ఫెదరర్‌లా నేనూ తెగ ఏడుస్తాను: అమీర్ ఖాన్

ఉత్కంఠభరితంగా ఆదివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌లో ఫెదరర్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఫైనల్ విజయం సాధించిన తర్వాత ఫెదరర్ వెక్కివెక్కి ఏడ్వడం మొదలుపెట్టాడు. ఓడిన వారు కదా కన్నీళ్లు పెట్టుకోవాలీ.. అనే సందేహం మీకు రావచ్చు. కానీ ఫెదరర్ మాత్రం విజయం సాధించినప్పుడల్లా తెగ ఏడుస్తాడట. ఇదే అలవాటు మన బాలీవుడ్ గజినీ హీరో అమీర్ ఖాన్‌కూ ఉందట. తన చిత్రం ఏది సక్సెస్ సాధించినా కళ్లంట నీళ్లు వాటికవే వచ్చేస్తాయట. మొన్నామధ్య ముంబయిలో గజినీ చిత్రం చూస్తున్నప్పుడు హాల్లోనుంచి బయటకు వచ్చినవాళ్లంతా గజినీ "సూపర్" అని పెద్దగా అరవడాన్ని విని హాల్లోని వీఐపీ గదిలోకి వెళ్లి తనివితీరా ఏడ్చి వచ్చాడట అమీర్. ఈ ఏడుపు విజయం సాధించినప్పుడల్లా వస్తుందని చెపుతున్నాడీ బాలీవుడ్ హీరో.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jun 2009 | 8:59 pm

విజృంభిస్తున్న స్వైన్‌ఫ్లూ: అగ్రస్థానంలో రాష్ట్రం

విదేశాల్లో పుట్టి ప్రస్తుతం దేశంలోనూ విస్తరిస్తోన్న స్వైన్‌ఫ్లూ వ్యాధి క్రమంగా తీవ్రరూపం దాల్చుతోంది. అదేసమయంలో దేశం మొత్తంమీద ఇప్పటివరకు మొత్తం 11 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదుకాగా ఒక్క మనరాష్ట్రంనుంచే ఏడు కేసులు నమోదు కావడం ఇక్కడివారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
Source: Yahoo! Telugu: News | 9 Jun 2009 | 8:13 pm

ఈ నెల 18న తెలంగాణ విమోచన సమితి

ప్రత్యేక తెలంగాణ కోసం తెలంగాణ విమోచన సమితి ఏర్పాటు కానుంది. తెలంగాణ కోసం పోరాడుతున్నవారితో కలిసి ఏర్పాటు కానున్న ఈ సమితి ఈనెల 18న ఏర్పాటు కానుంది.
Source: Yahoo! Telugu: News | 9 Jun 2009 | 7:55 pm

"ఎడ్వంటర్స్ ఆఫ్ మూషి" పేరిట యానిమేషన్ చిత్రం

హైదరాబాద్ ఆధారిత కంపెనీ మెర్క్యూరీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై "ఎడ్వంచర్స్ ఆఫ్ మూషి" అనే యానిమేషన్ చిత్రం తెరకెక్కనుంది. నాగేందర్ రాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి తెనాలి దర్శకుడు. జంతువుల భావోద్వేగాలను ఈ యానిమేషన్ చిత్రంలో చూపించనున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత నాగేందర్ రాజ్ మాట్లాడుతూ.. జంతువుల జీవన స్థితి గతులను, వాటి పోరాటాలను చక్కగా ఈ చిత్రంలో చూపించనున్నామన్నారు. యానిమేషన్ ఫార్మాట్‌లో సహజంగా ఉండే తొలి భారతీయ చిత్రమిదని చెప్పారు. షాడో నవల్స్ రచయిత మధుబాబు తమ యూనిట్‌లో ఒకరు కావడం చాలా ఆనందంగా ఉందని నిర్మాత వివరించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jun 2009 | 7:44 pm

ఆమెకు అమెరికా వైద్యాన్ని మేం అందిస్తాం

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యాసిడ్ దాడి ఘటనలో ప్రాణాలతో బయటపడిన ప్రణీతకు సాయం అందించేందుకు అమెరికా తెలుగు సంఘం (తానా) ముందుకొచ్చింది. యాసిడ్ దాడి ఘటన తర్వాత ప్రణీత కోలుకున్నా ఆమెకు జరగాల్సిన వైద్యానికి కావల్సిన ఆర్థిక సాయం తాము చేస్తామంటూ తానా ప్రకటించింది.
Source: Yahoo! Telugu: News | 9 Jun 2009 | 7:24 pm

చంద్రబాబు చమక్కులు... వైఎస్ నవ్వులు

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంగళవారం ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఎప్పుడూ ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలతో రెచ్చిపోయే చంద్రబాబు, వైఎస్‌లు నేడు మాత్రం నవ్వుల్లో మునిగిపోయారు.
Source: Yahoo! Telugu: News | 9 Jun 2009 | 7:07 pm

20 నుంచి షూటింగ్‌లో పాల్గొంటున్న ఎన్టీఆర్

ఎన్నికల ప్రచారంలో పాల్గొని కారు ప్రమాదంలో గాయపడిన మాస్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న కొత్త చిత్రం షూటింగ్‌ ఈ నెల 20 నుంచి తిరిగి ప్రారంభం కానుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jun 2009 | 7:04 pm

భారీసెట్‌లో "ఏక నిరంజన్" షూటింగ్

ప్రభాస్‌ హీరోగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో ఆదిత్యరామ్‌ నిర్మిస్తున్న "ఏక నిరంజన్‌' షూటింగ్‌ ఏకధాటిగా జరుగుతోంది. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ "ఫ్యాషన్" భామ కంగనా రనౌత్ హీరోయిన్‌గా నటిస్తోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jun 2009 | 6:46 pm

ఎల్టీటీఈ కంటే తమిళుల సమస్యే పెద్దది: ప్రధాని

శ్రీలంకలో కొన్ని దశాబ్దాలపాటు వేర్పాటువాద ఉద్యమం నడిపిన ఎల్టీటీఈ తీవ్రవాద సంస్థ కంటే అక్కడ తమిళుల సమస్యే పెద్దదని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. తమిళుల న్యాయబద్ధమైన ఆందోళనలకు శ్రీలంక ప్రభుత్వం అర్థవంతమైన పరిష్కారం చూపించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
Source: Yahoo! Telugu: News | 9 Jun 2009 | 6:46 pm

23 ఖాతాదారులను కోల్పోయిన సత్యం

ఖాతాల కుంభకోణంతో సంక్షోభం చిక్కుకున్న ఐటీ దిగ్గజం సత్యం కంప్యూటర్ సర్వీసెస్ ఈ ఏడాది మార్చి వరకు 23 ఖాతాదారులను కోల్పోయింది. కంపెనీ మాజీ ఛైర్మన్ రామలింగరాజు ఈ ఏడాది జనవరిలో సత్యం కంప్యూటర్స్‌లో ఖాతాల కుంభకోణాన్ని బయటపెట్టడం పెద్ద సంచలనం సృష్టించింది.
Source: Yahoo! Telugu: News | 9 Jun 2009 | 6:26 pm

పాకిస్థాన్‌లో శరణార్థులకు జపాన్ ఆర్థిక సాయం

పాకిస్థాన్‌లో తాలిబాన్ తీవ్రవాదులపై మిలిటరీ చేపట్టిన సైనిక చర్య కారణంగా ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాల్లోని సహాయక శిబిరాల్లో తలదాచుకున్న పౌరుల సహాయార్థం జపాన్ ప్రభుత్వం 10 మిలియన్ డాలర్ల సాయం చేయనుంది. పాకిస్థాన్‌లోని సమస్యాత్మక నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్‌లో గత కొన్ని వారాలుగా పాక్ మిలిటరీ ఆపరేషన్ కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 9 Jun 2009 | 6:04 pm

భారత్, నేపాల్ సరిహద్దు మ్యాప్‌పై కసరత్తు

భారత్- నేపాల్ సరిహద్దుకు సంబంధించిన వివాదాల పరిష్కారం కోసం రెండు దేశాలు ఓ ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేశాయి. ఇరుదేశాల సరిహద్దు మ్యాప్‌ను తయారు చేయడంపై ఈ కమిటీ కసరత్తులు తుది దశకు చేరుకున్నాయి. దీనిని ఖరారు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని నేపాల్‌లో భారత దౌత్యాధికారి రాకేశ్ సూద్ విలేకరులతో చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 9 Jun 2009 | 5:54 pm

గల్ఫ్‌లో "మగధీర" షూటింగ్

గీతా ఆర్ట్స్ పతాకంపై మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ హీరోగా నటిస్తున్న "మగధీర" చిత్రం షూటింగ్ గల్ఫ్‌లో జరుగనుంది. చందమామ ఫేమ్ సెక్సీడాళ్ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jun 2009 | 5:54 pm

లోహాన్ చేతికి "వెడ్డింగ్ రింగ్"

ఇటీవల లండన్ పర్యటన సందర్భంగా లిండ్సే లోహాన్ చేతికి "వెడ్డింగ్ రింగ్" ఉండటం హాలీవుడ్‌లో ఇప్పుడు చర్చనీయాంశమైంది. తన లెస్బియన్ ప్రేమికురాలు సమంతా రోన్సన్‌తో లోహాన్ మళ్లీ జట్టు కట్టినట్లు వస్తున్న పుకార్లకు ఈ వెడ్డింగ్ రింగ్ ఆజ్యం పోస్తోంది.ఈ "మీన్ గర్ల్స్" భామ బ్రిటన్ పర్యటనలో ఉన్న సందర్భంగా రోన్సన్ కూడా అక్కడే ఉంది. డేజే గిగ్స్ కోసం రోన్సన్ ఆ సమయంలో లండన్‌లో ఉంది. శనివారం సాయంత్రం లోహన్ లండన్ క్లబ్‌లోకి అడుగుపెట్టడంతోనే వీరిద్దరూ మళ్లీ ఏకమైనట్లు పుకార్లు వ్యాపించాయి.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jun 2009 | 5:28 pm

23 ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్

కేంద్ర ప్రభుత్వం మంగళవారం 23 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐలు) ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రతిపాదనల ద్వారా దేశంలోకి రూ.564.80 కోట్ల పెట్టుబడి రానుంది. దుబాయ్‌కు చెందిన డామా ఆభరణాల రిటైలింగ్ ప్రతిపాదనలకు, డానన్ ఆహార ఉత్పత్తుల రంగంలోకి పునఃప్రవేశ ప్రతిపాదనలకు కేంద్రం తాజాగా ఆమోదం తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 9 Jun 2009 | 5:25 pm

జాతీయ విపత్తుగా ప్రకటించాలి: లెఫ్ట్ ఫ్రంట్

ఐలా తుఫాను సృష్టించిన బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని పశ్చిమబెంగాల్ రాష్ట్ర అధికార వామపక్ష కూటమి కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఐలా తుఫానుపై వాటిల్లిన నష్టాన్ని అంచనా వేసేందుకు లెఫ్ట్ ఫ్రంట్ మంగళవారం సమావేశమై చర్చింది.
Source: Yahoo! Telugu: News | 9 Jun 2009 | 5:18 pm

ఛార్మి సైజ్ జీరో: అంతా "బిళ్ల" ఆట మహత్యం

అమాయకపు మోముతో కనిపించే సెక్సీడాళ్ ఛార్మి సైతం ఒళ్లు తగ్గిచుకుని జీరో సైజు కోసం నానా పాట్లు పడుతోందట. పొద్దున్నే లేచిన దగ్గర్నుండీ ఈత, దౌడు తీయడం, గుంజిళ్లు వంటివాటిని విపరీతంగా చేస్తోందట. వీటి ఫలితమో, మరేమోకానీ శరీరంలోని కొవ్వు చేరిన ప్రదేశాలు కాస్తంత నాజూకుగా తయారై "స్టిఫ్"గా మారిపోయి ఎదుటివాళ్లను తెగ ఆకర్షిస్తున్నాయట. ఛార్మిలో ఒక్కసారిగా ఎగిసిపడుతున్న గ్లామర్‌ను చూసి తోటి నటీమణులు ఈర్ష్య పడుతున్నారట. యోగా చేస్తున్న అనుష్క సైతం ఛార్మి జీరో సైజు చిట్కాలపై వాకబు చేసిందట. ఆ వాకబులో తెలిందేటయా... అంటే, ఛార్మి గుంజిళ్లు, ఈత వంటివాటితోపాటు తొక్కుడు బిళ్ల కూడా తెగ ఆడిందట. ఆ తొక్కుడిబిళ్లే ఛార్మిని జీరో చేసిందని టాలీవుడ్ సినీ హీరోయిన్లు బలంగా నమ్మేస్తున్నారట. ఇంకేం, నటీమణులందరూ తొక్కుడు బిళ్ల ఆటలాడుతారమో...
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jun 2009 | 5:08 pm

నాజూకు షేప్‌కోసం 'ఆవకాయ' పాట్లు..!

"ఆవకాయ్ బిర్యానీ" చిత్రం ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన సొట్ట బుగ్గల చిన్నది, అచ్చ తెలుగు అమ్మాయి "బిందు మాధవి". మదనపల్లి అమ్మడికి ఈ మధ్య ఛాన్సులు వెల్లువల్లా రావడంతో ఆహారం తీసుకునే విషయంలో అతి జాగ్రత్తలు పాటిస్తోందని ఆమె సన్నిహితుల సమాచారం. తెరపై ప్రేక్షకులను ఆకట్టుకునే కత్తిలాంటి శరీరాకృతి కోసం బిందు జంక్ ఫుడ్‌ను తీసుకోకూడదని నిర్ణయించిందట. కేలరీస్ తక్కువ గల ఆహారాన్ని మాత్రమే అమ్మడు క్రమంగా తీసుకుంటుందని సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. అంతేకాదు.. బాడీ ఫిట్‌నెస్ కోసం మాధవి వ్యాయామాలు కూడా చేస్తుందని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jun 2009 | 4:35 pm

"సెక్సీయెస్ట్ సెలబ్రిటీ బాడీస్" లిస్ట్‌లో కెల్లీ బ్రూక్ టాప్!

తాజాగా నిర్వహించిన "సెక్సీయెస్ట్ సెలబ్రిటీ బాడీస్" పోల్‌లో బ్రిటిష్ సినీ తార కెల్లీ బ్రూక్ టాప్‌లో నిలిచింది. ఇంతవరకు సెక్సీయెస్ట్ సెలబ్రిటీ లిస్టులో అగ్రస్థానంలో నిలిచిన మేగన్ ఫాక్స్‌ను బ్రూక్ వెనక్కి నెట్టింది. దీంతో ప్రేక్షకులను ఇట్టే ఆకర్షించగల అందచందాలను కలిగివున్న కెల్లీ బ్రూక్‌ అగ్రస్థానంలోనూ, హాలీవుడ్ బ్యూటీ మేగన్ ఫాక్స్ రెండో స్థానంలో నిలిచారు. ఇకపోతే.. హాలీవుడ్ సెక్సీతార ఏంజెలీనా జోలీ మూడో స్థానంలో, గర్ల్స్ అలౌడ్ స్టార్ కోల్, క్యాటీ పెర్రీలు నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. "సెక్సీయెస్ట్ సెలబ్రిటీ బాడీస్" పోల్‌లో ఘోరమైన శరీరాకృతిని కలిగిన సెలబ్రిటీగా విక్టోరియా బెక్హమ్ నిలిచిందని కాంటాక్ట్ మ్యూజిక్ పత్రిక వెల్లడించింది.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jun 2009 | 4:05 pm

విజృంభిస్తున్న స్వైన్‌ఫ్లూ: అగ్రస్థానంలో రాష్ట్రం

విదేశాల్లో పుట్టి ప్రస్తుతం దేశంలోనూ విస్తరిస్తోన్న స్వైన్‌ఫ్లూ వ్యాధి క్రమంగా తీవ్రరూపం దాల్చుతోంది. అదేసమయంలో దేశం మొత్తంమీద ఇప్పటివరకు మొత్తం 11 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదుకాగా ఒక్క మనరాష్ట్రంనుంచే ఏడు కేసులు నమోదు కావడం ఇక్కడివారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
Source: ఏపీ న్యూస్ | 9 Jun 2009 | 2:48 pm

ఈ నెల 18న తెలంగాణ విమోచన సమితి

ప్రత్యేక తెలంగాణ కోసం తెలంగాణ విమోచన సమితి ఏర్పాటు కానుంది. తెలంగాణ కోసం పోరాడుతున్నవారితో కలిసి ఏర్పాటు కానున్న ఈ సమితి ఈనెల 18న ఏర్పాటు కానుంది.
Source: ఏపీ న్యూస్ | 9 Jun 2009 | 2:26 pm

నెట్‌లో బ్రిట్నీ స్పియర్స్ టాప్‌లెస్ ఫోటోలు..!

ప్రముఖ పాప్ గాయని బ్రిట్నీ స్పియర్స్ టాప్ లెస్ ఫోటోలు నెట్‌లో షికార్లు చేస్తున్నాయట. తన అందచందాలతో శ్రోతలను, ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న ఈ భామ, ప్రస్తుతం "సర్కస్" సంగీతయాత్రలో నిమగ్నమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రిట్నీ టాప్ లెస్ ఫోటోలు నెట్‌లో షికార్లు చేయడం విన్న ఆమె అభిమానులు నెట్ సెంటర్లవైపు పరుగులు తీస్తున్నారట. ఈ ఫోటోలు చాలా హాట్‌గా ఉన్నాయని హాలీవుడ్ వర్గాల సమాచారం.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jun 2009 | 2:17 pm

ఆమెకు అమెరికా వైద్యాన్ని మేం అందిస్తాం

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యాసిడ్ దాడి ఘటనలో ప్రాణాలతో బయటపడిన ప్రణీతకు సాయం అందించేందుకు అమెరికా తెలుగు సంఘం (తానా) ముందుకొచ్చింది. యాసిడ్ దాడి ఘటన తర్వాత ప్రణీత కోలుకున్నా ఆమెకు జరగాల్సిన వైద్యానికి కావల్సిన ఆర్థిక సాయం తాము చేస్తామంటూ తానా ప్రకటించింది.
Source: ఏపీ న్యూస్ | 9 Jun 2009 | 1:54 pm

చంద్రబాబు చమక్కులు... వైఎస్ నవ్వులు

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంగళవారం ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఎప్పుడూ ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలతో రెచ్చిపోయే చంద్రబాబు, వైఎస్‌లు నేడు మాత్రం నవ్వుల్లో మునిగిపోయారు.
Source: ఏపీ న్యూస్ | 9 Jun 2009 | 1:37 pm

20 నుంచి షూటింగ్‌లో పాల్గొంటున్న ఎన్టీఆర్

ఎన్నికల ప్రచారంలో పాల్గొని కారు ప్రమాదంలో గాయపడిన మాస్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న కొత్త చిత్రం షూటింగ్‌ ఈ నెల 20 నుంచి తిరిగి ప్రారంభం కానుంది.
Source: వినోదం | 9 Jun 2009 | 1:35 pm

ఎల్టీటీఈ కంటే తమిళుల సమస్యే పెద్దది: ప్రధాని

శ్రీలంకలో కొన్ని దశాబ్దాలపాటు వేర్పాటువాద ఉద్యమం నడిపిన ఎల్టీటీఈ తీవ్రవాద సంస్థ కంటే అక్కడ తమిళుల సమస్యే పెద్దదని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. తమిళుల న్యాయబద్ధమైన ఆందోళనలకు శ్రీలంక ప్రభుత్వం అర్థవంతమైన పరిష్కారం చూపించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
Source: జాతీయ | 9 Jun 2009 | 1:16 pm

జాతీయ విపత్తుగా ప్రకటించాలి: లెఫ్ట్ ఫ్రంట్

ఐలా తుఫాను సృష్టించిన బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని పశ్చిమబెంగాల్ రాష్ట్ర అధికార వామపక్ష కూటమి కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఐలా తుఫానుపై వాటిల్లిన నష్టాన్ని అంచనా వేసేందుకు లెఫ్ట్ ఫ్రంట్ మంగళవారం సమావేశమై చర్చింది.
Source: జాతీయ | 9 Jun 2009 | 12:03 pm

అలా వెళ్తే ప్రజలు దగ్గరకు రారు మరి ?

జీన్స్, టీషర్టు ఎందుకు వేసుకుంటున్నారు అని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డిని కదిలిస్తే ఆయన ఓ విచిత్రమైన కారణాన్ని అడిగినవారిముందుంచారు. ఇంతకీ విష్ణు చెప్పిన సమాధానం ఏంటంటారా... జీన్స్, టీషర్టుల్లో వెళ్తేనే ప్రజలు తమ సమస్యలు చెప్పేందుకు నేతల దగ్గరికి వస్తారట.
Source: ఏపీ న్యూస్ | 9 Jun 2009 | 11:12 am

ఉత్తరాంధ్ర అభయప్రదాత "తిరుమలగిరివాసుడు"

"శ్రీ శ్రీనివాస గోవిందా.. శ్రీ వేంకటేశా గోవిందా.. భక్తవత్సలా గోవిందా.. భాగవతప్రియా గోవిందా... ఆపద మొక్కుల వాడా.. అనాధ రక్షకా... పాహిమాం... పాహిమాం..." అంటూ భక్తులు నిత్యం కొలిచే దైవం శ్రీవేంకటేశ్వరుడు.
Source: వినోదం | 9 Jun 2009 | 11:12 am

మందు పంపిణీ కార్యక్రమం ఆపే ప్రసక్తే లేదు

ఎవరెన్ని చెప్పినా చేప మందు పంపిణీ కార్యక్రమాన్ని ఆపే ప్రసక్తే లేదని బత్తిన సోదరులు స్పష్టం చేశారు. కొందరు తప్పుడు సమాచారంతో తమపై దుష్ర్పచారానికి పాల్పడుతున్నారని అయితే వీటికి తాము భయపడబోమని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 9 Jun 2009 | 10:49 am

ఆ విషయంలో మీ నిర్ణయం ఏం బాగోలేదు

ఇప్పటికే ఓటమి బాధతో తల్లడిల్లుతున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు సొంత పార్టీలోని నేతలనుంచి సైతం తలనొప్పులు ఎదురవుతున్నాయి. నాలుగురోజుల క్రితం అసెంబ్లీ స్పీకర్ ఎంపిక విషయమై చంద్రబాబు వ్యవహరించిన తీరు ఏమాత్రం బాగోలేదని కొవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రాసిన బహిరంగలేఖ టీడీపీ నేతలను తలపట్టుకునేలా చేసింది.
Source: ఏపీ న్యూస్ | 9 Jun 2009 | 10:11 am

తీవ్రవాదాన్ని ఉపేక్షించం: ప్రధాని మన్మోహన్

తీవ్రవాదాన్ని తాము ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. ఇదేతరహా చర్యలను పాకిస్థాన్ నాయకత్వం కూడా చేపట్టి, తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని ఆయన నొక్కివక్కాణించారు. ముఖ్యంగా, భారత్‌పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
Source: జాతీయ | 9 Jun 2009 | 8:23 am

కండువా వేసుకుని ఆ... సీట్లో కూర్చుంటారా ?

శాసనసభ సమావేశాల సందర్భంగా నేతలు సభా సమయాన్ని ఎంత చక్కగా దుర్వినియోగం చేస్తారో చెప్పాలంటే చాలా ఉదాహరణలే చూపించవచ్చు. ఇదే కోవలో మంగళవారం శాసనసభ సమావేశం సందర్భంగానూ ఓ సంఘటన చోటు చేసుకుంది.
Source: ఏపీ న్యూస్ | 9 Jun 2009 | 7:59 am

ప్రయాణికుల పట్ల "మమతా"నురాగాలు!

కొత్త రైల్వే బడ్జెట్‌లో రైల్వే ప్రయాణికుల సౌకర్యాలకు పెద్ద పీట వేయనున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. అలాగే, రైల్వే శాఖ వాణిజ్య ప్రయోజనాలను కూడా కాపాడుతానని స్పష్టం చేశారు.
Source: జాతీయ | 9 Jun 2009 | 7:47 am

"మహా" సంగ్రామంలో ఒంటరి పోరే: దేశ్‌ముఖ్

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగుతుందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి విలాస్ రావ్ దేశ్‌ముఖ్ అభిప్రాయపడ్డారు. ఈ కేంద్రమంత్రి వ్యాఖ్యలతో కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నట్టు చెప్పకనే చెప్పాయి.
Source: జాతీయ | 9 Jun 2009 | 7:21 am

డిప్యూటీ స్పీకర్‌గా నాదెండ్ల మనోహర్ ఎంపిక

రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీస్పీకర్‌గా కాంగ్రెస్ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ఎన్నికయ్యారు. ఈ విషయమై మంగళవారం అస్లెంబ్లీ సమావేశాలు ప్రారంభంకాగానే స్పీకర్ కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారిక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిప్యూటీ స్పీకర్ పదవికి ఒకే నామినేషన్ వచ్చిందని అది నాదెండ్ల మనోహర్‌దని తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 9 Jun 2009 | 7:10 am

గుర్తు తెచ్చుకో మామా...?

"నా కూతుర్ని ప్రేమించావా...? పాత చొక్కా గుడ్డ విలువ చెయ్యవు నువ్వు తెలుసా..?" గయ్‌మన్నాడు సుబ్బారావు...
Source: వినోదం | 9 Jun 2009 | 5:31 am

అమ్మతో చెబుతావా డార్లింగ్..?

"ఈ హాలీడేని జాలీడేగా గడిపేశాం. ఈ విషయాన్ని మీ అమ్మతో చెబుతావా డార్లింగ్..?" అన్నాడు ప్రియుడు "మా అమ్మ పట్టించుకోదు. ఎటొచ్చీ, మా ఆయనే హాలిడేని...
Source: వినోదం | 9 Jun 2009 | 5:28 am

ఏకాభిప్రాయంతో బిల్లుకు ఆమోదం: ములాయం

దేశ చట్ట సభల్లో మహిళలుకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లును అన్ని పార్టీల ఏకాభిప్రాయంతోనే ఆమోదం పొందేలా చూడాలని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ సూచించారు.
Source: జాతీయ | 9 Jun 2009 | 5:10 am

ఢిల్లీలో రెండు స్వైన్‌ఫ్లూ కేసుల నిర్ధారణ

దేశ రాజధానిలో సోమవారం మరో రెండు స్వైన్‌ఫ్లూ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా స్వైన్‌ఫ్లూ బారినపడిన వారి సంఖ్య 11కి చేరింది. న్యూయార్క్ నుంచి వచ్చిన 35 ఏళ్ల వ్యక్తికి స్వైన్‌ఫ్లూ సోకినట్లు తేలడంతో ఢిల్లీలో తొలి కేసు నమోదయింది.
Source: జాతీయ | 9 Jun 2009 | 4:04 am

పొరుగుదేశాలతో సత్సంబంధాలపై దృష్టి: కృష్ణ

పొరుగు దేశాలతో సంబంధాలు పటిష్ట పరుచుకోవడంపై భారత్ దృష్టి పెడుతుందని విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ తెలిపారు. కేంద్రంలో తిరిగి అధికార పగ్గాలు చేపట్టిన యూపీఏ కూటమి ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని వివరిస్తూ.. పొరుగుదేశాలతో సత్సంబంధాలు నెలకొల్పేందుకు కృషి చేస్తామన్నారు.
Source: జాతీయ | 9 Jun 2009 | 3:32 am

కోడి గుడ్డు పెట్టింది... అది రికార్డులకెక్కింది

కోడి గుడ్డు పెట్టడం మామూలే. అలాగే పంజాబ్‌లోని ఓ కోడి సైతం ఎప్పటిలాగే ఓరోజు గుడ్డు పెట్టింది. అయితే ఆ గుడ్డే ఆ కోడికి విపరీతమైన ప్రచారాన్ని అందించింది. కోడి పెట్టిన గుడ్డుకు ప్రచారం రావడం ఏమిటా అని అశ్చర్య పోతున్నారా ? అయితే ఈ వివరాలు చదవండి మరి.
Source: జాతీయ | 8 Jun 2009 | 2:44 pm

సమస్యల పేరుతో వీధికెక్కొద్దు: రాములమ్మ

పార్టీలోని అంతర్గత సమస్యల పేరుతో మీడియా ముందుకు వెళ్లొద్దంటూ తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ విజయశాంతి పార్టీ శ్రేణులకు హితవు పలికారు. సమస్యలేవైనా ఉంటే పార్టీ సమావేశాల్లో చర్చించుకోవాలే తప్ప సమైక్యవాదులకు బలం చేకూరే విధంగా నేతలు అనాలోచితంగా ప్రవర్తించరాదంటూ ఆమె విజ్ఞప్తి చేశారు.
Source: ఏపీ న్యూస్ | 8 Jun 2009 | 2:26 pm