వచ్చే నెల 5, 6 తేదీల్లో బీజేపీ సమావేశాలు

రాష్ట్రంలో వచ్చే నెలలో బీజేపీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ తెలిపారు. జులై 5, 6 తేదీల్లో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 14 Jun 2009 | 6:45 pm

అనంతపురంలో ప్రేమోన్మాదానికి బాలిక బలి

అనంతపురం జిల్లాలోని పామిడి మండలం, పాలెం తండాలో ఓ ఉన్మాది తనను ప్రేమించలేదనే కారణంతో బాలికను కిరోసిన్ పోసి సజీవ దహనం చేశాడు. రాష్ట్రంలో తరచుగా ప్రేమోన్మాద చర్యలు వెలుగుచూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇటువంటి మరోసారి ప్రేమోన్మాదం జడలు విప్పింది.
Source: Yahoo! Telugu: News | 14 Jun 2009 | 6:40 pm

గుంటూరు అగ్నిప్రమాదం: 5 కోట్ల ఆస్తి నష్టం

గుంటూరు నగర శివారులోని గోడౌన్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు రూ.ఐదు కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. మంటలు ఎంతకు ఆరకపోవడంతో సహాయక సిబ్బంది గోడౌన్‌ బ్లాక్‌ను కూల్చివేశారు. ఉవ్వెత్తున ఎగుస్తున్న మంటలను నియంత్రించేందుకు అగ్నిమాపక సిబ్బంది నానా తంటాలు పడ్డారు.
Source: Yahoo! Telugu: News | 14 Jun 2009 | 6:32 pm

పాక్‌లో అమెరికా డ్రోన్ దాడి: ఐదుగురి మృతి

పాకిస్థాన్‌లోని సమస్యాత్మక నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్‌లో అమెరికా డ్రోన్ (మానవరహిత విమానం) జరిపిన దాడిలో ఐదుగురు తీ్రవాదులు హతమయ్యారని మీడియా కథనాలు వెల్లడించాయి. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులకు సమీపంలోని పాక్ గిరిజన ప్రాంతంలో అమెరికా డ్రోన్ దాడి జరిగింది.
Source: Yahoo! Telugu: News | 14 Jun 2009 | 6:21 pm

ట్యునిషియా లైసెన్స్ బిడ్‌కు బీఎస్ఎన్ఎల్ దూరం

ట్యునిషియాలో టెలికాం లైసెన్స్ కోసం ప్రయత్నాలను విరమించుకోవాలని ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) నిర్ణయించుకుంది. ట్యూనిషియాలో లైసెన్స్ కోసం గతంలో బిడ్డింగ్ ప్రక్రియలోకి అడుగుపెట్టాలని బీఎస్ఎన్ఎల్ భావించిన సంగతి తెలిసిందే.
Source: Yahoo! Telugu: News | 14 Jun 2009 | 6:14 pm

నా గుండెలపై భారం పోయింది: యశ్వంత్ సిన్హా

బీజేపీలో అన్ని పదవులకు రాజీనామా చేస్తూ లేఖాస్త్రాన్ని సంధించిన తరువాతి రోజు యశ్వంత్ సిన్హా మాట్లాడుతూ.. ఇప్పుడు తనకు గుండెలపై భారమంతా దిగిపోయినట్లు ఉందన్నారు. పార్టీ పదవులన్నింటి నుంచి తప్పుకున్నప్పటికీ, బీజేపీలోనే కొనసాగుతానని యశ్వంత్ సిన్హా స్పష్టం చేశారు.
Source: Yahoo! Telugu: News | 14 Jun 2009 | 6:02 pm

ప్రణాళికా వ్యయం రూ.1 లక్ష కోట్ల పైమాటే

కేంద్రంలో తిరిగి అధికారం చేపట్టిన యూపీఏ కూటమి ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఏ, భారత్ నిర్మాణ్, పేదలకు కేజీ రూ.3లకే బియ్యం, గోధుమ పంపిణీ చేసే పథకాలకు కేటాయింపుల పెంచడంతో ప్రణాళికా వ్యయం రూ.1 లక్ష కోట్ల మేర పెరిగింది. మధ్యంతర బడ్జెట్‌లో రూ.2.85 లక్షల కోట్ల వద్ద ఉన్న ప్రణాళికా వ్యయం కేంద్ర ప్రభుత్వం ప్రధాన పథకాలకు కేటాయింపులు పెంచడంతో రూ.3.85 లక్షల కోట్లకు పెరిగినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
Source: Yahoo! Telugu: News | 14 Jun 2009 | 5:39 pm

తీవ్రవాద దాడులు ప్రసారం చేయొద్దు: పాకిస్థాన్

తీవ్రవాద దాడులను ప్రసారం చేయవద్దని పాకిస్థాన్ ప్రభుత్వం ఆదివారం ఆ దేశ ఎలక్ట్రానిక్ మీడియాకు విజ్ఞప్తి చేసింది. తీవ్రవాద దాడులు, ఇతర హింసాత్మక సంఘటనలను ప్రత్యక్ష ప్రసారం చేయవద్దని సూచించింది. ఇటువంటి దుశ్చర్యలను ప్రసారం చేయడం వలన ప్రజలు భయకంపితులు అవుతున్నారని పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి ఖమర్ జమన్ కైరా తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 14 Jun 2009 | 5:20 pm

కూలేముందే తునకలైన ఎయిర్‌ఫ్రాన్స్ జెట్

బ్రెజిల్ రాజధాని రియో డి జెనీరో నుంచి పారిస్ వెళుతూ అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయిన ఎయిర్‌ఫ్రాన్స్ జెట్ విమానం.. ఆకాశంలోనే రెండు ముక్కలు అయిందని ఆదివారం మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ విమాన ప్రమాదంలో 228 మంది ప్రాణాలు కోల్పోయారు.
Source: Yahoo! Telugu: News | 14 Jun 2009 | 5:07 pm

నింబాల్కర్ హత్య: పాటిల్ కస్టడీ పొడిగింపు

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత పదమ్‌సింహ్ పాటిల్ కస్టడీని ఆదివారం ముంబయి కోర్టు జూన్ 20 వరకు పొడిగించింది. మహారాష్ట్ర కాంగ్రెస్ నేత పవన్‌రాజే నింబాల్కర్, ఆయన డ్రైవర్ జంట హత్యల కేసులో ప్రమేయం ఉన్నట్లు పాటిల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
Source: Yahoo! Telugu: News | 14 Jun 2009 | 4:36 pm

వచ్చే నెల 5, 6 తేదీల్లో బీజేపీ సమావేశాలు

రాష్ట్రంలో వచ్చే నెలలో బీజేపీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ తెలిపారు. జులై 5, 6 తేదీల్లో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 14 Jun 2009 | 1:16 pm

అనంతపురంలో ప్రేమోన్మాదానికి బాలిక బలి

అనంతపురం జిల్లాలోని పామిడి మండలం, పాలెం తండాలో ఓ ఉన్మాది తనను ప్రేమించలేదనే కారణంతో బాలికను కిరోసిన్ పోసి సజీవ దహనం చేశాడు. రాష్ట్రంలో తరచుగా ప్రేమోన్మాద చర్యలు వెలుగుచూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇటువంటి మరోసారి ప్రేమోన్మాదం జడలు విప్పింది.
Source: ఏపీ న్యూస్ | 14 Jun 2009 | 1:10 pm

గుంటూరు అగ్నిప్రమాదం: 5 కోట్ల ఆస్తి నష్టం

గుంటూరు నగర శివారులోని గోడౌన్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు రూ.ఐదు కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. మంటలు ఎంతకు ఆరకపోవడంతో సహాయక సిబ్బంది గోడౌన్‌ బ్లాక్‌ను కూల్చివేశారు. ఉవ్వెత్తున ఎగుస్తున్న మంటలను నియంత్రించేందుకు అగ్నిమాపక సిబ్బంది నానా తంటాలు పడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 14 Jun 2009 | 1:02 pm

నా గుండెలపై భారం పోయింది: యశ్వంత్ సిన్హా

బీజేపీలో అన్ని పదవులకు రాజీనామా చేస్తూ లేఖాస్త్రాన్ని సంధించిన తరువాతి రోజు యశ్వంత్ సిన్హా మాట్లాడుతూ.. ఇప్పుడు తనకు గుండెలపై భారమంతా దిగిపోయినట్లు ఉందన్నారు. పార్టీ పదవులన్నింటి నుంచి తప్పుకున్నప్పటికీ, బీజేపీలోనే కొనసాగుతానని యశ్వంత్ సిన్హా స్పష్టం చేశారు.
Source: జాతీయ | 14 Jun 2009 | 12:33 pm

నింబాల్కర్ హత్య: పాటిల్ కస్టడీ పొడిగింపు

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత పదమ్‌సింహ్ పాటిల్ కస్టడీని ఆదివారం ముంబయి కోర్టు జూన్ 20 వరకు పొడిగించింది. మహారాష్ట్ర కాంగ్రెస్ నేత పవన్‌రాజే నింబాల్కర్, ఆయన డ్రైవర్ జంట హత్యల కేసులో ప్రమేయం ఉన్నట్లు పాటిల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
Source: జాతీయ | 14 Jun 2009 | 11:06 am

కేసీఆర్‌ ద్రోహి.. అందుకే బుద్ది చెప్పారు

తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు ప్రత్యేక తెలంగాణా పేరుతో మోసం చేశారని.. అందుకే ఎన్నికల్లో ఆయనకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని టీఆర్ఎస్ అసమ్మతి నేత జిట్టా బాలకృష్ణారెడ్డి విమర్శించారు. ఎన్నికల ముందు ఒక ప్రకటన, తర్వాత ఒక ప్రకటన చేసిన కేసీఆర్.. నాయకుడు ఎలా అవుతాడని ఆయన దుయ్యబట్టారు.
Source: ఏపీ న్యూస్ | 14 Jun 2009 | 10:49 am

ఆయుధ ప్యాక్టరీలు ఏర్పాటుచేస్తున్న నక్సల్స్

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తొలిసారి రాకెట్ లాంఛర్లు ఉపయోగించి భద్రతా దళాలను ఆశ్చర్యపరిచిన నక్సల్స్ ఇప్పటికే నాలుగు ఆయుధాలు, పేలుడు పదార్థాలు తయారు చేసే యూనిట్లును నెలకొల్పినట్లు కేంద్ర భద్రతా సంస్థలు తెలిపాయి.
Source: జాతీయ | 14 Jun 2009 | 8:30 am

అదృశ్యమైన అణుశాస్త్రవేత్త మృతదేహం లభ్యం

కైగా అణు విద్యుత్ ప్లాంటులో అణు శాస్త్రవేత్తగా పనిచేస్తున్న ఎన్.మహాలింగం మృతదేహాన్ని శనివారం కాళీ నదిలో కనుగొన్నారు. ఆరు రోజులుగా ఆయన ఆచూకీ కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిచ్చిన సంగతి తెలిసిందే.
Source: జాతీయ | 14 Jun 2009 | 7:03 am

బెంగళూరులో మరో రెండు స్వైన్ ఫ్లూ కేసులు

దేశంలో స్వైన్ ఫ్లూ కేసులు ఒక్కొక్కటిగా పెరుగుతుండటం ఆరోగ్య శాఖ అధికారులను కలవరపెడుతోంది. తాజాగా బెంగళూరులో మరో రెండు స్వైన్ ఫ్లూ కేసులు నిర్ధారించారు. దీంతో దేశవ్యాప్తంగా వెలుగుచూసిన స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య 19కి చేరింది. అమెరికా నుంచి బెంగళూరు వచ్చిన ఓ మహిళకు, ఆమె కుమార్తెకు స్వైన్ ఫ్లూ వ్యాధి సోకినట్లు అధికారిక వర్గాలు నిర్ధారణకు వచ్చాయి.
Source: జాతీయ | 14 Jun 2009 | 5:16 am

బుద్ధిలేక నితిన్‌ను హీరోగా తీసుకున్నా: వర్మ

ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌వర్మ గురించి అందరికీ బాగా తెలుసు. వర్మ అంటేనే ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌ అని సినీ ప్రముఖులు అంటుంటారు. ఎవరేమనుకున్నాసరే.. తను ఏది చెప్పాలనుకున్నాడో ఆ విషయాన్ని ముక్కుసూటిగా చెప్పేస్తానని రామ్‌గోపాల్ వర్మ అంటున్నారు. తాజాగా నితిన్ హీరోగా అడవి అనే సైకో థ్రిల్లర్ చిత్రాన్ని రామ్‌గోపాల్ వర్మ రూపొందిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్స్‌ను ప్రదర్శన కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా రామ్‌గోపాల్‌వర్మ కదిలిస్తే పలు విషయాలను చెప్పుకొచ్చారు. ప్రశ్న.. మధ్యాహ్న హత్య, రాత్రి, ఇప్పుడు "అడవి'తో ఇంకా ఎంతకాలం ప్రేక్షకుల్ని దడిపిస్తారు?జ.. వారు చూడనంతవరకు...ప్రశ్న.. అడవిలో నితిన్‌ను హీరోగా ఎందుకు పెట్టారు?జ.. బుద్ధిలేక నితిన్‌ను తీసుకున్నా.ప్రశ్న.. అడవిలో హీరోయిన్‌ను ఎక్స్‌పోజింగ్‌‌కు బాగా ఉపయోగించుకున్నారా?జ.. హీరోని చూపలేంకదా..!ప్రశ్న.. "రన్" సినిమాలో మీడియా గురించి ఏం చెప్పారు?జ.. మీడియాపై 'రన్‌' అనే సినిమా తీస్తున్నాను. సినిమా చూశాక మీడియానే చెబుతుంది.ప్రశ్న.. జనగణమణ'రన్‌' అనడంపై వివాదాస్పదమైంది. ఎందుకలాపెట్టారు?జ.. కొత్తదనం కోసం..
Source: Yahoo! Telugu: Entertainment | 13 Jun 2009 | 5:31 pm

ప్రియుడిపై చేయిచేసుకున్న పారిస్ హిల్టన్!

హాలీవుడ్ సుందరి పారిస్ హిల్టన్ తన బాయ్‌ఫ్రెండ్ బేస్బాల్ స్టార్ "డగ్ రీన్‌హార్డ్‌"తో తెగతెంపులు చేసుకుంది. ఓ క్లబ్‌లో మరొక అమ్మాయితో మాట్లాడుతూ రీన్‌హార్డ్ తన ప్రేయసి కంటబడ్డాడు. దీంతో రీన్‌‍హార్డ్ చెంపచెళ్లుమనిపించిన హిల్టన్ అతనికి అక్కడితో గుడ్‌బైతో చెప్పేసినట్లు తెలుస్తోంది. లాస్ ఏంజెల్స్‌లోని డార్క్‌రూమ్ క్లబ్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ క్లబ్‌కు పారిస్ హిల్టన్ (28) వచ్చే సమయానికి ఆమె బాయ్‌ఫ్రెంట్ మరో అమ్మాయితో చనువుగా ఉన్నాడు. దీంతో కోపాన్ని ఆపుకోలేకపోయిన హిల్టన్ అతనిపై చేయిచేసుకుందని ఇ- ఆన్‌లైన్ వెల్లడించింది.
Source: Yahoo! Telugu: Entertainment | 13 Jun 2009 | 5:00 pm

జూలై 27న తెరపైకి వస్తోన్న వర్మ 'అడవి'

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ డైరక్షన్‌లో, నితిన్‌ హీరోగా నటించిన చిత్రం 'అడవి'. హిందీ, తెలుగు భాషల్లో యుటివి మోషన్‌ పిక్చర్స్‌ సమర్పణలో, ఎ డ్రీమ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై "అడవి" చిత్రం రూపుదిద్దుకుంది. ఈ సినిమా ట్రైలర్స్‌ను శుక్రవారం రాత్రి ప్రదర్శించారు. ఈ సందర్భంగా నిర్మాత రామ్‌గోపాల్‌ వర్మ మాట్లాడుతూ.. ఇది సైకో థ్రిల్లర్‌. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై 27న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు రామ్ గోపాల్ వర్మ తెలియజేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 13 Jun 2009 | 4:50 pm

"శంఖం" షూటింగ్‌లో గోపిచంద్ పుట్టినరోజు

యజ్ఞం, రణం, లక్ష్యం, శౌర్యం వంటి సూపర్‌హిట్ చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను ఏర్పరుచుకున్న ఎగ్రెసివ్ హీరో గోపిచంద్‌కు ఈ నెల (జూన్) 12వ తేదీ పుట్టినరోజు. తాజాగా శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై "శౌర్యం" చిత్ర దర్శకుడు శివ దర్శకత్వంలో జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మిస్తున్న భారీ చిత్రం "శంఖం"లో గోపిచంద్ నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాదులోని రామోజీ ఫిలింసిటిలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. గురువారం హీరో గోపిచంద్ బర్త్ డే కావడంతో యూనిట్ సభ్యుల నడుమ గోపిచంద్ కేక్ కట్ చేసి పుట్టినరోజును జరుపుకున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 13 Jun 2009 | 4:24 pm

తడబడిన సుమంత్ "బోణి"

నటీనటులు: సుమంత్‌, కృతి, తనికెళ్ళభరణి, సుధ, చంద్రమోహన్‌ తదితరులుకథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజ్‌ పిప్పళ, నిర్మాత: రమణ గోగుల.ఇక కథలోకి వెళితే... అనాథలైన స్నేహితులు డిడి (సుమంత్‌), చిన్నా(త్రినేత్రుడు)లను.. ఆశ్రమంలో తల్లిగా చూసే వ్యక్తి వంటమనిషి సుధ. ఆమెచేతి వంట వీరికి పరమాన్నం. ఆమె పులిహోర చేస్తే అద్భుతంగా ఉంటుంది. భవిష్యత్‌లో బాగా డబ్బు సంపాదిస్తే పులిహోర సెంటర్‌ పెట్టాలని వీరిద్దరు అనుకుంటారు. అనుకోకుండా ఆమె చనిపోతుంది. ఇక ఆమె ఆప్యాయత కరువై డిడి, చిన్నాలు ఒంటరివారవుతారు. రోడ్డుమీద కొస్తారు. అక్కడే వీధిగూండాలతో పలు సమస్యలు ఎదుర్కొంటారు. వీరిద్దరు ఒక లక్ష్యంకోసం దాచిన సొమ్ము కనిపించక పోవడంతో, చాలా సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో మాఫియా ముఠాను నడిపే గిరి, దాసు (భరణి, జయప్రకాష్‌రెడ్డి) దగ్గర డిడి, చిన్నాలు పనిచేస్తారు.ఈ క్రమంలో డిడి, చిన్నాలు మంత్రి కుమారుడిని కిడ్నాప్ చేయడంలో, వీరి నిజాయితీ చూసి వీరిలో ఒకరిని మంత్రి కూతురు ప్రేమించడం వంటివి జరుగుతాయి. మరి మంత్రి ఊరుకుంటాడా? ఏంచేశాడు? తర్వాత కథను దర్శకుడు ఎలా తెరకెక్కించాడు అన్నది సినిమా.
Source: Yahoo! Telugu: Entertainment | 13 Jun 2009 | 4:08 pm

స్క్రిప్ట్‌ విషయంలో జాగ్రత్త పడుతోన్న బొమ్మాళీ!

"అరుంధతి" హిట్టయిన తర్వాత టాలీవుడ్ ప్రేక్షకులతో బొమ్మాళీ అని పిలువబడే సెక్సీడాళ్ అనుష్క ఈ మధ్య కథను ఎంచుకోవడంలో తగు జాగ్రత్తలు తీసుకుంటుందట. అరుంధతి చిత్రం ద్వారా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకున్న ఈ బిల్లా సుందరి తదుపరి చిత్రంలో నటించేందుకు కాస్త ఆచీ తూచీ వ్యవహరిస్తోందట. తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ మహేషే బాబు సరసన పేరు ఖరారు కాని కొత్త చిత్రంలో అనుష్క కథానాయికగా నటిస్తోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 13 Jun 2009 | 3:31 pm

అవును.. నేను దేవ్‌పటేల్‌ను ప్రేమిస్తున్నా..!

"స్లమ్‌డాగ్ మిలియనీర్" చిత్రం ద్వారా పాపులర్ అయిన ఆ సినిమా హీరోహీరోయిన్లు దేవ్‌పటేల్, ఫ్రిడా పింటోల మధ్య ప్రేమాయణం కొనసాగుతోందని వార్తలు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. దేవ్‌పటేల్‌తో ప్రేమాయణం కొనసాగిస్తున్నట్లు వార్తలు నిజమేనని పింటో అంగీకరించినట్లు సన్ పత్రిక వెల్లడించింది. దేవ్‌పటేల్‌తో స్లమ్‌డాగ్ చిత్రంలో నటించడం ద్వారా కలిగిన అనుభూతిని ఎన్నాటికి మరిచిపోలేనని చెప్పింది.
Source: Yahoo! Telugu: Entertainment | 13 Jun 2009 | 3:24 pm

జూన్ 15 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం

అమర్నాథ్ యాత్ర సోమవారం( జూన్ 15) నుంచి ప్రారంభం కానుంది. అయితే పహాల్గమ్ రహదారి పూర్తిగా మంచుతో కప్పబడి ఉండటంతో బాల్టెల్ మార్గం ద్వారా భక్తులు ప్రయాణించాలని గవర్నర్ సూచించినట్లు అమర్నాథ్ దేవాలయ బోర్డు అధికారి ఒకరు చెప్పారు.
Source: జాతీయ | 13 Jun 2009 | 2:35 pm