హౌరా జాతీయ రహదారిలో దెయ్యాల రెస్టారెంట్

హౌరా జాతీయ రహదారిపై నవంబరు తరువాత మీరు వెళుతుంటే అక్కడ మీకు దెయ్యాలు దర్శనమివ్వబోతున్నాయి. అక్కడ కపాలం, సాలెగూడులాంటి డైనింగ్ హాలు చూసి భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అది దెయ్యాల రెస్టారెంట్.
Source: Yahoo! Telugu: News | 10 Jun 2009 | 5:01 pm

పాలకులకు "ప్రతిజ్ఞ" బరువైందా!

రాష్ట్ర పాలకులకు ప్రతిజ్ఞ బరువైంది. ప్రతిజ్ఞే కదా, ప్రచురించక పోతే కొంపలు మునుగుతాయా? అని అనుకున్నారో... ఏమో. ప్రతిజ్ఞకు చరమగీతం పాడేశారు. ఎలాగో తమలో దేశభక్తి లేదని పలు సందర్భాల్లో వారు నిరూపించుకున్న సంఘటనలు కోకొల్లలు.
Source: Yahoo! Telugu: News | 10 Jun 2009 | 4:48 pm

ఇరాక్‌లో బాంబు పేలుడు: 28 మంది మృతి

దక్షిణ ఇరాక్‌లోని రద్దీగా ఉండే మార్కెట్ ప్రదేశంలో బుధవారం సంభవించిన బాంబు పేలుడులో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మంది ఈ కారు బాంబు దాడిలో గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. నసారియాకు పశ్చిమంగా 20 మైళ్ల దూరంలో ఉన్న అల్- బాథాలో జరిగిన కారు బాంబు దాడిలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని నసారియా ప్రాంతీయ మండలి అధికారి అక్రమ్ అల్ తమీమీ వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 10 Jun 2009 | 4:31 pm

సత్యం నిధుల కోసం టెక్ మహీంద్రా ఒప్పందాలు

ఖాతాల కుంభకోణంతో సంక్షోభంలో చిక్కుకున్న సత్యం కంప్యూటర్ సర్వీసెస్ కోసం నిధులు సేకరించేందుకు టాటా క్యాపిటల్, ఐడీఎఫ్‌సీతో ఆ కంపెనీ కొత్త యజమాని టెక్ మహీంద్రా ఒప్పందాలు కుదుర్చుకుంది. వీటి ద్వారా రూ.550 కోట్ల నిధులు సేకరించింది.
Source: Yahoo! Telugu: News | 10 Jun 2009 | 4:17 pm

జీఎస్ఎం సేవలు ప్రారంభించిన టాటా టెలీ

దేశంలో రెండో అతిపెద్ద సీడీఎంఏ టెలికాం ఆపరేటర్ టాటా టెలీసర్వీసెస్ జీఎస్ఎం సేవలు కూడా ప్రారంభించింది. జపాన్‌కు చెందిన టెలికాం సేవల సంస్థ ఎన్టీటీ డొకోమోతో కలిసి దేశంలో జీఎస్ఎం సేవలు ప్రారంభిస్తున్నట్లు టాటా టెలీసర్వీసెస్ బుధవారం వెల్లడించింది.
Source: Yahoo! Telugu: News | 10 Jun 2009 | 4:06 pm

వడ్డీ రేట్లు తగ్గించండి: ప్రణబ్ సూచన

ఆర్థిక ప్రదర్శనను మెరుగుపరిచేందుకు వడ్డీ రేట్లు తగ్గించాలని ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ బుధవారం బ్యాంకులకు సూచించారు. పరిశ్రమలకు తక్కువ వడ్డీ రేట్లతో రుణాలు మంజూరూ చేసే దిశగా ప్రయత్నాలు చేపట్టాలని కోరారు. ఆర్థిక మధ్యవర్తులగా వ్యవహరిస్తున్న బ్యాంకులు సమంజసమైన వడ్డీ రేట్లతో రుణాలు అందించాలన్నారు.
Source: Yahoo! Telugu: News | 10 Jun 2009 | 3:48 pm

భారీ లాభాల దిశగా సెన్సెక్స్ పయనం

బాంబే స్టాక్ మార్కెట్ భారీ లాభాల దిశగా పయనిస్తోంది. బుధవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి భారీ లాభాలను నమోదు చేసుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో 326 పాయింట్లు వృద్ధి చెంది, 15453 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతుంది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 100 పాయింట్లు బలపడి, 4651 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 10 Jun 2009 | 3:40 pm

ప్రతిపక్షాలు మమ్మల్నేమీ చేయలేవు

ప్రజలు తమవెంట ఉన్నంతవరకు ప్రతిపక్షాలు తమను ఏమీ చేయలేవని ముఖ్యమంత్రి వైఎస్ పేర్కొన్నారు. ప్రజలు తమను పూర్తిగా విశ్వసించబట్టే మళ్లీ అధికారం కట్టబెట్టారని ఆయన పేర్కొన్నారు.
Source: Yahoo! Telugu: News | 10 Jun 2009 | 3:32 pm

ఏది ఏమైనా మేం ఫాస్ అయ్యాంకదా !

గతంలో తామిచ్చిన వాగ్ధానాలను నెరవేర్చడంతోపాటు చెప్పనివాటినికూడా నెరవేర్చిన కారణంగానే ప్రజలు తమకు మళ్లీ అధికారం అప్పగించారని ముఖ్యమంత్రి వైఎస్ పేర్కొన్నారు. అదేసమయంలో తమను ప్రజలు వెరీగుడ్ అనకున్నా పాస్‌మార్కులు వేశారని వైఎస్ వ్యాఖ్యానించారు.
Source: Yahoo! Telugu: News | 10 Jun 2009 | 3:17 pm

ధర చుక్కలనంటినా.. వన్నె తగ్గని పసిడి..!!

ఓ వైపు బంగారం ధర నానాటికీ ఆకాశాన్నంటుతున్నా, కొనుగోలుదార్లలో పసిడిపై ఉన్న మోజు ఏ మాత్రం తగ్గటం లేదు. ఇంత గరిష్ట ధరలో కూడా బంగారాన్ని కొనుగోలు చేసేందుకు పలువురు ఆసక్తిని ప్రదర్శిస్తుండటమే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. పైగా వారు బంగారాన్ని ఆభరణాల రూపంలోనే కొనేందుకు ఎక్కువగా మక్కువ చూపుతున్నట్లు తాజాగా జరిపిన ఓ సర్వేలో వెల్లడయ్యింది.
Source: Yahoo! Telugu: News | 10 Jun 2009 | 3:13 pm

సల్మాన్- కత్రినాల సెక్స్ వీడియో: నిజమా? అబద్దమా?

బాలీవుడ్ ప్రేమ జంట కత్రినా- సల్మాన్ ఖాన్ ఇద్దరూ కలిసి ఉన్న సెక్స్ వీడియో ఒకటి కెనడాలో వెలుగులోకి వచ్చి వేగంగా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోందట. అయితే అది ఫేక్ వీడియో అనే వాదనలు వినిపిస్తున్నాయి. కానీ సెక్స్ వీడియోలో ఉన్నవారిని చూస్తే అచ్చు సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ మాదిరే ఉన్నట్లు చూసినవారు చెపుతున్నారట. ఇరువురూ పూర్తిస్థాయి సెక్స్ కార్యక్రమంలో నిమగ్నమై ఉండటాన్ని వీడియో క్లిప్పింగులలో చూశామని వారు చెపుతున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Jun 2009 | 12:07 pm

యువరత్న బాలయ్య... హ్యాపీ బర్త్‌డే టూయూ

తెలుగు సినీచరిత్రలో విశ్వ విఖ్యాత నటసార్వభౌముడిగా వినుతికెక్కిన నందమూరి తారక రామారావు గురించి తెలియనివారుండరు. అలాంటి మహానటుడి తనయుడిగా, ఆయన నట వారసుడిగా సినీరంగ ప్రవేశం చేసి యువరత్నగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలకృష్ణ సైతం తెలుగువారికి సుపరిచితుడే.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Jun 2009 | 11:55 am

హౌరా జాతీయ రహదారిలో దెయ్యాల రెస్టారెంట్

హౌరా జాతీయ రహదారిపై నవంబరు తరువాత మీరు వెళుతుంటే అక్కడ మీకు దెయ్యాలు దర్శనమివ్వబోతున్నాయి. అక్కడ కపాలం, సాలెగూడులాంటి డైనింగ్ హాలు చూసి భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అది దెయ్యాల రెస్టారెంట్.
Source: జాతీయ | 10 Jun 2009 | 11:43 am

ప్రతిపక్షాలు మమ్మల్నేమీ చేయలేవు

ప్రజలు తమవెంట ఉన్నంతవరకు ప్రతిపక్షాలు తమను ఏమీ చేయలేవని ముఖ్యమంత్రి వైఎస్ పేర్కొన్నారు. ప్రజలు తమను పూర్తిగా విశ్వసించబట్టే మళ్లీ అధికారం కట్టబెట్టారని ఆయన పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 10 Jun 2009 | 10:02 am

ఏది ఏమైనా మేం ఫాస్ అయ్యాంకదా !

గతంలో తామిచ్చిన వాగ్ధానాలను నెరవేర్చడంతోపాటు చెప్పనివాటినికూడా నెరవేర్చిన కారణంగానే ప్రజలు తమకు మళ్లీ అధికారం అప్పగించారని ముఖ్యమంత్రి వైఎస్ పేర్కొన్నారు. అదేసమయంలో తమను ప్రజలు వెరీగుడ్ అనకున్నా పాస్‌మార్కులు వేశారని వైఎస్ వ్యాఖ్యానించారు.
Source: ఏపీ న్యూస్ | 10 Jun 2009 | 9:48 am

గవర్నర్ నిర్ణయం ఆశ్చర్యం కలిగించలేదు: వీఎస్

పార్టీ నేత విజయన్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు అనుమతి ఇస్తూ రాష్ట్ర గవర్నర్ తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యం కలిగించలేదని కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి వీఎస్.అచ్యుతానందన్ అన్నారు. విజయన్‌పై వచ్చిన ఆరోపణలు రుజువు చేయడం తమ పార్టీకి ప్రతిష్టాత్మకమేనని అన్నారు.
Source: జాతీయ | 10 Jun 2009 | 9:40 am

ఎన్నాళ్లైనా ప్రతిపక్షంలో ఉండేందుకు రెడీ

రాజకీయంలోకి ప్రవేశించిన ఎవరైనా అధికారంలో ఉండాలనే కోరుకుంటారు. ప్రతిపక్షంలో ఉండి ప్రజాసమస్యలపై పోరాడుతున్నామని వారు చెప్పినా పరోక్షంగా మాత్రం వారు అధికారం కోసమే ప్రయత్నిస్తుంటారు. ఎందుకంటే రాజకీయంలోకి వచ్చేదే అధికారం కోసం కాబట్టి.
Source: ఏపీ న్యూస్ | 10 Jun 2009 | 8:06 am

సభా నాయకుడిగా రోశయ్య రైట్ రైట్

శాసనమండలిలో సభా నాయకుడిగా ఆర్థికమంత్రి రోశయ్య ఎన్నికయ్యారు. శాసనమండలి సభా నాయకుడిగా రోశయ్య పేరును ముఖ్యమంత్రి వైఎస్ ప్రకటించగా విపక్షాలు మద్దతు తెలిపాయి.
Source: ఏపీ న్యూస్ | 10 Jun 2009 | 7:48 am

జార్ఖండ్‌లో మందుపాతర పేలి 11 మంది మృతి

జార్ఖండ్ రాష్ట్రంలో మావోయిస్టులు రెచ్చిపోయారు. మందుపాతర పేల్చి 11 మంది పోలీసులను హతమార్చారు. మరో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. జార్ఖండ్ రాష్ట్రంలోని పశ్చిమ సింఘ్‌భూమ్ జిల్లాలో బుధవారం ఈ సంఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు.
Source: జాతీయ | 10 Jun 2009 | 7:46 am

భారత్‌కు చేరుకున్న అమెరికా మంత్రి బర్న్స్

నాలుగు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం అమెరికా రాజకీయ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి విలియమ్స్ బర్న్స్ బుధవారం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆయన భారత్-పాకిస్థాన్‌ల మధ్య స్తంభించిన చర్చలను తిరిగి ప్రారంభించాలనే ప్రతిపాదన చేసే అవకాశాలు ఉన్నాయి.
Source: జాతీయ | 10 Jun 2009 | 6:08 am

ఏం నన్ను కూడా ర్యాగింగ్ చేస్తారా ?

విద్యా సంస్థల్లో కొత్తగా చేరాలనుకునే విద్యార్ధులను భయపెడుతున్న అంశం ఏదంటే ర్యాగింగ్ అని ప్రతి ఒక్కరు టక్కున చెప్పేస్తారు. అయితే ఈ ర్యాగింగ్ అనే అంశం బుధవారం అసెంబ్లీలో సభ్యుల మధ్య చోటు చేసుకుంది. ఓ అంశం గురించి ప్రజారాజ్యం అధినేత చిరంజీవి మాట్లాడుతున్న సమయంలో అధికార పార్టీ నేతలు అడ్డుపడేసరికి ఆయనకు కోపమొచ్చిందో ఏమో ఏం కొత్తగా కాలేజీలో చేరినప్పుడు చేసినట్టు నన్ను కూడా ర్యాగింగ్ చేస్తారా ఏం అంటూ మండిపడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 10 Jun 2009 | 5:41 am

మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని మౌనముద్ర!

మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై అన్ని ప్రాంతీయ పార్టీల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో ఈ బిల్లుపై ప్రధాని మన్మోహన్ సింగ్ ఏమాత్రం నోరు మెదపడం లేదు.
Source: జాతీయ | 10 Jun 2009 | 4:53 am

అరుణాచల్‌ప్రదేశ్‌లో ఐఏఎఫ్ విమానం గల్లంతు

వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన ఓ రవాణా విమానం అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని పర్వతశ్రేణుల్లో అదృశ్యమైంది. ఈ విమానంలో ఎనిమిది మంది వైమానిక దళ సిబ్బంది ఉన్నారు. అరుణాచల్‌లో మంగళవారం ఓ ఐఏఎఫ్ రవాణా విమానం జాడ తెలియకుండా పోయిందని అధికారిక వర్గాలు తెలిపాయి.
Source: జాతీయ | 10 Jun 2009 | 3:35 am

ఫెదరర్‌లా నేనూ తెగ ఏడుస్తాను: అమీర్ ఖాన్

ఉత్కంఠభరితంగా ఆదివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌లో ఫెదరర్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఫైనల్ విజయం సాధించిన తర్వాత ఫెదరర్ వెక్కివెక్కి ఏడ్వడం మొదలుపెట్టాడు. ఓడిన వారు కదా కన్నీళ్లు పెట్టుకోవాలీ.. అనే సందేహం మీకు రావచ్చు. కానీ ఫెదరర్ మాత్రం విజయం సాధించినప్పుడల్లా తెగ ఏడుస్తాడట. ఇదే అలవాటు మన బాలీవుడ్ గజినీ హీరో అమీర్ ఖాన్‌కూ ఉందట. తన చిత్రం ఏది సక్సెస్ సాధించినా కళ్లంట నీళ్లు వాటికవే వచ్చేస్తాయట. మొన్నామధ్య ముంబయిలో గజినీ చిత్రం చూస్తున్నప్పుడు హాల్లోనుంచి బయటకు వచ్చినవాళ్లంతా గజినీ "సూపర్" అని పెద్దగా అరవడాన్ని విని హాల్లోని వీఐపీ గదిలోకి వెళ్లి తనివితీరా ఏడ్చి వచ్చాడట అమీర్. ఈ ఏడుపు విజయం సాధించినప్పుడల్లా వస్తుందని చెపుతున్నాడీ బాలీవుడ్ హీరో.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jun 2009 | 8:59 pm

"ఎడ్వంటర్స్ ఆఫ్ మూషి" పేరిట యానిమేషన్ చిత్రం

హైదరాబాద్ ఆధారిత కంపెనీ మెర్క్యూరీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై "ఎడ్వంచర్స్ ఆఫ్ మూషి" అనే యానిమేషన్ చిత్రం తెరకెక్కనుంది. నాగేందర్ రాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి తెనాలి దర్శకుడు. జంతువుల భావోద్వేగాలను ఈ యానిమేషన్ చిత్రంలో చూపించనున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత నాగేందర్ రాజ్ మాట్లాడుతూ.. జంతువుల జీవన స్థితి గతులను, వాటి పోరాటాలను చక్కగా ఈ చిత్రంలో చూపించనున్నామన్నారు. యానిమేషన్ ఫార్మాట్‌లో సహజంగా ఉండే తొలి భారతీయ చిత్రమిదని చెప్పారు. షాడో నవల్స్ రచయిత మధుబాబు తమ యూనిట్‌లో ఒకరు కావడం చాలా ఆనందంగా ఉందని నిర్మాత వివరించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jun 2009 | 7:44 pm

20 నుంచి షూటింగ్‌లో పాల్గొంటున్న ఎన్టీఆర్

ఎన్నికల ప్రచారంలో పాల్గొని కారు ప్రమాదంలో గాయపడిన మాస్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న కొత్త చిత్రం షూటింగ్‌ ఈ నెల 20 నుంచి తిరిగి ప్రారంభం కానుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jun 2009 | 7:04 pm

భారీసెట్‌లో "ఏక్ నిరంజన్" షూటింగ్

ప్రభాస్‌ హీరోగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో ఆదిత్యరామ్‌ నిర్మిస్తున్న "ఏక్ నిరంజన్‌' షూటింగ్‌ ఏకధాటిగా జరుగుతోంది. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ "ఫ్యాషన్" భామ కంగనా రనౌత్ హీరోయిన్‌గా నటిస్తోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jun 2009 | 6:46 pm

గల్ఫ్‌లో "మగధీర" షూటింగ్

గీతా ఆర్ట్స్ పతాకంపై మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ హీరోగా నటిస్తున్న "మగధీర" చిత్రం షూటింగ్ గల్ఫ్‌లో జరుగనుంది. చందమామ ఫేమ్ సెక్సీడాళ్ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jun 2009 | 5:54 pm

లోహాన్ చేతికి "వెడ్డింగ్ రింగ్"

ఇటీవల లండన్ పర్యటన సందర్భంగా లిండ్సే లోహాన్ చేతికి "వెడ్డింగ్ రింగ్" ఉండటం హాలీవుడ్‌లో ఇప్పుడు చర్చనీయాంశమైంది. తన లెస్బియన్ ప్రేమికురాలు సమంతా రోన్సన్‌తో లోహాన్ మళ్లీ జట్టు కట్టినట్లు వస్తున్న పుకార్లకు ఈ వెడ్డింగ్ రింగ్ ఆజ్యం పోస్తోంది.ఈ "మీన్ గర్ల్స్" భామ బ్రిటన్ పర్యటనలో ఉన్న సందర్భంగా రోన్సన్ కూడా అక్కడే ఉంది. డేజే గిగ్స్ కోసం రోన్సన్ ఆ సమయంలో లండన్‌లో ఉంది. శనివారం సాయంత్రం లోహన్ లండన్ క్లబ్‌లోకి అడుగుపెట్టడంతోనే వీరిద్దరూ మళ్లీ ఏకమైనట్లు పుకార్లు వ్యాపించాయి.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jun 2009 | 5:28 pm

ఛార్మి సైజ్ జీరో: అంతా "బిళ్ల" ఆట మహత్యం

అమాయకపు మోముతో కనిపించే సెక్సీడాళ్ ఛార్మి సైతం ఒళ్లు తగ్గిచుకుని జీరో సైజు కోసం నానా పాట్లు పడుతోందట. పొద్దున్నే లేచిన దగ్గర్నుండీ ఈత, దౌడు తీయడం, గుంజిళ్లు వంటివాటిని విపరీతంగా చేస్తోందట. వీటి ఫలితమో, మరేమోకానీ శరీరంలోని కొవ్వు చేరిన ప్రదేశాలు కాస్తంత నాజూకుగా తయారై "స్టిఫ్"గా మారిపోయి ఎదుటివాళ్లను తెగ ఆకర్షిస్తున్నాయట. ఛార్మిలో ఒక్కసారిగా ఎగిసిపడుతున్న గ్లామర్‌ను చూసి తోటి నటీమణులు ఈర్ష్య పడుతున్నారట. యోగా చేస్తున్న అనుష్క సైతం ఛార్మి జీరో సైజు చిట్కాలపై వాకబు చేసిందట. ఆ వాకబులో తెలిందేటయా... అంటే, ఛార్మి గుంజిళ్లు, ఈత వంటివాటితోపాటు తొక్కుడు బిళ్ల కూడా తెగ ఆడిందట. ఆ తొక్కుడిబిళ్లే ఛార్మిని జీరో చేసిందని టాలీవుడ్ సినీ హీరోయిన్లు బలంగా నమ్మేస్తున్నారట. ఇంకేం, నటీమణులందరూ తొక్కుడు బిళ్ల ఆటలాడుతారమో...
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jun 2009 | 5:08 pm

నాజూకు షేప్‌కోసం 'ఆవకాయ' పాట్లు..!

"ఆవకాయ్ బిర్యానీ" చిత్రం ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన సొట్ట బుగ్గల చిన్నది, అచ్చ తెలుగు అమ్మాయి "బిందు మాధవి". మదనపల్లి అమ్మడికి ఈ మధ్య ఛాన్సులు వెల్లువల్లా రావడంతో ఆహారం తీసుకునే విషయంలో అతి జాగ్రత్తలు పాటిస్తోందని ఆమె సన్నిహితుల సమాచారం. తెరపై ప్రేక్షకులను ఆకట్టుకునే కత్తిలాంటి శరీరాకృతి కోసం బిందు జంక్ ఫుడ్‌ను తీసుకోకూడదని నిర్ణయించిందట. కేలరీస్ తక్కువ గల ఆహారాన్ని మాత్రమే అమ్మడు క్రమంగా తీసుకుంటుందని సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. అంతేకాదు.. బాడీ ఫిట్‌నెస్ కోసం మాధవి వ్యాయామాలు కూడా చేస్తుందని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jun 2009 | 4:35 pm

విజృంభిస్తున్న స్వైన్‌ఫ్లూ: అగ్రస్థానంలో రాష్ట్రం

విదేశాల్లో పుట్టి ప్రస్తుతం దేశంలోనూ విస్తరిస్తోన్న స్వైన్‌ఫ్లూ వ్యాధి క్రమంగా తీవ్రరూపం దాల్చుతోంది. అదేసమయంలో దేశం మొత్తంమీద ఇప్పటివరకు మొత్తం 11 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదుకాగా ఒక్క మనరాష్ట్రంనుంచే ఏడు కేసులు నమోదు కావడం ఇక్కడివారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
Source: ఏపీ న్యూస్ | 9 Jun 2009 | 2:48 pm

ఈ నెల 18న తెలంగాణ విమోచన సమితి

ప్రత్యేక తెలంగాణ కోసం తెలంగాణ విమోచన సమితి ఏర్పాటు కానుంది. తెలంగాణ కోసం పోరాడుతున్నవారితో కలిసి ఏర్పాటు కానున్న ఈ సమితి ఈనెల 18న ఏర్పాటు కానుంది.
Source: ఏపీ న్యూస్ | 9 Jun 2009 | 2:26 pm

ఆమెకు అమెరికా వైద్యాన్ని మేం అందిస్తాం

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యాసిడ్ దాడి ఘటనలో ప్రాణాలతో బయటపడిన ప్రణీతకు సాయం అందించేందుకు అమెరికా తెలుగు సంఘం (తానా) ముందుకొచ్చింది. యాసిడ్ దాడి ఘటన తర్వాత ప్రణీత కోలుకున్నా ఆమెకు జరగాల్సిన వైద్యానికి కావల్సిన ఆర్థిక సాయం తాము చేస్తామంటూ తానా ప్రకటించింది.
Source: ఏపీ న్యూస్ | 9 Jun 2009 | 1:54 pm

చంద్రబాబు చమక్కులు... వైఎస్ నవ్వులు

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంగళవారం ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఎప్పుడూ ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలతో రెచ్చిపోయే చంద్రబాబు, వైఎస్‌లు నేడు మాత్రం నవ్వుల్లో మునిగిపోయారు.
Source: ఏపీ న్యూస్ | 9 Jun 2009 | 1:37 pm

20 నుంచి షూటింగ్‌లో పాల్గొంటున్న ఎన్టీఆర్

ఎన్నికల ప్రచారంలో పాల్గొని కారు ప్రమాదంలో గాయపడిన మాస్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న కొత్త చిత్రం షూటింగ్‌ ఈ నెల 20 నుంచి తిరిగి ప్రారంభం కానుంది.
Source: వినోదం | 9 Jun 2009 | 1:35 pm

ఎల్టీటీఈ కంటే తమిళుల సమస్యే పెద్దది: ప్రధాని

శ్రీలంకలో కొన్ని దశాబ్దాలపాటు వేర్పాటువాద ఉద్యమం నడిపిన ఎల్టీటీఈ తీవ్రవాద సంస్థ కంటే అక్కడ తమిళుల సమస్యే పెద్దదని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. తమిళుల న్యాయబద్ధమైన ఆందోళనలకు శ్రీలంక ప్రభుత్వం అర్థవంతమైన పరిష్కారం చూపించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
Source: జాతీయ | 9 Jun 2009 | 1:16 pm

జాతీయ విపత్తుగా ప్రకటించాలి: లెఫ్ట్ ఫ్రంట్

ఐలా తుఫాను సృష్టించిన బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని పశ్చిమబెంగాల్ రాష్ట్ర అధికార వామపక్ష కూటమి కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఐలా తుఫానుపై వాటిల్లిన నష్టాన్ని అంచనా వేసేందుకు లెఫ్ట్ ఫ్రంట్ మంగళవారం సమావేశమై చర్చింది.
Source: జాతీయ | 9 Jun 2009 | 12:03 pm

అలా వెళ్తే ప్రజలు దగ్గరకు రారు మరి ?

జీన్స్, టీషర్టు ఎందుకు వేసుకుంటున్నారు అని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డిని కదిలిస్తే ఆయన ఓ విచిత్రమైన కారణాన్ని అడిగినవారిముందుంచారు. ఇంతకీ విష్ణు చెప్పిన సమాధానం ఏంటంటారా... జీన్స్, టీషర్టుల్లో వెళ్తేనే ప్రజలు తమ సమస్యలు చెప్పేందుకు నేతల దగ్గరికి వస్తారట.
Source: ఏపీ న్యూస్ | 9 Jun 2009 | 11:12 am

ఉత్తరాంధ్ర అభయప్రదాత "తిరుమలగిరివాసుడు"

"శ్రీ శ్రీనివాస గోవిందా.. శ్రీ వేంకటేశా గోవిందా.. భక్తవత్సలా గోవిందా.. భాగవతప్రియా గోవిందా... ఆపద మొక్కుల వాడా.. అనాధ రక్షకా... పాహిమాం... పాహిమాం..." అంటూ భక్తులు నిత్యం కొలిచే దైవం శ్రీవేంకటేశ్వరుడు.
Source: వినోదం | 9 Jun 2009 | 11:12 am