నాగ్ చేతుల మీదుగా "కరెంట్" టైటిల్ సాంగ్ విడుదల

"కాళిదాసు" ఫేమ్ సుశాంత్ హీరోగా నటిస్తోన్న "కరెంట్" చిత్రం టైటిల్ సాంగ్‌ను అక్కినేని నాగార్జున శుక్రవారం విడుదల చేశారు. సుశాంత్ నటించిన ఈ సినిమాలోని నాలుగు పాటలను రొటీన్‌కు భిన్నంగా విడుదల చేయించారు. దర్శకులు శేఖర్ కమ్ముల, సుకుమార్, పూరీ జగన్నాథ్, శ్రీనువైట్ల ఇంటికి వెళ్ళి ఒక్కొక్కరిచేత ఒక్కో పాటను విడుదల చేయించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 29 May 2009 | 5:53 pm

హైదరాబాద్‌లో "ఆంజనేయులు"

రవితేజ, నయనతార నటిస్తోన్న "ఆంజనేయులు" చిత్రం షూటింగ్ ఈ నెల 30 నుంచి హైదరాబాదులో జరుగుతోంది. ఇటీవలే యూరప్‌లోని అందమైన లొకేషన్లలో పాటల చిత్రీకరణ పూర్తి చేసుకుని ఆంజనేయులు తిరిగొచ్చాడు. ఈ సినిమా గురించి నిర్మాత గణేష్ బాబు మాట్లాడుతూ.. ఆమ్‌స్టర్ డామ్, జర్మనీ, ఆస్ట్రియాలలోని విభిన్న లొకేషన్లలో రవితేజ, నయనతారలపై రెండు పాటల్ని చిత్రీకరించామన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 29 May 2009 | 5:38 pm

విలన్‌గా స్లమ్‌డాగ్ హీరో దేవ్‌పటేల్!

ఎనిమిది ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రంలో హీరోగా నటించిన దేవ్‌పటేల్ విలన్‌గా అవతారమెత్తనున్నాడు. స్లమ్‌డాగ్‌గా కథానాయకుడిగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న పటేల్, "ది లాస్ట్ ఎయిర్‌బెండర్" అనే హాలీవుడ్ సినిమాలో విలన్‌‌గా కనిపించనున్నాడు. మురికివాడలో పుట్టిన ఓ బాలుడు ధనవంతుడయ్యే కథాంశంతో రూపుదిద్దుకున్న స్లమ్‌డాగ్‌లో, ఫ్రిడా పింటోతో రొమాన్స్ చేసిన దేవ్ పటేల్‌, విలన్ పాత్రను కూడా ఛాలెంజ్‌గా తీసుకుని చేస్తాడని సినీ పండితులు భావిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 29 May 2009 | 5:21 pm

ఓబీసీ బిల్లుపై దృష్టి సారిస్తాం: కపిల్ సిబాల్

ప్రైవేట్, అన్ ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఓబీసీ విద్యార్థులకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై దృష్టిసారిస్తామని కేంద్ర మానవ వనరుల శాఖామంత్రి కపిల్ సిబాల్ అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఓబీసీ విద్యార్థులకు 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు గుర్తు చేశారు.
Source: Yahoo! Telugu: News | 29 May 2009 | 5:15 pm

వారాంతంలో లాభాలతో ముగిసిన సెన్సెక్స్

స్టాక్ మార్కెట్ వారాంతంలో లాభాలతో ముగియడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 329 పాయింట్లు పుంజుకుని 14,625 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 119 పాయింట్లు లాభపడి 4,449 వద్ద నిలిచింది. సెన్సెక్స్ 2.3 శాతం, నిఫ్టీ 2.58 శాతం చొప్పున వృద్ధి చెందాయి. ఈ రోజు ఉదయం 24 పాయింట్లు లాభంతో 14,320 వద్ద స్టాక్ మార్కెట్ ప్రారంభమైంది.
Source: Yahoo! Telugu: News | 29 May 2009 | 5:09 pm

పత్తాలేని కేసీఆర్: అయోమయంలో నేతలు!

తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతిపక్ష నేతలకే కాకుండా సొంత పార్టీ నేతలకు సైతం షాక్ ఇవ్వడం పరిపాటి. ఆయన ఎపుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ అంతుచిక్కదు.
Source: Yahoo! Telugu: News | 29 May 2009 | 4:58 pm

దీపికా పదుకునే చాలా హాటు గురూ...

ఈ భూమ్మీద ఉన్న ఒకే ఒక్క అందగత్తె మోడ్రన్ డ్రీమ్ గాళ్ దీపికా పదుకునే. ఈ మాట అన్నది మన దేశంలోని ఏ సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి కాదు. ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు రాబ్ కోహెన్ అలా సెలవిచ్చారు. అతనికి దీపికా అందాన్ని ఎంతసేపైనా అలానే చూడాలనిపిస్తుందట. ఆమె ఒప్పుకుంటే ఒక గంటపాటు అలా చూస్తూ కూచోవాలనిపిస్తుందని తన సన్నిహితులతో చెప్పాడట. అంత అందమైన అమ్మాయిని ఇంతవరకూ తాను చూడలేదనీ, ఆ మాటకొస్తే అసలు ఈ భూమ్మీదే దీపికలాంటి అందాల రాశి లేదని అదేపనిగా చెపుతున్నాడట. అంతటితో ఆపేస్తే ఫర్వాలేదు. దీపికా అందం ముందు హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీ దిగదుడుపే అని కితాబిస్తున్నాడట.
Source: Yahoo! Telugu: Entertainment | 29 May 2009 | 4:01 pm

ముస్లిం దేశాలతో మెరుగైన సంబంధాలు: ఒబామా

ప్రపంచంలోని ముస్లిం దేశాలతో మరింత మెరుగైన సంబంధాలను కొనసాగిస్తామని అమెరికా ప్రకటించింది. ఆయా దేశాధినేతలతో కలిసి తమ దేశం పని చేసేందుకు సిద్ధంగా ఉందని అమెరికా తెలిపింది
Source: Yahoo! Telugu: News | 29 May 2009 | 3:54 pm

విడ్డూరంగా ఉన్న తెదేపా విమర్శలు: చిరంజీవి

ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిని మూటగట్టుకున్న ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, ఓటమిని అంగీకరించక విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి వ్యాఖ్యానించారు. తన సొంత నియోజకవర్గం తిరుపతిలో పర్యటిస్తున్న ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
Source: Yahoo! Telugu: News | 29 May 2009 | 3:27 pm

దేశీయ మార్కెట్లోకి కురారే

రసాయనాల ఉత్పత్తి కర్మాగారమైన జపాన్‌కు చెందిన కురారే కంపెనీ భారతదేశంలోని మార్కెట్లోకి ప్రవేశించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆ సంస్థ 4 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తమ కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 29 May 2009 | 3:26 pm

లాభార్జనపై ఆసక్తి: అయినా లాభాల్లో సెన్సెక్స్

ఇన్వెస్టర్లు లాభార్జనపై ఆసక్తిని కనబరిచినప్పటికీ.. స్టాక్ మార్కెట్ లాభాల బాటలోనే పయనిస్తోంది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 396 పాయింట్లు పుంజుకుని 14,692 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 129 పాయింట్లు లాభపడి 4,466 వద్ద పయనిస్తోంది. ఇప్పటి వరకు మొత్తం 2,835 కంపెనీల వాటాలు ట్రేడ్ అవగా, 2,200 కంపెనీల వాటాలు లాభాల్లో ఉన్నాయి.
Source: Yahoo! Telugu: News | 29 May 2009 | 3:19 pm

కోమాలో ఉన్న అమ్మాయి పాట పాడింది...!

గత ఐదు రోజులుగా కోమాలోనున్న అమ్మాయి తనకిష్టమైన పాట మమ్మా మియాకు చెందిన ఏబీబీఏ పాటను పాడుతూ... స్పృహలోకి వచ్చింది. దీంతో అక్కడున్న వారు ఆశ్చర్యానికి గురయ్యారు.
Source: Yahoo! Telugu: News | 29 May 2009 | 2:35 pm

స్టాలిన్‌కు ఉపముఖ్యమంత్రి పదవి

తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి తన కుమారుడు స్టాలిన్‌కు శుక్రవారం ఉపముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారు. కరుణానిధి సిఫార్సు మేరకు గవర్నరు ఎస్ఎస్ బర్నాలా ఈ విషయాన్ని శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, అంతర్గత పరిపాలన శాఖలను నిర్వహిస్తున్న స్టాలిన్‌కు ఉపముఖ్యమంత్రి పదవి ఖాయమవడంతో భవిష్యత్తులో డీఎంకే తరపున ముఖ్యమంత్రిగా ఆయనే పోటీలో ఉంటారని స్పష్టమైంది.
Source: Yahoo! Telugu: News | 29 May 2009 | 2:25 pm

లాభాల్లో సెన్సెక్స్: ఏసీసీ 9 శాతం వృద్ధి

స్టాక్ మార్కెట్ లాభాలతో మరింతగా పుంజుకుంటుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 375 పాయింట్లు బలపడి 14,671 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 129 పాయింట్లు పెరిగి 4,466 వద్ద పయనిస్తోంది. ఇప్పటి వరకు మొత్తం 2,785 కంపెనీల వాటాలు ట్రేడ్ అవగా, 2,210 కంపెనీల వాటాలు లాభాల్లో ఉన్నాయి.
Source: Yahoo! Telugu: News | 29 May 2009 | 2:09 pm

ఆస్పత్రి పాలైన ఆసీస్ నటి సోపీ మాంక్

ఆస్ట్రేలియా నటి సోపి మాంక్ ఆస్పత్రి పాలైంది. సోపి మాంక్ నడిపిన కారు ప్రమాదానికి గురికావడంతో మాంక్ గాయపడిందని న్యూస్. కామ్ తెలిపింది. దీంతో చికిత్స నిమిత్తం సోపీను ఆస్పత్రికి తరలించారు. 29 ఏళ్ల ఈ ఆసీస్ నటి సోపీ నడుపుతున్న కారును, ఎదురుగా వచ్చిన కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని టిఎంజెడ్.కామ్ వెల్లడించింది. సోపీ కారును ఢీకొన్న కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 29 May 2009 | 1:58 pm

అయ్యో ఆర్తీ.. అప్పుడే విడాకులా...!?

తెలుగు సినీ వెండితెరపై "నువ్వు నాకు నచ్చావ్" అంటూ వెంకీ వెంటబడి వేధించి పెళ్లి చేసుకున్న తెల్లపిల్ల ఆర్తీ అగర్వాల్ నిజజీవితంలో తన భర్తతో విడాకులు తీసుకున్నదన్న వార్త టాలీవుడ్‌లో సుడిగాలిలో తిరుగుతోంది. ఈ వార్త విన్న అగర్వాల్ పాత స్నేహితులు "అయ్యో పాపం ఆర్తీకి ఎంత కష్టం వచ్చిందీ..." అని నిట్టూర్పులు విడిచి వెళుతున్నారట. ఆర్తి దీనస్థితిని తెలుసుకున్న కొందరు పాత స్నేహితులు ఇంటికొచ్చి మరీ పలుకరించి వెళుతున్నారట. వీరిలో మగ స్నేహితులు కూడా ఉన్నారని టాలీవుడ్ సినీజనం ఒహటే చెవులు కొరుక్కుంటున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 29 May 2009 | 1:34 pm

ఏంజెలీనా జోలీ హ్యాపీగా లేదట!

హాలీవుడ్ అందాల రాశి ఏంజెలీనా జోలీ ఈ మధ్య హ్యాపీగా లేదట. తన భర్త బ్రాడ్‌పిట్, జెన్నీఫర్ ఆనిస్టన్‌తో క్లోజ్‌గా ఉండటం ఆమెను కలచివేస్తుందని హాలీవుడ్ సినీ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. మాజీ భార్య జెన్నీఫర్ ఆనిస్టన్‌తో బ్రాడ్‌పిట్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడని, ఆమెతో తిరిగి సంబంధాలను సజీవం చేసుకుంటున్నాడని ఏంజెలీనా జోలీకి తెలియరావడంతో అమ్మడు విచారంలో మునిగిపోయిందట.
Source: Yahoo! Telugu: Entertainment | 29 May 2009 | 1:31 pm

కొరియోగ్రాఫర్‌గా నృత్యతార శోభన!

నాట్యంలోనూ, నటనలోనూ ప్రసిద్ధి చెందిన లలిత, పద్మిని, రాగిణిల వలె రాణించిన అందాల తార శోభన కొరియోగ్రాఫర్‌గా అవతారమెత్తనుంది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహించే ఈ సినిమాలో మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్‌కు శోభన డ్యాన్స్ నేర్పిస్తుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. నాగార్జున "విక్రమ్‌" సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన శోభన, నటన, నాట్యంతో ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
Source: Yahoo! Telugu: Entertainment | 29 May 2009 | 1:11 pm

ఓబీసీ బిల్లుపై దృష్టి సారిస్తాం: కపిల్ సిబాల్

ప్రైవేట్, అన్ ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఓబీసీ విద్యార్థులకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై దృష్టిసారిస్తామని కేంద్ర మానవ వనరుల శాఖామంత్రి కపిల్ సిబాల్ అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఓబీసీ విద్యార్థులకు 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు గుర్తు చేశారు.
Source: జాతీయ | 29 May 2009 | 11:46 am

పత్తాలేని కేసీఆర్: అయోమయంలో నేతలు!

తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతిపక్ష నేతలకే కాకుండా సొంత పార్టీ నేతలకు సైతం షాక్ ఇవ్వడం పరిపాటి. ఆయన ఎపుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ అంతుచిక్కదు.
Source: ఏపీ న్యూస్ | 29 May 2009 | 11:31 am

పాము బుసతో సొమ్మసిల్లిన నవదీప్!

గౌతమ్ ఎస్.ఎస్.సి, చందమామలో హీరోగా నటించిన నవదీప్.. పాము బుసకొట్టడంతో సొమ్మసిల్లి పడిపోయాడట. తాజాగా నవదీప్ నటించిన "యాగం" సినిమా షూటింగ్ బ్యాంకాక్‌లో జరిగింది. అక్కడ పామును ముద్దుపెట్టుకునే సన్నివేశంలో నవదీప్ నటించాల్సి ఉంది. రిస్క్ అయినా ఫర్వాలేదని ఒరిజినల్‌గా చేయాలని భావించి నవదీప్ సాహసం చేశాడు. ఎదురుగా లైట్లు, యూనిట్ జనమంతా ఉండేసరికి ఆ పాము కాస్త ఖంగారుపడి, ఓ జంప్‌చేసి నవదీప్ కుడిభుజం పైకి దూకింది. దీనికి తోడు బుస్ అని శబ్దం చేస్తూ నవదీప్‌పై ఎగిరిపడటంతో యూత్‌హీరో భయపడి కళ్ళు తిరిగి పడిపోయాడట.
Source: Yahoo! Telugu: Entertainment | 29 May 2009 | 10:59 am

విడ్డూరంగా ఉన్న తెదేపా విమర్శలు: చిరంజీవి

ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిని మూటగట్టుకున్న ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, ఓటమిని అంగీకరించక విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి వ్యాఖ్యానించారు. తన సొంత నియోజకవర్గం తిరుపతిలో పర్యటిస్తున్న ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
Source: ఏపీ న్యూస్ | 29 May 2009 | 9:59 am

స్టాలిన్‌కు ఉపముఖ్యమంత్రి పదవి

తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి తన కుమారుడు స్టాలిన్‌కు శుక్రవారం ఉపముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారు. కరుణానిధి సిఫార్సు మేరకు గవర్నరు ఎస్ఎస్ బర్నాలా ఈ విషయాన్ని శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, అంతర్గత పరిపాలన శాఖలను నిర్వహిస్తున్న స్టాలిన్‌కు ఉపముఖ్యమంత్రి పదవి ఖాయమవడంతో భవిష్యత్తులో డీఎంకే తరపున ముఖ్యమంత్రిగా ఆయనే పోటీలో ఉంటారని స్పష్టమైంది.
Source: జాతీయ | 29 May 2009 | 8:56 am

ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన చిన్నమ్మ

నందమూరి తారక రామారావు కుమార్తె, విశాఖపట్నం ఎమ్.పి., కేంద్ర సహాయ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని ఎన్‌టీఆర్ ఘాట్‌ను సందర్శించి స్వర్గీయ ఎన్‌టీ రామారావుకు నివాళులర్పించారు.
Source: ఏపీ న్యూస్ | 29 May 2009 | 8:39 am

మన్మోహన్ కొలువులో 9 మంది నేరచరితులు

కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో తొమ్మిది మంది మంత్రులు నేర చరిత్రను కలిగి ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది కాంగ్రెస్‌కు చెందిన వారు కాగా, మిత్రపక్షాలైన తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే పార్టీలకు చెందిన ఒక్కో సభ్యుడు ఉన్నారు.
Source: జాతీయ | 29 May 2009 | 8:08 am

అయ్యో ఆర్తీ.. అప్పుడే విడాకులా...!?

తెలుగు సినీ వెండితెరపై "నువ్వు నాకు నచ్చావ్" అంటూ వెంకీ వెంటబడి వేధించి పెళ్లి చేసుకున్న తెల్లపిల్ల ఆర్తీ అగర్వాల్ నిజజీవితంలో తన భర్తతో విడాకులు తీసుకున్నదన్న వార్త టాలీవుడ్‌లో సుడిగాలిలో తిరుగుతోంది. ఈ వార్త విన్న అగర్వాల్ పాత స్నేహితులు "అయ్యో పాపం ఆర్తీకి ఎంత కష్టం వచ్చిందీ..."
Source: వినోదం | 29 May 2009 | 8:05 am

మన్మోహన్ టీమ్‌లో 47మంది కోటీశ్వరులు

గురువారం నూతనంగా మన్మోహన్‌సింగ్ సర్కారులో మంత్రి పదవులను స్వీకరించిన 79 మంది మంత్రులలో 47 మంది కోటీశ్వరులు ఉన్నారు. 90 కోట్ల రూపాయల ఆస్తులతో ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ అగ్ర స్థానాన్ని ఆక్రమించారు. మరో విశేషమేమిటంటే ఎక్కువమంది కోటీశ్వరులను కలిగిన పార్టీ కాంగ్రెస్ కావడం. ఆ పార్టీకి చెందిన 38 మంది మంత్రులు కోటీశ్వరులై ఉన్నారు.
Source: జాతీయ | 29 May 2009 | 7:05 am

డీఎస్సీ రాత పరీక్షలు ప్రారంభం

రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ రాత పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. శుక్ర, శని, ఆదివారాల్లో జరిగే ఈ పరీక్షలు రాసేందుకు అన్ని కేటగిరీలలో కలిపి సుమారు 5.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,693 కేంద్రాల్లో డీఎస్సీ పరీక్షలు జరుగుతున్నాయి.
Source: ఏపీ న్యూస్ | 29 May 2009 | 6:20 am

రూ.వెయ్యి కోట్ల సాయం కోరిన బుద్ధదేవ్

ఐలా తుఫాను ధాటికి అతలాకుతలమైన బెంగాల్‌లో వరద బాధితులకు సాయం చేసేందుకు, పునరావాస చర్యల కోసం వెయ్యి కోట్ల రూపాయల నిధులను సాయం చేయాల్సిందిగా పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కోరారు. ఐలా తుఫాను ప్రళయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Source: జాతీయ | 29 May 2009 | 6:03 am

పొల్యూషన్ కంట్రోల్ బోర్డు

"మీ ఊపిరితిత్తులు, కాలేయం బాగా చెడిపోయాయి... మీరే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు...?" అడిగాడు డాక్టర్ "పొల్యూషన్ కంట్రోల్...
Source: వినోదం | 29 May 2009 | 5:06 am

రెండు రాత్రులు జాగరణ

"ఏంటి సునీత... అంత నీరసంగా ఉన్నావ్..?" అడిగింది మీరా "మా వారికి టైఫాయిడ్ కదా.. రెండు రాత్రులు జాగరణ..
Source: వినోదం | 29 May 2009 | 5:05 am

సమీక్షకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు: లాలూ

ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ ఘోర పరాజయం చవిచూడటానికి గల కారణాలపై సమీక్ష జరిపేందుకు కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్ ప్రసాద్ నేతృత్వంలో 21 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తెలిపారు.
Source: జాతీయ | 29 May 2009 | 3:59 am

ముగిసిన పదవుల పందారం: ఆజాద్‌కు ఆరోగ్యం

కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన మన్మోహన్ సింగ్ సర్కారులో మంత్రులకు శాఖల కేటాయింపు ప్రక్రియ గురువారం రాత్రితో పూర్తయింది. కేంద్ర ఆరోగ్య శాఖామంత్రిగా గులాం నబీ ఆజాద్‌ను నియమించారు. వాణిజ్య మంత్రిగా ఉన్న కమల్‌నాథ్‌కు ప్రధాని షాక్ ఇచ్చారు.
Source: జాతీయ | 29 May 2009 | 3:46 am

"రైడ్" సినిమా ట్రైలర్స్ విడుదల

నాని, తనీష్ హీరోలుగా బెల్లంకొండ సురేష్ నిర్మిస్తోన్న చిత్రం "రైడ్". ఈ సినిమా ట్రైలర్స్‌ను గురువారం విడుదల చేశారు. నందమూరి తారకరామారావు 87వ జన్మదినం సందర్భంగా "రైడ్" చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నామని, కానీ కొన్ని అనివార్యకారణాల వల్ల అది కుదరలేదని నిర్మాత వెల్లడించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 28 May 2009 | 6:32 pm

కేబినెట్ విస్తరణ: ఆంధ్రకు మొండిచేయి

కేంద్ర మంత్రివర్గ విస్తరణలో రాష్ట్రానికి మరోమారు చుక్కెదురైంది. కేవలం 27 మంది ఎంపీలు కలిగిన తమిళనాడు రాష్ట్రానికి మాత్రం పది మంత్రి పదవులు దక్కించుకుని తమ పట్టు నిరూపించుకుంది.
Source: ఏపీ న్యూస్ | 28 May 2009 | 2:41 pm

అయ్యో శోభా.. ఇలా మాట్లాడితే ఎలా!?

సబితా ఇంద్రారెడ్డి హోం మంత్రి అవడం పట్ల అందరూ హర్హం వ్యక్తం చేశారు. అయితే ప్రజారాజ్యం మహిళా నేత శోభా రాణి మాత్రం సబితారెడ్డి హోంమంత్రి పదవికి తగినవారు కాదని పాత్రికేయుల సమావేశంలో రెచ్చిపోయారు. ప్రజారాజ్యంలోని తోటి సభ్యులు జరిగిన విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి దృష్టికి తీసుకుని వెళ్లారు. దీంతో ఆయన శోభారాణిపై సీరియస్ అయ్యారట. ఎక్కడ ఏది మాట్లాడాలో కాస్త చూసుకుని మాట్లాడాలని సలహా ఇచ్చినట్లు సమాచారం.
Source: ఏపీ న్యూస్ | 28 May 2009 | 2:23 pm

జూన్ 3న కొలువుదీరనున్న కొత్త అసెంబ్లీ

రాష్ట్రంలో కొత్త శాసనసభ వచ్చే నెల మూడో తేదీన కొలువుదీరనుంది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ ఎన్డీ.తివారీ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన అసెంబ్లీ జూన్ 3వ తేదీన భేటీ అవుతుందని ఆయన తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 28 May 2009 | 2:10 pm

మంత్రి కంటే పార్టీ పదవే ముద్దు: రాహుల్

తనకు మంత్రి పదవి కంటే పార్టీ పదవులే ముద్దు అని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ యువనేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. తనకు తెలిసి ఏకకాలంలో రెండు పనులు చేయలేమని, అందుకే, మంత్రి 0పదవులకు దూరంగా ఉన్నట్టు చెప్పారు.
Source: జాతీయ | 28 May 2009 | 1:59 pm

జనజీవన స్రవంతిలో కలవండి: హోంమంత్రి

మావోయిస్టులు హింసను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని నూతన హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో ఎన్‌ఎస్‌జి దళాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 28 May 2009 | 1:43 pm

"పిస్తా"ను ట్రైలర్లో వీక్షించండి

పందెంకోడి, పొగరు, భరణి, భయ్యా, సెల్యూట్ వంటి సూపర్ హిట్ చిత్రాల ద్వారా మాస్ హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను ఏర్పరుచుకున్న విశాల్ తాజాగా "పిస్తా"గా వస్తున్నాడు.
Source: వినోదం | 28 May 2009 | 1:21 pm

"ఒక అమ్మాయి ఒక అబ్బాయి" ట్రైలర్

"అశోకచక్రం" నిర్మాత అలెక్స్ తాజాగా "ఒక అమ్మాయి ఒక అబ్బాయి" అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాన్సీ ఆర్ట్స్ క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి "తిందామా... పడుకున్నామా... తెల్లారిందా..." దర్శకుడు రామ్‌కుమార్ నేతృత్వం వహిస్తున్నారు.
Source: వినోదం | 28 May 2009 | 12:27 pm

"నచ్చావ్ అల్లుడు" ట్రైలర్‌‌ను తిలకించండి

అలీ, సుప్రేన, రవిబాబు, మలిష్క ప్రధాన పాత్రధారులుగా నటిస్తోన్న చిత్రం "నచ్చావ్ అల్లుడు". ఈ చిత్రానికి ఎం.ఎస్. శ్రీ చంద్ దర్శకత్వం వహిస్తున్నారు. సాయిదుర్గా ఆర్ట్స్ పతాకంపై ఉష సింగంశెట్టి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Source: వినోదం | 28 May 2009 | 12:22 pm

"రాజావారి చేపల చెరువు" ట్రైలర్

రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి నటిస్తూ రూపొందించిన చిత్రం 'రాజా వారి చేపల చెరువు'. ఈ సినిమా ఇటీవలే విడుదలై థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది. లక్ష్మీగణపతి ఫిలిమ్స్‌ పతాకంపై సుబ్రమణ్యం, బి. రూపేష్‌. వై. ఈ చిత్రాన్ని నిర్మించారు.
Source: వినోదం | 28 May 2009 | 12:20 pm

ప్రకృతి ఒడిలో "రంగనతిట్టు పక్షి ధామం"

అంటార్కిటికా, ఉత్తర అమెరికా, చైనా, సైబీరియా, నైజీరియాల్లాంటి సుదూర ప్రాంతాల నుంచి మే-అక్టోబర్ మాసాల మధ్య అతిథులుగా విచ్చేసే విగంహాలకు కొలువైన ప్రాంతమే రంగనతిట్టు పక్షి విహార కేంద్రం. మాండ్య జిల్లాలోని కావేరీ నదీ మధ్యభాగంలో, 57 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ కేంద్రం....
Source: వినోదం | 28 May 2009 | 12:20 pm

ముమైత్ "టార్గెట్" ట్రైలర్ మీ కోసం..

మైసమ్మ, పున్నమినాగు, మంగతాయారు టిఫిన్ సెంటర్, భజంత్రీలు వంటి సినిమాల తర్వాత ముమైత్ గ్లామర్‌తో సినిమా మొత్తాన్ని నడిపించాలనుకునే దర్శక, నిర్మాతల ఆలోచనలకు "టార్గెట్" సినిమా గండికొట్టింది. మరీ పాత కాలం నాటి కథను తీసుకోవడం, కథాగమనంలో ఆసక్తి లేకపోవడంతో ముమైత్ టార్గెట్ సినిమా ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేకపోతుందనే చెప్పాలి.
Source: వినోదం | 28 May 2009 | 12:16 pm