|
ప్రజారాజ్యానికి డాక్టర్ మిత్రా రాం..రాంప్రజారాజ్యం పార్టీకి మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన డాక్టర్ పుచ్చలపల్లి మిత్రా పార్టీకి రాజీనామా చేశారు. సైద్ధాంతిక విభేదాల వల్ల పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆయన అధ్యక్షుడు చిరంజీవికి సమర్పించిన లేఖలో పేర్కొన్నారు.Source: Yahoo! Telugu: News | 20 Jun 2009 | 4:49 pm మా దళాలను పాక్‌కు పంపే ఉద్దేశ్యం లేదు: ఒబామాస్వాత్ లోయలో పాకిస్తాన్ దళాలకు సహాయంగా అమెరికా తమ సేనలను పంపిస్తుందన్న ఊహాగానాల నేపధ్యంలో, తమకు అటువంటి ఉద్దేశ్యం ఏదీ లేదని బారక్ ఒబామా తేల్చి చెప్పారు. తాలిబన్లను సమర్థవంతంగా ఎదుర్కొనగల శక్తి పాకిస్తాన్‌కి ఉన్నదనీ, పాక్ దళాలు అత్యంత చాకచక్యంగా పోరు సాగిస్తున్నాయన్నారు.Source: Yahoo! Telugu: News | 20 Jun 2009 | 4:34 pm స్లమ్‌డాగ్ బాలనటులకు తప్పిన ప్రమాదం8 ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రంలో బాలనటులుగా నటించిన అజారుద్దీన్ ఇస్మాయిల్, రుబీనా అలీలు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ముంబై మురికి వాడలో గురువారం జరిగిన అగ్నిప్రమాదం నుంచి వీరిద్దరు సురక్షితంగా బయటపడ్డారు. డానీ బోయెల్ చిత్రం స్లమ్‌డాగ్‌లో సలీమ్, లతికా పాత్రల్లో నటించిన ఇస్మాయిల్, రుబీనాలు ముంబైలోని మురికివాడలో నివసిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాంతంలో గురువారం సాయంత్రం నాలుగు గంటలకు హఠాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. సిలిండర్ పేలడంతో సంభవించిన ఈ అగ్నిప్రమాదంలో 15 మంది గాయాల పాలయ్యారు. దాదాపు 200 గుడిసెలు దగ్ధమయ్యాయి. అయితే అజారుద్ధీన్ గృహానికి 30 మీటర్ల ముందే మంటలు ఆరిపోవడంతో, ఈ ప్రమాదం నుంచి అజర్ బయటపడ్డాడు. అదేవిధంగా ఈ అగ్నిప్రమాదంతో తమకు ఎలాంటి నష్టం కలగలేదని రుబీనా వెల్లడించింది.Source: Yahoo! Telugu: Entertainment | 20 Jun 2009 | 3:54 pm అమెరికా స్టాక్ మార్కెట్లుఅమెరికా స్టాక్ మార్కెట్లు.. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ ఇండెక్స్ - 0.19 శాతంతో 15.87 పాయింట్లు నష్టపోయి 8,539.73 వద్దకు చేరుకుంది. స్టాండార్డ్ అండ్ పూర్ 500 ఇండెక్స్ - 0.31 శాతంతో 2.86 పాయింట్లు లాభపడి 921.23 వద్దకు చేరుకుంది. నాస్‌డాక్ కంపోజిట్ ఇండెక్స్ - 1.09 శాతంతో 19.75 పాయింట్లు బలపడి 1,827.47 వద్దకు చేరుకుంది.Source: Yahoo! Telugu: News | 20 Jun 2009 | 3:48 pm 12.5శాతం పెరిగిన ఢిల్లీవాసుల ఆదాయంప్రపంచవ్యాప్తంగానెలకొన్న ఆర్థికమాంద్యంతో అతలాకుతలమౌతుంటే ఢిల్లీ ప్రజలు దీనికి అతీతులుగా నిలిచారు. ఢిల్లీ ప్రజల వార్షిక ఆదాయం 12.5% పెరిగింది.Source: Yahoo! Telugu: News | 20 Jun 2009 | 3:42 pm ఎన్నికల ఓటమికి బాధ్యత వహించిన రాజ్నాథ్ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి ఎదురైన ఓటమికి తానే నైతిక బాధ్యత వహిస్తున్నట్టు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. భాజపా ఎగ్జిక్యూటివ్ సమావేశానిక ముందు ఆయన ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 20 Jun 2009 | 3:24 pm బాలీవుడ్ మూవీ "న్యూయార్క్" సినిమా ట్రైలర్ప్రముఖ నిర్మాణ సంస్థ యాష్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్న బాలీవుడ్ చిత్రం "న్యూయార్క్" ఈ చిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆసియా అందగత్తె, అందాల రాశి కత్రీనా కైఫ్ హీరోయిన్‌గా, జాన్ అబ్రహాం, నెయిల్ ముఖేష్, ఇర్ఫాన్ ఖాన్‌లు కీలక పాత్ర పోషించే ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందింది.Source: Yahoo! Telugu: Entertainment | 20 Jun 2009 | 1:57 pm 'స్నేహితుడా' ఆడియో ఆవిష్కరణనాని, మాధవీలత జంటగా జెమినీ ఫిలిమ్ సర్క్యూట్ సమర్పిస్తున్న చిత్రం 'స్నేహితుడా'. సత్యం బెల్లంకొండ దర్శకత్వంలో శంకర్‌దాదా ఎం.బి.బి.ఎస్. నిర్మాత రవిశంకర్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా శుక్రవారం రాత్రి విడుదలైంది. ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన రమేష్‌ప్రసాద్ ఆడియోను ఆవిష్కరించగా, సీడీని హీరో గోపీచంద్ విడుదల చేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 20 Jun 2009 | 1:49 pm అరశాతం వడ్డీ తగ్గించిన యూకో బ్యాంక్తమ బ్యాంక్ ఖాతాదారులు తమ బ్యాంక్‌లో పెట్టే పెట్టుబడులపై, సేవింగ్స్ ఖాతాలపై అరశాతం వడ్డీని తగ్గించినట్లు యూకో బ్యాంక్ ప్రకటించింది.Source: Yahoo! Telugu: News | 20 Jun 2009 | 1:31 pm కేంద్రం వైఖరిపై నరేంద్ర మోడీ సీరియస్!సంఘ విద్రోహ శక్తుల ఆట కట్టించేందుకు గుజరాత్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కోకా బిల్లును కేంద్రం తిప్పిపంపడం పట్ల గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఉగ్రవాదుల దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాలంటే ఇలాంటి కఠిన చట్టం కావాలని మోడీ విశ్వసిస్తున్నారు.Source: Yahoo! Telugu: News | 20 Jun 2009 | 1:29 pm తెరాస అధ్యక్ష స్థానంలో రాములమ్మ?తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్ష మార్పడి ఖాయమని తెలుస్తోంది. ఆ బాధ్యతల నుంచి తప్పుకున్న కేసీఆర్.. తిరిగి బాధ్యతలను చేపట్టరాదనే కృత నిశ్చయంతో ఉన్నారు. దీంతో అధ్యక్ష పదవికి కొత్తవారిని ఎంపిక చేసే పనిలో తెరాస నాయకత్వం ఉంది.Source: Yahoo! Telugu: News | 20 Jun 2009 | 1:14 pm ఉగ్రవాదాన్ని ఇస్లాంతో ముడిపెట్టకండి: షరీఫ్ఉగ్రవాదాన్ని ఇస్లాంతో ముడిపెట్టకండని పాకిస్థాన్ ముస్లింలీగ్-నవాజ్(పీఎమ్ఎల్-ఎన్) అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హింస వేళ్ళూనుకుందని, దీనిని నివారించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు.Source: Yahoo! Telugu: News | 20 Jun 2009 | 1:09 pm ప్రభుత్వంతో చర్చలకు మావోయిస్టుల షరతులుచర్చలకు రావాలని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం ఇచ్చిన పిలుపుకు బెంగాల్ మావోయిస్టులు స్పందించారు. ఆయుధాలు వీడి ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధమేనని ప్రకటించారు. అయితే, ఇందుకు కొన్ని షరతులను విధించారు.Source: Yahoo! Telugu: News | 20 Jun 2009 | 12:10 pm ఇక నా పెదవులు వాటిని తాకవు: శ్రేయదక్షిణాది సెక్సీ తార శ్రేయా చరణ్ సాఫ్ట్ డ్రింక్ ప్రకటనల్లో నటించనని భీష్మించుక కూచుంది. పెద్ద మొత్తంలో పారితోషికం ఇస్తామనీ, మా సాఫ్ట్ డ్రింకులను మీరు తాగుతూ నటించినట్లుగా మరెవరూ నటించలేరనీ పొగడ్తలతో ముంచెత్తినా... శ్రేయ మాత్రం కుదరదంటోందట. "అందుకు కారణం ఏమిటి మిస్" అని మన పిల్ల జర్నలిస్ట్ అడిగితే ఈ విషయాలు ఆమె సన్నిహితులు చెప్పారట. గతంలో శ్రేయ కొన్ని సాఫ్ట్ డ్రింక్ ప్రకటనలు చేసిందట. ఒకరోజు ఓ తల్లి శ్రేయ వద్దకు వచ్చి... 'మా అబ్బాయికి మీరంటే ఎంతో అభిమానం. మీరు సాఫ్ట్ డ్రింక్ తాగుతున్నట్లుగా నటించిన దగ్గర్నుంచీ, మా అబ్బాయి తిండి తగ్గించి అదేపనిగా మీరు తాగిన డ్రింక్స్‌నే అతిగా తాగేస్తున్నాడు' అని చెప్పిందట. అంతే! ఇక సాఫ్ట్ డ్రింక్ ప్రకటనల్లో ఎట్టి పరిస్థితుల్లో నటించకూడదని ఆ రోజే నిర్ణయించుకున్నదట శ్రేయ. అదిసరే ఇదే విషయాన్ని మన మహేష్ బాబుకు, రామ్ చరణ్‌కు చెబితే బాగుంటుదిగా.Source: Yahoo! Telugu: Entertainment | 20 Jun 2009 | 12:01 pm సుశాంత్‌ది లో ఓల్టేజ్ "కరెంట్"నటీనటులు: సుశాంత్, స్నేహా ఉల్లాల్, తనికెళ్ళ భరణి, సుధ తదితరులు.నిర్మాతలు: చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల, కథ, దర్శకత్వం, స్క్రీన్‌ప్లే : సూర్యప్రతాప్,పాయింట్: ప్రేమంటే జ్ఞాపకాలు కాదు జీవితం.తొలి పరిచయంలోనే హీరో హీరోయిన్‌ను ప్రేమించేయడం. ఆ తర్వాత ఆమె కాదన్నా ఒప్పించేలా చేయడం, ఆ విషయం పెద్దలకు తెలియడం.. ససేమిరా అనడం. క్లైమాక్‌లో ప్రేమ ఎప్పుడూ సజీవమే అనే ముగింపు. ఈ రకమైన రొటీన్ చిత్రాలకు "కరెంట్" భిన్నమైన చిత్రం కాదు. ఇందులో సుశాంత్ తల్లిదండ్రులుగా తనికెళ్ళభరణి, సుధ నటించారు. రేపటి గురించి ఆలోచించక నేటిగురించే యోచించే క్యారెక్టర్ సుశాంత్‌ది. ఇక జడ్జి చరణ్‌రాజ్ కుమార్తె స్నేహ (స్నేహా ఉల్లాల్). స్నేహను తొలిచూపులోనే ప్రేమించే సుశాంత్, ఆమెను కూడా కొన్ని ట్రిక్కులు చేసి ప్రేమించేలా చేస్తాడు. కానీ సుశాంత్ క్యారెక్టర్ నచ్చక చరణ్‌రాజ్ ప్రేమను అంగీకరించడు. అప్పటికే ప్రేమలో మునిగిపోయిన స్నేహ, ఇక సుశాంత్ మారడని తెలుసుకుని 'నా మనసులో ప్రేమను పుట్టించింది.. నువ్వే కనుక దాన్ని నా మనసులోనుంచి తీసివేయమని' కొత్త పాయింట్ ముందుంచడం ట్విస్ట్.Source: Yahoo! Telugu: Entertainment | 20 Jun 2009 | 11:43 am ప్రజారాజ్యానికి డాక్టర్ మిత్రా రాం..రాంప్రజారాజ్యం పార్టీకి మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన డాక్టర్ పుచ్చలపల్లి మిత్రా పార్టీకి రాజీనామా చేశారు. సైద్ధాంతిక విభేదాల వల్ల పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆయన అధ్యక్షుడు చిరంజీవికి సమర్పించిన లేఖలో పేర్కొన్నారు.Source: ఏపీ న్యూస్ | 20 Jun 2009 | 11:27 am డీజీపీ యాదవ్‌పై మళ్ళీ వేటు పడనుందా...!రాష్ట్ర డీజీపీ యాదవ్‌పై మరోమారు వేటు పడనున్నట్లు విశ్వనీయ సమాచారం. ఆయన స్థానంలో అవినీతి నిరోధక శాఖ అధిపతి ఆర్.ఆర్ గిరీష్ కుమార్‌ను నియమించనున్నట్లు తెలిసింది.Source: ఏపీ న్యూస్ | 20 Jun 2009 | 11:16 am పార్టీ పదవులకు విజయశాంతి రాజీనామా!అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె.చంద్రశేఖర రావుకు పలువురు నేతలు అండగా నిలుస్తున్నారు. అధినేతకు మద్దతుగా పార్టీ సెక్రటరీ, రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ విజయశాంతి తన పదవులకు రాజీనామా చేశారు.Source: ఏపీ న్యూస్ | 20 Jun 2009 | 11:11 am ఎన్నికల ఓటమికి బాధ్యత వహించిన రాజ్నాథ్ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి ఎదురైన ఓటమికి తానే నైతిక బాధ్యత వహిస్తున్నట్టు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. భాజపా ఎగ్జిక్యూటివ్ సమావేశానిక ముందు ఆయన ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.Source: జాతీయ | 20 Jun 2009 | 9:55 am కేంద్రం వైఖరిపై నరేంద్ర మోడీ సీరియస్!సంఘ విద్రోహ శక్తుల ఆట కట్టించేందుకు గుజరాత్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కోకా బిల్లును కేంద్రం తిప్పిపంపడం పట్ల గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఉగ్రవాదుల దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాలంటే ఇలాంటి కఠిన చట్టం కావాలని మోడీ విశ్వసిస్తున్నారు.Source: జాతీయ | 20 Jun 2009 | 8:01 am తెరాస అధ్యక్ష స్థానంలో రాములమ్మ?తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్ష మార్పడి ఖాయమని తెలుస్తోంది. ఆ బాధ్యతల నుంచి తప్పుకున్న కేసీఆర్.. తిరిగి బాధ్యతలను చేపట్టరాదనే కృత నిశ్చయంతో ఉన్నారు. దీంతో అధ్యక్ష పదవికి కొత్తవారిని ఎంపిక చేసే పనిలో తెరాస నాయకత్వం ఉంది.Source: ఏపీ న్యూస్ | 20 Jun 2009 | 7:46 am ప్రభుత్వంతో చర్చలకు మావోయిస్టుల షరతులుచర్చలకు రావాలని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం ఇచ్చిన పిలుపుకు బెంగాల్ మావోయిస్టులు స్పందించారు. ఆయుధాలు వీడి ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధమేనని ప్రకటించారు. అయితే, ఇందుకు కొన్ని షరతులను విధించారు.Source: జాతీయ | 20 Jun 2009 | 6:42 am ప్రసన్నా.. కలిసుందాం రా: చంద్రబాబు పిలుపుఅధిష్టాన వైఖరిని ఎండగడుతూ బహిరంగ లేఖాస్త్రం సంధించిన కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బుజ్జగింపు ధోరణి అవలంభిస్తున్నారు. సమస్యలను చర్చించుకునేందుకు హైదరాబాద్‌కు రావాల్సిందిగా బాబు స్వయంగా కబురు పంపారు.Source: ఏపీ న్యూస్ | 20 Jun 2009 | 6:23 am దేశంలో 50కు పెరిగిన స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్యదేశంలో స్వైన్ ఫ్లూ మహమ్మారి క్రమంగా విస్తరిస్తోంది. ఈ వ్యాధి బారిన పడిన రోగుల సంఖ్య శుక్రవారానికి 50కు చేరుకుంది. వీరిలో రెండు సంవత్సరాల బాలుడుతో పాటు.. 66 సంవత్సరాల వృద్ధురాలు కూడా ఉంది. కాగా, ఢిల్లీ, ముంబై, బెంగుళూరులో కొత్తగా ఆరు కేసులు వెలుగు చూశాయి.Source: జాతీయ | 20 Jun 2009 | 5:49 am ప్రధాని మీడియా సలహాదారుడుగా హరీష్ ఖరే!ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారుగా సీనియర్ జర్నలిస్టు హరీష్ ఖరే నియమితులు కానున్నారు. 62 సంవత్సరాల ఖరే.. ది హిందూ అంగ్ల పత్రికకు సీనియర్ అసోసియేట్ ఎడిటర్‌గాను, చీఫ్ ఆఫ్ బ్యూరోగా విధులు నిర్వహిస్తున్నారు. పేరొందిన పొలిటికల్ కాలమిస్టుగా కూడా ఖరేకు మంచి పేరుంది.Source: జాతీయ | 20 Jun 2009 | 5:30 am శ్రీనగర్ ప్రధాన దారుల మూసివేతజమ్మూ-కాశ్మీర్ రాష్ట్ర రాజధాని శ్రీనగర్‌లో వేర్పాటు వాదులు ర్యాలీకి పిలుపునిచ్చిన సందర్భంగా ఆ ర్యాలీని అడ్డుకునేందకు పోలీసులు తీసుకున్న చర్యలు జనజీవనాన్ని స్తంభింపచేశాయి.Source: జాతీయ | 20 Jun 2009 | 3:41 am భారత గగనతలంలోకి రష్యా విమానంరష్యా మిలటరీ కార్గో విమానం ఏఏఎన్ 124 శుక్రవారం రాత్రి పాకిస్థాన్ వాయు మార్గంగుండా భారత గగన తలంలోకి దూసుకొచ్చింది. దీనిని ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో దించివేశారు.Source: జాతీయ | 20 Jun 2009 | 3:12 am వెంకీ, త్రిష జంటగా "నమో వెంకటేశ""ఆడవారి మాటలకు అర్థాలే వేరులే" చిత్రం తర్వాత వెంకటేష్, త్రిష జంటగా నటిస్తున్న"నమో వెంకటేశ" చిత్రం గురువారం రాత్రి నిరాబండరంగా ప్రారంభమైంది. పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ తరహాలో శ్రీనువైట్ల ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. జూలై 25వ తేదీ నుంచి ఈ చిత్రం షూటింగ్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిసింది.Source: Yahoo! Telugu: Entertainment | 19 Jun 2009 | 7:23 pm శరణార్థుల కోసం కంటతడి పెట్టిన జోలీ!హాలీవుడ్ నటి ఏజెంలీనా జోలీ అంతర్జాతీయ శరణార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తలచుకొని కంటతడి పెట్టారు. ప్రపంచ శరణార్థ దినాన్ని పురస్కరించుకొని అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఏంజెలీనా పాల్గొన్నారు.ప్రపంచంలో శరణార్థుల కోసం అమెరికా రాజకీయ నాయకులు మరింత చేయూతనివ్వాలని కన్నీటి పర్యంతమవుతూ ఆమె ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థకు గుడ్‌విల్ అంబాసీడర్‌గా వ్యవహరిస్తున్న ఏంజెలీనా మాట్లాడుతూ.. శరణార్థులను సంఖ్యల్లో చూడటం సబబు కాదన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 19 Jun 2009 | 7:15 pm "ఫ్రూట్ సలాడ్" షూటింగ్ ప్రారంభంజి. శ్రీనివాస్, శియ గౌతమ్, సౌమ్య, సంజు, సాయి, సందీప్తి, పావని రెడ్డి, స్వప్న, బాబి, శ్రీరాం, అమృత జంటలుగా "ఫ్రూట్ సలాడ్" చిత్రం ప్రారంభమైంది. ఈ సినిమా ముహూర్తపు షాట్‌కు ముగ్గురు హీరోలు తనీష్, నిఖిల్, సందీప్‌లు క్లాప్ కొట్టగా, తారకరత్న, సి. కళ్యాణ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. చంద్ర సిద్ధార్థ దర్శకత్వం వహించారు.Source: Yahoo! Telugu: Entertainment | 19 Jun 2009 | 7:13 pm ఆ అమ్మాయి షైనీని ప్రేమించింది: మాజీ పనిమనిషిబాలీవుడ్ నటుడు షైనీ అహుజా కేసు కొత్త మలుపు తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. అహుజా ఇంట్లో అంతకుముందు పనిచేసిన ఓ మహిళ, అత్యాచారానికి గురికాబడ్డ అమ్మాయి షైనీని ప్రేమించిందని వెల్లడించింది. ఆ అమ్మాయే స్వయంగా ఈ విషయాన్ని తనతో చెప్పిందని తెలిపింది. ఆ మహిళ చెప్పిన వివరాల ప్రకారం.... అత్యాచారానికి గురైన అమ్మాయి అంతకుముందే మరొక అబ్బాయితో ప్రేమలో పడిందట. అయితే అతను ఆమెను వదిలేసి సొంత ఊరులో మరో అమ్మాయిని వివాహమాడాట. ఆ తర్వాత కొంతకాలానికి ఆమె షైనీపై మనసు పారేసుకుందట. అయితే ఇది షైనీకి తెలుసా...? అని తను అడిగితే, తెలియదనీ... కానీ షైనీని ప్రేమిస్తూనే ఉంటాననీ చెప్పినట్లు మాజీ పనిమనిషి చెప్పుకొచ్చింది. షైనీ అహుజా ఇంట్లో తను కూడా పనిచేశాననీ, అతను ఎలాంటివాడో తనకు బాగా తెలుసునని చెప్పింది.Source: Yahoo! Telugu: Entertainment | 19 Jun 2009 | 4:40 pm బ్రిట్నీ స్పియర్స్‌కు మూడో పెళ్లి!ప్రియుడిగా మారిన తన ఏజెంట్ జాసన్ ట్రావిక్ చేసిన పెళ్లి ప్రతిపాదనకు పాప్ రాణి బ్రిట్నీ స్పియర్స్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే బ్రిట్నీ స్పియర్స్‌కు పెళ్లికావడం మూడోసారి అవుతుంది. బ్రిటన్‌కు చెందిన "ది సన్" బ్రిట్నీ మూడో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు తన కథనంలో వెల్లడించింది.Source: Yahoo! Telugu: Entertainment | 19 Jun 2009 | 3:20 pm కేసీఆర్ రాజీనామా ఓ డ్రామా: డీఎస్తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట చంద్రశేఖర్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేయడం ఓ డ్రామా అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీ. శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.Source: ఏపీ న్యూస్ | 19 Jun 2009 | 3:13 pm బాల్‌థాకరేకు అస్వస్థతగత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శివసేన అధ్యక్షుడు బాల్‌థాకరే గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్పించారు.Source: జాతీయ | 19 Jun 2009 | 2:04 pm అసమ్మతి "సెగ"... కారు "దిగిన" కేసీఆర్ఎట్టకేలకు అసమ్మతివాదుల ఒత్తిడికి తలొగ్గిన కేసీఆర్ తెలంగాణా రాష్ట్ర సమతి అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసిన విషయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి మధుసూదనా చారి తెలిపారు. కేసీఆర్ రాజీనామాపై తుదినిర్ణయం కార్యవర్గానిదేనని చారి తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 19 Jun 2009 | 1:33 pm "లేపాక్షి బసవన్న"ను కనులారా వీక్షిద్దామా..?!ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లాకు చెందిన ఒక చారిత్రక పట్టణమే లేపాక్షి. ఇది బెంగళూరుకు 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే హైదరాబాదు, బెంగళూరు రోడ్డుకు ఎడమవైపు నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ లేపాక్షి ఊరిలోకి ప్రవేశించగానే... అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం ఠీవిగా...Source: వినోదం | 19 Jun 2009 | 12:49 pm కటకటాల వెనక్కు జిల్లా జడ్జి...!వరకట్నం తీసుకోవడం నేరమంటూ తీర్పు చెప్పాల్సిన ఓ న్యాయమూర్తి, ఆయన కుటుంబం అదనపు కట్నం కోసం కోడలిని చిత్రహింసలు పెట్టినట్లు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో పోలీసులు న్యాయమూర్తిని, ఆయన కుటుంబ సభ్యులనుకూడా కటకకటాల వెనక్కు పంపారు.Source: ఏపీ న్యూస్ | 19 Jun 2009 | 12:44 pm బీహార్‌లో రైలు దోపిడీబీహార్లోని లక్ష్మీసరాయ్ జిల్లాలో హౌరా-జై నగర్ ఫాస్ట్ ప్యాసింజర్ రైల్లో దోపిడీ జరిగింది. బుధవారం జమాల్‌పూర్ స్టేషన్‌లో దాదాపు పదిమంది దుండగులు రైలెక్కి తుపాకులతో ప్రయాణికులను బెదిరించి రూ. 15 లక్షల నగదు, బంగారు ఆభరణాలు, వాచీలు, సెల్‌ఫోన్లు దొచుకున్నారని పోలీసులు తెలిపారు.Source: జాతీయ | 19 Jun 2009 | 12:17 pm వంద శాతం అక్షరాస్యతకు కృషి చేయాలి: చిరువచ్చే ఐదు సంవత్సారాల్లో రాష్ట్రంలో వంద శాతం అక్షరాస్యతను సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషిచేయాలని ప్రజారాజ్యం పార్టీ అధినేత, తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి పిలుపునిచ్చారు. తన నియోజకవర్గం పర్యటనలో భాగంగా గురువారం ఆయన బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు.Source: ఏపీ న్యూస్ | 19 Jun 2009 | 11:49 am ఉస్తాద్ అలీఅక్బర్‌ఖాన్ అస్తమయంప్రముఖ సరోద్ విద్వాంసుడు ఉస్తాద్ అలీ అక్బర్‌ఖాన్ సరోద్ మూగబోయింది. భారతీయ శాస్త్రీయ సంగీతంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ఖాన్‌ను లైవ్ లిజెండ్‌గా కీర్తిస్తుంటారు. అలాంటి సంగీత విద్యాంసుడు శాన్ ఫ్రాన్సిస్కోలో కన్నుమూశారని ఆయన కుటుంబ స్నేహితులు కోలకతాలో వెల్లడించారు.Source: జాతీయ | 19 Jun 2009 | 11:20 am ఆ అమ్మాయి షైనీని ప్రేమించింది: మాజీ పనిమనిషిబాలీవుడ్ నటుడు షైనీ అహుజా కేసు కొత్త మలుపు తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. అహుజా ఇంట్లో అంతకుముందు పనిచేసిన ఓ మహిళ, అత్యాచారానికి గురికాబడ్డ అమ్మాయి షైనీని ప్రేమించిందని వెల్లడించింది. ఆ అమ్మాయే స్వయంగా ఈ విషయాన్ని తనతో చెప్పిందని తెలిపింది.Source: వినోదం | 19 Jun 2009 | 11:13 am ఈసీఐఎల్ కంపెనీలో అగ్నిప్రమాదంరాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నగర శివార్లలోని ఈసీఐఎల్ కంపెనీ బ్యాటరీ యూనిట్‌లో శుక్రవారం మధ్యాహ్నం భారీ పేలుళ్ళు జరిగి అగ్నిప్రమాదం సంభవించింది. బ్యాటరీకి వినియోగించే గన్‌పౌడర్ అంటుకుని మంటలు చెలరేగినట్లు సమాచారం.Source: ఏపీ న్యూస్ | 19 Jun 2009 | 11:08 am
|