|
కేసీఆర్ రాజీనామా ఓ డ్రామా: డీఎస్తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట చంద్రశేఖర్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేయడం ఓ డ్రామా అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీ. శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.Source: Yahoo! Telugu: News | 19 Jun 2009 | 8:43 pm రాహుల్ ! పెళ్ళి చేసుకోండి... తర్వతే పీఎమ్ అవ్వండి...!జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీకి యువరాజుగా భాసిల్లుతున్న రాహుల్ గాంధీ శుక్రవారం నాటితో 39వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అతని జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.Source: Yahoo! Telugu: News | 19 Jun 2009 | 8:24 pm 9నెలల్లో 9వందల ఉద్యోగాలు: ఎస్ బ్యాంక్ప్రైవేట్ సెక్టార్‌లో అగ్రగామిగానున్న ఎస్ బ్యాంక్ రానున్న తొమ్మిది నెలల్లో తొమ్మిది వందల ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు శుక్రవారం ఢిల్లీలో ప్రకటించింది. దేశంలోని తమ బ్యాంక్‌కు సంబంధించిన ఆరు సెగ్మెంట్లు విస్తరింపచేయాలని బ్యాంక్ భావిస్తోందని, ఈ నేపథ్యంలోనే నియామకాలను చేపట్టనున్నట్లు బ్యాంక్ వర్గాలు తెలిపాయి.Source: Yahoo! Telugu: News | 19 Jun 2009 | 7:38 pm వెంకీ, త్రిష జంటగా "నమో వెంకటేశ""ఆడవారి మాటలకు అర్థాలే వేరులే" చిత్రం తర్వాత వెంకటేష్, త్రిష జంటగా నటిస్తున్న"నమో వెంకటేశ" చిత్రం గురువారం రాత్రి నిరాబండరంగా ప్రారంభమైంది. పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ తరహాలో శ్రీనువైట్ల ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. జూలై 25వ తేదీ నుంచి ఈ చిత్రం షూటింగ్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిసింది.Source: Yahoo! Telugu: Entertainment | 19 Jun 2009 | 7:23 pm బాల్‌థాకరేకు అస్వస్థతగత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శివసేన అధ్యక్షుడు బాల్‌థాకరే గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్పించారు.Source: Yahoo! Telugu: News | 19 Jun 2009 | 7:18 pm శరణార్థుల కోసం కంటతడి పెట్టిన జోలీ!హాలీవుడ్ నటి ఏజెంలీనా జోలీ గురువారం అంతర్జాతీయ శరణార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తలచుకొని కంటతడి పెట్టారు. ప్రపంచ శరణార్థ దినాన్ని పురస్కరించుకొని అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఏంజెలీనా పాల్గొన్నారు.ప్రపంచంలో శరణార్థుల కోసం అమెరికా రాజకీయ నాయకులు మరింత చేయూతనివ్వాలని కన్నీటి పర్యంతమవుతూ ఆమె ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థకు గుడ్‌విల్ అంబాసీడర్‌గా వ్యవహరిస్తున్న ఏంజెలీనా మాట్లాడుతూ.. శరణార్థులను సంఖ్యల్లో చూడటం సబబు కాదన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 19 Jun 2009 | 7:15 pm "ఫ్రూట్ సలాడ్" షూటింగ్ ప్రారంభంజి. శ్రీనివాస్, శియ గౌతమ్, సౌమ్య, సంజు, సాయి, సందీప్తి, పావని రెడ్డి, స్వప్న, బాబి, శ్రీరాం, అమృత జంటలుగా "ఫ్రూట్ సలాడ్" చిత్రం ప్రారంభమైంది. ఈ సినిమా ముహూర్తపు షాట్‌కు ముగ్గురు హీరోలు తనీష్, నిఖిల్, సందీప్‌లు క్లాప్ కొట్టగా, తారకరత్న, సి. కళ్యాణ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. చంద్ర సిద్ధార్థ దర్శకత్వం వహించారు.Source: Yahoo! Telugu: Entertainment | 19 Jun 2009 | 7:13 pm అసమ్మతి "సెగ"... కారు "దిగిన" కేసీఆర్ఎట్టకేలకు అసమ్మతివాదుల ఒత్తిడికి తలొగ్గిన కేసీఆర్ తెలంగాణా రాష్ట్ర సమతి అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసిన విషయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి మధుసూదనా చారి తెలిపారు. కేసీఆర్ రాజీనామాపై తుదినిర్ణయం కార్యవర్గానిదేనని చారి తెలిపారు.Source: Yahoo! Telugu: News | 19 Jun 2009 | 6:55 pm కటకటాల వెనక్కు జిల్లా జడ్జి...!వరకట్నం తీసుకోవడం నేరమంటూ తీర్పు చెప్పాల్సిన ఓ న్యాయమూర్తి, ఆయన కుటుంబం అదనపు కట్నం కోసం కోడలిని చిత్రహింసలు పెట్టినట్లు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో పోలీసులు న్యాయమూర్తిని, ఆయన కుటుంబ సభ్యులనుకూడా కటకకటాల వెనక్కు పంపారు.Source: Yahoo! Telugu: News | 19 Jun 2009 | 6:11 pm అసాధారణ ఫీజు వసూళ్లపై కమిటీ ఏర్పాటువిద్యార్థుల వద్ద నుంచి అసాధారణ ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకునేందుకు తక్షణ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం ఐదుగురు సభ్యులతో గురువారం కమిటీ ఏర్పాటు చేసింది.Source: Yahoo! Telugu: News | 19 Jun 2009 | 5:49 pm ఫార్మా విద్యార్థులకు కౌన్సెలింగ్ఫార్మసీలో కెరీర్, విద్యావకాశాలపై ఇఖ్రా సొసైటీ శనివారం ఉచిత కౌన్సెలింగ్ నిర్వహిస్తోంది. ఈ కౌన్సెలింగ్ కార్యక్రమం లక్డికాపూల్‌లోని రాయల్ కోర్ట్ ఫంక్షన్ హాలులో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కౌన్సెలింగ్ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది.Source: Yahoo! Telugu: News | 19 Jun 2009 | 5:41 pm పుంజుకున్న బుల్: లాభాలతో ముగిసిన సెన్సెక్స్వరుసగా రెండు రోజులు నష్టాలతో ముగిసిన తర్వాత మూడో రోజు బుల్ పరుగులతో వారాంతంలో స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 256 పాయింట్లు పుంజుకుని 14,522 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 62 పాయింట్లు లాభపడి 4,314 వద్ద ముగిసింది.Source: Yahoo! Telugu: News | 19 Jun 2009 | 5:39 pm నెజాద్ ఎన్నిక న్యాయబద్ధమే: ఇరాన్ సుప్రీంనేతఇరాన్ అత్యంత శక్తివంతమైన గార్డియన్ కౌన్సిల్ అధిపతి అయతుల్లా అలీ ఖమేనీ ఇటీవల దేశంలో జరిగిన వివాదాస్పద అధ్యక్ష ఎన్నికలకు న్యాయబద్ధత ఉందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఎటువంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. తాజా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను రద్దు చేయాలని, తిరిగి ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్ష సభ్యులు చేస్తున్న డిమాండ్‌లను తోసిపుచ్చారు.Source: Yahoo! Telugu: News | 19 Jun 2009 | 5:13 pm ఆ అమ్మాయి షైనీని ప్రేమించింది: మాజీ పనిమనిషిబాలీవుడ్ నటుడు షైనీ అహుజా కేసు కొత్త మలుపు తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. అహుజా ఇంట్లో అంతకుముందు పనిచేసిన ఓ మహిళ, అత్యాచారానికి గురికాబడ్డ అమ్మాయి షైనీని ప్రేమించిందని వెల్లడించింది. ఆ అమ్మాయే స్వయంగా ఈ విషయాన్ని తనతో చెప్పిందని తెలిపింది. ఆ మహిళ చెప్పిన వివరాల ప్రకారం.... అత్యాచారానికి గురైన అమ్మాయి అంతకుముందే మరొక అబ్బాయితో ప్రేమలో పడిందట. అయితే అతను ఆమెను వదిలేసి సొంత ఊరులో మరో అమ్మాయిని వివాహమాడాట. ఆ తర్వాత కొంతకాలానికి ఆమె షైనీపై మనసు పారేసుకుందట. అయితే ఇది షైనీకి తెలుసా...? అని తను అడిగితే, తెలియదనీ... కానీ షైనీని ప్రేమిస్తూనే ఉంటాననీ చెప్పినట్లు మాజీ పనిమనిషి చెప్పుకొచ్చింది. షైనీ అహుజా ఇంట్లో తను కూడా పనిచేశాననీ, అతను ఎలాంటివాడో తనకు బాగా తెలుసునని చెప్పింది.Source: Yahoo! Telugu: Entertainment | 19 Jun 2009 | 4:40 pm బ్రిట్నీ స్పియర్స్‌కు మూడో పెళ్లి!ప్రియుడిగా మారిన తన ఏజెంట్ జాసన్ ట్రావిక్ చేసిన పెళ్లి ప్రతిపాదనకు పాప్ రాణి బ్రిట్నీ స్పియర్స్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే బ్రిట్నీ స్పియర్స్‌కు పెళ్లికావడం మూడోసారి అవుతుంది. బ్రిటన్‌కు చెందిన "ది సన్" బ్రిట్నీ మూడో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు తన కథనంలో వెల్లడించింది.Source: Yahoo! Telugu: Entertainment | 19 Jun 2009 | 3:20 pm కేసీఆర్ రాజీనామా ఓ డ్రామా: డీఎస్తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట చంద్రశేఖర్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేయడం ఓ డ్రామా అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీ. శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.Source: ఏపీ న్యూస్ | 19 Jun 2009 | 3:13 pm బాలీవుడ్ మూవీ "న్యూయార్క్" సినీ ట్రైలర్ మీకోసం...బాలీవుడ్ అగ్రహీరో జాన్ అబ్రహం "న్యూయార్క్" సినిమా కోసం మహమ్మదీయుల పవిత్ర గ్రంథం ఖురాన్‌ను పఠిస్తున్నారట. "న్యూయార్క్" అనే చిత్రంలో ఎన్నారై ముస్లింగా కబీర్ ఖాన్ పాత్రను పోషిస్తున్న జాన్ అబ్రహం, తన పాత్రలో పూర్తిగా జీవించేందుకు ఖురాన్‌ను చదువుతున్నారని తెలిసింది.Source: Yahoo! Telugu: Entertainment | 19 Jun 2009 | 2:09 pm బాల్‌థాకరేకు అస్వస్థతగత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శివసేన అధ్యక్షుడు బాల్‌థాకరే గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్పించారు.Source: జాతీయ | 19 Jun 2009 | 2:04 pm బ్యాంకాక్ వెళ్ళనున్న "చెట్టుకింద పెళ్లికొడుకు"ఇన్నొవేటివ్ క్రియేషన్స్ పతాకంపై పరమేష్, నయన హీరోహీరోయిన్లుగా అరుణాచలం దర్శకత్వంలో అత్నూరి ప్రభాకర్ నిర్మిస్తొన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'చెట్టు కింద పెళ్లికొడుకు'. ఇటీవలే ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఈనెల 27 నుంచి బ్యాంకాక్‌లో సెకండ్ షెడ్యూల్ ప్రారంభించి రెండు పాటలతోపాటు కొంత టాకీని చిత్రీకరించనున్నామని నిర్మాత తెలియజేశారుSource: Yahoo! Telugu: Entertainment | 19 Jun 2009 | 1:45 pm అసమ్మతి "సెగ"... కారు "దిగిన" కేసీఆర్ఎట్టకేలకు అసమ్మతివాదుల ఒత్తిడికి తలొగ్గిన కేసీఆర్ తెలంగాణా రాష్ట్ర సమతి అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసిన విషయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి మధుసూదనా చారి తెలిపారు. కేసీఆర్ రాజీనామాపై తుదినిర్ణయం కార్యవర్గానిదేనని చారి తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 19 Jun 2009 | 1:33 pm "లేపాక్షి బసవన్న"ను కనులారా వీక్షిద్దామా..?!ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లాకు చెందిన ఒక చారిత్రక పట్టణమే లేపాక్షి. ఇది బెంగళూరుకు 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే హైదరాబాదు, బెంగళూరు రోడ్డుకు ఎడమవైపు నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ లేపాక్షి ఊరిలోకి ప్రవేశించగానే... అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం ఠీవిగా...Source: వినోదం | 19 Jun 2009 | 12:49 pm కటకటాల వెనక్కు జిల్లా జడ్జి...!వరకట్నం తీసుకోవడం నేరమంటూ తీర్పు చెప్పాల్సిన ఓ న్యాయమూర్తి, ఆయన కుటుంబం అదనపు కట్నం కోసం కోడలిని చిత్రహింసలు పెట్టినట్లు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో పోలీసులు న్యాయమూర్తిని, ఆయన కుటుంబ సభ్యులనుకూడా కటకకటాల వెనక్కు పంపారు.Source: ఏపీ న్యూస్ | 19 Jun 2009 | 12:44 pm బీహార్‌లో రైలు దోపిడీబీహార్లోని లక్ష్మీసరాయ్ జిల్లాలో హౌరా-జై నగర్ ఫాస్ట్ ప్యాసింజర్ రైల్లో దోపిడీ జరిగింది. బుధవారం జమాల్‌పూర్ స్టేషన్‌లో దాదాపు పదిమంది దుండగులు రైలెక్కి తుపాకులతో ప్రయాణికులను బెదిరించి రూ. 15 లక్షల నగదు, బంగారు ఆభరణాలు, వాచీలు, సెల్‌ఫోన్లు దొచుకున్నారని పోలీసులు తెలిపారు.Source: జాతీయ | 19 Jun 2009 | 12:17 pm వంద శాతం అక్షరాస్యతకు కృషి చేయాలి: చిరువచ్చే ఐదు సంవత్సారాల్లో రాష్ట్రంలో వంద శాతం అక్షరాస్యతను సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషిచేయాలని ప్రజారాజ్యం పార్టీ అధినేత, తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి పిలుపునిచ్చారు. తన నియోజకవర్గం పర్యటనలో భాగంగా గురువారం ఆయన బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు.Source: ఏపీ న్యూస్ | 19 Jun 2009 | 11:49 am నాకు ఏది ఇష్టమో దాన్నే చేస్తా..!: నీతూచంద్రఈ మధ్య ఓ ఫొటోషూట్‌లో హాట్‌హాట్‌గా నటించిన నీతూచంద్ర ఓ కొత్త కష్టం వచ్చిపడింది. ఆ ఫొటోషూట్‌లో బికీనీ వేసుకుని ఇంకో బికినీ భామ మీద పడి వాటేసుకుని అటూ ఇటూ దొర్లి విరగబడి నటించేసరికి నీతూ లెస్బియన్ అనే రూమర్ ఇండిస్టీ పాకింది.దీంతో చిర్రెత్తిన నీతూ తనను బాగా ఎక్సపోజ్‌చేశారంటూ మీడియాపై పరుషపదజాలం వాడింది. ప్రజాస్వామ్యంలో ఒక పౌరురాలిగా తనకు ఇష్టమైన దేనినైనా చేసే హక్కు ఉందని ప్రెస్‌మీట్‌పెట్టి మరీ చెప్పింది. దీంతో సినిమాలు ఎలా ఉన్నా.. ప్రస్తుతం తాను యాడ్స్‌పై కాన్‌సన్‌ట్రేషన్ చేస్తున్నానని వెల్లడించింది.Source: Yahoo! Telugu: Entertainment | 19 Jun 2009 | 11:35 am మంచి బాయ్‌ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తున్నా..!తాను నటి కాకుంటే ఎయిర్ హౌస్టెస్ లేదా లాయర్‌గా అవ్వాలన్నదే తన లక్ష్యమని అంటోన్న నటి సలోని సుమంత్ నటించిన 'ధన 51'లో కథానాయికగా పరిచయమయింది. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో దాదాపు 12 చిత్రాల్లో నటించిన ఆమె గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చింది. ఈ సందర్భంగా ఆమెను కదిలిస్తే కొన్ని విషయాలు చెప్పుకొచ్చింది. అందులో ప్రేమపెళ్ళి గురించి ఆమె మాట్లాడుతూ... ఇంకా ప్రేమలో పడలేదు. పడాక ఆలోచిస్తా. మంచి బాయ్‌ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తున్నానని చెప్పింది.Source: Yahoo! Telugu: Entertainment | 19 Jun 2009 | 11:22 am ఉస్తాద్ అలీఅక్బర్‌ఖాన్ అస్తమయంప్రముఖ సరోద్ విద్వాంసుడు ఉస్తాద్ అలీ అక్బర్‌ఖాన్ సరోద్ మూగబోయింది. భారతీయ శాస్త్రీయ సంగీతంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ఖాన్‌ను లైవ్ లిజెండ్‌గా కీర్తిస్తుంటారు. అలాంటి సంగీత విద్యాంసుడు శాన్ ఫ్రాన్సిస్కోలో కన్నుమూశారని ఆయన కుటుంబ స్నేహితులు కోలకతాలో వెల్లడించారు.Source: జాతీయ | 19 Jun 2009 | 11:20 am ఆ అమ్మాయి షైనీని ప్రేమించింది: మాజీ పనిమనిషిబాలీవుడ్ నటుడు షైనీ అహుజా కేసు కొత్త మలుపు తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. అహుజా ఇంట్లో అంతకుముందు పనిచేసిన ఓ మహిళ, అత్యాచారానికి గురికాబడ్డ అమ్మాయి షైనీని ప్రేమించిందని వెల్లడించింది. ఆ అమ్మాయే స్వయంగా ఈ విషయాన్ని తనతో చెప్పిందని తెలిపింది.Source: వినోదం | 19 Jun 2009 | 11:13 am ఈసీఐఎల్ కంపెనీలో అగ్నిప్రమాదంరాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నగర శివార్లలోని ఈసీఐఎల్ కంపెనీ బ్యాటరీ యూనిట్‌లో శుక్రవారం మధ్యాహ్నం భారీ పేలుళ్ళు జరిగి అగ్నిప్రమాదం సంభవించింది. బ్యాటరీకి వినియోగించే గన్‌పౌడర్ అంటుకుని మంటలు చెలరేగినట్లు సమాచారం.Source: ఏపీ న్యూస్ | 19 Jun 2009 | 11:08 am డీజీపీ యాదవ్‌పై మళ్ళీ వేటు పడనుందా...!రాష్ట్ర డీజీపీ యాదవ్‌పై మరోమారు వేటు పడనున్నట్లు విశ్వనీయ సమాచారం. ఆయన స్థానంలో అవినీతి నిరోధక శాఖ అధిపతి ఆర్.ఆర్ గిరీష్ కుమార్‌ను నియమించనున్నట్లు తెలిసింది.Source: ఏపీ న్యూస్ | 19 Jun 2009 | 10:23 am రాజీనామాను ఉపసంహరించుకున్న కోషియారీఉత్తరాఖండ్ బీజేపీ అగ్రనేత భగత్ సింగ్ కోషియారీ శుక్రవారం రాజ్యసభ సభ్యత్వానికి చేసిన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. ఉత్తరాఖండ్ సీఎం పదవి నుంచి బీసీ కందూరిని తొలగించేలా బీజేపీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు కోషియారీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.Source: జాతీయ | 19 Jun 2009 | 10:11 am రాహుల్ గాంధీ 3 మరియు 3+3+3= 39కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ 39 ఏటలోకి ప్రవేశించారు. ఆయన పుట్టిన రోజు జూన్ 19, 1970. మొన్నటి పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలలో విజయం సాధించడం వెనుక యువరాజు రాహుల్ పాత్ర ఎంతో ఉన్నది. రాహుల్ గాంధీ జన్మదినాన్ని కాంగ్రెస్ పార్టీ "సమ్రస్త దివస్"గా జరుపుకుంటోంది. ఇందులో భాగంగా సహపంక్తి భోజన కార్యక్రమాలను నిర్వహించనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాహుల్ పుట్టినరోజు సందర్భంగా వ్యాసరచన పోటీలతోపాటు ఇంగ్లీషు కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నారు.Source: జాతీయ | 19 Jun 2009 | 8:28 am గుజరాత్ కోకా బిల్లును తిప్పిపంపిన కేంద్రంగుజరాత్ అసెంబ్లీ ఆమోదముద్ర వేసిన కఠిన తీవ్రవాద నిరోధక బిల్లును కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి తిప్పిపంపింది. కేంద్ర చట్టాలకు అనుగుణంగా సవరణలు చేసేందుకు ఈ బిల్లును వెనక్కుపంపుతున్నట్లు హోంశాఖ మంత్రి పి.చిదంబరం విలేకరులతో చెప్పారు.Source: జాతీయ | 19 Jun 2009 | 8:15 am పాటిల్ ఇంటిపై సీబీఐ దాడులుహత్యారోపణ ఎదుర్కొంటున్న నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ)కి చెందిన పార్లమెంట్ సభ్యుడు పద్మసింహ్ పాటిల్ ఇంటిపై గురువారం రాత్రి కేంద్ర నేర పరిశోధన సంస్థ(సీబీఓ)కు చెందిన సభ్యులు దాడులు చేసి ఇంటిని చుట్టుముట్టారు.Source: జాతీయ | 19 Jun 2009 | 6:51 am కోల్‌కతాలో ఆపరేషన్ లాల్‌గఢ్ తిరిగి ప్రారంభంలాల్గఢ్లో మావోయిస్టులను చుట్టుముట్టేందుకు పోలీసులు మళ్లీ రంగంలోకి దిగారు. గత రాత్రి విరమించిన ఆపరేషన్ లాల్ గఢ్‌ను పోలీసులు శుక్రవారం ఉదయం తిరిగి ప్రారంభించారు. అయితే లాల్ గఢ్‌కు వెళ్లే దారిలో మావోయిస్టులు అన్నివైపులా అడ్డంకులను ఏర్పాటు చేశారు. రోడ్లను తవ్వేయడం, రహదారులకు అడ్డంగా పెద్ద చెట్లును పడవేయటం వంటి చర్యలకు దిగడంతో పోలీసులకు కొంత కష్టమవుతుతోంది. లాండ్ మైన్లు, క్లెమోర్ మైన్లు అమర్చారేమోనని రోడ్లన్నీ నిశితంగా పరీశీలించాకే పోలీసులు ముందుకు కదులుతున్నారు.Source: జాతీయ | 19 Jun 2009 | 6:47 am గుంటూరు ఆసుపత్రిలో ముగ్గురు రోగులు మృతిగుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సాంకేతిక లోపం తలెత్తడంతో ముగ్గురు రోగులు ప్రాణాలను కోల్పోయారు. ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో గత 15 రోజులుగా ఏసీ పనిచేయడంలేదు. దానిని బాగు చేయాలని పలుమార్లు రోగులు, వారి తరపు బంధువులు ఆసుపత్రి అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినాకూడా ఫలితం లేకుండాపోయింది.Source: ఏపీ న్యూస్ | 19 Jun 2009 | 6:14 am డార్క్ రూమ్‌లో పనిచేయడం అలవాటు"కరెంటు పోయినా, క్యాండిల్ కూడా లేకుండా అంతా చీకట్లో బావగారు వంట ఎలా చేస్తున్నారు"...Source: వినోదం | 19 Jun 2009 | 5:43 am చాల్లేరా.. ఎంతసేపు తింటావ్?స్నేహితుడి పెళ్ళి రిసెప్షన్‌కి వెళ్లిన జంబులింగం ప్లేటు తర్వాత ప్లేటు మారుస్తూ భోజనం లాగిస్తూనే ఉన్నాడు.Source: వినోదం | 19 Jun 2009 | 5:25 am ఢిల్లీ కంటే దిల్లీ మేలు : గిల్దేశ రాజధాని న్యూఢిల్లీ వివిధ సంస్కృతుల సమ్మేళనం. ఆ సంస్కృతులకు తగ్గట్టుగా రాజధాని పేరు ఉందా అన్న సందేహం కేంద్ర మంత్రివర్యులు ఎంఎస్ గిల్‌కు కలిగింది. న్యూఢిల్లీ అనడం కంటే ‘దిల్లీ’ అంటే సంస్కృతులను ప్రతిబింబించేట్టుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. దిల్లీ అనే పేరు ప్రజల హృదయాలకు హత్తుకునేలా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.Source: జాతీయ | 19 Jun 2009 | 4:12 am క్లబ్‌లో మోసపోయా : గోవా మంత్రిక్లబ్లో తనకు మోసం జరిగిందంటూ సాక్షాత్తూ ఓ మంత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలలోకి వెళితే...గోవా పర్యాటక శాఖామంత్రి ఫ్రాన్సిస్‌కో పచేకో గోవాలోని కాసినో క్లబ్ ఆపరేటర్ తనను రూ 1.25 కోట్ల మేరకు మోసం చేసాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.Source: జాతీయ | 19 Jun 2009 | 3:57 am కత్రినా కాదనుకుంటోందా...? సల్మాన్ వద్దనుకుంటున్నాడా...?సల్మాన్ ఖాన్ ప్రేమాయణం ఎప్పుడూ సస్పెన్సే. సల్మాన్ లక్కో- బ్యాడ్ లక్కో కానీ అతను ప్రేమించిన అమ్మాయిలు వరుసగా అతనికి దూరమవుతూ వస్తున్నారు. తాజాగా కత్రినా కూడా "హ్యాండ్" ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ సినీజనం కత్రినా కైఫ్ "నైఫ్" లాంటిదనీ, నమ్మవద్దనీ సల్మాన్ చెవినిల్లు కట్టుకుని చెపుతున్నారట. దీనికి బలం చేకూర్చే విధంగా కత్రినా ప్రవర్తన కూడా ఉంటోంది. ఆమె తన పుట్టినరోజు వేడుకలను సల్మాన్ లేకుండా జరుపుకునేందుకు ప్లాన్ చేస్తోందట. సల్మాన్ లేకుండా పుట్టినరోజు జరుపుకుంటున్నారంటే... అతనితో విభేదాలున్నాయా...? అని మీడియా గొడవ చేస్తుందేమోనని తన బర్త్ డే నాటికి లండన్‌కి చెక్కేసేటట్లు ప్రణాళిక రూపొందించుకున్నదట. ఇది తెలిసిన సల్మాన్ తోకతొక్కిన పాములా బుసలు కొడుతున్నాడని బాలీవుడ్ సినీ జనం అంటున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 18 Jun 2009 | 8:08 pm
|