ఆర్ఐఎల్, ఆర్ఎన్ఆర్ఎల్‌లకు కోర్టు ఆదేశాలు

రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్), రిలయన్స్ న్యాచురల్ రీసోర్సెస్ (ఆర్ఎన్ఆర్ఎల్) నెల రోజుల్లోగా గ్యాసు సరఫరా ఒప్పందంపై సంతకం చేయాలని బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Source: Yahoo! Telugu: News | 15 Jun 2009 | 4:08 pm

నోకియా కొత్త టచ్ స్క్రీన్ మ్యూజిక్ ఫోన్‌

ప్రముఖ అంతర్జాతీయ సెల్‌ఫోన్ తయారీ దిగ్గజం నోకియా కంపెనీ ఈ రోజు మూడు రకాల కొత్త మోడల్ ఫోన్‌ల హ్యాండ్‌సెట్లను మార్కెట్లోకి విడుదల చేసింది. వీటిలో సరికొత్త టచ్-స్క్రీన్ మోడల్‌ను కూడా విడుదల చేసింది. 5530 ఎక్స్‌ప్రెస్ మోడల్‌గా విడుదల చేసిన హ్యాండ్‌సెట్‌ను మూడో త్రైమాసికంలో ట్యాక్సులు కాకుండా 280 అమెరికా డాలర్లకు విక్రయిస్తామన్నారు.
Source: Yahoo! Telugu: News | 15 Jun 2009 | 4:02 pm

కేసీఆర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ ఆ పార్టీ అసమ్మతి నేత రవీంద్రనాయక్ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తెలంగాణ భవన్‌కు వెళ్లిన తనపై జరిగిన దాడి కేసీఆర్ ప్రోద్భలంతోనే జరిగిందని అందుకే ఆయనపై చర్య తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Source: Yahoo! Telugu: News | 15 Jun 2009 | 3:42 pm

అదుపులో స్వైన్ ఫ్లూ: ఆరోగ్య మంత్రి ఆజాద్

దేశంలో స్వైన్ ఫ్లూ వ్యాధి రోగుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. దీంతో దేశ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ మాత్రం స్వైన్ ఫ్లూ వ్యాధి పూర్తిగా అదుపులోనే ఉందని తాపీగా సెలవిస్తున్నారు.
Source: Yahoo! Telugu: News | 15 Jun 2009 | 3:28 pm

నష్టాల్లో సెన్సెక్స్: కష్టాల్లో స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం మరింతగా నష్టాలను చవిచూస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 393 పాయింట్లు కోల్పోయి 14,845 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 102 పాయింట్లు నష్టపోయి 4,482 వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 15 Jun 2009 | 3:26 pm

290 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం నష్టాల్లో కూరుకుపోతుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 290 పాయింట్లు కోల్పోయి 14,948 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 61 పాయింట్లు నష్టపోయి 4,523 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 1.90 శాతం, నిఫ్టీ 1.32 శాతం చొప్పున క్షీణించాయి.
Source: Yahoo! Telugu: News | 15 Jun 2009 | 2:02 pm

సాయం చేసేందుకు భారత్ సిద్ధం: ప్రధాని

అంతర్జాతీయ సమాజాన్ని వణికిస్తున్న ఆర్థిక మాంద్యం నుంచి ప్రపంచ దేశాలు గట్టెక్కేందుకు అవసరమైన సాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. ఈ సంక్షోభ సమయంలో అంతర్జాతీయ సహాయకారి పాత్రను పోషించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఆయన సోమవారం తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 15 Jun 2009 | 1:51 pm

కేసీఆర్‌పై దుమ్మెత్తిపోసిన రవీంద్రనాయక్

గిరిజన నేతనైన తనపై దాడి జరిపించిన టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నాశనమైపోతారంటూ ఆ పార్టీ అసమ్మతి నేత రవీంద్రనాయక్ దుయ్యబట్టారు. టీఆర్ఎస్‌కు గిరిజనుల్లో ఆదరణ లభించేందుకు తీవ్రమైన కృషి చేసిన తనను కొట్టించిన కేసీఆర్ తెలంగాణ ఏం తెస్తారంటూ ఆయన ధ్వజమెత్తారు.
Source: Yahoo! Telugu: News | 15 Jun 2009 | 1:45 pm

ప్రతిపక్ష ర్యాలీని నిషేధించిన ఇరాన్ ప్రభుత్వం

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో సోమవారం జరగాల్సిన ప్రతిపక్ష ర్యాలీని ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ నిషేధించింది. ఇరాన్‌లో శుక్రవారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పరాజయం పాలైన మాజీ ప్రధానమంత్రి మీర్ హుస్సేన్ మౌసావి మద్దతుదారులు టెహ్రాన్‌లో ఈ రోజు ర్యాలీ నిర్వహించతలపెట్టారు.
Source: Yahoo! Telugu: News | 15 Jun 2009 | 1:43 pm

ఆగస్టులో సమగ్ర వాణిజ్య విధానం: శర్మ

రానున్న ఆగస్టులో సమగ్ర విదేశీ వాణిజ్య విధానాన్ని తీసుకువచ్చే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖల మంత్రి ఆనంద్ శర్మ పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా దేశీయ ఎగుమతిదారులు మాంద్యాన్ని ఎదుర్కొనేందుకు చర్యలతోపాటు పన్ను మినహాయింపులనుకూడా కల్పించనున్నట్టు ఆయన తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 15 Jun 2009 | 1:05 pm

అత్యాచారం కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు

ఇంటిలో పని చేస్తున్న పని మనిషిపై అత్యాచారానికి పాల్పడినట్టు వచ్చిన ఆరోపణ కేసులో బాలీవుడ్ వర్ధమాన నటుడు షైనీ అహుజాను పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. ఆయన్ను సోమవారం కోర్టులో హాజరుపరుచనున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 15 Jun 2009 | 12:29 pm

కేసీఆర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ ఆ పార్టీ అసమ్మతి నేత రవీంద్రనాయక్ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తెలంగాణ భవన్‌కు వెళ్లిన తనపై జరిగిన దాడి కేసీఆర్ ప్రోద్భలంతోనే జరిగిందని అందుకే ఆయనపై చర్య తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 15 Jun 2009 | 10:13 am

అదుపులో స్వైన్ ఫ్లూ: ఆరోగ్య మంత్రి ఆజాద్

దేశంలో స్వైన్ ఫ్లూ వ్యాధి రోగుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. దీంతో దేశ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ మాత్రం స్వైన్ ఫ్లూ వ్యాధి పూర్తిగా అదుపులోనే ఉందని తాపీగా సెలవిస్తున్నారు.
Source: జాతీయ | 15 Jun 2009 | 10:05 am

సాయం చేసేందుకు భారత్ సిద్ధం: ప్రధాని

అంతర్జాతీయ సమాజాన్ని వణికిస్తున్న ఆర్థిక మాంద్యం నుంచి ప్రపంచ దేశాలు గట్టెక్కేందుకు అవసరమైన సాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. ఈ సంక్షోభ సమయంలో అంతర్జాతీయ సహాయకారి పాత్రను పోషించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఆయన సోమవారం తెలిపారు.
Source: జాతీయ | 15 Jun 2009 | 10:04 am

కేసీఆర్‌పై దుమ్మెత్తిపోసిన రవీంద్రనాయక్

గిరిజన నేతనైన తనపై దాడి జరిపించిన టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నాశనమైపోతారంటూ ఆ పార్టీ అసమ్మతి నేత రవీంద్రనాయక్ దుయ్యబట్టారు. టీఆర్ఎస్‌కు గిరిజనుల్లో ఆదరణ లభించేందుకు తీవ్రమైన కృషి చేసిన తనను కొట్టించిన కేసీఆర్ తెలంగాణ ఏం తెస్తారంటూ ఆయన ధ్వజమెత్తారు.
Source: ఏపీ న్యూస్ | 15 Jun 2009 | 10:04 am

భక్తుల సేవకు ప్రాధాన్యం ఇవ్వండి: వైఎస్

తిరుమలకు వచ్చే వీఐపీల గురించి కాకుండా సామాన్య భక్తుల గురించి టీటీడీ ఉద్యోగులు శ్రద్ధ తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కోరారు. తిరుమల శ్రీవారి దర్శనం వీఐపీలకు మాత్రమే అందుతోందని, సామాన్యులకు మాత్రం ఆ భాగ్యం కష్టసాధ్యమవుతోందని విమర్శలు వస్తోన్న నేపథ్యంలో వైఎస్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Source: ఏపీ న్యూస్ | 15 Jun 2009 | 7:25 am

జలంధర్‌లో 8మందికి స్వైన్‌ఫ్లూ నిర్ధారణ

దేశంలో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోందన్న వార్తల నేపథ్యంలో తాజాగా జలంధర్‌లో మరో ఎనిమిది కేసులు నమోదయ్యాయి. జలంధర్‌లో నమోదైన స్వైన్‌ఫ్లూ కేసుల్లో బాధితులంతా విద్యార్ధులే కావడం గమనార్హం.
Source: జాతీయ | 15 Jun 2009 | 6:21 am

నేడు రష్యాకు బయలుదేరి వెళ్లనున్న ప్రధాని

ప్రధాని మన్మోహన్ సింగ్ తన మూడు రోజుల అధికారిక పర్యటన కోసం సోమవారం రష్యా రాజధాని మాస్కోకు బయలుదేరి వెళ్ళనున్నారు. ఈ పర్యటనలో ఆయన పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ ఆలీ జర్దారీతో సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి.
Source: జాతీయ | 15 Jun 2009 | 6:11 am

అవి మత్తులో తీసుకున్న నిర్ణయాలు

తమపై బహిష్కరణ వేటు విధిస్తూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయం రాత్రివేళ మత్తులో తీసుకుందని బహిష్కరణకు గురైన నేతలు విమర్శించారు. కేసీఆర్ రాత్రివేళ మత్తులో ఉంటారని ఆ సమయంలో తీసుకున్న ఈ నిర్ణయంపై తామిప్పుడే తొందరపడబోమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 15 Jun 2009 | 5:34 am

చిరంజీవి సంస్కారవంతుడు: డీఎస్

ప్రాజారాజ్యం అధినేత చిరంజీవి సంస్కారవంతుడని పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. ఇటీవల మృతి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన టెక్కలి ఎమ్మెల్యే రేవతీపతి కుటుంబంలోని వారికే టికెట్ కేటాయిస్తే తమ పార్టీ పోటీ చేయదని చిరంజీవి ప్రకటించిన నేపథ్యంలో డీఎస్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Source: ఏపీ న్యూస్ | 15 Jun 2009 | 5:15 am

పారదర్శకతే ప్రధానంగా పాలన: వైఎస్

పారదర్శకతే ప్రధానంగా, ప్రజలకు మేలు జరిగేలా చూడడమే తమ ఐదేళ్ల కార్యచరణ ప్రణాళిక ఉద్దేశ్యమని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్పష్టం చేశారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో తప్పులు జరగకుండా చూస్తూ వచ్చే ఐదేళ్లలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో జలయజ్ఞానికి పెద్దపీట వేస్తామని ఆయన పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 15 Jun 2009 | 4:56 am

దేశంలో 20కి చేరిన స్వైన్ ఫ్లూ కేసులు

దేశవ్యాప్తంగా స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య ఒక్కొక్కటిగా పెరుగుతోంది. తాజాగా ఈ వ్యాధి బారినపడిన వారి సంఖ్య 20కి చేరుకుంది. దేశంలో స్వైన్ ఫ్లూ పరిస్థితిపై ఆదివారం కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు చర్చలు జరిపారు. ఈ సమావేశానికి ఆరోగ్య శాఖకు చెందిన పర్యవేక్షణా కమిటీ సభ్యులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ, జాతీయ అంటువ్యాధుల పరిశోధనా కేంద్రం (ఎన్ఐసీడీ) ప్రతినిధులు హాజరయ్యారు.
Source: జాతీయ | 15 Jun 2009 | 3:30 am

హిందుత్వను వదిలిపెడితే బీజేపీతో తెగతెంపులు

సీనియర్ నేతల మధ్య విభేదాలతో సతమతమవుతున్న ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీకి ఆర్ఎస్ఎస్ నుంచి ఎదురుదాడి ఎదుర్కొంటుంది. హిందుత్వపై బీజేపీ నేతల్లో స్పష్టమైన వైఖరి లేదని ఆర్ఎస్ఎస్ ఆరోపించింది. హిందుత్వను నిర్లక్ష్యం చేస్తే బీజేపీతో తమ సంబంధాలు తెగిపోతాయని హెచ్చరించింది.
Source: జాతీయ | 15 Jun 2009 | 3:20 am

వచ్చే నెల 5, 6 తేదీల్లో బీజేపీ సమావేశాలు

రాష్ట్రంలో వచ్చే నెలలో బీజేపీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ తెలిపారు. జులై 5, 6 తేదీల్లో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 14 Jun 2009 | 1:16 pm

అనంతపురంలో ప్రేమోన్మాదానికి బాలిక బలి

అనంతపురం జిల్లాలోని పామిడి మండలం, పాలెం తండాలో ఓ ఉన్మాది తనను ప్రేమించలేదనే కారణంతో బాలికను కిరోసిన్ పోసి సజీవ దహనం చేశాడు. రాష్ట్రంలో తరచుగా ప్రేమోన్మాద చర్యలు వెలుగుచూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇటువంటి మరోసారి ప్రేమోన్మాదం జడలు విప్పింది.
Source: ఏపీ న్యూస్ | 14 Jun 2009 | 1:10 pm

గుంటూరు అగ్నిప్రమాదం: 5 కోట్ల ఆస్తి నష్టం

గుంటూరు నగర శివారులోని గోడౌన్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు రూ.ఐదు కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. మంటలు ఎంతకు ఆరకపోవడంతో సహాయక సిబ్బంది గోడౌన్‌ బ్లాక్‌ను కూల్చివేశారు. ఉవ్వెత్తున ఎగుస్తున్న మంటలను నియంత్రించేందుకు అగ్నిమాపక సిబ్బంది నానా తంటాలు పడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 14 Jun 2009 | 1:02 pm

నా గుండెలపై భారం పోయింది: యశ్వంత్ సిన్హా

బీజేపీలో అన్ని పదవులకు రాజీనామా చేస్తూ లేఖాస్త్రాన్ని సంధించిన తరువాతి రోజు యశ్వంత్ సిన్హా మాట్లాడుతూ.. ఇప్పుడు తనకు గుండెలపై భారమంతా దిగిపోయినట్లు ఉందన్నారు. పార్టీ పదవులన్నింటి నుంచి తప్పుకున్నప్పటికీ, బీజేపీలోనే కొనసాగుతానని యశ్వంత్ సిన్హా స్పష్టం చేశారు.
Source: జాతీయ | 14 Jun 2009 | 12:33 pm

నింబాల్కర్ హత్య: పాటిల్ కస్టడీ పొడిగింపు

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత పదమ్‌సింహ్ పాటిల్ కస్టడీని ఆదివారం ముంబయి కోర్టు జూన్ 20 వరకు పొడిగించింది. మహారాష్ట్ర కాంగ్రెస్ నేత పవన్‌రాజే నింబాల్కర్, ఆయన డ్రైవర్ జంట హత్యల కేసులో ప్రమేయం ఉన్నట్లు పాటిల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
Source: జాతీయ | 14 Jun 2009 | 11:06 am

కేసీఆర్‌ ద్రోహి.. అందుకే బుద్ది చెప్పారు

తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు ప్రత్యేక తెలంగాణా పేరుతో మోసం చేశారని.. అందుకే ఎన్నికల్లో ఆయనకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని టీఆర్ఎస్ అసమ్మతి నేత జిట్టా బాలకృష్ణారెడ్డి విమర్శించారు. ఎన్నికల ముందు ఒక ప్రకటన, తర్వాత ఒక ప్రకటన చేసిన కేసీఆర్.. నాయకుడు ఎలా అవుతాడని ఆయన దుయ్యబట్టారు.
Source: ఏపీ న్యూస్ | 14 Jun 2009 | 10:49 am