|
కోనసీమ చుట్టివచ్చిన "బెండు అప్పారావు"డా. డి. రామానాయుడు నిర్మిస్తున్న తాజా చిత్రం బెండు అప్పారావు. అల్లరి నరేష్ టైటిల్‌రోల్ పోషిస్తున్న ఈ చిత్రానికి ఇ.వి.వి. ఇ.వి.వి. సత్యనారాయణ రావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం గురించి రామానాయుడు మాట్లాడుతూ.. తాజా షెడ్యూల్ కోనసీమలో చేశామన్నారుSource: Yahoo! Telugu: Entertainment | 22 Jun 2009 | 7:52 pm నిషేధం సమస్యకు పరిష్కారం కాదు: కారత్మావోయిస్టులపై తీవ్రవాదులుగా ముద్రవేసి, వారిపై నిషేధం విధించడం సమస్యకు పరిష్కారం కాదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ అభిప్రాయపడ్డారు. మావోల ప్రాబల్యాన్ని అడ్డుకునేందుకు రాజకీయ, పాలనా పరమైన చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.Source: Yahoo! Telugu: News | 22 Jun 2009 | 7:48 pm "గాలిశీను" ఏంచేస్తున్నాడు!పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రలో, సత్యకృష్ణన్ (మెంటల్ కృష్ణ ఫేమ్) మరో పాత్రలో నటిస్తోన్న చిత్రం 'గాలిశీను'. స్వప్నమూవీస్ పతాకంపై ఎం.వి. కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించగా, పి. ఉదయభాస్కర్ దర్శకత్వం వహించారు.Source: Yahoo! Telugu: Entertainment | 22 Jun 2009 | 7:47 pm రామానాయుడు "గుజరాతీ" చిత్రంసురేష్ప్రొడక్షన్స్లో డా. డి.రామానాయుడు జాతీయ భాషలన్నింటిలో సినిమాలు నిర్మించాలని కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగానే.. ఈనెల 18న ముంబైలో "గుజరాతీ" సినిమాను ప్రారంభించారు.తెలుగులో హిట్ అయిన 'నాయుడుగారి కుటుంబం' సినిమా ఆధారంగా దీన్ని నిర్మిస్తున్నారు. గుజరాతీ దర్శకుడు అవిరాజ్ ఈ సినిమాకు దర్శకుడు.Source: Yahoo! Telugu: Entertainment | 22 Jun 2009 | 7:45 pm కూటమి పొత్తులతో నష్టం జరిగింది: బర్ధన్ముగిసిన ఎన్నికల్లో కూటమి పొత్తుల వల్ల కొంత నష్టం వాటిల్లిందని సీపీఐ జాతీయ కార్యదర్శి ఏబీ బర్ధన్ అభిప్రాయపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్, భాజపాయేతర కూటములకు ప్రత్యామ్నాయంగా మూడో కూటమి ఏర్పాటుకు తమ వంతు కృషి చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు.Source: Yahoo! Telugu: News | 22 Jun 2009 | 7:29 pm కంపెనీల్లోని ఉద్యోగులను ఆదుకోవాలి: మిట్టల్ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా దేశంలోని పరిశ్రమల్లో భారీ మార్పులు వచ్చాయని, దీంతో కేంద్ర ప్రభుత్వం వివిధ కంపెనీల్లోని ఉద్యోగుల పక్షంవైపుండాలని భారతీ గ్రూప్ అధ్యక్షుడు సునీల్ మిట్టల్ కోరారు.Source: Yahoo! Telugu: News | 22 Jun 2009 | 7:28 pm ఆర్థికాభివృద్ధి 1.2శాతమే: ప్రపంచబ్యాంక్ప్రపంచ దేశాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థికాభివృద్ధి 1.2శాతం మాత్రమే ఉండొచ్చని ప్రపంచబ్యాంక్ అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగానెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా యావత్ ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో చిక్కుకుంది.Source: Yahoo! Telugu: News | 22 Jun 2009 | 6:12 pm తప్పని కష్టాలు: నష్టాలతో ముగిసిన సెన్సెక్స్స్టాక్ మార్కెట్‌ను ఇంకా కష్టాలు వీడినట్లు లేదు. ఉదయం ఆశావహంగా ప్రారంభమైన స్టాక్ మార్కెట్ మధ్యాహ్నం నాటికి నీరుగారిపోయింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 196 పాయింట్లు కోల్పోయి 14,326 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 78 పాయింట్లు నష్టపోయి 4,235 వద్ద ముగిసింది.Source: Yahoo! Telugu: News | 22 Jun 2009 | 6:05 pm మావోయిస్టులపై నిషేధం విధించిన కేంద్రంమావోయిస్టు పార్టీని కేంద్ర ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. దీంతో ఆ సంస్థపై దేశ వ్యాప్త నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మావోయిస్టు పార్టీని ఉగ్రవాద సంస్థగా కేంద్రం ప్రకటించడంతో మావోయిస్టుల వైపు నుంచి ప్రతీకార చర్యలు ఉండవచ్చునని హోం శాఖ హెచ్చరించింది.Source: Yahoo! Telugu: News | 22 Jun 2009 | 5:58 pm ఇంటర్‌లో తప్పిన విద్యార్థులు ఎంసెట్‌లో పాస్ఈ ఏడాది ఎంసెట్ పరీక్షలో అర్హత సాధించిన అయిన 35 వేల మంది విద్యార్థులు ఇంటర్‌మీడియట్ రెండో సంవత్సర, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పన్నెండో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. ఇదిలా ఉంటే ఎంసెట్‌లో అర్హత సాధించిన మరో 3 వేల మంది విద్యార్థులకు సంబంధిత బోర్డులు పన్నెండో తరగతి మార్కుల వివరాలు ఎంసెట్ అధికారులకు అందజేయకపోవడంతో వారికి ర్యాంకులు ఇవ్వలేదు.Source: Yahoo! Telugu: News | 22 Jun 2009 | 5:42 pm కొత్తవారు సత్తా చూపాలి: జస్టిస్ ఏఆర్ లక్ష్మణ్అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం కారణంగా దేశంలో వివిధ వ్యాపారాలు ప్రభావితం అయ్యాయని లా కమిషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ జస్టిస్ ఏఆర్ లక్ష్మణ్ తెలిపారు. ఈ ప్రభావాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, దీని గురించి భీతిల్లిపోవాల్సిన అవసరం లేదని చెప్పారు.Source: Yahoo! Telugu: News | 22 Jun 2009 | 5:32 pm మేము పిల్లల్ని ప్రేమిస్తాం: ఏంజెలీనాహాలీవుడ్ జంట ఏంజెలీనా జోలీ, బ్రాడ్ పిట్‌లు మరింత మంది పిల్లలను దత్తత తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి ఇంద్రధనుస్సు లాంటి కుటుంబాన్ని మరికొందరు పిల్లలను దత్తతలు స్వీకరించడం ద్వారా విస్తరించేందుకు జోలీ, బ్రాడ్ పిట్ సన్నాహాలు చేస్తున్నట్లు డైలీ మెయిల్ పేర్కొంది. "మేము పిల్లల్ని ప్రేమిస్తాం. మేము పెద్ద కుటుంబాన్ని కోరుకుంటున్నాము. అందువలన దత్తత స్వీకరించేందుకు మేమెప్పుడూ కాదని చెప్పబోమని" సీఎన్ఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏంజెలీనా తెలిపింది.Source: Yahoo! Telugu: Entertainment | 22 Jun 2009 | 5:28 pm జూలై మొదటివారంలో వస్తోన్న "అనకొండ-3"లక్ష్మీపాండురంగా ఫిలింస్ బేనర్‌పై సి.హెచ్. ఉమామహేశ్వరి అందిస్తున్న "అనకొండ-3" చిత్రం జూలై మొదటివారంలో విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. ఉత్కంఠిత భరితంగా తెరకెక్కనున్న ఈ సినిమా అత్యాధునిక టెక్నాలజీ, వినూత్న కథాంశంతో రూపుదిద్దుకుంది. హాలీవుడ్‌లో భారీ వ్యయంతో రూపొందిన "మేగాస్నేక్" చిత్రం ఈ 'అనకొండ-3'. మల్టీవిజన్ సంస్థ ద్వారా భారతదేశమంతటా అన్ని భాషల్లో ఒకేసారి విడుదలవుతోంది.Source: Yahoo! Telugu: Entertainment | 22 Jun 2009 | 5:19 pm ఇరాన్ ఘర్షణల్లో వందలాది మంది అరెస్ట్ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భద్రతా దళాలకు, నిరసనకారుల మధ్య పెద్దఎత్తున ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణలకు సంబంధించి అధికారిక యంత్రాంగం 457 మందిని అరెస్టు చేసింది. ఈ నెల 12న జరిగిన ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ అధ్యక్షుడు మహమౌద్ అహ్మదీనెజాద్ ప్రత్యర్థులు నిరసన ప్రదర్శనలకు నేతృత్వం వహిస్తున్నారు.Source: Yahoo! Telugu: News | 22 Jun 2009 | 5:00 pm నా తల్లి హత్యకు నియంతే కారణం: బిలావల్పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, తన తల్లి బేనజీర్ భుట్టో హత్యకు జరిగిన కుట్రలో తమ దేశ మాజీ సైనిక పాలకుడు, అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ హస్తం కూడా ఉందని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) ఛైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ పేర్కొన్నారు. తన తల్లి హంతకుడు కేవం ట్రిగ్గర్ మాత్రమే నొక్కాడని, అయితే అతని తుపాకీలో బుల్లెట్లు నింపిందని "నియంత" అని బిలావల్ చెప్పారు.Source: Yahoo! Telugu: News | 22 Jun 2009 | 4:45 pm జాన్ అబ్రహాం బెడ్‌పై కత్రినా: సల్మాన్ కుతకుతకత్రినా సల్మాన్‌కు దూరంగా జరగడమే కాదు, తన చేష్టలతో అతడిని కుతకుతలాడిస్తోంది. బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాంతో కలిసి ఒకే బెడ్‌పై పడుకోవడమేకాక అతనికి మహా మత్తైన ముద్దు ఇచ్చిందట కైఫ్. ఈ ముద్దు సన్నివేశం న్యూయార్క్ చిత్రంలోనిదైనప్పటికీ రిహార్సిల్స్ అంటూ అబ్రహాం కత్రినా పెదవులపై అదేపనిగా అలసిపోయేంతవరకూ చుంబించాడట. ఇదిలావుంటే సల్మాన్‌కు మరింత చిర్రెత్తించే మరో విషయం అతని ముందు నాట్యమాడుతోందట. అదేంటయా... అంటే, అబ్రహాం- కైఫ్‌ల ముద్దు సన్నివేశం తాలూకు ఉన్న ట్రైలర్‌నే అంతటా చిత్ర దర్శక నిర్మాతలు పంచారట. దీంతో టీవీల్లోనూ, వెబ్ సైట్లలోనూ, పేపర్లలోనూ ఎక్కడ చూసినా కత్రినా- అబ్రహాంల ఘాటైన ముద్దు సన్నివేశం కనబడుతోందట. వీటిని చూసిన సల్మాన్ కాగిపోతున్నాడట.Source: Yahoo! Telugu: Entertainment | 22 Jun 2009 | 4:43 pm 26 వస్తోన్న "ఎవరైనా ఎప్పుడైనా"హ్యాపీడేస్ ఫేమ్ వరుణ్ సందేశ్ హీరోగా, విమలారామన్ హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం "ఎవరైనా ఎప్పుడైనా" (ప్రేమలో పడొచ్చు). హ్యాపీడేస్, కొత్తబంగారులోకం సినిమాల ద్వారా హిట్ కొట్టిన వరుణ్ సందేశ్ "ఎవరైనా ఎప్పుడైనా" ద్వారా మరో హిట్ కొట్టేందుకు సై అంటున్నాడు. మార్తాండ్ శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చారు. ప్రతిష్టాత్మక ఏవీఎం పతాకంపై రూపుదిద్దుకుంటోన్న ఈ టాలీవుడ్ మూవీపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 22 Jun 2009 | 3:46 pm 'కలవరమాయే మదిలో..' ఆడియో విడుదలకలర్స్ స్వాతి, కమల్‌కామరాజ్ జంటగా మోహన్‌మీడియా పతాకంపై 'కలవరమాయే మదిలో..' అనే చిత్రం రూపొందింది. ఈ చిత్రాన్ని మోహన్‌వడ్లపట్ల నిర్మించగా, సతీష్‌కాసెట్టి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆడియో విడుదల లహరి మ్యూజిక్ ద్వారా జరిగింది. ఆదివారం రాత్రి ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగిన కార్యక్రమంలో దిల్‌రాజు సీడీని విడుదలచేసి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డికి ఇచ్చారు. గాయని చిత్ర ఆడియోకేసెట్‌ను విడుదలచేసి దర్శకుడు సముద్రకు అందించారు.Source: Yahoo! Telugu: Entertainment | 22 Jun 2009 | 3:43 pm "ఉత్సవమ్" ఆడియో విడుదలఇండో మోషన్ పిక్చర్స్ పతాకంపై హిందీలో "రాయల్ ఉత్సవమ్" పేరుతో రూపొందిన చిత్రాన్ని తెలుగులో "ఉత్సవమ్"గా అనువదించారు. వై. సోమశేఖర్ రెడ్డి, బి.వై. రాజారెడ్డి ఈ చిత్రం ద్వారా నిర్మాణ రంగంలో ప్రవేశించారు. రవి కె. పట్వా దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో సుప్రీం ద్వారా ఇటీవలే మార్కెట్లోకి విడుదలైంది.Source: Yahoo! Telugu: Entertainment | 22 Jun 2009 | 3:40 pm నగ్నంగా నటించేందుకు సిద్ధం: కంగనా రనౌత్తనకు సినీ వృత్తిపై ఎంతో మక్కువ. నిబ్ధత ఉన్న నటిని. సన్నివేశానికి తగినట్టుగా నగ్నంగా నటించాల్సిన అవసరం వస్తే అందుకు సిద్ధమే అని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ జంకు బొంకులేకుండా చెపుతోంది. ఆమె తాజాగా నటిస్తున్న "రాజ్-2" చిత్రంలో బాత్‌టబ్ నుంచి నగ్నంగా దూకే సన్నివేశం ఉంది.Source: Yahoo! Telugu: Entertainment | 22 Jun 2009 | 3:08 pm నిషేధం సమస్యకు పరిష్కారం కాదు: కారత్మావోయిస్టులపై తీవ్రవాదులుగా ముద్రవేసి, వారిపై నిషేధం విధించడం సమస్యకు పరిష్కారం కాదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ అభిప్రాయపడ్డారు. మావోల ప్రాబల్యాన్ని అడ్డుకునేందుకు రాజకీయ, పాలనా పరమైన చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.Source: జాతీయ | 22 Jun 2009 | 2:19 pm కూటమి పొత్తులతో నష్టం జరిగింది: బర్ధన్ముగిసిన ఎన్నికల్లో కూటమి పొత్తుల వల్ల కొంత నష్టం వాటిల్లిందని సీపీఐ జాతీయ కార్యదర్శి ఏబీ బర్ధన్ అభిప్రాయపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్, భాజపాయేతర కూటములకు ప్రత్యామ్నాయంగా మూడో కూటమి ఏర్పాటుకు తమ వంతు కృషి చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు.Source: ఏపీ న్యూస్ | 22 Jun 2009 | 1:59 pm కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం భాజపాయే: వెంకయ్యజాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీయేనని ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు చెప్పారు. భవిష్యత్తులో భాజపా మరింత పటిష్టమైన పార్టీగా వెలుగొందుతుందని ఆయన జోస్యం తెలిపారు. ఎన్నికల పరాజయంపై మేధోమథనం నిర్వహించి లోతుగా చర్చించామని వెంకయ్యనాయుడు అన్నారు.Source: ఏపీ న్యూస్ | 22 Jun 2009 | 12:36 pm మావోయిస్టులపై నిషేధం విధించిన కేంద్రంమావోయిస్టు పార్టీని కేంద్ర ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. దీంతో ఆ సంస్థపై దేశ వ్యాప్త నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మావోయిస్టు పార్టీని ఉగ్రవాద సంస్థగా కేంద్రం ప్రకటించడంతో మావోయిస్టుల వైపు నుంచి ప్రతీకార చర్యలు ఉండవచ్చునని హోం శాఖ హెచ్చరించింది.Source: జాతీయ | 22 Jun 2009 | 12:29 pm చెన్నపురి విహంగాల విడిది "అడయార్ పార్క్"వేసవి సెలవులు వచ్చాయంటే చాలు చల్లగా ఉండే ప్రదేశాలు ఎక్కడెక్కడో ఉన్నాయో వెతుక్కుని మరీ, మనం అక్కడ వాలిపోతుంటాం. మన సంగతి సరే.. మరి పక్షులు...? పక్షులకు కూడా వేసవి సెలవులు ఉంటాయా.. ఏంటి? అని అనుకుంటున్నారా..? సెలవులు ఉంటాయో...Source: వినోదం | 22 Jun 2009 | 11:42 am జాన్ అబ్రహాం బెడ్‌పై కత్రినా: సల్మాన్ కుతకుతకత్రినా సల్మాన్‌కు దూరంగా జరగడమే కాదు, తన చేష్టలతో అతడిని కుతకుతలాడిస్తోంది. బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాంతో కలిసి ఒకే బెడ్‌పై పడుకోవడమేకాక అతనికి మహా మత్తైన ముద్దు ఇచ్చిందట కైఫ్. ఈ ముద్దు సన్నివేశం న్యూయార్క్ చిత్రంలోనిదైనప్పటికీ రిహార్సిల్స్ అంటూ అబ్రహాం కత్రినా...Source: వినోదం | 22 Jun 2009 | 11:15 am వరుణ్ వ్యాఖ్యల్లో న్యాయ సమస్యలు: రాజ్నాథ్తమ పార్టీ యువనేత వరుణ్ గాంధీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల్లో న్యాయ సమస్యలు ఉన్నాయని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంలో చట్టం తన పని తాను చేయనివ్వండని ఆయన ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.Source: జాతీయ | 22 Jun 2009 | 10:45 am కేసీఆర్ మరో నాటకం: అసమ్మతి నేతలుతెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు ఆడిన మరో నాటకం రక్తికట్టించి, ప్రజలను బాగా ఆకట్టుకుందని ఆ పార్టీకి చెందిన అసమ్మతి నేతలు అభిప్రాయపడ్డారు. పార్టీ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్‌తో అసమ్మతి నేత చంద్రశేఖర నేతృత్వంలోని పలువురు నేతలు భేటీ అయ్యారు.Source: ఏపీ న్యూస్ | 22 Jun 2009 | 8:20 am సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యత: ముఖ్యమంత్రిదైవ దర్శనార్థం ఆలయాలకు వచ్చే సామాన్య భక్తకోటికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి పిలుపునిచ్చారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే విషయంలో రాజీ పడవద్దని ఆయన అధికారులకు హితవు పలికారు.Source: ఏపీ న్యూస్ | 22 Jun 2009 | 8:15 am ఆస్ట్రేలియా దాడులు: కేంద్రానికి సుప్రీం నోటీసుఆస్ట్రేలియాలోని భారతీయ విద్యార్థులపై జరిగిన జాత్యాహంకార దాడులకు దేశ అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. దాడులను ఆపేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టిందో వివరించాలని సోమవారం సుప్రీం కోర్టు నోటీసు జారీ చేసింది.Source: జాతీయ | 22 Jun 2009 | 8:02 am దేశంలో పెరుగుతున్న స్వైన్ ఫ్లూ కేసులుదేశంలో స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం మరో మూడు కేసులు వెలుగు చూశాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 59కు చేరింది. కాగా, కొత్తగా వెలుగు చూసిన మూడు కేసుల్లో రెండు కేసులు చెన్నయ్‌లోనూ, మరో కేసు దేశ రాజధాని న్యూఢిల్లీలో బయటపడింది.Source: జాతీయ | 22 Jun 2009 | 6:22 am రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరం: రోశయ్యరాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని రాష్ట్ర విత్త మంత్రి కొణిజేటి రోశయ్య అన్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు శాయశక్తులా కృషి చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు.Source: ఏపీ న్యూస్ | 22 Jun 2009 | 6:07 am లాల్‌గఢ్‌లో కొనసాగుతున్న కోబ్రా ఆపరేషన్మావోయిస్టులు ఆధీనంలో ఉన్న లాల్‌గఢ్‌కు విముక్తి కల్పించేందుకు స్థానిక పోలీసుల సాయంతో కేంద్ర బలగాలు సాగిస్తున్న కోబ్రా ఆపరేషన్ సోమవారం కూడా కొనసాగుతోంది.Source: జాతీయ | 22 Jun 2009 | 5:53 am కూర్చుని తినడానికి సిగ్గులేదు"అదేంటండీ నిలబడి తింటున్నారు?" అడిగింది గిరిజ "భార్య సంపాదిస్తుంటే కూర్చుని తినడానికి సిగ్గులేదూ..!Source: వినోదం | 22 Jun 2009 | 5:11 am చాప కింద చీమలు"ఏంటండీ.? మీరు పడుకున్న చాప కింద ఎప్పుడూ చీమలు కనిపిస్తున్నాయ్?" అడిగింది భార్య "ఏం లేదులే...వే!Source: వినోదం | 22 Jun 2009 | 5:09 am నక్సల్స్ బంద్: హింసాకాండపై కేంద్రం హెచ్చరికదేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో సోమ, మంగళవారాల్లో మావోయిస్టులు బంద్‌కు పిలుపునివ్వడంతో కేంద్ర ప్రభుత్వం భద్రతా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఇదిలా ఉంటే లాల్‌గఢ్‌ను మావోయిస్టుల చెర నుంచి విడిపించిన భద్రతా దళాలు ఆదివారం మావోయిస్టులతో తాజా పోరుకు రంగం సిద్ధం చేశాయి.Source: జాతీయ | 22 Jun 2009 | 4:05 am బీజేపీ హిందుత్వను వదిలిపెట్టలేదు: అద్వానీబీజేపీ హిందుత్వను వదిలిపెట్టలేదని, అదేవిధంగా ఆర్ఎస్ఎస్‌తో సంబంధాలు కూడా తెంచుకోలేదని పార్టీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ స్పష్టం చేశారు. ఆయన ఆదివారం పార్టీ కార్యవర్గ సమావేశంలో ముగింపు ప్రసంగం చేస్తూ.. బీజేపీ నాయకత్వాన్ని బహిరంగంగా సవాలు చేస్తున్న వారికి ఘాటైన సమాధానమిచ్చారు.Source: జాతీయ | 22 Jun 2009 | 3:50 am
|