ఆ పాత పాట 'మధురం'..

ఈ పాట.. 1953లో తీసిన "బ్రతుకు తెరువు" అనే చిత్రంలోని ఈ పాట. అక్కినేని నాగేశ్వరరావు, అలనాటి నటి సావిత్రి నటించిన ఈ సినిమాలో 'అందమె ఆనందం' అనే పాట తెలుగు సీమను చాలాకాలం పాటు ఉర్రూతలూగించింది.
Source: Yahoo! Telugu: Entertainment | 5 Jun 2009 | 3:37 pm

జూన్ 12న సమ్మె చేయనున్న బ్యాంక్ కార్మికులు

ప్రభుత్వ బ్యాంక్ కార్మికులందరూ తమ కోర్కెలు తీర్చమని ఈ నెల 12వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె చేయనున్నారు.
Source: Yahoo! Telugu: News | 5 Jun 2009 | 3:28 pm

లాభాల్లోనే పయనిస్తున్న స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం లాభాల్లో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 79 పాయింట్లు పుంజుకుని 15,088 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 8 పాయింట్లు స్వల్పంగా బలపడి 4,581 వద్ద పయనిస్తోంది. ఇప్పటి వరకు మొత్తం 2,865 కంపెనీల వాటాలు ట్రేడ్ అవగా, 1,585 కంపెనీల వాటాలు లాభాల్లో ఉన్నాయి.
Source: Yahoo! Telugu: News | 5 Jun 2009 | 3:27 pm

మహిళా బిల్లుకు సహకరిస్తాం: చిరంజీవి

చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించే మహిళా బిల్లుకు ప్రజారాజ్యం అన్ని రకాలుగా సహకరిస్తుందని ఆ పార్టీ అధినేత చిరంజీవి పేర్కొన్నారు. మిగిలిన పార్టీలకంటే తమ పార్టీలో మహిళలకు సముచితమైన స్థానం, ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని ఆయన తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 5 Jun 2009 | 3:08 pm

సయీద్‌తో మదనీకి సంబంధాలు: చిదంబరం

ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన లష్కర్ తోయిబా కమాండర్ మహమ్మద్ ఒమర్ మదనీకి పాకిస్థాన్‌ కేంద్రంగా పని చేస్తున్న జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్‌కు సంబంధాలు ఉన్నట్టు కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం తెలిపారు. ఈ విషయాన్ని ఆయన శుక్రవారం మీడియా ముందు వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 5 Jun 2009 | 3:06 pm

12న వస్తోన్న "నా స్టైలే వేరు"

డాక్టర్. రాజశేఖర్, భూమిక హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం "నా స్టైలే వేరు". ఈ సినిమా శుక్రవారం సెన్సార్‌‍‌ను పూర్తి చేసుకుందని చిత్ర నిర్మాత మాగంటి గోపీనాథ్ తెలిపారు. సెన్సార్ "యు" సర్టిఫికేట్ ఇచ్చిందని, ఈ నెల 12వ తేదీన సినిమాను విడుదల చేస్తామని నిర్మాత అన్నారు. చిత్ర దర్శకుడు జి. రాంప్రసాద్ మాట్లాడుతూ.. రాజశేఖర్ బాడీ లాంగ్వేజ్‌కు సరిపడా కథతో ఈ సినిమా తెరకెక్కనుందని చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 5 Jun 2009 | 2:45 pm

ఆ ఒక్కడు ట్రైలర్‌ను తిలకించండి

ప్రతినాయకుడుగా మంచి పేరు తెచ్చుకున్న అజయ్ 'ఆ ఒక్కడు' చిత్రం ద్వారా తొలిసారి కథానాయకుడిగా తెరపైకి రానున్నాడు. అమెరికాలో పలు బ్లాక్ బస్టర్ చిత్రాలను డిస్ట్రిబ్యూషన్ చేసిన 'టాలీ 2 హాలీ మూవీస్' సంస్థ తొలిసారి చిత్రనిర్మాణ రంగంలోకి అడుగుపెడుతూ అజయ్ హీరోగా ఈ చిత్రాన్ని రూపొందించింది.
Source: Yahoo! Telugu: Entertainment | 5 Jun 2009 | 2:28 pm

185 పాయింట్లు పుంజుకున్న సెన్సెక్స్

స్టాక్ మార్కెట్ 185 పాయింట్లు పుంజుకోవడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 15,194 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 49 పాయింట్లు లాభపడి 4,621 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 1.23 శాతం, నిఫ్టీ 1.06 శాతం చొప్పున వృద్ధి చెందాయి.
Source: Yahoo! Telugu: News | 5 Jun 2009 | 2:21 pm

సాధు సినిమా ట్రైలర్ మీ కోసం...

లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై నాగబాబు నటించిన చిత్రం 'సాధు'. ప్రముఖ ఛాయాగ్రాహకుడు అంజి తొలిసారి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 5 Jun 2009 | 2:19 pm

రాజు-మహారాజును ట్రైలర్లో చూడండి

మోహన్‌బాబు, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలుగా, శర్వానంద్ హీరోగా నటిస్తోన్న చిత్రం "రాజు మహారాజు". ఈ సినిమా గురించి మోహన్‌బాబు మాట్లాడుతూ.. కుటుంబకథా చిత్రమిదని, కొత్త నిర్మాత అయినా చెప్పింది.. చెప్పినట్లు తీస్తున్నారని చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 5 Jun 2009 | 2:13 pm

రాత్రి సినిమా ట్రైలర్‌ను వీక్షించండి

షాయాజీ షిండే, ప్రీతి మెహరా, సమీర్ ప్రధాన పాత్రల్లో 'రాత్రి' సినిమా రూపొందుతోంది. అన్నపూర్ణ సినీ క్రియేషన్స్ పతాకంపై భానుకిరణ్ దర్శకత్వంలో ఆర్.కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 5 Jun 2009 | 2:00 pm

"ఓయ్" సినిమా ట్రైలర్‌ను తిలకించండి

'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' అన్న సిద్దార్థ ఈసారి "ఓయ్" అంటూ తెరపైకి వస్తున్నాడు. యూనివర్శల్ మీడియా బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న "ఓయ్" సినిమాకు ఆనంద్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 5 Jun 2009 | 1:52 pm

భారత్‌లో నోకియా ఎన్-97 మొబైల్ ఫోన్

ప్రముఖ మొబైల్ ఫోన్ల ఉత్పత్తి సంస్థ నోకియా తన మల్టీమీడియా ఫోన్ సిరీస్‌లో భాగంగా.. సరికొత్త ఎన్-97 టచ్‌స్క్రీన్ మొబైల్ ఫోన్‌ను దేశీయ మార్కెట్లలోకి విడుదల చేసింది. కాగా... ఈ ఎన్-97 ఫోన్ ధర సుమారు 35 వేల రూపాయల దాకా ఉండవచ్చునని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
Source: Yahoo! Telugu: News | 5 Jun 2009 | 1:44 pm

నేరము-శిక్ష ట్రైలర్ మీకోసం

పద్మభూషణ్ కృష్ణ, విజయనిర్మల, జయసుధ ప్రధాన పాత్రలలో రూపొందిన చిత్రం నేరము-శిక్ష. ఆకుల్, ధీరజ్, ఆకర్ష, రూపా జంటలు కొత్తగా పరిచయమైన ఈ చిత్రం విజయకృష్ణా మూవీస్ పతాకంపై విజయనిర్మల దర్శకత్వంలో రూపొందింది.
Source: Yahoo! Telugu: Entertainment | 5 Jun 2009 | 1:43 pm

అయేషా హత్య కేసు విచారణ 22కు వాయిదా

రాష్ట్రంలో కొద్ది నెలల క్రితం సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్య కేసు విచారణ ఈనెల 22కు వాయిదా పడింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సత్యంబాబును విజయవాడ మహిళా సెషన్స్ కోర్టుకు తరలించిన నేపథ్యంలో విచారణ ప్రారంభమైంది.
Source: Yahoo! Telugu: News | 5 Jun 2009 | 1:42 pm

స్టాక్ మార్కెట్లో పెరుగుతున్న లాభాలు

స్టాక్ మార్కెట్లో లాభాలు మరింతగా పెరుగుతుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 152 పాయింట్లు పుంజుకుని 15,161 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 30 పాయింట్లు పుంజుకుని 4,602 వద్ద పయనిస్తోంది. ఇప్పటి వరకు మొత్తం 2,800 కంపెనీల వాటాలు ట్రేడ్ అవగా, 1,815 కంపెనీల వాటాలు లాభపడ్డాయి.
Source: Yahoo! Telugu: News | 5 Jun 2009 | 1:40 pm

లఘు పరిశ్రమలకు రుణాలివ్వండి: ఆర్‌బీఐ

లఘు పరిశ్రమలకు రుణాలివ్వడంలో అన్ని బ్యాంకులు తమ విధానాలను సరళీకృతం చేసుకోవాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ దేశీయ బ్యాంకులన్నింటికీ ఆదేశాలు జారీ చేసింది.
Source: Yahoo! Telugu: News | 5 Jun 2009 | 1:28 pm

దోడా జిల్లాలో ముగ్గురు మిలిటెంట్ల హతం

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని దోడా జిల్లాలో ముగ్గురు మిలిటెంట్లను భద్రతా బలగాలు శుక్రవారం హతమార్చాయి. ఈ జిల్లాలోని మారుమూల గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కర్ తోయిబాకు చెందిన మిలిటెంట్లు ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 5 Jun 2009 | 1:06 pm

నేను లెస్బియన్‌ని కాదు...నీతూ

నీతూ చంద్ర పేరు ఎక్కడో విన్నట్టే ఉంది. అదేనండి ఈ మధ్య సంచలనం సృష్టించిన తెలుగు సినిమా శేఖర్ కమ్ముల నిర్మించి దర్శకత్వం వహించిన 'గోదావరి' చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా, సుమంత్ మరదలుగా నటించిన బాలీవుడ్ నటీమణి. గుర్తుకు వచ్చిందనుకుంటా...!
Source: Yahoo! Telugu: Entertainment | 5 Jun 2009 | 12:47 pm

"మౌనరాగం" షూటింగ్ ప్రారంభం

సాయిదేవ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై బెల్లంకొండ నిర్మిస్తోన్న తాజా చిత్రం "మౌనరాగం". రామానాయుడు స్టూడియోలో గురువారం ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. రాజకీయనాయకుడు వసంత్ కుమార్ దేవుని పటాలపై తొలి షాట్‌కు క్లాప్ ఇవ్వగా, ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల కెమేరా స్విచ్ఛాన్ చేశారు. ఈ చిత్రం ద్వారా విజయబాలాజీ దర్శకుడిగా పరిచయమం అవుతున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 5 Jun 2009 | 11:52 am

మహిళా బిల్లుకు సహకరిస్తాం: చిరంజీవి

చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించే మహిళా బిల్లుకు ప్రజారాజ్యం అన్ని రకాలుగా సహకరిస్తుందని ఆ పార్టీ అధినేత చిరంజీవి పేర్కొన్నారు. మిగిలిన పార్టీలకంటే తమ పార్టీలో మహిళలకు సముచితమైన స్థానం, ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని ఆయన తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 5 Jun 2009 | 9:39 am

సయీద్‌తో మదనీకి సంబంధాలు: చిదంబరం

ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన లష్కర్ తోయిబా కమాండర్ మహమ్మద్ ఒమర్ మదనీకి పాకిస్థాన్‌ కేంద్రంగా పని చేస్తున్న జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్‌కు సంబంధాలు ఉన్నట్టు కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం తెలిపారు. ఈ విషయాన్ని ఆయన శుక్రవారం మీడియా ముందు వెల్లడించారు.
Source: జాతీయ | 5 Jun 2009 | 9:39 am

అయేషా హత్య కేసు విచారణ 22కు వాయిదా

రాష్ట్రంలో కొద్ది నెలల క్రితం సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్య కేసు విచారణ ఈనెల 22కు వాయిదా పడింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సత్యంబాబును విజయవాడ మహిళా సెషన్స్ కోర్టుకు తరలించిన నేపథ్యంలో విచారణ ప్రారంభమైంది.
Source: ఏపీ న్యూస్ | 5 Jun 2009 | 8:50 am

దోడా జిల్లాలో ముగ్గురు మిలిటెంట్ల హతం

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని దోడా జిల్లాలో ముగ్గురు మిలిటెంట్లను భద్రతా బలగాలు శుక్రవారం హతమార్చాయి. ఈ జిల్లాలోని మారుమూల గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కర్ తోయిబాకు చెందిన మిలిటెంట్లు ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు వెల్లడించారు.
Source: జాతీయ | 5 Jun 2009 | 7:37 am

పర్యావరణ రక్షణకు కృషిచేద్దాం: ముఖ్యమంత్రి

పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా ప్రతిఒక్కరూ కృషి చేయాల్సి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తెలిపారు. పర్యావరణ పరిరక్షణ చేపట్టకపోతే జరిగే అనర్థాల గురించి ఈ సందర్భంగా ఆయన వివరించారు.
Source: ఏపీ న్యూస్ | 5 Jun 2009 | 7:36 am

మదనీ అరెస్టు: దక్షిణ భారతంలో అలెర్ట్

దక్షిణ భారతావనిలో పోలీసు యంత్రాంగాలను ఢిల్లీ పోలీసులు అప్రమత్తం చేశారు. ఈ ప్రాంతంలోని కీలక నగరాలపై తీవ్రవాదులు దాడులకు పాల్పడవచ్చని నిఘా సంస్థలు హెచ్చరించాయి. దీంతో దక్షిణ భారతంలో అలెర్ట్ ప్రకటించారు.
Source: జాతీయ | 5 Jun 2009 | 7:20 am

రేవతీపతి మృతికి అసెంబ్లీ ఘన నివాళి

ఎమ్మెల్యేగా ఎంపికై శాసనసభలో అడుగుపెట్టకుండానే మృతిచెందిన టెక్కలి కాంగ్రెస్ ఎమ్మెల్యే కొర్ల రేవతీపతి మృతికి శుక్రవారం శాసనసభ ఘన నివాళి అర్పించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని సభ్యులంతా బలపరిచారు.
Source: ఏపీ న్యూస్ | 5 Jun 2009 | 6:24 am

త్వరలోనే డీఎస్సీ నియామకాలు: మంత్రి

తాజాగా నిర్వహించిన డీఎస్సీ పరీక్షలకు సంబంధించి ఫలితాలను ఈ నెలాఖరులోగా విడుదల చేస్తామని పాఠశాల విద్యాశాఖమంత్రి డి. మాణిక్యవరప్రసాద్ తెలిపారు. దీంతోపాటు అన్ని ప్రక్రియలను పూర్తిచేసి త్వరలోనే డీఎస్సీ నియామకాలను చేపడుతామని ఆయన పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 5 Jun 2009 | 5:25 am

జులై ఒకటిన రైల్వే బడ్జెట్: కేంద్ర వర్గాలు

కేంద్ర రైల్వే బడ్జెట్ వచ్చే నెల ఒకటో తేదీన లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే, 2009-10 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ జులై మూడో తేదీన సమర్పించే అవకాశాలు ఉన్నాయి. కాగా, ఆర్థిక సర్వే ఫలితాలను జులై రెండో తేదీన వెల్లడించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు గురువారం రాత్రి వెల్లడించాయి.
Source: జాతీయ | 5 Jun 2009 | 5:23 am

తీవ్రవాదులని అనుమానం: 5గురి అరెస్టు

తీవ్రవాదుల కన్ను రాష్ట్రంపై పడిందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు గాలింపు చర్యలను తీవ్రతరం చేశారు. ఇందులో భాగంగా పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఇచ్ఛాపురంలో ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 5 Jun 2009 | 5:13 am

ద్విపాత్రాభినయం చేసిన కారత్: అమర్ సింగ్

గత యూపీఏ ప్రభుత్వ హయాంలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ ద్విపాత్రాభినయం చేశారని సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఫలితంగా ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారో తెలియదన్నారు.
Source: జాతీయ | 5 Jun 2009 | 5:12 am

కేజీ రూ.3లకే ఇవ్వడం సులభసాధ్యం కాదు

కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ కూటమి ప్రభుత్వం దేశంలోని పేదలకు నెలకు 25 కేజీల బియ్యం, గోధుమలను కేజీ రూ.3లకే ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అయితే 25 కేజీల బియ్యం, గోధుమలను కేజీ రూ.3లకే అందించడం సులభసాధ్యం కాదని కేంద్ర ఆహార, వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ గురువారం అభిప్రాయపడ్డారు.
Source: జాతీయ | 5 Jun 2009 | 3:40 am

హెచ్చరిక న్యాయసమ్మతం కాదు: చిదంబరం

భారత్‌కు తీవ్రవాదం నుంచి పెనుముప్పు పొంచి ఉందని, అందువలన భారత్‌లో ఉండే, ఈ దేశానికి వెళ్లాలనుకునే అమెరికా పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అమెరికా ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు అమెరికా దౌత్య కార్యాలయ వెబ్‌సైట్‌లో ఆ దేశ ప్రభుత్వం ఓ అత్యవసర హెచ్చరిక సందేశాన్ని ఉంచింది.
Source: జాతీయ | 5 Jun 2009 | 3:40 am

ఢిల్లీలో లష్కరే తీవ్రవాది అరెస్టు

దేశంలో తీవ్రవాదులతో భయం పొంచి ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించడంతో దేశవ్యాప్తంగా భద్రతాధికారులు పటిష్టమైన భద్రతను చేపట్టారు. దీంతో దక్షిణ భారతదేశంలో తీవ్రవాదుల భయంతో ప్రధాన పట్టణాలలో పోలీసులు భద్రతను మరింత పటిష్టం చేసి తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఓ తీవ్రవాదిని పోలీసులు అరెస్టు చేశారు
Source: జాతీయ | 4 Jun 2009 | 4:07 pm

కొత్తదనంలేని రాష్ట్రపతి ప్రసంగం: భాజపా

ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేసిన ప్రసంగంలో ఎలాంటి కొత్త అంశాలు చోటు చేసుకోలేదని, ఈ ప్రసంగం తీవ్ర నిరాశకు గురిచేసిందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీ అభిప్రాయపడ్డారు.
Source: జాతీయ | 4 Jun 2009 | 1:35 pm

మహిళా బిల్లుకు శివసేన-జేడీయు వ్యతిరేకం!

దేశ చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రధాన లక్ష్యంతో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రతిపక్ష పార్టీలైన శివసేన, జనతాదళ్ యు పార్టీలు వ్యతిరేకించనున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీలకు చెందిన నేతలు సూచన ప్రాయంగా వెల్లడించాయి.
Source: జాతీయ | 4 Jun 2009 | 12:27 pm

హైదరాబాద్‌లో భద్రత కట్టుదిట్టం

హైదరాబాద్‌లో పోలీసులు గురువారం భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. దక్షిణ భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ఎక్కడైనా తీవ్రవాదులు విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ భద్రతా చర్యలు చేపట్టడం గమనార్హం.
Source: ఏపీ న్యూస్ | 4 Jun 2009 | 12:24 pm

పనితీరుతోనే సమాధానం చెప్తా: స్పీకర్

ప్రతిపక్షాలకు తనపై ఉన్న అభ్యంతరాలకు తన పనితీరుతోనే సమాధానం చెబుతానని అసెంబ్లీ స్పీకర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. అదేసమయంలో సభ సమావేశం సమయంలో ప్రతి ఒక్కరికీ మాట్లాడే అవకాశం కలగజేస్తానని ఈ విషయంలో మహిళలకు ప్రత్యేక అవకాశం కల్పిస్తానని ఆయన పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 4 Jun 2009 | 11:24 am

రాజధానిలో మరో స్వైన్‌ఫ్లూ కేసు

రాష్ట్రంలో తాజాగా మరో స్వైన్‌ఫ్లూ కేసు నమోదైంది. ఇప్పటికే రాష్ట్రంలో రెండు స్వైన్‌ఫ్లూ కేసులు అధికారికంగా నమోదైన తరుణంలో తాజాగా మరో కేసు నమోదు కావడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల అమెరికా నుంచి వచ్చిన 28 ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు నిర్వహించిన వైద్యసేవల్లో అతనికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్టు తేలిందని అధికారులు ప్రకటించారు.
Source: ఏపీ న్యూస్ | 4 Jun 2009 | 10:22 am