|
'రోమియో'ను ట్రైలర్లో వీక్షించండికొంత విరామం తర్వాత ఆర్యన్ రాజేష్ తెరమీదికి 'రోమియో' గా వస్తున్నాడు. ఈ చిత్రానికి రామకృష్ణ దర్శకుడు. 'గొడవ' ఫేం శ్రద్ధాఆర్య నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీహరి ఓ ప్రముఖ పాత్రను పోషిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 6 Jun 2009 | 4:31 pm అమెరికా స్టాక్ మార్కెట్లుడౌ జోన్స్ ఇండస్ట్రియల్ ఇండెక్స్ - 0.15 శాతంతో 12.89 పాయింట్లు లాభపడి 8,763.13 వద్దకు చేరుకుంది. స్టాండార్డ్ అండ్ పూర్ ఇండెక్స్ - 0.25 శాతంతో 2.37 పాయింట్లు పుంజుకుని 940.09 వద్దకు చేరుకుంది. నాస్‌డాక్ కంపోజిట్ ఇండెక్స్ - 0.03 శాతంతో 0.60 పాయింట్లు బలపడి 1,849.42 వద్దకు చేరుకుంది.Source: Yahoo! Telugu: News | 6 Jun 2009 | 4:26 pm "పిస్తా"ను ట్రైలర్లో తిలకించండివిశాల్, శ్రియ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం పిస్తా. విక్రమ్‌కృష్ణ నిర్మాణ సారథ్యం వహించిన ఈ చిత్రానికి సభా అయ్యప్ప దర్శకత్వం వహించారు. ద్విభాషా చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో విశాల్ 6 ప్యాక్ రాముడిగా, అలీ ఆంజనేయుడిగా నటించే దశ్యాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయని నిర్మాత అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 6 Jun 2009 | 4:22 pm పారా మెడికల్ కోర్సులకు ప్రవేశంపారామెడికల్ కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఏపీ పారామెడికల్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి బీఎన్ఎస్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 2009-10 విద్యా సంవత్సరానికి గాను ఈ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.Source: Yahoo! Telugu: News | 6 Jun 2009 | 4:14 pm మైక్రోబయాలజీ విద్యార్థులకు అవకాశాలు పుష్కలంమైక్రోబయాలజీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు విస్తారంగా ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పరిశోధన, డెవలప్‌మెంట్ లాబ్య్‌లో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటాయి. ఫార్మాక్యుటికల్స్, ఫుడ్ అండ్ కెమికల్ ఇండస్ట్రీస్‌లోనూ వీరికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.Source: Yahoo! Telugu: News | 6 Jun 2009 | 4:10 pm బాలకృష్ణ కోర్టు ఎదుటకు రావాల్సిందేసినీనటుడు బాలకృష్ణ కచ్చితంగా తమ ఎదుట హాజరుకావాల్సిందేనని కడప జిల్లా కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. ముందస్తు బెయిల్ ఉందన్న కారణంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో భాగంగా జరుగుతున్న ఈ విచారణకు బాలకృష్ణ హాజరు కాకుండా ఉండడంతో కోర్టు ఈ మేరకు ఆదేశించింది.Source: Yahoo! Telugu: News | 6 Jun 2009 | 4:10 pm నేరము-శిక్ష ట్రైలర్‌ను వీక్షించండికృష్ణ, విజయనిర్మల, జయసుధ ప్రధాన పాత్రల్లో అకుల్, ధీరజ్ హీరోలుగా రూపా, అకర్త హీరోయిన్లుగా నటించిన చిత్రం నేరము-శిక్ష. విజయకృష్ణా మూవీస్ పతాకంపై విజయ నిర్మల స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది.Source: Yahoo! Telugu: Entertainment | 6 Jun 2009 | 4:08 pm పెరిగిన ప్రత్యక్ష పన్నుల రాబడికేంద్ర ప్రభుత్వం వసూలు చేసే ప్రత్యక్ష పన్నుల శాతం ఒక్క మే నెలలోనే 16.88శాతానికి చేరుకుంది. దీంతో ప్రభుత్వానికి పన్నుల రూపంలో వసూలైన మొత్తం రూ. 11919 కోట్లు. ఇది గత సంవత్సరం ఇదే కాలానికి రూ. 10198 కోట్లుగా ఉండింది.Source: Yahoo! Telugu: News | 6 Jun 2009 | 3:54 pm "నా స్టైలే వేరు" ట్రైలర్‌ను తిలకించండిడాక్టర్. రాజశేఖర్, భూమిక హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం "నా స్టైలే వేరు". సెన్సార్‌ను పూర్తి చేసుకుందని చిత్ర నిర్మాత మాగంటి గోపీనాథ్ తెలిపారు. సెన్సార్ "యు" సర్టిఫికేట్ ఇచ్చిందని, ఈ నెల 12వ తేదీన సినిమాను విడుదల చేస్తామని నిర్మాత అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 6 Jun 2009 | 3:53 pm మెక్సికోలో అగ్నిప్రమాదం: 29 మంది దుర్మరణంవాయువ్య మెక్సికోలోని హెర్మోసిలో నగరంలో ఓ శిశు సంరక్షణా కేంద్రం అగ్నిప్రమాదంలో కాలిబూడిదైంది. ఈ ప్రమాదంలో 29 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. మృతులందరూ మూడు నెలల నుంచి రెండేళ్లలోపు వయసువారే.Source: Yahoo! Telugu: News | 6 Jun 2009 | 3:27 pm అఖిలపక్ష సమావేశానికి తృణమూల్ డుమ్మా!ఐలా తుఫాను వల్ల రాష్ట్రంలో సంభవించిన నష్టంపై చర్చించేందుకు ఆదివారం ఏర్పాటు చేయనున్న అఖిలపక్ష సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్ గైర్హాజరు కావాలని నిర్ణయించింది. తుఫాను బాధితులు నెమ్మెదిగా కోలుకున్న తర్వాత ఈ సమావేశం ఏర్పాటు చేయడంలో అర్థమేమిటని టీఎంసీ పార్లమెంటరీ పార్టీ నేత సుదీప్ బందోపాధ్యాయ వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 6 Jun 2009 | 3:16 pm లండన్‌లో 50 షోలపై మైకేల్ అమితానందంలండన్లో 50 షోలను బుక్ చేయడంపై మైకేల్ జాక్సన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని అతని ప్రమోటర్లు తోసిపుచ్చారు. ఇంత పెద్దమొత్తంలో షోలు బుక్ అవడంపై జాక్సన్ అమితానందం వ్యక్తం చేశాడని చెప్పారు. పాప్ కింగ్‌గా కీర్తించబడుతున్న మైకేల్ జాక్సన్ గతంలో తన అభిమానులతో ఓ2 వేదికపై పది షోలు చేయనున్నట్లు, మిగిలినవాటిని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు చెప్పారని ప్రచారం జరిగింది.Source: Yahoo! Telugu: Entertainment | 6 Jun 2009 | 3:07 pm విదేశీ సిగరెట్లపైకూడా ప్రమాద ఘంటికలు...!దేశవ్యాప్తంగా పొగాకు ఉత్పత్తులపై ప్రమాదకరమైన చిహ్నాలను ముద్రించాలని గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదే విదేశీ సంస్థలనుంచి పొగాకు ఉత్పత్తులను దిగుమతి చేసుకునేటట్లయితే వాటిపైకూడా ప్రమాదకరమైన చిహ్నాలను ముద్రించాలని, దీనిని ఖచ్చితంగా అమలు చేయాలని కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.Source: Yahoo! Telugu: News | 6 Jun 2009 | 2:50 pm త్వరలో రోడ్లపైకి మానవరహిత వాహనాలుహాలీవుడ్ జేమ్స్‌బాండ్ తరహా కొన్ని చిత్రాల్లో వాహనాలు వాటికవే డ్రైవ్ చేసుకుంటూ సర్రున రోడ్లపై వేగంగా వెళుతుండటం చూస్తుంటాం. ఇప్పుడు అలాంటి వాహనాలు నిజంగానే రోడ్లపై పరుగెడితే.. ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదూ... త్వరలో ఇది నిజం కాబోతోంది. అలాంటి...Source: Yahoo! Telugu: News | 6 Jun 2009 | 1:49 pm ఇకపై వెబ్ ఆధారిత కౌన్సిలింగ్ విధానంఇకపై ఎంసెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు ఇంటర్నెట్ ద్వారా ఆప్షన్లు ఇచ్చి ఇంజనీరింగ్ అడ్మిషన్లు పొందవచ్చు. ఇంజనీరింగ్‌తో పాటు ఈసారి ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, పాలిటెక్నిక్ కోర్సుల అడ్మిషన్లకు కూడా పూర్తి స్థాయి వెబ్ ఆధారిత అడ్మిషన్ల విధానం అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు.Source: Yahoo! Telugu: News | 6 Jun 2009 | 1:39 pm "మిత్రుడు" ట్రైలర్‌ను వీక్షించండిబాలకృష్ణ, ప్రియమణి జంటగా నటించిన చిత్రం 'మిత్రుడు'. మహదేవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైష్ణవి సినిమా పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ సినిమా హిట్ అయిందని చిత్ర యూనిట్ వెల్లడించింది.Source: Yahoo! Telugu: Entertainment | 6 Jun 2009 | 1:13 pm "బిల్లా"ను ట్రైలర్లో చూడండిగోపీకృష్ణా మూవీస్ పతాకంపై ప్రభాస్ హీరోగా నటించిన "బిల్లా" చిత్రం అర్థశతదినోత్సవ వేడుకలను వైభవంగా జరుపుకుంది. టాలీవుడ్ సెక్సీతార అనుష్క, నమిత హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మాస్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.Source: Yahoo! Telugu: Entertainment | 6 Jun 2009 | 1:02 pm తెల్లపిల్ల తమన్నా తాగుడే... తాగుడుతమన్నాకు ఆనందం వచ్చినా, దుఃఖం వచ్చినా తెగ తాగుతుందట. మామూలుగా ఒక్కర్తే కూచుని తాగదట. తన స్నేహితులందరినీ పిలిచి పార్టీ ఏర్పాటు చేసి మరీ తాగుతుందట. ఇటీవల ఆమెకు వరుసగా అగ్రహీరోల సరసన అవకాశాలు రావడంతో తాను అడగకుండానే నిర్మాతలు పారితోషికాన్ని తమంతట తామే పెంచుకుంటూ పోతున్నారట. ఆమె 50 లక్షలు అనే లోపే, ఓకేనమ్మా నువ్వు 60 లక్షలేగా అడుగుతున్నావ్...? 70... సరేనా అంటున్నారట. నిర్మాతలు ఇలా అంటుండంతో తమన్నా సంతోషానికి హద్దే లేకుండా పోతోందట. ఈ ఆనందాన్ని పంచుకోవడానికి తన స్నేహితులను పిలిచి గ్రాండ్ పార్టీ ఇచ్చిందట. తాగినంత తాగి, తిన్నంత తినమని హుషారు చేసిందట.Source: Yahoo! Telugu: Entertainment | 6 Jun 2009 | 12:39 pm బిపాసా-మారడోన్నాల కిస్ సీన్ అదిరింది..!బాలీవుడ్‌కు మారడోనా రెబెల్లో అనే కొత్త హీరో పరిచయమవుతున్నాడు. సుదిప్తొ ఛటోపాండే దర్శకత్వం వహిస్తోన్న పంక్ సినిమాలో రెబెల్లో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఓ హాట్ సన్నివేశంలో రెబెల్లో అద్భుతంగా నటించి అదరగొట్టాడు. ఈ సన్నివేశం ద్వారా బాలీవుడ్ హీరోలు షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ తరహాలో రెబెల్లో కూడా ప్రేక్షకులకు దగ్గరవుతాడని సినీ పండితులు జోస్యం చెబుతున్నారు. ఈ సన్నివేశంలో రెబెల్లోకు సహకరించింది ఎవరో తెలుసా? మన బాలీవుడ్ హాట్ గర్ల్ బిపాసా బసు. సెక్సీతారగా ముద్రవేసుకున్న బిపాసా రెబెల్లోతో తీసిన ఆ కిస్ సన్నివేశంలో చాలా చక్కగా నటించిందని సమాచారం.Source: Yahoo! Telugu: Entertainment | 6 Jun 2009 | 12:30 pm యువహీరో రాణాతో మోహన్‌దాస్ ప్రేమాయణం!మమతా మోహన్‌దాస్ అటు నటిగా, ఇటు గాయనిగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందింది. అయితే, ఈ ముద్దుగుమ్మ యువ హీరోతో ప్రేమలో పడినట్టు ఫిల్మ్ నగర్‌లో వార్తలు గుప్పుమంటున్నాయి.Source: Yahoo! Telugu: Entertainment | 6 Jun 2009 | 11:51 am బాలకృష్ణ కోర్టు ఎదుటకు రావాల్సిందేసినీనటుడు బాలకృష్ణ కచ్చితంగా తమ ఎదుట హాజరుకావాల్సిందేనని కడప జిల్లా కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. ముందస్తు బెయిల్ ఉందన్న కారణంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో భాగంగా జరుగుతున్న ఈ విచారణకు బాలకృష్ణ హాజరు కాకుండా ఉండడంతో కోర్టు ఈ మేరకు ఆదేశించింది.Source: ఏపీ న్యూస్ | 6 Jun 2009 | 10:40 am అఖిలపక్ష సమావేశానికి తృణమూల్ డుమ్మా!ఐలా తుఫాను వల్ల రాష్ట్రంలో సంభవించిన నష్టంపై చర్చించేందుకు ఆదివారం ఏర్పాటు చేయనున్న అఖిలపక్ష సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్ గైర్హాజరు కావాలని నిర్ణయించింది. తుఫాను బాధితులు నెమ్మెదిగా కోలుకున్న తర్వాత ఈ సమావేశం ఏర్పాటు చేయడంలో అర్థమేమిటని టీఎంసీ పార్లమెంటరీ పార్టీ నేత సుదీప్ బందోపాధ్యాయ వెల్లడించారు.Source: జాతీయ | 6 Jun 2009 | 9:48 am ఆ రెండున్నర గంటల్లో అసలేం జరిగింది ?ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠత, ఒకవేళ జరగరానిదేదైనా జరిగితే చనిపోతామా అన్న సందేహం, అలాగని ఏమీ చేయలేని నిస్సాహాయత ఇలాంటి అనుభవాలన్నీ దాదాపు రెండున్నర గంటలపాటు ఒక్కసారిగా మనిషిని చుట్టుముట్టేస్తే ఇక ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది ?... సరిగ్గా అలాంటి పరిస్థితే శుక్రవారం ఎమిరేట్స్ విమానం ద్వారా హైదరాబాద్‌కు చేరుకున్న ప్రయాణీకుల్లో చోటు చేసుకుంది.Source: ఏపీ న్యూస్ | 6 Jun 2009 | 7:36 am దేశంలో ఐదు స్వైన్ ఫ్లూ కేసులు : కేంద్రంప్రపంచాన్ని వణికిస్తున్న స్వైన్ ఫ్లూ వ్యాధి దేశంలో మెల్లగా ప్రబలుతోంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఐదు స్వైన్ ఫ్లూ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం స్పష్టం చేసింది.Source: జాతీయ | 6 Jun 2009 | 7:33 am స్వైన్‌ఫ్లూ కేంద్రంగా మారుతున్న హైదరాబాద్గత కొద్దిరోజులుగా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న స్వైన్‌ఫ్లూ ప్రస్తుతం రాష్ట్ర రాజధానిని ఆవహించింది. దేశంలో ఎక్కడాలేని విధంగా హైదరాబాద్‌లో వరుసగా స్వైన్‌ఫ్లూ కేసులు నమోదవుతుండడం నగర ప్రజానీకాన్ని కలవరానికి గురిచేస్తోంది.Source: ఏపీ న్యూస్ | 6 Jun 2009 | 7:12 am బిపాసా-మారడోన్నాల కిస్ సీన్ అదిరింది..!బాలీవుడ్‌కు మారడోనా రెబెల్లో అనే కొత్త హీరో పరిచయమవుతున్నాడు. సుదిప్తొ ఛటోపాండే దర్శకత్వం వహిస్తోన్న పంక్ సినిమాలో రెబెల్లో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఓ హాట్ సన్నివేశంలో రెబెల్లో అద్భుతంగా నటించి అదరగొట్టాడు.Source: వినోదం | 6 Jun 2009 | 7:01 am వాళ్లేమీ మనల్ని 'వెరీగుడ్' అనలేదుప్రజలు తమ ప్రభుత్వాన్ని గుడ్ అన్నారే తప్ప వెరీగుడ్ అనలేదని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు స్పందించిన తీరు చూసినప్పుడు తనకు ఈ విషయం స్పష్టమైందని కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి పేర్కొన్నారు.Source: ఏపీ న్యూస్ | 6 Jun 2009 | 6:10 am ఇక.. కరియా ముండా ఎన్నిక లాంఛనమే!15వ లోక్‌సభకు ఉపసభాపతి ఎన్నిక లాంఛనప్రాయం కానుంది. సంప్రదాయబద్ధంగా వస్తున్న ఆచారం మేరకు అధికార యూపీఏ సర్కారు డిప్యూటీ స్పీకర్ పదవిని అతిపెద్ద ప్రతిపక్ష పార్టీకి కేటాయించిన విషయం తెల్సిందే. దీంతో ఆ పదవికి గిరిజన నేత కరియా ముండాను భారతీయ జనతా పార్టీ ఎంపిక చేసింది.Source: జాతీయ | 6 Jun 2009 | 5:37 am మార్గదర్శి కేసులో రామోజీకి కష్టకాలంరామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుకు మార్గదర్శి రూపంలో కష్టకాలం ఎదురైంది. ప్రముఖ వ్యాపారవేత్తగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేకమైన గుర్తింపుతోపాటు ఓ ప్రముఖ పత్రికకు ఎడిటర్ అయిన రామోజీరావు మార్గదర్శి చిట్ సంస్థలో చోటు చేసుకున్న కొన్ని కారణాలవల్ల శుక్రవారం కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది.Source: ఏపీ న్యూస్ | 6 Jun 2009 | 5:30 am మహిళా రిజర్వేషన్ బిల్లుపై భిన్నాభిప్రాయాలు!మహిళా రిజర్వేషన్ బిల్లుపై దేశ రాజకీయ పార్టీల్లో భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు మాత్రమే ఈ బిల్లుకు మద్దతు తెలుపుతున్నాయి. ప్రాంతీయ పార్టీలైన జేడీయు, ఆర్జేడీ, సమాజ్‌వాదీ వంటి పార్టీలు బిల్లును వ్యతిరేకిస్తున్నాయి.Source: జాతీయ | 6 Jun 2009 | 5:18 am జాకెట్లపై ఆరోపణల్లో వాస్తవం లేదు: చవాన్ముంబయి పోలీసులకు నాణ్యత లేని బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లను ప్రభుత్వం అందజేసినట్లు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ స్పష్టం చేశారు. బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో ఆయన దీనిపై స్పందించారు. ఇవి ఆటవిక ఆరోపణలని దుయ్యబట్టారు.Source: జాతీయ | 6 Jun 2009 | 4:12 am సంగ్మా క్షమాపణ: ఎన్సీపీ- కాంగ్రెస్ విలీనంపై పుకార్లునేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత పీఏ సంగ్మా ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీకి గురువారం క్షమాపణలు చెప్పిన అనంతరం.. కాంగ్రెస్, ఎన్సీపీల విలీనంపై ప్రచారం జోరందుకుంది. సోనియా గాంధీ విదేశీయత వివాదాన్ని దశాబ్దకాలం క్రితం తెరపైకి తెచ్చినందుకు పీఏ సంగ్మా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఇప్పుడు క్షమాపణ చెప్పిన సంగతి తెలిసిందే.Source: జాతీయ | 6 Jun 2009 | 3:43 am మహిళా బిల్లు ఆమోదిస్తే విషం తాగుతా..శరద్కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న రూపంలోనే మహిళా బిల్లును ఆమోదిస్తే తాను సభలోనే విషం తాగి ఛస్తానని జనతా దళ్(యు) అధినేత శరద్ యాదవ్ లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారుSource: జాతీయ | 5 Jun 2009 | 3:57 pm మళ్లీ "ఠాగూర్" పాత్రలో మెగాస్టార్!తిరుపతి శాసనసభ సభ్యుడు, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి మళ్లీ వెండితెరపై కనిపించనున్నారు. తన కుమారుడు రామ్ చరణ్ తేజ్ హీరోగా నిర్మితమవుతున్న 'మగధీర' చిత్రంలో గెస్ట్‌రోల్ చేస్తున్న చిరు.. ఈ సారి పూర్తి స్థాయి హీరోగా కనిపించనున్నారు.Source: ఏపీ న్యూస్ | 5 Jun 2009 | 2:29 pm సోనియాకు భారతరత్న ఇవ్వండి: గంగాభవానీకాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ దేశ అత్యుత్తమ పురస్కారమైన భారతరత్న ఇవ్వాలని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గంగాభవానీ కోరారు. మహిళాభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తున్న సోనియాకు ఈ పురస్కారం లభించే దిశగా మహిళా కాంగ్రెస్ తరపున రాష్ట్రపతికి సిఫార్సు చేయనున్నట్టు ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.Source: ఏపీ న్యూస్ | 5 Jun 2009 | 1:38 pm విదేశీయతపై సోనియాకు సంగ్మా క్షమాపణకాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విదేశీయత అంశంపై తీవ్రంగా విభేదించి పార్టీని వీడిన లోక్‌సభ మాజీ స్పీకర్ పీఏ.సంగ్మా మనస్సు మార్చుకున్నారు. సోనియా గాంధీకి ఆయన క్షమాపణలు చెప్పారు. దీంతో దశాబ్దకాలం క్రితం సోనియాపై విదేశీయతపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల దుమారం సద్దుమణిగిపోయింది.Source: జాతీయ | 5 Jun 2009 | 12:46 pm మర్యాదలు వారికి మాత్రం వర్తించవా: టీడీపీమర్యాదలు, సాంప్రదాయాలు అనేవి కేవలం ప్రతిపక్షాలకి మాత్రమే వర్తిస్తాయా... ఏం అధికార పక్షానికి మాత్రం వర్తించవా అంటూ శుక్రవారం తెలుగుదేశం పార్టీ మండిపడింది.Source: ఏపీ న్యూస్ | 5 Jun 2009 | 12:08 pm విచారణ కమిషన్ అవసరం లేదు: చిదంబరంముంబై దాడులకు సంబంధించి ప్రత్యేకంగా విచారణ కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం స్పష్టం చేశారు. పేలుళ్ళు జరిగిన ఆరు నెలల తర్వాత ప్రతిపక్షాలు ఈ తరహా డిమాండ్ చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు.Source: జాతీయ | 5 Jun 2009 | 11:57 am
|