'రాజు మహారాజు' ఆడియో ఆవిష్కరణ

శర్వానంద్ హీరోగా మోహన్ బాబు, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం "రాజు మహారాజు". భానుశంకర్ దర్శకత్వంలో పత్తికొండ నిర్మిస్తోన్న ఈ చిత్రం ఆడియో విడుదల బుధవారం రాత్రి హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నటి జయసుధ ఆడియోను ఆవిష్కరించగా, సీడీని దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 28 May 2009 | 6:05 pm

భారత్‌తో అణు ఒప్పందానికి చేరువలో కెనడా

భారత్‌‍తో అణు ఒప్పందంపై సంతకం చేసేందుకు కెనడా అతి సమీపంలో ఉందని ఆ దేశ అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రి స్టాక్‌వెల్ డే తెలిపారు
Source: Yahoo! Telugu: News | 28 May 2009 | 5:59 pm

లాభాలతో ముగిసిన సెన్సెక్స్: రాన్‌బాక్సీ వృద్ధి

స్టాక్ మార్కెట్ గురువారం లాభాలతో ముగియడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 186 పాయింట్లు పుంజుకుని 14,296 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 61 పాయింట్లు బలపడి 4,337 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 1.32 శాతం, నిఫ్టీ 1.43 శాతం చొప్పున వృద్ధి చెందాయి.
Source: Yahoo! Telugu: News | 28 May 2009 | 5:38 pm

"ఒక అమ్మాయి ఒక అబ్బాయి" ట్రైలర్

"అశోకచక్రం" నిర్మాత అలెక్స్ తాజాగా "ఒక అమ్మాయి ఒక అబ్బాయి" అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాన్సీ ఆర్ట్స్ క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి "తిందామా... పడుకున్నామా... తెల్లారిందా..." దర్శకుడు రామ్‌కుమార్ నేతృత్వం వహిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 28 May 2009 | 5:34 pm

"నచ్చావ్ అల్లుడు" ట్రైలర్‌‌ను తిలకించండి

అలీ, సుప్రేన, రవిబాబు, మలిష్క ప్రధాన పాత్రధారులుగా నటిస్తోన్న చిత్రం "నచ్చావ్ అల్లుడు". ఈ చిత్రానికి ఎం.ఎస్. శ్రీ చంద్ దర్శకత్వం వహిస్తున్నారు. సాయిదుర్గా ఆర్ట్స్ పతాకంపై ఉష సింగంశెట్టి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 28 May 2009 | 5:31 pm

"రాజావారి చేపల చెరువు" ట్రైలర్

రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి నటిస్తూ రూపొందించిన చిత్రం 'రాజా వారి చేపల చెరువు'. ఈ సినిమా ఇటీవలే విడుదలై థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది. లక్ష్మీగణపతి ఫిలిమ్స్‌ పతాకంపై సుబ్రమణ్యం, బి. రూపేష్‌. వై. ఈ చిత్రాన్ని నిర్మించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 28 May 2009 | 5:29 pm

ముమైత్ "టార్గెట్" ట్రైలర్ మీ కోసం..

మైసమ్మ, పున్నమినాగు, మంగతాయారు టిఫిన్ సెంటర్, భజంత్రీలు వంటి సినిమాల తర్వాత ముమైత్ గ్లామర్‌తో సినిమా మొత్తాన్ని నడిపించాలనుకునే దర్శక, నిర్మాతల ఆలోచనలకు "టార్గెట్" సినిమా గండికొట్టింది. మరీ పాత కాలం నాటి కథను తీసుకోవడం, కథాగమనంలో ఆసక్తి లేకపోవడంతో ముమైత్ టార్గెట్ సినిమా ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేకపోతుందనే చెప్పాలి.
Source: Yahoo! Telugu: Entertainment | 28 May 2009 | 5:27 pm

సత్యంపై ప్రత్యేక ఆడిటింగ్: ఆర్థికశాఖ

ప్రస్తుత సంవత్సరం జనవరి నెలలో జరిగిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో జరిగిన అవకతవకల లెక్కలలో ప్రత్యేక ఆడిటింగ్ జరిపే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది
Source: Yahoo! Telugu: News | 28 May 2009 | 5:08 pm

కేరళలో మరో పది శాఖలు: ఐఎఫ్‌సీఐ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత పారిశ్రామిక పెట్టుబడుల సంస్థ(ఐఎఫ్‌సీఐ) కేరళ రాష్ట్రంలో మరో పది శాఖలను ప్రారంభించనుంది
Source: Yahoo! Telugu: News | 28 May 2009 | 4:31 pm

పాకిస్థాన్ చేతిలో 60 అణు బాంబులు: అమెరికా

పాకిస్థాన్ వద్ద 60 అణ్వాయుధాలు ఉన్నట్లు అమెరికా కాంగ్రెస్ నివేదిక ఒకటి వెల్లడించింది. భారత్‌తో పోటీకి పాకిస్థాన్ అణు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చున్న సంగతి తెలిసిందే. భారత్‌తో కొన్ని దశాబ్దాల వైరానికి ప్రతీకగా పాకిస్థాన్ కూడా అణ్వాయుధ రాజ్యంగా అవతరించింది.
Source: Yahoo! Telugu: News | 28 May 2009 | 4:24 pm

భారత రాయబారిగా తిమోతి రోయెమర్

కాంగ్రెస్ మాజీ డెమొక్రట్ సభ్యుడు తిమోతి రోయెమర్‌ను భారతదేశంలో రాయబారిగా బాధ్యతలను నిర్వర్తించేందుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా నియమించారు.
Source: Yahoo! Telugu: News | 28 May 2009 | 4:09 pm

ఐఐపిహెచ్‌లో షార్ట్ టెర్మ్ సమ్మర్ కోర్సులు

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఐఐపీహెచ్)లో షార్ట్ టెర్మ్ సమ్మర్ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కేవలం 30 నుంచి 45 రోజుల వ్యవధి కలిగిన ఈ కోర్సుల్లో ఆర్ ప్రోగ్రామింగ్ ఫర్ రీసెర్చర్స్, డేటా మేనేజ్‌మెంట్ వర్క్ షాప్ (మైక్రోసాఫ్ట్ ఎక్సెల్), గ్రాంట్ ప్రపోజల్ రైటింగ్‌లు ఉన్నాయి.
Source: Yahoo! Telugu: News | 28 May 2009 | 4:08 pm

డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డులో ఉద్యోగాలు

నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డులో వివిధ రకాల ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ప్రాజెక్టు ఫైనాన్స్ అండ్ అప్రైజల్, ప్రొక్యూర్‌మెంట్ ఇన్ అగ్రికల్చర్ కమోడిటీస్, ప్రాజెక్టు ఇంజనీరింగ్, అనిమల్ బ్రీడింగ్, అనిమల్ న్యూట్రిషన్, హెచ్.ఆర్.డి...
Source: Yahoo! Telugu: News | 28 May 2009 | 4:06 pm

హాలీవుడ్ సినిమాలో సెక్సీతార బిపాసా..!

బాలీవుడ్ భామలకు ఈ మధ్య భలే హాలీవుడ్ ఛాన్సులు వచ్చేస్తున్నాయి. ఒకవైపు మల్లికా షెరావత్ తన అందచందాలను "హిస్" చిత్రంలో ఆరబోస్తుంటే.. దానికి తానేమాత్రం తీసిపోనంటూ బాలీవుడ్ గ్లామర్ గర్ల్ బిపాసా అంటోంది. తన వంపుసొంపులతో కుర్రకారును మత్తెక్కించే బిపాసా బసు, హాలీవుడ్ ప్రేక్షకులను కూడా అలరించేందుకు సిద్ధమౌతోంది. తాజాగా ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు బిల్లి జేన్ చిత్రంలో నటించే అవకాశం బిపాసా బసుకు దక్కిందట. డానియల్, తపన్ సహల రికమండేషన్‌లో అమ్మడుకు ఈ ఛాన్స్ లభించిందని సినీ వర్గాల్లో టాక్. ప్రేమకథా నేపథ్యంలో సాగే ఈ సినిమా షూటింగ్ జూలైలో ప్రారంభం కానుందని తెలిసింది.
Source: Yahoo! Telugu: Entertainment | 28 May 2009 | 4:05 pm

మార్కెట్లోకి కొత్త రకం ట్రక్కులు: టాటా

మోటార్ వాహనాల నిర్మాణ రంగంలో అగ్రగామిగానున్న టాటా మోటార్స్ అంతర్జాతీయ స్థాయిలో నూతన ట్రక్కుల నిర్మాణం చేపట్టినట్లు కంపెనీ ప్రకటించింది. కొత్తగా తయారు చేసే ట్రక్కులో 10నుంచి 75 టన్నుల బరువును తీసుకువెళ్ళగలిగేలా ట్రక్కులను రూపొందించామని ఇది పలువిధాలుగా ఉపయోగించుకోవచ్చని కంపెనీ ప్రకటించింది.
Source: Yahoo! Telugu: News | 28 May 2009 | 3:56 pm

లాభాల్లోనే పయనిస్తున్న స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం లాభాల్లోనే పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 147 పాయింట్లు పుంజుకుని 14,257 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 61 పాయింట్లు లాభపడి 4,337 వద్ద పయనిస్తోంది. ఇప్పటి వరకు మొత్తం 2,810 కంపెనీల వాటాలు ట్రేడ్ అవగా, 1,740 కంపెనీల వాటాలు లాభాల్లో ఉన్నాయి. బీఎస్ఈ మెటల్ ఇండెక్స్ 3 శాతం మేరకు వృద్ధి చెందింది.
Source: Yahoo! Telugu: News | 28 May 2009 | 3:49 pm

కిమ్ శర్మను వదల్లేని యువరాజ్ సింగ్

ఎడమచేతివాటం బ్యాట్సమన్ యువరాజ్ సింగ్ సెక్సిణి కిమ్ శర్మను వదల్లేక పోతున్నాడట. అయితే కిమ్ ఇజ్రాయిల్‌కి చెందిన యూది అనే కుర్రాణ్ణి వదల్లేకపోతున్నట్లు సమాచారం. "ఏ బాయ్‌ఫ్రెండ్ కావాలీ కిమ్" అని అడిగితే- కొన్ని సంబంధాలు ఎప్పటికీ చచ్చిపోవు. మదిలో ఏదో ఒక మూల ఆ సంబంధాల తాలూకు అనుభూతులు కదలాడుతూనే ఉంటాయి. మరిచిపోదామన్నా మర్చిపోలేరు. అలాగే యూవీ కూడా నన్ను మరువలేకపోతున్నాడు. అతను నాతో స్నేహం కొనసాగించాలనున్నప్పుడు నేనెలా కాదంటాను అని చిలుక పలుకులు పలుకుతోందట ఈ సుందరి.
Source: Yahoo! Telugu: Entertainment | 28 May 2009 | 1:13 pm

ఇదిగో వచ్చేస్తున్నా.. మీరేం భయపడకండి..!

ముంబైలోని మురికివాడల్లో ఉండే స్లమ్‌డాగ్ బాలనటులు అజారుద్ధీన్ (10), రుబీనా (9)ల బతుకులు దిగజారి పోతున్నాయనే వార్త ఆ చిత్ర దర్శకుడు డానీ బోయెల్‌ను కలచివేసింది. మీరేం భయపడకండి. త్వరలో భారత్ వచ్చి మీ కష్టాలు తీర్చుతానని డానీ బోయెల్ స్లమ్‌డాగ్ బాలనటులు అజారుద్ధీన్ , రుబీనాలకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఆస్కార్ అవార్డు గెలుచుకోవడంతో.. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది చెందిన స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రంలో రుబీనా, అజారుద్ధీన్‌‌లు బాలనటులుగా నటించిన సంగతి తెలిసిందే.
Source: Yahoo! Telugu: Entertainment | 28 May 2009 | 1:04 pm

కత్రీనాకు సల్మాన్ గుడ్‌బై..!?

ఆసియా అందగత్తె కత్రీనా కైఫ్‌కు ఆమె బాయ్ ఫ్రెండ్, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గుడ్‌బై చెప్పబోతున్నాడని సినీ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. సల్మాన్ ఖాన్‌తో గడిపేందుకు కత్రీనా కైఫ్ అంతగా ఆసక్తి చూపడం లేదని, అతడి సినీ కెరీర్‌కు సంబంధించిన ఐడియాలకు కూడా ఆమె ప్రాధాన్యత ఇవ్వడంలేదని తెలిసింది. ఏ విషయమైనా సల్మాన్‌తో చర్చించి నిర్ణయం తీసుకునే కత్రీనా ఈ మధ్య తనకు తోచినట్లు నడుచుకుంటుందని సమాచారం. దీంతో సల్మాన్ కత్రీనా జ్ఞాపకాలకు తొలగించాలని భావిస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్. అంతేగాకుండా.. కత్రీనాను పూర్తిగా మరిచిపోయేందుకు సల్మాన్ ప్రయత్నిస్తున్నట్లు సన్నిహితుల సమాచారం.
Source: Yahoo! Telugu: Entertainment | 28 May 2009 | 11:51 am

తెలుగు సినీ పరిశ్రమ ఆరాధ్యుడు: ఎన్టీఆర్

అశేష తెలుగు ప్రజల గుండెల్లో పదిలమైన స్థానాన్ని దక్కించుకున్న స్వర్గీయ నందమూరి తారక రామారావు జన్మించిన రోజు నేడు. ఆయన 1923 మే 28వ తేది, కృష్ణాజిల్లాలోని నిమ్మకూరు గ్రామంలో జన్మించారు. చిన్నతనం నుంచే రంగస్థలంపై మక్కువ కనబరిచిన ఎన్టీఆర్ అవకాశం దొరికనప్పుడల్లా చిన్న చిన్న పాత్రలు వేస్తుండేవారు. అయితే తన 20వ ఏటనే వివాహం కావడంతో కుటుంబ పోషణ నిమిత్తమై ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఆయన ఉద్యోగ వేటలో పడ్డారు. అయితే రంగస్థలంపై నాటకాలను వేయడంతోపాటు సినిమాల్లో నటించాలనే కోరిక బలంగా ఉండేంది.
Source: Yahoo! Telugu: Entertainment | 28 May 2009 | 11:42 am

స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఇద్దరు ఆస్పత్రిపాలు

కోల్‌కతాలో ఇద్దరు స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. అంతర్జాతీయ విమాన ప్రయాణికులైన వీరిద్దరినీ స్వైన్ ఫ్లూ అనుమానంతో నగరంలోని ఓ ఆస్పత్రిలో చేర్చినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అనుమానితుల్లో ఒకరు మహిళకాగా, మరొకరు ఏడాది వయసున్న బాలుడు. ఆ మహిళను 43 ఏళ్ల సుస్మితా బిస్వాస్‌గా గుర్తించారు.
Source: జాతీయ | 28 May 2009 | 10:02 am

హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సబిత

దేశంలో తొలి మహిళా హోంమంత్రిగా నియమితులై సరికొత్త రికార్డును సృష్టించిన సబితా ఇంద్రారెడ్డి గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని జె బ్లాక్‌లో 8 అంతస్తులోని హోం మంత్రిత్వ శాఖ ఛాంబర్‌లో ఈ ఉదయం 11.30 గంటలకు ఆమె అధికార పగ్గాలు చేపట్టారు.
Source: ఏపీ న్యూస్ | 28 May 2009 | 9:51 am

భారత వైమానిక దళం చేతిలో "ఆకాశ నేత్రం"

తొలి ఎయిర్‌‍బర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ (అవాక్స్) ఎట్టకేలకు భారత వైమానిక దళం (ఐఏఎఫ్)లో ప్రవేశపెట్టారు. ఇజ్రాయేల్ తయారు చేసిన ఈ అవాక్స్‌‍ను "ఆకాశ నేత్రం"గా పిలుస్తున్నారు. శత్రువులు ప్రయోగించే క్షిపణి తరహా ఆయుధాలను ఇట్టే పసిగట్టగల అవాక్స్‌ను గురువారం రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ ఐఏఎఫ్‌లోకి ప్రవేశపెట్టడం ద్వారా జాతికి అంకితమిచ్చారు.
Source: జాతీయ | 28 May 2009 | 9:47 am

మన్మోహన్ సింగ్ మంత్రివర్గానికి పూర్తి రూపు

కేంద్రంలో కొత్తగా ఏర్పాటయిన యూపీఏ సంకీర్ణ ప్రభుత్వం పూర్తి రూపు సంతరించుకుంది. రాష్ట్రపతి భవన్‌లోని అశోక్ హాలులో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గురువారం ఉదయం 59 మంది మంత్రులచే ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో కాంగ్రెస్ నేతృత్వంలోని కొత్త యూపీఏ ప్రభుత్వంలో 78 మంత్రులు బాధ్యతలు స్వీకరించినట్లయింది.
Source: జాతీయ | 28 May 2009 | 8:23 am

కేబినెట్ మంత్రుల్లో సగంమందికి "లా" డిగ్రీలు

న్యాయవాద డిగ్రీని కలిగి ఉంటే కేబినెట్‌లో మంత్రి పదవి దక్కే అవకాశాలు మెండుగా ఉంటాయని మన్మోహన్ సింగ్ కేబినెట్ మంత్రులను చూసి తెలుసుకోవచ్చు. ఎందుకంటే మన్మోహన్ సింగ్ కేబినెట్‌లోని 33 మంత్రుల్లో 15మందికి పైగా న్యాయవాద డిగ్రీని కలిగి ఉన్నారు.
Source: జాతీయ | 28 May 2009 | 8:06 am

గెలుపు - ఓటములు సహజం: జూ ఎన్టీఆర్

రాజకీయ చదరంగంలో గెలుపోటములు సహజమేనని తెలుగుదేశం పార్టీ యువనేత, సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ అభిప్రాయపడ్డారు. సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్స్‌లో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడులో ఆయన పాల్గొని ప్రసంగించారు.
Source: ఏపీ న్యూస్ | 28 May 2009 | 7:39 am

పంజాబ్ సమస్యాత్మక ప్రాంతాల్లో కర్ఫ్యూ ఎత్తివేత

వియన్నాలో సిక్కు గురువు హత్య అనంతరం తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగిన పంజాబ్ రాష్ట్రంలో గురువారం ప్రశాంత వాతావరణం నెలకొంది. సాధారణ జనజీవనం పూర్తిస్థాయిలో పునరుద్ధరించబడింది. హింసాత్మక ఆందోళన కారణంగా సమస్యాత్మకంగా మారిన జలంధర్, ఫాగ్వారా, హోషియార్‌పూర్స మలౌత్, లూధియానాలలో గురువారం కర్ఫ్యూ ఎత్తివేశారు.
Source: జాతీయ | 28 May 2009 | 7:15 am

మాజీలకు తెదేపా అధినేత ఆహ్వానం!

పార్టీని వీడిన మాజీ నేతలు, సీనయర్లు తిరిగి సొంత గూటికి రావాల్సిందిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అలా తిరిగి వచ్చే పార్టీ నేతలకు గతంలో వారు ఏయే హోదాల్లో ఉండేవారో ఆ హోదాలనే మళ్ళీ కట్టబెడతామంటూ ఆశ చూపారు.
Source: ఏపీ న్యూస్ | 28 May 2009 | 7:05 am

తిరుమల ఘాట్‌రోడ్డులో రెండు ప్రమాదాలు

తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులో గురువారం ఉదయం ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో 14మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారు ఆంధ్రా, కర్నాటకకు చెందిన భక్తులుగా తెలియవచ్చింది. వీరంతా శ్రీవారిని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Source: ఏపీ న్యూస్ | 28 May 2009 | 6:50 am

స్థానిక ఎన్నికల్లో మా పవర్ చూపిస్తాం: చిరు

ప్రజారాజ్యం పార్టీ అధక్షుడు, తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత తొలిసారిగా తిరుపతి పర్యటనకు గురువారం ఉదయం తిరుపతికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తమ పార్టీ రానున్న స్థానిక ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు
Source: ఏపీ న్యూస్ | 28 May 2009 | 6:40 am

తెలుగు సినీ పరిశ్రమ ఆరాధ్యుడు: ఎన్టీఆర్

అశేష తెలుగు ప్రజల గుండెల్లో పదిలమైన స్థానాన్ని దక్కించుకున్న స్వర్గీయ నందమూరి తారక రామారావు జన్మించిన రోజు నేడు. ఆయన 1923 మే 28వ తేది, కృష్ణాజిల్లాలోని నిమ్మకూరు గ్రామంలో జన్మించారు. చిన్నతనం నుంచే రంగస్థలంపై మక్కువ కనబరిచిన ఎన్టీఆర్ అవకాశం...
Source: వినోదం | 28 May 2009 | 6:13 am

మన్మోహన్ కేబినెట్‌లో 9 మంది మహిళలు

కేంద్రంలో వరుసగా రెండోసారి కొలువుదీరిన ప్రధాని మన్మోహన్ సింగ్.. తన కేబినెట్‌లో తొమ్మిది మంది మహిళలకు స్థానం దక్కింది. వీరిలో ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కాగా, ఒకరు మిత్రపక్షమైన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, మరొకరు నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీకి చెందిన అగతా సంగ్మాలు ఉన్నారు.
Source: జాతీయ | 28 May 2009 | 6:11 am

బంగారు బిస్కెట్లు

"మీ ఇంట్లో దొంగలు పడ్డారట.. ఏం దోచుకెళ్లారు..?" "బిస్కెట్లు"...
Source: వినోదం | 28 May 2009 | 5:06 am

చెప్పులు కొనే బెడద

"రాజకీయాల్లోకి రాగానే మీకు మొట్టమొదట కలిగిన లాభమేమిటో చెపుతారా..?" అని అడిగాడు విలేకరి "నాతో పాటు...
Source: వినోదం | 28 May 2009 | 5:04 am

ఐలా తుపాను: 100కు చేరిన మృతులు

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో విషాద ఛాయలు మిగిల్చిన ఐలా తుఫాను కారణంగా మృతి చెందిన వారి సంఖ్య బుధవారానికి వందకు చేరుకుంది. చాలా ప్రాంతాలు ఇప్పటికీ తుపాను ప్రభావం నుంచి బయటపడలేదు. కోల్‌కతా శివారు ప్రాంతాల్లో తీవ్రమైన త్రాగునీటి సంక్షోభం ఏర్పడింది.
Source: జాతీయ | 28 May 2009 | 4:20 am

కేబినెట్ కసరత్తు పూర్తి: నేడు ప్రమాణస్వీకారం

ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ మూడు రోజులపాటు కేంద్ర మంత్రివర్గ కూర్పుపై జరిపిన కసరత్తు పూర్తయింది. రెండో దశ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇరువురు నేతలు అనేక పర్యాయాలు సంప్రదింపులు జరిపిన సంగతి తెలిసిందే.
Source: జాతీయ | 28 May 2009 | 3:18 am

అర్జున్, భరద్వాజ్‌లకు గవర్నర్ పదవులు...!

కేంద్ర మాజీ మానవ వనరుల శాఖామంత్రి అర్జున్ సింగ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హెచ్.ఆర్. భరద్వాజ్‌లకు గవర్నర్ పదవులు లభించనున్నాయి.
Source: జాతీయ | 27 May 2009 | 2:11 pm

రాష్ట్రం నుంచి ఐదుగురు కేంద్ర మంత్రులు

ప్రధాని రెండో దశ మంత్రివర్గ విస్తరణకు గాను రాష్ట్రపతికి 59 మంది సభ్యుల జాబితాను అందజేశారు. వీరిలో 14మందికి క్యాబినెట్, ఏడుగురికి స్వతంత్ర సహాయ పదవులు, మిగిలిన 38 మందికి సహాయమంత్రి పదవులు ఖరారయ్యాయి. ప్రధాని రాష్ట్రపతికి అందించిన ఈ జాబితాలో మన రాష్ట్రానికి ఐదు మంత్రి పదవులు దక్కాయి.
Source: జాతీయ | 27 May 2009 | 1:37 pm

ప్రజారాజ్యాన్ని వీడబోను: దేవేందర్ గౌడ్

తాను ప్రజారాజ్యాన్ని వీడబోతున్నట్టు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఆ పార్టీ నేత దేవేందర్ గౌడ్ స్పష్టం చేశారు. అదేసమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేత ఈటెల రాజేందర్‌తో తాను సమావేశం కావడానికి కూడా ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని ఆయన పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 27 May 2009 | 12:20 pm

కార్యకర్తలను ఆదుకుంటాం: చంద్రబాబు

పార్టీకి చెందిన ప్రతిఒక్క కార్యకర్తను ఆదుకుంటామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. తమ పార్టీకి కార్యకర్తలే బలమని పేర్కొన్న ఆయన వారి అభ్యున్నతి కోసం అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 27 May 2009 | 12:00 pm