహుముఖ వ్యూహం: కేంద్రం

దేశంలో స్వైన్ ఫ్లూ కేసులు నానాటికీ పెరుగుతుండటంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాంనబీ ఆజాద్ తెలిపారు. స్వైన్ ఫ్లూ వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఆయన సోమవారం వివరించారు. దేశంలో స్వైన్ ఫ్లూ వైరస్ నియంత్రణకు కేంద్రం బహుముఖ వ్యూహాన్ని పాటిస్తోందని, ఈ వ్యాధిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
Source: జాతీయ | 23 Jun 2009 | 3:34 am

పెదరాయుడి "శ్రీరంగ" నీతులు...!

వయస్సు మీద పడుతున్నా.. కాలం మారుతున్నా... కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మాత్రం తన నైజాన్ని మార్చుకోవడం లేదట. లొకేషన్లలో అమ్మాయిలను హడలెత్తించే ఈ విలన్ కమ్ హీరో.. తాజాగా వార్తలకు ఎక్కారు.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Jun 2009 | 8:18 pm

కోనసీమ చుట్టివచ్చిన "బెండు అప్పారావు"

డా. డి. రామానాయుడు నిర్మిస్తున్న తాజా చిత్రం బెండు అప్పారావు. అల్లరి నరేష్ టైటిల్‌రోల్‌ పోషిస్తున్న ఈ చిత్రానికి ఇ.వి.వి. ఇ.వి.వి. సత్యనారాయణ రావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం గురించి రామానాయుడు మాట్లాడుతూ.. తాజా షెడ్యూల్‌ కోనసీమలో చేశామన్నారు
Source: Yahoo! Telugu: Entertainment | 22 Jun 2009 | 7:52 pm

"గాలిశీను" ఏంచేస్తున్నాడు!

పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రలో, సత్యకృష్ణన్‌ (మెంటల్‌ కృష్ణ ఫేమ్‌) మరో పాత్రలో నటిస్తోన్న చిత్రం 'గాలిశీను'. స్వప్నమూవీస్‌ పతాకంపై ఎం.వి. కృష్ణప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించగా, పి. ఉదయభాస్కర్‌ దర్శకత్వం వహించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Jun 2009 | 7:47 pm

రామానాయుడు "గుజరాతీ" చిత్రం

సురేష్‌ప్రొడక్షన్స్‌లో డా. డి.రామానాయుడు జాతీయ భాషలన్నింటిలో సినిమాలు నిర్మించాలని కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగానే.. ఈనెల 18న ముంబైలో "గుజరాతీ" సినిమాను ప్రారంభించారు.తెలుగులో హిట్‌ అయిన 'నాయుడుగారి కుటుంబం' సినిమా ఆధారంగా దీన్ని నిర్మిస్తున్నారు. గుజరాతీ దర్శకుడు అవిరాజ్‌ ఈ సినిమాకు దర్శకుడు.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Jun 2009 | 7:45 pm

మేము పిల్లల్ని ప్రేమిస్తాం: ఏంజెలీనా

హాలీవుడ్ జంట ఏంజెలీనా జోలీ, బ్రాడ్ పిట్‌లు మరింత మంది పిల్లలను దత్తత తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి ఇంద్రధనుస్సు లాంటి కుటుంబాన్ని మరికొందరు పిల్లలను దత్తతలు స్వీకరించడం ద్వారా విస్తరించేందుకు జోలీ, బ్రాడ్ పిట్ సన్నాహాలు చేస్తున్నట్లు డైలీ మెయిల్ పేర్కొంది. "మేము పిల్లల్ని ప్రేమిస్తాం. మేము పెద్ద కుటుంబాన్ని కోరుకుంటున్నాము. అందువలన దత్తత స్వీకరించేందుకు మేమెప్పుడూ కాదని చెప్పబోమని" సీఎన్ఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏంజెలీనా తెలిపింది.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Jun 2009 | 5:28 pm

జూలై మొదటివారంలో వస్తోన్న "అనకొండ-3"

లక్ష్మీపాండురంగా ఫిలింస్ బేనర్‌పై సి.హెచ్. ఉమామహేశ్వరి అందిస్తున్న "అనకొండ-3" చిత్రం జూలై మొదటివారంలో విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. ఉత్కంఠిత భరితంగా తెరకెక్కనున్న ఈ సినిమా అత్యాధునిక టెక్నాలజీ, వినూత్న కథాంశంతో రూపుదిద్దుకుంది. హాలీవుడ్‌లో భారీ వ్యయంతో రూపొందిన "మేగాస్నేక్" చిత్రం ఈ 'అనకొండ-3'. మల్టీవిజన్ సంస్థ ద్వారా భారతదేశమంతటా అన్ని భాషల్లో ఒకేసారి విడుదలవుతోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Jun 2009 | 5:19 pm

కాంగ్రెస్‌ విషయంలో లాలూ వైఖరేంటి: నితీష్‌

కాంగ్రెస్‌ పార్టీతో రాష్ట్రీయ జనతా దళ్(ఆర్‌జేడీ) అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని సోమవారం బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.
Source: జాతీయ | 22 Jun 2009 | 3:37 pm

కూటమి పొత్తులతో నష్టం జరిగింది: బర్ధన్

ముగిసిన ఎన్నికల్లో కూటమి పొత్తుల వల్ల కొంత నష్టం వాటిల్లిందని సీపీఐ జాతీయ కార్యదర్శి ఏబీ బర్ధన్ అభిప్రాయపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్, భాజపాయేతర కూటములకు ప్రత్యామ్నాయంగా మూడో కూటమి ఏర్పాటుకు తమ వంతు కృషి చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 22 Jun 2009 | 1:59 pm