|
సెరగాన్ సాయంతో టాటా టెలీసర్వీసెస్ విస్తరణటెలికాం దిగ్గజం టాటా టెలీసర్వీసెస్ లిమిటెడ్ జీఎస్ఎం మొబైల్ నెట్‌వర్క్ విస్తరణ కోసం సెరగాన్ నెట్‌వర్క్స్‌కు కొత్త ఆర్డర్లు అప్పగించింది. గతంలో కుదిరిన ఒప్పందంలో భాగంగా ఏడు కొత్త సర్కిళ్లలో జీఎస్ఎం మొబైల్ నెట్‌వర్క్ విస్తరణకు సెరగాన్ సాయం చేయనుందని టాటా టెలీసర్వీసెస్ లిమిటెడ్ (టీటీఎస్ఎల్) సోమవారం వెల్లడించింది.Source: Yahoo! Telugu: News | 8 Jun 2009 | 5:57 pm 12న తెరపైకి వస్తోన్న సుమంత్ "బోణీ"యూత్ హీరో సుమంత్ కథానాయకుడిగా కృతికరబంద కథానాయికగా నటిస్తోన్న చిత్రం "బోణీ". గ్రీన్ మ్యాంగోస్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రానికి రాజా దర్శకునిగా పరిచయమవుతున్నారు.ఈ సినిమాను సంగీత దర్శకుడు రమణ గోగుల నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉన్న బోణీ చిత్రాన్ని ఈ నెల 12వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు.Source: Yahoo! Telugu: Entertainment | 8 Jun 2009 | 5:52 pm ఓటమి కారణాల విశ్లేషణకు సీపీఎం సమీక్షరాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి గల కారణాలను విశ్లేషించుకునేందుకు సీపీఎం రాష్ట్రశాఖ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఆ పార్టీ రాష్ట్రస్థాయి సమీక్షను రేపటినుంచి ప్రారంభించనుంది.Source: Yahoo! Telugu: News | 8 Jun 2009 | 5:45 pm మధ్యప్రదేశ్‌లో తగ్గుతున్న పులుల సంఖ్యదేశంలో పులుల మనుగడ నానాటికీ ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవలి కాలంలో వివిధ కారణాల వల్ల మృత్యువాత పడుతున్న పులుల సంఖ్య పెరిగిపోతోంది. దీనికి తోడు సంఘ విద్రోహశక్తులు కొందరు పులుల వేట జోరుగా సాగిస్తున్నారు. ఫలితంగా దేశంలో పులుల సంఖ్య తగ్గిపోతోంది.Source: Yahoo! Telugu: News | 8 Jun 2009 | 5:23 pm పాకిస్థాన్: జూన్‌లో 29 రాజకీయ హత్యలుపాకిస్థాన్ ఆర్థిక రాజధాని కరాచీలో జూన్ మొదటివారంలో మొత్తం 29 రాజకీయ హత్యలు జరిగాయి. వీటిలో ఎనిమిది హత్యలు ఒక్క ఆదివారమే జరగడం గమనార్హం. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. ఆదివారం హత్యకు గురైనవారిలో ఆరుగురు అర్ఫాత్ అహ్మద్ నేతృత్వంలోని ముత్తాహిదా కవామీ ఉద్యమం (ఎంక్యూఎం- హెచ్)లోని హఖీఖీ వర్గానికి చెందినవారు.Source: Yahoo! Telugu: News | 8 Jun 2009 | 5:11 pm భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో ముగియడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 438 పాయింట్లు కోల్పోయి 14,666 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 157 పాయింట్లు నష్టపోయి 4,430 వద్ద ముగిసింది. ఈ రోజు ఉదయం 50 పాయింట్ల లాభంతో 15,153 వద్ద స్టాక్ మార్కెట్ ప్రారంభమైంది.Source: Yahoo! Telugu: News | 8 Jun 2009 | 5:08 pm సౌదీలో మంత్రికైనా అనుమతి కావాల్సిందేసౌదీ అరేబియా మహిళా మంత్రి కూడా అనుమతి లేకుండా టీవీలో కనిపించరాదని ఓ వార్తాపత్రిక కథనం సోమవారం వెల్లడించింది. నౌరా అల్ ఫాయిజ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో మహిళా విద్యా శాఖకు సహాయమంత్రిగా నియమితులయ్యారు.Source: Yahoo! Telugu: News | 8 Jun 2009 | 5:02 pm డిఫ్యూటీ స్పీకర్ పదవికి మనోహర్ నామినేషన్రాష్ట్ర అసెంబ్లీ ఉపసభాపతి పదవికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ పదవికి మనోహర్ తప్ప వేరెవరూ నామినేషన్ వేయకపోవడంతో ఆ పదవి ఆయననే వరించనుంది.Source: Yahoo! Telugu: News | 8 Jun 2009 | 5:00 pm ప్రజాస్వామ్యం లేకపోతే పాక్‌లో ఏదైనా ఊహించవచ్చుపాకిస్థాన్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం కుప్పకూలితే తాలిబాన్ తీవ్రవాదుల చేతుల్లోకి అణ్వాయుధాలు వెళతాయని ఆ దేశ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ అభిప్రాయపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యం విఫలమై, ప్రపంచ దేశాలు సహకరించని పరిస్థితులు ఏర్పడితే తాలిబాన్ల చేతిల్లోకి పాకిస్థాన్ అణ్వాయుధాలు చేరతాయని జర్దారీ పేర్కొన్నారు.Source: Yahoo! Telugu: News | 8 Jun 2009 | 4:47 pm రూ.420 కోట్ల నికర ఆదాయం అర్జించిన జేపీఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూపు జయప్రకాష్ అసోసియేట్స్ మార్చి 31వ తేదీతో ముగిసిన ఆర్థిక సంవత్సరంతో 420.25 కోట్ల రూపాయల నికర ఆదాయాన్ని అర్జించినట్టు ఆ సంస్థ సోమవారం ప్రకటించింది. గత 2008 సంవత్సరంలో ఈ మొత్తం రూ.676.8 కోట్లుగా ఉన్నదని ఆ సంస్థ బాంబే స్టాక్ ఎక్చేంజ్‌కు సమర్పించిన లేఖలో పేర్కొంది.Source: Yahoo! Telugu: News | 8 Jun 2009 | 4:47 pm హైదరాబాద్ తర్వాత.. సత్యం చెన్నైకు ఆటంకంప్రముఖ ఐటీ సంస్థ సత్యం కంప్యూటర్స్ కంపెనీకి కష్టకాలం ఇంకా తొలగిపోయినట్లు లేదు. ఎందుకంటే... హైదరాబాద్ తర్వాత ఇప్పడు చెన్నైలోని సత్యం సంస్థ కార్యకలాపాలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. కొందరు సీనియర్ అసోసియేట్ సభ్యులుSource: Yahoo! Telugu: News | 8 Jun 2009 | 4:32 pm బ్రాడ్‌పిట్‌ను పెళ్లాడనున్న ఏంజెలినా జోలీ!హాలీవుడ్ నటుడు బ్రాడ్‌పిట్‌ను పెళ్లాడేందుకు సెక్సీతార ఏంజెలినా జోలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంతకాలం తనతో పాటు సహజీవనం చేస్తున్న హాలీవుడ్ నటుడు బ్రాడ్‌పిట్ పెళ్లి చేసుకునేందుకు జోలీ సిద్ధమని ఆమె సన్నిహితులు తెలిపారు. తన మాజీ భార్య జెన్నిఫర్ ఎనిస్టన్‌తో బ్రాడ్ పిట్ మళ్ళీ సంబంధాలు కొనసాగిస్తున్నట్లు మీడియాలో ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో... ఏంజెలీనా జోలీ-బ్రాడ్‌పిట్‌ల సంబంధాలు తెగతెంపులయ్యే అవకాశముందని ఫిలిమ్ నగర్ వర్గాలు చెవులు కొరుక్కోవడంతో జోలీ ఈ నిర్ణయం తీసుకుందని తెలిసింది.Source: Yahoo! Telugu: Entertainment | 8 Jun 2009 | 3:28 pm కొత్త ప్రాజెక్టుపై డానీ బోయెల్ దృష్టి?8 ఆస్కార్ అవార్డులు గెల్చుకున్న "స్లమ్‌డాగ్ మిలియనీర్" చిత్రం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించిన బ్రిటిష్ సినీ నిర్మాత డానీ బోయెల్ మరో కొత్త ప్రాజెక్టు కోసం ముంబైకి రానున్నారని తెలిసింది. ముంబైకి చెందిన కథాంశంతో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాను మరో సినీ నిర్మాత అనురాగ్ కాశ్యప్‌తో కలిసి డానీ బోయెల్ నిర్మిస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. ప్రాజెక్టు వివరాలపై డానీ బోయెల్‌తో ఇంకా చర్చించాలని సినీ నిర్మాత అనురాగ్ కాశ్యప్ ఒక వార్తా సంస్థకు తెలిపారు.Source: Yahoo! Telugu: Entertainment | 8 Jun 2009 | 2:14 pm హ్యాపీ బర్త్ డే శిల్పా...!ఈ రోజు ఎనిమిది జూన్. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇందులో గొప్పదనం ఏంటంటే... ఈ రోజు ప్రముఖ బాలీవుడ్ నటి, పొడుగు కాళ్ళ సుందరి శిల్పాశెట్టి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకు మనమందరం జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తాం. రానున్న పుట్టిన రోజుకు ఆమె వివాహం చేసుకుంటుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీనిపై ఆమె ప్రతిస్పందిస్తూ...ఈ సంవత్సరం చివరిలో ఆమె రాజ్‌తో మూడు ముళ్ళు వేయించుకోనున్నట్లు తెలిపింది. పుట్టిన తేదీ.. 8 జూన్, 1975, జన్మస్థలం.. మంగళూరు,నటించిన చిత్రాలు.. దోస్తానా, అప్నే, లైఫ్ ఇన్ ఎ మెట్రో, సాహస వీరుడు సాగర కన్య తదితరాలు.నటించిన మొత్తం చిత్రాలు.. దాదాపు 50కి పైగా.Source: Yahoo! Telugu: Entertainment | 8 Jun 2009 | 1:47 pm "వోగ్" కవర్‌పేజీపై దీపికా పడుకునే బొమ్మబాలీవుడ్ సెక్సీతార దీపికా పడుకునే బొమ్మ "వోగ్" కవర్‌పేజీపై అచ్చయింది. ఓ భారతీయ సుందరి ముఖ చిత్రాన్ని ఈ పత్రిక కవర్ పేజీపై ప్రచురించడం ఇదే తొలిసారి. లాటిన్ అమెరికాకు చెందిన వోగ్ పత్రికపై పడుకునే బొమ్మ అచ్చయిందని ప్రముఖ పత్రిక ఫిమేల్ ఫస్ట్ ప్రచురించింది.Source: Yahoo! Telugu: Entertainment | 8 Jun 2009 | 1:21 pm హాలీవుడ్ చిత్రానికి రెహ్మాన్ సంగీతం"స్లమ్‌డాగ్ మిలియనీర్" చిత్రం ద్వారా యావత్ ప్రపంచాన్ని మైమరపించిన సంగీత యువ కెరటం ఎ.ఆర్. రెహ్మాన్ తొలిసారిగా ఒక హాలీవుడ్ చిత్రానికి సంగీతం దర్శకత్వం వహిస్తున్నారు. అలీగఢ్ యూనివర్శిటీలో గౌరవ డాక్టరేట్ పొందిన అనంతరం రెహ్మాన్ మాట్లాడుతూ.. హలీవుడ్ నటుడు, దర్శకుడు పీటర్ బిల్లింగ్ స్లే రూపొందిస్తోన్న శృంగార హాస్యభరిత చిత్రం "కపుల్స్ రిట్రీట్"కు సంగీతాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 8 Jun 2009 | 12:44 pm రెహ్మాన్‌కు అలీగఢ్ వర్శిటీ డాక్టరేట్ పురస్కారం"స్లమ్‌డాగ్ మిలియనీర్" చిత్రానికి సంగీతం సమకూర్చి రెండు ఆస్కార్ అవార్డులను గెలుచుకున్న సంగీత సముద్రం ఎ.ఆర్. రెహ్మాన్‌కు గౌరవ డాక్టరేట్ లభించింది. చారిత్రాత్మిక అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయ 59వ స్నాతకోత్సవం సందర్భంగా భారతీయలు గౌరవించదగ్గ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహ్మాన్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.Source: Yahoo! Telugu: Entertainment | 8 Jun 2009 | 12:19 pm ఓటమి కారణాల విశ్లేషణకు సీపీఎం సమీక్షరాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి గల కారణాలను విశ్లేషించుకునేందుకు సీపీఎం రాష్ట్రశాఖ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఆ పార్టీ రాష్ట్రస్థాయి సమీక్షను రేపటినుంచి ప్రారంభించనుంది.Source: ఏపీ న్యూస్ | 8 Jun 2009 | 12:16 pm నయన వివాహం.. వీడని దేవ "రహస్యం"సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రంలో నటించి జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ నయనతార. ఆది నుంచి వివాదాల్లో చిక్కుకుని తన సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. గతంలో శింబుతో ప్రేమాయణం, అతనితో వెండితెర 'చుంబన' దృశ్యాలు అప్పట్లో సంచలనం సృష్టించాయి.Source: Yahoo! Telugu: Entertainment | 8 Jun 2009 | 11:53 am డిఫ్యూటీ స్పీకర్ పదవికి మనోహర్ నామినేషన్రాష్ట్ర అసెంబ్లీ ఉపసభాపతి పదవికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ పదవికి మనోహర్ తప్ప వేరెవరూ నామినేషన్ వేయకపోవడంతో ఆ పదవి ఆయననే వరించనుంది.Source: ఏపీ న్యూస్ | 8 Jun 2009 | 11:30 am కురచ దుస్తులు ధరించాలంటే.. సిగ్గండీ బాబూ..!"సినిమాల్లో కురచ దుస్తులు ధరించాలంటే అబ్బో సిగ్గేస్తుందండీ.. బాబు" అంటూ హీరోయిన్ మధురిమ సిగ్గు ఒలక బోస్తుంది. అజయ్ హీరోగా నటించిన ఆ ఒక్కడు సినిమా ద్వారా మధురిమ హీరోయిన్‌గా పరిచయమైంది. బెంగాల్‌కు చెందిన ఈ నటి పదోవ తరగతి నుంచే గాయనిగా పలు అవార్డులు పొందింది.తన అమ్మకు తాను గాయనిగా పేరుతెచ్చుకోవాలని ఉన్నా.. అనుకోని విధంగా నటిగా మారాల్సి వచ్చిందని మధురిమ చెబుతోంది. ఈ నెల ఐదో తేదీన విడుదలైన ఆ ఒక్కడు సినిమాకు హైదరాబాద్‌లోని పలు థియేటర్లలో వచ్చిన స్పందన చూసి ఆశ్చర్యపోయానని మధురిమ అంటోంది.Source: Yahoo! Telugu: Entertainment | 8 Jun 2009 | 11:26 am బ్రాడ్‌పిట్‌ను పెళ్లాడనున్న ఏంజెలినా జోలీ!హాలీవుడ్ నటుడు బ్రాడ్‌పిట్‌ను పెళ్లాడేందుకు సెక్సీతార ఏంజెలినా జోలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంతకాలం తనతో పాటు సహజీవనం చేస్తున్న హాలీవుడ్ నటుడు బ్రాడ్‌పిట్ పెళ్లి చేసుకునేందుకు జోలీ సిద్ధమని ఆమె సన్నిహితులు తెలిపారు. తన మాజీ భార్య జెన్నిఫర్ ఎనిస్టన్‌తో బ్రాడ్ పిట్..Source: వినోదం | 8 Jun 2009 | 10:59 am మీకు మద్దతు ఇచ్చి నష్టపోయాం: ములాయంగతంలో మీకు మద్దతు ఇవ్వడం వల్లే మేం నష్ట పోయామని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ అన్నారు. మేము మీకు మద్దతు ఇచ్చాం. ఫలితంగా మేం నష్టపోయాం. మీరు లబ్ధి పొందారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.Source: జాతీయ | 8 Jun 2009 | 10:59 am అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఓపీ.మాథూర్భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఓం ప్రకాష్ మాథూర్ తన పదవికి రాజీనామా చేశారు. ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఫలితాలు ఆశాజనకంగా లేక పోవడానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసినట్టు ఆయన తెలిపారు.Source: జాతీయ | 8 Jun 2009 | 9:52 am గవర్నర్ ప్రసంగమంతా అవాస్తవాలే: చిరుఉభయసభలనుద్దేశించి గవర్నర్ ఎన్డీ తివారీ సోమవారం చేసిన ప్రసంగం మొత్తం అవాస్తవాలేనని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి పేర్కొన్నారు. మొత్తం అసత్యాలతో నిండిన గవర్నర్ ప్రసంగం మేడిపండు చందంగా పైకి మాత్రం చాలా గొప్పగానే ఉందని ఆయన ఎద్దేవా చేశారు.Source: ఏపీ న్యూస్ | 8 Jun 2009 | 9:28 am రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: గవర్నర్దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ని తీర్చిదిద్దుతామని గవర్నర్ ఎన్డీ తివారీ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పట్టిపీడిస్తున్న ఆర్థికమాంద్యం చుట్టుముట్టినా రాష్ట్రం మాత్రం ఆర్థిక ప్రగతివైపే కొనసాగుతోందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.Source: ఏపీ న్యూస్ | 8 Jun 2009 | 7:38 am అటార్నీ జనరల్‌గా వాహన్‌వతి నియామకందేశ అటార్నీ జనరల్‌గా సీనియర్ అడ్వకేట్ గూలమ్ ఇ.వాహన్‌వతిని కేంద్ర యూపీఏ ప్రభుత్వం సోమవారం నియమించింది. మహారాష్ట్రకు చెందిన వాహన్‌వతి.. గత యూపీఏ ప్రభుత్వంలో ప్రభుత్వ సొలిసిటర్ జనరల్‌గా విధులు నిర్వహించారు.Source: జాతీయ | 8 Jun 2009 | 7:35 am కేరళ గవర్నర్‌కు బెదిరింపు ఫోన్ కాల్!కేరళ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎస్.గవాయ్‌ను హత్య చేస్తామంటూ బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో ఆ రాష్ట్ర రాజ్‌భవన్ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. గల్ఫ్ నుంచి ఈ బెదిరింపు కాల్ వచ్చినట్టు పోలీసులు వెల్లడించారు.Source: జాతీయ | 8 Jun 2009 | 7:24 am డిప్యూటీ స్పీకర్‌గా ముండా ఏకగ్రీవ ఎన్నిక15వ లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌గా భారతీయ జనతా పార్టీకి చెందిన గిరిజన తెగకు చెందిన ఎంపీ కరియా ముండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం సభ ప్రారంభమైన వెంటనే ఆయన ఎన్నికను సభ మూజువాణి ఓటుతో ఆమోదముద్ర వేసింది.Source: జాతీయ | 8 Jun 2009 | 7:02 am గిరిజనులకు ఇకపై సొంతభూమి: వైఎస్ హామీరాష్ట్రంలోని గిరిజనులు ఇకముందు సొంతభూమి కలిగిన రైతులు కానున్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గిరిజనులకు భూపంపిణీ కార్యక్రమం చేపట్టి వారికి్ పట్టాలను అందజేసేందుకు సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ కొందరు గిరిజనులకు లాంఛనంగా పట్టాలు పంపిణీ చేశారు.Source: ఏపీ న్యూస్ | 8 Jun 2009 | 6:40 am మత్తుమందిచ్చారు... పనికానిచ్చేశారురైలు ప్రయాణంలో ఏమాత్రం పరిచయంలేని వారు ఇచ్చే తినుబండారాలను స్వీకరించకండి. అందులో మత్తుమందులు కలిపి మిమ్మల్ని దోచుకునే అవకాశం ఉంది అనే రైల్వేశాఖ హెచ్చరికలను పాపం వారు విననట్టుంది. అందుకే ఎవరో ఇచ్చిన మత్తుమందు కలిపిన పదార్ధాలను తిని స్పృహ కోల్పోవడంతో పాటు ఆ ప్రయాణీకులు చివరకు తమ సర్వస్వం కోల్పోయారు.Source: ఏపీ న్యూస్ | 8 Jun 2009 | 6:13 am చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధంఆస్తమా వ్యాధిగ్రస్తులకు బత్తన సోదరులు ప్రతిఏటా అందించే చేప ప్రసాదం పంపిణీని సోమవారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ ప్రారంభించనున్నారు. లక్షలాదిగా బారులుతీరే వ్యాధిగ్రస్తులకు ఈ చేప ప్రసాదంపై ఉన్న నమ్మకం ఏపాటిదో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలిసిందే.Source: ఏపీ న్యూస్ | 8 Jun 2009 | 6:12 am నిద్రపోయిన తరువాత..!"నాన్నా.... సన్నాయి కొనిపెట్టవా?" గారంగా అడిగాడు కొడుకు "ఎందుకురా? వేళా పాళా లేకుండా వాయిస్తే ఇంట్లో డిస్టర్బెన్స్‌గా...Source: వినోదం | 8 Jun 2009 | 6:12 am ఒకేసారి ఇద్దరు"ఏంటి పిన్నీ... అంత కోపంగా వున్నారు?" అడిగింది జయ వరాలమ్మను "ఇవాళ ముచ్చటపడి ఆర్టీసీ..Source: వినోదం | 8 Jun 2009 | 6:11 am మహిళా బిల్లును వ్యతిరేకిస్తాం: యూడీఎఫ్మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము కూడా వ్యతిరేకమని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) పార్టీ ప్రకటించింది. ఈ బిల్లు ద్వారా మైనారిటీ వర్గ మహిళలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ అన్నారు. ఈ పార్టీ తరపున అస్సోం నుంచి ఏకైక ఎంపీ ఈయనే కావడం గమనార్హం.Source: జాతీయ | 8 Jun 2009 | 6:10 am దేశవ్యాప్తంగా పది మందికి స్వైన్‌ఫ్లూ నిర్ధారణనిన్నమొన్నటి వరకు ప్రపంచదేశాలను వణికించిన ప్రమాదకర స్వైన్‌ఫ్లూ భారత్‌ను కూడా తాకింది. తాజాగా ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లో ఇద్దరికి స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో దేశంలో బయటపడిన స్వైన్‌ఫ్లూ కేసుల సంఖ్య పదికి చేరింది.Source: జాతీయ | 8 Jun 2009 | 4:20 am జూన్ 14 వరకు ఎన్సీపీ ఎంపీకి సీబీఐ కస్టడీమహారాష్ట్ర కాంగ్రెస్ నేత పవన్‌రాజే నింబాల్కర్, అతని డ్రైవర్ జంట హత్యల కేసులో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎంపీ పదమ్‌సింహ్ పాటిల్ (69)ను సీబీఐ అరెస్టు చేసింది. ఈ జంట హత్యల కేసులో పదమ్‌సింహ్ ప్రమేయం ఉన్నట్లు సీబీఐ అనుమానిస్తుంది.Source: జాతీయ | 8 Jun 2009 | 3:50 am పెను మార్పులు చేయనున్న కాంగ్రెస్ పార్టీదేశంలో ఇటీవల జరిగిన లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. ఇందులో భాగంగా పార్టీని బలోపేతం చేసేందుకు పెను మార్పులు చేపట్టనుంది. ఇందులో భాగంగా ఒక వ్యక్తికి ఒకే పదవి అనే సూత్రాన్ని పాటించనుంది.Source: జాతీయ | 7 Jun 2009 | 1:18 pm
|