సరికొత్తగా ఆలోచించండి: మన్మోహన్ సింగ్

ప్రజలు ఉపయోగపడేలా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సరికొత్తగా ఆలోచించాలని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తన కార్యాలయ అధికారులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం తొలి వంద రోజుల్లో చేయవలసిన పనులపై ఎజెండా రూపకల్పనకు అధికారులతో సమావేశమైన మన్మోహన్‌ సింగ్‌ ఈ మేరకు వారికి సూచించారు.
Source: Yahoo! Telugu: News | 11 Jun 2009 | 6:34 pm

రూ. 50 కోట్ల వ్యాపార లక్ష్యంగా హార్లిక్స్ బిస్కెట్లు

"హార్లిక్స్ తాగను-తింటాను" అనే నానుడితో ప్రసిద్ధి చెందిన హార్లిక్స్ పౌష్టికాహారం, బిస్కెట్ల రంగంలోకూడా తనకంటూ ఓ ముద్రను వేసుకుంది. రానున్న మూడు సంవత్సరాలలో ఈ బిస్కెట్ల అమ్మకాలను రూ. 50 కోట్లకు పెంచుకోవాలని గ్లాక్సో స్మిత్‌క్లైన్ కంపెనీ భావిస్తోంది
Source: Yahoo! Telugu: News | 11 Jun 2009 | 6:30 pm

వైఎస్సార్‌చే "నితిన్" కొత్త చిత్రం ప్రారంభం

యువ కథానాయకుడు నితిన్‌హీరోగా, హన్సిక హీరోయిన్‌గా నటిస్తోన్న తాజా చిత్రం గురువారం సి.ఎం. క్యాంప్‌ కార్యాలయంలో ప్రారంభమైంది. నితిన్‌పై తీసిన తొలిషాట్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి క్లాప్‌ కొట్టగా, గిరిజన సంక్షేమశాఖా మంత్రి బాలరాజు కెమేరా స్విచ్చాన్‌ చేశారు. గీతారెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 11 Jun 2009 | 6:23 pm

సచిన్ అంటే చాలా ఇష్టం: మహేష్ బాబు

టాలీవుడ్ మాస్ హీరోగా ముద్రవేసుకున్న ప్రిన్స్‌ మహేష్‌బాబు ఈ మధ్య సినిమాలను పక్కనపెట్టి యాడ్‌ ఫిలింస్‌లో ఎక్కువ నటిస్తున్నారు. నవరతన్‌ తైలం, థమ్స్‌ అప్‌ యాడ్స్‌ చేయడం గౌరవంగా భావిస్తున్నట్లు మహేష్ బాబు పేర్కొన్నారు. త్వరలో మహేష్‌బాబు మరో థమ్స్‌ అప్‌ యాడ్‌లో నటించనున్నారు. గురువారంనాడు హైదరాబాద్‌లో జరిగిన ప్రమోషన్‌లో ప్రిన్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన సినీ ప్రణాళికలు వెల్లడించారు.ప్రశ్న.. మీ సోదరితో నటించే అవకాశముందా?జ.. ఆమెతో నటించే ఆలోచనలేదు. ప్రశ్న.. కావ్యాస్‌డైరీ చూశారా?జ.. ఆ సినిమా చూశాను. మొదటి భాగం పెద్దగా ఆకట్టుకోలేదు. రెండోభాగం నన్ను బాగా ఇంప్రస్‌ చేసింది.ప్రశ్న.. 'అతిథి' తర్వాత విరామం ఎక్కువగా తీసుకోవడానికి కారణం?జ.. ప్రధానమైంది స్క్రిప్ట్‌. కథ సరిగ్గా కుదరలేదు.ప్రశ్న.. క్రికెట్‌ అంటే ఇష్టంకదా? అంతర్జాతీయ మ్యాచ్‌లకు వెళుతుంటారా?జ.. క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. ఖాళీ దొరికితే ఇంటిదగ్గరే ఆడుతుంటాను. నాకు టెండూల్కర్‌ చాలా ఇష్టం. అంతర్జాతీయ టోర్నీలకు వెళ్ళాలనుకున్నా కొన్నిసార్లు సాధ్యపడేదికాదు.
Source: Yahoo! Telugu: Entertainment | 11 Jun 2009 | 6:10 pm

అసలు తెలంగాణ ఇచ్చేదుందా... లేదా ?

కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడడం మాని అసలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తుందా, లేదా తేల్చి చెప్పాలంటూ టీఆర్‌ఎస్ అసమ్మతి నేత రవీంద్ర నాయక్ ప్రశ్నించారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇకనైనా తన నిర్ణయాన్ని స్పష్టం చేయాలని ఆయన కోరారు.
Source: Yahoo! Telugu: News | 11 Jun 2009 | 6:06 pm

అతడే పైనుంచి నన్ను కిందికి తోసేశాడు

హైదరాబాద్‌లోని ప్రముఖ కట్టడమైన చార్మినార్ మీదినుంచి గురువారం ఓ యువతి కిందికి దూకడంతో ఆమె తలకు తీవ్రగాయాలయ్యాయి. అయితే చార్మినార్ మీదినుంచి తాను స్వయంగా దూకలేదని తన ప్రియుడే తనను కిందికి తోసేశాడని ఆ యువతి తన వాంగ్మూలంలో పేర్కొంది.
Source: Yahoo! Telugu: News | 11 Jun 2009 | 5:53 pm

మాంద్యం భారత్, చైనాలకు లాభం

ఆసియాలోనే అతి పెద్ద వ్యాపార రంగాలకు చెందిన భారత్, చైనా దేశాలు రత్నాలు, నగలు, మీడియా, మనోరంజకమైన కార్యక్రమాలను ఇరు దేశాలు పంచుకుని వ్యాపారం చేసుకుంటే ఈ రెండు దేశాలుకూడా ఆర్థికమాంద్యంలోకూడా లాభాలను పొందగలరని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Source: Yahoo! Telugu: News | 11 Jun 2009 | 5:36 pm

అమ్మకాల ఒత్తిడి: నష్టాలతో ముగిసిన సెన్సెక్స్

దేశీయ కంపెనీలకు చెందిన బ్యాకింగ్ వాటాలు అమ్మకాల వైపు మొగ్గుచూపడంతో బాంబే స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. యూరోపియా, ఆసియా మార్కెట్ల ట్రేడింగ్ పుంజుకోకపోవడంతో గురువారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల బాటలో పయనించింది. మంగళ, బుధవారాల్లో కదం తొక్కిన స్టాక్ మార్కెట్ ర్యాలీ గురువారం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 55 పాయింట్లు క్షీణించి, 15411 పాయింట్ల మార్కు వద్ద ముగిసింది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ 17 పాయింట్లు పతనమై, 4637 పాయింట్ల మార్కు వద్ద నిలిచింది.
Source: Yahoo! Telugu: News | 11 Jun 2009 | 5:33 pm

మతవాద పార్టీలకు చెంపపెట్టులాంటిది: సోనియా

కుల, మతాలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్న పార్టీలకు ముగిసిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు చెంపపెట్టులాంటివని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అభిప్రాయపడ్డారు. ఆమె ఒక రోజు పర్యటన నిమిత్తం గురువారం తన సొంత నియోజకవర్గమైన రాయ్‌బరేలిలో పర్యటించగా, ఆమెకు ప్రజలు నీరాజనాలు పలికారు.
Source: Yahoo! Telugu: News | 11 Jun 2009 | 5:18 pm

కిమ్ శర్మ సరిగంగ స్నానాలు

సోయగాలు పోతూ పారే జలపాతంలో ఒక్కసారైనా జలకాలాటలాడాలని అనుకోని వారుండరు. ఇదలా ఉంచితే బాలీవుడ్ అందాలు పూబోణి కిమ్ శర్మ జలపాతాలు, సముద్రాలు, నదులు, బాత్‌టబ్‌లు ఇలా అన్నింటిలోనూ స్నానాలు చేసిన అనుభవం తనకు ఉన్నదని చెపుతోంది. ఆ అనుభవం ఎలా ఉందేంటీ... అని అడిగితే ఇలా చెప్పుకొచ్చింది. జలపాత స్నానం: కొన్నాళ్ల క్రితం అదిరేపల్లి జలపాతానికి వెళ్లా. నేను అక్కడికి వెళ్లినప్పుడు జలపాతంలో అంతగా నీరు లేదు. అంతే ఒక్కసారిగా నాలో ఆనందం కట్టలు తెంచుకుంది. అందులోకి దుమికి నా ఇష్టం వచ్చినంత సేపు ఈత కొట్టాను. అప్పుడు ఎంత అలుపు వచ్చిందో.
Source: Yahoo! Telugu: Entertainment | 11 Jun 2009 | 5:11 pm

తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే కమిటీలో చేరండి

తెలంగాణ విషయంలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రోశయ్య కమిటీలో చేరాలంటూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అసలు తెలంగాణవాదం దెబ్బతిందంటే కారణం టీఆర్ఎస్సేనని అందుకే ఇకనైనా కేసీఆర్ వాస్తవాలెరిగి ప్రవర్తించాలని డీఎస్ అభిప్రాయపడ్డారు.
Source: Yahoo! Telugu: News | 11 Jun 2009 | 4:50 pm

మహిళా బిల్లులో మార్పులు చేయం: మంత్రి బన్సల్

ప్రస్తుత మహిళా రిజర్వేషన్ బిల్లులో ఎలాంటి మార్పులు ఉండబోవని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి పవన్ కుమార్ బన్సల్ స్పష్టం చేశారు. ఈ కమిటీపై తుది నివేదిక సమర్పించేందుకు 31 మంది ఎంపీలతో ఒక స్థాయీ సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 11 Jun 2009 | 4:47 pm

పుంజుకోని విదేశీ మార్కెట్ల ట్రేడింగ్: నష్టాల్లోనే సెన్సెక్స్

విదేశీ మార్కెట్ల ట్రేడింగ్ పుంజుకోకపోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల బాటలో పయనిస్తోంది. దీంతో గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 52 పాయింట్ల మేర పతనమై, 15414 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 11 పాయింట్ల స్వల్ప నష్టంతో, 4643 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 11 Jun 2009 | 3:45 pm

వ్యాపారవేత్తలతో హిల్టన్ డాన్సా..? నో ఛాన్స్..!

సామాజిక సేవకురాలు, హాలీవుడ్ సెక్సీతార ప్యారిస్ హిల్టన్ లాస్ వేగస్ పార్టీలో ఓ వ్యాపారవేత్తలతో చిందులేసిందని ఇటీవల ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు గుప్పుమన్నాయి. బాగా డబ్బున్న బిజినెస్‌‍మేన్‌‌లను ఎంచుకుని వారితో హిల్టన్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుందని హాలీవుడ్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. పై వార్తలపై హిల్టన్ ప్రతినిధి స్పందిస్తూ.. వ్యాపారవేత్తలనే ఎలాంటి వ్యక్తితోనూ హిల్టన్ డ్యాన్స్ చేయలేదని స్పష్టం చేశారు. ఇవన్నీ వదంతులేనని, ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 11 Jun 2009 | 1:37 pm

సరికొత్తగా ఆలోచించండి: మన్మోహన్ సింగ్

ప్రజలు ఉపయోగపడేలా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సరికొత్తగా ఆలోచించాలని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తన కార్యాలయ అధికారులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం తొలి వంద రోజుల్లో చేయవలసిన పనులపై ఎజెండా రూపకల్పనకు అధికారులతో సమావేశమైన మన్మోహన్‌ సింగ్‌ ఈ మేరకు వారికి సూచించారు.
Source: జాతీయ | 11 Jun 2009 | 1:05 pm

ఐఐఎఫ్ఎ అవార్డ్స్ ఫంక్షన్లో అభి-ఐష్!

10వ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఐఎఫ్ఎ) అవార్డ్స్ కార్యక్రమంలో బాలీవుడ్ చిలకా గోరింకలు అభిషేక్ బచ్చన్-ఐశ్వర్యారాయ్ ఓ మెరుపు మెరిశారు. బాలీవుడ్ సినీతారలు అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ మరియు సైఫ్ అలీ ఖాన్‌లలో ఏ ఒక్కరూ ఈ ఏడాది ఐఐఎఫ్ఎ అవార్డ్స్ ఫంక్షన్లో పాల్గొనడం లేదు. అయితే బాలీవుడ్ గ్రాండ్ ఫాదర్ అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్- బచ్చన్ ఇంటి కోడలు ఐశ్వర్యారాయ్‌లు ఈ ఐఐఎఫ్ఎ ప్రదానోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే మెకావ్ చేరుకున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 11 Jun 2009 | 1:03 pm

అసలు తెలంగాణ ఇచ్చేదుందా... లేదా ?

కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడడం మాని అసలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తుందా, లేదా తేల్చి చెప్పాలంటూ టీఆర్‌ఎస్ అసమ్మతి నేత రవీంద్ర నాయక్ ప్రశ్నించారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇకనైనా తన నిర్ణయాన్ని స్పష్టం చేయాలని ఆయన కోరారు.
Source: ఏపీ న్యూస్ | 11 Jun 2009 | 12:37 pm

అతడే పైనుంచి నన్ను కిందికి తోసేశాడు

హైదరాబాద్‌లోని ప్రముఖ కట్టడమైన చార్మినార్ మీదినుంచి గురువారం ఓ యువతి కిందికి దూకడంతో ఆమె తలకు తీవ్రగాయాలయ్యాయి. అయితే చార్మినార్ మీదినుంచి తాను స్వయంగా దూకలేదని తన ప్రియుడే తనను కిందికి తోసేశాడని ఆ యువతి తన వాంగ్మూలంలో పేర్కొంది.
Source: ఏపీ న్యూస్ | 11 Jun 2009 | 12:24 pm

మేము మంచి మిత్రులం మాత్రమే: క్లాడియా

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌, జర్మన్ మోడల్ క్లాడియా సీస్లాల మధ్య ప్రేమాయణం నడుస్తోందని ముంబై వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వదంతులపై క్లాడియా నోరు విప్పింది. తన మొట్టమొదటి అంతర్జాతీయ సినిమా "కర్మ" ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు ముంబైకి వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. సల్మాన్‌తో ప్రేమాయణం వదంతులను కొట్టిపారేసింది. తామిద్దరం కేవలం మంచి మిత్రులం మాత్రమేనని క్లాడియా స్పష్టం చేసింది. బాలీవుడ్ సినిమాల్లో నటించడమంటే, భారతీయ వంటకాలంటే తనకెంతో ఇష్టమని చెప్పింది.
Source: Yahoo! Telugu: Entertainment | 11 Jun 2009 | 12:17 pm

అమ్మో.. నయన పారితోషికం పెంచేసిందట..!

దక్షిణాది సినీరంగంలో అగ్రహీరోయిన్‌గా ముద్రవేసుకున్న మలయాళీ ముద్దుగుమ్మ నయనతార. తాజాగా క్రేజీ హీరో "ఆంజనేయులు" చిత్రంలో నటిస్తోన్న నయన, తన పారితోషికాన్ని భారీగా పెంచేంసిదని టాలీవుడ్ వర్గాల్లో టాక్. కేవలం 35 రోజులకే ఆంజనేయులు చిత్ర నిర్మాత నయనకు 65 లక్షలు చెల్లించాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు వినబడుతున్నాయి. లక్ష్మీ, దుబాయ్ శీను వంటి చిత్రాల ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులను ఆకర్షించిన నయనకు ఈ మధ్య అంతగా ఛాన్సులు రావడం లేదట. దీంతో వచ్చిన అవకాశాల్లోనే బాగా సంపాదించేయాలని నయన ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.
Source: Yahoo! Telugu: Entertainment | 11 Jun 2009 | 11:54 am

మతవాద పార్టీలకు చెంపపెట్టులాంటిది: సోనియా

కుల, మతాలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్న పార్టీలకు ముగిసిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు చెంపపెట్టులాంటివని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అభిప్రాయపడ్డారు. ఆమె ఒక రోజు పర్యటన నిమిత్తం గురువారం తన సొంత నియోజకవర్గమైన రాయ్‌బరేలిలో పర్యటించగా, ఆమెకు ప్రజలు నీరాజనాలు పలికారు.
Source: జాతీయ | 11 Jun 2009 | 11:49 am

మహిళా బిల్లులో మార్పులు చేయం: మంత్రి బన్సల్

ప్రస్తుత మహిళా రిజర్వేషన్ బిల్లులో ఎలాంటి మార్పులు ఉండబోవని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి పవన్ కుమార్ బన్సల్ స్పష్టం చేశారు. ఈ కమిటీపై తుది నివేదిక సమర్పించేందుకు 31 మంది ఎంపీలతో ఒక స్థాయీ సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.
Source: జాతీయ | 11 Jun 2009 | 11:46 am

జేజెమ్మకు జై అంటోన్న టాలీవుడ్

అరుంధతి చిత్రంలో రాజకుమారిగా నటించి తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన అనుష్క, ఆ తర్వాత బిల్లాలో పూర్తి సెక్సీ క్వీన్‌గా కనబడింది. ఆ చిత్రంలో బొద్దందాల నమితను డామినేట్ చేయడానికి ఫిట్ డ్రెస్‌లను ధరించి స్విమ్మింగ్‌పూల్ వద్ద ఏకంగా బట్టలిప్పేస్తున్నట్లు నటించి కుర్రకారు గుండెల్లో వేడిని రాజేసింది. ఈ రెండు చిత్రాల్లో విభిన్న పాత్రలను పోషించిన అనుష్క ఏ పాత్రలోనైనా రాణించగలనని నిరూపించింది. ప్రస్తుతం చేతినిండా అవకాశాలతో ఉక్కిరిబిక్కిరైపోతోంది. మరోవైపు ఇలియానా, ఛార్మి వంటి తారలు ఎలాగైనా జేజెమ్మను క్రాస్ చేయాలని ఆరాటపడుతున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 11 Jun 2009 | 11:24 am

తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే కమిటీలో చేరండి

తెలంగాణ విషయంలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రోశయ్య కమిటీలో చేరాలంటూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అసలు తెలంగాణవాదం దెబ్బతిందంటే కారణం టీఆర్ఎస్సేనని అందుకే ఇకనైనా కేసీఆర్ వాస్తవాలెరిగి ప్రవర్తించాలని డీఎస్ అభిప్రాయపడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 11 Jun 2009 | 11:20 am

సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టండి: వైఎస్

కేబినేట్‌లోని మంత్రులందరూ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కోరారు. విపక్షాల విమర్శలను, వదంతులను ఎవరూ పట్టించుకోవద్దని ఈ సందర్భంగా ఆయన కేబినేట్‌ మంత్రులకు సూచించారు.
Source: ఏపీ న్యూస్ | 11 Jun 2009 | 10:08 am

పినరాయి విజయన్‌పై సీబీఐ చార్జిషీటు

ఎన్.ఎస్.సి. లవలిన్ కుంభకోణం కేసులో సీపీఎం పార్టీకి చెందిన కేరళ రాష్ట్ర కార్యదర్శి పినారాయి విజయన్‌పై కేంద్ర నేర పరిశోధక బృందం (సీబీఐ) చార్జిషీటు నమోదు చేసింది. 300 కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించిన ఈ కేసులో విజయన్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్నారు.
Source: జాతీయ | 11 Jun 2009 | 9:52 am

ప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీసింది ఆయనే

తెలంగాణ ప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీసింది టీఆర్ఎస్ అధినేత కేసీఆరేనని ఆరోగ్యశాఖ మంత్రి దానం నాగేందర్ పేర్కొన్నారు. ఇలాంటి తరుణంలో తెలంగాణ ప్రజల ఆత్మస్థైర్యాన్ని వైఎస్ పెంచినందుకు ఈసారి ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారని ఆయన వ్యాఖ్యానించారు.
Source: ఏపీ న్యూస్ | 11 Jun 2009 | 9:29 am

ముఖ్యమంత్రి వైఎస్‌కు రుణపడి ఉంటా

ప్రభుత్వ చీఫ్ విప్‌గా తనను నియమించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి రుణపడి ఉంటానని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అదేసమయంలో చీఫ్ విప్‌గా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని ఆయన తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 11 Jun 2009 | 8:20 am

ప్రభుత్వ ఏర్పాటుకు యూపీఏ సన్నాహాలు

జార్ఖండ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు యూపీఏ మిత్రపక్షాలు సన్నాహాలు ఆరంభించాయి. ప్రస్తుతం అమలులో ఉన్న రాష్ట్రపతి పాలన ఈనెల 18వ తేదీతో ముగియనుంది. దీంతో 13వ తేదీన (శనివారం) యూపీఏ మిత్రపక్షాలు సమావేశం కావాలని నిర్ణయించాయి.
Source: జాతీయ | 11 Jun 2009 | 6:35 am

అమ్మో.. నయన పారితోషికం పెంచేసిందట..!

దక్షిణాది సినీరంగంలో అగ్రహీరోయిన్‌గా ముద్రవేసుకున్న మలయాళీ ముద్దుగుమ్మ నయనతార. తాజాగా క్రేజీ హీరో "ఆంజనేయులు" చిత్రంలో నటిస్తోన్న నయన, తన పారితోషికాన్ని భారీగా పెంచేంసిదని టాలీవుడ్ వర్గాల్లో టాక్. కేవలం 35 రోజులకే ఆంజనేయులు చిత్ర నిర్మాత నయనకు 65...
Source: వినోదం | 11 Jun 2009 | 6:26 am

సమ్మెను ఉధృతం చేస్తాం: జూ. డాక్టర్లు

తమపై దాడికి తెగించినవారిని అరెస్టు చేయడంతోపాటు వారిపై చర్య తీసుకోకుంటే తాము రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తామని గాంధీ ఆసుపత్రి జూనియర్ డాక్టర్లు హెచ్చరించారు. ఆసుపత్రికి వచ్చినవారు తమపై దాడికి తెగించడాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని కాబట్టి దీనిపై ప్రభుత్వం వెంటనే చర్య చేపట్టాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
Source: ఏపీ న్యూస్ | 11 Jun 2009 | 6:16 am

ఎన్.సి.పి. నుంచి ఎంపీ పదమ్‌సిన్హ్‌ సస్పెండ్

హత్య కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీ సీనియర్ నేత, ఎంపీ పదమ్‌సిన్హ్ పాటిల్‌ను కేంద్ర మంత్రి శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్.సి.పి) సస్పెండ్ చేసింది. ఈమేరకు పార్టీ అధిష్టానం గురువారం ఆదేశాలు జారీ చేసింది.
Source: జాతీయ | 11 Jun 2009 | 6:00 am

ఇల్లు మారిన సంగతి తెలిస్తే కదా...!

"ఏరా దొంగ వెధవా, నా ఇంటికే కన్నం వేస్తావా...?" కోపంగా అన్నాడు ఇన్‌స్పెక్టర్ "క్షమించండి సార్...
Source: వినోదం | 11 Jun 2009 | 5:23 am

పండక్కి వచ్చారంతే..!

"ఆచారిగారింట్లోకి ఎవరో అద్దెకొచ్చినట్లున్నారే..?" పరిశీలనగా చూస్తూ అడిగాడు రామయ్య "అదేంకాదులేండీ.. ఆచారి..
Source: వినోదం | 11 Jun 2009 | 5:22 am

వారు మా ప్రయత్నాన్ని అడ్డుకుంటారేమో: సోనియా

చట్టసభల్లో మహిళా రిజర్వేషన్‌ను అమలుచేసే విషయమై పార్లమెంటులో ప్రవేశపెట్టాలనుకుంటున్న బిల్లును కొందరు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.
Source: జాతీయ | 11 Jun 2009 | 5:09 am

కూలిన రవాణా విమాన శకలాలు లభ్యం

ఇటీవల అచూకీ తెలియకుండా పోయిన ఐఏఎఫ్ ఎఎన్-32 రకం రవాణా విమాన శకలాలను గుర్తించారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పశ్చిమ షియాంగ్‌ జిల్లాలోని ఒక గ్రామంలో వీటిని కనుగొన్నట్లు పోలీసులు చెప్పారు.
Source: జాతీయ | 11 Jun 2009 | 5:08 am

హైదరాబాద్ అభివృద్ధి మా పాలన చలవే

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌‍‌లో అభివృద్ధి అంటూ జరిగిందంటే అది తమ హయాంలోనేనని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. హైటెక్‌ సిటీ, క్రీడా స్టేడియాలు, సైబరాబాద్‌ కమిషనరేట్‌‌వంటి వాటిని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని ఆయన గుర్తు చేశారు.
Source: ఏపీ న్యూస్ | 11 Jun 2009 | 5:07 am

ఆ సీన్ చూస్తే "కరెంట్" పుడుతుందట

కరెంట్ చిత్రంలో స్నేహ అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న స్నేహా ఉల్లాల్ ఈ చిత్రంలో బబ్లీ గర్ల్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాని చెపుతోంది. సుశాంత్ సరసన నటించే అవకాశం రావడం చాలా సంతోషం అనీ చెపుతోంది. అన్నట్లు ఈ చిత్రంలో ఉల్లాల్ పలు సన్నివేశాలలో ప్రేక్షకుల్లో కరెంట్ పుట్టించడం ఖాయం అంటున్నారు. ముఖ్యంగా ఆమె నాభీ ప్రాంతంలో సుశాంత్ టాటూలను వేయడం, ఆ టాటూలను వేయించుకునేందుకు ఆమె పై వస్త్రాన్ని పైపైకి ఎత్తడం వంటి సన్నివేశాలు టీనేజ్ కుర్రకారుని గిలిగింతలు పెడుతున్నాయంటున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Jun 2009 | 7:40 pm

మంచు మనోజ్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం

నేను మీకు తెలుసా?, ప్రయాణం ఫేమ్ మంచు మనోజ్‌కుమార్‌ హీరోగా షీనా హీరోయిన్‌గా నటిస్తోన్న కొత్త చిత్రం షూటింగ్ నానక్ రామ్‌గూడాలో బుధవారం ప్రారంభమైంది. ఏటీవీ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని సుంకర రామబ్రహ్మం నిర్మిస్తుండగా, వీరూపోట్ల దర్శకత్వం వహిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Jun 2009 | 6:33 pm

కసబ్ కాల్పులు జరపడాన్ని చూశా: ఓ చిన్నారి

గత సంవత్సరం నవంబరు 26న ముంబయి ఛత్రపతి శివాజీ టెర్మినస్‌లో ఉగ్రవాది అజ్మల్ అమీర్ కసబ్ జరిపిన కాల్పులను తాను కళ్లారా చూశానని పదేళ్ల బాలిక దేవికా రోతవన్ చెప్పింది. ఆ రోజు కసబ్ జరిపిన కాల్పుల్లో దేవిక కాలులోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఫలితంగా ఆమె వికలాంగురాలైంది.
Source: జాతీయ | 10 Jun 2009 | 2:40 pm

అహంతోనే వైఎస్ అలా మాట్లాడుతున్నారు

రెండోసారి కూడా అధికారాన్ని సాధించామన్న అహంతో ముఖ్యమంత్రి వైఎస్ మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. తమ ప్రాణాలు పోయినా తెలంగాణ కోసం సాగిస్తున్న ఉద్యమం ఆగబోదని ఈ సందర్బంగా ఆయన స్పష్టం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 10 Jun 2009 | 2:26 pm

మంత్రి పదవుల కోసం టీఆర్ఎస్ ఏర్పడలేదు

మంత్రి పదవులు ఇవ్వనందకు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఏర్పడిందంటూ ముఖ్యమంత్రి వైఎస్ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నేత హరీష్‌రావు కొట్టిపారేశారు. ఆరోజుల్లో తెలంగాణ జిల్లాల్లో రైతులు పడుతున్న అవస్థలను చూడలేకే టీఆర్ఎస్ ఏర్పడిందని హరీష్‌రావు పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 10 Jun 2009 | 1:30 pm

అంతరిస్తున్న పులులు... రాత్రుల్లో ఎన్‌హెచ్-67పై నిషేధం..!

నీలగిరి జిల్లా, కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో ఉండే "బండిపూర్ పులుల సంరక్షణా కేంద్రం (డీటీఆర్)" అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడుతున్న కారణంగా... ఈరోజు నుంచి ఈ కేంద్రం సమీపంలోని నీలగిరి-మైసూర్‌ల మధ్య ఉన్న జాతీయ రహదారి-67పై రాత్రి 10 గంటల తరువాత...
Source: వినోదం | 10 Jun 2009 | 1:08 pm

అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా పొత్తు: చౌతలా

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్ఎల్‌డి) వంటి పార్టీల మధ్య పొత్తు కొనసాగుతుందని ఐఎన్‌ఎల్‌డి అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతలా తెలిపారు. అధికార కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు తమ పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఆయన చెప్పుకొచ్చారు
Source: జాతీయ | 10 Jun 2009 | 12:43 pm