కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం భాజపాయే: వెంకయ్య

జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీయేనని ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు చెప్పారు. భవిష్యత్తులో భాజపా మరింత పటిష్టమైన పార్టీగా వెలుగొందుతుందని ఆయన జోస్యం తెలిపారు. ఎన్నికల పరాజయంపై మేధోమథనం నిర్వహించి లోతుగా చర్చించామని వెంకయ్యనాయుడు అన్నారు.
Source: Yahoo! Telugu: News | 21 Jun 2009 | 5:40 pm

లెఫ్ట్ వైఖరి వల్లే కాంగ్రెస్‌కు విజయం: బర్ధన్

గత ఐదేళ్ళ కాలంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరి వల్లే కాంగ్రెస్ పార్టీ కేంద్ర, రాష్ట్రాల్లో విజయం సాధించిందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏబీ.బర్ధన్ అభిప్రాయపడ్డారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఆదివారం ప్రారంభమయ్యాయి.
Source: Yahoo! Telugu: News | 21 Jun 2009 | 5:31 pm

ఎయిర్‌ ఇండియాకు కేంద్ర సాయం: జాదవ్

ఆర్థిక మాంద్యం పుణ్యమాని నిధుల సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఎయిరిండియాను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఆ సంస్థకు అవసరమైన సాయం చేసేందుకు కేంద్రం అంగీకరించిందని ఎయిర్ ఇండియా ఛైర్మన్, ఎండీ అరవింద్ జాదవ్ సూచన ప్రాయంగా వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 21 Jun 2009 | 5:14 pm

ఎంసెట్ ర్యాంకుల విడుదల

ఎంసెట్ ర్యాంకులను సాంకేతిక శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ ఆదివారం విడుదల చేశారు. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్శిటీ (జెఎన్‌టియు) ఎంసెట్ ర్యాంకుల్లో ఇంజనీరింగ్‌కు 2,72,086 మంది, మెడిసన్‌కు 66,351 మంది అర్హత సాధించారు.
Source: Yahoo! Telugu: News | 21 Jun 2009 | 5:14 pm

చైనా ఫ్యాక్టరీలో భారీ పేలుడు: 16మంది మృతి

చైనాలోని అన్హూయ్ ఫ్యాక్టరీలో సంభవించిన భారీ పేలుడులో 16 మంది మృతి చెందారు. ఆదివారం జరిగిన ఈ భారీ పేలుడులో మరో 42 మంది తీవ్రంగా గాయపడ్డారని స్థానిక పోలీసులు తెలిపారు. మృతి చెందిన వారిలో అధికంగా ఉద్యోగులేనని, గాయపడిన వారిని ఫ్యాక్టరీ సమీపంలో నివశించిన వారని స్థానిక పోలీసులు వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 21 Jun 2009 | 4:47 pm

ఆగస్టులో భారత్‌కు రానున్న నేపాల్ ప్రధాని

నేపాల్ దేశ కొత్త ప్రధానమంత్రి మాధవ్ కుమార్ నేపాల్ వచ్చే ఆగస్టు నెలలో భారత్‌ పర్యటనకు విచ్చేయనున్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఆయన, తమ మంత్రివర్గాన్ని విస్తరించాల్సి ఉండటంతో, ఆయన భారత పర్యటన ఆలస్యమైంది.
Source: Yahoo! Telugu: News | 21 Jun 2009 | 4:09 pm

రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్: వైఎస్సార్

రైతులకు కచ్చితంగా 9గంటల ఉచిత విద్యుత్ అందించేందుకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి అన్నారు. దీనికోసం జాతీయ విద్యుత్ నిధి నుంచి సాయం అందించాల్సిందిగా కేంద్రాన్ని కోరుతామని సీఎం వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 21 Jun 2009 | 3:56 pm

ఆ గొంతు వరుణ్‌ గాంధీదే: ఫోరెన్సిక్ నివేదిక

మైనార్టీ వర్గ ప్రజలకు వ్యతిరేకంగా ప్రసంగించి వివాదంలో చిక్కున్న భారతీయ జనతా పార్టీ యువనేత వరుణ్ గాంధీపై ఉచ్చు బిగిస్తోంది. ఫిలిబిత్ ప్రసంగం టేపుల్లోని గొంతు వరుణ్ గాంధీదేనని ఫోరెన్సిక్ విభాగం తేల్చి చెప్పింది.
Source: Yahoo! Telugu: News | 21 Jun 2009 | 3:51 pm

బెర్గర్ పెయింట్స్ లాభం రూ.88 కోట్లు

పెయింట్స్ ఉత్పత్తి కంపెనీల్లో ఒకటిగా పేరుగాంచిన బెర్గర్ పెయింట్స్.. గత మార్చి 31వ తేదీతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 88 కోట్ల రూపాయల మేరకు ఆదాయాన్ని అర్జించినట్టు ఆ సంస్థ వెల్లడించింది. 2007-08 ఆర్థిక సంవత్సరంలో ఈ ఆదాయం 92 కోట్ల రూపాయలుగా నమోదైనట్టు తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 21 Jun 2009 | 2:48 pm

నాన్న ఫోటోముందు అడ్వాన్స్ ఇచ్చారు: మార్తాండ్ శంకర్

సీనియర్ ఎడిటర్ "మార్తాండ్‌" రెండో కుమారుడు మార్తాండ్‌ శంకర్‌. తొలిసారిగా ఆయనకు ఏవీఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థలో దర్శకుడిగా అవకాశం రావడం ఊహించని పరిణామమని అంటున్నారు.వరుణ్‌సందేశ్‌, విమలారామన్‌ జంటగా 'ఎవరైనా ఎప్పుడైనా' (ప్రేమలో పడొచ్చు) అనే చిత్రానికి మార్తాండ్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈనెల 26న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ...ప్రశ్న.. ఎడిటర్ ఫ్యామిలీ నుంచి దర్శకునిగా ఎలా మారారు?జ.. దర్శకుడు కావాలన్నది నా కోరిక. అన్నయ్య మార్తాండ్ వెంకటేష్ పలు సినిమాలు పరిశీలించాను. ప్రేమించుకుందాం రా డైరక్టర్ జయంత్ వద్ద టక్కరిదొంగ వరకు పనిచేశాను. ఇలాగే దర్శకునిగా మారాల్సి వచ్చింది. ప్రశ్న.. ఈ చిత్రం హైలైట్‌ ఏమిటి?జ.. క్లైమాక్స్‌లో రెండు రీల్స్‌ అద్భుతంగా వచ్చాయి. అలాగే రమాప్రభ, హీరో, వేణుమాధవ్‌, హీరోయిన్‌ సీన్స్‌ చిత్రానికి ఆయువుపట్టు. ప్రశ్న.. ఈ బేనర్‌లో చేయడం ఎలా అనిపిస్తుంది?జ.. ఏవీఏం వంటి సంస్థలో పనిచేయడం ఇప్పటికీ ఎక్సైటింగ్‌గా ఉంది. ఏవీఎం బేనర్‌లో 172 సినిమా అని స్టూడియోలో ఫొటోకూడా పెట్టుకున్నారు. ఇదిచాలు... అంటూ ముగించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Jun 2009 | 1:40 pm

30 శాతం పెంపును కోరుతున్న ఎస్బీఐ ఆఫీసర్లు

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ సంస్థ భారతీయ స్టేట్ బ్యాంకు ఆఫీసర్లు ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాగే, 30 శాతం మేరకు జీతభత్యాల పెంపును కోరుతున్నారు. ఈ మేరకు ఆల్ ఇండియా ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Source: Yahoo! Telugu: News | 21 Jun 2009 | 1:25 pm

కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం భాజపాయే: వెంకయ్య

జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీయేనని ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు చెప్పారు. భవిష్యత్తులో భాజపా మరింత పటిష్టమైన పార్టీగా వెలుగొందుతుందని ఆయన జోస్యం తెలిపారు. ఎన్నికల పరాజయంపై మేధోమథనం నిర్వహించి లోతుగా చర్చించామని వెంకయ్యనాయుడు అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 21 Jun 2009 | 12:13 pm

లెఫ్ట్ వైఖరి వల్లే కాంగ్రెస్‌కు విజయం: బర్ధన్

గత ఐదేళ్ళ కాలంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరి వల్లే కాంగ్రెస్ పార్టీ కేంద్ర, రాష్ట్రాల్లో విజయం సాధించిందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏబీ.బర్ధన్ అభిప్రాయపడ్డారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఆదివారం ప్రారంభమయ్యాయి.
Source: జాతీయ | 21 Jun 2009 | 12:02 pm

ఎంసెట్ ర్యాంకుల విడుదల

ఎంసెట్ ర్యాంకులను సాంకేతిక శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ ఆదివారం విడుదల చేశారు. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్శిటీ (జెఎన్‌టియు) ఎంసెట్ ర్యాంకుల్లో ఇంజనీరింగ్‌కు 2,72,086 మంది, మెడిసన్‌కు 66,351 మంది అర్హత సాధించారు.
Source: ఏపీ న్యూస్ | 21 Jun 2009 | 11:45 am

రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్: వైఎస్సార్

రైతులకు కచ్చితంగా 9గంటల ఉచిత విద్యుత్ అందించేందుకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి అన్నారు. దీనికోసం జాతీయ విద్యుత్ నిధి నుంచి సాయం అందించాల్సిందిగా కేంద్రాన్ని కోరుతామని సీఎం వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 21 Jun 2009 | 10:28 am

ఆ గొంతు వరుణ్‌ గాంధీదే: ఫోరెన్సిక్ నివేదిక

మైనార్టీ వర్గ ప్రజలకు వ్యతిరేకంగా ప్రసంగించి వివాదంలో చిక్కున్న భారతీయ జనతా పార్టీ యువనేత వరుణ్ గాంధీపై ఉచ్చు బిగిస్తోంది. ఫిలిబిత్ ప్రసంగం టేపుల్లోని గొంతు వరుణ్ గాంధీదేనని ఫోరెన్సిక్ విభాగం తేల్చి చెప్పింది.
Source: జాతీయ | 21 Jun 2009 | 10:24 am

నక్సల్ ప్రభావిత రాష్ట్రాల్లో కోబ్రా ఆపరేషన్

నక్సల్ ప్రభావిత రాష్ట్రాల్లో కోబ్రా ఆపరేషన్ నిర్వహించేందుకు ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలు సమాయత్తమవుతున్నాయి. ఇందుకోసం ఒక్కో బెటాలియన్‌లో 2000 మంది సాయుధ బలగాలతో కూడిన కంబోట్ బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్ బృందాలను ఇప్పటికే పంపినట్టు రెండు రాష్ట్రాల ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Source: జాతీయ | 21 Jun 2009 | 7:40 am

భక్తులతో కిటకిటలాడుతోన్న శ్రీవారి ఆలయం

కలియుగ ప్రత్యక్షదైవం, శ్రీ వేంకటేశ్వరుని ఆలయం ఆదివారం అశేష భక్త జనసందోహంతో నిండిపోయింది. వారాంతం కావడంతో శుక్రవారం నుంచి భక్తులతో కిటకిటలాడుతున్న శ్రీవారి ఆలయం ఆదివారం అశేష భక్తజన సందోహంతో దర్శనమిచ్చింది. అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోవడంతో రెండు కిలోమీటర్ల మేర క్యూలైన్లు ఏర్పడ్డాయి. దీంతో శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
Source: ఏపీ న్యూస్ | 21 Jun 2009 | 7:18 am

కార్గిల్‌ను సందర్శించనున్న ఉపరాష్ట్రపతి

ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఆదివారం కార్గిల్‌ను సందర్శించనున్నారు. జమ్ముకాశ్మీర్‌ రాష్ట్ర పర్యటనలో ఉన్న ఆయన కార్గిల్ సెక్టార్‌లోని సరిహద్దు నియంత్రణ రేఖను సందర్శించి, అక్కడ విధులు నిర్వహిస్తున్న జవాన్లతో ముచ్చటిస్తారు.
Source: జాతీయ | 21 Jun 2009 | 7:13 am

ప్రాంతీయ పార్టీగా ప్రజారాజ్యానికి ఈసీ గుర్తింపు

తెలుగు వెండితెర హీరో చిరంజీవి పది నెలల క్రితం స్థాపించిన ప్రజారాజ్యంకు ప్రాంతీయ పార్టీ గుర్తింపు లభించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి లభించిన ఫలితాలు, ఓట్ల శాతాన్ని ఆధారంగా చేసుకుని పీఆర్పీకి రాష్ట్రంలో రాజకీయ పార్టీగా గుర్తింపు ఇస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది.
Source: ఏపీ న్యూస్ | 21 Jun 2009 | 6:19 am

మావోల ఘాతుకం: 29 మంది జవాన్ల మృతి

నక్సల్ ప్రభావిత రాష్ట్రాల్లో ఒకటైన ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు భద్రతా బలగాలపై విరుచుకు పడ్డారు. బలగాలను లక్ష్యంగా చేసుకుని శనివారం రాత్రి పేల్చిన మందు పాతరకు.. 29 మంది జవాన్ల మృతి చెందారు. రాయ్‌పూర్‌ దళానికి చెందిన మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
Source: జాతీయ | 21 Jun 2009 | 5:02 am

పదుకునే అంటే పడి చస్తోన్న హాలీవుడ్ నిర్మాత

బాలీవుడ్ సెక్సీ బొమ్మ దీపికా పదుకునే అంటే చొంగ కార్చుకునేవారు చాలామందే ఉన్నారు. ఆమె సెక్సీ నవ్వు విసిరితే చాలు బొక్కబోర్లా పడిపోవడం ఖాయమని బాలీవుడ్ సినీజనం అంటుంటారు. ఇప్పుడు ఈ జాబితాలో ఓ హాలీవుడ్ నిర్మాత చేరిపోయారు. దీపికా అందాన్ని చూసి అతను ప్లాటై పోయాడట.
Source: Yahoo! Telugu: Entertainment | 20 Jun 2009 | 6:45 pm

జూన్ 28న "మగధీర" ఆడియో విడుదల

తొలిచిత్రం "చిరుత"తోనే కలెక్షన్స్‌లో రికార్డ్ సృష్టించిన మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా నటిస్తోన్న చిత్రం "మగధీర". వరుసగా ఆరు సూపర్ హిట్స్ ఇచ్చి డబుల్ హ్యాట్రిక్ సాధించిన సూపర్ సక్సెస్‌ఫుల్ డైరక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు
Source: Yahoo! Telugu: Entertainment | 20 Jun 2009 | 4:42 pm

నాలుగో షెడ్యూల్‌లో "అల్లు అర్జున్" కొత్త చిత్రం

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా, డైనమిక్ డైరక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాత డి.వి.వి. దానయ్య నిర్మించే కొత్త చిత్రం నాలుగో షెడ్యూల్ ఈ నెల 19 నుంచి జరుగుతోంది. యూనివర్శల్ మీడియా పతాకంపై నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని నాలుగో షెడ్యూల్‌తో ఏకధాటిగా చిత్రం పూర్తయ్యే వరకు షూటింగ్ జరుపుతామని నిర్మాత వెల్లడించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 20 Jun 2009 | 4:36 pm

స్లమ్‌డాగ్ బాలనటులకు తప్పిన ప్రమాదం

8 ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రంలో బాలనటులుగా నటించిన అజారుద్దీన్ ఇస్మాయిల్, రుబీనా అలీలు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ముంబై మురికి వాడలో గురువారం జరిగిన అగ్నిప్రమాదం నుంచి వీరిద్దరు సురక్షితంగా బయటపడ్డారు. డానీ బోయెల్ చిత్రం స్లమ్‌డాగ్‌లో సలీమ్, లతికా పాత్రల్లో నటించిన ఇస్మాయిల్, రుబీనాలు ముంబైలోని మురికివాడలో నివసిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాంతంలో గురువారం సాయంత్రం నాలుగు గంటలకు హఠాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. సిలిండర్ పేలడంతో సంభవించిన ఈ అగ్నిప్రమాదంలో 15 మంది గాయాల పాలయ్యారు. దాదాపు 200 గుడిసెలు దగ్ధమయ్యాయి. అయితే అజారుద్ధీన్ గృహానికి 30 మీటర్ల ముందే మంటలు ఆరిపోవడంతో, ఈ ప్రమాదం నుంచి అజర్ బయటపడ్డాడు. అదేవిధంగా ఈ అగ్నిప్రమాదంతో తమకు ఎలాంటి నష్టం కలగలేదని రుబీనా వెల్లడించింది.
Source: Yahoo! Telugu: Entertainment | 20 Jun 2009 | 3:54 pm

బాలకృష్ణకు పగ్గాలు ఇవ్వండి: ప్రసన్న లేఖ

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును లక్ష్యంగా చేసుకుని నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ శనివారం మరో లేఖాస్త్రాన్ని సంధించారు. పార్టీ అధ్యక్ష బాధ్యతల బాబు తప్పుకోవాలని డిమాండ్ చేశారు.
Source: ఏపీ న్యూస్ | 20 Jun 2009 | 2:34 pm

మావోయిస్టు సంస్థ నిషేధంపై పరిశీలన: బుద్ధదేవ్

రాష్ట్రంలో అరాచక కార్యకలాపాలకు పాల్పడుతున్న సీపీఐ మావోయిస్టు సంస్థపై ప్రభుత్వం నిషేధం విధించవచ్చని పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య అభిప్రాయపడ్డారు. కాగా, మావోయిస్టులు విముక్తి జోన్‌గా ప్రకటించుకున్న లాల్‌గఢ్‌లోకి భద్రతా బలగాలు శనివారం ప్రవేశించాయి.
Source: జాతీయ | 20 Jun 2009 | 2:33 pm