|
మాంద్యంలోకూడా ఆన్‌లైన్ అమ్మకాలు...!ఆర్థికమాంద్యం కారణంగా నిరుడు ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కేవలం భారతదేశంలోనే ఆన్‌లైన్ అమ్మకాల్లో 42శాతం వృద్ధిని సాధించాయి.Source: Yahoo! Telugu: News | 12 Jun 2009 | 7:21 pm పాక్ సైన్యాన్ని ప్రశంసించిన అమెరికాపాకిస్థాన్లోని స్వాత్ లోయలో పాక్ సైన్యం అక్కడే స్థావరాలను ఏర్పరచుకుని ఉన్న తాలిబన్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. వారి పోరాట పటిమను చూసి అమెరికాకు చెందిన ఉన్నతాధికారి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ వారిని ప్రశంసించారు.Source: Yahoo! Telugu: News | 12 Jun 2009 | 6:51 pm ఇండియన్ టీమ్ నా ఫేవరేట్: నమ్రతా శిరోద్కర్క్రికెట్ అంటే తనకు చాలా ఇష్టమని టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ అన్నారు. ఫేవరేట్ క్రికెటర్ అంటూ ప్రత్యేకించి ఎవ్వరూ లేరని ఆమె చెప్పారు. క్రికెట్ అంటేనే సమిష్టిగా ఆడేదని, అందుకే టీం ఇండియా మొత్తం తన ఫేవరేట్ అని నమ్రతా వెల్లడించారు. ఈ సమ్మర్‌ను కుటుంబంతో గోవాలో ఎంజాయ్ చేస్తామని, జూలైలో గోవాకు ప్రయాణమవుతున్నామని నమ్రత తెలిపారు.Source: Yahoo! Telugu: Entertainment | 12 Jun 2009 | 6:45 pm ప్రభాస్-కరుణాకరన్ కాంబినేషన్‌లో కొత్త చిత్రంప్రభాస్ హీరోగా 'తొలిప్రేమ' దర్శకుడు కరుణాకరన్ దర్శకత్వం వహిస్తున్న కొత్త చిత్రం శుక్రవారం సంస్థ కార్యాలయంలో ప్రారంభమైంది. శ్రీవెంకటేశ్వర సినీచిత్ర పతాకంపై 'ఛత్రపతి' ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవుని పటాలపై చిత్రీకరించిన తొలిషాట్‌కు కరుణాకరన్ తండ్రి అళగర్‌స్వామి క్లాప్ కొట్టగా, హీరో ప్రభాస్ దర్శకత్వం వహించారు.Source: Yahoo! Telugu: Entertainment | 12 Jun 2009 | 6:25 pm స్వైన్ ఫ్లూ భయం వద్దు: ఆరోగ్య మంత్రి ఆజాద్ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న స్వైన్ ఫ్లూ వ్యాధి గురించి దశ ప్రజలు ఆందోళన చెందవద్దని కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి గులాం నబీ ఆజాద్ సూచించారు. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలను ఇప్పటికే చేపట్టిందని ఆయన గుర్తు చేశారు.Source: Yahoo! Telugu: News | 12 Jun 2009 | 6:13 pm 'వేసవి సెలవుల్లో' ఆడియో విడుదలశ్రీకాంత్, సిద్ధి హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ చందు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'వేసవి సెలవుల్లో' సినిమా ఆడియో మార్కెట్లోకి విడుదలైంది. అగస్త్య ప్రొడక్షన్స్‌పై అగస్త్య, నరేంద్ర ఈ చిత్రాన్ని నిర్మించారు. గురువారం రాత్రి ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్.వి. కృష్ణారెడ్డి ఆడియో ఆవిష్కరించి వి.వి. వినాయక్‌కు అందజేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 12 Jun 2009 | 6:11 pm తిరుమలేశునికి ఎప్పటికీ ఋణగ్రస్తులమేగురువారం వైకుంఠవాసునికి మరో వజ్రకచిత కిరీటం అందింది. 45 కోట్ల రూపాయల విలువైన ఈ వజ్ర కిరీటాన్ని తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి కర్ణాటక రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి గాలి జనార్ధన రెడ్డి గురువారం కానుకగా అందజేశారు. కోరిన కోర్కెలు తీర్చిన వేంకటేశునికి ఎంత ఇచ్చినా చాలదనీ బ్రాహ్మిణి స్టీల్ పరిశ్రమ మేనేజింగ్ డైరెక్టర్ కూడా అయిన జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఇటువంటి సంఘటనలు... ఆ కలియుగ దైవానికి ఉన్న శక్తి ఎంతటిదో తెలియజేస్తాయి.Source: Yahoo! Telugu: News | 12 Jun 2009 | 5:59 pm పాలిటెక్నిక్, డి.ఫార్మసీ కాలేజీల ఫీజులు పెంపుపాలిటెక్నిక్, డి.ఫార్మసీ కళాశాల్లో ఫీజులు పెంచుతూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభత్వ డి.ఫార్మసీ కళాశాల్లో 3,800 రూపాయలను, ప్రైవేటు కళాశాలల్లో రూ.17000లు పెంచినట్లు ప్రభుత్వం ప్రకటించింది.Source: Yahoo! Telugu: News | 12 Jun 2009 | 5:59 pm అల్లు అర్జున్, మనోజ్‌ల "వేదం" ప్రారంభం'గమ్యం' దర్శకుడు రాధాకృష్ణ (క్రిష్) దర్శకత్వంలో అల్లు అర్జున్- మనోజ్ కలిసి నటిస్తోన్న 'వేదం' చిత్రం ప్రారంభమైంది. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని సిటీమ్యాక్స్‌లో ఈ సినిమా షూటింగ్‌ను పూజాకార్యక్రమాలతో లాంఛనంగా ఆరంభించారు.Source: Yahoo! Telugu: Entertainment | 12 Jun 2009 | 5:56 pm 2009-10లో 1.3 మిలియన్ ఉద్యోగాలకు గండిప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేకించి ఎగుమతి విభాగంలో సుమారు 1.3 మిలియన్‌లకు పైగా ఉద్యోగాలకు గండి పడే అవకాశం ఉందని ప్రముఖ సంస్థ యూఎన్‌సీటీఏడీ వెల్లడించింది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక సంక్షోభమే దీనికి కారణంగా యూఎన్‌సీటీఏడీ వివరించింది.Source: Yahoo! Telugu: News | 12 Jun 2009 | 5:44 pm తోడ్పడని ఐఐపీ అంకెలు: నష్టాలతో ముగిసిన సెన్సెక్స్ఆశాజనకమైన పారిశ్రామిక ఉత్పత్తి ఇండెక్స్ (ఐఐపీ) అంకెలు స్టాక్ మార్కెట్‌కు మద్దతు ఇవ్వడంలో విఫలయ్యాయయి. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 174 పాయింట్లు నష్టంతో 15,238 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 54 పాయింట్లు క్షీణించి 4,583 వద్ద ముగిసింది.Source: Yahoo! Telugu: News | 12 Jun 2009 | 5:03 pm విమాన ప్రయాణఛార్జీలు తగ్గించనున్న ఏఐదేశంలో ప్రధాన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (ఏఐ).. ఎంపిక చేసుకున్న మార్గాల్లో ప్రయాణ ఛార్జీలను తగ్గించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ ధరలు 25 శాతం మేరకు తగ్గించాలని ఏఐ యోచిస్తోంది. కానీ, ఏఐ పోటీ సంస్థలైన జెట్ ఎయిర్‌వేస్ మరియు చౌకధరల విమానయాన సంస్థ స్పైస్ జెట్‌లు ఇప్పటికే ప్రయాణ ఛార్జీలను తగ్గించిన సంగతి విదతమే.Source: Yahoo! Telugu: News | 12 Jun 2009 | 4:37 pm పాకిస్థాన్‌లో జంట పేలుళ్ళు : ఏడుగురి మృతిపాకిస్థాన్లోని రెండు ప్రాంతాలలో జుమా నమాజు తర్వాత వరుసగా రెండు పేలుళ్ళు జరిగాయి. తొలుత లాహోర్‌లో ఓ ఆత్మాహుతి దాడి జరుగగా మరో దాడి నౌషేరాలో జరిగింది. ఇక్కడ కారుబాంబు దాడి జరిగిందని ఈ దాడుల్లో మొత్తం 7 గురు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 12 Jun 2009 | 4:31 pm బ్రాడ్‌పిట్‌తో ఆనిస్టన్ సరస సల్లాపాలు!తన మాజీ భర్త బ్రాడ్‌పిట్‌తో హాలీవుడ్ సినీతార జెన్నీఫర్ ఆనిస్టన్ రహస్యంగా సరస సల్లాపాలు సాగిస్తుందని కాంటాక్ట్ మ్యూజిక్ మేగజైన్ తెలిపింది. హాలీవుడ్ అందాల రాశి ఏంజెలీనా జోలీ బ్రాడ్‌పిట్‌ను పెళ్లాడుతానని ఇటీవలే ప్రకటించిన నేపథ్యంలో.. బ్రాడ్‌పిట్‌తో ఆనిస్టన్ సన్నిహితంగా ఉందని సినీ వర్గాల సమాచారం. ఇటీవల న్యూయార్క్‌లోని సిటీ గ్రామెర్సీ పార్క్ హోటల్‌లో బ్రాడ్‌పిట్-ఆనిస్టన్‌లు ఒక రాత్రంతా గడిపారని స్టార్ పత్రిక తన ప్రచురణలో తెలిపింది.Source: Yahoo! Telugu: Entertainment | 12 Jun 2009 | 4:29 pm ఉరిశిక్ష అమలు సాధ్యం కాదు: మంత్రి మొయిలీదోషులు పెట్టుకున్న క్షమాభిక్ష పిటీషన్లపై తుది నిర్ణయం తీసుకునేంత వరకు ఉరిశిక్షల అమలు సాధ్యం కాదని కేంద్ర న్యాయ శాఖామంత్రి వీరప్ప మొయిలీ తేల్చి చెప్పారు. ఇలాంటి దోషుల్లో అఫ్జల్ గురు లేదా మరొకరు ఉన్నా ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు.Source: Yahoo! Telugu: News | 12 Jun 2009 | 4:21 pm నా డ్రీమ్‌బాయ్ ఇంకా కంటపడలేదు..!: శ్రియ"ఇష్టం" సినిమా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్న సెక్సీడాళ్ శ్రియ. టాలీవుడ్, కోలీవుడ్‌లలో తన హవాను కొనసాగిస్తున్న శ్రియ, తాజాగా ఆరడుగుల అందగాడు విశాల్‌తో "పిస్తా" అనే సినిమాలో నటించింది. ద్విభాషా చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమౌతోంది. ఈ నేపథ్యంలో బిజీ బిజీగా ఉన్న శ్రియను కదిలిస్తే.. కొన్ని విషయాలను చెప్పుకొచ్చింది. పెళ్లెప్పుడు తల్లీ.. అని శ్రియను అడిగితే..? ఇంకేముంది..? "నా డ్రీమ్ బాయ్ ఇంక కంటపడలేదని" అంటోంది. అంతేకాదు.. తనకు కాబోయే భర్తకు కొన్ని క్వాలిటీస్ ఉండాలని వెల్లడించింది. అవి ఏమిటంటే..? జీవితంలో తన ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వాలట. దీంతో పాటు బాగా చదువుకున్న వ్యక్తిగా బుద్ధిమంతుడిగా ఉండాలట. అందరిలా కాకుండా తన డ్రీమ్‌బాయ్‌కి విశేషమైన క్వాలిటీస్ ఉండాలని శ్రియ వరుసగా చెప్పుకొచ్చింది.Source: Yahoo! Telugu: Entertainment | 12 Jun 2009 | 4:11 pm "రామ రామ కృష్ణ కృష్ణ" అంటోన్న రామ్!మస్కా, దేవదాసు, రెడీ చిత్రాల ద్వారా మాస్ హీరోగా ముద్రవేసుకున్న రామ్ తాజాగా "రామ రామ కృష్ణ కృష్ణ" అనే చిత్రం ద్వారా తెరపైకి రానున్నాడు. ప్రస్తుతం శ్రావంతి రవి కిషోర్ నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకుంటోన్న కొత్త చిత్రం షూటింగ్‌లో రామ్ బిజీబిజీగా ఉన్నాడు.మరోవైపు.. టాలీవుడ్ గోల్డెన్ హ్యాండ్ దిల్‌రాజు నిర్మాణ బాధ్యతలు చేపట్టే కొత్త చిత్రంలోనూ రామ్ నటించనున్నాడు. వైవిధ్యమైన కథాంశంతో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి "రామ రామ కృష్ణ కృష్ణ" అనే టైటిల్‌ను ఖరారు చేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 12 Jun 2009 | 3:11 pm డిఫరెంట్ రోల్ అయితే ఓకే..! లేదా గో.. గో..!"బొమ్మరిల్లు", చిత్రం ద్వారా హాసినిగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అందాల ముద్దుగుమ్మ జెనీలియా. అమాయకపు మోముతో చిలిపి అమ్మాయిగా అందరినీ ఆకర్షించిన ఈ భామ, ఈ మధ్య వైవిధ్య పాత్రలను పోషించాలని నిర్ణయించినట్లు సమాచారం. బాలీవుడ్ సినిమాలు చేస్తూనే టాలీవుడ్ చిత్రాలకు ముఖ్యత్వం ఇస్తోన్న ఈ శశిరేఖ, ఇకపై ఆడియన్స్ ఆదరణ కోసం సీరియస్ పాత్రలు పోషించేందుకైనా సిద్ధంగా ఉందని ఫిలిమ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో జెన్నీ కాల్షీట్ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారట. అంతేకాదు.. రోజువారిగా మంచి కథ చెబుతామని జెన్నీ వద్దకు వచ్చి వెళ్లే రచయితలు ఎక్కువవుతున్నారని తెలిసింది. అయితే జెన్నీ మాత్రం డిఫరెంట్ రోల్ అయితే ఓకే.. లేదంటే గో.. గో.. అంటూ చెప్పేస్తుందట..!Source: Yahoo! Telugu: Entertainment | 12 Jun 2009 | 2:20 pm 26న వస్తోన్న "టర్మినేటర్ సాల్వేషన్"సోనీ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా సమర్పిస్తోన్న తాజా చిత్రం "టర్మినేటర్ సాల్వేషన్" చిత్రం ఈ నెల 26వ తేదీన దేశవ్యాప్తంగా విడుదల కానుంది. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు వంటి భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో రూపుదిద్దుకుంది. ఇందులో క్రిస్టియన్ బేల్, జాన్ కొన్నర్‌లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇంకా యంగ్ హీరో జాన్ కొన్నర్ తండ్రి కైలీ రీస్ కూడా ఇందులో నటిస్తున్నారు. ఆంటన్ ఎల్చిన్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్న కైలీ రీస్, టి-800 మోడల్ 101 టర్మినేటర్ రూపకల్పనతో పాటు పలు ఆశ్చర్యకరమైన అంశాలతో రూపొందుతోన్న ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తారు.Source: Yahoo! Telugu: Entertainment | 12 Jun 2009 | 1:43 pm ఇండియన్ టీమ్ నా ఫేవరేట్: నమ్రతా శిరోద్కర్క్రికెట్ అంటే తనకు చాలా ఇష్టమని టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ అన్నారు. ఫేవరేట్ క్రికెటర్ అంటూ ప్రత్యేకించి ఎవ్వరూ లేరని ఆమె చెప్పారు. క్రికెట్ అంటేనే సమిష్టిగా ఆడేదని, అందుకే టీం ఇండియా మొత్తం తన ఫేవరేట్ అని నమ్రతా వెల్లడించారు.Source: వినోదం | 12 Jun 2009 | 1:18 pm హ్యాపీ బర్త్ డే గోపిచంద్.."తొలివలపు" చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచమైన మాస్ హీరో గోపిచంద్. ఈ సినిమా ఆయనకు అంతగా గుర్తింపు సంపాదించి పెట్టలేదు. అయితే నిజం (2003), వర్షం (2004), జయం (2003) వంటి సినిమాల్లో నెగటివ్ రోల్ పోషించిన గోపిచంద్‌కు మంచి క్రేజ్ లభించింది. త్రికోణ ప్రేమకథా నేపథ్యంలో విడుదలైన బ్లాక్‌బస్టర్ మూవీ జయంలో గోపిచంద్ అద్భుతమైన నటనతో టాలీవుడ్‌లో నిలదొక్కుకున్నాడు. ఇదే క్రేజ్‌తో విలన్ పాత్రల నుంచి హీరో స్థాయికి ఎదిగిన గోపిచంద్ సినీ కెరీర్‌ను యజ్ఞం చిత్రం మలుపు తిప్పింది. ఆ తర్వాత నెగటివ్ రోల్స్‌కు మెల్లమెల్లగా స్వస్తి చెప్పి యజ్ఞం (2004), రణం (2006) వంటి చిత్రాల్లో హీరో స్థాయికి ఎదిగాడు. పుట్టిన తేదీ.. 12, జూన్, 1982,జన్మస్థలం.. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్.నటించిన చిత్రాలు.. 15కి పైగా.Source: Yahoo! Telugu: Entertainment | 12 Jun 2009 | 1:04 pm స్వైన్ ఫ్లూ భయం వద్దు: ఆరోగ్య మంత్రి ఆజాద్ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న స్వైన్ ఫ్లూ వ్యాధి గురించి దశ ప్రజలు ఆందోళన చెందవద్దని కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి గులాం నబీ ఆజాద్ సూచించారు. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలను ఇప్పటికే చేపట్టిందని ఆయన గుర్తు చేశారు.Source: జాతీయ | 12 Jun 2009 | 12:46 pm ఉరిశిక్ష అమలు సాధ్యం కాదు: మంత్రి మొయిలీదోషులు పెట్టుకున్న క్షమాభిక్ష పిటీషన్లపై తుది నిర్ణయం తీసుకునేంత వరకు ఉరిశిక్షల అమలు సాధ్యం కాదని కేంద్ర న్యాయ శాఖామంత్రి వీరప్ప మొయిలీ తేల్చి చెప్పారు. ఇలాంటి దోషుల్లో అఫ్జల్ గురు లేదా మరొకరు ఉన్నా ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు.Source: జాతీయ | 12 Jun 2009 | 10:54 am గ్రేటర్ ఎన్నికల్లోనూ ఒంటరిపోరే: డీఎస్రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేయనుందని పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ స్పష్టం చేశారు. గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే విషయమై ఆలోచించడం లేదని ఆయన పేర్కొన్నారు.Source: ఏపీ న్యూస్ | 12 Jun 2009 | 10:47 am ర్యాగింగ్‌పై కఠిన చర్యలు తీసుకోండి: వైఎస్ప్రతి కళాశాలలో ర్యాగింగ్‌ను నిరోధించే దిశగా కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వివిధ యూనివర్శిటీల వీసీలను కోరారు. కళాశాలల్లో ర్యాంగింగ్‌ను అడ్డుకునే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలంటూ ఆయన సూచించారు.Source: ఏపీ న్యూస్ | 12 Jun 2009 | 10:07 am హైదరాబాద్‌ను వీడని స్వైన్‌ఫ్లూ: కొత్తకేసు నమోదుస్వైన్ఫ్లూ హైదరాబాద్‌ను విడిచిపెట్టే సూచనలు కన్పించడం లేదు. ఈ కోవలో శుక్రవారం మరో కొత్త స్వైన్‌ఫ్లూ కేసు నమోదైంది. దీంతో హైదరాబాద్ నగరం స్వైన్‌ఫ్లూ భయంతో వణుకుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగా నమోదైన స్వైన్‌ఫ్లూ కేసు ఆరేళ్ల పాపది కావడం గమనార్హం.Source: ఏపీ న్యూస్ | 12 Jun 2009 | 10:05 am భద్రతా బలగాల ప్రత్యేకాధికారాలపై దృష్టి: పీసీక్లిష్ట పరిస్థితులు ఉత్పన్నమైనపుడు భద్రతా బలగాలకు ప్రత్యేక అధికారాలు ఇచ్చే చట్టంపై ప్రత్యేక దృష్టి పెడతామని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం తెలిపారు. ఇందుకోసం అవసరమైన చర్యలను కేంద్రం తీసుకుంటుందని చెప్పారు.Source: జాతీయ | 12 Jun 2009 | 10:05 am కళా సంపద ఉట్టిపడే "నల్‌దుర్గ్"కళా సంపద, వాస్తు నైపుణ్యంతో అలరారే పురాతన చరిత్ర కలిగిన కట్టడాలు మన దేశంలో అనేకం ఉన్నాయి. అలాంటి వాటిలో మహారాష్ట్రలో విలసిల్లుతున్న "నల్‌దుర్గ్" కోట ఒకటి. మన పురాణాల్లోని నలుడు, దమయంతి నివసించినదిగా చెప్పబడుతున్న ఈ కోట పేరుతోనే అక్కడో గ్రామం...Source: వినోదం | 12 Jun 2009 | 9:49 am సమాచారం లేని అణు శాస్త్రవేత్త ఆచూకీ!బెంగుళూరులో అదృశ్యమైన అణు శాస్త్రవేత్త ఆచూకీని ఆ రాష్ట్ర పోలీసులు ఇప్పటి వరకు కనుగొనలేక పోయారు. దీంతో శాస్త్రవేత్త కుటుంబంతో సహా, కైగా ఆటామిక్ ప్లాంట్ సైంటిస్టులు ఆందోళన చెందుతున్నారు. శాస్త్రవేత్త ఆచూకీ కోసం తాము చేపట్టిన ఆపరేషన్‌లో ఎలాంటి ఆధారం లేదా, పురోగతి లభించలేదని శుక్రవారం పోలీసులు వెల్లడించారు.Source: జాతీయ | 12 Jun 2009 | 8:30 am జూనియర్ డాక్టర్ల సమ్మె తీవ్రరూపంతమపై జరిగిన దాడికి నిరసనగా సమ్మె ప్రారంభించిన గాంధీ ఆస్పత్రి జూనియర్ డాక్టర్లు శుక్రవారం తమ సమ్మెను ఉధృతం చేశారు. అదేసమయంలో జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఈ సమ్మెకు ప్రభుత్వ వైద్యులు తమ మద్దతు ప్రకటించారు.Source: ఏపీ న్యూస్ | 12 Jun 2009 | 8:21 am చార్మినార్ ఘటన: విషమించిన సమీర ఆరోగ్యంచార్మినార్పైనుంచి తన ప్రియుడు తోసివేయడంతో తీవ్రంగా గాయపడ్డ సమీరాబేగం పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు పేర్కొన్నారు. బాగా ఎత్తునుంచి కిందపడిన కారణంగానే ఈ పరిస్థితి తలెత్తినట్టు వారు తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 12 Jun 2009 | 8:06 am మహిళా రిజర్వేషన్ బిల్లు: భాజపాలో విభేదాలు!మహిళా రిజర్వేషన్ బిల్లుపై భారతీయ జనతా పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుల మధ్య విభేదాలు పొడచూపుతున్నాయి. బిల్లుకు అనుకూలంగా మద్దతు తెలపాలని భాజపా అధిష్టానం కోరడాన్ని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వినయ్ కతియార్ తప్పుబట్టారు.Source: జాతీయ | 12 Jun 2009 | 6:07 am ఏమీ లేదనే కదా...?"నాలో ఏం చూసి ప్రేమించావ్...?" అడిగింది సుందరి "నీలో ఏమీ లేదనే ప్రేమిస్తున్నాను... ఏదైనా ఉంటే ఈపాటికే...Source: వినోదం | 12 Jun 2009 | 5:11 am కోపాన్ని చీరమీద చూయించారులే..!"మొన్న కొన్న చీరే కదా... అప్పుడే రంగు వెలిసిపోయిందేమిటి...?" అడిగింది గిరిజ "అవును..Source: వినోదం | 12 Jun 2009 | 5:09 am జలయజ్ఞానికి 15వేల కోట్లు కేటాయించండిరాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞం ప్రాజెక్టుల నిర్మాణానికి రూ. 15వేల కోట్లు కేటాయించాల్సిందిగా ఆర్ధికమంత్రి రోశయ్య కేంద్రాన్ని కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ఏర్పాటు చేసిన బడ్జెట్ ముందు సంప్రదింపుల సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి రోశయ్య ఈ అంశాన్ని ప్రతిపాదించారు.Source: ఏపీ న్యూస్ | 12 Jun 2009 | 4:42 am కాశ్మీర్ రక్షణ ఇకపై పోలీసులదే: హోంమంత్రినిరంతరం దాడులు, తీవ్రవాద చర్యలతో అట్టుడికే జమ్మూ కాశ్మీర్ భద్రతను ఇకనుంచి ఆ రాష్ట్ర పోలీసులే నిర్వహించనున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి పి. చిదంబరం తెలిపారు. జమ్మూ కాశ్మీర్ భద్రత విషయంలో మొదట ఆ రాష్ట్ర పోలీసుల ప్రాధాన్యం తర్వాతే పారా మిలటరీ బలగాల పాత్ర ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.Source: జాతీయ | 12 Jun 2009 | 3:08 am రాహుల్‌వల్లే యూపీలో పార్టీ విజయం: సోనియాతాజాగా ముగిసిన ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లో పార్టీ ఘనవిజయం సాధించడానికి యువనేత రాహుల్‌గాంధీ తీసుకున్న చర్యలే కారణమని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రశంసించారు. రాహుల్ చొరవతోనే చాలాకాలం తర్వాత ఉత్తర ప్రదేశ్‌లో పార్టీకి చెప్పుకోదగ్గ స్థానాలు లభించాయని ఆమె పేర్కొన్నారు.Source: జాతీయ | 12 Jun 2009 | 3:08 am ఆర్మీ సర్వీస్ కేంద్రాన్ని తరలించవద్దు: నితీష్బీహార్ రాష్ట్రంలో ఉన్న ఆర్మీ సర్వీసెస్ కేంద్రాన్ని వేరే ప్రాంతానికి తరలించవద్దని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర రక్షణ మంత్రి ఏకే.ఆంటోనీకి గురువారం లేఖ రాశారు. కాగా, ఈ కేంద్రాన్ని బెంగుళూరుకు తరలించాలని రక్షణ శాఖ నిర్ణయించింది.Source: జాతీయ | 11 Jun 2009 | 2:33 pm సరికొత్తగా ఆలోచించండి: మన్మోహన్ సింగ్ప్రజలు ఉపయోగపడేలా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సరికొత్తగా ఆలోచించాలని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తన కార్యాలయ అధికారులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం తొలి వంద రోజుల్లో చేయవలసిన పనులపై ఎజెండా రూపకల్పనకు అధికారులతో సమావేశమైన మన్మోహన్ సింగ్ ఈ మేరకు వారికి సూచించారు.Source: జాతీయ | 11 Jun 2009 | 1:05 pm
|