ప్రరాపాతో కలిసి పోటీ చేస్తాం: నారాయణ

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీతో కలిసి పోటీ చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ చూచాయగా వెల్లడించారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలంటే ప్రరాపాతో కలిసి పోటీ చేయక తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు.
Source: Yahoo! Telugu: News | 7 Jun 2009 | 5:27 pm

కొత్త కాల్‌ సెంటర్‌ను ప్రారంభించనున్న రైల్వే

ప్రతి నిత్యం లక్షల మంది రైల్వే వివరాలు కనుగొనేందుకు రైల్వే ఎంక్వయిరీలకు ఫోన్‌లు చేస్తుంటారు. దీంతో ఎన్నో అవరోధాలు ఎదురవుతుంటాయి. ఈ అవరోధాలను తొలగించేందుకు ప్రస్తుతం కొత్త కాల్ సెంటర్ నెంబర్ 138ను ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ నెంబరును డయల్ చేస్తే తమకు కావలసిన వివరాలు తెలుస్తాయి.
Source: Yahoo! Telugu: News | 7 Jun 2009 | 5:06 pm

సిడ్నీలో భారతీయుల ర్యాలీ

ఆస్ట్రేలియాలో భారతీయులపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో దాడులకు వ్యతిరేకంగా ఆదివారం సిడ్నీలో వెయ్యిమంది భారతీయులు ప్రదర్శన నిర్వహించారు.
Source: Yahoo! Telugu: News | 7 Jun 2009 | 4:13 pm

పత్తి ఉత్పత్తిలో భారత్ రెండవ స్థానం

పత్తి ఉత్పత్తిలో భారత దేశం రెండవ స్థానానికి చేరుకుంది. పత్తి ఉత్పత్తిలో అమెరికా దేశాన్ని కాదని భారత్ రెండవ స్థానాన్ని ఆక్రమించింది
Source: Yahoo! Telugu: News | 7 Jun 2009 | 3:31 pm

ఆరు స్వైన్ ఫ్లూ కేసులు నమోదైనాయి: మంత్రి

ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రజల ఎవ్వరికీకూడా స్వైన్ ఫ్లూ వ్యాధి సోకలేదని, కాని విదేశాలనుంచి తమ దేశంలోకి ప్రవేశించి రాష్ట్రంలోకి వచ్చినవారికే ఈ వ్యాధి ఉందని వైద్యుల నిర్ధారణలో తేలినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖామంత్రి సుదర్శన్ రెడ్డి తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 7 Jun 2009 | 3:06 pm

ప్రధాన నగరాల్లోని వస్తువుల మార్కెట్ల ధరలు

దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో గల మార్కెట్లలో వస్తువుల ధరలు...కోల్హాపూర్ మార్కెట్‌లో చక్కెర ధర (100 కేజీలు) - రూ. 2,390 గుంటూరు మార్కెట్‌లో ఎండుమిరపకాయలు (100 కేజీలు) - రూ. 4,745 హజీరాబాద్ మార్కెట్‌లో సహజవాయువు (1ఎంఎంబీటీయు) - రూ. 182.10 ముంబాయి మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ (1బీబీఎల్) - రూ. 3,222
Source: Yahoo! Telugu: News | 7 Jun 2009 | 3:03 pm

వస్త్ర పరిశ్రమ ఎగుమతులు తగ్గుముఖం

2008-09 ఆర్థిక సంవత్సరంలో వస్త్ర పరిశ్రమ ఎగుమతులు సుమారు 2 శాతం మేరకు తగ్గుముఖం పట్టినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం కారణంగానే ఈ వస్త్ర పరిశ్రమ ఎగుమతులు తగ్గుముఖం పట్టినట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు.
Source: Yahoo! Telugu: News | 7 Jun 2009 | 2:58 pm

సీబీఐ కస్టడీలో ఎన్సీపీ ఎమ్‌పీ

మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలో నేషనల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యడు పద్మసింగ్ పాటిల్‌ను సీబీఐ అదుపులోకి తీసుకుంది. పాటిల్ ఉస్మానాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Source: Yahoo! Telugu: News | 7 Jun 2009 | 1:47 pm

ఒబామా ఉపన్యాసం మోసపూరితమైంది: తాలిబన్

అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా గత వారం ముస్లిం దేశాలనుద్దేశించి ప్రసంగించిన ఉపన్యాసం మోసపూరితమైనదని, అతని ఉపన్యాసాలు విని ముస్లిం దేశాలు మోసపోకూడదని తాలిబన్లు సూచించారు
Source: Yahoo! Telugu: News | 7 Jun 2009 | 1:09 pm

నేటి బులియన్ మార్కెట్ ధరలు

నేటి బులియన్ మార్కెట్‌లో బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి... హైదరాబాద్ 24 క్యారెట్ - రూ. 15,000 - రూ. 15,050, వెండి కిలో - రూ. 23,900 - రూ. 23,500. చెన్నై 24 క్యారెట్ - రూ. 14,695 - రూ. 14,940, వెండి కిలో - రూ. 24,730 - రూ. 25,394. విజయవాడ - రూ. 14,835 - రూ. 15,065, వెండి కిలో - రూ. 23,200 - రూ. 23,500.
Source: Yahoo! Telugu: News | 7 Jun 2009 | 1:03 pm

బోణీ డిస్ట్రిబ్యూటర్లపై దాడి: సమితి అభ్యంతరం

సుమంత్ హీరోగా, సరస్వతి ఫిలింస్ వారి "బోణీ" చిత్ర డిస్ట్రిబ్యూషన్ ప్రతినిధులపై జరిగిన దాడిపై తెలుగు చలనచిత్ర పరిరక్షణ సమితి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బోణీ డిస్ట్రిబ్యూషన్ ప్రతినిధులపై, సురేష్ మూవీస్ వారు దాడిచేయడం సరికాదని మండిపడింది.
Source: Yahoo! Telugu: Entertainment | 6 Jun 2009 | 7:31 pm

వంటగదిలో ఐశ్వర్యారాయ్: ఎగబడుతున్న టీవీ ఛానళ్లు

బచ్చన్ కోడలు ఐశ్వర్యారాయ్ ఇక నుంచి వంటింటి పడుచుగా పాపులర్ కానుంది. ఎన్ని సినిమాలలో నటించినా... నటిస్తున్నా, ఎన్ని అంతర్జాతీయ సినీ ఉత్సవాలకు హాజరవుతున్నా, తన చేతి వంటను తన అత్తామామలతోపాటు తన భర్తకు పెట్టడంలో ఉన్న సంతోషం ఎక్కడా లేదని చెపుతోంది ఈ బచ్చన్ల బహు. కోడలుపిల్ల వంటగదిని కూడా చూసుకోవాలని బచ్చన్ కుటుంబం ఆకాంక్షించిందో, లేదంటే స్వయంగా ఐశ్వర్యారాయ్ స్వయంగా ఈ నిర్ణయం తీసుకుందో కానీ, తన భర్త అభిషేక్‌తో కలిసి ముంబయిలోని ఓ సూపర్ మార్కెట్లో వంట సామగ్రిని కొనుగోలు చేసిందట ఐష్. ఆమె సామగ్రిని కొంటుంటే, ఏ వస్తువులను కొంటుందో చూసేందుకు అక్కడివాళ్లు ఎగబడ్డారట. ఆ సంగతి సరే... అసలు ఐష్ వంట చేసేటపుడు షూటింగ్‌కు అనుమతి ఇస్తే తమ టీవీల్లో "ఇల్లాలు- వంటలు" కార్యక్రమాల్లో వేసుకుంటామని పలు టీవీ ఛానళ్లు ఎగబడుతున్నాయట.
Source: Yahoo! Telugu: Entertainment | 6 Jun 2009 | 7:21 pm

"నజరానా" షూటింగ్ ప్రారంభం

ఐమాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న చిత్రం "నజరానా". వై. కోటిబాబు స్వీయదర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వై. శైలజ సమర్పిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభమైంది
Source: Yahoo! Telugu: Entertainment | 6 Jun 2009 | 7:17 pm

శరవేగంగా "మా నాన్న చిరంజీవి" షూటింగ్

జగపతిబాబు, నీలిమ హీరోహీరోయిన్లుగా అరుణ్‌ప్రసాద్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న "మా నాన్న చిరంజీవి (పేద్ద హీరో)" చిత్రం షూటింగ్ హైదరాబాదులో శరవేగంగా జరుగుతోంది. జయశ్రీ సమర్పణలో తెరకెక్కనున్న ఈ చిత్రం ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని దర్శకుడు చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 6 Jun 2009 | 7:05 pm

ప్రేమ కోసం "ఆ ఒక్కడు" ఏం చేస్తాడు?

నటీనటులు: అజయ్, సురేష్‌గోపి, మధురిమ తదితరులు,కథ, దర్శకత్వం: మూర్తి,నిర్మాత: గణేష్‌ ఇందుకూరి, సుధాకర్‌. ఇదొక సైక్రియాటిస్ట్‌ నేపథ్యంలోసాగే చిత్రం. లాయర్‌, డాక్టర్‌, క్రిమినల్‌ మధ్య జరిగే కథ. విలన్‌నుంచి హీరోగా మారిన అజయ్ నటించిన ఈ చిత్రాన్ని టాలీ టు హాలీ సంస్థ నిర్మించింది. విలనిజాన్ని బాగా పండించగల అజయ్ ఈ చిత్రంలో అదే తరహాలో నటించాడు.ఇక కథలోకి వెళితే... డాక్టర్‌ పవిత్ర (మధురిమ) సైక్రియాటిస్ట్‌. ఈమె తండ్రి రిటైర్డ్‌ మేజిస్ట్రేట్‌ రఘు (విజయచందర్‌). ఇకపోతే.. శ్రీ కృష్ణ (సురేష్‌గోపి) క్రిమినల్‌ లాయర్‌. ఆయనకు అసిస్టెంట్‌ బొంగరాల బుజ్జి (అజయ్). ప్రధానంగా ఈ పాత్రల మధ్య కథ సాగుతుంది.మరోవైపు ఆస్తికోసం తన తండ్రిని ఇబ్బంది పెడుతున్న తన చెల్లెలి భర్త పోరును తట్టుకోలేక పవిత్ర శ్రీకృష్ణను కలవాల్సి వస్తుంది. ఇవన్నీ గమనించిన బుజ్జి పవిత్రపై విపరీతమైన ప్రేమ పెంచుకుంటాడు. ఆమెకు ఎటువంటి సమస్యవచ్చినా అజ్ఞాతంగా కాపాడుతుంటాడు.ఓ సందర్భంలో ఆమె కూడా ఓ కేసులో ఇరుక్కుంటుంది. ఆ సమస్యను బుజ్జి పరిష్కరిస్తాడు. ఇక పవిత్ర ప్రధాన సమస్యకు కారణం ఎవరు? బుజ్జి పాత్ర ఏమిటి? అనేది మిగిలిన కథ.
Source: Yahoo! Telugu: Entertainment | 6 Jun 2009 | 6:52 pm

'రోమియో'‌ను ట్రైలర్లో వీక్షించండి

కొంత విరామం తర్వాత ఆర్యన్ రాజేష్ తెరమీదికి 'రోమియో' గా వస్తున్నాడు. ఈ చిత్రానికి రామకృష్ణ దర్శకుడు. 'గొడవ' ఫేం శ్రద్ధాఆర్య నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీహరి ఓ ప్రముఖ పాత్రను పోషిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 6 Jun 2009 | 4:31 pm

"పిస్తా"ను ట్రైలర్లో తిలకించండి

విశాల్, శ్రియ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం పిస్తా. విక్రమ్‌కృష్ణ నిర్మాణ సారథ్యం వహించిన ఈ చిత్రానికి సభా అయ్యప్ప దర్శకత్వం వహించారు. ద్విభాషా చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో విశాల్ 6 ప్యాక్ రాముడిగా, అలీ ఆంజనేయుడిగా నటించే దశ్యాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయని నిర్మాత అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 6 Jun 2009 | 4:22 pm

నేరము-శిక్ష ట్రైలర్‌ను వీక్షించండి

కృష్ణ, విజయనిర్మల, జయసుధ ప్రధాన పాత్రల్లో అకుల్, ధీరజ్ హీరోలుగా రూపా, అకర్త హీరోయిన్లుగా నటించిన చిత్రం నేరము-శిక్ష. విజయకృష్ణా మూవీస్ పతాకంపై విజయ నిర్మల స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 6 Jun 2009 | 4:08 pm

"నా స్టైలే వేరు" ట్రైలర్‌‌ను తిలకించండి

డాక్టర్. రాజశేఖర్, భూమిక హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం "నా స్టైలే వేరు". సెన్సార్‌‍‌ను పూర్తి చేసుకుందని చిత్ర నిర్మాత మాగంటి గోపీనాథ్ తెలిపారు. సెన్సార్ "యు" సర్టిఫికేట్ ఇచ్చిందని, ఈ నెల 12వ తేదీన సినిమాను విడుదల చేస్తామని నిర్మాత అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 6 Jun 2009 | 3:53 pm

లండన్‌లో 50 షోలపై మైకేల్ అమితానందం

లండన్‌లో 50 షోలను బుక్ చేయడంపై మైకేల్ జాక్సన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని అతని ప్రమోటర్లు తోసిపుచ్చారు. ఇంత పెద్దమొత్తంలో షోలు బుక్ అవడంపై జాక్సన్ అమితానందం వ్యక్తం చేశాడని చెప్పారు. పాప్ కింగ్‌గా కీర్తించబడుతున్న మైకేల్ జాక్సన్ గతంలో తన అభిమానులతో ఓ2 వేదికపై పది షోలు చేయనున్నట్లు, మిగిలినవాటిని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు చెప్పారని ప్రచారం జరిగింది.
Source: Yahoo! Telugu: Entertainment | 6 Jun 2009 | 3:07 pm