|
సంయుక్త అంతరిక్ష పరిశోధనలో భారత్, జపాన్ఈ ఏడాది సంయుక్త అంతరిక్ష పరిశోధన ప్రాజెక్టును ప్రారంభించాలని భారత్, జపాన్‌లు ప్రణాళికలు చేశాయి. పూర్తి గురుత్వాకర్షణ లేని స్థితిలో పెరిగే మొక్కలపై ప్రయోగాలు చేసేందుకు ఈ సంయుక్త ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్Source: Yahoo! Telugu: News | 13 Jun 2009 | 1:52 pm కుట్రదారులను చట్టం ముందు నిలబెడతాం: పాక్గత ఏడాది ముంబయి మహానగర వాసులను భయకంపితులను చేసిన ఉగ్రవాద దాడుల కుట్రదారులను చట్టం ముందుకు తీసుకొచ్చేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం చేపట్టిన చర్యలపై అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో.. ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రెహమాన్ మాలిక్ మాట్లాడుతూ.. ముంబయి ఉగ్రవాద దాడుల కుట్రదారులను చట్టం ముందు నిలబెట్టేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.Source: Yahoo! Telugu: News | 13 Jun 2009 | 1:43 pm స్వైన్ ఫ్లూ రోగులను పసిగట్టే ధర్మల్ స్కానర్స్ప్రపంచాన్ని గడగడ వణికిస్తున్న స్వైన్ ఫ్లూ భారతదేశంలో వేగంగా విస్తరిన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో దీని తీవ్రత మరింత ఎక్కువగా కనబడుతోంది. దేశంలో ఇప్పటివరకూ 16 కేసులు నమోదైతే అందులో 8 మన రాష్ట్రానికి చెందినవి కావడం ఆందోళన కలిగించే అంశం.Source: Yahoo! Telugu: News | 13 Jun 2009 | 1:33 pm అమెరికా నౌకను ఢీకొన్న చైనా జలాంతర్గామిఫిలిప్పీన్స్ తీరంలో అమెరికా నౌకా దళానికి చెందిన యూఎస్ఎస్ జాన్ ఎస్ మెక్‌కెయిన్ నౌకను చైనాకు చెందిన ఓ జలాంతర్గామి (సబ్‌మెరైన్) ఢీకొంది. అమెరికా నౌకకు చెందిన సోనార్ అర్రేను నీటిలో చైనా జలాంతర్గామి ఢీకొనట్లు సీఎన్ఎన్ వెల్లడించింది.Source: Yahoo! Telugu: News | 13 Jun 2009 | 1:31 pm ఎగుమతి రంగం ఉద్యోగులకు గడ్డుకాలంఎగుమతుల రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ ఆర్థిక సంవత్సరం గడ్డుకాలం తప్పదని అంక్టాడ్ అనే సర్వే తేల్చిచెబుతోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థికమాంద్యం హెచ్చుమీరుతున్న కారణంగా ఎగుమతులు తగ్గి ఈ రంగంలోని 13లక్షలమంది ఉపాధి కోల్పోవచ్చని ఈ సర్వే పేర్కొంది.Source: Yahoo! Telugu: News | 13 Jun 2009 | 1:16 pm తాలిబాన్లను అంతం చేసే వరకు సైనిక చర్యపాకిస్థాన్ తన సార్వభౌమత్వాన్ని నిలుపుకునేందుకు తాలిబాన్ తీవ్రవాదులతో పోరాడుతుందని ఆ దేశ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ పేర్కొన్నారు. ఆయన శనివారం మాట్లాడుతూ.. తాలిబాన్లను పూర్తిగా అణిచివేసే వరకు పాక్ ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్య కొనసాగుతుందని స్పష్టం చేశారు.Source: Yahoo! Telugu: News | 13 Jun 2009 | 1:15 pm అమెరికా స్టాక్ మార్కెట్లుపెరుగుతున్న వినిమయ వస్తువుల ధరలు, లేబర్ మార్కెట్లో పరిస్థితులు ఆశాజనకంగా ఉండటం, వడ్డీ రేట్లు స్వల్పంగా తగ్గటం.. వంటి అంశాల ప్రభావంతో అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల్లో నడిచాయి. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ ఇండెక్స్ - 0.37 శాతంతో 31.90 పాయింట్లు లాభపడి 8,770.92 వద్దకు చేరుకుంది. స్టాండార్డ్ అండ్ పూర్ ఇండెక్స్ - 0.61 శాతంతో 5.74 పాయింట్లు పెరిగి 944.89 వద్దకు చేరుకుంది. నాస్‌డాక్ కంపోజిట్ ఇండెక్స్ - 0.50 శాతంతో 9.29 పాయింట్లు పుంజుకుని 1,862.37 వద్దకు చేరుకుంది.Source: Yahoo! Telugu: News | 13 Jun 2009 | 1:11 pm బ్రాడ్‌పిట్‌తో ఏంజెలీనా డిష్యూం.. డిష్యూం..!పాపం..! ఏంజెలీనా జోలీ ప్రస్తుతం సవతి పోరుతో తల్లడిల్లుతోంది. తనతో సహజీవనం చేస్తున్న బ్రాడ్‌పిట్ ఈ మధ్య అతడి మాజీ భార్య జెన్నీఫర్ ఆనిస్టన్‌తో కలిసి తిరగడం విని జోలీ తెగ బాధపడిపోతోంది. జూన్ నాలుగో తేదీ ఏంజెలీనా పుట్టినరోజు. ఆ రోజున తన బర్త్ డేను హ్యాపీగా గడుపుకోకుండా జోలీ బ్రాడ్‌పిట్‌తో జగడం వేసిందట. ఆనిస్టన్ విషయమై బ్రాడ్‌పిట్-ఏంజెలీనా జోలీలకు మధ్య పెద్ద వాగ్వివాదం జరిగిందట.Source: Yahoo! Telugu: Entertainment | 13 Jun 2009 | 1:03 pm సెస్నా విమాన సంస్థ ఉద్యోగాల్లో కోతఅమెరికా కార్పొరేట్ జెట్ విమాన తయారీ సంస్థ సెస్నా ఎయిర్‌క్రాఫ్ట్ కంపెనీ తాజాగా మళ్లీ 1,300 మంది ఉద్యోగులను తొలిగించనుంది. ఆర్థిక మాంద్యం మరింతగా విస్తరిస్తున్న ఈ నేపథ్యంలో ఉత్పత్తి విభాగంలో ఈ సవరణలు (ఉద్యోగాల్లో కోత) చేసినట్లు కంపెనీ తెలిపింది.Source: Yahoo! Telugu: News | 13 Jun 2009 | 12:46 pm వేలాది మందిని మోసగించిన వ్యక్తి అరెస్ట్దేశ రాజధానిలో వేలాది మందిని మోసగించిన సుభాష్ అగర్వాల్, అతని భార్య స్నేహలతాలను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఢిల్లీలోని నాంగ్లోయ్‌లో వీరిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులపై ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తు జరుపుతోందని పోలీసు అధికారులు తెలిపారు.Source: Yahoo! Telugu: News | 13 Jun 2009 | 12:36 pm భద్రతకు హామీ: జూ. డాక్టర్ల సమ్మె విరమణఆస్పత్రిలో తమకు ప్రత్యేక భద్రత కల్పించేందుకు యాజమాన్యం ముందుకు రావడంతో గాంధీ ఆస్పత్రి జూనియర్ డాక్టర్లు నాలుగురోజులుగా చేస్తున్న సమ్మెను విరమించారు. ఆస్పత్రి సూపరింటెండ్ బాల నాగేశ్వరితో జరిగిన చర్చలు విజయవంతమైన నేపథ్యంలో తామీ నిర్ణయం తీసుకున్నట్టు వారు ప్రకటించారు.Source: Yahoo! Telugu: News | 13 Jun 2009 | 12:35 pm ఫ్లూ జ్వరంతో వణికిపోయిన తెల్లపిల్ల తమన్నా"కండేన్ కథాళి" తమిళ చిత్రానికి సంబంధించి షూటింగ్‌లో పాల్గొంటున్న తమన్నాకు ఉన్నట్టుండి ఫ్లూ జ్వరం వచ్చిందట. ఎన్ని దుప్పట్లు కప్పినా వణుకు ఆగలేదట. దీంతో ఆమె అసిస్టెంట్లు పరుగుపరుగున ఈ సమాచారాన్ని దర్శకునికి తెలియజేద్దామని వెళితే, ఆయన కూడా నాలుగు దుప్పట్లు కప్పుకుని గడగడమని వణుకుతున్నాడట. దీంతో వీళ్లద్దరికీ ఫ్లూ జ్వరం వచ్చిందన్న సంగతిని చిత్ర నిర్మాతకు చెబుదామంటే, ఆయన అందుబాటులో లేరట. చేసేది లేక కనీసం చిత్ర కథానాయికునికైనా చెబుదామని పరుగెత్తారట. చిత్రంగా సదరు హీరోగారు కూడా ఓ ఐదు మందపాటి రగ్గులు కప్పుకుని "హు...హు.. హు..." అని మూలుగుతున్నాడట. అంతే... ఆయనకు కూడా ఫ్లూ జ్వరం వచ్చినట్లు నిర్థారించుకున్నారట అసిస్టెంట్లు.Source: Yahoo! Telugu: Entertainment | 13 Jun 2009 | 12:24 pm అక్షయ్ కుమార్‌తో జతకట్టనున్న త్రిష..!టాలీవుడ్, కోలీవుడ్ సినీ రంగాల్లో అగ్రహీరోయిన్‌గా ముద్రవేసుకున్న సొట్ట బుగ్గల చిన్నది, పొడవుకాళ్ల సుందరి త్రిష.. బాలీవుడ్ రంగ ప్రవేశం చేయనుంది. బాలీవుడ్ టాప్ హీరో అక్షయ్ కుమార్‌తో రూపుదిద్దుకోనున్న కొత్త చిత్రంలో త్రిష కథానాయికగా నటించబోతుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. ప్రముఖ ప్రియదర్శన్ దర్శకత్వం వహించే "ఖటా మిటా" అనే హిందీ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించబోతోంది. అక్షయ్ కుమార్ సొంత బేనర్‌పై, స్వీయ నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాకు సంబంధించిన అగ్రిమెంట్లో త్రిష ఇప్పటికే సంతకాలు చేసేసిందని బాలీవుడ్ వర్గాల సమాచారం.Source: Yahoo! Telugu: Entertainment | 13 Jun 2009 | 12:01 pm వేలాది మందిని మోసగించిన వ్యక్తి అరెస్ట్దేశ రాజధానిలో వేలాది మందిని మోసగించిన సుభాష్ అగర్వాల్, అతని భార్య స్నేహలతాలను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఢిల్లీలోని నాంగ్లోయ్‌లో వీరిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులపై ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తు జరుపుతోందని పోలీసు అధికారులు తెలిపారు.Source: జాతీయ | 13 Jun 2009 | 7:06 am భద్రతకు హామీ: జూ. డాక్టర్ల సమ్మె విరమణఆస్పత్రిలో తమకు ప్రత్యేక భద్రత కల్పించేందుకు యాజమాన్యం ముందుకు రావడంతో గాంధీ ఆస్పత్రి జూనియర్ డాక్టర్లు నాలుగురోజులుగా చేస్తున్న సమ్మెను విరమించారు. ఆస్పత్రి సూపరింటెండ్ బాల నాగేశ్వరితో జరిగిన చర్చలు విజయవంతమైన నేపథ్యంలో తామీ నిర్ణయం తీసుకున్నట్టు వారు ప్రకటించారు.Source: ఏపీ న్యూస్ | 13 Jun 2009 | 7:06 am త్వరలో మన్మోహన్, జర్దారీల భేటీకి అవకాశంభారత ప్రధాని మన్మోహన్ సింగ్, పాకిస్థాన్ అధ్యక్షుడు అసీఫ్ అలీ జర్దారీలు త్వరలో పరస్పరం భేటీ అయ్యే అవకాశాలున్నాయి. షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఒకే వేదికపైకి రానున్న ఈ ఇద్దరు నేతలు ముఖాముఖీ భేటీ అయ్యే అవకాశాలను కొట్టిపారేయలేమని భారత అధికారులు పేర్కొన్నారు.Source: జాతీయ | 13 Jun 2009 | 6:03 am నాలుగోరోజుకు చేరిన జూ. డాక్టర్ల సమ్మెగాంధీ ఆస్పత్రికి చెందిన జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మె శనివారంతో నాలుగోరోజుకు చేరింది. అదేసమయంలో జూనియర్ డాక్టర్లపై దాడికి పాల్పడినవారిలో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఈ సమ్మెకు నేటితో తెరపడే సూచనలు ఉన్నట్టు భావిస్తున్నారు.Source: ఏపీ న్యూస్ | 13 Jun 2009 | 5:45 am టీడీపీతో పొత్తు ప్రసక్తేలేదు: చిరు స్పష్టంకాంగ్రెస్, తెలుగుదేశంలతోపాటు తమ పార్టీ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలని కాబట్టి ఈ మూడింటిలో ఏ రెండు పార్టీలు పొత్తు పెట్టుకునే అవకాశం లేదని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి స్పష్టం చేశారు.Source: ఏపీ న్యూస్ | 13 Jun 2009 | 5:36 am జస్వంత్ సింగ్‌పై చర్యలు ఉండవు: బీజేపీలోక్సభ ఎన్నికల్లో పార్టీ పేలవ ప్రదర్శనకు కొంత మంది నేతలను బాధ్యులను చేస్తూ బహిరంగంగా విమర్శలు చేసిన సీనియర్ నేత జస్వంత్ సింగ్‌పై ఎటువంటి చర్యలు పరిశీలనలో లేవని భారతీయ జనతా పార్టీ తెలిపింది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పార్టీ ఎన్నికల ప్రచారాన్ని జస్వంత్ సింగ్ బాహాటంగా తీవ్రస్థాయలో విమర్శించారు.Source: జాతీయ | 13 Jun 2009 | 4:05 am ఏఎఫ్ఎస్‌పీఏని పునఃపరిశీలిస్తాం: చిదంబరంభద్రతా దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఏఎఫ్ఎస్‌పీఏ) పునఃపరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని హోంమంత్రి పి.చిదంబరం తెలిపారు. జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలో పారమిలిటరీ దళాల తీరుపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో చిదంబరం ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.Source: జాతీయ | 13 Jun 2009 | 3:41 am ఇండియన్ టీమ్ నా ఫేవరేట్: నమ్రతా శిరోద్కర్క్రికెట్ అంటే తనకు చాలా ఇష్టమని టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ అన్నారు. ఫేవరేట్ క్రికెటర్ అంటూ ప్రత్యేకించి ఎవ్వరూ లేరని ఆమె చెప్పారు. క్రికెట్ అంటేనే సమిష్టిగా ఆడేదని, అందుకే టీం ఇండియా మొత్తం తన ఫేవరేట్ అని నమ్రతా వెల్లడించారు. ఈ సమ్మర్‌ను కుటుంబంతో గోవాలో ఎంజాయ్ చేస్తామని, జూలైలో గోవాకు ప్రయాణమవుతున్నామని నమ్రత తెలిపారు.Source: Yahoo! Telugu: Entertainment | 12 Jun 2009 | 6:45 pm ప్రభాస్-కరుణాకరన్ కాంబినేషన్‌లో కొత్త చిత్రంప్రభాస్ హీరోగా 'తొలిప్రేమ' దర్శకుడు కరుణాకరన్ దర్శకత్వం వహిస్తున్న కొత్త చిత్రం శుక్రవారం సంస్థ కార్యాలయంలో ప్రారంభమైంది. శ్రీవెంకటేశ్వర సినీచిత్ర పతాకంపై 'ఛత్రపతి' ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవుని పటాలపై చిత్రీకరించిన తొలిషాట్‌కు కరుణాకరన్ తండ్రి అళగర్‌స్వామి క్లాప్ కొట్టగా, హీరో ప్రభాస్ దర్శకత్వం వహించారు.Source: Yahoo! Telugu: Entertainment | 12 Jun 2009 | 6:25 pm 'వేసవి సెలవుల్లో' ఆడియో విడుదలశ్రీకాంత్, సిద్ధి హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ చందు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'వేసవి సెలవుల్లో' సినిమా ఆడియో మార్కెట్లోకి విడుదలైంది. అగస్త్య ప్రొడక్షన్స్‌పై అగస్త్య, నరేంద్ర ఈ చిత్రాన్ని నిర్మించారు. గురువారం రాత్రి ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్.వి. కృష్ణారెడ్డి ఆడియో ఆవిష్కరించి వి.వి. వినాయక్‌కు అందజేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 12 Jun 2009 | 6:11 pm అల్లు అర్జున్, మనోజ్‌ల "వేదం" ప్రారంభం'గమ్యం' దర్శకుడు రాధాకృష్ణ (క్రిష్) దర్శకత్వంలో అల్లు అర్జున్- మనోజ్ కలిసి నటిస్తోన్న 'వేదం' చిత్రం ప్రారంభమైంది. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని సిటీమ్యాక్స్‌లో ఈ సినిమా షూటింగ్‌ను పూజాకార్యక్రమాలతో లాంఛనంగా ఆరంభించారు.Source: Yahoo! Telugu: Entertainment | 12 Jun 2009 | 5:56 pm బ్రాడ్‌పిట్‌తో ఆనిస్టన్ సరస సల్లాపాలు!తన మాజీ భర్త బ్రాడ్‌పిట్‌తో హాలీవుడ్ సినీతార జెన్నీఫర్ ఆనిస్టన్ రహస్యంగా సరస సల్లాపాలు సాగిస్తుందని కాంటాక్ట్ మ్యూజిక్ మేగజైన్ తెలిపింది. హాలీవుడ్ అందాల రాశి ఏంజెలీనా జోలీ బ్రాడ్‌పిట్‌ను పెళ్లాడుతానని ఇటీవలే ప్రకటించిన నేపథ్యంలో.. బ్రాడ్‌పిట్‌తో ఆనిస్టన్ సన్నిహితంగా ఉందని సినీ వర్గాల సమాచారం. ఇటీవల న్యూయార్క్‌లోని సిటీ గ్రామెర్సీ పార్క్ హోటల్‌లో బ్రాడ్‌పిట్-ఆనిస్టన్‌లు ఒక రాత్రంతా గడిపారని స్టార్ పత్రిక తన ప్రచురణలో తెలిపింది.Source: Yahoo! Telugu: Entertainment | 12 Jun 2009 | 4:29 pm నా డ్రీమ్‌బాయ్ ఇంకా కంటపడలేదు..!: శ్రియ"ఇష్టం" సినిమా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్న సెక్సీడాళ్ శ్రియ. టాలీవుడ్, కోలీవుడ్‌లలో తన హవాను కొనసాగిస్తున్న శ్రియ, తాజాగా ఆరడుగుల అందగాడు విశాల్‌తో "పిస్తా" అనే సినిమాలో నటించింది. ద్విభాషా చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమౌతోంది. ఈ నేపథ్యంలో బిజీ బిజీగా ఉన్న శ్రియను కదిలిస్తే.. కొన్ని విషయాలను చెప్పుకొచ్చింది. పెళ్లెప్పుడు తల్లీ.. అని శ్రియను అడిగితే..? ఇంకేముంది..? "నా డ్రీమ్ బాయ్ ఇంక కంటపడలేదని" అంటోంది. అంతేకాదు.. తనకు కాబోయే భర్తకు కొన్ని క్వాలిటీస్ ఉండాలని వెల్లడించింది. అవి ఏమిటంటే..? జీవితంలో తన ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వాలట. దీంతో పాటు బాగా చదువుకున్న వ్యక్తిగా బుద్ధిమంతుడిగా ఉండాలట. అందరిలా కాకుండా తన డ్రీమ్‌బాయ్‌కి విశేషమైన క్వాలిటీస్ ఉండాలని శ్రియ వరుసగా చెప్పుకొచ్చింది.Source: Yahoo! Telugu: Entertainment | 12 Jun 2009 | 4:11 pm "రామ రామ కృష్ణ కృష్ణ" అంటోన్న రామ్!మస్కా, దేవదాసు, రెడీ చిత్రాల ద్వారా మాస్ హీరోగా ముద్రవేసుకున్న రామ్ తాజాగా "రామ రామ కృష్ణ కృష్ణ" అనే చిత్రం ద్వారా తెరపైకి రానున్నాడు. ప్రస్తుతం శ్రావంతి రవి కిషోర్ నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకుంటోన్న కొత్త చిత్రం షూటింగ్‌లో రామ్ బిజీబిజీగా ఉన్నాడు.మరోవైపు.. టాలీవుడ్ గోల్డెన్ హ్యాండ్ దిల్‌రాజు నిర్మాణ బాధ్యతలు చేపట్టే కొత్త చిత్రంలోనూ రామ్ నటించనున్నాడు. వైవిధ్యమైన కథాంశంతో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి "రామ రామ కృష్ణ కృష్ణ" అనే టైటిల్‌ను ఖరారు చేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 12 Jun 2009 | 3:11 pm ఇండియన్ టీమ్ నా ఫేవరేట్: నమ్రతా శిరోద్కర్క్రికెట్ అంటే తనకు చాలా ఇష్టమని టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ అన్నారు. ఫేవరేట్ క్రికెటర్ అంటూ ప్రత్యేకించి ఎవ్వరూ లేరని ఆమె చెప్పారు. క్రికెట్ అంటేనే సమిష్టిగా ఆడేదని, అందుకే టీం ఇండియా మొత్తం తన ఫేవరేట్ అని నమ్రతా వెల్లడించారు.Source: వినోదం | 12 Jun 2009 | 1:18 pm స్వైన్ ఫ్లూ భయం వద్దు: ఆరోగ్య మంత్రి ఆజాద్ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న స్వైన్ ఫ్లూ వ్యాధి గురించి దశ ప్రజలు ఆందోళన చెందవద్దని కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి గులాం నబీ ఆజాద్ సూచించారు. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలను ఇప్పటికే చేపట్టిందని ఆయన గుర్తు చేశారు.Source: జాతీయ | 12 Jun 2009 | 12:46 pm ఉరిశిక్ష అమలు సాధ్యం కాదు: మంత్రి మొయిలీదోషులు పెట్టుకున్న క్షమాభిక్ష పిటీషన్లపై తుది నిర్ణయం తీసుకునేంత వరకు ఉరిశిక్షల అమలు సాధ్యం కాదని కేంద్ర న్యాయ శాఖామంత్రి వీరప్ప మొయిలీ తేల్చి చెప్పారు. ఇలాంటి దోషుల్లో అఫ్జల్ గురు లేదా మరొకరు ఉన్నా ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు.Source: జాతీయ | 12 Jun 2009 | 10:54 am గ్రేటర్ ఎన్నికల్లోనూ ఒంటరిపోరే: డీఎస్రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేయనుందని పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ స్పష్టం చేశారు. గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే విషయమై ఆలోచించడం లేదని ఆయన పేర్కొన్నారు.Source: ఏపీ న్యూస్ | 12 Jun 2009 | 10:47 am ర్యాగింగ్‌పై కఠిన చర్యలు తీసుకోండి: వైఎస్ప్రతి కళాశాలలో ర్యాగింగ్‌ను నిరోధించే దిశగా కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వివిధ యూనివర్శిటీల వీసీలను కోరారు. కళాశాలల్లో ర్యాంగింగ్‌ను అడ్డుకునే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలంటూ ఆయన సూచించారు.Source: ఏపీ న్యూస్ | 12 Jun 2009 | 10:07 am హైదరాబాద్‌ను వీడని స్వైన్‌ఫ్లూ: కొత్తకేసు నమోదుస్వైన్ఫ్లూ హైదరాబాద్‌ను విడిచిపెట్టే సూచనలు కన్పించడం లేదు. ఈ కోవలో శుక్రవారం మరో కొత్త స్వైన్‌ఫ్లూ కేసు నమోదైంది. దీంతో హైదరాబాద్ నగరం స్వైన్‌ఫ్లూ భయంతో వణుకుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగా నమోదైన స్వైన్‌ఫ్లూ కేసు ఆరేళ్ల పాపది కావడం గమనార్హం.Source: ఏపీ న్యూస్ | 12 Jun 2009 | 10:05 am భద్రతా బలగాల ప్రత్యేకాధికారాలపై దృష్టి: పీసీక్లిష్ట పరిస్థితులు ఉత్పన్నమైనపుడు భద్రతా బలగాలకు ప్రత్యేక అధికారాలు ఇచ్చే చట్టంపై ప్రత్యేక దృష్టి పెడతామని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం తెలిపారు. ఇందుకోసం అవసరమైన చర్యలను కేంద్రం తీసుకుంటుందని చెప్పారు.Source: జాతీయ | 12 Jun 2009 | 10:05 am కళా సంపద ఉట్టిపడే "నల్‌దుర్గ్"కళా సంపద, వాస్తు నైపుణ్యంతో అలరారే పురాతన చరిత్ర కలిగిన కట్టడాలు మన దేశంలో అనేకం ఉన్నాయి. అలాంటి వాటిలో మహారాష్ట్రలో విలసిల్లుతున్న "నల్‌దుర్గ్" కోట ఒకటి. మన పురాణాల్లోని నలుడు, దమయంతి నివసించినదిగా చెప్పబడుతున్న ఈ కోట పేరుతోనే అక్కడో గ్రామం...Source: వినోదం | 12 Jun 2009 | 9:49 am సమాచారం లేని అణు శాస్త్రవేత్త ఆచూకీ!బెంగుళూరులో అదృశ్యమైన అణు శాస్త్రవేత్త ఆచూకీని ఆ రాష్ట్ర పోలీసులు ఇప్పటి వరకు కనుగొనలేక పోయారు. దీంతో శాస్త్రవేత్త కుటుంబంతో సహా, కైగా ఆటామిక్ ప్లాంట్ సైంటిస్టులు ఆందోళన చెందుతున్నారు. శాస్త్రవేత్త ఆచూకీ కోసం తాము చేపట్టిన ఆపరేషన్‌లో ఎలాంటి ఆధారం లేదా, పురోగతి లభించలేదని శుక్రవారం పోలీసులు వెల్లడించారు.Source: జాతీయ | 12 Jun 2009 | 8:30 am జూనియర్ డాక్టర్ల సమ్మె తీవ్రరూపంతమపై జరిగిన దాడికి నిరసనగా సమ్మె ప్రారంభించిన గాంధీ ఆస్పత్రి జూనియర్ డాక్టర్లు శుక్రవారం తమ సమ్మెను ఉధృతం చేశారు. అదేసమయంలో జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఈ సమ్మెకు ప్రభుత్వ వైద్యులు తమ మద్దతు ప్రకటించారు.Source: ఏపీ న్యూస్ | 12 Jun 2009 | 8:21 am చార్మినార్ ఘటన: విషమించిన సమీర ఆరోగ్యంచార్మినార్పైనుంచి తన ప్రియుడు తోసివేయడంతో తీవ్రంగా గాయపడ్డ సమీరాబేగం పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు పేర్కొన్నారు. బాగా ఎత్తునుంచి కిందపడిన కారణంగానే ఈ పరిస్థితి తలెత్తినట్టు వారు తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 12 Jun 2009 | 8:06 am
|